
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ సౌకర్యం లేనందునే, దేశంలో జనాభా పెరిగిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. కర్ణాటకలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు.
‘అధికారంలోకి వస్తే ఉచితంగా కరెంటు ఇస్తామని కాంగ్రెస్ ఇప్పుడు హామీ ఇస్తోంది కానీ, గతంలో ఆ పార్టీ ప్రభుత్వ హయాంలో కరెంటు సరఫరా సరిగా చేయలేకపోయింది, గ్రామాల్లో అస్సలే కరెంటు లేదు. ఫలితంగా జనాభా పెరిగిపోయింది’అని అన్నారు. ప్రధాని మోదీ హయాంలో 24 గంటలూ విద్యుత్ ఉంటోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment