union minister
-
కేంద్ర మంత్రి కుమార్తెకు పోకిరీల వేధింపులు
జల్గావ్: తన కుమార్తెను వేధించారంటూ కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రలో శాంతి భద్రతలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. జల్గావ్ జిల్లా ముక్తాయ్‌నగర్‌లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తన కుమార్తెను అక్కడ కొందరు యువకులు వేధించారని.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి వెల్లడించారు.“ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా మా ప్రాంతంలో సంత్ ముక్తాయ్ యాత్ర జరుగుతుంది. రెండు రోజుల క్రితం నా కూతురు యాత్రకు వెళ్లింది. కొందరు యువకులు ఆమెను వేధించారు. వారిపై ఫిర్యాదు చేసేందుకు నేను పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను' అని మీడియాకు కేంద్ర మంత్రి ఖడ్సే చెప్పారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందిపైనా ఆ యువకులు దురుసుగా ప్రవర్తించారు. గుజరాత్ పర్యటన నుంచి నేను ఇంటికి రాగానే నా కుమార్తె ఈ విషయం చెప్పింది. కేంద్ర మంత్రి కుమార్తెకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. సాధారణ మహిళల సంగతి ఏంటో అర్థం చేసుకోవచ్చంటూ కేంద్ర మంత్రి ఖడ్సే వ్యాఖ్యానించారు.రక్షా ఖడ్సే మామ ఏక్నాథ్ ఖడ్సే మాట్లాడుతూ.. ఈ యువకులపై గతంలోనూ పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. వారు కరుడుగట్టిన నేరస్థులు. మహారాష్ట్రలో నేరస్థులకు పోలీసులంటే భయమే లేదు. రోజురోజుకు మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి. బాధిత మహిళలు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. వారి తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెల పేర్లు బయటకు రాకూడదని భావిస్తున్నారు. వేరే మార్గం లేకనే ఫిర్యాదు చేశాం’’ అని ఏక్నాథ్ ఖడ్సే తెలిపారు.పోలీస్ స్టేషన్‌కు వెళితే రెండు గంటలు మమ్మల్ని కూర్చోబెట్టారని.. అమ్మాయిల విషయం కావడంతో ఆలోచించుకోవాలంటూ పోలీసులు మాకు సలహా ఇచ్చారు. వేధింపులకు పాల్పడ యువకులకు రాజకీయ నాయకుల అండ ఉంది. డీఎస్పీ, ఐజీతో కూడా చెప్పాను’’ అని ఖడ్సే తెలిపారు. -
గచ్చిబౌలి స్టేడియంలో నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్
-
భారీ ఊరట: ఆ మూడు కేన్సర్లకు త్వరలో వ్యాక్సీన్
కేన్సర్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మహిళలకు భారీ ఊరటనిచ్చే వార్తను ప్రకటించింది. దేశంలోని మహిళలకు ఆరు నెలల్లో క్యాన్సర్ టీకాను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఆయుష్ సహాయ మంత్రి ప్రతాప్ జాదవ్ మంగళవారం వెల్లడించారు. మహిళలను ప్రభావితం చేసే కేన్సర్లను ఎదుర్కోవడానికి టీకా ఐదు నుండి ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తుందని, 9-16 ఏళ్ల వయస్సున్న అమ్మాయిలు టీకాలు తీసుకోవడానికి అర్హులని కేంద్ర మంత్రిప్రకటించారు. ఈ టీకా రొమ్ము, నోటి, గర్భాశయ కేన్సర్ నిరోధకంగా పనిచేస్తుందన్నారు.దేశంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది, ఈ నేపథ్యంలోనే ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్టు కేంద్రంమంత్రి తెలిపారు.. 30 ఏండ్ల పైబడిన మహిళలకు ఆ సుపత్రిల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తారు. కేన్సర్‌ను ముందుగానే గుర్తించడానికి డే కేర్ కేన్సర్ కేంద్రాలను నెలకొల్పుతామని కూడా కేంద్రమంత్రి వెల్లడించారు. . ప్రభుత్వ ఆసుపత్రులలో ఆయుష్ విభాగాలున్నాయని.. ప్రజలు వాటిని వైద్యం కోసం ఉపయోగించుకోవచ్చని తెలిపారు. దేశంలో ఇటువంటి 12,500 ఆరోగ్య సౌకర్యాలు ఉన్నాయని, ప్రభుత్వం వాటిని పెంచుతోందని ఆయన అన్నారు. కాగా మన దేశంలో మహిళల్లో రొమ్ము కేన్సర్ బాగా కనిపిస్తోంది. అదే పురుషుల్లో అయితే ఊపిరితిత్తుల అత్యధికంగా విస్తరిస్తోంది. చిన్నపిల్లలో లింఫోయిడ్ లుకేమియా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. స్త్రీ జననేంద్రియ కేన్సర్‌లో ప్రధానంగా ఐదు కాలుఉన్నాయి. గర్భాశయ ముఖద్వార, అండాశయ, గర్భాశయ, యోని అండ్ వల్వార్. ఆరవది చాలా అరుదైనది ఫెలోపియన్ ట్యూబ్ కేన్సర్ . చదవండి: ఒక్కో గ్రాము ధర రూ. 53 వేల కోట్లు, అంత ‘మ్యాటర్’ ఏముంది?మహిళ చేతివాటం, దెబ్బకి బ్యాన్ చేసిన వాల్‌మార్ట్ -
రైతు సంఘాలతో కేంద్రం చర్చలు
చండీగఢ్: పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించడం వంటి డిమాండ్లపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సారథ్యంలోని బృందం శుక్రవారం చండీగఢ్‌లో రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించింది. రెండున్నర గంటలకుపైగా జరిగిన ఈ చర్చల్లో సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాలకు చెందిన 28 మంది స భ్యుల ప్రతినిధి బృందం పాల్గొంది. పంజాబ్, హరియాణా సరిహద్దుల్లోని శంభు, ఖనౌరీల్లో ఈ రెండు రైతు సంఘాలు ఏడాదికిపైగా నిరసనలు సాగిస్తున్నారు. పంజాబ్ ప్రభుత్వం తరఫున వ్యవసాయ మంత్రి గుర్మీత్ సింగ్ ఖుద్దియన్, ఆహారం, పౌరసరఫరా శాఖ మంత్రి లాల్ చంద్ తదితరులు పాలొ న్నారు. మహాత్మాగాంధీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప బ్లిక్ అడ్మినిస్ట్రేషన్(ఎంజీఎస్ఐపీఏ)లో జరిగిన చ ర్చలు సుహృద్భావ వాతావరణంలో సాగాయన్నా రు. రైతుల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం తీసు కున్న చర్యలను ఈ సందర్భంగా రైతు నేతలకు వివరించామని ప్రహ్లాద్ జోషి చెప్పారు. తదుపరి రౌండ్ చర్చలు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలో 22న జరుగుతాయని మంత్రి చెప్పారు. నిరశనదీక్ష సాగిస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఖనౌరీ నుంచి ఆయన్ను అంబులెన్సులో తీసుకువచ్చారు. ఆయన ప్రయాణానికి నాలుగు గంటల సమయం పట్టిందని రైతు నేత కాకా సింగ్ కొట్ర చెప్పారు. -
ఆవిష్కరణలతోనే ఫార్మాకు భవిష్యత్
న్యూఢిల్లీ: ఆవిష్కరణలతోనే భారత ఫార్మా పరిశ్రమ రాణించగలదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆవిష్కరణలు లేకపోతే ఈ పరిశ్రమే మనుగడ సాగించలేదని హెచ్చరించారు. ఫార్మా రంగం పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కోసం ఎప్పుడూ ప్రభుత్వంపైనే ఆధారపడడం పట్ల ఆందోళన వ్యక్తం చేవారు. ‘‘దురదృష్టవశాత్తూ మన దేశంలో ప్రతి దాని కోసం ప్రభుత్వం వైపు చూసే బలహీన మనస్తత్వ ధోరణి నెలకొంది. ప్రభుత్వం పన్ను రాయితీలు కల్పించినప్పుడే పరిశోధన నిర్వహిద్దామని అనుకుంటారు. విజయానికి ఆవిష్కరణలే ఆధారమైన పరిశ్రమ ఇది. ఎవరైతే ఆవిష్కరణకు దూరంగా ఉంటారో వారి కథ ముగిసినట్టే’’అని ముంబైలో ఫార్మా కంపెనీలు నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మంత్రి వ్యాఖ్యానించారు. మారుతున్న జీవనశైలి తీరులు, సమాజం, రోగుల డిమాండ్లు, అవసరాలకు అనుగుణంగా పరిశ్రమ కూడా మారాలని సూచించారు. ప్రాజెక్టులతో ఫార్మా పరిశ్రమ ముందుకు వచ్చి.. ప్రభుత్వం, విద్యా సంస్థల సహకారంతో పరిశోధనపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇక్కడ ఆవిష్కరణలతో పేటెంట్లు సంపాదించుకుని, ఇక్కడి నుంచి ఎగుమతులు చేయాలని పిలుపునిచ్చారు. ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ (ఏఎన్ఆర్ఎఫ్) కింద 2023–28 కాలానికి కేంద్రం రూ.50,000 కోట్ల నిధిని ప్రకటించడం గమనార్హం. దీని కింద పరిశోధన, ఆవిష్కరణలకు చేయూతనివ్వనుంది. ఆ దేశాల్లో ఆవిష్కరణలే బలం.. స్విట్జర్లాండ్, యూఎస్, జపాన్ దేశాల్లో తలసరి ఆదాయం చాలా పెద్ద మొత్తంలో ఉందని, ఇందుకు అక్కడి కంపెనీల ఆవిష్కరణలే కారణమని మంత్రి గోయల్ చెప్పారు. ‘‘నాణ్యత, ఆవిష్కరణ అన్న రెండు అంశాలపై మీ మనుగడ ఆధారపడి ఉంది’’అని పేర్కొన్నారు. ప్రజావేగులుగా మారి తప్పుడు విధానాలకు పాల్పడుతున్న, నకిలీ మందులు తయారు చేస్తున్న కంపెనీల గుట్టు బయటపెట్టాలని పులుపునిచ్చారు. పెద్ద కంపెనీలు చిన్న కంపెనీలను దత్తత తీసుకుని, ఉత్తమ తయారీ విధానాలను అనుసరించడం ద్వారా అవి వృద్ధి చెందేందుకు సహకారం అందించాలని కోరారు. -
ఈపీఎఫ్‌వో రూ.2 లక్షల కోట్ల క్లెయిమ్‌లు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యుల క్లెయిమ్‌ల పరిష్కారంలో కొత్త రికార్డులకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సభ్యులకు సంబంధించి రూ.2,05,932 కోట్ల విలువైన క్లెయిమ్‌లను ఈపీఎఫ్‌వో ఆమోదించినట్టు కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది. మొత్తం పరిష్కరించిన క్లెయిమ్‌ల సంఖ్య 5.08 కోట్లను చేరుకున్నట్టు తెలిపింది. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో రెండు నెలలు మిగిలి ఉండగా, అప్పుడే గతేడాది క్లెయిమ్ గణాంకాలను ఈ ఏడాది అధిగమించడం గమనార్హం. 2023–24 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 4.45 కోట్ల క్లెయిమ్‌లకు గాను చేసిన చెల్లింపులు రూ.1,82,838 కోట్లుగా ఉన్నాయి. క్లెయిమ్ పరిష్కారాల ప్రక్రియ పురోగతికి, ఫిర్యాదుల పరిష్కారం దిశగా ఈపీఎఫ్‌వో చేపట్టిన సంస్కరణల వల్లే ఈ ఘనత సాధించినట్టు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మనుసుఖ్ మాండవీయ తెలిపారు. క్లెయిమ్‌లను ఆటోమేటిగ్గా పరిష్కరించడం, సభ్యుల ప్రొఫైల్ మార్పులను సులభతరం చేయడం, పీఎఫ్ సాఫీ బదిలీకి వీలు కల్పించడం వంటి చర్యలను మంత్రి ప్రస్తావించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆటో క్లెయిమ్ పరిష్కారాలు రెట్టింపై 1.87 కోట్లుగా ఉన్నట్టు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆటో క్లెయిమ్ పరిష్కారాలు 89.52 లక్షలుగా ఉన్నాయి. -
2027లో చంద్రయాన్–4
న్యూఢిల్లీ: చంద్రుడిపై శిలలను సేకరించి భూమిపైకి తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన చంద్రయాన్–4 మిషన్‌ను 2027లో చేపట్టనున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. మిషన్‌లో భాగంగా రెండు వేర్వేరు ప్రయోగాలుంటాయన్నారు. ఎల్వీఎం–3 రాకెట్ ద్వారా ఐదు రకాల సాంకేతిక వస్తు సామాగ్రిని కక్ష్యలోకి పంపి, అక్కడే వాటిని అసెంబుల్ చేయిస్తారని వివరించారు. వచ్చే ఏడాది గగన్‌యాన్ మిషన్‌లో ప్రత్యేకంగా రూపొందించిన అంతరిక్ష నౌకలో ఇద్దరు భారత వ్యోమగాములను దిగువ భూకక్ష్యలోకి పంపి, తిరిగి సురక్షితంగా తీసుకువస్తామని చెప్పారు. ఈ ఏడాదిలో గగన్‌యాన్ మానవరహిత మిషన్ లో భాగంగా వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షంలోకి పంపిస్తామన్నారు. దీంతోపాటు, 2026లో సముద్రయాన్‌లో భాగంగా ముగ్గురు శాస్త్రవేత్తలను 6 వేల మీటర్ల లోతులో సముద్రం అడుగు భాగానికి పంపిస్తామని వెల్లడించారు. వీరు సముద్రగర్భంలో వనరులు, కీలక, అరుదైన ఖనిజాల అన్వేషణతోపాటు, సముద్ర జీవజాలంపై పరిశోధనలు జరుపుతారని చెప్పారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 1969లో అవతరించగా మొదటి లాంఛ్ ప్యాడ్ రెండు దశాబ్దాల అనంతరం 1993లో కార్యరూపం దాల్చిందని చెప్పారు. మరో దశాబ్ద కాలం తర్వాత 2004లో రెండో లాంఛ్ ప్యాడ్‌ను నిర్మించామన్నారు. విస్తరణ, మౌలిక వనరుల కల్పన, పెట్టుబడుల విషయంలో ఇస్రో గణనీయమైన ప్రగతి సాధించిందని మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. భారత అంతరిక్ష ఆర్థిక రంగ ప్రస్తుతం 8 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుందని వివరించారు. దీనిని వచ్చే పదేళ్లలో 44 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లి, ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్ స్థానాన్ని సుస్థిరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. -
ఉక్కు కార్మికులకు కేంద్రమంత్రి షాక్
-
కేంద్ర మంత్రి కుమారస్వామికి నిరసన సెగ
-
జమ్ము మిస్టరీ మరణాలపై కేంద్రం ప్రకటన
మిస్టరీగా మారిన జమ్ము కశ్మీర్ వరుస మరణాల(Mysterious Deaths)పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. అంతుచిక్కని అంటువ్యాధితో మరణిస్తున్నారనే వాదనను కేంద్రం తోసిపుచ్చింది. అయితే విషపూరిత పదార్థాల వల్లే వరుస మరణాలు సంభవించాయని, ఈ వ్యవహారంపై కుట్ర కోణం సహా అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని గురువారం ప్రకటించింది.రాజౌరీ(Rajouri) జిల్లాలోని ఓ గ్రామంలో నెలవ్యవధిలో 17 మంది వరుసగా ఒకే తరహా లక్షణాలతో జబ్బుపడి మరీ చనిపోయారు. చనిపోయిన వాళ్లలో చిన్నపిల్లలే(13) ఎక్కువగా ఉన్నారు. వాళ్ల మరణాలకు విషపూరిత పదార్థాలే కారణమని కేంద్రం నిర్ధారించింది. అయితే ఆ టాక్సిన్ ఏంటన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర సైన్స్&టెక్నాలజీ మంత్రి(స్వతంత్ర) డాక్టర్ జితేంద్ర సింగ్ గురువారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.‘‘లక్నోలోని సీఎస్ఐఆర్(CSIR) ల్యాబ్ నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో.. ఇది వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షనో కాదని తేలింది. మృతదేహాల నుంచి సేకరించిన నమునాల్లో విషపదార్థాలు ఉన్నట్లు తేలింది. అయితే ఆ విషపదార్థాలు ఏంటన్న దానిని నిర్ధారించుకునే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు. వారం, పదిరోజుల్లో దీనిపై స్పష్టమైన ప్రకటన రానుంది’’ అని ఆయన తెలిపారు. ఇక అన్నికోణాల్లో ఈ అంశంపై దర్యాప్తు జరుగుతోంది. ఇందులో ఏదైనాకుట్ర ఉందని తేలితే.. బాధ్యులెవరైనా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. ఐటీఆర్ (టాక్సికాలజీ రీసెర్చ్) నిర్వహించిన విశ్లేషణలోనూ ఇంతకు ముందు విషపూరిత పదార్థాలు ఉన్నట్లు గుర్తించింది.డిసెంబర్ 7 నుంచి జనవరి 19వ తేదీల మధ్యలో రాజౌరీలోని బధాల్ అనే కుగ్రామంలో ఈ వరుస మరణాలు(Serial Deaths) సంభవించాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట, విపరీతంగా చెమటలు పోయడం, స్పృహ కోల్పోవడం తదితర లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. పైగా మూడు కుటుంబాలకే చెందిన వ్యక్తులు వరుసగా జబ్బు చేసి మరణించడం గమనార్హం. పైగా ఆ కుటుంబాలకు చెందిన బంధువులు చుట్టుపక్కల నాలుగు గ్రామాల్లో విస్తరించి ఉన్నారు. అయితే అనూహ్యంగా వాళ్లలో కూడా కొందరు ఇదే రీతిలో జబ్బు పడ్డట్లు సమాచారం. అందులోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.దీంతో బుధవారం అక్కడి అధికారులు బధాల్ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. సుమారు 40 మందిని ఐసోలేషన్‌కు తరలించారు. ఇక ప్రజల్లో ఆందోళన నెలకొన్న దృష్ట్యా.. బహిరంగా జనం గుమిగూడటంపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. వరుస మరణాలతో జమ్ము కశ్మీర్లో హెల్త్ ఎమర్జెన్సీ(Health Emergency) ప్రకటిస్తారనే వదంతులు చక్కర్లు కొట్టాయి. అయితే వైద్య ఆరోగ్య అధికారులు మాత్రం వాటిని కొట్టిపారేశారు. ఆ అవసరం లేదని స్పష్టత ఇచ్చారు. నమునాల్లో న్యూరోటాక్సిన్స్ ఉన్నట్లు తేలడంతో.. కుట్ర కోణం తెర మీదకు వచ్చింది. నిజాలు నిగ్గుతేల్చేందుకు కశ్మీర్ పోలీస్ శాఖ సిట్‌ను ఏర్పాటుచేసింది. మంగళవారం బధాల్కు వెళ్లిన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని ప్రకటించారు. మరోవైపు.. వరుస మరణాల నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు 11 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని కశ్మీర్‌కు పంపింది. -
వైఎస్ జగన్ ప్రభుత్వం వల్లే ప్రైవేటీకరణ ఆగింది
సాక్షి, న్యూఢిల్లీ: ‘కోవిడ్ సమయంలో దీపం పథకం కింద విశాఖ ఉక్కు కర్మాగారంలో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇదే సమయంలో యూనిట్‌ను వందశాతం ప్రైవేటీకరణ చేయాలని కూడా నిర్ణయించారు. అయితే, దీనికి వ్యతిరేకంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వందశాతం పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది.దీనిపై ఆందోళనలు, నిరసనలు కొనసాగించింది.’ అని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి వెల్లడించారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.11,440 కోట్లు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ అంశంపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు, సహాయ మంత్రి శ్రీనివాసవర్మతో కలిసి కుమారస్వామి శుక్రవారం ఢిల్లీలోని ఉద్యోగ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు.ఆయన ఏమన్నారంటే.. మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి ఉన్నంత వరకూ కర్మాగారం అభివృద్ధిలో నడిచింది. 2016–17లో 7.3 మిలియన్ల ఉత్పత్తికి ప్రయత్నాలు చేసినప్పటి నుంచి నష్టాలు ప్రారంభయ్యాయి. 2018–19, 2020–21లో రూ.930 కోట్లు లాభాలు వచ్చాయి. 2021 కోవిడ్ సమయంలో ప్రైవేటీకరణ అంశం వచ్చినప్పుడు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తన గొంతు వినిపించింది. అసెంబ్లీ సాక్షిగా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం కూడా చేసింది. అంతేకాదు.. ఉద్యమాలు, ఆందోళనలు చేసినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. నిజానికి.. అప్పటి ప్రభుత్వంవల్లే వందశాతం పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ జరగలేదు.Thankyou YSRCP MP's For Saving VIZAG STEEL PLANT✊ pic.twitter.com/UECSvaE8Wj— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) January 17, 2025ఆర్థిక మంత్రికి అభ్యంతరాలున్నాయినేను కేంద్రమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత అనేక సమీక్షలు చేసి విశాఖ ఉక్కుకు సాయంచేయాలనే విషయాన్ని ప్రధాని, ఆర్థికమంత్రి దృష్టికి తీసుకెళ్లా. అయితే, ఈ ఆర్థిక ప్యాకేజీ విషయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు కొన్ని అభ్యంతరాలున్నాయి. అయినా, వాటిని పక్కనపెట్టి చివరి అవకాశంగా రూ.11,440 కోట్లు ప్యాకేజీ ఇచ్చేందుకు ఆమె అంగీకరించారు. దీంతో రెండేళ్లలోనే స్టీల్‌ప్లాంట్‌ను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దడాన్ని నేను సవాలుగా తీసుకున్నా.ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాం.. ఎక్స్‌లో ప్రధాని మోదీ‘విశాఖ ఉక్కు కర్మాగారానికి రాష్ట్ర ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ కర్మాగారానికి రూ.10 వేల కోట్లుకు పైగా పెట్టుబడిని మద్దతుగా ఇచ్చేందుకు గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించాం. ఆత్మనిర్భర భారత్ సాధించడంలో ఉక్కు కర్మాగారానికి ఉన్న ప్రాముఖ్యతను అర్థంచేసుకుని ఈ చర్య చేపట్టాం’ అని ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ‘ఎక్స్’లో తెలిపారు. విలీనం, ఉద్యోగుల వీఆర్ఎస్పై దాటవేత..ఇదిలా ఉంటే.. ఉద్యోగుల్ని వీఆర్ఎస్ తీసుకోమంటున్నారు.. సెయిల్ విలీన ప్రక్రియ ఎందుకు ఆగిందంటూ మీడియా ప్రస్తావించగా.. కుమారస్వామి దాటవేసే ప్రయత్నం చేశారు. వీఆర్ఎస్పై త్వరలో యూనియన్ నేతలతో మాట్లాడతామన్నారు. ఇక ప్రతి అంశాన్ని దశల వారీగా చర్చించి, పరిష్కరించేందుకు ముందుకెళ్తామన్నారు.అలాగే, ప్యాకేజీ సందర్భంగా కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో రూ.26,114.82 కోట్లు అప్పుల్లో ఉన్నట్లు ఉంది. ఇదే అంశంపై కేంద్రమంత్రిని మీడియా ప్రశ్నించగా.. ‘రూ.26,114.82 కోట్లు కాదు రూ.35 వేల కోట్లు రుణభారం ఉంది. దీనిని అధిగమించేందుకు అంచెలంచెలుగా ముందుకెళ్తాం. ప్రస్తుతం ఇచ్చిన రూ.11,440 కోట్ల ప్యాకేజీతో కర్మాగారాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తాం’ అన్నారు. ప్యాకేజీకి.. ఉన్న రుణభారానికి సంబంధంలేదు కదా అన్న ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు. ఇదిలా ఉంటే.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.11,400 కోట్ల ప్యాకేజీ ప్రకటించడం తమకెంతో ఆనందంగా ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, సహాయ మంత్రి శ్రీనివాసవర్మ హర్షం వ్యక్తంచేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైయస్ జగన్ ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించింది. ఆనాడు లాభాల్లో ఉన్న సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం ప్రయత్నించగా ఏపీ శాసనసభ దానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. సంస్థను కాపాడేందుకు @ysjagan ప్రభుత్వం ఆది నుంచి పోరాడుతూనే… pic.twitter.com/vdsM9VCkIS— YSR Congress Party (@YSRCParty) January 18, 2025 -
వైఎస్ జగన్ వల్లే ప్రైవేటీకరణ ఆగింది - కేంద్రమంత్రి కుమార స్వామి
-
వేగంగా పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో గణనీయమైన పెరుగుదల ఉన్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. భారత్‌ను పెట్టుబడులకు గొప్ప కేంద్రంగా మధ్య ప్రాచ్యం, జపాన్, ఐరోపా యూనియన్ (ఈయూ), యూఎస్ గుర్తిస్తున్నట్టు చెప్పారు. ఇది లక్షలాది కొత్త ఉద్యోగాలకు దారితీస్తున్నట్టు తెలిపారు. వేగవంతమైన ఆర్థిక వృద్ధి ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొన్నారు. దేశీ మార్కెట్ బలంగా ఉండడం, నైపుణ్య, మేధో వనరుల లభ్యత, చట్టాలకు కట్టుబడి ఉండడం, స్పష్టమైన నియంత్రణలు సానుకూల వ్యాపార వాతావరణం, వ్యాపార సులభ నిర్వహణకు వీలైన ప్రగతిశీల విధానాలు.. అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నట్టు మంత్రి గోయల్ చెప్పారు. ‘‘ప్రపంచంలోనే ఒకానొక పెద్ద ఫండ్ నిర్వహణ సంస్థ సీఈవోతో గత నెలలో యూఎస్‌లో భేటీ అయ్యాను. అదే సంస్థ భారత్‌లోనూ భారీ పెట్టుబడులు కలిగి ఉంది. గడిచిన పదేళ్ల కాలంలో భారత్‌లోని తమ పెట్టుబడులు తమ ఫండ్స్ చేసిన పెట్టుబడుల్లో అత్యుత్తమ పనితీరు చూపించినట్టు నాతో పంచుకున్నారు. గత 20 ఏళ్ల నుంచి భారత్‌లో ఇన్వెస్టర్లుగా ఉన్నప్పటికీ, 80 శాతం పెట్టుబడులు ఇటీవలి సంవత్సరాల్లోనే పెట్టినట్టు చెప్పారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టి 20 ఏళ్ల అయిన సందర్భాన్ని పురస్కరించుకుని, భారత్‌కు వచ్చి మరో విడత పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించనున్నట్టు ప్రకటించారు’’ అని గోయల్ తను అనుభవాలను వెల్లడించారు. భారత స్టాక్ మార్కెట్ చక్కని పనితీరు భారీగా ఫ్ఐఐ పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్టు చెప్పారు. ప్రతి నెలా రూ.38వేల కోట్లు.. అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు నెలకొన్నప్పటికీ ప్రతి నెలా సగటున 4.5 బిలియన్ డాలర్ల (రూ.38,000 కోట్లు) ఎఫ్‌డీఐలు గడిచిన ఏడాది కాలంగా భారత్‌లోకి వస్తుండడం గమనార్హం. గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య ఎఫ్‌డీఐ 42 శాతం పెరిగి 42 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెపె్టంబర్)నూ ఎఫ్‌డీఐలు 45 శాతం పెరిగి 29.79 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 71.28 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐని భారత్ ఆకర్షించింది. సేవల రంగాలు, కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, టెలికం, ట్రేడింగ్, నిర్మాణం, ఆటోమొబైల్, కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్ రంగాలు ఎక్కువ ఎఫ్‌డీఐలను రాబడుతున్నాయి. -
ఏ బ్యాంక్‌లో అయినా ఈపీఎఫ్ పెన్షన్
న్యూఢిల్లీ: ‘ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్), 1995’ సభ్యులకు శుభవార్త. 68 లక్షల పెన్షనర్లు ఇక మీదట ఏ బ్యాంక్‌లో అయినా పెన్షన్ పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది. అన్ని ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో కేంద్రీకృత పింఛను చెల్లింపుల వ్యవస్థ (సీపీపీఎస్)ను అమల్లోకి తీసుకువచ్చినట్టు కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న పింఛను పంపిణీ వ్యవస్థ కేంద్రీకృతమై లేదు. ప్రతి జోనల్/ప్రాంతీయ కార్యాలయ పరిధిలో సభ్యులకు పింఛను పంపిణీకి వీలుగా 3–4 బ్యాంకులతో ఒప్పందం చేసుకోవాల్సి వచ్చేది. సీపీపీఎస్ కింద లబ్ధిదారు ఏ బ్యాంకు నుంచి అయినా పెన్షన్ తీసుకోవచ్చని, పెన్షన్ ప్రారంభంలో ధ్రువీకరణ కోసం బ్యాంక్‌ను సందర్శించాల్సిన అవసరం ఉండదని కార్మిక శాఖ తెలిపింది. పెన్షన్‌ను మంజూరు చేసిన వెంటనే బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని పేర్కొంది. పెన్షనర్ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలివెళ్లినప్పటికీ, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పీపీవో)ను ఒక ఆఫీస్ నుంచి మరో ఆఫీస్‌కు బదిలీ చేసుకోవాల్సిన అవసరం తప్పుతుందని వివరించింది. రిటైర్మెంట్ అనంతరం తమ స్వస్థలాలకు వెళ్లి స్థిరపడే పింఛనుదారులకు నూతన వ్యవస్థతో ఇబ్బందులు తొలగిపోనున్నాయి. సీపీపీఎస్‌ను అన్ని ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయ పరిధిలో పూర్తి స్థాయిలో అమలు చేయడాన్ని చారిత్రక మైలురాయిగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వ్యాఖ్యానించారు. -
మోసాల రమణ నిండా ముంచాడు
కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు సహకారంతోనే ఎదిగానని ఇండియన్ ఆర్మీ కాలింగ్ నిర్వాహకుడు బసవ రమణ ప్రచారం చేసుకున్నాడు. ఆయనతో తీసుకున్న ఫొటోలు, వీడియోలను ఫేస్‌బుక్‌లు, వాట్సాప్‌లోనూ పెట్టి తనకున్న అనుబంధాన్ని, సంబంధాలను అందరికీ తెలియజేశాడు. ఆర్మీ కాలింగ్ సెంటర్లో చేరిన విద్యార్థులను రామ్మోహన్నాయుడు హాజరయ్యే కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసేవాడు. సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్ కంచరాన అవినాష్ వంటి అధికారులను ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్‌కు తీసుకొచ్చి వారితో విద్యార్థులకు అవగాహన కల్పించాడు. తనకు ఎంతో పలుకుబడి ఉందని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. దానికోసం ముందస్తుగా పోస్టర్లు, ఫ్లెక్సీల ద్వారా విస్తృత ప్రచారం చేశాడు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇండియన్ ఆర్మీ కాలింగ్ రమణ మోసాలు తిలాపాపం..తలా పిడికెడు అన్నట్టుగా కనిపిస్తున్నాయి. పెద్దలతో ఏ మాత్రం పరిచయం ఏర్పడినా దాన్ని తన వ్యాపారాన్ని పెంచుకునే అస్త్రంగా రమణ వాడుకున్నాడు. కేంద్రమంత్రిని.. ‘అన్నా’ అని సంబోధిస్తూ, ఆయన అండతోనే ఎదిగానని చెబుతూ, ఆయన ఆశీస్సులుంటే మరింత ఎదుగుతానని ఫొటోలు, వీడియోలతో సహా చూ పించిన దృశాలు, రక్షణ రంగంలోని అధికారులతో నిర్వహించిన సమావేశాలు, కలెక్టర్లు, జేసీలతో చేపట్టిన కార్యక్రమాలు, ఎమ్మెల్యే, వారి కుటుంబీకులతో నిర్వహించిన ప్రైవేటు కార్యక్రమాలు, నగరంలో జరిపిన పలు ఈవెంట్లతో రమణను పలుకుబడి గల వ్యక్తిగా నమ్మించాయి. ఇదే విద్యార్థుల కొంప ముంచింది. అసలు నిజం ఇదీ.. రాజకీయ ప్రముఖులు, ఆర్మీ అధికారులు, ఉన్నతాధికారులతో పరిచయాలను చూపించి విద్యార్థులను నిలువునా ముంచేశాడు. మాజీ మేజర్ జనర ల్ తన సంస్థకు ప్రెసిడెంట్‌గా ఉన్నారని నమ్మబలికి నిరుద్యోగ యువతను ట్రాప్ చేశాడు. ఈ ప్రచారం చూసే విద్యార్థులు ఆకర్షితులై ఉద్యోగాల కోసం రూ.3లక్షల నుంచి రూ.10లక్షల వరకు ముట్ట చెప్పేశారు. అంతటితో ఆగకుండా శిక్షణ, వసతి అని చెప్పి రూ.లక్షల్లో గుంజేశాడు. మోసం బట్టబయలు కావడంతో వారంతా లబోదిబోమంటున్నారు. శ్రీకాకుళం కేంద్రంగానే కాదు జులుమూరు కేంద్రంగా కూడా మోసం చేశాడు. రోజూ ఆయన చేతిలో మోసపోయిన వారు బయటకి వస్తూనే ఉన్నారు. ఎంత మొత్తంలో వసూలు చేశాడో లెక్క కట్టడం కూడా కష్టమవుతోంది. జిల్లాకు వచ్చే కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఐఎఫ్ఎస్ అధికారులు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తదితరులను మర్యాద పూర్వకంగా కలిసి, వారిని మచ్చిక చేసుకుని, పలు కార్యక్రమాలకు ఆహా్వనించేవాడు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో మోటివేషన్ కార్యక్రమాలను నిర్వహించాడు. అధికారికంగా జరిగే ఈవెంట్లకు, ప్రైవేటు కార్యక్రమాలకు తన దగ్గర శిక్షణ పొందుతున్న విద్యార్థులను తన సైన్యంగా తీసుకెళ్లి బల నిరూపణ చేసేవాడు. ఈవెంట్ల పేరుతో పెద్ద ఎత్తున శాఖల వారీగా, ప్రైవేటు సంస్థల నుంచి నిధుల సమీకరణ కూడా చేసేవాడు. ⇒ పలువురు జర్నలిస్టులతో కూడా వెంకటరమణ చేతులు కలిపారు. వారికున్న పత్రికల్లో స్పాన్సర్ కథనాలు వండి వార్చారు. అవసరం వచ్చినప్పుడల్లా అండగా నిలిచారు. ఉన్నత స్థాయి వ్యక్తులను కలిసేందుకు ఓ జర్నలిస్టును రిఫరెన్స్‌గా వాడుకునే వాడు. పోలీసు శాఖలో పనిచేసిన కొందరు అధికారులు కూడా ఆయనకు అండగా నిలిచారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఫిర్యాదులొస్తే పట్టించుకోకుండా వెంకటరమణకే వత్తాసు పలికిన ఉదంతాలున్నాయి. భారత రక్షణ వ్యవస్థ మేజర్‌గా ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న మేజర్ పెంటకోట రవికుమార్‌ను కలిసిన ఫొటోలను చూపించి, తనకు అధికారిక పలుకుబడి ఉందని నమ్మించాడు. ఐఏఎఫ్ గ్రూప్ కెపె్టన్ పి.ఈశ్వరరావు వంటి వారితో మోటివేషన్ క్లాసులు ఇప్పించాడు.జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమాలకు ఎమ్మెల్యే సతీమణి జీ.స్వాతిని ఆహా్వనించి హడావిడి చేశాడు. అకృత్యాలు.. వికృత చేష్టలు.. ⇒ శిక్షణ, ఉద్యోగాల పేరుతో మోసం చేయడమే కాకుండా తన ఆర్మీ కాలింగ్ సెంటర్లో చేరిన విద్యార్థులను హింసించాడు. ⇒ ఏకంగా కాళ్లతో తన్ని, డేటా కేబుల్ వైర్‌తో కొడుతూ చాలామందికి నరకం చూపించాడు. ⇒ శిక్షణలో చేరిన అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడు. ⇒ రకరకాల మెసెజ్‌లు, మాటలతో ట్రాప్ చేసే ప్రయత్నం చేశాడు. ⇒ అంతటితో ఆగకుండా అమ్మాయిలున్న వసతి గృహంలో, వాష్ రూమ్‌ల్లో, పరుపులు ఉన్న రూమ్‌ల్లో సీసీ కెమెరాలు పెట్టాడు. ⇒ ఒకసారి దొరికిపోయాక అది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అనుమతితోనే పెట్టానని నమ్మించే ప్రయత్నం చేశాడు. ⇒ ∙సీసీ కెమెరాల గుట్టు బయటకు రాకుండా ఉండటానికి అమ్మాయిలను కూడా భయపెట్టాడు. ⇒ బయటకు చెబితే వీడియోలు బయటకు వస్తాయని, అసభ్యకర ఫొటోలు వెలుగు చూస్తాయని బెదిరించినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. ⇒ రమణ కోసం ఒక్క మాటలో చెప్పాలంటే రక్షణ రంగంలో ఉద్యోగాల పేరుతో ఓ నియంతలా.. సైకోలా వ్యవహరించాడనే విషయం బాధితుల మాటల్లో స్పష్టమవుతోంది. -
TDP ఎమ్మెల్యేల అక్రమ సంపాదనపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
-
కేంద్ర మంత్రి సురేశ్ గోపీపై కేసు
త్రిస్సూర్: కేరళలోని త్రిస్సూర్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో పూరమ్ ఉత్సవాల సమయంలో అంబులెన్సు సౌకర్యాన్ని దుర్వినియోగం చేశారంటూ కేంద్ర మంత్రి సురేశ్ గోపీపై కేసు నమోదైంది. ఉద్దేశపూర్వక ర్యాష్ డ్రైవింగ్‌తోపాటు మోటారు వాహనాల చట్టంలోని పలు సెక్షన్ల కింద త్రిస్సూర్ ఈస్ట్ పోలీసులు ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. స్థానిక సీపీఐ నేత కేపీ సుమేశ్ ఫిర్యాదు మేరకు సురేశ్ గోపీతోపాటు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి అభిజిత్ నాయర్, అంబులెన్సు డ్రైవర్‌ను నిందితులుగా చేర్చారు. పూరమ్ ఉత్సవాల వేదిక వద్దకు చేరుకునేందుకు వీరు పోలీసు ఆంక్షలను ధిక్కరిస్తూ, ప్రజల ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరించారని సుమేశ్ ఆరోపించారు. మంత్రి సురేశ్ గోపీ ఈ ఆరోపణలను ఖండించారు. కారులో వస్తుండగా ప్రత్యర్థి పారీ్టల గూండాలు దాడి చేయడంతో అక్కడే ఉన్న అంబులెన్సులో ఉత్సవాల వేదిక వద్దకు చేరుకున్నట్లు చెప్పారు. -
భారత్–యూఏఈ మధ్య ‘ఫుడ్ కారిడార్’
ముంబై: భారత్–యునైటెడ్ ఆరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) దాదాపు రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఫుడ్ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నాయి. ఈ క్యారిడార్ యూఏఈ ఆహార అవసరాలను తీర్చడంతోపాటు, అంతకుమించి భారతీయ రైతులకు అధిక ఆదాయాన్ని సంపాదించడానికి, దేశంలో మరిన్ని ఉద్యోగాలను సృష్టించడానికి సహాయపడుతుందని కేంద్ర మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. పెట్టుబడులపై భారత్–యూఏఈ అత్యున్నత స్థాయి టాస్క్‌ఫోర్స్ 12వ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో గోయల్ ఈ విషయాలు చెప్పారు. ఈ సమావేశానికి గోయల్‌తో పాటు అబుధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఎండీ షేక్ హమీద్ బిన్ జాయెద్ అల్ నాహ్యాన్ కో–చెయిర్‌గా వ్యవహరించారు. స్థానిక కరెన్సీలో ద్వైపాక్షిక వాణిజ్యంతో పాటు వర్చువల్ ట్రేడ్ కారిడార్ పనులు, అహ్మదాబాద్‌లో ఫుడ్ పార్క్ ఏర్పాటు మొదలైన అంశాలపై ఇందులో చర్చించారు. ఈ సందర్భంగా గోయల్ ఏమి చెప్పారంటే... → రెండు దేశాల మధ్య ఫుడ్ కారిడార్ స్థాపనను ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు– యూఏఈతో కూడిన చిన్న వర్కింగ్ గ్రూప్ కూడా ఇప్పటికే ఏర్పాటయ్యింది. → భారతదేశంలో ఫుడ్ పార్కుల ఏర్పాటు గురించి చర్చించిన అంశాల్లో మరొకటి. ఇప్పటికే ఈ విషయంలో కొంత పురోగతి జరిగింది. రైతులకు అధిక ఆదాయంతోపాటు లక్షలాది మందికి ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఉద్యోగాలు కల్పించడానికి సహాయపడే అంశమిది. అలాగే యూఏఈ ఆహార భద్రతకు కూడా దోహదపడుతుంది. → ఫుడ్ క్యారిడార్ పెట్టుబడి వచ్చే రెండున్నరేళ్ల కాలంలో జరుగుతుందని అంచనా. → యూఏఈకి అనువైన అధిక నాణ్యతా ఉత్పత్తుల లభ్యత కోసం దేశంలో యూఏఈ భారీ పెట్టుబడులతో ఫుడ్ ప్రాసెసింగ్ సదుపాయాలను మెరుగుపరచాలన్నది గత ఎంతోకాలంగా చర్చిస్తున్న అంశం. ఇది ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతోంది. → తాజా పరిణామంతో దేశీయ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమతో ఇతర గల్ప్ మార్కెట్లూ అనుసంధానమయ్యే అవకాశం ఉంది. దుబాయ్‌లో ఇన్వెస్ట్ ఇండియా కార్యాలయంభారత్లో పెట్టుబడులు చేయదల్చుకునే మదుపర్లకు సహాయకరంగా ఉండేలా దుబాయ్‌లో ఇన్వెస్ట్ ఇండియా కార్యాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు పియుష్ గోయల్ ఈ సందర్భంగా తెలిపారు. అలాగే, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌కి (ఐఐఎఫ్‌టీ) సంబంధించి విదేశాల్లో తొలి క్యాంపస్‌ను కూడా దుబాయ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (యూఏఈ) నివసించే 35 లక్షల మంది భారతీయులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. -
ఈపీఎఫ్‌వో కిందకు 20 లక్షల కొత్త సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలోకి జూలై నెలలో 19.94 లక్షల మంది కొత్తగా చేరారు. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ విడుదల చేశారు. ఈపీఎఫ్‌వో నిర్వహించే సామాజిక భద్రతా పథకం కింద జూలైలో 10.52 లక్షల మంది మొదటిసారి నమోదు చేసుకున్నట్టు తెలిపారు. → 8.77 లక్షల మంది సభ్యుల వయసు 18–25 ఏళ్ల మధ్య ఉంది. అంటే వీరంతా మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. → జూలైలో కొత్తగా చేరిన వారిలో 4.41 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఈపీఎఫ్‌వో నెలవారీ పేరోల్ గణాంకాలు విడుదల చేయడం మొదలైన తర్వాత ఒక నెలలో మహిళా సభ్యుల గరిష్ట చేరిక ఇదే. ఇందులో 3.05 లక్షలు మొదటిసారి చేరిన వారు కావడం గమనార్హం. → 14.65 లక్షల మంది ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరారు. → జూలైలో ఈపీఎఫ్‌వో కిందకు చేరిన వారిలో 59 శాతం మేర మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల నుంచే ఉన్నారు. → తయారీ, కంప్యూటర్ సేవలు, నిర్మాణ రంగం, ఇంజనీరింగ్, బ్యాంకింగ్, ప్రైవేటు ఎలక్ట్రానిక్ మీడియా రంగాల నుంచి ఎక్కువ మంది చేరారు. -
27 లక్షల మహిళా పారిశ్రామికవేత్తలకు లబ్ధి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సీజీటీఎంఎస్ఈ పథకం కింద మహిళల ఆధ్వర్యంలోని సూక్ష్మ, చిన్న తరహా సంస్థలకు 90 శాతం వరకు మెరుగైన రుణ హామీ కవరేజీ లభిస్తుందని కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ తెలిపారు. 27 లక్షల మహిళల ఎంఎస్ఎంఈలకు (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు) దీని కింద ప్రయోజనం దక్కుతుందన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలు బ్యాంకుల నుంచి హామీలేని రుణ సాయాన్ని పొందే దిశగా ఇది కీలక నిర్ణయం అవుతుందన్నారు. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో, స్మాల్ ఎంటర్ప్రైజెస్ (సీజీటీఎంఎస్ఈ) బోర్డ్ ఆమోదానికి ముందు మహిళల ఆధ్వర్యంలోని సంస్థలకు 85 శాతం వరకే రుణ హామీ రక్షణ ఉండేది. దీన్ని 90 శాతానికి పెంచడం వల్ల మరింత మందికి ప్రయోజనం దక్కుతుందని మంత్రి మాంఝీ పేర్కొన్నారు. నరేంద్ర మోదీ సర్కారు 100 రోజుల పాలనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలను మంత్రి మీడియాకు వెల్లడించారు. 5.07 కోట్ల ఎంఎస్ఎంఈలు సంఘటిత వ్యవస్థలోకి చేరాయని, 21 కోట్ల ఉద్యోగాలు ఏర్పడినట్టు వివరించారు. ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద గడిచిన 100 రోజుల్లో 26,426 సూక్ష్మ సంస్థలు ఏర్పాటయ్యాయని, వాటికి రూ.3,148 కోట్ల రుణాలు మంజూరైనట్టు మంత్రి వెల్లడించారు. వీటి రూపంలో 2.11 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం పెరుగుతుందన్నారు. 14 టెక్నాలజీ కేంద్రాలు రూ.2,800 కోట్లతో, ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా 14 టెక్నాలజీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి జితన్ రామ్ మాంఝీ తెలిపారు. నాగ్‌పూర్, పుణె, బొకారోలోనూ వీటిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ‘‘వీటిని ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో నెలకొల్పుతాం. స్థానిక ఎంఎస్ఎంఈలు వీటి ద్వారా తయారీలో అత్యాధునిక సాంకేతికతలు, నైపుణ్యాభివృద్ధి, వ్యాపార సలహా సేవలు పొందొచ్చు. టెక్నాలజీ లభ్యతతో లక్ష ఎంఎస్ఎంఈలు ప్రయోజనం పొందుతాయి. వచ్చే ఐదేళ్ల కాలంలో 3 లక్షల మంది యువతకు శిక్షణ ఇస్తాం’’అని మంత్రి వివరించారు. పీఎం విశ్వకర్మ పథకం మొదలై ఏడాది అయిన సందర్భంగా మహారాష్ట్రలోని వార్ధాలో ఈ నెల 20న ఓ మెగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. -
రాహుల్ గాంధీ భారతీయుడు కాదు: కేంద్ర మంత్రి
ఢిల్లీ: ఇటీవల అమెరికా పర్యటనలో లోక్‌సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సిక్కులపై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు ఘాటుగా స్పందించారు. అసలు రాహుల్ భారతీయుడే కాదని మండిపడ్డారు. రాహుల్ అధిక సమయం విదేశాల్లోనే గడుపుతారని అన్నారు. కేంద్ర మంత్రి బిట్టు.. ఆదివారం మీడియాతో మాట్లాడారు.‘‘ రాహుల్ గాంధీ భారతీయుడు కాదు. ఎక్కువ సమయంలో విదేశాల్లో ఉంటారు. విదేశాలకు వెళ్లినప్పుడు మన దేశం మీద తప్పుడు, అసత్య వ్యాఖ్యలు చేస్తారు. మన దేశం మీద రాహుల్‌కు అసలు ప్రేమే లేదు. రాహుల్ చేసే వ్యాఖ్యలను కేవలం మోస్ట్ వాంటెడ్ పీపుల్స్, వేర్పాటువాదులు, బాంబులు, గన్నులు తయారు చేసే వాళ్లు మాత్రమే ప్రశంసిస్తారు. రాహుల్ గాంధీ చేసిన అసత్య వ్యాఖ్యలు ప్రపంచ దేశాల్లో ఉండే సిక్కు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. విమానాలు, రైళ్లు, రోడ్లు పేల్చివేయడానికి ప్రయత్నించే దేశ శత్రువులు రాహుల్ గాంధీకి మద్దతుగా ఉన్నారు. ఒక నంబర్ వన్ ఉగ్రవాదిని, దేశానికి శత్రువును పట్టుకుంటే అవార్డు వస్తుందంటే.. అది రాహుల్ గాంధీనే’’ అని తీవ్రంగా మండిపడ్డారు.#WATCH | Bhagalpur, Bihar: On Lok Sabha LoP Rahul Gandhi's recent statements, Union Minister Ravneet Singh Bittu says, "Rahul Gandhi is not an Indian, he has spent most of his time outside. He does not love his country much because he goes abroad and says everything in a wrong… pic.twitter.com/uZTvtSuhGj— ANI (@ANI) September 15, 2024బిట్టు వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత సందీప్ దీక్షిత్ స్పందిస్తూ.. ‘‘మేము బిట్టు వంటి వ్యక్తులపై పట్ల జాలి మాత్రమే చూపిస్తాం. ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీని పొగిడేవారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత ఆ పార్టీకి తన విధేయతను చూపిస్తున్నాడు’’ అని అన్నారు. ఇక.. బిట్టు సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు.ఇటీవల అమెరికా రాహుల్ మాట్లడుతూ.. ‘‘సిక్కులు తలపాగాలు, కడియాలు ధరించవచ్చా, వారు గురుద్వారాకు వెళ్లగలుగుతున్నారా అనేవాటిపైనే భారత్‌లో ఘర్షణలు జరుగుతున్నాయి. అన్ని మతాలకూఈ పరిస్థితి తప్పడం లేదు’ అని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను తీవ్ర దుమారం రేపాయి. రాహుల్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుపట్టిన విషయం తెలిసిందే.చదవండి: ‘కేజ్రీవాల్ రాజీనామా నిర్ణయం.. 48 గంటల రహస్యం ఏంటి?’ -
కేంద్రమంత్రి బూట్లు తీసిన ప్రభుత్వ అధికారి.. వీడియో వైరల్
కేంద్రమంత్రికి ఓ ప్రభుత్వ అధికారి సేవలు చేయడం విదాదాస్పదంగా మారింది. సదరు ఉన్నతాధికారి మంత్రి పైజామాను సరిచేయడం, బూట్లను తొలగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అధికారి, మంత్రి తీరుపై ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కేంద్ర బొగ్గుశాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే సోమవారం జార్ఖండ్ పర్యటనకు వచ్చారు. కోల్ ఇండియా లిమిటెడ్ అనుంబంధ సంస్థ అయిన బీసీసీఎల్ జనరల్ మేనేజర్ అరిందమ్ ముస్తాఫీ.. కేంద్ర మంత్రి బూట్లను తొలగించారు. అలాగే ధన్‌బాద్‌లోని భూగర్భ గని సందర్శన సమయంలో ఆయన పైజామాను సరిచేశారు.On an official visit to review several coal projects of BCCL, Union Minister of State for Coal Satish Chandra Dubey was seen taking the help of a senior BCCL official to remove his shoes and tighten his pajama. #Watch #Dhanbad #Jharkhand #India #SatishChandraDubey #BCCL pic.twitter.com/v1mvbbUxWo— Mirror Now (@MirrorNow) September 9, 2024ఈ వీడియో వైరలవ్వడంతో కాంగ్రెస్ స్పందిస్తూ.. ఈ ఘటన అవమానకరమైన విషయమని విమర్శించింది. బీసీసీఎల్ అధికారులు తమ అవినీతిని దాచడానికి ఇలాంటి చర్యల ద్వారా మంత్రులను సంతోష పెడుతున్నారని ఆరోపించింది.‘మంత్రి కాళ్లకు షూస్ జీఎం తొలగిస్తే అది సిగ్గుచేటు. జీఎంను బీబీసీఎల్ సీఎండీ (చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్)గా చేయాలి. అలాంటి బీసీసీఎల్ అధికారులు అవినీతికి పాల్పడి, తమ లోపాలను దాచిపెట్టి మంత్రులను ప్రసన్నం చేసుకుంటున్నారు’ అని ధన్‌బాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ సింగ్ మండిపడ్డారు. -
‘సినిమా లేకుండా ఉండలేను.. కేంద్రమంత్రి పదవి ఎక్కువేం కాదు’
కేంద్ర మంత్రిత్వ పదవి, సినిమాల్లో నటించడంపై నటుడు సురేషి గోపి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మోదీ కేబినెట్లో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సురేషి గోపి.. ఇటు సినిమాల్లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన్ను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగిస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా ఈ వార్తలపై సురేష్ గోపి స్పందించారు. మంత్రి పదవిలో ఉంటూ సినిమాల్లో నటించినందుకు తనను కేంద్ర సహాయ మంత్రిగా తొలగిస్తే.. తనను తాను రక్షించుకున్నట్లేనని పేర్కొన్నారు. అదే విధంగా తన తదుపరి చిత్రం 'ఒట్టకొంబన్' సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు కేంద్రం నుంచి అనుమతి కోరానని.. ఇంకా దీనిపై ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. అయితే సెప్టెంబర్ 6న షూటింగ్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.కాగా సురేషి గోపి ప్రస్తుతం మోదీ 3.0 కేబినెట్లో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి ఉన్నారు. అటు సినిమాల్లోనూ నటన కొనసాగించాలని ఆయన కోరుకుంటున్నారు. ప్రస్తుతం తన వద్ద అనేక స్క్రిప్ట్‌లు ఉన్నాయని, వీటిలో 20 నుంచి 22 సినిమాలు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. సినిమాల్లో నటించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అనుమతి కోరగా.. ఆయన ఎన్ని సినిమాల్లో నటించాలని అడిగారని చెప్పారు.@నేను 22 సినిమాల్లో నటించాల్సి ఉందని అమిత్ షాకు చెప్పాను. అయితే దీనిని ఆయన పక్కన పెట్టారు. ప్రస్తుతం సినిమాల్లోకి నటించేందుకు అనుమతి ఇస్తానని చెప్పారు. ఇప్పుడైతే సెప్టెంబర్ 6 నుంచి షూటింగ్లో పాల్గొంటాను’ అని కేరళలో ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు.‘మంత్రి పదవిని నిర్వహించేందుకు సహకరించడానికి మంత్రివర్గానికి చెందిన ముగ్గురు, నలుగురు అధికారులను నా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు సినిమా సెట్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇదంతా వీలు కాకపోతే.. వారు నన్ను కేంద్ర పదవి నుంచి తీసివేస్తే, అది నాకు మేలు చేసిన వాడిగా భావిస్తాను. నేను మంత్రి పదవి కావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పటికీ ఆ కోరిక లేదు. నా కోసం కాకుండా నన్ను ఎన్నుకున్న త్రిసూర్ ప్రజల కోసం నాకు మంత్రి పదవి ఇస్తున్నామంటూ బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి నేను తలవంచి అంగీకరించాను. ఇప్పటికీ నేను మా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. కానీ నా అభిరుచి (సినిమా) లేకుండా ఉండలేను’ అని పేర్కొన్నారు. -
కేంద్ర మంత్రి జుయల్ ఓరం భార్య మృతి
భువనేశ్వర్: కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్ ఓరం భార్య జింగియా ఓరం మృతి చెందారు. డెంగ్యూతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. జుయల్ ఓరం సైతం డెంగ్యూ బారిన పడి అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జింగియా ఓరం మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం రాత్రి ఆయన ఆస్పత్రిని సందర్శించారు. సీఎంతో పాటు ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్, ఆరోగ్య శాఖ మంత్రి ముఖేష్ మహాలింగ్, స్పీకర్ సూరమా పాడి, ఇతర బీజేపీ నేతలు కూడా జింగియా ఓరం భౌతికకాయానికి నివాళులు అర్పించారు. -
జెండా ఎగురవేసిన కిషన్ రెడ్డి
-
Narendra Modi: అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం
వయనాడ్: భీకర వరదలతో అతలాకుతలమైన కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. వరదల ధాటికి కొట్టుకుపోయిన గ్రామాలు, దెబ్బతిన్న వంతెనలు, ధ్వంసమైన రహదారులు, శిథిలమైన ఇళ్లను పరిశీలించారు. సహాయక శిబిరంలో బాధితులతో స్వయంగా మాట్లాడారు. వరదల్లో ఆప్తులను కోల్పోయిన కుటుంబాల ఆవేదన విని చలించిపోయారు. అధైర్యపడొద్దని, అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వెంట కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ తదితరులు ఉన్నారు. బురద దారుల్లో మోదీ నడక ప్రధాని మోదీ తొలుత ఢిల్లీ నుంచి కేరళలోని కన్నూర్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వయనాడ్ జిల్లాలోని చూరమల, ముండక్కై, పుంచిరిమట్టామ్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించారు. తర్వాత కాల్పెట్టాలో దిగారు. రోడ్డు మార్గంలో చూరమలకు చేరుకున్నారు. బురద, రాళ్లతో నిండిపోయిన దారుల్లో కాలినడకన కలియదిరిగారు. వరద బీభత్సాన్ని స్వయంగా అంచనా వేశారు. ప్రభుత్వ అధికారులతో, సహాయక సిబ్బందితో మాట్లాడారు. సహాయక చర్యలు, క్షేత్రస్థాయి పరిస్థితులను అధికారులు వివరించారు. అనంతరం ప్రధానమంత్రి మెప్పడిలో సహాయక శిబిరానికి చేరుకొని, బాధితులతో సంభాíÙంచారు. వారికి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. స ర్వం కోల్పోయామంటూ బోరుమని విలపించారు. ప్రధాని మోదీ వారిని ఓదార్చారు. భుజాలపై చేతులు వేసి మాట్లాడారు. గూడు లేని తమకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని బాధి తు లు కోరగా, తప్పకుండా ఇస్తామంటూ మోదీ చెప్పారు. పలువురు చిన్నారులతోనూ ఆయ న సంభాíÙంచారు. వరదల తర్వాత భారత సైన్యం నిర్మించిన 190 అడుగుల బెయిలీ వంతెనపై కాసేపు నడిచారు. మోదీ పర్యటన సందర్భంగా చూరమలలో రహదారికి ఇరువైపులా వందలాది మంది జనం గుమికూడారు. ప్రధానమంత్రి నుంచి సహాయం అరి్థంచడానికి వచ్చామని వారు చెప్పారు. -
రామయ్యా.. హామీల మాటేమిటయ్యా.!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ⇒ గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు ఉచితంగా ఇవ్వబోతున్నాం. మూడు సిలిండర్లు ఎందుకని చంద్రబాబు ఇవ్వబోతున్నారు..? సిలిండర్ల ధర జగన్ పెంచారు. ఇప్పుడు కొనలేకపోతున్నాం. ఇబ్బంది ఉంది కాబట్టి మళ్లీ గ్యాస్ పొయ్యల మీద వంట చేసుకునేందుకు మూడు సిలిండర్లు ఉచితం.⇒ వైఎస్ జగన్ ప్రభుత్వంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. నిత్యావసర సరుకు లు కూడా భారీగా పెరగడంతో కొనలేకపోతున్నాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ధరలను స్థిరీకరిస్తాం.⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోలేదు. అన్ని రకాలుగా ముంచేశారు. రైతుల్ని ఆదుకోవడానికి ఏటా సీజన్ ప్రారంభంలోనే రూ. 20వేల పెట్టుబడి సా యం అందిస్తాం. ⇒ సముద్ర వేట విరామ సమయంలోనే మత్స్యకారులకు రూ. 20వేలు అందజేస్తాం. మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తాం. వారికి అవసరమైన బోట్లు, వలలు, పరికరాలు అందిస్తాం.అధునాతన పద్ధతుల్లో వేటకు సహకరిస్తాం.⇒ ఆర్టీసీ ఛార్జీలు భరించలేని విధంగా ఉన్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం. జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆర్టీసీ బస్సు ఛార్జీలు ఫ్రీ చేసి, ఆడప డుచులు ఎక్కడ తిరగాలన్నా పైసా ఖర్చు లేకుండా చేస్తాం. ⇒చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నా సరే ప్రతి పిల్లాడికి రూ.15వేలు చొప్పున.. ఇద్దరుంటే రూ.30వేలు.. ముగ్గురుంటే రూ.45 వేలు... నలుగురుంటే రూ.60వేలు.. ఇంకా ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15వేలు చొప్పున మీ అకౌంట్లో వేయడానికి చంద్రబాబు నిర్ణయించారు.ఎన్నికలకు ముందు ప్రస్తుత కేంద్ర మంత్రి, అప్పటి ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు చేసిన ప్రసంగాలు, ఇచ్చిన హామీలు ఇవి. ఇప్పుడు వారు అనుకున్నట్టే అధికారంలోకి వచ్చారు. బాధ్యతలు స్వీకరించి 50 రోజులు దాటిపోయింది. వీటిలో ఒక్కటంటే ఒక్కటైనా అమలు చేశారా? అంటే ఏమీ లేదనే చెప్పాలి. పైగా ఆయన కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. కానీ ఇప్పుడు ఎన్నికల ముందు మాటలన్నీ మర్చిపోయినట్టు కనిపిస్తున్నారు.ధరలు తగ్గించారా?వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఽనిత్యావసర ధరలు పెరిగిపోయాయని గగ్గోలు పెట్టారు. పోనీ ఇప్పుడేమైనా తగ్గించారా అంటే అదేమీ లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయని ఆరోపించిన రామ్మోహన్ నాయుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలోనే మంత్రిగా ఉన్నా ఆ ధరల గురించి మాటైనా మాట్లాడడం లేదు. గ్యాస్ ధరల పెంపు కూడా వైఎస్ జగన్‌పైనే వేసి ఊరూరా ప్రచారం చేశారు. ఇప్పుడు మాత్రం దాన్ని తగ్గించి చూపలేకపోతున్నారు.కోటలు దాటే మాటలుకేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు మాటలు కోటలు దాటుతున్నాయి గానీ చేతలే దాటడం లేదని జిల్లా వాసులంటున్నారు. మత్స్యకారుల వేట విరామం సమయం దాటిపోయి చాలా రోజులైంది. మధ్యలో వర్షాలు కూడా వచ్చి మత్స్యకారులు వేటకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారికి ఇస్తామన్న రూ.20 వేలు ఇంతవరకు ఇవ్వలేదు. ఖరీఫ్ సీజన్ సగానికి వచ్చేసింది. ఉడుపులు అయిపోయాయి. కానీ, వారికింతవరకు పెట్టుబడి సాయం అందలేదు. వ్యవసాయ ఖర్చుల కోసం రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడి సాయమే కాదు ప్రభుత్వం విధిగా అందించాల్సిన విత్తనాలు, ఎరువుల విషయంలోనూ అదే నిర్లక్ష్యం కన్పించింది. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు దాటిపోయింది. పిల్లల్ని చదివించేందుకు తల్లులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహాన్ని నేటికీ ఇవ్వలేదు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రూ. 15వేలు చొప్పున ఇస్తామని చెప్పి ఇంకా ఇవ్వలేదు. ఇవే కాదు మహిళలకు ప్రతి నెలా రూ. 1500, నిరుద్యోగులకు 20లక్షల ఉద్యోగాలు...అవి ఇచ్చేలోపు నెలకి రూ. 3వేల నిరుద్యోగ భృతి కూడా మర్చిపోయారు. 50 ఏళ్ల పింఛన్ ఇవ్వడం మాట దేవుడెరుగు.. ఉన్నవి తీసేస్తున్నారు.కొత్తవేవీ..?తాను ఎంపీగా ఎన్నికయ్యాకే జిల్లాలో రైల్వే అభివృద్ధి జరిగిందని గొప్పలు చెప్పుకుంటారు. కానీ, దేశ వ్యాప్తంగా ఏం జరిగాయో అవే జరిగాయే తప్ప వ్యక్తిగత ప్రాధాన్యతతో జరిగినవేవి లేవు. పక్కనే ఉన్న విజయనగరం జిల్లాలో అనేక రైల్వే స్టేషన్లు ఆధునీకరణ జరిగాయి. అవన్నీ ఎంపీల వ్యక్తిగత ఖాతాలో వేసుకుంటే.. ఇక్కడ అదనంగా చేసిందేంటో చెప్పడానికి లేవు. కేంద్రమంత్రిగా ఉండటంతో జిల్లాకు ప్రత్యేక ప్రాజెక్టులేమైనా వస్తాయేమోనని ప్రజలంతా ఆశించారు. కానీ ఒక్కటంటే ఒక్కటీ జిల్లాకు ప్రత్యేక కేటాయింపు లేదు. -
గుడ్‌న్యూస్.. బీఎస్ఎన్ఎల్లో మరో శుభ పరిణామం
BSNL 5G: ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్లో మరో శుభ పరిణామం చోటుచేసుకుంది. బీఎస్ఎన్ఎల్ దేశంలో తన 5జీ సేవల ట్రయల్స్ నిర్వహించడం ప్రారంభించింది. దీనికి సంబంధించి కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి, జ్యోతిరాదిత్య సింధియా ‘ఎక్స్’ (ట్విటర్) హ్యాండిల్ ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేశారు."బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్‌తో ఫోన్ కాల్ ప్రయత్నించాను" అని సింధియా రాసుకొచ్చారు. ఈ మేరకు సి-డాట్ క్యాంపస్‌లో బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్‌ను పరీక్షిస్తున్న వీడియోను షేర్ చేశారు. మంత్రి పోస్ట్ చేసిన వీడియోలో ఆయన బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్వర్క్ ద్వారా వీడియో కాల్ మాట్లాడారు.ఈ ఏడాది బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు రూ. 82 వేల కోట్లకు పైగా నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. టెలికం సంస్థ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, దేశంలో పూర్తిగా అభివృద్ధి చేసిన 4జీ, 5జీ సాంకేతికతను సులభతరం చేయడానికి ఈ నిధులు ఉపయోగించనున్నారు. ఈ చర్య భవిష్యత్తులో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు పెద్ద సవాలుగా మారవచ్చు.Connecting India! Tried @BSNLCorporate ‘s #5G enabled phone call. 📍C-DoT Campus pic.twitter.com/UUuTuDNTqT— Jyotiraditya M. Scindia (@JM_Scindia) August 2, 2024 -
కులగణనపై కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: కేంద్రమంత్రి, ఎల్జేపీ(రామ్ విలాస్) పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ దేశవ్యాప్త కులగణనపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా కులగణన చేసి వాటి వివరాలు బహిర్గతం చేస్తే సమాజంలో విభజనకు దారి తీస్తుందని అన్నారు. కులగణన వివరాలు వెల్లడిస్తే జరిగే పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చిరాగ్ పాశ్వాన్ పీటీఐ ఎడిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు.లోక్‌సభ ఎన్నికల సందర్బంగా బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన.. దేశంలో ఒకే ఎన్నిక, ఉమ్మడి పౌరస్మృతి అమలు వంటి హామీలపై ఎటువంటి చర్చలు ఎన్డీయే కూటమిలో జరగటం లేదని స్పష్టం చేశారు. ‘మా ముందుకు ఇప్పటికీ ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన ముసాయిదా రాలేదు. మేము ఆ ముసాయిదాను పరిశీలించాలి. ఎందుకంటే భారత్ భిన్నత్వం ఏకత్వం గల దేశం కావున, మాకు కొన్ని ఆందోళనలు ఉన్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో భాష, సంస్కృతి, జీవనశైలిలో చాలా వ్యత్యాలు ఉంటాయి. అందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనుకోవటంపై నాకు ఆశ్చర్యం కలుగుతోంది. .. అయితే ఉమ్మడి పౌరస్మృతి అంశం చర్చకు వచ్చినప్రతిసారి హిందూ, ముస్లింల వ్యవహారంగా కనిస్తోంది. కానీ, ఇది అందరి మత విశ్వాసాలు, సంప్రదాయాలు, వివాహ పద్దతులకు సంబంధించింది. హిందు, ముస్లింలను వేరు చేసింది అస్సలే కాదు. ఇది అందరినీ ఏకం చేసేది మాత్రమే’ అని అన్నారు.మరోవైపు.. ‘ప్రభుత్వం కులాల వారీగా చేపట్టే సంక్షేమ పథకాలకు కులగణన ఎంతో ఉపయోగపడుతంది. కోర్టులు కూడా కులాల వారీ జనాభా డేటాను పలసార్లు ప్రస్తావించింది. అయితే ఈ డేటాను ప్రభుత్వం తన వద్దనే ఉంచుకోవాలి. బయటకు విడుదల చేయవద్దు. అయితే కులగణన డేటాను బహిర్గతం చేయడాన్ని మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఆలా చేయటం వల్ల సమాజంలో కులాల మధ్య విభజనకు దారి తీస్తుందనే ఆందోళన కలుగుతోంది’ అని కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ అన్నారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్.. CMD మైండ్ గేమ్..
-
విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిశీలిస్తున్న కేంద్రమంత్రి కుమారస్వామి
-
అడ్వాణీకి పొరపాటున మంత్రి శ్రద్ధాంజలి!
తుమకూరు: బీజేపీ దిగ్గజ నేత ఎల్కే అడ్వాణీ చనిపోయారంటూ కేంద్రమంత్రి వి.సోమణ్ణ ఏకంగా ఆయనకు శ్రద్ధాంజలే ఘటించారు! కర్ణాటకలోని తుమకూరులో శనివారం ఈ ఘటన జరిగింది. అడ్వాణీ అనారోగ్యంతో రెండుసార్లు ఆస్పత్రిలో చేరి చికిత్స అనంతరం కోలుకోవడం తెలిసిందే. మంత్రి మాత్రం బీజేపీ, జేడీ(ఎస్) కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, ‘‘నాకిప్పుడే సమాచారం అందింది. అడ్వాణీ మరణించారు’’ అంటూ శ్రద్ధాంజలి ఘటించారు. అడ్వాణీ క్షేమంగా ఉన్నారని తేలడంతో సభికులంతా కంగుతిన్నారు. -
పోలవరం ప్రాజెక్టు జాప్యానికి చంద్రబాబు పాపాలే కారణం..
-
ప్రత్యేక హోదా అనేది లేదు.. ప్యాకేజీతోనే సహకరిస్తాం: : కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ
న్యూఢిల్లీ, సాక్షి: ఎన్టీయే కూటమిలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ.. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని పట్టుబట్టాలనే ఒత్తిళ్లు మొదలయ్యాయి. అయితే ఈ విషయంలో మిత్రపక్షాలకు కేంద్రంలోని బీజేపీ మొండి చేయి చూపిస్తుందా? అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. ఏపీకి చెందిన ఆ పార్టీ ఎంపీ, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చేసిన తాజా వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై నరసాపురం ఎంపీ, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మీడియాతో స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగానే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం కదా అని వ్యాఖ్యానించారాయన. అలాగే.. బీహార్ అసెంబ్లీ ప్రత్యేక హోదా తీర్మానంపైనా స్పందిస్తూ.. జేడీయూ తీర్మానాలు చేసినంత మాత్రాన హోదా వస్తుందా? అని ఎదురు ప్రశ్నించారాయన. ‘‘కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది తీర్మానాలు చేసి ఇచ్చే అంశం కాదు. ప్రత్యేక హోదా లేదనేది బీహార్‌కు కూడా వర్తిస్తుంది. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అభివృద్ధికి కేంద్రం సిద్ధంగా ఉంది’’ అని తెలిపారాయన. అలాగే.. సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వస్తారని, ఎంపీలతో సమావేశం అవుతారని, రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపై ఎలా ముందుకు వెళ్లాలనేది చర్చిస్తామని చెప్పారాయన.ఇక.. పోలవరం ప్రాజెక్టు అంశంపైనా స్పందిస్తూ.. నిర్మాణ వైఫల్యం వల్లే డయాఫ్రం వాల్, కాపర్ డ్యాంకు పగుళ్లు వచ్చాయన్నారు. జాతీయ ప్రాజెక్టు పొలవరం నిర్మాణానికి కేంద్రం సహకారం ఉంటుంది. కానీ, ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందా? లేదంటే కేంద్రం నిర్మిస్తుందా? అనేది కేంద్ర జలవనరుల శాఖ నిర్ణయిస్తుందన్నారు.రాష్ట్రంలో కొనసాగుతున్న దాడుల పర్వంపైనా స్పందిస్తూ.. ఏపీలో శాంతిభద్రతలు కొలిక్కి రావడానికి రెండు, మూడు నెలల టైం పట్టొచ్చని, గత పరిస్థితుల వల్లే ఈ దాడులు కొనసాగుతున్నాయని అన్నారాయన. -
కేంద్రమంత్రి నితిన్ గడ్కరితో సీఎం రేవంత్ సమావేశం
-
సింగరేణి ప్రైవేటీకరణ శుద్ధ అబద్ధం
-
పేపర్ లీక్ అయినా నీట్ పరీక్ష రద్దు చేయరా?
న్యూఢిల్లీ: దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్-యూజీ 2024 పరీక్షపై వివాదంం రోజురోజుకీ ముదురుతోంది. పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ, పేపర్ లీక్ అయ్యిందంటూ విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నీట్ పరీక్షతో పాటు త్వరలో జరగబోయే కౌన్సింగ్ ప్రక్రియను రద్దు చేసి కొత్తగా ఎగ్జామ్ నిర్వహించాలనే డిమాండ్ వెల్లువెత్తోంది.అయితే గతంలో నీట్ పేపర్ లీక్ అయినప్పుడు పరీక్షను రద్దు చేశారు. మరి ఈ దఫా అందుకు ఒకవైపు కేంద్రం.. మరోవైపు ఈ పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ససేమిరా అంటోంది. అందుకు కారణం ఏంటో.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. ‘‘పేపర్ లీక్ పరిమిత సంఖ్యలో విద్యార్థులను మాత్రమే ప్రభావితం చేసిందని చెప్పారు. పరీక్షను రద్దు చేయడం వల్ల పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుంది’’ అని అన్నారాయన. అలాగే ఈ కేసును సుప్రీంకోర్టు విచారిస్తోందని, కోర్టే తీసుకునే నిర్ణయమని, తుది నిర్ణయమని చెప్పారు. అయితే 2004, 2015లో విస్తృతమైన లీక్‌లు జరగడం వల్ల అప్పటి పరీక్షలను రద్దు చేయడానికి దారితీసినట్లు చెప్పారు.కాగా నీట్ యూజీ పరీక్షలో 67 మంది విద్యార్థులు 720 మార్కులు సాధించడంతో వివాదం చెలరేగింది. ప్రశ్నపత్రం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులకు, తప్పుడు ప్రశ్నలు రావడం కారణంగా కొంతమంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది.మే 5న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను దాదాపు 24 లక్షల మంది విద్యార్ధులు రాశారు. జూన్ న4న విడుదల ఫలితాల్లో 67 మంది అభ్యర్ధులకు 720 మార్కులు సాధించారు. దీంతో ప్రశ్న పత్రం లీక్ అయ్యిందంటూ, 1500 మంది విద్యార్ధులకు గ్రేస్ మార్కులు కలపడంపై వివాదం చెలరేగింది. పరీక్షకు ఒక రోజు ముందు పేపర్ లీకవడంపై పలువురిని అరెస్ట్ చేశారు. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అయితే పరీక్షను రద్దు చేయడానికి కేంద్రం నిరాకరించింది. ఈ వివాదాల నడుమనే జులై మొదటి వారంలో కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ఎన్టీఏ సన్నాహకాలు చేస్తుండగా.. సుప్రీం కోర్టు సైతం కౌన్సెలింగ్ వాయిదా వేయాలన్న అభ్యర్థలను తోసిపుచ్చుతూ వస్తోంది. -
సింగరేణి వివాదం.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి ఒక్క రాష్ట్ర ప్రభుత్వానిదే కాదని.. కేంద్రానికి బాధ్యత ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సింగరేణిపై కేంద్రం పారదర్శకంగా వ్యవహరిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో సింగరేణిని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. డిప్యూటీ సీఎం చెప్పిన విషయాలన్నింటిని పరిశీలిస్తాం. ఒడిశాలో గనుల వ్యవహారంపై అక్కడి ముఖ్యమంత్రితో మాట్లాడతాను. దేశమంతా ఒకే పాలసీ వర్తించేలా చొరవ తీసుకుంటాం’’ అని కిషన్‌రెడ్డి వెల్లడించారు.‘‘సింగరేణికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీన్ని రాజకీయం చేయకూడదు. సింగరేణి కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సింగరేణిపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. కోల్ ఇండియా లిమిటెడ్‌కు ఇచ్చిన ప్రాధాన్యత సింగరేణికి కేంద్రం ఇస్తోంది. రెండు మైన్లు కేంద్రం దృష్టిలో ఉన్నాయి.. ఒడిశా నైనీ ప్రాజెక్టుపై త్వరలో నిర్ణయం ఉంటుంది. సింగరేణిలో కొన్ని సమస్యలు ఉన్నాయి.. వాటిని అధిగమిస్తాం’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘రెండు, మూడు రోజుల్లో సింగరేణిపై మరింత స్పష్టత ఇస్తాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పొంతన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పాలసీనే తెలంగాణలో అమలు అయ్యే అవకాశం. ఆక్షన్ అనేది ఓపెన్.. సింగరేణి మాత్రమే కాదు ఎవరైనా బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చు‘‘ అని కిషన్‌రెడ్డి తెలిపారు. -
ఎల్లో మీడియాపై కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ సంచలన కామెంట్స్
-
రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తా: కేంద్ర సహాయ మంత్రి
-
బేటీ పడావోను తప్పుగా రాసిన కేంద్రమంత్రి.. కాంగ్రెస్ విమర్శలు
‘బేటీ బచావో, బేటీ పడావో’.. దేశంలో బాలికల సంక్షేమం కోసం, వారి చదువుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నినాదాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని 22 జనవరి 2015న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. భ్రూణహత్యలను తగ్గించి, బాలికల లింగ నిష్పత్తిని పెంచేందుకు, ముఖ్యంగా చదువుల్లోనూ అమ్మాయిలను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చారు.కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ నినాదాన్ని తాజాగా ఓ మహిళా కేంద్రమంతి సరిగా రాయలేకపోయారు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ ఆమె మాతృ భాష ‘బేటీ బచావో, బేటీ పడావో’ నినాదా హిందీలో తప్పుగా రాశారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో జరిగిన ‘స్కూల్ ఛలో అభియాన్’ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.ये केंद्रीय महिला एवं बाल विकास राज्यमंत्री सावित्री ठाकुर हैं जिले में शिक्षा जागरूकता रथ पर उन्हें ‘बेटी बचाओ बेटी पढ़ाओ’ का स्लोगन लिखना था लेकिन, मंत्रीजी ने लिखा- "बेढी पडाओ बच्चाव" शपथ-पत्र के मुताबिक वे 12वीं पास हैं ये टीप उनके नहीं बल्कि देश के "शैक्षणिक स्तर" पर है pic.twitter.com/v66qM05Uyc— Anurag Dwary (@Anurag_Dwary) June 19, 2024అయితే జాతీయ స్థాయి నేత మాతృభాషలో ఈ పదాన్ని తప్పుగా రాయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్న నినాదాన్ని కూడా మంత్రి సరిగా రాయలేకపోయారంటూ కాంగ్రెస్ మండిపడుతోంది. పార్టీ సీనియర్ నేత కేకే మిశ్రా స్పందిస్తూ..రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉంటూ పెద్ద శాఖలు చూస్తున్న వ్యక్తులకు తమ మాతృభాషలో సైతం సామర్థ్యం లేకపోవడం దురదృష్టకరం. వాళ్లు తమ శాఖలను సమర్థంగా ఎలా నిర్వహించగలరు?’ అని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హత నిబంధనను రాజ్యాంగం విధించాలని అభిప్రాయపడ్డారు.అయితే కాంగ్రెస్ విమర్శలను ధార్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఖండించారు.. మంత్రి తొందరపాటులో చేసిన తప్పును కాంగ్రెస్ పెద్దది చేసి చూపడం ఆ పార్టీ అల్పమైన ఆలోచనలకు, గిరిజన వ్యతిరేకతకు నిదర్శనమని అన్నారు. ఆదివాసీ మహిళా ప్రతినిధి అని కూడా చూడకుండా కాంగ్రెస్ అనవసరపు రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.కాగా సావిత్రి ఠాకుర్.. మధ్యప్రదేశ్‌లోని ధార్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇటీవల మోదీ 3.0 కేబినెట్లో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. -
ఇందిరాగాంధీ.. భారతమాత: సురేశ్ గోపీ
త్రిసూర్: ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ తరఫున కేరళ నుంచి గెలిచిన ఏకైక ఎంపీ, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన మాజీ ప్రధాని ఇందిరను ఆయన భారత మాత(మదర్ ఆఫ్ ఇండియా)గాను, కేరళ దివంగత సీఎం కె.కరుణాకరన్‌ను సాహసోపేతుడైన పాలకుడిగాను అభివర్ణించారు. త్రిసూర్ జిల్లా పుంకున్నమ్లో ఉన్న కరుణాకరన్ సమాధి ‘మురళి మందిరం’ను సురేశ్ గోపీ ఇటీవల సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన గురువుకు నివాళులర్పించేందుకే ఇక్కడికి వచ్చానని, దీనిని రాజకీయం చేయొద్దంటూ కోరారు. -
మరో వివాదంలో కేంద్ర మంత్రి సురేష్‌గోపీ
తిరువనంతపురం: ఇటీవలే కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేరళ బీజేపీ ఎంపీ, సినీ నటుడు సురేష్‌గోపీ మరో వివాదానికి తెర తీశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ‘మదర్ ఆఫ్ ది నేషన్’గా అభివర్ణించి సంచలనం రేపారు.శనివారం(జూన్ 15) కేరళ త్రిసూర్‌లోని కాంగ్రెస్ నేత కరుణాకరణ్ సమాధి ‘మురళి మందిర్’ను సందర్శించి నివాళులర్పించిన సందర్భంగా సురేష్‌గోపీ ఈ వ్యాఖ్యలు చేశారు.అంతేగాక కరుణాకరన్‌తో పాటు మాజీ సీఎం ఈకే నయనార్ తనకు రాజకీయ గురువులని తెలిపారు. కేరళ కాంగ్రెస్‌కు కరుణాకరణ్ తండ్రి అని చెప్పారు. అయితే తన ఈ వ్యాఖ్యలకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు ఆపాదించవద్దని మీడియాను కోరారు. ఇటీవల తాను కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కొన్ని మీడియా ఛానళ్లు తప్పుడు ప్రచారం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో తొలిసారిగా బీజేపీ ఖాతా తెరిచింది. త్రిసూర్ నుంచి సురేశ్‌గోపీ 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిచి రాష్ట్రం నుంచి గెలిచిన తొలి బీజేపీ ఎంపీగా రికార్డు క్రియేట్ చేశారు. దీంతో కేంద్రంలోని మోదీ3.0 మంత్రి వర్గంలో సురేశ్గోపీకి చోటు దక్కింది. -
బండి సంజయ్ బాధ్యతల స్వీకరణ
-
కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా మన్సుఖ్ మాండవియా
న్యూఢిల్లీ: కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా మన్సుఖ్ మాండవియా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు నిర్వర్తించిన అనురాగ్ ఠాకూర్ స్థానంలో 52 ఏళ్ల మాండవియాకు అవకాశం దక్కింది. గుజరాత్‌లోని పోర్బందర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన గత మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. మాండవియాకు తోడు మహారాష్ట్రకు చెందిన రక్షా ఖడ్సేను క్రీడా శాఖ సహాయ మంత్రిగా కూడా నియమించారు. ఠాకూర్ క్రీడా మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ 7 పతకాలు గెలుచుకుంది. ఠాకూర్ మరోసారి ఎన్నికల్లో గెలిచినా... ఈ సారి ఆయనకు మంత్రి పదవి దక్కలేదు -
Raksha Khadse: సర్పంచ్ నుంచి సెంట్రల్ మినిస్టర్ వరకూ
తాజా ఎన్.డి.ఏ. మంత్రి వర్గంలో 71 మంది ప్రమాణ స్వీకారం చేస్తే ఏడుగురే స్త్రీలు. వారిలో అందరి కంటే చిన్నది రక్ష ఖడ్సే. 37 సంవత్సరాల రక్ష భర్తను కోల్పోయాక రాజకీయాల్లోకి వచ్చింది. సింగిల్ పేరెంట్‌గా ఉంటూనే సర్పంచ్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకూ ఎదిగింది. మహారాష్ట్ర ఎం.పి. అయిన రక్షకి ప్రజాభిమానం మెండుగా ఉంది. ఆమె స్ఫూర్తిదాయక కథనం.రాజకీయ కుటుంబంలో కోడలుగా అడుగు పెట్టిన అమ్మాయికి రాజకీయాలు ఎంత నాటకీయంగా ఉంటాయో, పదవి విషయంలోనే కాదు జీవితంలో కూడా గెలుపు ఓటములు ఎంత ఖేద మోదాలు కలిగిస్తాయో మెల్లగా తెలిసి వచ్చింది. 2024 లోక్‌సభ ఎన్నికలలో మహారాష్ట్రలోని రావెర్ స్థానం నుంచి మూడోసారి బి.జె.పి. తరఫున గెలిచి, కేంద్రమంత్రిగా మొదటిసారి ప్రమాణం చేసిన రక్ష ఖడ్సే ఆ ఎత్తుకు చేరడానికి తీవ్ర సవాళ్లనే ఎదుర్కొంది. కాని ఓడిపోలేదు. ఆగిపోలేదు. ధైర్యం కూడగట్టుకుని చేసిన ప్రయాణమే గెలుపు తీరానికి చేర్చింది.భర్త ఆత్మహత్యతో...మహారాష్ట్రలోని నాసిక్‌లో కంప్యూటర్ సైన్స్ చదువుకున్న రక్ష ఖడ్సే జలగావ్‌కు చెందిన రాజకీయ కుటుంబంలో కోడలిగా వచ్చింది. ఆమె మామగారు ఏక్నాథ్ ఖడ్సే బి.జె.పి.లో ప్రముఖ నాయకుడు. మంత్రిగా కూడా పని చేశాడు. అతని కుమారుడు నిఖిల్‌తో రక్ష వివాహం జరిగింది. రక్షకు రాజకీయాల మీద పెద్దగా ఆసక్తి లేకపోయినా 2010లో జనం ‘కొథాలి’ అనే ఊరికి సర్పంచ్‌ను చేశారు. ఆ తర్వాత ఆమె జిల్లా పరిషత్ స్థాయి నాయకురాలైంది. కాని 2013లో జీవితం తల్లకిందులైంది. 2013 శాసనమండలి ఎన్నికలలో కేవలం 500 ఓట్ల తేడాతో ఓడిపోయినందుకు మనస్తాపం చెందిన రక్ష భర్త నిఖిల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అది తెలిసి తండ్రి ఏక్నాథ్ తీవ్రంగా జబ్బు పడ్డాడు. ఇద్దరు చిన్న పిల్లలతో రక్ష మొత్తం కుటుంబానికే ఊతంగా నిలబడాల్సి వచ్చింది.అత్తింటి ఆదరణతో...భర్త చనిపోయినా అత్తింటిని రక్ష వీడలేదు. అత్తింటి వారు ముఖ్యంగా మామగారు ఆమెను కన్నకూతురిలా ఆదరించి రాజకీయాలలో ్రపోత్సహించాడు. 2014 ఎన్నికలలో రావేర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె ఘన విజయం సాధించింది. భర్త చనిపోయిన సంవత్సరానికే ఇద్దరు చిన్న పిల్లలను తీసుకుని ఆమె సాగించిన ప్రచారం ఆ రోజుల్లో పెద్ద ఆసక్తిని రేపింది. జనం ఆమెకు మద్దతుగా నిలిచి గెలిపించారు. ఐదేళ్ల కాలంలో వ్యవసాయం, విద్యావ్యవస్థ కోసం రక్ష చేసిన కృషి జనానికి నచ్చడంతో 2019లో కూడా రావేర్ నుంచి ఎం.పి.గా ఘనంగా గెలిపించారు.ప్రత్యర్థిగా మామగారురక్ష మామగారైన ఏక్‌నాథ్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో వచ్చిన విభేదాలు బి.జె.పి.ని వీడేలా చేశాయి. ఆయన ఎన్‌సిపి (శరద్‌పవార్) వర్గంలో చేరి ఎం.ఎల్.సి. అయ్యాడు. కాని రక్ష బి.జె.పి.లోనే కొనసాగింది. 2024 ఎన్నికలలో రావేర్ నుంచి రక్ష నిలబడుతున్నప్పుడు శరద్ పవార్ వర్గం ఏక్నాథ్ను ప్రత్యర్థిగా నిలపాలనుకున్నాయి. కాని కోడలి విజయం కోరిన ఏక్నాథ్ తాను పోటీలో నిలవనని దూరంగా ఉండిపోయాడు. దాంతో ఎన్.సి.పి. అభ్యర్థి శ్రీరామ్ పాటిల్ పై రక్షా ఖడ్సే రెండు లక్షల డెబ్బయి వేల మెజారిటీతో గెలిచింది. పిల్లల కోసం...పిల్లలను ముంబైలో చదివిస్తున్న రక్షా ఖడ్సే ప్రతి శని, ఆదివారాలు వారి దగ్గరకు వెళ్లి సమయం గడుపుతుంది. ‘పిల్లలను ముంబైలో ఉంటున్న మా ఆడపడుచులు బాగా చూసుకుంటారు. కాబట్టి నాకు టెన్షన్ లేదు. ప్రజలకు మేలు చేయాలన్నదే నా లక్ష్యం. మా ్రపాంతంలో ఇంకా సాగునీటి వసతి చాలా చోట్ల లేదు. దేశానికి అవసరమైన అరటిలో 35 శాతం మా దగ్గరే పండుతుంది. వ్యవసాయాన్ని ఇంకా వృద్ధి చేయడంలో నేను కృషి చేస్తాను. కేంద్ర మంత్రిగా ఇప్పుడు నా బాధ్యత పెరిగింది. ఏ శాఖ ఇచ్చినా సమర్థంగా పని చేసి నిరూపించుకుంటాను’ అని తెలిపింది రక్షా ఖడ్సే. -
కేంద్ర మంత్రిగా ఎర్రన్న తనయుడు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు తనయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు చిన్న వయసులో పెద్ద బాధ్యతలు అందుకున్నారు. టీడీపీ నాయకులు ప్రేమగా రాము అని పిలుచుకునే రామ్మోహన్ నాయుడిని 36 ఏళ్ల వయసులోనే కేంద్ర మంత్రి పదవి వరించింది. నరేంద్ర మోదీ మూడోసారి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఆదివారం రాత్రి క్యాబినెట్ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు దక్కించుకున్న రామ్మోహన్నాయుడు.. జిల్లాలో ఎంపీగా హ్యాట్రిక్ కొట్టారు. చంద్రబాబుతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయనకు క్యాబినెట్ ర్యాంకు మంత్రి పదవి దక్కింది. 36 ఏళ్ల వయస్సులో.. ఎంపీ రామ్మోహన్నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు 37 ఏళ్ల వయస్సులో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు తనయుడు 36 ఏళ్ల వయస్సులోనే కేంద్ర మంత్రి పదవిని అలంకరించారు. దీంతో జిల్లా నుంచి కేంద్ర మంత్రి బాధ్యతలు నిర్వర్తించిన వారి సంఖ్య మూడుకు చేరింది. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఎర్రన్నాయుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పనా శాఖ మంత్రిగా పనిచేశారు. 2011లో కిల్లి కృపారాణి ఐటీ, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అలాగే, ఉమ్మడి శ్రీ కాకుళం జిల్లాలోని పాలకొండ, ఉణుకూరు నియోజకవర్గాలు కలిసి ఉన్న పార్వతీపురం ఎంపీగా ఎన్నికైన వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ కూడా చరణ్‌సింగ్(1979–80), మన్మోహన్ సింగ్ ప్రభుత్వం(2011–2014)లో కేంద్ర ఉక్కు, గనుల, బొగ్గు శా ఖా మంత్రిగా, గిరిజన శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా పనిచేశారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు పాతపట్నం లోకసభ నుంచి గెలిచిన వీవీ గిరి కూడా ఆ తర్వాత ఎన్నికైన సందర్భంలో కేంద్రమంత్రిగా పనిచేశారు.కుటుంబ నేపథ్యం.. కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు, విజయకుమారి దంపతులకు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో 1987 డిసెంబర్ 18న రామ్మోహన్నాయుడు జని్మంచారు. ఈయనకు సోదరి భవానీ ఉన్నారు. ఈమె 2019 ఎన్నికల్లో రాజమహేంద్రవరం ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన బాబాయ్ అచ్చెన్నాయుడు గతంలో మంత్రిగా పనిచేశారు. ఎర్రన్నాయుడు టీడీపీలో కీలక నేతగా కొనసాగుతున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామ్మోహన్నాయుడు రాజకీయ అరంగేట్రం చేశారు. మాజీ మంత్రి, విశాఖ జిల్లా టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి కుమార్తె శ్రావ్యను 2017లో వివాహమాడారు. వీరికి నిహిర అన్వి, శివాంకృతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విద్యాభ్యాసం రామ్మోహన్నాయుడు ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషన్ సొసైటీ హాస్టల్లో చదువుకున్నారు. 1994లో ఎర్రన్నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ చీఫ్ విప్‌గా ఎన్నికవ్వడంతో హైదరాబాద్‌కు మకాం మార్చారు. దీంతో 4,5వ తరగతులు హైదరాబాద్‌లోని భారతీయ విద్యా భవన్లో చదువుకున్నారు. 1996 లో ఎర్రన్నాయుడు లోకసభకు ఎన్నికవ్వడంతో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కుటుంబమంతా షిఫ్ట్ అయ్యింది. దీంతో రామ్మోహన్నాయుడు ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత అక్కడే ఉన్న లాంగ్ ఐలాండ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ కూడా చేశారు. సింగపూర్‌లో ఏడాది పాటు ఉద్యోగం చేసి తర్వాత ఢిల్లీకి వచ్చేశారు. ఢిల్లీలో ఒక ఇంటీరియర్ డెవలప్మెంట్ కంపెనీ మా ర్కెటింగ్ వ్యవహారాలు చూసేవారు. ఎర్రన్నాయుడు 2012లో రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉద్యోగం మానేసి శ్రీకాకుళం వచ్చేశారు. 2014 ఎన్నికల్లో ఎర్రన్నాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించి తొలిసారి శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేశారు. 26 ఏళ్లకే ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు. అక్కడి నుంచి వరుసగా మూడు సార్లు ఎంపీగా గెలిచారు. ఇప్పుడు 36 ఏళ్ల వయస్సులో కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. -
తెలుగు కేంద్ర మంత్రులపై సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో మూడోసారి ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం ఆదివారం అట్టహాసంగా జరిగింది. మోదీతోపాటు 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది తెలిసిందే. తాజాగా వీరిని ఉద్దేశిస్తూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ నుంచి ఎంపికైన కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బూపతిరాజు శ్రీనివాస వర్మకు రేవంత్ అభినందనలు తెలిపారు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు వీరంతా కృషి చేయాల్సిందిగా కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్లో ట్వీట్ చేశారుతెలుగురాష్ట్రాల నుండి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ జి. కిషన్ రెడ్డి, శ్రీ బండి సంజయ్ కుమార్, శ్రీ కె.రామ్మోహన్ నాయుడు, శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ కు శుభాకాంక్షలు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుండి తెలుగు రాష్ట్రాలకు…— Revanth Reddy (@revanth_anumula) June 10, 2024కాగా మోదీ కేబినెట్లో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మల సీతారామన్, నితిన్ గడ్కరీ, జైశంకర్ మరోసారి మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి అయిదుగురు మంత్రి పదవులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్రమంత్రులుగాప్రమాణ స్వీకారం చేశారు.కిషన్‌రెడ్డి, రామ్మోహన్లకు కేబినెట్ పదవులు దక్కగా.. బండి సంజయ్, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మలకు సహాయ బెర్తులు దక్కాయి. మొత్తం 30 కేబినెట్, 5 స్వతంత్ర, 36 మంది సహాయ మంత్రులు మోదీ 3.0 కేబినెట్లో కొలువుదీరారు. 11 బెర్తులతో ఎన్డీఏ భాగస్వాములకు సముచిత ప్రాధాన్యం లభించింది. -
గంగాపురం కిషన్‌రెడ్డి అనే నేను..
సికింద్రాబాద్: మోదీ నేతృత్వంలో ఆదివారం కొలువుదీరిన కేంద్ర ప్రభుత్వంలో గ్రేటర్‌కు మరోసారి ప్రాధాన్యం దక్కింది. ఇక్కడి నుంచి మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు ఎంపీలు మోదీ కేబినెట్లో బెర్తు కోసం పోటీ పడగా.. సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డిని మరోదఫా కేంద్ర మంత్రి పదవి వరించింది. కేంద్రంలో వరుసగా మూడుసార్లు ఏర్పడిన మోదీ సర్కారులో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి ప్రాధాన్యం లభించడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక 2014లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన ప్రస్తుత హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయకు కేంద్ర సహాయమంత్రి పదవి దక్కింది. అప్పట్లో ఆయన మూడేళ్లపాటు కారి్మక, ఉపాధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కిషన్‌రెడ్డి రెండుమార్లు ఎంపీగా వరుస విజయాలు సాధించారు. 2019లో మొదటిసారి ఎంపీగా గెలిచిన కిషన్‌రెడ్డి మోదీ ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రెండేళ్ల అనంతరం జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో సాంస్కృతిక, పర్యాటక శాఖ కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందారు. ఎంపీగా రెండో విజయాన్ని నమోదు చేసుకున్న ఆయన తాజాగా మరోసారి నరేంద్ర మోదీ కేబినెట్లో కొలువుదీరారు. ఇద్దరితో పోటీపడి.. బీజేపీలో సహజంగా జోడు పదవులు ఉండవని చెబుతుంటారు. రెండేళ్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి జోడు పదవులను నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. ఒకసారి కేంద్ర మంత్రిగా పని చేసి.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీ కొత్త మంత్రివర్గంలో కిషన్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు ఎంపీలు పోటీపడ్డారు. మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ స్థానాల నుంచి ఎంపీలుగా గెలిచిన ఈటల రాజేందర్, విశ్వేశ్వర్‌రెడ్డిలు కేంద్ర మంత్రి పదవిని ఆశించారు. అయినప్పటికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డికి మోదీ కేబినెట్లో స్థానం లభించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి మరో బీసీ ఎంపీకి సీనియారిటీ ప్రాతిపదికన కేంద్ర మంత్రి పదవి ఇస్తున్న క్రమంలో త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కిషన్‌రెడ్డి నుంచి తప్పించనున్నట్టు సమాచారం. కేంద్ర మంత్రి పదవి ఆశించి భంగపడ్డ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని అధిష్టానం అప్పగించనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు అవుతారని.. మూడుసార్లు వరుసగా ఏర్పాటైన నరేంద్ర మోదీ ప్రభుత్వాల్లో సికింద్రాబాద్ ఎంపీలకు మంత్రి పదవులు లభించాయి. ఈ పరిణామం పట్ల సికింద్రాబాద్ ప్రాంత ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్ఎస్ఎస్ భావజాలంతో బీజేపీలో దశాబ్దాలుగా అంకితభావంతో పని చేసి నేతలుగా బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డిలు పేరుప్రఖ్యాతులు సంపాదించారు. అద్వానీతో కలిసి దత్తాత్రేయ, మోదీతో కలిసి కిషన్‌రెడ్డి పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే వీరిని ఎంపీలుగా గెలిపించుకుంటే కేంద్ర మంత్రులు అవుతారన్న ప్రచారాలను ఇక్కడి బీజేపీ నేతలు బలంగా చేస్తూ వస్తున్నారు. ఈ ప్రచారం కూడా ఇక్కడ బీజేపీ అభ్యర్థుల విజయానికి దోహదం చేస్తున్నాయి. ఈటలకు తప్పని నిరాశమేడ్చల్: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఆయన అనుచరులు, రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ.. ఆయనకు నిరాశే ఎదురైంది. సికింద్రాబాద్, కరీంనగర్ ఎంపీలుగా గెలిచిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు కేంద్ర మంత్రులుగా చోటు దక్కడంతో కొంత నిరాశకు గురయ్యారు. తెలంగాణ ఉద్యమ కారుడిగా, మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకమైన ముద్ర వేసి కీలక నేతగా ఆయన ఎదిగారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఈటల బీజేపీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ప్రకటించడంతో ఈటల రాజేందర్ పేరు తెరపైకి వచి్చంది. కాగా.. రాష్ట్రంలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టింది. ఈటల రాజేందర్ గజ్వేల్, హుజురాబాద్ స్థానాల నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటి.. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందడం, బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడంతో ఈటల మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యరి్థగా పోటీ చేసి గెలుపొందారు. కేంద్ర మంత్రి కావాలని ఆశించారు. ఈటల ఎంపీగా గెలవగానే ఆయనకు ఎన్నికల్లో ప్రచారం చేసిన ప్రధాన నాయకులందరూ మరుసటి రోజే ఢిల్లీకి తరలివెళ్లారు. తమ నాయకుడు మంత్రి అవుతున్నారని జోరుగా ప్రచారం చేశారు. మీడియాలో సైతం ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి పదవి రేసులో ఉన్నారని కథనాలు ప్రసారమయ్యాయి. కాగా.. ఆదివారం ప్రధాని మోదీ కేబినెట్లో సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లకు కేంద్ర మంత్రులుగా ప్రకటనలు రావడంతో ఈటల రాజేందర్ ఆశలు అడియాసలే అయ్యాయి. కాగా.. ఈటలకు బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించే అవకాశముంది. -
కేంద్రమంత్రిగా బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: నరేంద్ర మోదీ 3.0 కేబినెట్లో తెలంగాణా నుంచి ఇద్దరికి చోటు దక్కింది. కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్‌కు అవకాశం దక్కింది. తెలంగాణలో బీజేపీ పుంజుకోవడానికి కీలకంగా వ్యవహరించిన బండి సంజయ్.. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రెండోసారి కరీంనగర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన భారీ మెజార్టీతో విజయం సాధించారు. కాగా, ఆదివారం ఉదయం నరేంద్ర మోదీ తన నివాసంలో కొత్త మంత్రులకు తేనీటి విందు ఇచ్చారు. రాష్ట్రపతి భవన్లో ఈరోజు(ఆదివారం) రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి.. కరీంనగర్లో సంబరాలుబండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి వరించడంతో కరీంనగర్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. సంజయ్ ఇంటివద్ద, ఎంపీ కార్యాలయం వద్ద సంబరాలు మిన్నంటాయి. సంజయ్ తల్లి శకుంతల సాక్షి టీవీతో మాట్లాడుతూ, సంజయ్ చాలా కష్టపడి ఈ స్థాయికి రావడం తల్లిగా గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. సంజయ్ చాలా కష్టపడి ఈ స్థాయికి రావడం సంతోషంగా ఉందని.. ఇది మాపై మరింత బాధ్యతను పెంచిందని ఆయన భార్య అపర్ణ సంతోషం వ్యక్తం చేశారు.బండి సంజయ్ వ్యక్తిగత ప్రొఫైల్పుట్టిన తేదీ:11-7-1971తల్లిదండ్రులు: (కీ.శే. బండి నర్సయ్య) - శకుంతల.అక్క :శైలజ అన్నలు : బండి శ్రవణ్ కుమార్ బండి సంపత్ కుమార్భార్య: బండి అపర్ణ(ఎస్.బి.ఐ ఉద్యోగిని)పిల్లలు: సాయి భగీరత్, సాయి సుముఖ్కులం: మున్నూరుకాపు,(బి.సి-'డి')ప్రస్తుత బాధ్యతలు:బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగతంలో చేపట్టిన బాధ్యతలు:బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో స్వయం సేవకుడిగా..అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్‌లో పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా..కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో రెండు పర్యాయాలు (1994-1999; 1999-2003) డైరెక్టర్‌గా..బీజేపీ జాతీయ కార్యాలయం, ఢిల్లీలో ఎన్నికల ప్రచార ఇంచార్జ్‌గా భారతీయ జనతా యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షునిగా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా, జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ, తమిళనాడు ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టారు. BJP రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా పని చేశారు. అద్వానీ చేపట్టిన సురాజ్ రథ యాత్రలో వెహికల్ ఇంచార్జ్‌గా, కరీంనగర్ నగర పాలక సంస్థగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 48వ డివిజన్ నుండి బిజెపి కార్పొరేటర్ గా, రెండవసారి అదే 48వ డివిజన్ నుంచి భారీ మెజారిటీతో హ్యాట్రిక్ విజయం సాధించారు.వరుసగా రెండు పర్యాయాలు కరీంనగర్ నగర బీజేపీ అధ్యక్షునిగా2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, 52,000 వేల పై చిలుకు ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచారు.2019 ఎన్నికల్లో తిరిగి బీజేపీ తరపున కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి 66009 ఓట్లను సంపాదించి రెండవ స్థానంలో ఉండగా, రాష్ట్రంలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల్లో ప్రథమ స్థానంలో నిలిచారు.2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి, టీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టి 96వేల పైచిలుకు ఓట్లతో ఘనవిజయం సాధించారు.2019లో ఓబీసీ వెల్ఫేర్ పార్లమెంట్ కమిటీ మెంబర్‌గా నియామకం2019లో అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంట్ కమిటీ మెంబర్‌గా నియామకం2019లో టొబాకో బోర్డు మెంబర్‌గా నియామకం.2019లో మైనారిటీ అఫైర్స్ స్టేట్ లెవెల్ కమిటీ మెంబర్‌గా నియామకం2020లో ఎయిమ్స్ బీబీనగర్ బోర్డు మెంబర్‌గా నియామకం2020లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియామకం2023లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం2023 అసెంబ్లీ ఎన్నికల్లో 89000 ఓట్లు సాధించారు2024లో జాతీయ కిసాన్ మోర్చా ఇంఛార్జ్‌గా నియామకం2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ ఎంపీగా 2 లక్షల 25 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపు -
పెమ్మసాని మంత్రి పదవి? గల్లా అభినందనలు
సాక్షి, ఢిల్లీ: పెమ్మసానికి కేంద్ర సహాయ మంత్రి పదవి ఖరారు కావడంతో మాజీ ఎంపీ గల్లా జయదేవ్ అభినందనలు తెలిపారు. రాజకీయ మొదటి అడుగులోనే కేంద్ర మంత్రి పదవి పొందడం గొప్ప విషయం అన్నారు. కేంద్ర మంత్రి పదవితో సానుకూల మార్పులు తీసుకురావాలన్నారు.కాగా, సహాయ మంత్రి పదవులకు గుంటూరు, నెల్లూరు ఎంపీలు పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిల పేర్లను ఆయన ఖరారు చేసినట్లు సమాచారం. ప్రధానమంత్రితో పాటు వీరు ముగ్గురూ ఆదివారం మంత్రులుగా ప్రమాణం చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా, మూడుసార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహన్నాయుడికి ఈసారి కేంద్రమంత్రి పదవి ఖాయమని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. Congratulations to Dr. @PemmasaniOnX on being confirmed as a Minister of State. Such an honour to serve the nation at the central level during your very first political stint. The people of Guntur and entire AP are proud of you. All the best for your new role. May you bring… pic.twitter.com/NAvPMViMLc— Jay Galla (@JayGalla) June 9, 2024 Congratulations to my young friend @RamMNK on being confirmed as a cabinet minister in the new #NDA Government! Your sincerity and humble nature will surely be an asset to the development of the country. Wishing you all the best in your new role! pic.twitter.com/VkgGu8kdHB— Jay Galla (@JayGalla) June 9, 2024 -
52.9 డిగ్రీలు.. నిజమేనా!?
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాదిలో ఎండల తీవ్రత నానాటికీ పెరుగుతోంది. బుధవారం రాజస్తాన్‌లో పలుచోట్ల ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటేసింది. పాకిస్తాన్ మీదుగా అక్కడి నుంచి వీస్తున్న తీవ్రమైన వేడి గాలులతో దేశ రాజధాని అల్లాడుతోంది. దాంతో వరుసగా రెండో రోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ క్రమంలో ఢిల్లీ సమీపంలోని ముంగేశ్‌పూర్‌లో దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందంటూ వచి్చన వార్తలు కలకలం రేపాయి. మధ్యాహ్నం 2.30 సమయంలో అక్కడ 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు భారత వాతావరణ శాఖ ప్రాంతీయ డైరెక్టర్ కుల్దీప్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. మన దేశంలో రాజస్తాన్ సహా ఏ రాష్ట్రంలోనూ ఇప్పటిదాకా ఇంతటి ఉష్ణోగ్రతలు నమోదవలేదు. అయితే 52.9 డిగ్రీలన్నది అధికారికంగా నిర్ధారణ కాలేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజజు స్పష్టం చేశారు. ‘‘ఢిల్లీలో అంత ఉష్ణోగ్రత నమోదైందంటే నమ్మశక్యంగా లేదు. వాస్తవమేమిటో తెలుసుకోవాలని ఐఎండీ అధికారులకు సూచించాం. దీనిపై త్వరలో స్పష్టత వస్తుంది’’ అంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. దాంతో నిజానిజాలను పరిశీలిస్తున్నట్టు ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం.మహాపాత్ర తెలిపారు. ‘‘డేటాలో తప్పులు దొర్లి ఉండొచ్చు. అంతటి ఉష్ణోగ్రత నిజమే అయితే స్థానిక పరిస్థితులేవైనా కారణమై ఉండొచ్చు. ముంగేశ్‌పూర్ వాతావరణ కేంద్ర సెన్సర్లను స్పెషలిస్టుల బృందం నిశితంగా అధ్యయనం చేస్తోంది’’ అని వివరించారు. బుధవారం రాజస్తాన్‌లోని ఫలోదీలో 51 డిగ్రీలు, పరిసర ప్రాంతాల్లో 50.8 డిగ్రీలు, హరియాణాలోని సిర్సాలో 50.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలోని నజఫ్గఢ్లో 49.1 డిగ్రీలు, పుసాలో 49, నరేలాలో 48.4 డిగ్రీలు నమోదైంది. ఢిల్లీలోని సఫ్దర్జంగ్లో ప్రాంతంలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడ గత 79 ఏళ్లలో ఇదే అత్యధికం. హరియాణా, పంజాబ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ కూడా ఎండ దెబ్బకు అల్లాడుతున్నాయి. హీట్ వేవ్ నేపథ్యంలో ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు రెడ్ అలెర్ట్ జారీ అయింది. ఎండలకు తోడు తీవ్రస్థాయిలో వడగాలులు వీస్తున్నాయి. దాంతో జనం బయటకు రావాలంటే వణికిపోతున్నారు. నిత్యం లక్షలాది వాహనాలతో రద్దీగా ఉండే ఢిల్లీ రోడ్లు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం దాకా నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. రికార్డు విద్యుత్ డిమాండ్ ఎండల ధాటికి ఢిల్లీలో విద్యుత్ డిమాండ్ చుక్కలనంటుతోంది. బుధవారం మధ్యాహ్నం 3.36 గంటలకు 8,302 మెగావాట్ల పవర్ డిమాండ్ నమోదైంది. ఇది ఢిల్లీ చరిత్రలోనే రికార్డని డిస్కం అధికారులు చెప్పారు.సాయంత్రం భారీ వర్షం ఢిల్లీలో బుధవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన రెండు గంటల తర్వాత వర్షం ప్రారంభమైంది. దీంతో ప్రజలు కొంత ఉపశమనం పొందారు. రెండు, మూడు రోజుల్లో వర్షాలు అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం నేపథ్యంలో వాయువ్యం నుండి తూర్పు దిశగా వీచే గాలుల కారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని ఐఎండీ తెలిపింది. వచ్చే రెండు, మూడు రోజుల్లో ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీ, హరియాణా రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. -
మహిళపై కస్సుమన్న కేంద్రమంత్రి భార్య.. వెల్లువెత్తిన విమర్శలు
సమస్య చెబుతున్న గ్రామీణ మహిళపై కస్సుమన్నారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భార్య ప్రియదర్శినీ రాజే సింధియా. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. గ్రామీణ మహిళ పట్ల ఆమె ప్రవర్తినపై విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మధ్య ప్రదేశ్‌లోని గుణ-శివపురి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భార్య ప్రియదర్శిని తన భర్త విజయం కోసం కుమారుడితో కలిసి గ్రామ గ్రామాలు తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియదర్శిని రాజే ఖుజ్రీ గ్రామానికి వెళ్లగా అక్కడ కొందరు మహిళలు గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను లేవనెత్తారు. దీంతో ఆమె సమస్యలను రాసి తమకివ్వలని చెప్పారు. ఇంతలో ఓ మహిళ “నువ్వే రాసుకో” అంది. అది విన్న ప్రయదర్శిని రాజే ఆగ్రహానికి గురై, "మీరు రాసి నాకు ఇవ్వండి, మీ పని చేయడం నా పని కాదు" అంటూ చిరాకుపడ్డారు.ఖుజ్రీ గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, మహిళలు ప్రయదర్శిని సింధియాను ఆశ్రయించారు. గ్రామంలో నీటి సమస్య ఎక్కువగా ఉందని అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదని ఆ గ్రామ మహిళలు వాపోతున్నారు. ఈ సమయంలో, ఒక మహిళ, "మేడమ్, మీరు దయచేసి ఒకసారి ఇక్కడికి రండి. ఇక్కడ నీటి కోసం ఒక ట్యాంక్ ఉంది, కానీ అందులో నీరు లేదు" అంటూ తెలియజేసింది. -
Smriti Zubin Irani: క్యోం కి స్మృతీ భీ కభీ అభినేత్రీ థీ
స్మృతి జుబిన్ ఇరానీ. ఇప్పుడు కేంద్ర మంత్రిగా సుపరిచితులు. ఒకప్పుడు హిందీ టీవీ సీరియల్ వీక్షకుల అభిమాన నటి. సంప్రదాయ కుటుంబం నుంచి వచి్చనా మోడల్‌గా, నటిగా రాణించారు. రాజకీయాల్లో స్వయంకృషితో ఎదిగారు. కాంగ్రెస్ కంచుకోట అమేథీలో రాహుల్‌గాందీనే మట్టికరిపించారు. ఈసారి కూడా అమేథీలో కాంగ్రెస్‌కు సవాల్ విసురుతున్నారు... రాజకీయ ప్రయాణం.. నటనతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న స్మృతీ 2003లో బీజేపీలో చేరారు. మహారాష్ట్ర బీజేపీ యువజన విభాగం ఉపాధ్యక్షురాలిగా చేశారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత కపిల్ సిబల్పై ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి పోటీ చేసి ఓడారు. 2011లో గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014లో యూపీలోని అమేథీ నుంచి రాహుల్ గాం«దీపై పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2017లో రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అమేథీపై బాగా దృష్టి పెట్టారు. నిత్యం స్థానికంగా ప్రజల్లో ఉన్నారు. కాంగ్రెస్‌పై, రాహుల్‌పై విమర్శలతో హోరెత్తించారు. 2019లో అమేథీలో రాహుల్‌ను ఓడించి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. అమేథీలో స్థిర నివాసం ఏర్పరుచుకుని అక్కడే ఉంటానని ప్రకటించారు. 2021లో మావాయి గ్రామంలో ఇల్లు కట్టుకున్నారు. ఇటీవలే గృహప్రవేశం చేశారు. ‘దమ్ముంటే అమేథీ నుంచి పోటీ చేయండి’ అంటూ మళ్లీ రాహుల్‌కు సవాలు విసురుతున్నారు. కేంద్రంలో మానవ వనరులు, సమాచార–ప్రసార, జౌళి శాఖ మంత్రిగా చేశారు. ప్రస్తుతం మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి, మైనారిటీ వ్యవహారాల మంత్రి. బహుభాషా ప్రావీణ్యం... స్మృతి 1976 మార్చి 23న ఢిల్లీలోని పంజాబీ కుటుంబంలో జని్మంచారు. తండ్రి అజయ్ కుమార్ మల్హోత్రా వ్యాపారి. తల్లి శిబానీ నే బాగ్చీ బెంగాలీ. ఢిల్లీలోని హోలీ చైల్డ్ ఆగ్జీలియమ్ స్కూల్లో చదివారు. తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా పాఠశాల విద్య కాగానే మోడలింగ్ వైపు వెళ్లారు. తర్వాత నటనలో అదృష్టం పరీక్షించుకునేందుకు ముంబైలో అడుగుపెట్టారు. పలు ఉత్పత్తులకు మోడల్‌గా చేస్తూనే నటిగా ప్రయతి్నంచారు. ఆ క్రమంలో సినిమా కష్టాలు పడ్డారు. పెద్ద కూతురుగా ఇంటి బాధ్యతలను తలకెత్తుకున్నారు. పలు సీరియళ్లలో నటించారు. క్యోం కీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్‌తో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఒక టీవీ సీరియల్‌కు సహదర్శకత్వంతో పాటు పలు టీవీ షోలకు హోస్ట్‌గా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ‘జై బోలో తెలంగాణ’ సినిమాతో తెలుగు ప్రజలకూ పరిచయమయ్యారు. 2001లో జుబిన్ ఇరానీని పెళ్లాడారు. వీరికి కొడుకు జోహార్, కూతురు జోయిష్ ఉన్నారు. వైవిధ్యమైన కుటుంబ, సినీ నేపథ్యం కారణంగా ఆమె హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ భాషల్లో అనర్గళంగా మాట్లాడతారు. వివాదాలకు కేరాఫ్ రకరకాల కారణాలతో స్మృతి తరచూ వివాదాల్లో పడుతుంటారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో చాందినీచౌక్ నుంచి పోటీ చేసినప్పుడు ఎన్నికల అఫిడవిట్లో ఢిల్లీ యూనివర్సిటీ (స్కూల్ ఆఫ్ కరస్పాండెన్స్)లో 1996లో బీఏ చదివానని పేర్కొన్నారు. 2014, 2019ల్లో అమేథీ నుంచి పోటీ చేసినప్పుడేమో 1994లో ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్‌లో చేరినట్టు వెల్లడించారు. దాంతో ఆమె డిగ్రీలో చేరింది 1994లోనా, 1996లోనా, చదివింది బీఏనా, కామర్సా అనే విమర్శలొచ్చాయి. 2014లో మానవ వనరుల మంత్రి కావడంతో కనీసం డిగ్రీ లేని వ్యక్తి దేశానికి విద్యా మంత్రా అంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి. సమస్య కోర్టు దాకా వెళ్లింది. ఈ వివాదాల నేపథ్యంలో ఆమె మానవ వనరుల నుంచి జౌళి శాఖకు మారారు. -
వచ్చే ఏడాదే ‘సముద్రయాన్’: కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సముద్రయాన్ ప్రాజెక్టును వచ్చే ఏడాది చివరికల్లా చేపడతమని కేంద్ర భూవిజ్ఞాన శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. సముద్ర గర్భంలో అన్వేషణ కోసం దేశంలోనే తొలి మానవ సహిత డీప్ ఓషియన్ మిషన్‌కు సముద్రయాన్ అని పేరుపెట్టారు. సముద్ర ఉపరితలం నుంచి 6 కిలోమీటర్ల లోతుకు సైంటిస్టులను పంపించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా ‘మత్స్య6000’ జలాంతర్గామి నిర్మాణం దాదాపు పూర్తయ్యిందని, ఈ ఏడాది ఆఖరుకల్లా పరీక్షించబోతున్నామని కిరణ్ రిజిజు తెలిపారు. సముద్రంలో 6 కిలోమీటర్ల లోతుకు కాంతి కూడా చేరలేదని, మనం జలాంతర్గామిలో సైంటిస్టులను పంపించబోతున్నామని వెల్లడించారు. సముద్రయాన్‌కు 2021లో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘మత్స్య6000’ జలాంతర్గామిలో ముగ్గురు పరిశోధకులు ప్రయాణించవచ్చు. వచ్చే ఏడాది ఆఖర్లో హిందూ మహాసముద్రంలో వారు అన్వేషణ సాగించబోతున్నారు. ప్రపంచంలో ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ మాత్రమే ఇలాంటి ప్రాజెక్టులను విజయవంతంగా చేశాయి. -
కేంద్ర మంత్రికి నిరసన సెగ! నల్లజెండాలతో ‘గో బ్యాక్’ నినాదాలు
బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు నిరసన సెగ తగిలింది. బిహార్‌లోని తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన బెగుసరాయ్‌లో పార్టీ కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. బచ్వాడాలో ఒక కార్యక్రమానికి వెళుతుండగా సొంత పార్టీ కార్యకర్తలే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నల్ల జెండాలను ప్రదర్శించారు. గిరిరాజ్ సింగ్ ఇటీవల తన బెగుసరాయ్ నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు నిరంతరం చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఆదివారం బరౌని డెయిరీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముగించుకుని బచ్వాడలో మరో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఎన్‌హెచ్-28లోని రాణి గ్రామ సమీపంలో సొంత పార్టీ కార్యకర్తలే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు నల్లజెండాలు చూపించారు. కాన్వాయ్‌ను చుట్టుముట్టిన వారు, బీజేపీ జెండాలతో పాటు నల్ల జెండాలను పట్టుకుని, ఆయన వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో గిరిరాజ్ సింగ్ కాన్వాయ్ కొద్దిసేపు నిలిచిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నల్లజెండాలు చూపుతున్న వారిని చెదరగొట్టి సాధారణ పరిస్థితులు తీసుకొచ్చారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పెప్సీ ప్లాంట్‌లో బెగుసరాయ్ వాసులెవరికీ ఉపాధి కల్పించలేదని నిరసనకారులు చెబుతున్నారు. ఆయనకు డబ్బులిచ్చినవారికి మాత్రమే ఉపాధి కల్పించారని ఆరోపించారు. అయితే తమ కార్యకర్తలు కేంద్ర మంత్రికి స్వాగతం పలికేందుకే వచ్చారని బీజేపీ చెబుతోంది. నల్ల జెండాలు ప్రదర్శించినవారు సీపీఐ మద్దతుదారులని పేర్కొంది. बीजेपी सांसद गिरिराज सिंह को उनके संसदीय क्षेत्र में बीजेपी कार्यकर्ताओं ने काले झंडे दिखाए। pic.twitter.com/j7OmTGtg9U — Lutyens Media (@LutyensMediaIN) March 10, 2024 -
ఈ ఫుడ్స్ తింటే అంతే..షాకింగ్ స్టడీ! టాక్స్ విధించండి బాబోయ్!
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా ప్రమాదకరమన్న తాజా సంచలన నివేదికల నేపథ్యంలో అటువంటి ఆహారాలపై పన్ను విధించాలంటూ మహారాష్ట్రలోని స్వచ్ఛంద సంస్థలు, విద్యావేత్తలు, మనస్తత్వ వేత్తలతోకూడిన సంఘాలు కేంద్ర వినియోగ దారుల వ్యవహారాల మంత్రి, ఆహార మంత్రికి విన్నవించాయి. అధిక మొత్తంలో చక్కెర, ఉప్పు , కొవ్వుతో కూడిన అధిక ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలపై పన్ను విధించాలని కోరుతూ ఎర్లీ చైల్డ్‌హుడ్ అసోసియేషన్ (ECA) , అసోసియేషన్ ఫర్ ప్రిపరేటరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (APER), కేంద్రమంత్రికి మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశాయి. తద్వారా పాఠశాలల్లో చాక్లెట్లు, కేకులు, కుకీలు , పుట్టినరోజులు మరియు ఈవెంట్ల వంటి ఇతర వస్తువుల వినియోగం, పంపణీ ఆగిపోతుందని నమ్ముతున్నారు. ఈ పదార్థాల స్థానంలో తాజాపండ్లను చేర్చుకోవాలని కూడా ప్రజల్ని, పాఠశాలల్ని కోరారు. వీరి డిమాండ్లు ♦ అన్ని ఫుడ్ చెయిన్స్, రెస్టారెంట్లు మెనూలు, ప్యాకేజింగ్ , ప్రతీ బాక్సుపైనా ఉప్పు-చక్కెర-కొవ్వు శాతం వివరాలను తప్పనిసరిగా ప్రింట్ చేయాలి. ఉప్పు-చక్కెర-కొవ్వుతో సహా వీటి స్థాయి ఎక్కువుంటే ఎరుపు రంగు, మధ్యస్థానికి గుర్తుగా కాషాయం, తక్కువగా ఉంటే ఆకుపచ్చ రంగుల లేబులింగ్ ఉండాలి. ♦ బ్రాండ్ పేరు లేదా రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌తో రెస్టారెంట్లు విక్రయించే బర్గర్లు, పిజ్జాలు, టాకోలు, డోనట్స్, శాండ్విచ్లు, పాస్తా, బ్రెడ్ ఫిల్లింగ్‌లపై పరోక్ష కొవ్వు కంటెంట్ పన్ను 14.5 శాతం విధించాలి. ♦ చక్కెరపై ఆరోగ్య పన్నును ప్రవేశపెట్టాలి. అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార పదార్థాల వినియోగం చాలా ప్రమాదకరమని, ఇలాంటి ఆహారాన్ని తినడం వల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని సైంటిస్టులు ఇటీవల హెచ్చరించారు. వీటితో ప్రాణాలకే ప్రమాదం వస్తుందని ఇటీవల అధ్యయనం ద్వారా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఏకంగా 32 రకాల ప్రమాదకర వ్యాధులు వస్తాయని కూడా వెల్లడించారు. ఆస్ట్రేలియా, అమెరికా, ఫ్రాన్స్, ఐర్లాండ్ దేశాలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కోటి మందికి పైగా వ్యక్తులపై జరిపిన అధ్యాయంలో ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలతో వస్తున్న ముప్పుపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్రిటీష్ జర్నల్ ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో మానసిక, శ్వాసకోశ , హృదయ, జీర్ణకోశ సమస్యలు వస్తాయని, మొత్తం 32 ప్రమాదకర వ్యాధులు వస్తాయి. మరణాలు సంభవించిన కేసులు కూడా ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించాల్సిన అవసరం ఉందని వారు నొక్కి చెప్పారు. అంతేకాదు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌తో 50 శాతం పెరుగుతుందని కూడా హెచ్చరించారు. డిప్రెషన్ 22 శాతం అధికంగా పెరిగే అవకాశం ఉందట. అల్ట్రా ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌లో విటమిన్లు, పీచు తక్కువ, ఉప్పు, చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉంటాయి, అందుకే కేన్సర్, గుండె వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, మానసిక అనారోగ్యం తోపాటు, మెటబాలిజంకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయని ఈ స్టడీ పేర్కొంది. -
చిప్‌ల తయారీలో అంతర్జాతీయ స్థాయికి భారత్
న్యూఢిల్లీ: వచ్చే అయిదేళ్లలో సెమీ కండక్టర్ల తయారీలో భారత్ అంతర్జాతీయ స్థాయికి చేరగలదని కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. చిప్‌ల విభాగంలో తైవాన్ ఆధిపత్యాన్ని తగ్గించే దిశగా దేశీయంగా కొత్త ఫ్యాబ్రికేషన్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలు ఇందుకు దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో ప్లాంట్లు పెట్టేందుకు, సంబంధిత రంగాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు తయారీ సంస్థలు ముందుకొచ్చేలా ప్రభుత్వ విధానాలు ఆకర్షిస్తున్నాయని మంత్రి చెప్పారు. చైనాకి ప్రత్యామ్నాయంగా, ప్రజాస్వామ్య టెక్నాలజీ హబ్‌గా భారత్ నిలుస్తోందని ఆయన తెలిపారు. ‘భారత్‌కి ఎప్పుడు వెళ్లాలి.. అసలు వెళ్లొచ్చా అని గతంలో అంతా అలోచించే వారు. కానీ ఇప్పుడు వీలైనంత ముందుగా వెళ్లాలి అనుకుంటున్నారు. అటువంటి మార్పు కనిపిస్తోంది. ప్రతి పెద్ద సంస్థ భారత్‌లో పెట్టుబడులు పెట్టే ఆలోచనల్లో ఉంది‘ అని పేర్కొన్నారు. కేంద్రం ఇటీవలే దాదాపు రూ. 1.26 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే మూడు సెమీకండక్టర్ ప్లాంట్ల ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. వీటిలో టాటా గ్రూప్ తలపెట్టిన మెగా ఫ్యాబ్ కూడా ఉంది. -
PM Surya Ghar Muft Bijli Yojna: రూఫ్‌టాప్ సోలార్ రాయితీ 78 వేలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రూఫ్‌టాప్ సౌర విద్యుత్ పథకం ‘పీఎం–సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని అధ్యక్షతన మంత్రివర్గం గురువారం సమావేశమైంది. రూ.75,021 కోట్లతో అమలు చేసే ఈ పథకం కింద దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఇళ్లపై సౌర ఫలకాల ఏర్పాటుకు లబి్ధదారులకు రూ.78,000 వరకు రాయితీ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలియజేశారు. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లాకో మోడల్ సోలార్ గ్రామం రూప్‌టాప్ సౌర విద్యుత్ పథకాన్ని ప్రధాని మోదీ ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన ప్రారంభించారు. పథకం అమలులో భాగంగా 2 కిలోవాట్ల సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం ఆర్థిక సాయం అందిస్తుంది. 2 కిలోవాట్ల నుంచి 3 కిలోవాట్ల సోలార్ పవర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి అదనంగా మరికొంత ఆర్థిక సాయం అందజేస్తుంది. 3 కిలోవాట్ల వరకే పరిమితి విధించారు. ఒక కిలో వాట్ వ్యవస్థకు రూ.30 వేలు, 2 కిలోవాట్ల వ్యవస్థకు రూ.60 వేలు, 3 కిలోవాట్ల వ్యవస్థకు రూ.78 వేల చొప్పున కేంద్రం నుంచి రాయితీ లభిస్తుంది. లబ్ధిదారులు రాయితీ సొమ్ము కోసం నేషనల్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసే కంపెనీని పోర్టల్ ద్వారా ఎంపిక చేసుకోవచ్చు. కేంద్రం ఇచ్చే రాయితీ మినహా మిగిలిన పెట్టుబడి కోసం ఎలాంటి పూచీకత్తు లేకుండానే తక్కువ వడ్డీకే రుణం తీసుకొనే అవకాశం కలి్పంచారు. సౌర విద్యుత్‌పై గ్రామీణ ప్రజలకు అవగాహన కలి్పంచడానికి ప్రతి జిల్లాలో ఒక మోడల్ సోలార్ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూఫ్‌టాప్ సోలార్ పథకాన్ని ప్రమోట్ చేసే పట్టణ స్థానిక సంస్థలకు, పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్రం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. 3 కిలోవాట్ల సౌర విద్యుత్ వ్యవస్థ నెలకు 300 యూనిట్లకుపైగా కరెంటును ఉత్పత్తి చేస్తుంది. 300 యూనిట్లు ఉచితంగా ఉపయోగించుకొని, మిగిలిన కరెంటును డిస్కమ్‌లకు విక్రయించి ఆదాయం పొందవచ్చు. పీఎం–సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన కింద సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి, రాయితీ పొందడానికి https:// pmsuryaghar.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పథకం ద్వారా కొత్తగా 17 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది. -
ఖుర్దా రోడ్-విజయనగరం మధ్య మూడో రైల్వే లైన్
సాక్షి, ఢిల్లీ: ఒడిశాలోని ఖుర్దా రోడ్ నుంచి విజయనగరం మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. ఖుర్దా రోడ్ నుంచి విజయనగరం వరకు 363 కిలో మీటర్ల దూరం మూడవ రైల్వే లైన్ నిర్మాణంతోపాటు భద్రక్-విజయనగరం సెక్షన్లో నెర్గుడి - బరంగ్ మధ్య 22 కిలో మీటర్ల మేర మూడో రైల్వే లైన్‌ను 4962 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ప్రతిపాదనలకు గత ఏడాది ఆగస్టులోనే ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. ప్రధాన మంత్రి గతి శక్తి పథకం కిందపైన పేర్కొన్న రెండు సెక్షన్లలో మూడో రైల్వే నిర్మాణ ప్రాజెక్ట్ ఎప్పటిలోగా పూర్తవుతుందో ఇప్పుడే చెప్పలేమని మంత్రి వివరించారు. రైల్వే ప్రాజెక్ట్‌ల నిర్మాణం పూర్తి చేయడం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి అవసరమయ్యే భూసేకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన పూర్తి చేయాలి. రైల్వే లైన్ నిర్మాణానికి ఆటంకంగా నిలిచే అడవుల తొలగింపుకు అటవీ శాఖ అనుమతులు మంజూరు చేయాలి. వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి అవసరమయ్యే అనుమతులు లభించాలి. రైల్వే లైన్ నిర్మాణం తలపెట్టే భూమి స్వరూప స్వభావాలపై అధ్యయనం జరగాలి. ప్రాజెక్ట్ సైట్లో శాంత్రి భద్రతలను పటిష్టం చేయాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏడాది కాలంలో ఎన్ని నెలలపాటు ప్రాజెక్ట్ పనులు నిర్విరామంగా కొనసాగుతాయే వంటి పలు అంశాల ఆధారంగా మాత్రమే ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పటిలోగా పూర్తవుతుందో ఒక అంచనాకు రాగలమని రైల్వే మంత్రి తన జవాబులో వివరించారు. హస్త కళల అభివృద్ధి కోసం ఏపీకి 3911 కోట్లు జాతీయ హస్తకళల అభివృద్ధి కార్యక్రమం, సమగ్ర హస్తకళల క్లస్టర్ అభివృద్ధి పథకం కింద గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.3911.25 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర టెక్స్ టైల్స్ శాఖ సహాయ మంత్రి దర్శన జర్దోష్ పేర్కొన్నారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ 2018-19 నుంచి 2023-24 వరకు నేషనల్ హాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎన్హెచ్డిపి), సీహెచ్డీసీ పథకాల కింద విడుదల చేసిన మొత్తం నిధుల్లో రూ.2439.8 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఎన్‌హెచ్‌డీపీ కింద ఐదేళ్లలో రూ.3378.99 కోట్లు విడుదల చేయగా రూ.1907.54 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే కాంప్రహెన్సివ్ హ్యాండిక్రాఫ్ట్ క్లస్టర్ డెవలప్మెంట్ స్కీం కింద ఐదేళ్లలో రూ.532.26 కోట్లు నిధులు మంజూరు చేసి విడుదల చేయగా మొత్తం నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. హస్త కళల అభివృద్ధి కోసం ఎన్హెచ్డిపి, సీహెచ్డీసీ పథకాలను వేర్వేరు ఉద్దేశాలతో రూపొందించినట్లు మంత్రి తెలిపారు. హస్త కళాకారులు పదివేల మందికి మించి ఉన్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి గొలుసు అభివృద్ధి చేయడం సీహెచ్సీడీ పథకం ఉద్దేశమైతే, హస్త కళాకారులకు వ్యక్తిగతంగా అలాగే 1000 మందికి మించని చిన్న క్లస్టర్లకు మార్కెటింగ్ ప్లాట్ ఫాంలు ఏర్పాటు చేసి సామాజిక భద్రత కల్పించడం, నైపుణ్యాలను పెంపొందించడం ఎన్‌హెచ్‌డీపీ ఉద్దేశ్యమని తెలిపారు. ఎన్‌హెచ్‌డీపీ స్కీం కింద మార్కెటింగ్ సదుపాయం, నైపుణ్యాభివృద్ధి, క్లస్టర్ అభివృద్ధి, ఉత్పత్తిదారుల కంపెనీలు ఏర్పాటు, హస్తకళాకారులకు డైరెక్ట్ బెనిఫిట్, మౌలిక సదుపాయాలు, సాంకేతిక సహకారం, హస్తకళాకారులకు, క్లస్టర్లకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సహకారం అందించడం ద్వారా వ్యాపార ప్రోత్సాహక వాతావరణాన్ని కల్పించడం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సీహెచ్డీఎస్ కింద రాష్ట్ర స్థాయిలో ప్రాజక్టులు ఏర్పాటు చేయడం, అవి ఆయా రంగాల్లో విశేష అనుభవం కలిగిన కేంద్ర/ రాష్ట్ర హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్లు, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా క్లస్టర్ ప్రాజక్టు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. -
మళ్లీ పౌరసత్వ రగడ!
వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ) అంశం మరోసారి దుమారం రేపుతోంది. సీఏఏను వారం రోజుల్లో దేశమంతటా అమలు చేస్తామని కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ ప్రకటించడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇది లోక్‌సభ ఎన్నికల లబ్ధి కోసం చేసిన ఉత్తుత్తి ప్రకటన అంటూ తృణమూల్ కాంగ్రెస్ కొట్టిపారేసింది. 2019లోనే మోదీ సర్కారు సీఏఏ చట్టం చేసినా దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత, ఆందోళనలతో దాని అమలు వాయిదా పడుతూ వస్తోంది. కానీ సీఏఏ అమలుపై బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు పట్టుదలగా ఉందని ఇటీవలి వరుస పరిణామాలు చెబుతున్నాయి. ఎవరేమనుకున్నా దేశమంతటా దాని అమలు తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా గత నెలలోనే స్పష్టం చేశారు. ఏమిటీ చట్టం... పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కలి్పంచడం సీఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కు వలస వచి్చన వారు ఇందుకు అర్హులు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు సీఏఏ వర్తిస్తుంది. వీరికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసింది. సీఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణపరిషత్ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది. ► గడువులోపు భారత్‌కు వలస వచి్చన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు పౌరసత్వం కలి్పస్తారు. ► వాళ్లు భారత్‌లో కనీసం 11 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు. ► పౌరసత్వమిచ్చేందుకు ఇలా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోనుండటం భారత్‌లో ఇదే తొలిసారి. ► అయితే సీఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం వివాదా స్పదంగా మారింది. ఎందుకు వ్యతిరేకత... ఈశాన్య రాష్ట్రాలు, పశి్చమబెంగాల్తో పాటు దేశ రాజధాని ప్రాంతంలోనూ పాక్, బంగ్లా, అఫ్గాన్ల నుంచి వలస వచి్చన ముస్లిమేతర మైనారిటీలు అధిక సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా బెంగాల్లో మతువా సామాజిక వర్గంలో అత్యధికులు బంగ్లాదేశ్‌లో తమపై ముస్లింల అణచివేత, తీవ్ర హింసాకాండను తట్టుకోలేక 1950ల నుంచీ వలస వచి్చన వారే. వీరంతా 1990ల నాటికే బెంగాల్లో ప్రబలమైన ఓటు బ్యాంకుగా స్థిరపడ్డారు. దాంతో వీరి మద్దతు కోసం పార్టీలన్నీ ప్రయతి్నంచడం పరిపాటిగా మారింది. నిజానికి సీఏఏ అమలుతో అత్యధికంగా లబ్ధి పొందేది మతువాలేనంటారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ బంగ్లాదేశ్ నుంచి ఎంతోమంది అక్రమంగా ప్రవేశించారు. సీఏఏ అమల్లోకి వస్తే వీరంతా ఎలాంటి ధ్రువీకరణలతోనూ నిమిత్తం లేకుండా నేరుగా భారత పౌరసత్వం పొందుతారు. అలా చేస్తే వీరంతా మెజారిటీ పౌరులుగా మారతారని స్థానికులంటున్నారు. దాంతో హక్కులు, సంస్కృతీ సంప్రదాయాలకు భంగం కలగడమే గాక ఉపాధి అవకాశాలకూ దెబ్బ పడుతుందన్నది వారి వాదన. పైగా బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి మరింత భారీగా వలసలకు ఇది బాటలు వేస్తుందని వారంటున్నారు. దాంతో 2019లో సీఏఏ బిల్లుకు చట్టబద్ధత రాగానే దాని అమలును వ్యతిరేకిస్తూ ఆయా రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. అసోం తదితర రాష్ట్రాల్లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చెలరేగుతున్నాయి. ముస్లింలలోనూ ఆందోళన... ముస్లింల నుంచి కూడా సీఏఏపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది ప్రధానంగా తమనే లక్ష్యం చేసుకుని తెచి్చన చట్టమన్నది వారి అభ్యంతరం. ‘‘ఏ ధ్రువీకరణ పత్రాలూ లేని ముస్లింలపై అక్రమ వలసదారులుగా సీఏఏ సాయంతో ముద్ర వేస్తారు. ఈ కారణంగానే ఇతర దేశాల నుంచి వలస వచి్చన ముస్లిం మైనారిటీలకు సీఏఏను వర్తింపజేయడం లేదు’’ అన్నది వారి వాదన. పాకిస్తాన్లో షియా తదితర ముస్లింలు కూడా తీవ్రమైన అణచివేతకు గురై భారత్ వలస వచ్చారని, సీఏఏ అమలుతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని వారంటున్నారు. సీఏఏను వ్యతిరేకిస్తూ పలు ముస్లిం వర్సిటీల్లో కూడా విద్యార్థులు తీవ్ర స్థాయిలో నిరసనలకు దిగారు. వాటిని అణచివేసే క్రమంలో జరిగిన ఘర్షణలు ప్రాణ నష్టానికీ దారి తీశాయి. కేంద్రం మాత్రం పాక్, బంగ్లా, అఫ్గాన్ వంటి దేశాల్లో ముస్లింలపై అకృత్యాల వాదనను తోసిపుచ్చుతోంది. మరోవైపు టిబెట్, మయన్మార్, శ్రీలంకల నుంచి వలస వచి్చన మతపరమైన మైనారిటీలకు సీఏఏను వర్తింపజేయకపోవడం అన్యాయమన్న విమర్శలూ ఉన్నాయి. సుప్రీంలో వివాదం: ఈ నేపథ్యంలో మొత్తంగా సీఏఏ చట్టం రాజ్యాంగబద్ధతనే సవాలు చేస్తూ తృణమూల్‌తో పాటు కాంగ్రెస్, ఆర్జేడీ, మజ్లిస్ తదితర పక్షాలు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసులు వేశాయి. జమాయిత్ ఉలేమా ఇ హింద్‌తో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఇంప్లీడయ్యాయి. వీటిపై విచారణ తుది దశకు చేరుతోంది. ఎన్ఆర్సీ రగడ... సీఏఏలో భాగంగా తెరపైకి వచి్చన జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్సీ) కూడా వివాదానికి మరింతగా ఆజ్యం పోసింది. అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కు పంపడం దీని ప్రధానోద్దేశం. ఇందులో భాగంగా వలసదారుల నివాస తదితర ధ్రువీకరణ పత్రాలను నమోదు చేయడం తప్పనిసరి. తద్వారా పౌరసత్వానికి చట్టపరంగా అర్హులైన జాబితాను రూపొందిస్తారు. సరైన పత్రాలు లేనివారిని అక్రమ వలసదారులుగా నిర్ధారిస్తారు. 2020లో అసోంలో మాత్రమే అమలు చేసిన ఎన్ఆర్సీని దేశవ్యాప్తం చేస్తామని మోదీ సర్కారు ప్రకటించింది. దీనిపైనా రగడ కొనసాగుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Union Minister Amit Shah: ఎకానమీలో సహకార రంగ భాగస్వామ్యం పెరగాలి
న్యూఢిల్లీ: భారత్‌లో గత 75 సంవత్సరాల్లో సహకార ఉద్యమం ఆశించిన స్థాయిలో పురోగమించలేదని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అయితే 2027–28 ఆర్థిక సంవత్సరం నాటికి 5 ట్రిలియన్ డాలర్లుగా భారత్ ఎకానమీ ఆవిర్భవిస్తుందన్న అంచనాల నేపథ్యంలో, ఈ లక్ష్య సాధనలో సహకార రంగం భారీ వాటాను కలిగి ఉండేలా చూడడమే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి అన్నారు. దక్షిణ ఢిల్లీలోని నౌరోజీ నగర్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 41,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్బీసీసీ అభివృద్ధి చేసిన సెంట్రల్ రిజి్రస్టార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (సీఆర్సీఎస్) కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం కేంద్ర సహకార మంత్రి షా ప్రసంగించారు. 175 కోట్లతో ఈ కొత్త కార్యాలయాన్ని కొనుగోలు చేసినట్లు షా తెలిపారు. సహకార ఉద్యమం అభివృద్ధి కోసం ప్రభుత్వం గత 30 నెలల్లో 60 పెద్ద కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి పేర్కొన్నారు. సహకార మంత్రిత్వ శాఖ జూలై 2021లో ఏర్పాటయినట్లు వివరించారు. 21వ శతాబ్దంలోకి పురోగమనం స్వాతంత్య్రం వచి్చనప్పటి నుంచి సహకార సంఘాల విజయగాథలు ఉన్నాయని, అయితే ఆ రంగం వేగంగా అభివృద్ధి చెందలేదని షా అన్నారు. ‘‘ప్రధాని మోదీజీ లక్షిత 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో, సహకార సంస్థలకు పెద్ద వాటా ఉండాలని ఇప్పుడు మేము నిర్ణయించుకున్నాము. సహకార రంగం 19వ శతాబ్దం నుండి నేరుగా 21వ శతాబ్దంలోకి పురోగమిస్తుంది’’ అని షా ఈ సందర్భంగా అన్నారు. సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మల్టీ–స్టేట్ కో–ఆపరేటివ్ సొసైటీస్ చట్టాన్ని సవరించిందని అన్నారు. అలాగే పీఏసీఎస్ (ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీలు), పీఏసీఎస్‌లను కంప్యూటరీకరించే పథకాన్ని బలోపేతం చేయడానికి నమూనా బై–లాస్‌ను తీసుకువచి్చందని మంత్రి పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో 2 లక్షల సంఘాల ఏర్పాటు వచ్చే ఐదేళ్లలో 2 లక్షల బహుళ వినియోగ పీఏసీఎస్/ డెయిరీ/ మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని షా తెలిపారు. ఇప్పటికే కొత్తగా 12,000 పీఏసీఎస్‌లు ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. సహకార రంగంలో మరిన్ని బ్యాంకులను తెరవాల్సిన అవసరాన్ని షా ఉద్ఘాటించారు. తమను తాము బ్యాంకులుగా మార్చుకోవాలని బహుళ–రాష్ట్ర క్రెడిట్ సొసైటీలను సూచించారు. మలీ్ట–స్టేట్ కో–ఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రేషన్ 2023లో 102కి చేరిందని ఆయన పేర్కొంటూ 2020లో 10 నుంచి 10 రెట్లు పెరిగిందని వివరించారు. నానో లిక్విడ్ యూరియా, నానో లిక్విడ్ డీఏపీలకు డిమాండ్ ఐఎఫ్ఎఫ్సీఓ వినూత్న ఉత్పత్తులైన నానో లిక్విడ్ యూరియా, నానో లిక్విడ్ డీఏపీ (డి–అమ్మోనియం ఫాస్ఫేట్)లను షా ఈ సందర్భంగా ఉటంకించారు. రాబోయే సంవత్సరాల్లో ఈ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేశారు. నానో యూరియా, నానో డీఏపీ పిచి కారీ చేసేందుకు పీఏసీఎస్‌లు రైతులకు డ్రోన్ లను అందజేస్తున్నట్లు మంత్రి వివరించారు. కాగా, ఇటీవల షా ఆవిష్కరించిన నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సీఓఎల్)– ’భారత్ ఆర్గానిక్స్’ బ్రాండ్‌కు మంచి ఆదరణ లభిస్తున్నట్లు ఉన్న త స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. నేషనల్ డైయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ)చీఫ్ ప్రమోటర్‌గా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్, 2002 కింద 2022 జనవరి 25న ఎన్‌సీఓల్ రిజిస్టర్ అయ్యింది. గుజరాత్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన మూడు కొత్త సహకార సంస్థలలో ఎన్‌సీఓఎల్ ఒకటి. మిగిలిన రెండు సహకార సంఘాలు విత్తనాలు– ఎగుమతుల రంగంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 7.89 కోట్ల సహకార సంఘాలు ఉండగా వీటిలో మొత్తం 29 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. -
నాణ్యతా నిబంధనల పరిధిలోకి మరిన్ని ఉత్పత్తులు
న్యూఢిల్లీ: దేశీయంగా మరిన్ని ఉత్పత్తులకు నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరి చేయనున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. 2047 నాటికి భారత్ సంపన్న దేశంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో దీనిపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన చెప్పారు. భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) 77వ వ్యవస్థాపక దినోత్సవంలో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ (క్యూసీవో) ద్వారా తప్పనిసరిగా పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాల పరిధిలోకి మరిన్ని ఉత్పత్తులను తేవడం వల్ల వినియోగదారులకు ఆయా ఉత్పత్తులు, సర్వీసుల లభ్యత మెరుగుపడిందని మంత్రి చెప్పారు. ఇప్పటివరకు 672 ఉత్పత్తులతో 156 క్యూసీవోలు జారీ అయ్యాయని, రాబోయే రోజుల్లో 2,000–2,500 ఉత్పత్తులు క్యూసీవోల పరిధిలోకి చేరతాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం .. బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్, ఆట»ొమ్మలకు నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించడం మొదలైన చర్యలు తీసుకుందని మంత్రి చెప్పారు. భారత్ ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు, సంపన్న దేశంగా ఎదిగేందుకు ఉత్పత్తులు, సరీ్వసులపరంగా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు తోడ్పడగలవని ఆయన చెప్పారు. ఆ దిశగా నాణ్యతా ప్రమాణాలకు బీఐఎస్ ప్రచారకర్తగా మారాలని సూచించారు. సాధ్యమైనంత వరకు అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా బీఐఎస్ దేశీయంగా నాణ్యతా ప్రమాణాలను రూపొందించాలని గోయల్ చెప్పారు. లిఫ్టులు, ఎయిర్ ఫిల్టర్లు, వైద్య పరికరాలు మొదలైన ఉత్పత్తుల విషయంలో భారత్ ప్రపంచ స్థాయి ప్రమాణాలను నిర్దేశించడానికి అవకాశం ఉందని ఆయన తెలిపారు. -
తీవ్ర ఒడిదుడుకుల్లో చమురు మార్కెట్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. అవి స్థిరపడ్డాకే దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకునేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ఈ విషయం గురించి ఎటువంటి చర్చలూ జరపలేదని చెప్పారు. ముడి చమురు రేట్లు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించే అవకాశాలపై స్పందిస్తూ మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘అంతర్జాతీయంగా రెండు ప్రాంతాల్లో (రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయెల్–పాలస్తీనా) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరిన్ని సవాళ్లేమైనా తలెత్తినా .. లేదా ఆటంకాలేమైనా ఎదురైనా దాని ప్రభావాలు ఎదుర్కొనాల్సి రావచ్చు. కానీ అలాంటిదేమీ జరగకూడదని కోరుకుందాం. తీవ్ర ఒడిదుడుకులు నెలకొన్న పరిస్థితుల్లో ఇంధన లభ్యత, అందుబాటు ధరలో అది అందేలా చూడటం ప్రాథమిక బాధ్యత. జాగ్రత్తగా దీన్నుంచి బైటపడే ప్రయత్నం చేస్తున్నాం‘ అని పురి వివరించారు. మరోవైపు, చమురు దిగుమతులకు సంబంధించి రష్యాకు చెల్లింపుల విషయంలో ఎలాంటి సమస్యా లేదని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. -
ఏపీ సర్కార్‌పై కేంద్రమంత్రి ప్రశంసలు
సాక్షి, విజయవాడ: నగరంలోని పాత ప్రభుత్వాసుపత్రిలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా శుక్రవారం పర్యటించారు. ఓల్డ్ జీజీహెచ్‌లో రూ.25 కోట్లతో నిర్మించనున్న క్రిటికల్ కేర్ బ్లాక్, బీఎస్ఎల్-3 ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొత్తగా 1.25 కోట్లతో నిర్మించిన ఐపీహెచ్ఎల్ ల్యాబ్స్‌ను కేంద్రమంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ, ఏపీలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు చాలా బాగుందని ప్రశంసించారు. ఆరోగ్య రంగంలో ఏపీకి పూర్తి స్థాయిలో సహకరిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతోనే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. ఏపీ ప్రభుత్వం హెల్త్ సెక్టార్‌పై ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమన్నారు. సీఎం జగన్‌కి, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనికి కేందమంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ‘‘ప్రజల ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రధాని మోదీ హెల్త్ సెక్టార్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా 1.70 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను నిర్మించాం. గత తొమ్మిదేళ్లలో 350 కి పైగా కొత్త మెడికల్ కళాశాలలనుప్రదాని మోదీ నిర్మించారు. గ్రామీణ స్ధాయిలో హెల్త్ వెల్ నెస్ సెంటర్లని జిల్లా ఆసుపత్రులు, ఎయిమ్స్ లాంటి సంస్ధలతో అనుసంధానం చేశాం. గ్రామీణ ప్రాంతవాసులకు స్పెషలిస్ట్ సేవలు టెలీ కన్సల్టేషన్ ద్వారా ఉచితంగా అందిస్తున్నాం. ప్రతీ రోజూ 4 లక్షల వరకు టెలీ కన్సల్టేషన్ సేవలు అందిస్తున్నాం. ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందిస్తున్నాం’’ అని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఇదీ చదవండి: అందుకేనట బాబు రహస్య మంతనాలు! -
ఇది ఇంగ్లాండ్ కాదు.. కన్నడ భాషా వివాదంపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు
బెంగళూరు: బెంగళూరులో భాషా ఉద్యమంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. కర్ణాటకలో దుకాణాల బోర్డులు ప్రధానంగా స్థానిక భాషలో ఉండాలనే డిమాండ్‌తో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర రాజధాని బెంగళూరులో కన్నడ అనుకూల గ్రూపులు బుధవారం విధ్వంసం చేసిన తర్వాత ఆయన ఈ మేరకు మాట్లాడారు. "ప్రతి ఒక్కరూ సంకేతాలను చదవగలగాలి. అందరూ ఇంగ్లీష్ చదవలేరు. కన్నడలో అలాగే ఇంగ్లీష్ లేదా హిందీ వంటి ఇతర భాషలలో రాయడం వల్ల వచ్చే నష్టం ఏమిటి? ఇది ఇంగ్లాండ్ కాదు. దుకాణదారులు కూడా అవసరాన్ని అర్థం చేసుకోవాలి " అని ప్రహ్లాద్ జోషి అన్నారు. కన్నడనాట మరోసారి భాష ప్రతిపాదిత ఆందోళనలు బుధవారం జరిగాయి. నేమ్ బోర్డులు ఇతర భాషల్లో ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. కెంపెగౌడ ఎయిర్‌పోర్టు ముందు కన్నడ సంఘాలు ఉద్యమం మొదలుపెట్టాయి. కొన్ని హోటల్స్‌పై దాడులకు దిగాయి. దీంతో బెంగళూరు అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎయిర్పోర్ట్ బయట కన్నడ కాకుండా ఇంగ్లీష్, హిందీ భాషల్లో నేమ్ ప్లేట్లు ఉంచడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది కన్నడ రక్షా వేదిక. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆందోళకు దిగింది. కెంపెగౌడ ఎయిర్పోర్ట్ బయట ఇతర భాషల నేమ్ బోర్డుల్ని ధ్వంసం చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారుల్ని నిలువరించి.. పరిస్థితి అదుపుచేసే యత్నం చేస్తున్నారు. ఇదీ చదవండి: తమిళనాడు డీజీపీ ఆఫీస్‌కు ‘బాంబు’ బెదిరింపు -
లోక్‌సభలో అలజడి ఘటన: ప్రతిపక్షాలపై కేంద్ర మంత్రి ఫైర్
ఢిల్లీ: పార్లమెంట్ అలజడి ఘటనపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తప్పుబట్టారు. మహ్మద్ అలీ జిన్నా భావజాలంతో ఓవైసీ ప్రభావితమయ్యారని విమర్శించారు. జిన్నా ఆత్మ ఓవైసీలోకి చొరబడిందని వ్యగ్యాస్త్రాలు సంధించారు. అందుకే ఆయన ఓ వర్గం కోసమే పనిచేస్తారని అన్నారు. నేరస్థుల్లో కూడా మతకోణం చూడటానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. లోక్‌సభలో భద్రతా వైఫల్యం కేసుపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. ఉగ్రవాదుల మతం, కులం, విశ్వాసాలతో పట్టింపులేదని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మతపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే ఉగ్రవాదులను ఉగ్రవాదులుగానే గుర్తించామని తెలిపారు. పార్లమెంట్లో అలజడి కేసులో నిందితులు ముస్లింలు అయితే పరిస్థితి ఏంటని ప్రతిపక్షాలు అడగడంపై ఆయన ఆక్షేపించారు. ఉగ్రవాద అంశంలో ప్రతిపక్షాలు మత కోణాన్ని చూస్తున్నారు.. ఈ అంశంపై హోమంత్రి అమిత్ షా స్పందించాలని పట్టుబడుతున్నారు.. ఇలాంటి విషయాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పారిపోయేవారు కాదు అని గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు. దృఢ సంకల్పంతో ప్రతిస్పందించే వ్యక్తి అని తెలిపారు. పార్లమెంటు చొరబాటుదారులు ముస్లింలైతే పరిస్థితి మరోలా ఉండేదని జేడీయూ, ఏఐఎంఐఎం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఇదీ చదవండి: అరాచకం సృష్టించడానికి కుట్ర.. వెలుగులోకి కీలక విషయాలు -
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఫోన్ చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని ఆయనను సీఎం కోరారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని కిషన్ రెడ్డికి సీఎం విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో పూర్తి సహాయసహకారాలు అందించాలన్నారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి ధరణిపై సమీక్ష నిర్వహించారు. ధరణి లోటుపాట్లపై వారం, పదిరోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్ కమిషనర్ నవీన్ మిట్టల్‌ను ఆదేశించారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు నివేదికలో పొందుపరచాలన్న సీఎం.. ధరణి యాప్ భద్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరణి లావాదేవీలపై వస్తున్న విమర్శలకు డాటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇదీ చదవండి: తెలంగాణకు తొలి దళిత స్పీకర్.. రేపే అధికారిక ప్రకటన -
రానున్నది పూర్తిస్థాయి బడ్జెటేనా? ఆర్థిక శాఖ మంత్రి ఏం చెప్పారు?
న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో సమర్పించే బడ్జెట్ .. ఓట్ ఆన్ అకౌంట్ మాత్రమేనని, అందులో ఎటువంటి అద్భుతమైన ప్రకటనలు ఉండబోవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అలాంటి వాటి కోసం, ఎన్నికలయ్యాక ఏర్పడే కొత్త ప్రభుత్వం జూలైలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే దాకా ఎదురు చూడాల్సిందేనని ఆమె తెలిపారు. సీఐఐ గ్లోబల్ ఎకనమిక్ పాలసీ ఫోరమ్‌లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఎన్నికల ముంగిట్లో ప్రవేశపెట్టే బడ్జెట్ .. కొత్త సర్కార్ కొలువు తీరే వరకు అయ్యే ప్రభుత్వ వ్యయాలకు ఆమోదం పొందేందుకు ఉద్దేశించి ఉంటుంది. దీన్ని ఓట్ ఆన్ అకౌంట్‌గా వ్యవహరిస్తారు. సాధారణంగా ఇలాంటి వాటిలో ప్రభుత్వం భారీ ప్రతిపాదనలేమీ చేయదు. మరోవైపు, అన్ని రంగాల్లో కార్యకలాపాలు పుంజుకోవడంతో రెండో క్వార్టర్లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అత్యధికంగా నమోదైనట్లు రాజ్యసభలో చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీగా భారత్ కొనసాగుతోందని ఆమె చెప్పారు. గత ఎనిమిదేళ్ల వ్యవధిలో ప్రపంచంలోనే అతి పెద్ద ఎకానమీల జాబితాలో భారత్ 10వ స్థానం నుంచి అయిదో స్థానానికి చేరిందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మేకిన్ ఇండియా, పీఎల్ఐ (ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాల స్కీము) వంటి తోడ్పాటు చర్యలతో తయారీ రంగం కూడా ఎకానమీ వృద్ధిలో గణనీయంగా పాలుపంచుకుంటోందని మంత్రి చెప్పారు. నిరుద్యోగిత రేటు 2017–18లో దాదాపు 18 శాతంగా ఉండగా ప్రస్తుతం 10 శాతానికి దిగి వచ్చిందన్నారు. -
దేశాన్ని విడదీసే కుట్రలు సాగనివ్వం
న్యూఢిల్లీ: గోమూత్ర రాష్ట్రాలు అంటూ తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ డీఎన్వీ సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు బుధవారం లోక్‌సభలో తీవ్ర అలజడి సృష్టించాయి. అధికార బీజేపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం 12 గంటలకు సభకు పునఃప్రారంభమైన తర్వాత కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఈ అంశాన్ని లేవనెత్తారు. సెంథిల్ కుమార్ అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ, డీఎంకే సీనియర్ నేత టీఆర్ బాలు ఆమోదిస్తున్నారా? అని నిలదీశారు. దేశాన్ని ఉత్తర, దక్షిణ భారతదేశంగా విడదీసే కుట్రలను సాగనివ్వబోమని తేలి్చచెప్పారు. సెంథిల్ కుమార్ వెంటనే క్షమాపణ చెప్పాలని మేఘ్వాల్ డిమాండ్ చేశారు. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపించారని, దేశం పట్ల వారి తీర్పును వెలువరించారని అన్నారు. టీఆర్ బాలు స్పందిస్తూ.. సెంథిల్ కుమార్ అలా మాట్లాడడం సరైంది కాదని చెప్పారు. సెంథిల్‌ను తమ ముఖ్యమంత్రి స్టాలిన్ హెచ్చరించారని తెలిపారు. సెంథిల్ కుమార్ వ్యాఖ్యలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా రికార్డుల నుంచి తొలగించారు. సభలో సెంథిల్ కుమార్ క్షమాపణ తను వ్యాఖ్యల పట్ల డీఎంకే ఎంపీ డీఎన్వీ సెంథిల్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. బుధవారం లోక్‌సభలో క్షమాపణ కోరారు. ప్రజల మనోభావాలను గాయపర్చడం తన ఉద్దేశం కాదని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. అనుకోకుండానే ఈ మాట ఉపయోగించానని, తనకు ఎలాంటి దురుద్దేశం లేదని సెంథిల్ కుమార్ వివరణ ఇచ్చారు. ఆయన మంగళవారం క్షమాపణ కోరుతూ ‘ఎక్స్’లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. భారతీయ సంస్కృతిని కించపర్చే కుట్ర ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ భారతీయ సంస్కృతిని, గుర్తింపునకు కించపర్చేందుకు కుట్ర పన్నిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలు అన్వేíÙంచకుండా దేశాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కుయుక్తులు సాగిస్తోందని ధ్వజమెత్తారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమేథీలో రాహుల్ గాంధీ ఓడిపోయిన తర్వాతే ఉత్తర–దక్షిణ భారతదేశం అనే విభజనను తెరపైకి తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. -
మత్స్య రంగంలో ఏపీ అద్భుత ప్రగతి
-
కవితను కచ్చితంగా జైలుకు పంపిస్తాం: కేంద్రమంత్రి అశ్విని చౌబే
సాక్షి, హన్మకొండ జిల్లా: లిక్కర్ కేసులో కవితను కచ్చితంగా జైలుకు పంపిస్తామంటూ కేంద్రమంత్రి అశ్విని చౌబే వ్యాఖ్యానించారు. హంటర్ రోడ్డులో మీడియా సెంటర్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. రూ.వంద కోట్లు గోవా ఎన్నికల్లో ఆప్ పార్టీకి కవిత ఇచ్చారు. కేసీఆర్ కుటుంబం ప్రజల సొమ్మును దోచుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్.. రెండూ ఒకటే. బీజేపీని ఎదుర్కొలేక బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏకమయ్యాయి. తెలంగాణలో కమలం వికసిస్తుందని నా నమ్మకం’’ అని అశ్విని చౌబే ధీమా వ్యక్తం చేశారు. చదవండి: కామారెడ్డి రూపురేఖలు మారుస్తా: కేసీఆర్ -
కేంద్రమంత్రి కాన్వాయ్‌కు ప్రమాదం.. ఒకరు మృతి
భోపాల్: కేంద్రమంత్రి కాన్వాయ్‌లోని కారు ప్రమాదానికి గురైంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ ప్రయాణిస్తున్న కారు మంగళవారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా పలువురికి గాయాలయ్యాయి. కేంద్రమంత్రి సైతం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈనెల 17న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రహ్లాద్ పటేల్ మధ్యప్రదేశ్‌లోని నార్సింగ్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బరిలో నిలిచారు. ఈ క్రమంలో మంగళవారం చింద్వారాలో ఓ కార్యక్రమాన్ని ముగించుకొని నార్సింగ్‌పూర్‌కు వెళ్తుండగా అమర్వారా వద్ద ప్రమాదం జరిగింది. సింగోడి బైపాస్ సమీపంలో మంత్రి కాన్వాయ్‌ను రాంగ్ రూట్లో ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని నిరంజన్ చంద్రవంశీగా(33) గుర్తించారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నిరంజన్.. బైక్‌పై పిల్లలు నిఖిల్ నిరంజన్, సంస్కర్ నిరంజన్‌తో కలిసి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం ముగ్గురికి గాయాలవ్వగా..వారిని నాగ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియో చూస్తుంటే మంత్రి ఎస్యూవీ కారు పూర్తిగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. చదవండి: Bihar Caste Reservation: రిజర్వేషన్లపై బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. #WATCH | Union Minister and BJP candidate from Narsinghpur, Prahlad Patel's convoy meets with a road accident in Amarwara of Chhindwara district in Madhya Pradesh. The minister was travelling from Chhindwara to Narsinghpur. pic.twitter.com/k9vQvQWxda — ANI (@ANI) November 7, 2023 -
212 మంది భారతీయుల తరలింపు
న్యూఢిల్లీ: హమాస్ మిలిటెంట్ల దాడులతో రణరంగంగా మారిన ఇజ్రాయెల్ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతోంది. దాదాపు 212 మందితో టెల్ అవివ్ నుంచి బయలుదేరిన మొదటి విమానం శుక్రవారం ఢిల్లీకి చేరుకుంది. వీరిలో చాలామంది విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారు. విమానంలో వచ్చిన భారతీయులకు ఎయిర్‌పోర్టులో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వారికి స్వాగతం పలికారు. కరచాలనం చేశారు. ఇజ్రాయెల్‌లో తమకు ఎదురైన భయానక అనుభవాలను భారతీయులు పంచుకున్నారు. సైరన్ల మోతతో నిద్రలేచేవాళ్లమని, ఎప్పుడేం జరుగుతుందో తెలియక ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపామని, షెల్టర్లలో తలదాచుకున్నామని శశ్వంత్ సింగ్ అనే వ్యక్తి చెప్పాడు. ఆయన తన భార్యతో కలిసి ఢిల్లీకి చేరుకున్నాడు. తమను క్షేమంగా స్వదేశానికి చేర్చిన భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇజ్రాయెల్ నుంచి భారతీయులను వెనక్కి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభించింది. ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం 18,000 మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. వెస్ట్‌బ్యాంకు, గాజాలోనూ కొందరు భారతీయులు నివసిస్తున్నారు. ‘ఆపరేషన్ అజయ్’లో భాగంగా రెండో విమానం శుక్రవారం సాయంత్రం టెల్ అవివ్ నుంచి బయలుదేరింది. శనివారం భారత్‌కు చేరుకోనుంది. ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి చేరుకున్న భారతీయులు -
భగత్ సింగ్ అపూర్వమైన దేశభక్తుడు- కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే
న్యూఢిల్లీ: షహీద్ భగత్ సింగ్ ఒక అపూర్వమైన దేశ భక్తుడని, ఆయన అందరివాడని, రాబోయే తరాలవారికి ఒక స్ఫూర్తి జ్యోతి అని కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే భగత్ సింగ్ సేవలను కొనియాడారు. భగత్ సింగ్ 116వ జయంతి సందర్భంగా రాజ్ త్రిపాఠీ, రాహుల్ ఇంక్విలాబ్ రచించిన " క్రాంతీ కి దరోహర్" (హిందీ) గ్రంధాన్ని ముఖ్య అతిధి కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే అంబేద్కర్ ఆడిటోరియం, ఆంధ్ర భవన్ , ఢిల్లీలో 28 సెప్టెంబర్ 2023 న సాయంత్రం 5 గంటలకు జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. సభకు ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డుల సృష్టికర్త, సేవ్ టెంపుల్స్ భారత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ సభకు అధ్యక్షత వహించారు. గౌరవ అతిథిగా విచ్చెసిన శాంభవి మఠాధిపతి స్వామి ఆనంద్ స్వరూప్ మహారాజ్ మాట్లాడుతూ పటిష్ట భారత దేశం కోసం, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలిపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంగళ్ పాండే, భగత్ సింగ్ కుటుంబ సభ్యులతో పాటు ఎంతోమంది స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబాల వారు పాల్గొన్నారు. -
త్వరలోనే కొత్త హౌసింగ్ స్కీమ్.. ధ్రువీకరించిన కేంద్ర మంత్రి
గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) తాజాగా ధ్రువీకరించారు. “మేము కొత్త హోమ్ సబ్వెన్షన్ స్కీమ్ వివరాలను ఖరారు చేసే ప్రక్రియలో ఉన్నాం. ప్రధాన మంత్రి చెప్పినట్లుగా లబ్ధిదారులకు వడ్డీ రాయితీని అందించే ఇది ఒక పెద్ద పథకం. త్వరలోనే ఈ పథకం తుది వివరాలు వెల్లడిస్తాం ” అని హర్దీప్ సింగ్ పూరి మీడియా సమావేశంలో తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 15న తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తొలుత ఈ పథకాన్ని ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో నివసించే నిరుపేదలకు ప్రయోజనం చేకూర్చే కొత్త హౌసింగ్ లోన్ స్కీమ్‌ను తమ ప్రభుత్వం తీసుకువస్తోందని ఆయన ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్న ప్రధాని మోదీ, నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని అద్దె ఇళ్లు, మురికివాడలు, అనధికార కాలనీలలో నివసించే కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే కొత్త పథకాన్ని తమ ప్రభుత్వం తీసుకువస్తుందని చెప్పారు. ‘సొంత ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్న పేదలకు వడ్డీ రేట్లు, బ్యాంకుల నుంచి రుణాల ఉపశమనంతో సహాయం చేస్తాం. అది వారికి లక్షల రూపాయలు ఆదా చేయడంలో సహాయపడుతుంది’ అని ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని మోదీ చెప్పారు. రాయిటర్స్ కథనం ప్రకారం.. ఈ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునే పేదలకు రూ.9 లక్షలు రుణం అందిస్తారు. దీనిపై కేవలం 3 నుంచి 6.5 శాతం వడ్డీ మాత్రమే ఉంటుంది. ఒక వేళ ఇంతకు ముందే హోమ్‌లోన్ తీసుకున్నట్లయితే 20 సంవత్సరాల టెన్యూర్‌తో రూ.50 లక్షల లోపు గృహ రుణాలు తీసుకున్నవారు మాత్రమే ఈ వడ్డీ సబ్సిడీకి అర్హులు. -
13 నెలల ఆలస్యంగా తెలంగాణకు స్వాతంత్య్రం
-
వాహన డీలర్లకు కీలక ఆదేశాలు.. ఇక ఆ సౌకర్యం కూడా..
దేశంలోని వాహన డీలర్లకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆటోమొబైల్స్ డీలర్లు కూడా వాహనాల స్క్రాపింగ్ సౌకర్యాలను తెరవాలని కోరారు. ఐదో ఆటో రిటైల్ కాంక్లేవ్‌ను ఉద్దేశించి గడ్కరీ మాట్లాడుతూ.. ప్రభుత్వం సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహిస్తోందని, తదనుగుణంగా వాహన స్క్రాపింగ్ సౌకర్యాలను ప్రారంభించడానికి ప్రభుత్వం డీలర్లకు అనుమతి ఇస్తుందని పేర్కొన్నారు. భారత్ ప్రత్యామ్నాయ, జీవ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని, దేశాన్ని గ్రీన్ హైడ్రోజన్‌లో అతిపెద్ద తయారీదారుగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని, భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ఆటో డీలర్లు ముఖ్యమైన పాత్ర పోషించాలని గడ్కరీ పిలుపునిచ్చారు. ప్యాసింజర్ వాహనాల తయారీలో నాలుగో స్థానంలో, వాణిజ్య వాహనాల తయారీలో ఆరో స్థానంలో ఉన్న భారత్‌ను ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆటోమొబైల్ హబ్‌గా మార్చడమే తన కల అని గడ్కరీ పేర్కొన్నారు. -
కేంద్రమంత్రిని గదిలో బంధించిన బీజేపీ కార్యకర్తలు
లక్నో: కేంద్రమంత్రి సుభాష్ సర్కార్‌కు సొంత ఇలాకా అయిన బంకురా జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. జిల్లా రాజకీయాల్లో నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం పార్టీ కార్యకర్తలే ఆయన్ను బీజేపీ కార్యాలయంలో బంధించారు. ఆ గదికి తాళం కూడా వేశారు. కాగా పశ్చిమబెంగాల్లోని బంకుర లోక్‌సభ ఎంపీ ఆయన సుభాష్ ప్రస్తుతం ప్రధాని మోదీ కేబినెట్లో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బంకురాలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం సుభాష్ అధ్యక్షతన మీటింగ్ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో కొందరు బీజేపీ కార్యకర్తలు పెద్దగా నినాదాలు చేస్తూ పార్టీ కార్యాలయంలోకి చొరబడ్డారు. కేంద్ర మంత్రిని గదిలో బంధించి వేసి తాళం వేశారు. విషయం తెలసుకున్న ఆయన మద్దతుదారులు వెంటనే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు భారీగా అక్కడకు చేరుకొని కేంద్రమంత్రిని బయటకు తీసుకొచ్చారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ కార్యకర్త మోహిత్ శర్మ మాట్లాడుతూ.. సుభాష్ సర్కార్ కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. తనకు దగ్గరున్న వారికే జిల్లా కమిటీలో సభ్యులుగా నియమిస్తున్నారని తెలిపారు. దీనిని వ్యతిరేకించిన కొందరికీ షోకాజ్ నోటీసులు ఇచ్చారని, పార్టీని రక్షించేందుకు నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు. ఆయన అసమర్థత వల్ల ఈసారి బంకుర మున్సిపాలిటీ లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదని తెలిపారు. ఇంతకుముందు రెండు వార్డులను బీజేపీ సొంతం చేసుకుందన్నారు. అలాగే పంచాయతీ ఎన్నికల్లో చాలా స్థానాల్లో కనీసం అభ్యర్థులను నిలబెట్టలేకపోయారని, ఇది సిగ్గుచేటని ఆరోపించారు. ఇక ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సమీక్ భట్టాచార్య స్పందిస్తూ.. క్రమశిక్షణకు మారుపేరైన బీజేపీలో ఇలాంటి ఘటనలు ఆమోదయోగ్యం కాదని అన్నారు. దీనికి పాల్పడిన పార్టీ కార్యకర్తలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటివి ఏవైనా ఫిర్యాదులు ఉంటే.. వాటిని లేవనెత్తడానికి ఓ వేదిక ఉంది. ఈ ఘటనపై విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని’ తెలిపారు. అంతేగాక జిల్లా స్థాయి పార్టీ కార్యకలాపాల్లో సుభాష్ సర్కార్ ప్రమేయం లేదని చెప్పారు. అపార్థాలతో మంత్రిపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి ఇంతవరకు స్పందించలేదు. చదవండి: హర్ష గొయెంకా ట్వీట్.. హాట్ టాపిక్‌గా ఇస్రో చైర్మన్ జీతం.. With each passing day, @BJP4Bengal is crumbling as infighting is reaching its peak! In Bankura, vehement clashes erupted, & BJP workers locked Union Minister Subhas Sarkar in the party office. While unity within the party is a myth, BJP is truly a shining example of a weak… pic.twitter.com/Tu90BpQSZ7 — All India Trinamool Congress (@AITCofficial) September 12, 2023 -
కేంద్ర మంత్రి నివాసంలో యువకుడి అనుమానాస్పద మృతి!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కేంద్రమంత్రి నివాసంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితితో మృతిచెందడం కలకలం రేపుతోంది. హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కుమార్ నివాసంలో తలకు బుల్లెట్ తగిలిన గాయాలతో రక్తపు మడుగులో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన లక్నోలోని బెగారియా గ్రామంలో శుక్రవారం ఉదంయ 4 గంటల సమయంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులుసంఘటన స్థలానికి చేరుకున్నారు. కేంద్రమంత్రి కుమారుడు వికాస్ పేరుతో రిజిస్ట్రర్ అయిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మృతుడిని వినయ్ శ్రీవాస్తవగా పోలీసులు గుర్తించారు. అతడు మంత్రి కుమారుడు వికాస్ కిషోర్ స్నేహితుడిగా తెలిసింది. అయితే ఆ ఇంటిని ప్రస్తుతం మంత్రి ఉపయోగించడం లేదు. అంతేగాక శ్రీ వాస్తవ మరణించిన సమయంలో మంత్రిగానీ, అతని కొడుకు గానీ ఆ ఇంట్లో లేరని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేరుకున్నారు. ఘటన సమయంలో ఇంట్లో ఉన్న ఆరుగురిని ప్రశ్నిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా ప్రాంతానికి వెళ్లి ఆధారాలను సేకరించాయి. చదవండి: బాబు ‘బ్లాక్‌మనీ యవ్వారం’.. బిగ్ ట్విస్ట్ ఇదిలా ఉండగా మృతుడి సోదరుడు మాత్రం తన అన్నయ్య మరణంలో కుట్ర దాగుందని ఆరోపించారు. అయితే ఈ కుట్రలో మంత్రి కుమారుడి ప్రమేయం ఉందా అని ప్రశ్నించగా.. ‘మంత్రి కొడుకు వికాస్ ఎక్కడికి వెళ్లినా తన గన్ను వెంట తీసుకెళ్లేవాడు. అతను కచ్చితంగా పిస్టల్ తీసుకెళ్లి ఉండాల్సింది.. ఢిల్లీకి వెళ్లినా, ఎక్కడికైనా వెళ్లినా దాన్ని వెంట తీసుకెళ్లేవాడని ఖచ్చితంగా చెప్పగలను. నిన్న ఎందుకు తీసుకోలేదో నాకు తెలీదు.. ఇది పక్కా ప్లాన్.. మా అన్నయ్యను ఎందుకు, ఎవరు చంపారో తెలియాలి’ అని ప్రశ్నించాడు. మృతుడి సోదరుడి ఆరోపణలపై కేంద్రమంత్రి స్పందించారు. వికాస్ గురువారం మధ్యాహ్నమే ఢిల్లీకి వెళ్లాడని తెలిపారు. ఇందుకు బోర్డింగ్ పాస్‌లు కూడా సాక్ష్యంగా చూపించారు. పిస్తోల్‌కు నేషనల్ లైసెన్స్ లేదని, అందుకే తన కొడుకు పిస్టల్ని తనతో తీసుకెళ్లలేదని చెప్పారు. జరిగింది విచారకరమని.. విషయం తెలిసిన వెంటనే పోలీస్ కమిషనర్‌కు తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఘటనపై విచారణ జరుగుతోందని నిందితులను వదిలిపెట్టమని, దోషులెవరైనా శిక్షిస్తామని తెలిపారు. బాధితుడి కుటుంబానికి తాము అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. -
డిజిటల్ ఇండియా ప్రాజెక్టు పొడిగింపు
న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా ప్రాజెక్టును పొడిగించే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇందు కోసం 2021–22 నుంచి 2025–26 మధ్య కాలానికి రూ. 14,903 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీని కింద 6.25 లక్షల మంది ఐటీ నిపుణులకు కొత్త నైపుణ్యాల్లోను, 2.64 లక్షల మందికి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలోనూ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పొడిగించిన డిజిటల్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా మరో తొమ్మిది సూపర్ కంప్యూటర్లను నేషనల్ సూపర్కంప్యూటింగ్ మిషన్‌కు (ఎన్సీఎం) జోడించనున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటికే ఎన్సీఎం కింద 18 సూపర్ కంప్యూటర్స్ ఉన్నట్లు వివరించారు. డిజిటల్ ఇండియా పథకం 2015లో ప్రారంభమైనప్పుడు రూ. 4,500 కోట్లతో 2022 నాటికి ఎన్సీఎం కింద 70 సూపర్‌కంప్యూటర్స్‌ను నెలకొల్పే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. వాటికి అదనంగా మరో తొమ్మిది సూపర్‌కంప్యూటర్లకు తాజాగా ఆమోదముద్ర వేసిందని మంత్రి చెప్పారు. 12 కోట్ల మంది విద్యార్థులకు కోర్సులు.. డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద 12 కోట్ల మంది కాలేజీ విద్యార్థుల కోసం సైబర్ అవగాహన కోర్సులను నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని 1,200 స్టార్టప్‌లకు ఆరి్థక తోడ్పాటు అందించే వెసులుబాటు కూడా ఉందని వైష్ణవ్ చెప్పారు. 1,787 యూనివర్సిటీలు, పరిశోధన సంస్థల నెట్వర్క్ అయిన నేషనల్ నాలెడ్జ్ నెట్‌వర్క్‌ను డిజిటల్ ఇండియా ఇన్ఫోవేస్‌గా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం తదితర రంగాల్లో కృత్రిమ మేధ ను వినియోగించేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పా రు. డిజిలాకర్ యాప్‌ను లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకూ అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. -
అమిత్ షా బాటలోనే కిషన్‌రెడ్డి! జోడు పదవులతో ఎన్నికలకు.. బీజేపీ వ్యూహమేంటి?
తెలంగాణ బీజేపీ చీఫ్ గంగాపురం కిషన్ రెడ్డి రెండు పదవుల్లో కొనసాగనున్నారా మోదీ కేబినెట్లో సీటుకు డోకా లేదా? కేంద్రమంత్రిగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? పార్టీ హైకమాండ్ వ్యూహమేంటీ? కిషన్ రెడ్డిని జోడు పదవుల్లో కొనసాగించడానికి కారణమేంటీ?.. అదనపు బాధ్యతలతో టైం మేనేజ్మెంట్లో ఇబ్బంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అనుకోకుండా తెలంగాణ కాషాయ పగ్గాలు దక్కాయి. ఎన్నికలకు టైం దగ్గరపడుతుంది. అటు కేంద్రంలో మూడు శాఖలకు మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.మరోవైపు అదనంగా పార్టీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించడంతో టైం మేనేజ్మెంట్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. పార్లమెంట్ సమావేశాల కారణంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని, జిల్లా కార్యవర్గాలను, పార్టీ అనుబంధ విభాగాల పనితీరుపై సమీక్షలు చేసుకునే వెసులుబాటు కూడా దొరకలేదు. అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్ మధ్య నలిగిపోతున్నారు. కిషన్ రెడ్డికి పూర్తి సపోర్ట్ మరోవైపు డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తున్నారు. అన్ని జిల్లాలను చుట్టేయాలని అనుకున్న వీలుకాకపోవడంతో.. కొన్ని జిల్లాలను పార్టీ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఛైర్మన్ ఈటల రాజేందర్‌కు అప్పగించారు. పార్టీ గ్రౌండ్ వర్క్ ప్రిపరేషన్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. జాతీయ నాయకత్వం కిషన్ రెడ్డికి పూర్తి సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా బాటలోనే కిషన్‌రెడ్డి! ఒక్కరికి ఒకటే పదవి అన్నది బీజేపీ నిబంధన. కొన్నిసందర్భాల్లో కొందరికి మినహాయింపులు వర్తించాయి. అమిత్ షా గతంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలతో పాటు కేంద్ర హోం మంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం అదే తరహాలో కిషన్ రెడ్డికి పార్టీ హైకమాండ్ మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఆయన్ను కేంద్ర మంత్రిగా కొనసాగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల వ్యూహం ఎన్నికల వేళ తెలంగాణలో అధికార పార్టీ నుంచి ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి సపోర్ట్‌గా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిశీలనకు వెళ్లిన సందర్భంలో కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అధికార బీఆర్ఎస్పై పోరాటానికే ద్విపాత్రాభినయం కిషన్ రెడ్డి చేయనున్నారు. అదే వ్యూహంతో కాషాయ పార్టీ నేతలు వచ్చే ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నట్లు స్పష్టమవుతోంది. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా తెలంగాణలో పాగా వేయాలని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు. కేంద్రమంత్రిగా ఉంటూనే కిషన్ రెడ్డి అంబర్ పేట అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. మొత్తంగా జోడు పదవులతో ఎన్నికలకు వెళ్తున్న కిషన్ రెడ్డికి ఏ మేరకు మైలేజీ వస్తుందో చూడాలి. -
క్రిప్టోల కట్టడికి అంతర్జాతీయ సహకారం కావాలి
న్యూఢిల్లీ: క్రిప్టో అసెట్స్‌ను నియంత్రించేందుకు అన్ని దేశాలు సమిష్టిగా కలిసి పనిచేయాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ తెలిపారు. వాటిని నియంత్రించాలన్నా లేక నిషేధించాలన్నా అంతర్జాతీయ స్థాయిలో గణనీయంగా సహకారం అవసరమవుతుందని ఆయన పేర్కొన్నారు. వాటిపై పన్నుల విధింపు, ప్రమాణాల మీద పలు దేశాలు, సంస్థలు అధ్యయనం చేస్తున్నందున అన్నీ సమిష్టిగా కలిసి రావడమనేది ఎప్పటికి జరుగుతుందని నిర్దిష్టంగా చెప్పలేమని లోక్‌సభకు మంత్రి తెలియజేశారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. 2014 మార్చి 31 నాటికి కేంద్ర ప్రభుత్వ రుణభారం రూ. 58.6 లక్షల కోట్లుగా (స్థూల దేశీయోత్పత్తిలో 52.2 శాతం) ఉండగా 2023 మార్చి 31 నాటికి ఇది రూ. 155.6 లక్షల కోట్లకు (స్థూల దేశీయోత్పత్తిలో 57.1 (శాతం) చేరిందని చౌదరి తెలిపారు. -
దుమ్ముంటే ఆ వివరాలు బయటపెట్టు.. రిజిజుకు కాంగ్రెస్ ఎంపీ సవాల్
న్యూఢిల్లీ: ప్రతి 15 రోజులకోసారి ఈశాన్య రాష్ట్రాలను సందర్శించాలంటూ ప్రధాని మోదీ తమను ఆదేశించారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన లోక్‌సభలో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కేబినెట్ సమావేశంలో కేంద్ర మంత్రులతో మోదీ ఒక బృందాన్ని ఏర్పాటు చేశారని, ఇందులో ఐదుగురు కేబినెట్ మంత్రులు, ఏడుగురు సహాయ మంత్రులు ఉన్నారని తెలిపారు. ప్రతి 15 రోజులకోసారి ఈశాన్యంలో పర్యటించాలంటూ ఈ బృందాన్ని ఆదేశించారని పేర్కొన్నారు. ప్రధాని ఆదేశాల ప్రకారం ఈశాన్యంలో పర్యటిస్తున్నట్లు వివరించారు. ఢిల్లీ నుంచి పాలించడం కాదు, నేరుగా ప్రజలకు వద్దకు వెళ్లాలని అధికారులను సైతం మోదీ ఆదేశించారని పేర్కొన్నారు. కిరణ్ రిజిజు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌లో గత 97 రోజుల్లో కేంద్ర మంత్రులు ఎవరెవరు ఎప్పుడు పర్యటించారో చెప్పాలని, దమ్ముంటే వివరాలు బయటపెట్టాలని రిజిజుకు సవాలు విసిరారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. During the No Confidence Motion in Lok Sabha, Union Minister Kiren Rijiju has boasted about the Prime Minister’s directions to Cabinet Ministers and Ministers of State to visit Northeast every 15 days. Yes, we all know about the frequency of visits of Union Ministers before any… — Jairam Ramesh (@Jairam_Ramesh) August 8, 2023 -
కేంద్ర పోలీస్ విభాగాల్లో 1.14 లక్షల ఖాళీలు
న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఢిల్లీ పోలీసు వంటి కేంద్ర పోలీస్ విభాగాల్లో 1,14,245 ఉద్యోగాలు ఇంకా భర్తీ చేయాల్సి ఉందని కేంద్రప్రభుత్వం బుధవారం వెల్లడించింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా బుధవారం ఈ వివరాలు తెలిపారు. ఈ ఏడాది 31,879 పోస్టులకు ప్రకటనలు జారీచేయగా ఇప్పటిదాకా 1,126 పోస్టులే భర్తీ అయ్యాయి. కేంద్ర హోం శాఖ, దాని విభాగాలైన బీఎస్ఎఫ్, సశస్త్ర సీమా బల్, సీఆర్పీఎఫ్, ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్, అస్సాం రైఫిల్స్, సీఐఎస్ఎఫ్, కేంద్ర పోలీసు సంస్థలు, ఢిల్లీ పోలీస్ ఇలా అన్ని విభాగాల్లో మొత్తంగా 1,14,245 ఖాళీలు ఉన్నట్లు మంత్రి తెలిపారు. వీటిలో షెడ్యూల్ కులాల పోస్టులు 16,356 ఉన్నాయి. షెడ్యూల్ తెగలకు 8,759, ఇతర వెనుకబడిన వర్గాలకు 21,974, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 7,394 పోస్టులు, మిగతా 59వేలకుపైగా జనరల్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి. -
వాహనదారులకు అలర్ట్.. ఇక ఆగక్కర్లేదు,కొత్త టోల్ వ్యవస్థ రాబోతోంది
జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు ఆపాల్సిన అవసరం లేకుండా కొత్త టోల్ వ్యవస్థను అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. అవరోధం లేని టోల్ వ్యవస్థ కోసం ట్రయల్స్ కొనసాగుతున్నాయి. వాటి ట్రయల్స్ విజయవంతం అయిన వెంటనే, దానిని అమలు చేస్తాము" అని రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. ఈ వ్యవస్థ అమలులోకి వస్తే వాహనదారులు టోల్ బూత్‌ల వద్ద అర నిమిషం కూడా వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఈ నూతన వ్యవస్థ ద్వారా సామర్థ్యం మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు. అలాగే కిలోమీటర్ల ఆధారంగా చెల్లింపుల వ్యవస్థకు ఉండొచ్చని తెలిపారు. గతంలో ఫాస్ట్‌ట్యాగ్‌ల వినియోగం ద్వారా టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని 47 సెకన్లకు తగ్గించామని, ప్రస్తుతం ప్రభుత్వం దానిని 30 సెకన్ల కంటే తక్కువకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన చెప్పారు. ఉపగ్రహ, కెమెరాలు వంటి సాంకేతికతల ఆధారితంగా పనిచేసే ఈ నూతన టోల్ వ్యవస్థ పైలట్ ప్రాజెక్ట్‌గా ఇప్పటికే ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలో పరీక్షిస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు జాతీయ రహదారిపైకి ప్రయాణిస్తున్నప్పుడు టోల్ ప్లాజా వద్ద మీ వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్‌ను కెమెరా స్కాన్ చేసి డేటాను క్రోడీకరిస్తుంది. మీరు ప్రయాణించిన కి.మీ.లకు ఛార్జీలు విధిస్తుంది. టెలికాం సహా అన్ని రంగాలలో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగానే ఇలాంటి పురోగతి అంతా జరుగుతోందని, టెలికమ్యూనికేషన్స్ రంగం అన్ని ఇతర రంగాలతో అనుసంధానమై ఉందని మంత్రి అన్నారు. మెరుగైన టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు టోల్ ప్లాజాల డేటాను నిర్వహించడంలో సహాయపడతాయని అన్నారు. చదవండి 'ప్రతి ఒక్కరినీ రక్షించలేం..' అల్లర్లపై సీఎం కీలక వ్యాఖ్యలు.. -
మనీ లాండరింగ్ కేసుల్లో 93 శాతం నేర నిరూపణలు
న్యూఢిల్లీ: దేశంతో గత తొమ్మిదేళ్లలో మనీ లాండరింగ్ కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 93.54 శాతం నేరాలను నిరూపించిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద 31 కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసిందని, ఇందులో 29 కేసుల్లో 54 మందిని దోషులుగా గుర్తించిందని వెల్లడించారు. పీఎంఎల్ఏ కింద నేర నిరూపణ రేటు 93.54 శాతం ఉందని పేర్కొన్నారు. అలాగే ఈడీ గత తొమ్మిదేళ్లలో రూ.16,507.86 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిందని తెలియజేశారు. -
జీడీపీలో వ్యవసాయం వాటా మరింత పెరగాలి
న్యూఢిల్లీ: దేశ జీడీపీలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాటా మరింత పెరగాల్సి ఉందని, మార్కెటింగ్‌ను బలోపేతం చేయడం ద్వారా ఇది సాధ్యపడుతుందని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్‌షా అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో రైతులు, తయారీదారుల సంఘాలు (ఎఫ్‌పీవోలు) కీలకపాత్ర పోషించాల్సి ఉందన్నారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ఆధునిక టెక్నాలజీ, మార్కెటింగ్ విధానాలను అనుసరించడం మొదలు పెడితే వ్యవసాయం లాభదాయకంగా మారుతుందన్నారు. ఈ దిశగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్), ఎఫ్‌పీవోలు సాయంగా నిలుస్తాయన్నారు. ఎఫ్‌పీవోలు, పీఏసీఎస్‌లు హైబ్రిడ్ నమూనాలో కలసి పనిచేయాలని సూచించారు. ఇందులో భాగంగా 11,770 ఎఫ్‌పీవోలు ఒప్పందం ద్వారా పీఏసీఎస్‌తో అనుసంధానం కావాలని కోరారు. దీనికింద పీఏసీఎస్‌లకు ఎఫ్‌పీవోలు సేవలు అందించాలని సూచించారు. ‘‘తయారీ ద్వారా జీడీపీ వృద్ధి చెందితే ఉపాధి కల్పన భారీగా ఉండదు. అదే వ్యవసాయం, అనుబంధ రంగాలు వృద్ధి చెందిదే జీడీపీకే కాకుండా పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు అనుకూలిస్తుంది. వ్యవసాయం దాని అనుబంధ రంగాలు అత్యధికంగా జీడీపీకి 17.5–18 శాతం వాటా సమకూరుస్తున్నాయి. కానీ, ఇతర రంగాల్లోని వారితో పోలిస్తే రైతుల పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. ఇతర రంగాల్లో మాదిరే రైతుల పరిస్థితులు మెరుగు పడాలంటే అందుకు ఎఫ్‌పీవోలను ఆమోదించాలి’’ అని అమిత్‌షా పేర్కొన్నారు. ఎఫ్‌పీవోల్లో రైతులు, తయారీదారులు (ఉత్పత్తిదారులు) భాగంగా ఉంటారు. వీరు చిన్న, సన్నకార రైతులకు సాగు, ముడి సరుకులు, సాంకేతిక సేవలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ సహా అన్ని రకాల సేవలు అందిస్తుంటారు. మరిన్ని ఎఫ్‌పీవోలు ఇప్పటికే 11,770 ఎఫ్‌పీవోలు ఉండగా, 2027–28 నాటికి మరో 10,000 ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. దేశంలో 85 శాతం మంది చిన్న, సన్నకార రైతులే ఉన్నందున వ్యవసాయం లాభసాటిగా మారాల్సి ఉందని అమిత్‌షా పేర్కొన్నారు. ఇందుకోసం ఆధునిక టెక్నాలజీ, మార్కెటింగ్ విధానాలు అవసరమని సూచించారు. ‘‘ఎఫ్‌పీవోల వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. కానీ, సహకార రంగంలో ఎఫ్‌పీవోలు, వాటి వల్ల ప్రయోజనాలు పరిమిత స్థాయికే చేరుకున్నాయి. పీఏసీఎస్‌ల ద్వారా 1,100 ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలని ఇటీవలే నిర్ణయించాం’’అని అమిత్‌షా తెలిపారు. వ్యవసాయ మౌలిక నిధికి మద్దతుగా నిలవాలి బ్యాంక్‌లను కోరిన వ్యవసాయ శాఖ వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన నిధి (రూ.లక్ష కోట్లు)కి ప్రోత్సాహంగా నిలవాలని కేంద్ర వ్యవసాయ శాఖ కోరింది. సాగు రంగంలో మౌలిక వసతులు కల్పించేందుకు ఇది తప్పనిసరి అవసరంగా పేర్కొంది. సాగు అనంతరం నిల్వ వసతుల నిర్వహణ, కమ్యూనిటీ సాగు తదితర చర్యల కోసం 2020 జూలై 8న కేంద్ర సర్కారు వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనా నిధి (ఏఐఎఫ్)ని ప్రారంభించింది. ఈ పథకం కింద 2025–26 నాటికి రూ.లక్ష కోట్లను బ్యాంక్‌లు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఇది వడ్డీ రాయితీ, కేంద్ర ప్రభుత్వ హామీతో కూడిన పథకం. ఇందుకోసం కొత్త ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహుజా ప్రారంభించారు. ‘‘నెల రోజుల పాటు (ఆగస్ట్ 15 వరకు) ఇది కొనసాగుతుంది. ఈ కాలంలో రూ. 7,200 కోట్లను మంజూరు చేయాలి. ఈ వీడి యో కాన్ఫరెన్స్ సమావేశానికి ప్రభుత్వ, ప్రైవేటు, ప్రాంతీయ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, కోపరేటివ్ బ్యాంక్‌ల ఎగ్జిక్యూటివ్‌లు హాజరయ్యారు’’అని అహుజా తెలిపారు. దేశంలో వ్యవసాయ మౌలిక ప్రాజెక్టులకు గణనీయమైన అవకాశాలున్నాయని చెప్పారు. -
నైపుణ్యాల కొరతే అడ్డు
న్యూఢిల్లీ: నిరుద్యోగం పట్ల ప్రజల్లో ఉన్న ఆలోచనా ధోరణి సరైంది కాదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. నరేంద్ర మోదీ సారథ్యంలో 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చే నాటికే నిరుద్యోగ సమస్య వారసత్వంగా వచి్చందని, అప్పటికి పని ప్రదేశాల్లోని 42 కోట్ల ఉద్యోగుల్లో 31 కోట్ల మందికి నైపుణ్యాలు లేవని చెప్పారు. ‘‘నిరుద్యోగం పట్ల ఈ విధమైన ఆలోచన సరైంది కాదు. ఎందుకంటే ఎన్నో ఉద్యోగాలు, సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు కలి్పంచాం. కానీ వారికి నైపుణ్యాలు అవసరం. స్వాతంత్య్రం వచి్చన 65 ఏళ్ల తర్వాత కూడా ప్రతి నలుగురిలో ముగ్గురికి నైపుణ్యాలు లేవు. గత తొమ్మిదేళ్లుగా మేము దీన్ని పరిష్కరించే క్రమంలో ఉన్నాం’’అని కేంద్ర నైపుణ్యాల అభివృద్ధి శాఖ మంత్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో కరోనా కాలం రెండున్నరేళ్లను మినహాయించి చూస్తే, తాము 6.25 కోట్ల యువతలో నైపుణ్యాలు కలి్పంచామని చెప్పారు. ‘‘ప్రస్తుత ప్రభుత్వం, ప్రధాని మోదీ దృష్టి అంతా స్థానికంగానే ఎన్నో ఆర్థిక అవకాశాలు కలి్పంచాలన్న దానిపైనే. ఎన్నో దశాబ్దాలుగా ఉన్న సంప్రదాయ కళలు, నైపుణ్యాలను.. ఉత్పత్తుల ఆవిష్కరణ దిశగా పునరుజ్జీవింపజేయాల్సి ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ను చేరుకునేలా అనుసంధాన కలి్పంచాలి’’అంటూ ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు. -
రూ. 7.27 లక్షల వరకు ఆదాయ పన్ను ఉండదు
ఉడుపి (కర్ణాటక): మధ్యతరగతి వర్గాలకు కేంద్ర ప్రభుత్వం పన్నులపరంగా పలు ప్రయోజనాలు కలి్పంచిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వార్షికంగా రూ. 7.27 లక్షల వరకు ఆదాయం పొందే వారికి కొత్త పథకంలో పన్ను భారం నుంచి మినహాయింపు ఇవ్వడం కూడా ఇందులో ఒకటని వివరించారు. 2023–24 బడ్జెట్లో రూ. 7 లక్షల వరకు ఆదాయంపై మినహాయింపు ప్రకటించినప్పుడు ఆ పరిమితికి మించి కాస్తంతే ఎక్కువగా ఆర్జిస్తున్న వారి పరిస్థితి ఏమిటని కొన్ని వర్గాల్లో సంశయాలు తలెత్తాయని ఆమె తెలిపారు. దీంతో అదనంగా ఆర్జించే ప్రతి రూపాయిపై ఏ స్థాయి నుంచి పన్ను కట్టాల్సి ఉంటుందనే అంశం మీద తమ బృందం మళ్లీ కసరత్తు చేసిందని వివరించారు. మొత్తం మీద ప్రస్తుతం రూ. 7.27 లక్షల వరకు పన్ను లేదని, ఆ తర్వాతే ట్యాక్స్ వర్తిస్తుందని మంత్రి చెప్పారు. కొత్త స్కీములో స్టాండర్డ్ డిడక్షన్ లేదంటూ ఫిర్యాదులు రావడంతో దాన్ని కూడా చేర్చినట్లు చెప్పారు. -
నాణ్యమైన ప్లాస్టిక్ ఉత్పత్తులపై దృష్టి పెట్టండి
ముంబై: నాణ్యమైన, మన్నికైన ప్లాస్టిక్ ఉత్పత్తులపై దృష్టి పెట్టాలంటూ ప్లాస్టిక్ పరిశ్రమకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. ఇందుకు టెక్నాలజీని వినియోగించుకోవాలని కోరారు. అలాగే, ఆవిష్కరణల ద్వారా అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని పెంచుకుని, ఎగుమతులను ఇతోధికం చేసుకోవాలని సూచించారు. ‘‘నాణ్యత తక్కువగా ఉన్న ఉత్పత్తులు, దేశీయంగా తయారైనా లేదా దిగుమతి చేసుకున్నవి అయినా వాటికి చెక్ పెట్టేందుకు నాణ్యతా తనిఖీలను, నియంత్రణలను తీసుకొస్తున్నాం. ఇవి ప్లాస్టిక్ పరిశ్రమకు, మన వినియోగదారుల ప్రయోజనాలకు హాని చేస్తున్నాయి. అంతేకాదు భారతదేశ ప్రతిష్టకు నష్టం చేస్తున్నాయి’’అని ‘ప్లాస్టిక్ పరిశ్రమ వృద్ధికి సంబంధించిన టెక్నాలజీ సదస్సు’లో భాగంగా మంత్రి పేర్కొన్నారు. ఈ సదస్సును పరిశ్రమ మండలి అయిన ఏఐపీఎంఏ నిర్వహించింది. ప్లాస్టిక్ పరిశ్రమ సామర్థ్యం, సమస్యల పట్ల కేంద్రం సానుకూల దృక్పథంతో ఉన్నట్టు మంత్రి చెప్పారు. రీసైకిల్ కీలకం.. ‘‘ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసే విషయంలో లేదా ప్లాస్టిక్ ముడి పదార్థాలను తిరిగి వినియోగించే విషయంలో పరిశ్రమకు ఎలా మద్దతుగా నిలవగలమనే దానిపై దృష్టి సారించాం. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ మరింత సమర్థవంతంగా, కచ్చితంగా నిర్వహించడం కీలకం. అంతర్జాతీయంగా ప్లాస్టిక్ రీసైకిల్ సగటు 9 శాతంగానే ఉంది. అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లో 4 శాతంకంటే తక్కువే ఉంది. కానీ మనం మన ప్లాస్టిక్ వినియోగంలో 13 శాతాన్ని రీసైకిల్ చేస్తూ ప్రపంచంలోనే ముందున్నాం. రానున్న రోజు ల్లో ఇది మరింతగా పెరుగుతుంది’’అని మంత్రి పీయూష్ గోయల్ వివరించారు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకు రావాలని, టెక్నాలజీ, పరిశోధన, అభివృద్ధి కోసం భాగస్వామ్యాలతో పరిశ్రమ చొరవ చూపించాలని కోరారు. ఈ రంగంలో స్టార్టప్‌లకు ఆహ్వానం పలుకుతున్నట్టు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో జీడీపీలో ప్లాస్టిక్ పరిశ్రమ వాటా మరింత పెరగాలని పిలుపునిచ్చారు. ‘‘వచ్చే పదేళ్లలో పరిశ్రమ పరిమాణం మూడింతలు కావాలి. రెట్టింపు స్థాయిలో ఉపాధి కలి్పంచాలి. ఎగుమతులను రెండింతలు చేసుకోవాలి’’అని కోరారు. -
కేబినెట్ భేటీకి దూరం.. కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా?
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం 10 గంటలకు కేంద్ర మంత్రిమండలి సమావేశం ప్రారంభమవ్వగా.. కిషన్‌రెడ్డి దూరంగా ఉన్నారు. ఢిల్లీలోనే ఉన్నా సమావేశానికి హాజరు కాలేదు. ఇటు మంత్రిత్వశాఖ అధికారులు కూడా ఆయన ఇంటికి వెళ్లలేదు. దీంతో కేంద్ర మంత్రిత్వపదవికి ఆయన రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బాధ్యతలు కిషన్ రెడ్డికి, పక్కలో ఈటల ఇక కిషన్ రెడ్డి 2021 నుంచి కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. అంతకుముందు 2019 మే 30 నుంచి 2021 వరకు హోం వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేశారు. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణకు ముందే కిషన్ రెడ్డి అధికారికంగా తన నిర్ణయాన్ని వెల్లడించవచ్చు. కాగా పలు రాష్ట్రాల సారథులను మారుస్తూ బీజేపీ అధిష్టానం మంగళవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా హైకమాండ్ నియమించింది. బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ బాధ్యతలను ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు అప్పగించింది. (చదవండి: బండి సంజయ్ ను ఎందుకు తప్పించారంటే.?) బాధ్యతలు ఇచ్చారు కానీ అధికారం అంతంతేనా? అయితే తెలంగాణ అధ్యక్ష పదవిపై కిషన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించాక ఇప్పటి వరకు ఆయన స్పందించనూ లేదు. మీడియాతో మాట్లాడటానికి సైతం నిరాకరిస్తున్నారు. ఇప్పటి వరకు లేని ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ పదవిని ఇప్పుడెందుకు సృష్టించారని, పూర్తి స్థాయిలో అధికారం ఇవ్వకుండా బాధ్యతలు ఎలా ఉంటాయన్న భావనలో కిషన్ రెడ్డి ఉన్నట్టు సమాచారం. తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినా.. ఈటల రాజేందర్ రూపంలో మరో పోటీదారు కిషన్ రెడ్డికి ఉన్నట్టే. రేపటి ఎన్నికల్లో అభ్యర్థులను ఎవరు ఖరారు చేస్తారు? తెలంగాణ అసెంబ్లీ ఐదేళ్ల కాల పరిమితి డిసెంబర్ తో ముగియనుంది. ఇప్పుడున్నది జులై. అంటే ముందున్న నాలుగు నెలలు ఎన్నికల వాతావరణమే. ఇప్పటివరకు చాలా నియోజకవర్గాల్లో బీజేపీకి అభ్యర్థులెవరో తెలియని పరిస్థితి. ఇక ఇప్పటికే బండి సంజయ్ కొందరికి హామీ ఇచ్చినా.. పార్టీ ఆమోద ముద్ర ఎంత వరకు వేస్తుందన్నది అనుమానమే. ఇప్పుడు అభ్యర్థుల ఖరారు విషయంలోనూ పార్టీ అధిష్టానం ఎవరిపై ఆధారపడుతుందన్నది జవాబు లేని ప్రశ్నే. సమన్వయం సవాలే అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నా.. పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ గా ఈటల తన వంతుగా కొన్ని పేర్లు తీసుకురావొచ్చు. అలాగే ఇతర పార్టీల నుంచి కొంత మందిని తీసుకురావాలన్నది ఈటల వ్యూహంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ లో అసమ్మతి నేతలను తమ వైపుకు తిప్పుకుంటే పార్టీకి ప్రయోజనం ఉంటుందన్నది ఈటల భావనగా కనిపిస్తోంది. పార్టీ హైకమాండ్ కూడా ఈ విషయంలో ఈటల వ్యూహం పట్ల సానుకూలంగా ఉంది. అయితే ఇన్నాళ్లు పార్టీకి సేవ చేసిన కరడు గట్టిన కమలనాథులు ఈ విషయంలో కిషన్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. చదవండి: బీజేపీ ఇన్చార్జి తరుణ్‌ఛుగ్ స్థానంలో భూపేంద్రయాదవ్? -
స్టార్టప్ వ్యవస్థ బలోపేతానికి కృషి
గురుగ్రామ్: అంకుర సంస్థలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. స్టార్టప్‌ల వ్యవస్థను ప్రోత్సహించేందుకే తప్ప నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రయతి్నంచబోదని ఆయన స్పష్టం చేశారు. ఆ వ్యవస్థలో భాగమైన వర్గాలే స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. స్టార్టప్20 సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. అంకుర సంస్థల పురోగతికి అవరోధాలు కలి్పంచాలనేది ప్రభుత్వల ఉద్దేశం కాదనే స్పష్టమైన సందేశం స్టార్టప్‌లకు చేరాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. భారత్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని అంకుర సంస్థలను ఆహ్వానించారు. 2030 నాటికి అంకుర సంస్థల వ్యవస్థలోకి జీ20 దేశాలన్నీ కలిసి ఏటా 1 లక్ష కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టేలా చూసేందుకు స్టార్టప్20 గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలు సాకారమైతే స్టార్టప్‌లకు మరిన్ని ప్రయోజనాలు చేకూరగలవని గోయల్ చెప్పారు. మంచి స్టార్టప్‌లకు నిధుల కొరత లేదు: అమితాబ్ కాంత్ సరైన అంకుర సంస్థలకు పెట్టుబడుల కొరతేమీ లేదని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు. పటిష్టమైన వ్యాపార విధానాలున్న మంచి స్టార్టప్‌లకు నిధుల లభ్యత బాగానే ఉందని ఆయన చెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు స్టార్టప్ వ్యవస్థ చురుగ్గా పని చేస్తోందని స్టార్టప్20 శిఖర్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భారత్‌లో 1,00,000 పైచిలుకు స్టార్టప్‌లు, 108 యూనికార్న్‌లు (బిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే అంకురాలు) ఉన్నాయని అమితాబ్ కాంత్ తెలిపారు. -
జూలై 3న కేంద్ర కేబినెట్ భేటీ.. ఆరోజే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ!
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణ వార్తలు జోరందుకుంటున్న వేళ కీలక భేటీకి పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్రమోదీ. ఆయన అధ్యక్షతన కేంద్ర కేబినెట్ జూలై 3న సమావేశం కానుంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్లో జూలై 3న కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్లో ఉన్న కేంద్ర మంత్రులు, సహాయ, స్వతంత్ర మంత్రులంతా ఈ భేటీకి హాజరవుతారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, జూలై మూడో వారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండగా.. కొన్ని రోజుల ముందు మంత్రి మండలి సమావేశం జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక జూన్ 28న మోదీ నేతృత్వంలో బీజేపీ ఆగ్రనేతలు సమావేశమైన సంగతి తెలిసిందే. కేంద్ర హోంమత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నేతలతో ప్రధాని మోదీ బుధవారం అర్థరాత్రి వరకు చర్చలు జరిపారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న కీలకమైన అసెంబ్లీ ఎన్నికలతోపాటు (రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరం), వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ సన్నద్ధత గురించి ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. అదే విధంగా ప్రభుత్వంలో, రాష్ట్ర స్థాయిలో పార్టీలో సంస్థాగత మార్పుల గురించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇక బుధవారం జరిగిన సమావేశంలోనే కేబినెట్లో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇది జరిగిన మరుసటి రోజే కేబినెట్ భేటీ ప్రకటన వెలువడింది. చదవండి: ఉత్తరాదిని వణికిస్తున్న భారీ వర్షాలు.. పలు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్! -
మేడిన్ ఇండియా ఈ-చిప్: 2024 చివరికల్లా మార్కెట్లోకి..
న్యూఢిల్లీ: భారత్‌లో తయారైన (మేడ్ ఇన్ ఇండియా) తొలి ఈ–చిప్‌లు 2024 డిసెంబర్ నాటికి మార్కెట్లోకి వస్తాయని కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రకటించారు. ఏడాదిలోపు నాలుగు నుంచి ఐదు వరకు సెమీకండక్టర్ ప్లాంట్లు దేశంలో ఏర్పాటు కావొచ్చని చెప్పారు. అమెరికాకు చెందిన కంప్యూటర్ మెమొరీ చిప్ తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీస్ 2.75 బిలియన్ డాలర్ల వ్యయంతో గుజరాత్లో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు చేసిన ప్రకటనను మంత్రి గుర్తు చేశారు. ఈ ప్లాంట్‌కు అనుసంధానంగా 200 చిన్న యూనిట్లు కూడా ఏర్పాటు అవుతాయని మంత్రి చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, భారత ప్రధాని మోదీ సంయుక్త ప్రకటన అనంతరం అశ్వని వైష్ణవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. మైక్రాన్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి పన్ను నిబంధనలు, ఫ్యాక్టరీ డిజైన్, భూ కేటాయింపులపై ఒప్పందం కూడా పూర్తయినట్టు తెలిపారు. మైక్రాన్ టెక్నాలజీస్ నుంచి మొదటి చిప్ ఆరు త్రైమాసికాల తర్వాత మార్కెట్లోకి వస్తుందన్నారు. మైక్రాన్ ఏర్పాటు చేసే 2.75 బిలియన్ డాలర్ల ప్రాజెక్టుకు సంబంధించి సంస్థ సొంతంగా రూ.825 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుండగా, మిగిలిన మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చనుండడం గమనార్హం. ఈ ప్లాంట్‌తో మొత్తం 20వేల ఉద్యోగాలు రానున్నాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం విలువ బిలియన్ డాలర్ల మేర ఉంటుందని అశ్వని వైష్ణవ్ తెలిపారు. సెమీకండక్టర్ పథకం సవరణ సెమీకండక్టర్ పథకాన్ని సవరించామని, కనుక గతంలో దరఖాస్తు చేసిన సంస్థలను మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని కోరినట్టు మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. లేదా దరఖాస్తులు సవరించుకోవాలని సూచించినట్టు చెప్పారు. సవరించిన పథకం కింద సెమీకండక్టర్ ప్లాంట్ వ్యయంలో 50 శాతాన్ని కేంద్రమే ద్రవ్య ప్రోత్సాహకం కింద సమకూరుస్తోంది. గతంలో ఇది 30 శాతంగానే ఉండేది. -
Manipur: కేంద్రమంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో హింసాకాండ ఇంకా కొనసాగుతోంది. రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు నేటికి చల్లారడం లేదు. నెల రోజులు దాటినా రాష్ట్రంలో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. తాజాగా వెయ్యి మందికిపైగా నిరసనకారులు ఇంఫాల్‌లోని కేంద్రమంత్రి ఆర్రంకే జన్ సింగ్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. దాడి సమయంలో గుంపుగా ఎగబడిన జనం మంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరినట్లు ఆయన నివాస భద్రతా సిబ్బంది వెల్లడించారు. అయితే ఘటన జరిగిన సమయంలో మంత్రి ఇంఫాల్‌లోని ఇంట్లో లేరని మణిపూర్ అధికారులు తెలిపారు. ఇంఫాల్‌లో కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఆందోళనకారులు కొంగ్బాలోని మంత్రి ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో మంత్రి నివాసంలో తొమ్మిది మంది ఎస్కార్ట్ సిబ్బంది, ఐదుగురు సెక్యూరిటీ గార్డ్స్, ఎనిమిది మంది అడిషనల్ గార్డ్స్ విధుల్లో ఉన్నారని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కాగా భారీగా నిరసనకారులు దూసుకురావడంతో వారిని అడ్డుకోలేకపోయామని ఎస్కార్ట్ కమాండర్ ఎల్ దినేశ్వర్ సింగ్ వెల్లడించారు. మంత్రి ఇంటి ముందు, వెనక అన్ని వైపుల నుంచి నుంచి బాంబులు విసరడంతో పరిస్థితిని నియంత్రించలేకపోయామని పేర్కొన్నారు. ముకదాడి చేసిన వారిలో దాదాపు 1,200 మంది ఉన్నారని తెలిపారు. కాగా రంజన్ సింగ్ ఇంటిపై దాడి జరగడం ఇది రెండోసారి. మే నెలలో కూడా ఇంటిపై దాడికి యత్నం జరగ్గా.. భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపి నిరసనకారులను చెదరగొట్టారు. చదవండి: గవర్నర్ Vs సీఎం స్టాలిన్:సెంథిల్ బాలాజీ అంశంలో మరో వివాదం.. #WATCH | Manipur: A mob torched Union Minister of State for External Affairs RK Ranjan Singh's residence at Kongba in Imphal on Thursday late night. https://t.co/zItifvGwoG pic.twitter.com/LWAWiJnRwc — ANI (@ANI) June 16, 2023 ఇక ఆర్కే రంజన్ సింగ్ ప్రస్తుతం మోదీ కేబినెట్లో విదేశీ వ్యవహారాలు, విద్యాశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. అయితే ఇంటిపై దాడి జరిగిన సమయంలో ఆయన అధికారిక పనిపై కేరళలో ఉన్నట్లు మంత్రి రంజన్ సింగ్ చెప్పారు. తన ఇల్లు పెట్రోలు బాంబుల దాడిలో దెబ్బతిందని తెలిపారు. మణిపూర్‌లో శాంతి స్థాపనకు అందరూ కలిసి రావాలని కేంద్రమంత్రి కోరారు. కాగా రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ఆయన మెయిటీ, కుకీ వర్గానికి చెందిన ప్రముఖులతో చర్చలు జరిపారు. అలాగే హింసను ప్రేరేపిస్తోన్న స్థానిక నేతలను గుర్తించి, చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి కూడా లేఖ రాశారు. -
విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల.. టాప్ 10లో హైదరాబాద్‌కు దక్కని చోటు
సాక్షి, న్యూఢిల్లీ/రాయదుర్గం: దేశంలోని విద్యాసంస్థల్లో అన్ని విభాగాల్లో కలిపి ఐఐటీ–మద్రాస్ అత్యుత్తమ విద్యాసంస్థగా నిలిచింది. మొత్తం విభాగాల్లో ఐఐటీ–మద్రాస్‌కు మొదటిస్థానం దక్కడం ఇది ఐదోసారి కాగా, ఇంజనీరింగ్ విభాగంలోనూ వరుసగా ఎనిమిదోసారి నంబర్‌వన్ స్థానాన్ని నిలుపుకోవడం విశేషం. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్–2023) నివేదికను విద్య, విదేశీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి డాక్టర్ రాజ్‌కుమార్ రంజన్ సింగ్ సోమవారం విడుదల చేశారు. బోధనా అభ్యాసం, మౌలిక వసతులు, పరిశోధన, వృత్తిపరమైన అభ్యాసం, గ్రాడ్యుయేషన్ ఫలితం, విద్యార్థులు పొందే ఉపాధి అవకాశాలు వంటి అంశాల ఆధారంగా విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, లా, మెడికల్ కాలేజీలకు ర్యాంకులను ప్రకటించారు. వీటిలో అన్ని కేటగిరీల్లో ఐఐటీ–మద్రాస్ తొలిస్థానంలో ఉండగా, ఐఐఎస్సీ–బెంగళూరు రెండో స్థానంలో, ఐఐటీ–ఢిల్లీ మూడో స్థానంలో నిలిచాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఐఐటీ–హైదరాబాద్ 14వ స్థానం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్‌సీయూ) 20వ స్థానం, నిట్–వరంగల్ 53, ఉస్మానియా యూనివర్సిటీ 64, వడ్డేశ్వరంలోని కేఎల్ కాలేజ్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ 50, వైజాగ్‌లోని ఆంధ్రా యూనివర్సిటీ 76వ స్థానంలో నిలిచాయి. ర్యాంకింగ్స్ కోసం 200కు పైగా యూనివర్సిటీలను సర్వేచేశారు. దరఖాస్తు చేసిన దాదాపు 8వేల సంస్థల నుంచి 2023 ర్యాంకులను ప్రకటించారు. అత్యుత్తమ వర్సిటీల విభాగంలో... ఇక అత్యుత్తమ వర్సిటీల విభాగంలో ఐఐఎస్సీ–బెంగళూరు తొలి స్థానంలో ఉండగా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 10వ స్థానం, ఉస్మానియా యూనివర్సిటీ 36, హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 84వ స్థానంలో నిలిచింది. ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీ 43, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ 60వ స్థానం దక్కించుకున్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 8వ, నిట్–వరంగల్ 21వ స్థానంలో ఉన్నాయి. పరిశోధన విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 14వ స్థానంలో, హెచ్‌సీయూ 25వ స్థానంలో నిలిచాయి. మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎం–వైజాగ్ 29వ, ఐసీఎఫ్ఏఐ–హైదరాబాద్ 40వ స్థానంలో ఉన్నాయి. ఫార్మసీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్–హైదరాబాద్ తొలి స్థానంలో ఉండగా, న్యాయ విభాగంలో నల్సార్ యూనివర్సిటీ 3వ స్థానంలో ఉంది. ఇన్నోవేషన్ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 3వ స్థానంలో నిలిచింది. వ్యవసాయ విభాగంలో.. ఇక వ్యవసాయం, దాని అనుబంధ విభాగాల్లో గుంటూరులోని ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ 20వ, వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 31వ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్–హైదరాబాద్ 32వ స్థానంలో ఉన్నాయి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ కోసం https://www.nirfindia.org/ వెబ్సైట్లో చూడొచ్చు. సమష్టి కృషితోనే సాధ్యం జాతీయ, అంతర్జాతీయస్థాయిలో మంచి గుర్తింపే లక్ష్యం. సమష్టి కృషితోనే సాధ్యం. దేశంలో టాప్– 10 విశ్వవిద్యాలయాల్లో హెచ్సీయూకు మళ్లీ ర్యాంక్‌ను పొందడం ఆనందంగా ఉంది. ఉత్తమ పద్ధతులు, నాణ్యతతో కూడిన బోధన, పరిశోధనల కారణంగా ఈ ర్యాంకు సాధ్యమైంది. భవి ష్యత్‌లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు కృషి చేస్తాం. -ప్రొ. బీజే రావు, వైస్‌చాన్స్‌లర్ హెచ్‌సీయూ మానవాళి కోసం టెక్నాలజీ ఈ విజయంలో విద్యార్థులు, అధ్యాపకులతోపాటు, పూర్వ విద్యార్థుల కృషి కూడా ఉంది. మానవాళి కోసం సాంకేతిక పరిజ్ఞానం అనే నినాదంతో ఐఐటీహెచ్ ముందుకెళ్తోంది. – ప్రొ. బీఎస్ మూర్తి, ఐఐటీహెచ్ డైరెక్టర్ IIT Madras ranked best institution followed by IISC Bengaluru and IIT Delhi as per the NIRF Ranking released by the Union Ministry of Education pic.twitter.com/yAKN3uVnuU— ANI (@ANI) June 5, 2023 IISC, Bangalore ranked best university followed by JNU and Jamia Millia Islamia as per the NIRF Ranking released by the Union Ministry of Education pic.twitter.com/Jvr1OixSHz— ANI (@ANI) June 5, 2023 ఫార్మసీ విభాగంతో హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మొదటి స్థానంలో నిలిచింది. జామియా హమ్దర్ద్, బిట్స్ పిలానీ రెండో, మూడో స్థానాలు సాధించాయి.న్యాయ విద్యలో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, దిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని ‘నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా’ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. దీనికి సంబంధించిన సమగ్ర వార్తకథనం మా ఎడ్యుకేషన్ వెబ్ సైట్లో చదవండి -
కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
గువాహటి: కేంద్రమంత్రి ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన అస్సాంలోని గువాహటిలో చోటు చేసుకొంది. ఆదివారం ఉదయం దిబ్రూఘఢ్ వెళ్లాల్సిన ఇండిగో విమాన ఇంజన్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో విమానాన్ని గువాహటిలోని లోక్‌ప్రియ గోపినాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. లాగే కేంద్ర పెట్రోలియం, సహజవాయుశాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలితోపాటు ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశాంత్ ఫుకాన్, తెరష్ గోవాలా ఉన్నారు ప్రమాద సమయంలో విమానంలో 150కి పైగా ప్రయాణికులు ఉండగా వారంతా సురక్షింగా ఉన్నట్లు సమాచారం. కాగా విమాన ఘటనపై ఐ కేంద్ర మంత్రి స్పందించారు. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి విమానంలో బల్దేరానని తెలిపారు. విమానం టేకాఫ్ అయ్యాక 15 నుంచి 20 నిమిషాల తర్వాత దిబ్రూగఢ్‌లో దిగాల్సి ఉందన్నారు. కానీ సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి గువాహాటిలో అత్యవసరంగా ల్యాండ్ అయిందని, తాము సురక్షితంగా ఉన్నామని తెలిపారు. చదవండి:Odisha Train Accident: వామ్మో రైలా..! రైల్వే ఆడిట్ రిపోర్ట్‌లో ఏముంది? A Dibrugarh-bound IndiGo flight was diverted to Guwahati’s Lokpriya Gopinath Bordoloi International after the pilot of the plane announced snag in engine of the aircraft. Over 150 passengers were travelling on the flight, including Union Minister of State for Petroleum and… pic.twitter.com/umZb0sm75V — ANI (@ANI) June 4, 2023 -
చంపేస్తామంటూ కేంద్రమంత్రికి బెదిరింపు కాల్.. ఈ ఏడాదిలో రెండోసారి
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. సోమవారం ఢిల్లీలోని గడ్కరీ నివాసానికి ఈ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మంత్రి కార్యాలయం నుంచి నితిన్ గడ్కరీకి ప్రాణహాని ఉన్నట్లు తమకు ఫిర్యాదు అందినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వివరాల ఆధారంగా ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. కాగా నితిన్ గడ్కరీకి తన కార్యాలయంలో హత్య బెదిరింపు కాల్స్ రావడం ఈ ఏడాది ఇది రెండోసారి. అంతకుముందు జనవరిలో, మహారాష్ట్రలోని అతని నివాసం, కార్యాలయానికి అలాంటి కాల్స్ వచ్చాయని, కాల్ చేసిన వ్యక్తి కర్ణాటకలోని బెలగావిలో జైలులో ఉన్న వ్యక్తిగా గుర్తించామని నాగ్‌పూర్ పోలీసులు తెలిపారు. చదవండి: షాకిచ్చిన ఓటర్లు.. మృతి చెందిన అభ్యర్థికి తిరుగులేని విజయం -
‘వచ్చే ఎన్నికల్లో పోస్టర్లు, బ్యానర్లు అంటించను.. అదే నన్ను గెలిపిస్తుంది’
న్యూఢిల్లీ: ఎన్నికల్లో విజయం కోసం పోస్టర్లు, బ్యానర్లపై కాకుండా సేవా రాజకీయాలపై ఆధారపడాలని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తన నియోజకవర్గంలో ఎలాంటి పోస్టర్లు అంటించబోనని, ఓటర్లు తన సేవను, చేసిన పనిని చూసే ఓట్లు వేయాలని పేర్కొన్నారు. అదే సమయంలో, రాబోయే ఎన్నికల్లో తనకు పోలయ్యే ఓట్లు సంఖ్యను కూడా పెంచుకుంటానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లోని సికార్ జిల్లా ఖచరియావాస్ గ్రామంలో మాజీ ఉపాధ్యక్షుడు భైరాన్ సింగ్ షెకావత్ వర్ధంతి కార్యక్రమంలో హాజరైన గడ్కరీ ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను గతంలో కష్టతరమైన నియోజకవర్గం నుంచి పోటీ చేశాను. ఆ సమయంలో అక్కడి నుంచి పోటీ చేయవద్దని పలువురు సూచించారు. అయినా పట్టుదలతో పోరాడాను. అలానే వచ్చే ఎన్నికల్లో పోస్టర్లు, బ్యానర్లు వేయకూడదని నిర్ణయించుకున్నాను. తనకు ఓటు వేయాలనుకున్న వాళ్లు వేస్తారు, ఇష్టం లేనివాళ్లు వేయరు’’ అని ఆయన అన్నారు. 'సేవా రాజకీయాలు', 'అభివృద్ధి కార్యక్రమాలు', గ్రామాల్లోని పేదల సంక్షేమం, పేద ప్రజలకు ఆరోగ్య సదుపాయాలు, యువతకు ఉపాధి, పిల్లలకు మంచి విద్య అందించడం ద్వారా ఓట్లు లభిస్తాయి తప్ప పోస్టర్లు, బ్యానర్లతో కావని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోడ్, ప్రతిపక్ష ఉపనేత సతీష్ పూనియా, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు. చదవండి: కర్ణాటక ఫలితాలు: కరెంటు బిల్లులు కాంగ్రెస్ నుంచి వసూలు చేసుకోండి! -
భారత్ వైపు చూస్తున్న ప్రపంచం
ముంబై: ప్రపంచం భారత్, భారత పరిశ్రమల వైపు చూస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. భారత పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, ఎగుమతులను పెంచుకోవాలని సూచించారు. ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలు, కొత్త మార్కెటింగ్ విధానాలు, బ్రాండింగ్ ఉత్పత్తులతో దేశంలోని వ్యవస్థాపక సామర్థ్యాలు భారత్ అసలైన సామర్థ్యాన్ని వెలుగులోకి తీసుకొస్తామయన్నారు. 49వ జెమ్ అండ్ జ్యుయలరీ అవార్డుల కార్యక్రమంలో భాగంగా మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారు. ‘‘ఈ నెల 24న యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ మంత్రులతో (ఐస్లాండ్, లీచెస్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్) సమావేశం ఉంది. వారు భారత్‌తో వాణిజ్య చర్చలకు సుముఖంగా ఉన్నారు. గల్ఫ్ దేశాలు, రష్యా కూడా భారత్‌తో చర్చలకు ఆసక్తిగా ఉన్నాయి. కనుక దేశ పారిశ్రామికవేత్తలు దీన్ని అవకాశంగా మలుచుకోవాలి’’అని మంత్రి సూచించారు. ప్రభుత్వం వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు నిజాయితీగా కృషి చేస్తోందంటూ, పరిశ్రమ నైతిక విధానాలు అనుసరించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ప్రభుత్వం యూఎస్, జీ7 దేశాలతో చర్చించడం ద్వారా ఆంక్షలు లేకుండా చూడాలని ఇదే సమావేశంలో భాగంగా జెమ్, జ్యుయలరీ ఎగుమతి ప్రోత్సాహక మండలి చైర్మన్ విపుల్ షా మంత్రిని కోరారు. -
వాళ్లు కన్పిస్తే కాల్చి పడేయాలి.. కేంద్ర మంత్రి తీవ్ర వ్యాఖ్యలు..
పట్నా: ఇటీవల హత్యకు గురైన ఉత్తర్‌ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌ను పొగుడుతున్న వాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి అశ్విని చౌబె. అలాంటి వాళ్లు కన్పించిన వెంటనే కాల్చి పడేయాలని వ్యాఖ్యానించారు. బిహార్‌లో కూడా యోగి మోడల్ ప్రభుత్వం అవసరం ఉందన్నారు. పట్నాలో శుక్రవారం ప్రార్థనల అనంతరం కొందరు అతీక్ అహ్మద్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన అశ్విని చౌబె వాళ్లపై ఫైర్ అయ్యారు. బిహార్‌లో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, తక్షణమే వాళ్లను కాల్చిపడేయాలన్నారు. మోదీ, యోగికి వ్యతిరేకంగా వాళ్లు నినాదాలు చేసిన తీరు బాధాకరమన్నారు. క్రిమినల్స్, మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న యోగి మార్క్ పాలన బిహార్‌లోనూ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. బిహార్‌లో ప్రస్తుతం కుటంబ, కుల రాజకీయాలు చేసే వారే అధికారంలో ఉన్నారని కేంద్రమంత్రి మండిపడ్డారు. సీఎం నితీశ్ కుమార్ బీజేపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వాళ్లకు తగిన రీతిలో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కాగా.. గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అశ్రఫ్‌ను ముగ్గురు యువకులు పోలీసులు, మీడియా ముందే కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముగ్గురు నిందితులు వెంటనే పోలీసులకు లొంగిపోయారు. ఫేమస్ అయ్యేందుకే తాము ఈ హత్యలు చేసినట్లు విచారణలో అంగీకరించారు. చదవండి: 35 రోజులుగా వేట.. అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు! -
జై శ్రీ అన్నా
గతంతో పోల్చితే చిరుధాన్యాల పెద్ద ఉపయోగాల గురించి పల్లె, పట్టణం అనే తేడా లేకుండా విస్తృత అవగాహన పెరిగింది. దీనికి సాక్ష్యంగా నిలిచే వీడియోను ప్రధానమంత్రి నరేంద్రమోదీ షేర్ చేశారు. ‘వైబ్రెంట్ విలేజెస్’ కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఒక గ్రామంలోకి వెళ్లారు. ఆ గ్రామంలోని ఒక మహిళ మంత్రిగారికి చిరుధాన్యాలతో చేసిన సంప్రదాయ వంటల రుచి చూపించడమే కాదు... జొన్నె రొట్టె నుంచి రాగి లడ్డు వరకు చిరుధాన్యాలు చేసే మంచి గురించి మంచిగా మాట్లాడింది. ప్రధాని ప్రశంస అందుకొంది. ‘ప్రతి పల్లెలో ఇలాంటి దృశ్యం కనిపించాలి’... ‘క్షేత్రస్థాయి నుంచి మొదలైన స్పృహ, చైతన్యం వేగంగా విస్తరిస్తుంది’... ‘కనుల విందు చేసే వీడియో’... ఇలాంటి కామెంట్స్ కనిపించాయి. -
అమిత్ షా సభ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వేడి
-
తెలంగాణాలో అమిత్ షా పర్యటన
-
సివిల్ సర్వీస్ అధికారులపై బీజేపీ నేత ‘బందిపోటు’ కామెంట్లు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీపీఎస్సీ) ద్వారా నియమితులైన అధికారుల్లో చాలామంది బందిపోట్లే అంటూ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోడి దొంగకు అయినా శిక్ష పడుతుందేమో గానీ మినరల్ మాఫియాను నడుపుతున్న అధికారులను అస్సలు టచ్ చేయలేం అన్నారు. ఈ మేరకు బాలాసోర్ జిల్లాలో బలియాపాల్‌లోని ప్రభుత్వ పాఠశాల స్వర్ణోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒడిశా ఎంపీ, గిరిజన వ్యవహారాలు, జలశక్తి సహాయ మంత్రి బిశేశ్వర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తాను ఢిల్లీలో ఉండగా సివిల్ సర్వీస్ కార్యాలయం తన నివాసం వెనకాలే ఉండేదని, దానిపట్ల ఎంతో గౌరవం ఉండేదన్నారు. అప్పట్లో తనకు ఆ సర్వీస్ ద్వారా నియమితులైన వారందరూ అత్యంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తులని, ఎల్లప్పుడూ ఉన్నత స్థానాల్లో ఉంటారనే భావన ఉండేదన్నారు. కానీ ఇప్పుడు తన ఆలోచన మారిందన్నారు. అక్కడ నుంచి వచ్చిన వారిలో చాలామందిని బందిపోటు దొంగలుగా భావిస్తున్నానని చెప్పారు. అలా అని నూటికి నూరు శాతం అందరూ అలానే ఉన్నారని చెప్పడం లేదు. కొంతమంది మాత్రం అలానే ఉంటున్నారని నొక్కి చెప్పారు. మన విద్యా వ్యవస్థలో నైతికత లేకపోవటం వల్లే ఇలాంటి చదువుకున్న వ్యక్తుల అవినీతిని సమాజం భరించాల్సి వస్తోందంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. (చదవండి: జంషెడ్‌డ్‌పూర్‌లో ఘర్షణ..రంగంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్) -
ప్రధాని మోదీని సన్మానించిన కిషన్ రెడ్డి
-
తెలుగు రాష్ట్రాలకు మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్
-
విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబు
సాక్షి, న్యూఢిల్లీ: విదేశీ పర్యాటకుల ద్వారా 2022 ఆర్థిక సంవత్సరంలో దేశానికి ఒక లక్షా 34 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం లభించిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2021 ఆర్థిక సంవత్సరంలో పర్యాటకుల ద్వారా 65 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం వచ్చినట్లు చెప్పారు. 2019లో కోవిడ్ ప్రబలడానికి ముందు కోటి మంది విదేశీ పర్యాటకులు దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఇమ్మిగ్రేషన్ బ్యూరో అందించిన తాజా సమాచారం ప్రకారం 2022లో దేశాన్ని సందర్శించిన విదేశీ పర్యాటకుల సంఖ్య 60 లక్షలు ఉన్నట్లు మంత్రి వివరించారు. కోవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత విదేశీ పర్యాటకం గణనీయంగా పుంజుకుంటోందని మంత్రి వెల్లడించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు తమ మంత్రిత్వ శాఖ స్వదేశ్ దర్శన్, ప్రసాద్ వంటి వినూత్న పథకాలతోపాటు పర్యాటక ప్రదేశాల్లో మౌలిక వసతులను మెరుగుపరచేందుకు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్థిక సహాయం అందిస్తోందని అన్నారు. విదేశీ పర్యాటకులకు పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన సమాచారం అందించేందుకు పర్యాటక మంత్రిత్వ శాఖ 12 విదేశీ భాషల్లో టూరిస్టు హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది 166 దేశాలకు సంబంధించిన పర్యాటకులకు అయిదు సబ్ కేటగిరీల్లో ఈ వీసా మంజురు చేసే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. 1000 నుంచి 7500 రూపాయలు ఉండే హోటల్ గది అద్దెలపై జీఎస్టీని 12 శాతానికి తగ్గించి పర్యాటక ప్రాంతాల్లో వసతి సౌకర్యాల కల్పనకు పోటీని పెంచేందుకు దోహదం చేసినట్లు మంత్రి చెప్పారు. పర్యాటక మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు 59 టూరిజం రూట్లను వివిధ ఎయిర్‌లైన్స్‌కు కేటాయించినట్లు చెప్పారు. దేశంలో 55 ప్రాంతాల్లో జి 20 సమావేశాలు జరుగుతున్నాయి. పర్యాటకుల కోసం ఈ ప్రదేశాల్లో మౌలిక వసతులను మరింత మెరుగుపరుస్తున్నట్లు మంత్రి తెలిపారు. జి-20 ప్రతినిధులు దేశంలోని వివిధ ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. ఏపీలో 79 లక్షల మంది కార్మికులకు ఉచిత ప్రమాద బీమా కేంద్ర ప్రభుత్వ ఈ-శ్రమ్ పోర్టల్ లో 2023 మార్చి 27 నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి 79,54,498 మందితో పాటు దేశవ్యాప్తంగా 28,78,93,401 మంది అసంఘటిత రంగ కార్మికులు నమోదు చేసుకున్నారని, వీరందరికీ మొదటి ఏడాది రూ. 2 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. కోవిడ్ మహమ్మారి కారణంగా ఉచిత ప్రమాద బీమా సౌకర్యం మరో ఏడాదిపాటు పొడిగించే యోచన ఉందా? అన్న మరో ప్రశ్నకు జవాబిస్తూ ఇన్సూరెన్స్ కవరేజ్ పొడిగించే ప్రతిపాదన ఏదీ లేదని, పోర్టల్‌లో నమోదు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ మొదటి సంవత్సరం మాత్రమే ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. చదవండి: ప్రపంచంలో ఎవరూ ఇలా ధైర్యంగా అడగలేరు: సజ్జల రామకృష్ణారెడ్డి ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంతో పాటు స్పెషల్ డ్రైవ్‌లు, క్యాంపులు నిర్వహించి, ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు ఈ పథకంపై అవగాహన కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ-శ్రమ్ పోర్టల్ ప్రమోషన్ కోసం నిధులు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
కారణం చెప్పకుండా బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం అన్యాయం : కిషన్ రెడ్డి
-
Nitin Gadkari: రాజకీయాలకు ‘వీడ్కోలు దుమారం’పై గడ్కరీ స్పందన
రాజకీయాలకు కేంద్ర రవాణ మంత్రి నితిన్ గడ్కరీ గుడ్ బాయ్ చెబుతున్నారు అంటూ వార్తలు గుప్పుమన్నాయి. పలు మీడియాల్లో కథనాలు హల్చల్ చేశాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి గడ్కరీ ఆ ఆరోపణలకు స్పందించారు. ఆ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. వాటిల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. తనకు రాజకీయాలకు రిటైర్మంట్ చెప్పే ఉద్దేశం అస్సలు లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..ముంబై గోవా జాతీయ రహదారి నిర్మాణ పనులను గురువారం తనిఖీ చేశామని, దాదాపు పనుల్ని పూర్తియినట్లు తెలియజేశారు. ముండై-గోవా జాతీయ రహదారి కొంకణ్‌లోని ప్రధాన పర్యాటక ప్రాంతాలను కలిపే హైవే అని చెప్పారు. ఇది పర్యాటకానికి మంచిగా ఉపయోగపడుతుందన్నారు. అలాగే ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ రోడ్డు ఉన్నందున పారిశ్రామికాభివృద్ధి కూడా మంచిగా ఊపందుకుంటుందని చెప్పారు. పన్వేల్ ఇందాపూర్ల కోసం భూసేకరణ, పర్వావరణ అనుమతులే ఈ ముంబై-గోవా జాతీయ రహదారిని ఆలస్యం చేశాయని చెప్పారు. ఇక ఈ అడ్డంకులన్నీ తొలగిపోయాయని, కర్నాల్ అభయారణ్యంలో ఫ్లైఓవర్‌ను తొలగించి పర్యావరణ సమస్యను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా..గురువారం ఉదయం రూ.కోటి విలువైన మూడు జాతీయ రహదారుల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. రాయ్‌గఢ్ జిల్లాలోని పలాస్పే గ్రామం వద్ద 63,900 కి.మీ రూ.414.68 కోట్లతో రహదారి నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులు జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, డిఘి అనే రెండు ఓడరేవుల వద్ద ఆర్థిక వృద్ధిని పెంచుతాయని గడ్కరి చెప్పారు. అయితే పన్వెల్ నుంచి కాసు హైవే వరకు శంకుస్థాపన చేయడం వల్ల ప్రయాణ వేగం తోపాటు ఇంధనం కూడా ఆదా అవుతుందన్నారు గడ్కరీ. (చదవండి: ‘అమృత్‌పాల్ సింగ్ లొంగిపోకూడదు.. 1984 తరహాలోనే పాక్‌కు పారిపోవాలి’) -
సీఎం వైఎస్ జగన్ కు స్వాగతం పలికిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్
-
కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతల వల్లే జనాభా పెరిగింది
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ సౌకర్యం లేనందునే, దేశంలో జనాభా పెరిగిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. కర్ణాటకలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘అధికారంలోకి వస్తే ఉచితంగా కరెంటు ఇస్తామని కాంగ్రెస్ ఇప్పుడు హామీ ఇస్తోంది కానీ, గతంలో ఆ పార్టీ ప్రభుత్వ హయాంలో కరెంటు సరఫరా సరిగా చేయలేకపోయింది, గ్రామాల్లో అస్సలే కరెంటు లేదు. ఫలితంగా జనాభా పెరిగిపోయింది’అని అన్నారు. ప్రధాని మోదీ హయాంలో 24 గంటలూ విద్యుత్ ఉంటోందని చెప్పారు. -
ఏపీ అభివృద్ధికి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది
-
ఏపీకి పారిశ్రామిక అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి : కిషన్ రెడ్డి
-
విశాఖకు చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
-
రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు చైనా విరాళాలెలా వచ్చాయి? ..
సాక్షి, హైదరాబాద్: రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు చైనా నుంచి విరాళాలు వస్తున్నాయని కేంద్ర యువజన, క్రీడలు, సమాచార శాఖమంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ ఆరోపించారు. ఈ చందాలు ఎవరెవరు ఇచ్చారు? ఎందుకిచ్చారో రాహుల్‌గాంధీ వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు చైనా భారత్‌లో దురాక్రమణకు పాల్పడుతున్నప్పుడు రాహుల్‌గాంధీ చైనా అధికారులతో కలిసి విందులో పాల్గొన్నారని, ఆ విందు కేంద్రంగా ఎలాంటి ప్రణాళికలు రచించారో ప్రజలకు చెప్పాలన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి అనురాగ్‌సింగ్ మీడియాతో మాట్లాడారు. రాహుల్‌గాంధీ మన దేశ సైనికులను హేళన చేస్తూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని, రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. దళితబంధు, దళితులకు మూడెకరాల భూమి, పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు, జర్నలిస్టులకు ఇళ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. కర్ణాటక రాష్ట్రానికి ఎన్నో స్టార్టప్ కంపెనీలు, పెట్టుబడులు వస్తున్నాయని, తెలంగాణకు మాత్రం రావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతోందన్నారు. తెలంగాణలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్సలెన్సీ కేంద్రాలు తెరుస్తామని చెప్పారు. (చదవండి: అప్పులు తీర్చుకునేందుకు ప్రియురాలితో డ్రామా!) -
ఉల్లి ఎగుమతులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. ఏం చెప్పిందంటే?
న్యూఢిల్లీ: ఉల్లి ఎగుమతులపై ఎటువంటి నిషేధం లేదని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు (ఆదివారం) తెలిపింది. 2022 ఏప్రిల్ - డిసెంబర్ మధ్య భారదేశం నుంచి సుమారు 523.8 మిలియన్ డాలర్ల విలువైన ఉల్లి రవాణా చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఉల్లి విత్తన ఎగుమతిపై మాత్రమే ఆంక్షలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉల్లి ఎగుమతులపైన ఫిబ్రవరి 25న ఎన్‌సిపి నాయకురాలు సుప్రియా సూలే చేసిన ట్వీట్‌కు రిప్లై ఇస్తూ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ విషయం తెలిపింది. భారత్ నుంచి సుమారు చాలా దేశాలకు ఉల్లి ఎగుమతి అవుతోందని, ఏ దేశానికీ ఉల్లి ఎగుమతులపై నిషేధం లేదని, అందుకు విరుద్ధంగా తప్పుదోవ పట్టించే ప్రకటనలు దురదృష్టకరమని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి 'పీయూష్ గోయల్' శనివారం ట్వీట్ చేశారు. గత ఏడాది డిసెంబర్లో ఉల్లి ఎగుమతులు దాదాపు 50 శాతం పెరిగి 52.1 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - డిసెంబర్ మధ్య కాలంలో ఎగుమతులు 16.3 శాతం పెరిగి 523.8 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఉల్లి ఎగుమతులపై ఎటువంటి నిషేధం లేదు, కానీ ఉల్లి విత్తనాల ఎగుమతిపైన నిషేధం ఉన్నప్పటికీ DGFT నుండి ఆథరైజేషన్ కింద అనుమతించబడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దీన్ని బట్టి భారతదేశం నుంచి ఉల్లి ఏ దేశానికైనా ఎగుమతి చేయవచ్చని, దానిపైన ఎటువంటి ఆంక్షలు లేదని స్పష్టమవుతోంది. There is no ban on onion exports from India to any country and misleading statements suggesting the contrary is unfortunate. Infact, from July-December 2022, onion exports have consistently been above the $40 million mark every month, benefiting our Annadatas. https://t.co/tGzwVHCt9J — Piyush Goyal (@PiyushGoyal) February 25, 2023 -
సెట్‌టాప్ బాక్స్‌ల్లేకుండానే టీవీ కార్యక్రమాలు
ముంబై: టీవీల్లో తయారీ సమయంలోనే శాటిలైట్ ట్యూనర్లు ఏర్పాటు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీంతో సెట్‌టాప్ బాక్స్ అవసరం లేకుండానే ఉచితంగా 200 చానల్స్ వరకు వీక్షించే అవకాశం ఏర్పడుతుందన్నారు. టీవీల్లో శాటిలైట్ ట్యూనర్లను ఏర్పాటు చేయడం వల్ల ఉచిత టీవీ చానళ్లను చూడడానికి వీలవుతుంది. రేడియో చానళ్ల ప్రసారాలను కూడా వినొచ్చు. విండో వద్ద లేదంటే మేడ పైన చిన్న యాంటెన్నా ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఇందుకు సంబంధించి నిర్ణయాన్ని ఇంకా తీసుకోవాల్సి ఉన్నట్టు మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చెప్పారు. టీవీల్లో ఇన్‌బిల్ట్‌గా శాటిలైట్ ట్యూనర్ల విషయంలో ఆదేశాలు జారీ చేయాలంటూ టెలికం మంత్రి అశ్వని వైష్ణవ్‌కు గత డిసెంబర్లో అనురాగ్ సింగ్ ఠాకూర్ లేఖ కూడా రాయడం గమనార్హం. -
రైళ్లలో అత్యవసర మందులతో ఫస్ట్ ఎయిడ్.. విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు
సాక్షి, న్యూఢిల్లీ: రైలు ప్రయాణీకులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు దేశంలోని అన్ని రైళ్లు, రైల్వే స్టేషన్లలో అత్యవసర మందులు, మెడికల్ సామాగ్రి, ఆక్సిజన్ సిలిండర్ కలిగిన మెడికల్ బాక్స్‌లను ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ అత్యవసర పరిస్థితులలో ప్రయాణీకులకు ఫస్ట్ ఎయిడ్ సేవలు చేసేలా ఫ్రంట్ లైన్ సిబ్బంది అయిన ట్రైన్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ), ట్రైన్ గార్డులు, సూపరింటెండ్లు, స్టేషన్ మాస్టర్లకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. రైళ్లు, రైల్వే స్టేషన్లలో అత్యవసర వైద్య సేవలు కల్పించే అంశాన్ని పరిశీలించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలకు అణుగుణంగా ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులతో ఒక నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. అన్ని ప్రయాణీకుల రైళ్లతో పాటు రైల్వే స్టేషన్లలో అత్యవసర మందులతో కూడిన మెడికల్ బాక్స్‌లను ఏర్పాటు చేయాలని, రైల్వే సిబ్బందికి ఫస్ట్ ఎయిడ్ సేవలు అందించడంలో శిక్షణ ఇవ్వాలని, రైలు ప్రయాణీకులలో ఎవరైనా డాక్టర్ అందుబాటులో ఉంటే వారి చేత లేదా సమీప రైల్వే స్టేషన్లో అస్వస్థతకు గురైన ప్రయాణికునికి తక్షణ వైద్య సేవలు అందే సదుపాయం కల్పించాలని నిపుణుల సంఘం సిఫార్సు చేసినట్లు మంత్రి తెలిపారు. చదవండి: పాత బడ్జెట్ చదివిన సీఎం అశోక్ గెహ్లాట్..! ఫస్ట్ ఎయిడ్ సేవలు అందించే రైల్వే సిబ్బందికి ఎప్పటికప్పుడు రిఫ్రెషర్ కోర్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే రైల్వే స్టేషన్‌కు సమీపాన ఉన్న ఆస్పత్రులు, అక్కడ పని చేసే వైద్యుల, వారి మొబైల్ నంబర్లతో కూడిన జాబితాను రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అస్వస్థతకు గురైన లేదా గాయపడిన ప్రయాణికుడిని ఆస్పత్రికి తరలించేందుకు రైల్వే, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం, ప్రైవేట్ ఆస్పత్రుల అంబులెన్స్ సర్వీసులను కూడా అందుబాటులో ఉంచినట్లు మంత్రి పేర్కొన్నారు. బీఐఎస్ ఆమోదం లేని బొమ్మల తయారీపై చర్యలు బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) ఆమోదం లేకుండా బొమ్మలు తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు శుక్రవారం రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు వినియోగదారుల వ్యవహారాల సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి చెప్పారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్న బీఐఎస్ మార్క్ లేని బొమ్మలు పిల్లల ఆరోగ్యానికి ఎలాంటి చేటు కలిగిస్తున్నవో ప్రభుత్వం మదింపు చేస్తోందా అన్న ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ బీఐఎస్ ఆమోదం లేకుండా బొమ్మలు తయారు చేస్తున్న వారిపై తరచుగా దాడులు నిర్వహిస్తూ జరిమానాలు విధిస్తున్నట్లు మంత్రి తెలిపారు. -
కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన మేరకే ఏపీకి అప్పులు
న్యూఢిల్లీ: ఏపీ ఆర్థిక పరిస్థితిపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన మేరకే ఏపీకి అప్పులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే నెట్ బారోయింగ్ సీలింగ్ లిమిట్ ఫిక్స్ చేస్తారని చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణ కోసమే ఏపీఎఫ్‌ఆర్‌బీఎం చట్టం అమల్లో ఉందన్నారు. స్టేట్ లెజిస్లేచర్ ఎఫ్ఆర్బీఎంను పర్యవేక్షిస్తుందన్నారు. -
సెయిల్ లేదా ఎన్ఎండీసీలో వైజాగ్ స్టీల్ విలీన ప్రతిపాదనలు
న్యూఢిల్లీ: వైజాగ్ స్టీల్‌ను (ఆర్ఐఎన్ఎల్) సెయిల్, ఎన్ఎండీసీలో విలీనం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు వచ్చాయి. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే ఈ విషయం తెలిపారు. ప్రస్తుతం ఆర్ఐఎన్ఎల్లో 4,875 మంది ఎగ్జిక్యూటివ్‌లు, 10,005 మంది నాన్–ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు ఉన్నారని రాజ్యసభకు రాతపూర్వక సమాధానంలో ఆయన వివరించారు. కంపెనీ ఆర్థిక పరిస్థితి అంతగా బాగా లేనందున రిక్రూట్‌మెంట్‌ను క్రమబద్ధీకరించినట్లు కులస్తే పేర్కొన్నారు. పబ్లిక్ ఇష్యూ లేదా బాండ్ల జారీ ద్వారా ఆర్ఐఎన్ఎల్ నిధులు సమీకరించే యోచనేదీ లేదని తెలిపారు. -
రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నదుల అనుసంధానం ప్రక్రియలో భాగంగా గుర్తించిన మొత్తం 30 లింకులలో 8 లింకు ప్రాజెక్ట్‌లకు సంబంధించి సవివర ప్రాజెక్ట్ నివేదికలు పూర్తయ్యాయని జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాత పూర్వకంగా జవాబిస్తూ మరో 24 లింకు ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఫీజిబిలిటీ (సాధ్యాసాధ్యాల) నివేదికలు కూడా పూర్తయినట్లు చెప్పారు. ప్రభుత్వ నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ కింద నదుల అనుసంధానం కోసం జాతీయ జలాభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) దేశవ్యాప్తంగా 30 లింకులను గుర్తించింది. ఈ లింకులన్నింటికీ ప్రీ ఫీజిబిలిటీ నివేదికలు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. నదుల అనుసంధాన ప్రాజెక్ట్ అమలు కోసం కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం భరించాల్సి ఉంటుందని ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని మంత్రి చెప్పారు. నదుల అనుసంధానం ప్రాజెక్ట్ అమలు దశలో మాత్రమే ప్రాజెక్ట్ నిర్మాణం వ్యయం, నిధుల సమీకరణ వంటి తదితర అంశాలు చర్చకు వస్తాయని పేర్కొన్నారు. చదవండి: ఏంటి లోకేశా ఇదీ?.. నరాలు కట్ అయిపోతున్నాయ్..! -
కేంద్ర మంత్రి కాన్వాయ్‌కు ప్రమాదం..
కేంద్ర సహాయక మంత్రి అశ్విని కుమార్ చౌబే ఘోర రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆదివారం రాత్రి బక్సర్ నుంచి పాట్నా వెళుతుండగా ఆయన కాన్వాయ్‌లోని ఓ పోలీస్ వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. డుమ్రాన్‌లోని మథిలా-నారాయణపూర్ రోడ్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బోల్తాకొట్టిన కారు కాలువలో పడటంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. అయిదుగురు పోలీసులతో సహా డ్రైవర్‌కు గాయలవ్వగా.. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీస్ వాహనం ప్రమాదానికి గురైన సమయంలో వెనకాలే కేంద్రమంత్రి కారు ఉండడం గమనార్హం. అయితే ఈ ఘటనలో కేంద్ర మంత్రి సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత సంఘటన స్థలానికి చెందిన ఓ వీడియోను ఆయన ట్విటర్లో పంచుకున్నారు. ప్రమాదంలో బోల్తా పడిన ఎస్కార్ట్ వాహనాన్ని మంత్రి తనిఖీ చేయడాన్ని చూడవచ్చు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ‘బక్సర్ నుంచి పాట్నాకు వెళ్లే క్రమంలో కోరన్‌సరాయ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన వాహనం దుమ్రావ్ మథిలా-నారాయణపూర్ రహదారి వంతెన కాలువలో ప్రమాదానికి గురైంది. శ్రీరాముని దయవల్ల అందరూ క్షేమంగా ఉన్నారు. గాయపడిన పోలీసులు, డ్రైవర్‌ను డుమ్రావ్ సదర్ ఆసుపత్రికిలో చేర్చారు’ అని ట్వీట్ చేశారు. కాగా బీజేపీ నేత అశ్విని కుమార్ చౌబే ప్రస్తుతం కేంద్ర పర్యావరణం, అటవీ, వినియోగదారుల వ్యవహారాలు. ఆహారం ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. చదవండి: మధ్యప్రదేశ్ సీఎం హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్.. बक्सर से पटना जाने के क्रम में डुमराव के मठीला-नारायणपुर पथ के सड़की पुल के नहर में कारकेड में चल रही क़ोरानसराय थाने की गाड़ी दुर्घटनाग्रस्त हो गई है। प्रभु श्रीराम की कृपा से सभी कुशल हैं। घायल पुलिसकर्मियों एवं चालक को लेकर डुमराव सदर अस्पताल जा रहा हूं। pic.twitter.com/ybTVi6jn5v — Ashwini Kr. Choubey (@AshwiniKChoubey) January 15, 2023 -
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్..
ముంబై: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆయన కార్యాలయానికి ఫోన్ చేసిన దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. 10 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు ఫోన్ చేశారు. శనివారం ఉదయం 11.30, 11.40 గంటలకు దుండగుల నుంచి ఫోన్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఇది ఆకతాయి పని అయి ఉంటుందా? లేక ఎవరైనా సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దుండగుడు ఉపయోగించిన ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: 900 కిమీ దూరం.. గంటల వ్యవధిలోనే చనిపోయిన కవల సోదరులు.. -
తెలంగాణ నుంచి మరొకరికి కేంద్రమంత్రి పదవి..?
-
మంత్రి పదవి వదులుకుంటా.. కిషన్‌రెడ్డికి కేటీఆర్ సవాల్
సాక్షి, హైదరాబాద్: కేందమంత్రి కిషన్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ‘‘కేంద్రానికి రాష్ట్రం కట్టింది రూ.3.68 లక్షల కోట్లు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది రూ.1.68 లక్షల కోట్లు. ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారో బీజేపీ చెప్పాలి’’ అని కేటీఆర్ నిలదీశారు. ‘నేను చెప్పింది తప్పు అయితే మంత్రి పదవిని వదులుకుంటా.. బీజేపీ చెప్పేవి తప్పు అయితే ప్రజలకు సమాధానం చెప్పాలి. ఉద్యమ సమయంలోనూ కిషన్‌రెడ్డి రాజీనామా చేయలేదు. బీజేపీ చేసిన ఒక్క మంచి పనైనా చెప్పాలి. మతం పేరుతో రాజకీయాలు చేసే వారిని ప్రజలు నమ్మొద్దు’’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. చదవండి: తెలంగాణ రాష్ట్రం నుంచి మరో కేంద్రమంత్రి? -
అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో పీఎస్‌యూలు
నాగ్‌పూర్: అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) పెద్ద ఎత్తున పాలు పంచుకోనున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పవర్ ప్లాంట్ల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ కోసం పీఎస్‌యూలతో జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేసుకునేలా న్యూక్లియర్ రంగ నిబంధనలను ప్రభుత్వం సరళీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. 108వ భారతీయ సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. అణు విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించే దిశగా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐఎల్), ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జాయింట్ వెంచర్లకు వెసులుబాటు కల్పిస్తూ 2015లో అటామిక్ ఎనర్జీ చట్టాన్ని ప్రభుత్వం సవరించిందని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా దాదాపు అన్ని అణు విద్యుత్ ప్లాంట్లను నిర్వహించే ఎన్పీసీఐఎల్ మరింతగా కార్యకలాపాలు విస్తరించేలా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ న్యూక్లియర్ ఎనర్జీ, నాల్కో పవర్ కంపెనీ మొదలైన వాటితో జేవీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో అణు విద్యుత్ స్థాపిత సామర్థ్యం 6,780 మెగావాట్లుగా ఉంది. మరో 21 యూనిట్ల ఏర్పాటుతో 2031 నాటికి దీన్ని 15,700 మెగావాట్లకు చేర్చుకోవాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. -
గ్రామ పంచాయతీ నిధులను తెలంగాణ ప్రభుత్వం దుర్వినియోగం చేసింది
-
వివిధ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయండి
-
కేంద్ర అటవీశాఖమంత్రితో సీఎం వైఎస్ జగన్ సమావేశం
-
నా కుమారుడిని రక్షించుకోలేకపోయా!: కేంద్ర మంత్రి భావోద్వేగం
మద్యం సేవించే అధికారికంటే రిక్షా తొక్కేవాడిని, కూలీలను పెళ్లిచేసుకోవడం సముచితమని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేగాదు తమ కుమార్తెలు, సోదరీమణులకు మద్యపానం చేసేవారితో అస్సలు వివాహం చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఉత్తరప్రదేశ్‌లోని లంభువా అసెంబ్లీ నియోజకవర్గంలో మద్యపానం డి అడిక్షన్‌పై జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత అనుభవాన్ని వివరిస్తూ...తాను ఎంపీగా తన భార్య ఎమ్మెల్యేగా ఉండి కూడా తమ కుమారుడి ప్రాణాలను కాపాడలేకపోయినప్పుడూ..సామాన్య ప్రజలను ఎలా కాపాడగలనంటూ భావోద్వేగానికి గురయ్యారు. "తన కొడుకు ఆకాష్ తన స్నేహితులతో మద్యం సేవించడం అలవాటు చేసుకున్నాడు. మానిపించేందుకు డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించాం. ఆ అలవాటు మానుకుంటాడని పెళ్లి కూడా చేశాను కానీ అతను పెళ్లైన తర్వాత కూడా తాగడం ప్రారంభించాడు. క్రమంగా అది అతని మరణానికి దారితీసింది. దీంతో అతడి భార్య వితంతువుగా మారింది. పైగా వారికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు." అని ఆవేదనగా చెప్పుకొచ్చారు. అందువల్ల దయచేసి మీరు మీ కుమార్తెలను, సోదరీమణులను ఇలాంటి వ్యసనపరులకు కట్టబెట్టకుండా రక్షించండి. ఈ తాగుడు వ్యసనం కారణంగా ప్రతి ఏడాది సుమారు 20 లక్షల మంది మరణిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎంపీ కూడా 80 శాతం క్యాన్సర్ మరణాలకు కేవలం పొగాకు, సిగరెట్లు, బీడీల వ్యసనమే కారణమని అన్నారు. ఈ డీ అడిక్షన్ కార్యక్రమంలో ప్రజలు, ఇతర సంస్థలు భాగస్వాములు కావాలని కుటుంబాలను రక్షించుకోవాలని ఆయన కోరారు. అలాగే జిల్లాను వ్యసన రహితంగా మార్చేందుకు డీ అడిక్షన్ క్యాంపెయిన్‌ను అన్ని పాఠశాలలకు తీసుకువెళ్లాలని, పైగా ఉదయం ప్రార్థన సమయంలో పిల్లలకు దీని గురించి చెప్పాలని కేంద్ర మంత్రి కౌశల్ అధికారులను ఆదేశించారు. (చదవండి: ఇలా నన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారు: రాహుల్ గాంధీ) -
రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరు.. కేంద్రమంత్రి జోస్యం..
ఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరని జోస్యం చెప్పారు కేంద్ర సామాజిక న్యాయ సహాయమంత్రి రామ్‌దాస్ అథవాలే. 2004లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే సోనియా గాంధీ ఆయనను ప్రధాని చేయాల్సిందని పేర్కొన్నారు. సమయం దాటిపోయిందని, ఇక రాహుల్ ఎప్పటికీ ప్రధాని అయ్యే అవకాశమే లేదని అథవాలే అన్నారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ హవా కొనసాగుతోందని అథవాలే చెప్పారు. ఆయన స్థానాన్నీ భర్తీ చేసే నాయకుడే లేరన్నారు. రాహుల్ గాంధీకి అది సాధ్యం కాదన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ 400 స్థానాలకుపైగా కైవవం చేసుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. అలాంటప్పుడు రాహుల్ ఎలా ప్రధాని అవుతారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం 40 సీట్లు కూడా రావని అథవాలే అన్నారు. కేరళ ప్రజలు ఆదరించకపోయి ఉంటే గత ఎన్నికల్లో ఆ పార్టీకి పట్టుమని 15 సీట్లు కూడా వచ్చేవి కాదన్నారు. చదవండి: భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు -
జవాన్ల శౌర్యాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దు : కేంద్రమంత్రి జై శంకర్
-
ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబు
సాక్షి, న్యూఢిల్లీ: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను మిశ్రమం చేయాలన్న లక్ష్య సాధనలో 2జీ (రెండో తరం) ఇథనాల్ కీలకం కానున్నట్లు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ వెల్లడించారు. అందుకోసం 2జీ బయో ఇథనాల్ రిఫైనరీల ఏర్పాటుకు కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుందని రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రశ్నకు రాతపూర్వకంగా బదులిస్తూ చెప్పారు. ప్రభుత్వ ఆయిల్ రంగ సంస్థలు ఈ ఏడాది నవంబర్ 15 నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి 16.19 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి గడిచిన 5 సంవత్సరాలలో 385.92 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. 2025 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని సాధించేందుకు రెండో తరం ఇథనాల్ ఉత్పత్తిని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారన్న ప్రశ్నకు మంత్రి బదులిస్తూ ప్రధాన మంత్రి జేఐ-వన్ (జీవ్ ఇంధన్- వాతావరణ్ అనుకూల్ ఫసల్ అవశేష్ నివారణ్) యోజన పథకం కింద సెల్లులోసిక్, లింగో సెల్లులోసిక్ బయోమాస్ నుంచి అలాగే పెట్రో కెమికల్ మార్గం ద్వారా 2జీ ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు 2 జీ ఇథనాల్ బయో రిఫైనరీస్‌ను పెద్ద ఎత్తు ఏర్పాటు చేయాలని తలపెట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఈ రిఫైనరీలకు తగిన విధంగా ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్రం నోటిఫికేషన్ కూడా విడుదల చేసినట్లు తెలిపారు. వరి దుబ్బు, ఇతర పంట వ్యర్థాల ఆధారిత 2జీ ఇథనాల్ బయో రిఫైనరీలు పంజాబ్, హర్యానా, ఒడిశా, అస్సాం రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. హర్యానాలోని పానిపట్‌లో నెలకొల్పిన బయో రిఫైనరీని జాతికి అంకితం చేసినట్లు తెలుపారు. బయోమాస్ సేకరణ కోసం ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు వివిధ రాష్ట్రాలు, రైతులు, ఇతర భాగస్వాములతో సమన్వయం చేసుకుంటోందని మంత్రి తెలిపారు ఏపీలో లక్షా 90 వేల వీధి వర్తకులకు స్వానిధి రుణాలు ప్రధానమంత్రి స్వానిధి పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 1,90,433 మంది వీధి వర్తకులకు రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1,12,744 మందికి, 2021-22 లో 70,415 మందికి, 2022-23 లో 7,274 మందికి మొదటి దశ కింద ఒక్కొక్కరికి 10 వేల రూపాయల రుణం మంజూరు చేసినట్లు తెలిపారు. మొదటి తీసుకున్న రుణం సక్రమంగా చెల్లించిన వారికి రెండవ దఫా రుణం కింద 20 వేల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. మూడవ దశ కింద 251 మందికి 50 వేల రూపాయల రుణం అందించినట్లు మంత్రి తెలిపారు. అలాగే వడ్డీ సబ్సిడీ కింద 3 కోట్ల రూపాయలు, క్యాష్ బ్యాక్ కింద కోటి 65 లక్షల రూపాయలు లబ్దిదారులకు అందజేసినట్లు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 4 నాటికి పీఎం స్వానిధి పథకం కింద రుణాల కోసం ఏపీ నుంచి 4 లక్షల దరఖాస్తులు అందగా అందులో 67,404 దరఖాస్తులు అర్హత లేనివిగా గుర్తించి తిరస్కరించినట్లు తెలిపారు. 16,118 దరఖాస్తులు మంజూరు దశలో ఉన్నాయని, 29,853 మంది బ్యాంకులకు అందుబాటులో లేని కారణంగా రుణాల పంపిణీ పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి వివరించారు. కోవిడ్ మహమ్మారి కారణంగా కుదేలైన వీధి వర్తకులు తిరిగి వారి వ్యాపార కార్యకలాపాలను కొనగించుకునేందుకు వర్కింగ్ కాపిటల్ కింద 10 వేల రూపాయలు రుణం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం స్వానిధి పథకాన్ని 2020 జూన్ 1న ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. తీసుకున్న రుణం సకాలంలో చెల్లించిన వారికి రెండవ దఫా రుణం కింద 20 వేలు, మూడవ దఫా కింద 50 వేల రూపాయలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. సకాలంలో రుణం చెల్లించిన వారికి తీసుకున్న రుణంపా 7 శాతం వడ్డీ రాయితీ, డిజిటల్ చెల్లింపులు చేసిన వారికి క్యాష్ బ్యాక్ కింద ఏడాదికి 1200 రూపాయలు చెల్లించినట్లు మంత్రి పేర్కొన్నారు. చదవండి: ఏపీలో భారీగా ఉద్యోగావకాశాలు.. వేల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ -
ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ క్లీన్ చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
-
సింగరేణిని ప్రైవేటీకరణ చేసే అధికారం కేంద్రానికి లేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
-
విశాఖ సీఐటీఎస్‌లో నైపుణ్య శిక్షణ.. రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
న్యూఢిల్లీ: మహిళలకు నైపుణ్య శిక్షణ కోసం దేశంలో ప్రత్యేకంగా 19 జాతీయ మహిళా నైపుణ్య శిక్షణా సంస్థలు (ఎన్ఎస్టీఐ) పనిచేస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా 33 ఎన్ఎస్టీఐలు వాటికి అనుబంధంగా మూడు కేంద్రాలు నెలకొల్పినట్లు తెలిపారు. ఇందులో 19 ఎన్ఎస్టీఐలు ప్రత్యేకంగా మహిళల కోసం నెలకొల్పినవే. విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ (హైదరాబాద్)లో మూడు ఎన్ఎస్టీఐలు నెలకొల్పగా అందులో ఒకటి మహిళల కోసం ప్రత్యేకించిందని మంత్రి చెప్పారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ఎస్టీఐ నెలకొల్పలేదని చెబుతూ విశాఖపట్నం గాజువాకలోని క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ ట్రైనర్స్ (సీఐటీఎస్)ను అనుబంధ సంస్థగా ప్రకటించి 2022-23 నుంచి ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్ వంటి ట్రేడ్లలో శిక్షణను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ఈ మూడు ట్రేడ్లలో 75 మందికి శిక్షణ పొందే అవకాశం ఉన్నట్లు మంత్రి తెలిపారు. చెంచులకు వేతనంతో కూడిన ఉపాధి కొనసాగుతుంది న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని నల్లమల్ల అడవుల్లో నివసించే చెంచు తెగకు చెందిన ప్రజలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వేతనంతో కూడిన ఉపాధి కల్పించేందుకు క్రియాశీలకమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తెలిపాయని రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి రాతపూర్వకంగా తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్గదర్శకాలలో చేసిన మార్పుల కారణంగా నల్లమల అడవులలో జీవించే చెంచు తెగకు చెందిన ప్రజలు ఈ పథకం కింద వేతనంతో కూడిన ఉపాధి పొందడానికి అనర్హులవుతారా అన్న ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ మార్గదర్శకాలను సవరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి విజ్ఞప్తి రాలేదని చెప్పారు. -
ఆ ఆరోపణలపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన..
సాక్షి, ఢిల్లీ: సింగరేణి బొగ్గు గనుల వేలంపై పార్లమెంట్లో బుధవారం రగడ జరిగింది. ప్రైవేటీకరణ ఆపాలని టీఆర్ఎస్ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆందోళనకు దిగారు. దీనిపై కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ.. తెలంగాణ ఎంపీల ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అర్థరహితమని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ బొగ్గు గనుల వేలం, సింగరేణి ప్రైవేటీకరణపై జీరో అవర్‌లో లేవనెత్తగా.. సభలోనే కేంద్రమంత్రి ప్రకటన జారీ చేశారు. సింగరేణి కాలరీస్‌లో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం ఉన్నప్పుడు 49 శాతం వాటా కల్గిన కేంద్రం.. ప్రైవేటీకరణ చేయడం సాధ్యం కాదు. బొగ్గు గనుల కేటాయింపుల్లో పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్న వేలం ప్రక్రియపై ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. వేలం ప్రక్రియ ద్వారా బొగ్గు గనుల కేటాయింపులు జరుపుతున్న రాష్ట్రాలకు సైతం ప్రయోజనం కలుగుతుంది. దీంతో అనేక రాష్ట్రాలు గనుల వేలానికి పూర్తిగా సహకరిస్తున్నాయని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కానప్పటికీ ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా వేలం పద్ధతిని అందిపుచ్చుకున్నాయి. వేలం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం రాష్ట్రాలకే వెళ్తుంది. బొగ్గు కుంభకోణాల్లో ఉన్నవాళ్లే పారదర్శక వేలం పద్ధతిని వ్యతిరేకిస్తున్నారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి దుయ్యబట్టారు. చదవండి: గుజరాత్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ తారుమారు -
లఖీంపూర్ కేసు: కేంద్ర మంత్రి కుమారుడిపై అభియోగాలు
లఖీంపూర్ ఖేరి: నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది మృతికి కారణమైన లఖీంపూర్ ఖేరి సంఘటనలో నిందితులపై కోర్టులో విచారణకు రంగం సిద్ధమయ్యింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాతోపాటు మరో 12 మంది నిందితులపై జిల్లా కోర్టు అభియోగాలు నమోదు చేసింది. హత్య, నేరపూరిత కుట్ర, సంబంధిత సెక్షన్ల కింద అభియాగాలు మోపింది. నిందితులపై ఐపీసీ సెక్షన్లు 147, 148(అల్లర్లు), 149(చట్టవిరుద్ధంగా గుమికూడడం), 302(హత్య), 307(హత్యాయత్నం), 326(ఆయుధాలతో గాయపర్చడం), 427, 120బీతోపాటు మోటార్ వాహన చట్టంలోని 177 కింద అదనపు జిల్లా జడ్జి సునీల్‌కుమార్ వర్మ అభియోగాలు నమోదు చేశారు. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. 13 మంది నిందితులు ప్రస్తుతం జైలులో ఉన్నారు. బెయిల్‌పై బయట ఉన్న 14వ నిందితుడు వీరేంద్ర శుక్లాపై ఐపీసీ సెక్షన్ 201 అభియోగాలు నమోదయ్యాయి. ఆశిష్ మిశ్రాతోపాటు కొందరు నిందితులపై ఆయుధాల చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. 2021 అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరిలో రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులపైకి వాహనం దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. అనంతరం రైతుల దాడిలో ఒక డ్రైవర్, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఒక జర్నలిస్టు మరణించారు. రైతులపైకి దూసుకెళ్లిన వాహనంలో ఆశిష్ మిశ్రా ఉన్నాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇదీ చదవండి: మళ్లీ సరిహద్దు రగడ -
పరిశ్రమకు భరోసా: ఎంఎస్ఎంఈ ద్వారా 11 కోట్ల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: సూక్ష్మ, లఘు చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) భారతదేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ముఖ్యమైన మూల స్తంభాలని ఆ శాఖ సహాయమంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ సోమవారం పేర్కొన్నారు. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి, మరింత అభివృద్ధి చేయడానికి, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడ్డానికి కేంద్రం తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటుందని అన్నారు. ఎంఎస్ఎంఈ రంగంపై ఫిక్కీ నిర్వహించన వార్షిక సదస్సులో ఆయన ఈ మేరకు చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు.. ⇒ భారతదేశాన్ని స్వావలంబన సాధనకు, అలాగే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎకానమీని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వంతో పరిశ్రమ, సంబంధిత వర్గాలు కలిసి పని చేయాలి. ⇒ దేశంలో 6.3 కోట్ల సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ఉన్నాయి. వాటి ద్వారా 11 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ⇒ ఎంఎస్ఎంఈలు మన భారత్ జీడీపీ విలువలో దాదాపు 30 శాతం వాటాను అందిస్తున్నాయి. మొత్తం ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంలో 50 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ⇒ దేశంలో ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిరంతర చర్యలు తీసుకుంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన పీఎంఈజీపీ (ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం) ఈ దిశలో ఒక ముందడుగు. ఈ పథకం కింద 2021–22 ఆర్థిక సంవత్సరంలో తయారీ, సేవల రంగంలో మొత్తం 1.03 లక్షల కొత్త యూనిట్లు ఏర్పాటయ్యాయి. ⇒ ఎంఎస్ఎంఈల పూర్తి సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం సహకారం రెట్టింపయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ రంగానికి ఎదరవుతున్న సవాళ్లను తగ్గించడానికి తగిన ప్రయత్నం జరుగుతుంది. ⇒ యువత పారిశ్రామికవేత్తలుగా మారే సంస్కృతిని పెంపొందించడానికి, ఎంఎస్ఎంఈలకు రుణాలు అందించడానికి, వారి నాణ్యతను మెరుగుపరచడానికి, వారి సామర్థ్యాన్ని పెంచడానికి, వారి పోటీతత్వాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడానికి ప్రభుత్వం తగిన కృషి చేస్తోంది. ⇒ ఇప్పటికే ఉన్న అలాగే కొత్త ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వడానికి వాటిని బలోపేతం చేయడానికి మా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా వివిధ సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ⇒ దీనితోపాటు ‘జెడ్ఈడీ’ సర్టిఫికేషన్ పథకం (టెక్నాలజీ అప్‌గ్రేడేషన్– క్వాలిటీ సర్టిఫికేషన్ అందించడానికి ఉద్దేశించిన), నాణ్యత ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ‘ఏఎస్పీఐఆర్ఈ’ డిజైన్ క్లినిక్ మొదలైన వాటి కింద ఎంఎస్ఎంఈలకు సహాయం చేయడానికి ప్రభుత్వం ఇతర సంస్థలతో కలిసి పని చేస్తోంది. ⇒ ప్రభుత్వం చాంపియన్ పోర్టల్‌ను కూడా ప్రారంభించింది, ఇది ఒకే చోట అన్ని పరిష్కారాలను అందిస్తుంది. ఎంఎస్ఎంఈలను మరింత పోటీగా మార్చడానికిసైతం పోర్టల్‌ను దోహదపడేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ పథకాల ద్వారా ఎంఎస్ఎంఈలు మరింత స్థిరంగా ఉంటాయని మేము ఆశిస్తున్నాము. ఈ రంగం పురోగతి అవశ్యం:స్వైన్ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ కార్యదర్శి బీబీ స్వైన్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రంగం స్థిరమైన అభివృద్ధికి ఆర్థిక, సాంకేతిక పరమైన చేయూత అవసరమని అన్నారు. ‘రైసింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పనితీరు’ (ఆర్‌ఏఎంపీ) కింద ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు సమన్వయంగా సహకారాన్ని అందించడానికి, ఇందుకు తగిన ప్రణాళిక రూపకల్పనకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తోందని వివరించారు. ఈ రంగం పురోగతి దిశలో 2020లో ప్రారంభించబడిన సెల్ఫ్ రిలయన్ట్ ఇండియా ఫండ్ ఇప్పటి వరకు 125 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.2,335 కోట్ల విలువైన వృద్ధి సంబంధ మూలధనాన్ని అందించిందని తెలియజేశారు. ఈ రంగం కోసం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌ను పునరుద్ధరించడం, ఉద్యామ్, ఇ-శ్రామ్, నేషనల్ కెరీర్ సర్వీస్, ఏఎస్ఈఈఎం పోర్టల్‌ల పూర్తి స్థాయి ఏకీకరణ వంటి కార్యక్రమాల కోసం ప్రణాళిక రూపకల్పన జరుగుతోందన్నారు. సాంకేతిక కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ సమాచార వ్యవస్థ, జాతీయ ఎంఎస్ఎంఈ పాలసీని రూపొందించడం, జెడ్ఈడీ ధృవీకరణ ద్వారా సమస్యలను పరిష్కరించడం, ఎంఎస్ఎంఈ చెల్లింపు సమస్యలను తొలగించడం వంటి చర్యలకూ ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ఎంస్ఎంఈలకు మద్దతుగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ, వర్గీకరణలో అప్‌గ్రేడేషన్ విషయంలో ప్రభుత్వం పన్నుయేతర ప్రయోజనాలను 3 సంవత్సరాల పాటు పొడిగించిందని స్వైన్ పేర్కొన్నారు. ఎకానమీలో కీలక పాత్ర ఎంఎస్ఎంఈ రంగం సామర్థ్యం చాలా విస్తృతమైనది. భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో ఈ రంగం మరింత కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నాం. ఎకానమీ విలువలో ఈ రంగం వాటా 40-45 శాతంగా ఉండాలని మేము ఆశిస్తున్నాం- ఆర్ నారాయణ్, ఎఫ్ఐసీసీఐ(సీఎంఎస్ఎంఈ ప్రెసిడెంట్) -
బీజేపీతో టచ్‌లో 45మంది టీఎంసీ ఎమ్మెల్యేలు!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష నేతల మాటలతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తాజాగా కేంద్ర మంత్రి, బీజేపీ నేత నిశిత్ ప్రమానిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ)కి చెందిన 40-45 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కీలక పరిణాణాలు చోటు చేసుకోనున్నాయని తెలిపారు. అంతకు ముందు బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అరెస్ట్ కాబోతోందని, 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు. కూచ్ బెహర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమం వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రమానిక్. తృణమూల్ కాంగ్రెస్ పునాదులు బలహీనంగా మారాయని ఆరోపించారు. ‘తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునాదులు చాలా బలహీనంగా ఉన్నాయి. ఇసుక మేటల వలే ఉన్నాయి. పేకమేడలా ఎప్పుడైనా కూలిపోవచ్చు. అది మాకు అర్థమవుతోంది. బెంగాల్ ప్రజలకు సైతం తెలుసు. 40 నుంచి 45 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. భవిష్యత్తులో ఏం చేయాలనేదానిపై ఆలోచన చేస్తున్నాం.’ అని పేర్కొన్నారు కేంద్ర మంత్రి. ఇదీ చదవండి: పార్లమెంట్లో మహిళా సభ్యురాలిపై చేయి చేసుకున్న ఎంపీ.. వీడియో వైరల్ -
మన ఎగుమతులపై అంతర్జాతీయ సవాళ్ల ప్రభావం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, మాంద్యం పరిస్థితుల ప్రభావం భారత ఎగుమతులపై ఉండడం సహజమేనని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఎగుమతుల్లో బలహీనత ఉండొచ్చన్నారు. అదే సమయంలో సేవల ఎగుమతులకు భారీ అవకాశాలున్నట్టు చెప్పారు. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నడుమ భారత్ ఆశాకిరణంగా కనిపిస్తున్నట్టు అభివర్ణించారు. టైమ్స్‌నౌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి గోయల్ మాట్లాడారు. ధరల ఒత్తిళ్లను తగ్గించేందుకు (ద్రవ్యోల్బణం) ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అంతర్జాతీయంగా మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో.. రెండేళ్ల తర్వాత మన దేశ ఎగుమతులు అక్టోబర్ నెలకు ప్రతికూల జోన్‌కు వెళ్లడం గమనార్హం. 16.65 శాతం తగ్గి 29.78 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జ్యుయలరీ, ఇంజనీరింగ్, పెట్రోలియం ఉత్పత్తులు, రెడీ మేడ్ గార్మెంట్స్, టెక్స్టైల్స్, కెమికల్స్, ఫార్మా, మెరైన్, తోలు ఉత్పత్తుల ఎగుమతులు క్షీణించాయి. వాణిజ్య లోటు సైతం 26.91 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఎగుమతులు 12.55 శాతం పెరిగి 263.35 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు సైతం 33 శాతం పెరిగి 437 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. -
ఫౌంహౌస్ ఫైల్స్‌కు భయపడేది లేదు: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీతోనే మార్పు సాధ్యమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన శామీర్‌పేటలో జరుగుతున్న బీజేపీ మూడు రోజుల శిక్షణా తరగతుల్లో మాట్లాడుతూ, గత పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం కూతురు, బంధువును ఓడించాం. అభద్రతా భావంతో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. మునుగోడులో బీజేపీదే నైతిక విజయం. ప్రగతి భవన్లో కూర్చుని దేశ ఆర్థిక వ్యవస్థను విమర్శిస్తున్నారు. ప్రధాని విమర్శిస్తే.. స్థాయి పెరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నారు ఫౌంహౌస్ ఫైల్స్‌కు భయపడేది లేదని కిషన్‌రెడ్డి అన్నారు. పాత, కొత్త తేడా లేకుండా ఐక్యమత్యంతో ముందుకు వెళ్లాలని బీజేపీ నేతలకు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. చిన్నచిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు.. సిద్ధాంతం కోసం కలిసి పనిచేయాలన్నారు. బీజేపీ నాయకత్వంపై విమర్శలు చేసి మళ్లీ ఓట్లు పొందాలని చూస్తున్నారు. వాళ్లు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగడం లేదు. జవాబు చెప్పకుండా దొంగే.. దొంగ దొంగ అని అరుస్తున్నట్లు ఉంది’’ అంటూ కిషన్‌రెడ్డి మండిపడ్డారు. చదవండి: తొమ్మిదేళ్ల క్రితం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో ఎదురేలేదు.. మరి నేడు? -
‘స్థలం కేటాయిస్తే సైన్స్ సిటీ ఏర్పాటు’
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో 25 ఎకరాల స్థలం కేటాయిస్తే సైన్సు సిటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. బేగంపేటలోని హరిత ప్లాజాలో శనివారం జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ సమితి (దిశ) సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నగరంలో జరుగుతున్న వివిధ పథకాలను సమీక్షించారు. ఇళ్ల నిర్మాణ వివరాలను జీßæచ్ఎంసీ అధికారులను అడిగి తెలుసుకొన్నారు. త్వరగా పూర్తి చేయాలని సూచించారు. జేఎన్‌యూహెచ్ స్కీమ్‌లో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. త్వరగా అందజేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన వెల్నెస్ సెంటర్ల గురించి ప్రశ్నించగా.. 152 బస్తీ దవాఖానాలు, యుహెచ్‌సీలను వెల్నెస్ సెంటర్లుగా మార్చినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. నగరంలోని టీబీ పేషంట్లను తాను దత్తత తీసుకుంటానని మంత్రి తెలిపారు. పీఎం స్వయంనిధి, ముద్ర రుణాలు అందరికీ అందేట్లు చూడా లని బ్యాంకు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హెచ్ఎండబ్ల్యూ ఎండీ దానకిషోర్, హైదరాబాద్ కలెక్టర్ అమోయ్ కుమార్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, సంయుక్త సంచాలకులు ఎన్.సురేందర్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: నిలబడి.. కలబడేదెలా?.. భవిష్యత్తు కార్యాచరణపై టీపీసీసీ -
Shraddha Case: అమ్మాయిలే జాగ్రత్త పడాలి!
బాగా చదువుకుని, తాము చాలా ఓపెన్‌గా.. నిష్కపటంగా(ఫ్రాంక్‌గా) ఉన్నామని, భవిష్యత్తు గురించి ఎలాంటి నిర్ణయాలైనా తమంతట తాముగా తీసుకోగలమని భావించే అమ్మాయిల విషయంలోనే ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అసలు సహజీవనం అనేది ఎందుకు? ఒకవేళ అలాంటి బంధాలు అవసరం అనుకుంటే.. అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి!. ఒకవేళ తల్లిదండ్రులు అలాంటి వాటికి ఒప్పుకోకపోతే.. న్యాయబద్ధంగా పెళ్లి చేసుకుని కలిసి ఉండాలి... ! శ్రద్ధావాకర్ హత్యోందతాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ చేసిన పైవ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చదువుకున్న అమ్మాయిలు సహజీవనం పేరుతో తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్లడం సరికాదంటూ వ్యాఖ్యానించారాయన. ఈ వ్యాఖ్యలను శివసేన నేత ప్రియాంక చతుర్వేది ఖండించారు. తక్షణమే ఆయన్ని మంత్రి పదవి నుంచి తప్పించాలంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారామె. ‘‘అలా ఎందుకు చేస్తున్నారో అనే విషయంపై అమ్మాయిలే జాగ్రత్త పడాలి. చదువుకున్న అమ్మాయిలు అలాంటి బంధాలకు దూరంగా ఉండాలి. అసలు తల్లిదండ్రులు అలాంటి బంధాలకు ఒప్పుకోనప్పుడు.. పూర్తి బాధ్యత ఆ చదువుకున్న అమ్మాయిలదే అవుతుంది కూడా’’ అని మంత్రి కౌశల్ ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ‘‘ఈ దేశంలో పుట్టడానికి ఆడపిల్లలే కారణమని చెప్పకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. సిగ్గులేని, హృదయం లేని, క్రూరమైన వాళ్ల వల్ల అన్ని సమస్యలకు స్త్రీని నిందించే మనస్తత్వం అభివృద్ధి చెందుతూనే ఉంది అని ఆమె పేర్కొన్నారు. నారీశక్తికి కట్టుబడి ఉంటే తక్షణమే ఆయన్ని తొలగించాలంటూ ప్రధాని కార్యాలయాన్ని డిమాండ్ చేస్తూ ఆమె ట్వీట్ చేశారు. Surprised he didn’t say girls are responsible for being born into this nation. Shameless, heartless and cruel, blame-the-woman-for-all problems mentality continues to thrive. https://t.co/ILYGHjwsMX — Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) November 17, 2022 ఇదీ చదవండి: అఫ్తాబ్‌పై ఆ పరీక్షలు నిర్వహిస్తారా? -
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత
-
బొగ్గు గనుల వేలంతో రాష్ట్రానికే ఆదాయం
సాక్షి, హైదరాబాద్: వేలం ద్వారా గనుల కేటాయింపులు జరిపితే తెలంగాణ రాష్ట్రానికే తగిన ఆదాయం దక్కుతుందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వేలానికి విముఖత చూపి, ఒక్క బ్లాక్ కూడా కేటాయించకుండా ఉండటం వల్ల రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలుగుతోందని తెలిపారు. సింగరేణిలో 51% వాటా తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉందని స్పష్టంచేశారు. సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని, అది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేయగలదని చెప్పారు. అలాగే సింగరేణికి నైని, పెనగడ్డప్ప, న్యూ పాత్రపర అనే 3 బొగ్గు గనులు కేటాయించినట్లు గమనించాలని సూచించారు. అయితే అవినీతిలో కూరుకుపోయిన తెలంగాణ ప్రభుత్వం 7 ఏళ్ల నుంచి ఈ బ్లాకులను వినియోగించలేకపోయిందని, వేలం మార్గాన్ని నిరాకరించడం వల్ల రాష్ట్రానికి రాయల్టీ, ఆదాయం విషయంలో గండి పడుతోందని జోషి వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్న తెలంగాణ అభివృద్ధి ఆగదు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
-
ప్రధాని పర్యటనపై టీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి