karnataka elections
-
సుదీప్ ప్రచారం పై కాంగ్రెస్ అభ్యర్థి సుబ్బారెడ్డి కామెంట్స్
-
కాంగ్రెస్ హామీలపై నా కామెంట్స్ ఇవే.. నేను గెలిస్తే పేదలకు చేసే పనులు..
-
ఒక్కరైనా వామపక్ష ఎమ్మెల్యే ఉంటేనే ప్రజల సమస్యలు తెలుస్తాయి
-
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఫెయిల్ మా జెండానే ఎగరేస్తాం
-
బెంగళూరు రూరల్ పై కన్నేసిన ప్రధాన పార్టీలు
-
బ్యానెర్లు కనిపిస్తే కఠిన చర్యలు.
-
బుల్డోజర్ ప్రభుత్వాన్ని తీసుకొస్తామని చెప్పడం సిగ్గు చేటు
-
స్కాములు తప్ప స్కీమ్ లు లేవు ...
-
బీజేపీకి డిపాజిట్లు కూడా రావు 40 వేల మెజార్టీతో గెలుస్తాం
-
ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు మా సమస్యను పరిష్కరిస్తారు...
-
బీజేపీకి డిపాజిట్లు కూడా రావు 40 వేల మెజార్టీతో గెలుస్తాం
-
మోడీ మాత్రమే కాదు ఏ యాక్టర్ వచ్చినా ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది
-
కుటుంబానికో ఉద్యోగం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన హామీ
-
కుటుంబానికో ఉద్యోగం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన హామీ
-
కాంగ్రెస్ ను ప్రజలు రిజెక్ట్ చేశారు.. బీజేపీ విజయం పక్కా
-
మే 13 తర్వాత మాదే రాజ్యం
-
100% కాంగ్రెస్ గెలుస్తుంది.. ఇదే ప్రజల తీర్పు
-
కాంగ్రెస్ విజయం తర్వాత రాహుల్ గాంధీ ఫస్ట్ రియాక్షన్
-
కర్ణాటక విజయం... తెలంగాణలో సీతక్క సంబరాలు
-
బీఆర్ఎస్, బీజేపీని తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి
-
నాకు ఓటు వేసి గెలిపించిన బళ్లారి ప్రజలకు మాట ఇస్తున్న...
-
5 గంటల్లో రూ.40.. కర్ణాటక ఆటో డ్రైవర్ల దయనీయ స్థితి..
బెంగుళూరు: ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఒకటి. ఈ పథకం అమల్లోకి రావడంతో మా జీవితాలు పెనం మీద నుంచి వెళ్లి పొయ్యిలో పడ్డాయని వాపోతూ కన్నీటి పర్యంతమయ్యాడు ఒక ఆటో డ్రైవర్. ఉదయం 8 గంటలనుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఆటో నడిపినా రూ. 40 కూడా రాలేదన్నాడు. దయనీయం.. ఈ వీడియో ఎప్పుడు ఎక్కడ తీశారో తెలియదు కానీ ఇప్పుడైతే బాగా వైరల్ గా మారింది. ఓ మీడియా ప్రతినిధి బెంగుళూరులోని ఒక ఆటో వద్దకు వెళ్లి డ్రైవరుతో మాటామంతీ కలపగా.. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారిందని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఇచ్చాక ఎవ్వరూ ఆటోలను పట్టించుకోవడమే లేదని ఆవేదన చెందాడు. ఉదయం నుండి ఐదు గంటలపాటు ఏకధాటిగా ఆటో నడిపినా పట్టుమని రూ.40 కూడా మిగలలేదని జేబులో నుంచి రెండు 20 రూపాయల నోట్లు చూపించి.. ఆటో బండి సంగతిలా ఉంటే మేము బ్రతుకు బండిని నడిపేదెలా అంటూ కంటతడి పెట్టుకున్నాడు. ఓ పెద్దాయన ఈ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. A Bengaluru auto driver in tears after collecting just Rs 40/- from 8 am to 1 pm. This is the result of free bus rides given by the new Cong govt in Karnataka. Pushing people into poverty. pic.twitter.com/2RZEjA9pw8 — Zavier (@ZavierIndia) June 25, 2023 ఎవరి దారి వారిది.. ఈ వీడియోకు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా ఉచితాలు ప్రకటించిందని.. వాటికి ఆకర్షితులై ప్రజలు ఓట్లేశారని.. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఇవి ప్రభావ చూవుతాయని ఒకరు అభిప్రాయాపడగా, ఆడవాళ్ళంతా బస్సుల్లో ఉంటే మగవాళ్ళంతా ఇళ్లల్లో దూరి తలుపులు వేసుకున్నారా? అని మరొకరు.. గతవారం జయదేవ నుండి మల్లేశ్వరం వెళదామంటే ఆటోస్టాండ్‌లో అందరూ ఖాళీగానే ఉన్నారు కానీ ఒక్క డ్రైవర్ కూడా రాలేదు.. రెట్టింపు చార్జీ ఇస్తామన్నా కూడా కనికరించలేదు. వీళ్లకు ఇదే తగిన శాస్తి అని వేరొకరు స్పందించారు. ఇది కూడా చదవండి: కంటతడి పెట్టిస్తున్న జొమాటో డెలివరీ బాయ్ వీడియో -
100 సీట్లు గెలుస్తాం..!
-
దేశానికి అవసరమైన విజయం!
కీలకమైన ఎన్నికల్లో విజయం సాధించి కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రెండోసారి ఎన్నికవడం శుభవార్త అనే చెప్పాలి. ప్రజా సంక్షేమ రాజకీయాలకూ, మత రాజకీయాలకూ మధ్య జరిగిన ఎన్నిక ఇది. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాదరణ, స్థిరమైన లౌకిక ప్రజాస్వామ్య వ్యూహాలు సిద్ధ రామయ్యను నిజమైన మాస్ లీడర్‌గా మార్చాయి. దేశం మతతత్వం నుండి ప్రజాస్వామ్య సంక్షేమం వైపు మళ్లాల్సిన అవసరం ఉన్నందున, కర్ణాటక ఎన్నికలు దేశానికి చాలా ముఖ్యమైనవి. మహాత్మా ఫూలే, బి.ఆర్. అంబేడ్కర్, పెరియార్లు రాజకీయాలలో మతం ప్రమేయం లేకుండా సానుకూల ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు. సిద్ధరామయ్య మతపరమైన భావజాలానికి చోటివ్వకుండా లౌకికవాద భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వల్లే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందన్న కథనం ఢిల్లీ నుంచి వినిపిస్తోంది. ఇది ఒక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు. కానీ రాష్ట్ర స్థాయిలో ఒక బలమైన మాస్ లీడర్ లేకుండా ఏ జాతీయ పార్టీ కూడా రాష్ట్ర ఎన్నికల్లో గెలవలేదు. శూద్ర ఓబీసీల కోసం నిబద్ధత కలిగి, మంచి పరిపాలనాదక్షుడిగా, చిల్లర అవినీతి రాజకీయాలకు అతీతంగా తనను తాను నిరూపించుకున్న సిద్ధరామయ్య లాంటి బలమైన లీడర్ లేకుండా కాంగ్రెస్ గెలవలేక పోయేది. అవినీతికి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నప్పటికీ, ఆయన పార్టీకి చెందిన కర్ణాటక నేతలు మాత్రం ఆయన మాట తప్పని నిరూపించారు. కేపీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ కాంగ్రెస్ గెలుపులో మంచి పాత్ర పోషించినప్పటికీ, సిద్ధరామయ్యకు ఉన్న ప్రజాపునాది, క్లీన్ ఇమేజ్ ఆయనకు లేదు. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రెండోసారి ఎన్నికవడం యావత్ భారతదేశానికి శుభవార్త అనే చెప్పాలి. అయినప్పటికీ, ఆయన రెండవ టర్మ్... మోసపూరిత బీజేపీని అదుపులో ఉంచడం, శివ కుమార్ తక్కువ స్థాయి ఆకాంక్షలను నియంత్రించడంతోపాటు మోదీని ఓడించిన ప్రజలను మాత్రమే కాకుండా స్థానిక నాయకులను సంతృప్తిపరిచేలా పరిపాలనను నడపడం వంటి సవాళ్లను కలిగి ఉంది. ఇది ఆర్ఎస్ఎస్ తదుపరి సర్సంచాలక్ దత్తాత్రేయ హొసబలే సొంత రాష్ట్రం. బహుశా ఈయన కూడా ఢిల్లీలోని మొత్తం బలాన్ని ఉప యోగించి, అన్ని విధాలుగా రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకోవాలను కున్నారు. హొసబలే బ్రాహ్మణ నాయకుడు. అంతేకాకుండా మోదీకి బలమైన మద్దతుదారు. 2013లో మోదీని ప్రధాని అభ్యర్థిగా తీసుకు రావడానికి హొసబలే కారణమని చెబుతున్నారు. అందుకే మోదీ ఓబీసీ కార్డ్‌ని, మతతత్వాన్ని ఉపయోగించి కర్ణాటకను గెలవడానికి తన ప్రభుత్వ బలాన్ని, తన సమయాన్ని, తన శక్తిని ఉపయోగించి నట్లనిపించింది. ప్రతి గ్రామ వ్యవసాయ సమాజాన్నీ, చేతివృత్తుల సంçఘాన్నీ కలిసిన సిద్ధరామయ్య... మోదీ కంటే భిన్నమైన ఓబీసీ నాయకుడని తెలియజేస్తోంది. సిద్ధరామయ్య 75వ జన్మదినోత్సవానికి 16 లక్షల మంది హాజరైనట్లు ‘వికీపీడియా’ రాసింది. ‘‘సిద్ధరామయ్య తన 75వ పుట్టినరోజును 2022 ఆగస్టు 3న దావణగెరెలో జరుపుకొన్నారు. జనం దాన్ని సిద్ధరామోత్సవ అని పిలిచారు, సిద్ధరామయ్య అను యాయులైన 16 లక్షల మంది ఆనాటి కార్యక్రమానికి హాజర య్యారు’’. రాహుల్ గాంధీ కూడా హాజరైన ఈ జన్మదిన వేడుకల్లో, పైన చెప్పిన సంఖ్యలో సగం మంది హాజరైనా కూడా, లక్షలాది మంది జనం ఒక నాయకుడి చుట్టూ గుమికూడటం భారతీయ చరిత్ర లోనే అపూర్వం. ఆయన పెద్ద లేదా చిన్న పట్టణ వ్యాపార నేపథ్యం నుండి కానీ, కొత్తగా చేర్చబడిన ఓబీసీ నేపథ్యం నుండి కానీ రాజకీయ అధికారానికి రాలేదు. ఆయన ఋగ్వేదం రాసిన రోజుల నుండి విద్య, ప్రభుత్వో ద్యోగం, మానవ గౌరవ హక్కుల నిరాకరణకు గురైన చారిత్రక శూద్ర గొర్రెల కాపరి కుటుంబానికి చెందిన ఓబీసీ. ఢిల్లీలో అధికారాన్ని ఓబీసీ ఓటు నిర్ణయిస్తుందని గ్రహించిన ఆరెస్సెస్–బీజేపీ శక్తులు, చాలా మంది శూద్రేతర నాయకులను ఓబీసీలుగా ప్రచారం చేస్తున్నాయి. మండల్ రిజర్వేషన్ ను వ్యతిరేకించిన తర్వాత ఓబీసీ ఓట్లు లేకుండా ఢిల్లీని చేజిక్కించుకోలేమని వారు గ్రహించడమే దీనికి కారణం. మోదీ, సుశీల్ మోదీ తరహాలో ఇప్పుడు ఓబీసీ కార్డు వాడు తున్న బీజేపీ నాయకులు ఆనాడు మండల్ రిజర్వేషన్‌ను వ్యతిరేకిస్తూ మిలి టెంట్ కమండల్ ఉద్యమ నాయకులుగా పనిచేశారు. సిద్ధరామయ్య బలమైన మండల్ ఉద్యమ నాయకుడు. గొర్రెల కాపరి కుటుంబం నుండి వచ్చి, బీఎస్సీ, ఎల్ఎల్బీ డిగ్రీలు పొందారు. ఆ రోజుల్లో ఇది ఒక కురుబ బాలుడు ఊహించనిది. ఎల్ఎల్బి పూర్తి చేసిన తర్వాత మైసూర్ ప్రాంతంలో సామాజిక కార్యకర్తగా పని చేస్తున్నప్పుడు లా ప్రాక్టీస్‌లోకి ప్రవేశించారు. ఈ అసాధారణ యువ కురుబ న్యాయవాది 1980వ దశకం ప్రారంభంలో రైతు ఉద్యమంలో సుప్రసిద్ధ నాయకుడైన ఎం.డీ. నంజుండస్వామి దృష్టిని ఆకర్షించారు. ఆయనే సిద్ధరామయ్యను రాజ్య రైతు సంఘం ప్రతినిధిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించారు. అలా 1983లో గెలిచి అసెంబ్లీకి వెళ్ళారు. తరువాత జనతా పార్టీలో చేరారు. వరుసగా ఎన్నికల్లో గెలుస్తూ మంత్రి కాగలిగారు. దేవెగౌడ పదవీ విరమణ చేసిన తర్వాత తాను ముఖ్యమంత్రి కావాలనే ఆశతో, పేదల అనుకూలత, నిబద్ధత కలిగిన ఓబీసీ, ఎస్సీ, ఆదివాసీ ప్రతినిధిగా జేడీ (యూ)లో చేరారు. ఆయన మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. కానీ సిద్ధరామయ్యను పట్టించు కోకుండా దేవెగౌడ తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేశారు. దేవెగౌడ సంప్రదాయవాద అర్ధ–హిందుత్వ నాయకుడు. కాగా, సిద్ధరామయ్య శూద్ర ఆధ్యాత్మిక భావజాలం కలిగిన హేతువాది. ఆ తర్వాత జేడీ (యూ)ను విడిచిపెట్టి ‘అహిందా’ పార్టీని స్థాపించారు. అంటే ‘అల్పసంఖ్యాక, హిందూళిద, దళిత’ అని! హిందూళిద అంటే కన్నడంలో వెనుకబడినది అని అర్థం. వాస్తవానికి ప్రధాన స్రవంతి మీడియా సిద్ధరామయ్య నాటి దశను ఆయన రాజకీయ జీవితానికి ముగింపుగా చూసింది. మాస్ లీడర్ లేని సమయంలో ఆయన కాంగ్రెస్ లోకి వచ్చారు. ఓబీసీ ఎజెండా, లౌకిక వాదం, హేతువాదంపై తనకున్న బలమైన నిబద్ధతను వదలకుండా కాంగ్రెస్‌లోకి ప్రవేశించారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అన్ని ప్రకటనల్లో కుల వ్యతిరేకత, సెక్యుల రిజం, హేతువాదం పట్ల ఆయన నిబద్ధతను చూడవచ్చు. ఎల్లప్పుడూ తన మణికట్టుకు కాషాయ దారాలను ధరించే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివ కుమార్ శైలితో దీన్ని పోల్చి చూడవచ్చు. కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విచిత్రంగా దేవాలయాలకు వెళ్తూ శివుడు (రాహుల్), హనుమంతుడి (ప్రియాంక) పూజలు చేస్తున్నారు. కానీ సిద్ధరామయ్య అలా చేయ లేదు. తన ఆధ్యాత్మిక నాయకుల సంప్రదాయంగా బసవ, అక్క మహా దేవిలను ఉదాహరిస్తారు. దేవాలయాల చుట్టూ తిరగరు. సిద్ధరామయ్య, పినరయి విజయన్, ఎం.కె.స్టాలిన్, కె.చంద్ర శేఖరరావు, జగన్మోహన్ రెడ్డి– దక్షిణాదిలోని ముఖ్యమంత్రులందరూ శూద్ర వ్యవసాయ, చేతివృత్తుల నేపథ్యం ఉన్నవారే. ఉత్తరాదిలో అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్, నితీశ్ కుమార్, భూపేశ్ బఘేల్, అశోక్ గెహ్లోత్ కూడా శూద్ర వ్యవసాయ నేపథ్యం నుండి వచ్చినవారే. వీరందరూ 2024లో మెజారిటీ పార్లమెంటు స్థానాలు గెలిస్తే బీజేపీ ఓడిపోతుంది. జాతీయ శూద్ర–ఓబీసీ నాయకులు ఏకమై సానుకూల ప్రజా స్వామ్య సంక్షేమం దిశగా దేశాన్ని నడిపించాల్సిన సమయం ఇది. ఓబీసీ రాజకీయాల పేరుతో జరుగుతున్న మతతత్వాన్ని అంత మొందించాలి. వ్యవసాయాధారిత జాతీయవాదాన్ని అగ్జ్రపీఠిన ఉంచడం; ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు కానివారు భారీ మొత్తంలో కూడగట్టిన క్రోనీ క్యాపిటల్ సమీకరణను తనిఖీ చేయడం ప్రస్తుతం చాలా ముఖ్యం. తమకు భాగస్వామ్యం లేని క్రోనీ క్యాపిట లిజానికి ఓబీసీలు మద్దతు ప్రకటిస్తే, అది భారతదేశ ప్రజాస్వామ్య పెట్టుబడిదారీ మార్గాన్ని నాశనం చేస్తుంది. మహాత్మా ఫూలే, అంబే డ్కర్, పెరియార్లు రాజకీయాలలో మతం ప్రమేయం లేకుండా సానుకూల ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు. సిద్ధరామయ్య తన జీవితంలో ఏ సమయంలోనైనా మతపరమైన భావజాలానికి చోటివ్వ కుండా లౌకికవాద భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
కాంగ్రెస్.. మోదీ.. మధ్యలో కేటీఆర్ అదిరిపోయే ఎంట్రీ
కర్ణాటకలో కమలం పార్టీ ఎన్నికల ప్రచారానికి, తెలంగాణలో గులాబీ పార్టీకి ఏంటి సంబంధం? ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ ఏంటి? మోదీ కామెంట్స్‌కి తెలంగాణ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఎందుకిచ్చారు? కేటీఆర్ ట్వీట్లో నిజామాబాద్ ఎంపీని కూడా ఎందుకు లాగారు? టాపిక్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా? పసుపు మనిషిలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే కరోనా క్లిష్ట సమయంలో దీని గురించి ప్రధాని మోదీ చెప్పారట. ఆ సమయంలో ప్రజలకు అవసరమైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా పసుపు ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుందని ప్రధాని వ్యాఖ్యానించడాన్ని కాంగ్రెస్ పార్టీ హేళన చేసిందట. అప్పుడు కాంగ్రెస్ తన వ్యాఖ్యలను హేళన చేసి పసుపు రైతుల్ని అవమానించిందంటూ.. కర్నాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. పసుపు ఇమ్యూనిటీ బూస్టర్ అనే విషయంలో కాంగ్రెస్ పార్టీ, ప్రధాని మధ్య జరిగిన డైలాగ్ వార్ మధ్యలోకి తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ మీద ప్రధాని మోదీ చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ.. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ తరపున నిజామాబాద్ నుంచి పోటీ చేసిన అరవింద్ రాసిచ్చిన బాండ్ పేపర్‌ను కేటీఆర్ ట్విట్టర్లో పెట్టారు. రాష్ట్రంలోని పసుపు రైతుల కోసం కేంద్రం నుంచి పసుపు బోర్డు తీసుకొస్తామని.. తీసుకురాలేకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని ఎంపీ అభ్యర్థి అరవింద్ రాసిచ్చిన బాండ్ పేపర్‌ను ట్యాగ్ చేయడంతో రాజకీయ రచ్చ మొదలైంది. ఇంతవరకూ పసుపు బోర్డును తీసుకురాకపోవడం పసుపు రైతులకు నిజమైన అవమానం అని ట్విట్టర్లో కేటీఆర్ పేర్కొన్నారు. పసుపు రైతులు మోదీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని కూడా వ్యాఖ్యానించారు. ఒక్క ట్వీట్ ద్వారా కేటీఆర్ అటు ప్రధాని మోదీకి..ఇటు నిజామాబాద్ ఎంపీ అరవింద్‌కి కౌంటర్లు వేశారా అంటే అవుననే అంటున్నారు గులాబీ పార్టీ నేతలు. Real insult to Turmeric Farmers is promising them a Turmeric Board on a Bond Paper at the time of Parliament Elections and then hoodwinking them by refusing to deliver despite numerous protests Do you recognise this👇Bond paper promise of your BJP MP from Nizamabad ?? Turmeric… https://t.co/C87FyVyaMM pic.twitter.com/9WjkbrAqzN — KTR (@KTRBRS) May 8, 2023 వాస్తవానికి నిజామాబాద్ ఎంపీ అరవింద్‌ను గులాబీ పార్టీ చాలా కాలంగా టార్గెట్ చేసింది. పసుపు బోర్డు విషయంలో హామీ ఏమైంది అంటూ ప్రశ్నలు కురిపిస్తూనే ఉంది. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని.. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలంతా.. సమయం చిక్కినప్పుడల్లా.. బీజేపీ ఎంపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ప్రధానంగా ఆర్మూరు కేంద్రంగా పసుపు రైతుల ఉద్యమం దశాబ్దాల నుంచి కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ నాయకత్వాన గల రాష్ట్ర అధికార పార్టీ పసుపు బోర్డు తీసుకురాలేకపోయిందన్న అసంతృప్తితో ఉన్న రైతులకు అరవింద్ హామీ ఇచ్చారు. బీజేపీ నుంచి పసుపు బోర్డ్‌ను తాను తీసుకొస్తానని, తీసుకురాలేని పక్షంలో రాజీనామా చేస్తానని అరవింద్ ప్రకటించారు. ఆ మేరకు బాండ్ పేపర్ కూడా రాసి రైతులకు చూపించారు. ఎంపీగా విజయం సాధించారు. కేసీఆర్ కుమార్తె కవిత పరాజయం పాలయ్యారు. చదవండి: కరీంనగర్లో మారుతున్న పాలిట్రిక్స్.. ఈ సారి గంగుల కమాలకర్‌కు కష్టమే! అరవింద్ ఎంపీగా గెలిచినప్పటినుంచీ పసుపు బోర్డు గురించి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయం తీసుకొచ్చామని, పసుపునకు మంచి ధర కూడా రైతులకు లభిస్తోందని ఎంపీ అరవింద్ చెబుతున్నారు. అటు రైతులు, ఇటు బీఆర్ఎస్ ఈ విషయంలో సంతృప్తి చెందలేదు. వచ్చే ఎన్నికల్లో కూడా పసుపు బోర్డ్ మరోసారి రాజకీయ అస్త్రంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సారి కమలనాథులు పసుపుబోర్డ్ వ్యవహారాన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. -
న్యూ ఇండియాలోకి ‘పరకాల ప్రవేశం’!
‘క్రూకెడ్ టింబర్ ఆఫ్ హ్యుమానిటీ’ అనే పాశ్చాత్య భావన ఒకటి ఉంది. అందులోని ‘హ్యుమానిటీ’ స్థానంలో ‘న్యూ ఇండియా’ను చేర్చి రాసిన పుస్తకం ‘ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సేస్ ఆన్ ఎ రిపబ్లిక్ ఇన్ క్రైసిస్’. ‘క్రూకెడ్ టింబర్ (వంకర వృక్షం) ఆఫ్ హ్యుమానిటీ’ అంటే మానవ జన్మలోని అపరిపక్వత. అదే విధంగా మోదీ భారత్‌లో ‘హిందూత్వ’ ఒక అపరిపక్వత అని ఈ పుస్తకం సంకేతపరచడం ఆసక్తికరం. యాదృచ్ఛికాలు అన్నవి వట్టి అర్థరహిత మైన సంభవాలేనా లేక వాటి వెనుక గొప్ప అంతరార్థం ఏదైనా ఉండి ఉంటుందా అని నేను తరచూ ఆలోచిస్తూ ఉంటాను. ఒకటేదైనా మనం అర్థం చేసుకోలేనిది, లేదా కనీసం గ్రహించలేనిది దీర్ఘకాలానంతరం దానికై అదే బహిర్గతం అవుతుంది. గతవారం జరిగింది అటువంటిదే అయివుండే అవకాశం ఉంది. చూద్దాం, ఈ మాటను మీరు ఒప్పుకుంటారేమో! ఇటీవల నేను పరకాల ప్రభాకర్‌ను ఆయన తాజా పుస్తకం ‘ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సేస్ ఆన్ ఎ రిపబ్లిక్ ఇన్ క్రైసిస్’పై ఇంటర్వ్యూ చేశాను. ప్రధానమంత్రి మీద, భారతీయ జనతాపార్టీని ఆయన రూపాంతర పరచిన వైనం మీద చురుక్కుమనిపించే విమర్శ ఆ పుస్తకం. ప్రభాకర్ ఏమిటన్నది మీరు కనుగొన్నప్పుడు ఆ చురక మరింత స్పష్టంగా దృగ్గోచరం అవుతుంది. ఇంటర్వ్యూ చేసిన మరునాడే బీజేపీకి కర్ణాటకలో పరాభవం ఎదురైంది. దక్షిణాదిన ఆ పార్టీకి ఉన్న ఏకైక రాష్ట్రం హిందుత్వ ముఖం మీదే తలుపులు వేసేసింది. పోయిన ఆదివారం ‘విముక్త’ బెంగళూరులో ప్రభాకర్ పుస్తకానికి ఆవిష్కరణ జరిగింది. ప్రభాకర్ అనే వ్యక్తి ఇదీ అని చెప్పాలన్నది నా ఉద్దేశం కాదు. ఒక వ్యక్తిగా ఆయన గురించి ఆయననే మాట్లాడనివ్వడం మంచిది. మన ఆర్థిక వ్యవస్థ గురించి ఆయన ఇలా అంటారు: ‘‘దేశ ఆర్థిక యాతనలు మోదీ పాలనలోని విస్మయకరమైన అసమర్థతల వల్ల తలెత్తినవి. ఆయన పాలన చక్కటి ఆలోచనాపరత్వాన్ని, పొందిక గుణం కలిగిన ఆర్థిక తత్వాన్ని జతపరచలేకపోయింది.’’ ‘‘ఇష్టానుసారం అధికారాన్ని అపరిమితంగా ఉపయోగించడానికి అలవాటు పడింది. ప్రజాస్వా మ్యాన్ని సమస్యాత్మకం చేసింది.’’ ఫలితంగా, ‘‘1975–77 ఎమర్జెన్సీ తర్వాతెన్నడూ లేని భయం సమాజంలో నేడొక కఠినమైన ప్రత్యక్ష వాస్తవం అయింది’’ అని ప్రభాకర్ ఈ పుస్తకంలో రాశారు. ప్రభాకర్ నిక్కచ్చిగా, నిర్దయగా విషయాన్ని తేల్చేస్తారు. ‘‘మన ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉంది. మన సామాజిక నిర్మాణం బల హీనం అయింది. మన ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉంది. మనం చీకటి యుగాలకు తిరోముఖం పడుతున్నాం’’ అంటారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలలో హిందూత్వ – అలాగే హిందూత్వపై ప్రతిస్పందించడంలో విపక్షాల అసమర్థత, ప్రాసంగికతను కలిసి ఉన్నా యని ఆయన చెప్పారు. ‘‘దేశ రాజకీయ అగ్రగణ్యతల దిగు వన దాగి ఉన్నమూల ప్రవృత్తులు; సామాజిక, సాంస్కృతిక అభద్రతలను తారుమారు చేయగల నైపుణ్యంపై హిందూత్వ అభివృద్ధి చెందుతుందని అన్నారు. మన గుణగణాలలోని చీకటి కోణాలకు ఇది ఒక విజ్ఞప్తి అని ప్రభాకర్ ఈ పుస్తకం గురించి నాతో అన్నారు. మొన్నటి ఎన్నికల ప్రచారం ముగింపు రోజుల్లో ప్రధాని జై బజరంగబలీ అంటూ ఓటింగ్ మీటను నొక్కమని కర్ణాటక ప్రజల్ని కోరడం వెనుక ఆయన నేర్పు, నర్మగర్భత ఉన్నాయని అనేకమంది విశ్వసిస్తున్నారు. పనితీరులోని వైఫల్యం, అవినీతిలో గడించిన ఖ్యాతి కారణంగా కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి ఎదురైన ఘోర పరాజయం మీద ప్రభాకర్ తీర్మానాలు స్పష్టతను కలిగి ఉన్నాయి. ‘‘బీజేపీ ప్రస్తుత ఓటమి, తిరిగి అధికారాన్ని సాధించుకోలేక పోవడం అన్నవి పనితీరు వల్ల కాదు. హిందూత్వ గుర్తింపునకు ఆ పార్టీ దృఢ వైఖరిని కలిగి ఉండటం వల్ల, హిందూయేతరులను వేరుగా చూడటం వల్ల’’ అని ఆయన అన్నారు. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ జై బజరంగ బలీ అన్నదే తప్ప, మంచి పాలనను ఇస్తానని అనలేదు. మనమిప్పుడు ప్రతిపక్షాల గురించి ప్రభాకర్ రాసిన చోటుకు వద్దాం. ‘‘బీజేపీయేతర రాజకీయ వర్గ వైఫల్యమే నేడు మన దేశం సూత్రరహితమైన సౌధంగా మారడానికి ప్రధాన కారణం. బీజేపీనీ, ఆ పార్టీ పరివారాన్నీ సైద్ధాంతికంగా వ్యతిరేకించే రాజకీయ పార్టీలే అత్యంత ప్రభావవంతమైన ఈ సవాలును ఎదుర్కొని ఉండాల్సింది. కానీ వారు తమ దృష్టి, వ్యూహం, శక్తికి సంబంధించిన స్థిరమైన వైఫల్యాలతో మనల్ని ఓడిపోయేలా చేశారు’’ అన్నారాయన. ఆ వైఫల్యాలను ప్రతిపక్షాలు ఎలా అధిగమిస్తున్నాయనే దానికి కర్ణాటకలో మొన్నటి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారమే మొదటి నిదర్శ నమని నేను భావిస్తున్నాను. దృష్టిపరంగా ఆ పార్టీ... ఓటర్ల నిజమైన సమస్యలకు సంక్షేమాన్ని హామీని, సానుభూతితో కూడిన ప్రతిస్పంద నను అందించింది. వ్యూహాత్మకంగా... హిందూ వ్యతిరేకి అని ఆ పార్టీపై ప్రధాని చేసిన ఆరోపణలను తిప్పికొట్టకుండా దాట వేసింది. శక్తి పరంగా అక్షరాలా ఉత్తేజాన్ని నింపింది. దీనిని ప్రభాకర్ అంగీ కరిస్తారని చెప్పగలను. ప్రచారం చరమాంకానికి చేరుకోగానే కాంగ్రెస్ గంభీరంగా, దృఢ నిశ్చయంతో చెవిని నేలకు ఆన్చి (సమగ్ర విషయ సేకరణ జరిపి), ప్రజలపై దృష్టి సారించింది. బీజేపీ ఇందుకు విరుద్ధంగా ఉత్కంఠంగా, నిరాశాపూరితంగా, కొన్నిసార్లు ఉన్మాదంగా కనిపించింది. ఇందుకు కారణం హిందూత్వ వెనకంజ వేయడమేనా? ఉనికి కోసం పోరాడుతుండటమేనా? లేదంటే, ఓటర్లకు కావలసిందేమిటో కాంగ్రె స్కు తెలిసి ఉండటం వల్లనా? ఇప్పుడు నేను పేర్కొన్న సంఘటనల క్రమం, వాటి ఆసక్తికరమైన కాలానుక్రమణిక కేవలం యాదృచ్ఛికం అని అనిపిస్తున్నాయా? లేదా విధివశాత్తూ జరిగినవిగా తోస్తున్నాయా? నిజాయతీగా ఒప్పుకుంటు న్నాను. నేను చెప్పలేను. అయితే ప్రధానమంత్రి, ప్రతిపక్షాలు... ప్రభా కర్ రాసిన ఈ పుస్తకాన్ని చదవాలని నేను కోరుకుంటున్నాను. వాళ్లకు ఈ పుస్తకం ఒక హెచ్చరిక... అలాగే పాఠం కూడా! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మనం హామీల ప్రమేయం లేకుండానే ఓడిపోయాం సార్!
మనం హామీల ప్రమేయం లేకుండానే ఓడిపోయాం సార్! -
కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్.. తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. ఢిల్లీలో ఈటల!
కర్ణాటక ఫలితాలు బీజేపీకి గట్టి షాక్ ఇచ్చాయనే చెప్పాలి. దక్షిణాదిపై పట్టు కోసం కాషాయ పార్టీ గత కొన్నేళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కర్ణాటకలో మరోసారి అధికారం చేజిక్కించుకోవడంతో పాటు తెలంగాణపై పట్టు కోసం ప్రణాళికలు రచించింది. కర్ణాటక ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఫలితాలు వస్తే.. తెలంగాణలో మారుతున్న రాజకీయ వాతావరణం తమకు మరింత కలిసొస్తుందని కేంద్రం భావించింది. అయితే, అనూహ్యంగా కర్ణాటక చేజారడంతో కమలనాథులు ప్లాన్ మార్చినట్లు తెలుస్తోంది. ఫోకస్ అక్కడే.. బీజేపీ హైకమాండ్ దక్షిణాదిలో తెలంగాణను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అందుకే ప్రస్తుత ఫోకస్ తెలంగాణపై పెట్టనున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే ఆపరేషన్ ఆకర్ష్‌పై నేరుగా రంగంలోకి దిగింది. ఇదిలా ఉండగా హస్తినలో ఈటెల రాజేందర్ తిష్ట వేయగా, అగ్రనాయకులను నేరుగా పొంగులేటితో మాట్లాడించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు పార్టీలో కీలకమార్పులు ఉంటాయని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. కర్ణాటక ఫలితాల దెబ్బతో తెలంగాణ బీజేపీలో సమీకరణాలు మారునున్నాయని తెలుస్తోంది. ఇకపై ఆ తప్పులు చేయకూడదు కర్ణాటక ఎన్నికల ఓటమి నుంచి బీజేపీ పెద్దలు గుణపాఠం నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. తమ లోపాల గురించి ఆలోచించడంతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ వంటి రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం కాషాయ పార్టీ వ్యూహాన్ని పునరాలోచిస్తోంది. ఓ నివేదిక ప్రకారం.. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అభ్యర్థులను, ప్రాంతీయ నాయకత్వాన్ని నిర్ణయించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆచితూచి వ్యవహరించాలని అగ్ర నాయకత్వం నిర్ణయించుకుంది. కర్ణాటకలో బీఎస్ యడియూరప్పను తొలగించడం, లింగాయత్ వర్గానికి చెందిన జగదీష్ షెట్టర్, లక్ష్మణ్ సదవి వంటి సీనియర్ నాయకులకు టిక్కెట్లు నిరాకరించడం వల్ల అక్కడ భారీగా నష్టపోయిందని పార్టీ గ్రహించింది. అందుకే ఈ సారి అవసరమైతే ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు కూడా బీజేపీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: మహారాష్ట్ర సర్కార్‌కు ముప్పు లేదు.. అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు -
ఈ ఎన్నిక ఏం చెబుతోంది?
ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వెలువడ్డాయి. కర్ణాటకలో ఉత్కంఠకు మాత్రం తెరపడలేదు. బీజేపీ సర్కార్‌ను మట్టి కరిపించిన కాంగ్రెస్ విజయగాథ ఇంకా పూర్తిగా ప్రచారం కాక ముందే, విజయ సారథులైన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్, శాసనసభా పక్షా నేత సిద్దరామయ్యల మధ్య సీఎం సీటుకై సాగుతున్న పోటాపోటీ ప్రధాన వారై్త కూర్చుంది. సోమవారం కథ బెంగళూరు నుంచి ఢిల్లీకి మారింది. కాంగ్రెస్ అధిష్ఠానం కోర్టులోకి కొత్త సీఎం ఎంపిక బంతి వచ్చి పడింది. పోటీదారు లిద్దరినీ ఎలా బుజ్జగించి, ఎవరి పేరును సీఎంగా ప్రకటిస్తుందన్న సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రాజీ ఫార్ములా ఏమైనా, వ్యవహారం అశోక్ గెహ్లోత్, సచిన్ పైలట్ల నిత్యకుంపటి రాజస్థాన్‌లా కాకూడదన్నదే ప్రస్తుతం కాంగ్రెస్ అజెండాగా కనిపిస్తోంది. అధిక భాగం ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో, సాక్షాత్తూ సిద్ద రామయ్య సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ సోమవారం దేశరాజధానికి విమానమెక్కారు. పుట్టినరోజు వేడుకలు, పూజా కార్యక్రమాల బిజీ మధ్య డీకే ఢిల్లీ పయనం ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కూ ఊగిసలాడింది. అధిష్ఠానం ఆదేశించినా ఆఖరి క్షణంలో అనారోగ్యమంటూ వెళ్ళక డీకే తన అసంతృప్తిని పైవాళ్ళకు చెప్పకనే చెప్పారు. త్వరలో లోక్‌సభ ఎన్నికలున్న వేళ సిద్ద, డీకేలలో ఒకరిని కాదని మరొకరిని ఎంపిక చేయడం కాంగ్రెస్ పెద్దలకు సైతం క్లిష్టమైన పనే. ఇద్దరూ సమర్థులే. ఇద్దరూ పార్టీ విజయానికి కష్టపడ్డవారే. ప్రజానేతగా, గతంలో ప్రజానుకూల సీఎంగా తెచ్చుకున్న పేరు, పాలనానుభవం సిద్దకు కలిసొచ్చే అంశాలు. మరోపక్క పార్టీని పలువురు వదిలే సినా, కేంద్ర దర్యాప్తు సంస్థలు వేటాడినా కాంగ్రెస్‌కే కట్టుబడి, అంగ, అర్థబలాలతో భారీ విజయం కట్టబెట్టిన కార్యదక్షత డీకే ప్రధాన ఆకర్షణ. ఎవరినీ దూరం చేసుకోలేకే కాంగ్రెస్ వంతులవారీ సీఎం సీటనే లోపాయకారీ ఫార్ములాతో శాంతపరచజూస్తోంది. కాకపోతే ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో లాగా ఆ ఫార్ములా ఆచరణలో అమలుకాదేమో అన్నది రెండో వంతులో సీఎం కావాల్సినవారి భయం. ఎన్నికల వేళ కలసి ప్రత్యర్థి పార్టీపై పోరాడిన కర్ణాటక కాంగ్రెస్ దిగ్గజ నేతలు తీరా ఫలితాలు వెలువడిన మరుక్షణమే సీఎం సీటుకై పాత ప్రత్యర్థులుగా మారిపోవడం విచిత్రమే. బీజేపీతో ఢీ అంటే ఢీ అనడానికి ఇప్పుడిప్పుడే సర్వశక్తులూ ఒడ్డుతున్న పార్టీకి ఇది పెద్ద తలనొప్పే కాక ప్రజాక్షేత్రంలోనూ తలవంపులే. దీని నుంచి బయటపడడం ఇప్పుడు ఆ పార్టీ, ఆ పార్టీ నేతల చేతుల్లోనే ఉంది. నిజానికి, 224 స్థానాలున్న కీలక దక్షిణాది రాష్ట్రంలో 42.9 శాతం ఓటు షేర్‌తో 135 సీట్లు గెలవడం మోదీ ప్రవేశానంతర రాజకీయ క్షేత్రంలో కాంగ్రెస్‌కు పెద్ద సాంత్వన. 2018 ఎన్నికలతో పోలిస్తే, 4.8 శాతం ఓటు షేర్, 55 సీట్లు అధికంగా ఆ పార్టీ దక్కించుకోవడం విశేషం. బీజేపీ మాత్రం అర శాతం లోపే ఓటు షేరు తగ్గినా, 38 సీట్లు చేజార్చుకొని 66 స్థానాల్లోనే గెలుపొందగలిగింది. బీజేపీ ప్రభుత్వ పాలనావైఫల్యానికి దర్పణంగా డజనుమంది మంత్రులు ఓటమిపాలై, ఇంటి దారి పట్టాల్సొచ్చింది. పాలనలో లోపంతో పాటు పేరుకున్న అవినీతి, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, లింగాయత్ వర్గాన్ని దూరం చేసుకోవడం – ఇలా బీజేపీ ఓటమికి అనేక కారణాలు. రాష్ట్రంలో 16–17 శాతం జనాభాతో, ఒకప్పుడు కమలానికి బలమైన ఓటుబ్యాంక్‌గా నిలిచిన వీరశైవ లింగాయత్‌లు ఈసారి హస్తం గుర్తుకు జై కొట్టారు. ఉత్తర కర్ణాటకలో వచ్చిన ఫలితాలు, బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ పక్షాన గెలిచిన లింగాయత్ ఎమ్మెల్యే అభ్యర్థుల సంఖ్యే అందుకు సాక్ష్యం. బీజేపీలో తమకు అవమానం జరిగిందంటూ తమ వైపు మొగ్గిన ఈ బలమైన లింగాయత్ వర్గాన్ని అలాగే నిలుపుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్‌దే. మరో బలమైన ఒక్కళిగ వర్గానికి చెందిన డీకేనూ దూరం చేసుకోలేదు. పైగా, లోక్‌సభ ఎన్నికల్లోనూ 28 సీట్ల కన్నడసీమలో ఇదే విజయ దరహాసం పునరావృతం కావాలంటే పార్టీని సమర్థంగా నడిపే కార్యశూరులే కావాలి. 75 లక్షల సంస్థాగత బలంతో, సిద్ద, డీకే లాంటి స్థానిక నేతలతోనే తాజా విజయం సాధ్యమైందని అధిష్ఠానానికీ తెలుసు. ఒక రకంగా కర్ణాటక ఫలితాలు గెలిచిన కాంగ్రెస్‌కూ, ఓడిన బీజేపీకీ రెంటికీ స్పష్టమైన సందేశం ఇస్తున్నాయి. జాతీయ అంశాల కన్నా స్థానిక అంశాలు, సారథులు, ప్రజా సంక్షేమ వాగ్దానాలు, బడుగు బలహీన వర్గాల, దళిత, మైనారిటీల ఏకీకరణ రాజకీయంతో మోదీ, షా లాంటి బలమైన ప్రత్యర్థుల్ని సైతం ఢీకొట్టవచ్చని గ్రాండ్ ఓల్డ్ పార్టీ నేర్వాల్సిన పాఠం. అతి జాతీయవాదం, మను షుల్ని చీల్చే మతతత్వం, ‘ఒకే దేశం ఒకే భాష’తో ఆసేతు హిమాచలాన్ని చాపచుట్టేయాలనుకుంటే అది కుదరని పని అనేది కాషాయపార్టీకి కర్ణాటక చావుదెబ్బ చెబుతున్న గుణపాఠం. మోదీపై బీజేపీ అతిగా ఆధారపడితే లాభం లేదు. స్థానికంగా పార్టీ, నాయకత్వం బలంగా ఉంటేనే ఆ మోళీ పని చేస్తుందనడానికి యూపీ, అస్సామ్, మధ్యప్రదేశ్లే తార్కాణం. 2014 మే తర్వాత జరిగిన 57 అసెంబ్లీ ఎన్నికల్లో సగానికి పైగా వాటిలో మోదీ ఉన్నా ఆ పార్టీ ఓడిపోయిందనేది కఠిన వాస్తవం. అది తెలిసి నడుచుకోకుంటే బీజేపీకి కష్టం. ఇక, కర్ణాటక ఫలితాలతో లోక్‌సభపై ఆశలు పెంచుకుంటున్న ప్రతిపక్షాలు అతిగా లెక్కలేసి, సంబరపడితే సరిపోదు. జాతీయ స్థాయిలో నేటికీ తిరుగులేని మోదీకి ప్రత్యామ్నాయంగా నిలవాలంటే, నిందలు, ఆరోపణల కన్నా ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలి. బలవంతుడైన ప్రత్యర్థిపై కలసికట్టుగా పోరాడాలి. సీఎం సీటు చేజారవచ్చనే నిస్పృహలో ‘ధైర్య సాహసాలు నిండిన ఒక్క వ్యక్తి వల్లే మెజారిటీ సాధ్య’మని గర్జిస్తున్న డీకేకి సైతం ఆ సంగతి తెలీదనుకోలేం. మరిన్ని సవాళ్ళు ముందున్న వేళ పార్టీకైనా, వ్యక్తులకైనా ఐకమత్యమే మహాబలం. -
కర్ణాటక లో కాంగ్రెస్ సందడి...
-
మల్లికార్జున ఖర్గేకు షాక్.. పంజాబ్ కోర్టు సమన్లు
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో జులై 10 న న్యాయస్థానం ముందు హాజరు కావాలని సంగ్రూర్ కోర్టు ఖర్గేకు సమన్లు పంపింది. కాగా ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ విశ్వహిందూ పరిషత్ యువజన విభాగమైన బజరంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బజరంగ్ దళ్ సంస్థను నిషేధిత ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)తో పోలుస్తూ వ్యాఖ్యలు చేయడంతో వివాదానికి దారితీసింది. దీనిపై బజరంగ్ దళ్ కోర్టును ఆశ్రయించింది. విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దల్ ఫౌండర్ హితేష్ భరద్వాజ్ సంగ్రూర్ కోర్టులో పిటిషన్ కేసు దాఖలు చేశారు. కర్ణాటక ఎన్నికల సందర్భంగా భజరంగ్‌దళ్‌ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఖర్గేపై రూ.100 కోట్ల పరువు నష్టం కేసు వేశారు. దీనిపై సినీయర్ డివిజన్ బెంజ్ విచారణ చేపట్టింది. మల్లికార్జున ఖర్గేను జులై 10 న కోర్టుకు హాజరు కావాలని సివిల్ జడ్జి రమణదీప్ కౌర్ ఏఐసీసీ అధ్యక్షుడికి సమన్లు జారీ చేసింది. కాగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో భజరంగ్ దళ్‌ను దేశ వ్యతిరేక సంస్థలతో పోల్చిందని భరద్వాజ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కర్ణాటకలో తాము అధికారంలోకి వస్తే ఆ సంస్థను నిషేధిస్తామని కూడా హామీ ఇచ్చిందని తెలిపారు. చదవండి: కర్ణాటక సీఎం ఎవరు?.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు -
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన అయిదు హామీలకు ఆకర్షితులైన ఓటర్లు
-
కాంగ్రెస్ విజయం జాతీయ స్థాయిలో ప్రభావం చూపుతుందా ?
-
గంగావతి అసెంబ్లీ సీటునుంచి గెలిచిన గాలి జనార్ధన్ రెడ్డి
-
కర్ణాటక ఎన్నికల బెట్టింగ్‌పై ఫన్నీ స్కిట్
-
బెంగళూరులో పెరిగిన ఓటింగ్ శాతం
-
ముగిసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..
-
కర్ణాటక ఎన్నికలో రచ్చ రచ్చ...
-
కాంగ్రెస్ వైపే మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ మొగ్గు..!
-
ఓటు హక్కు వినియోగించుకున్న సుధామూర్తి, గాలి జనార్దన్ రెడ్డి సతీమణి
-
కర్ణాటక పోలింగ్ గురించి ఇన్ఫోసిస్ సుధా మూర్తి మరియు గాలి లక్ష్మి అరుణ
-
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ప్రత్యేక ఏర్పాట్లు
-
కర్ణాటక ప్రజలకు ప్రధాని మోదీ బహిరంగ లేఖ
-
చివరి అంకానికి చేరుకున్న ఎన్నికల సంగ్రామం...
-
నువ్వా నేనే అన్నట్టుగా సాగిన కాంగ్రెస్-బీజేపీ ప్రచారం
-
ప్రగతిని పరుగులు పెట్టిస్తాం!
కర్ణాటకలో ప్రగతిని పరుగులు పెట్టిస్తాం- ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు! -
బెంగళూరులో ప్రధాని మోదీ మెగా రోడ్‌షో
-
బీజేపీ 40 సీట్లుకె పరిమితం
-
Karnataka Assembly Election 2023: 581 మంది అభ్యర్థులపై నేరారోపణలు
సాక్షి బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న నేతలకూ ప్రధాన పార్టీలు టికెట్లిచ్చిమరీ ఎన్నికల బరిలో నిలిపాయి. ఈసారి పోటీ చేసే అభ్యర్థుల్లో 581 మంది (22 శాతం) నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు ఉండటం తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ 581 మంది నేతల్లో 404 మందిపై తీవ్రమైన నేరారోపణలు నమోదై ఉన్నాయి. ఈసారి శాసనసభ ఎన్నికల్లో నామినేషన్ దాఖలుచేసిన 2,613 మందిలో 2,586 మంది అభ్యర్థుల నామినేషన్లను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) అనే సంస్థ పరిశీలించి సంబంధిత గణాంకాలను విడుదలచేసింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు.. ► బీజేపీ తరఫున 224 మంది నామినేషన్లు వేయగా అందులో 96 మందిపై కేసులున్నాయి. మొత్తం 223 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో 122 మందిపై కేసులున్నాయి. మొత్తం 208 మంది జేడీఎస్ అభ్యర్థుల్లో 70 మందిపై, 208 ఆప్ అభ్యర్థుల్లో 48 మందిపై, 9 మంది ఎన్సీపీ అభ్యర్థుల్లో ఇద్దరిపై, ముగ్గురు సీపీఐ అభ్యర్థుల్లో ఒకరిపై, 901 స్వతంత్ర అభ్యర్థుల్లో 119 మందిపై కేసులున్నాయి. ► గతంలో పోలిస్తే బీజేపీ, జేడీఎస్‌లు ఎక్కువ మంది నేరచరితులకు టికెట్లు ఇచ్చాయి. 2018లో బీజేపీ అభ్యర్థుల్లో 37 శాతం మందిపై కేసులుంటే ఈసారి 43 శాతం మందిపై కేసులున్నాయి. జేడీఎస్‌లోనూ ఈ శాతం 21 నుంచి ఏకంగా 34 శాతానికి పెరగడం ఆందోళనకరం. కాంగ్రెస్ అభ్యర్థుల్లో 2018 ఏడాదిలోనూ, ఇప్పడూ 55 శాతం మంది నేరచరితులున్నారు. ళీ 111 నియోజకవర్గాల్లో ముగ్గురు కంటే ఎక్కువ మంది అభ్యర్థులు వివిధ రకాల క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. కుబేరులూ ఉన్నారు.. ► బీజేపీ నుంచి 216 మంది, కాంగ్రెస్ నుంచి 215 మంది, జేడీఎస్ నుంచి 170, ఆప్ నుంచి 197 మంది అభ్యర్థులు కోట్లకు పడగలెత్తారని వారి నామినేషన్ల పత్రాల ద్వారా తెలుస్తోంది. స్వతంత్ర అభ్యర్థుల్లో 215 మంది కోటీశ్వరులు ఉండటం విశేషం. కోటీశ్వరులైన అభ్యర్థులను మొత్తంగా పరిశీలిస్తే ప్రతి అభ్యర్థి సరాసరి ఆస్తి విలువ రూ. 12 కోట్లు. -
కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షిస్తున్న సినీ గ్లామర్
-
తెలుగు ప్రజల మధ్దతుతో మేమె గెలుస్తాం...
-
మూడు సిలిండర్లు మాకెందుకివ్వరు?
సిరిసిల్ల: ఉచితాలు వద్దని, రేవుడీ కల్చర్ అంటూ.. తెలంగాణ ప్రభుత్వాన్ని నిందించిన దేశ ప్రధాని నరేంద్రమోదీ.. ఏటా మూడు సిలిండర్లు, నిత్యం అర లీటరు పాలు ఉచితంగా ఇస్తామంటూ కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడాన్ని రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు తప్పుపట్టారు. మోదీ దేశానికి ప్రధానమంత్రా? లేక ఒక్క కర్ణాటకకేనా అని ప్రశ్నించారు. సిలిండర్ ధరను రూ.400 నుంచి రూ.1,200కు పెంచిన బీజేపీ సర్కార్.. తెలంగాణ రాష్ట్రంలో మూడు సిలిండర్లు ఉచితంగా ఎందుకు ఇవ్వదని, మిగతా రాష్ట్రాల్లోనూ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. పాలపైనా జీఎస్టీ వేసిన కేంద్ర ప్రభుత్వం హామీలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, సిరిసిల్ల, గంభీరావుపేట మండలాల్లో వడగండ్ల వానలతో దెబ్బతిన్న పంటలను, తడిసిన ధాన్యాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 90 శాతం వరకు వరి నష్టం రాష్ట్రంలో నీరు పుష్కలంగా ఉండడంతో రైతులు ఎక్కువగా యాసంగి సీజన్లో వరిని సాగు చేశారని, అయితే అనూహ్యంగా వచ్చిన వడగండ్ల వానలతో పంటలు దెబ్బతిన్నాయని కేటీఆర్ చెప్పారు. వరి పంట 30 శాతం నుంచి 90 శాతం మేరకు నష్టం జరిగిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 19 వేల ఎకరాల్లో 17 వేల మంది రైతులకు పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. ఇంకా క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ జరుగుతోందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే ఐదు జిల్లాల్లో పర్యటించారని, నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్ను ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారని గుర్తుచేశారు. ఇలావుండగా.. రైతాంగానికి రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, నీరు ఇచ్చే తెలంగాణ వ్యవసాయ విధానం కావాలని దేశమంతా కోరుకుంటోందని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7.50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, గతేడాది ఈ సమయానికి కేవలం 4 లక్షల టన్నుల ధాన్యం కొన్నామని వివరించారు. పంటలు వేసిన అసైన్డ్ భూములు, పోడు భూములకు కూడా నష్ట పరిహారం ఇస్తామన్నారు. మహిళల భద్రతకు ‘అభయ’యాప్ మహిళల భద్రతకు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రూపొందించిన ‘అభయ’యాప్‌ను మంత్రి కేటీఆర్ సిరిసిల్ల మినీ స్టేడియంలో ఆవిష్కరించారు. జిల్లా పోలీస్ క్రీడోత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి.. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షణలో రాష్ట్రంలోనే తొలిసారి రూపొందించిన ‘అభయ’యాప్‌ను ఆవిష్కరించారు. ఆటోల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఉమెన్ సెఫ్టీ కోసం ఈ క్యూఆర్ కోడ్ పనిచేస్తుందని, ట్రాక్ మై లొకేషన్ పోలీసులకు షేర్ అవుతుందన్నారు. ఈ యాప్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. కాగా సచివాయంలోకి ఎంపీ రేవంత్‌రెడ్డిని ఎందుకు అనుమతించడం లేదని విలేకరులు ప్రశ్నించగా.. ‘అది సచివులు ఉండే చోటు, సచివులకే ప్రవేశం ఉంటుంది..’అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
50 వేల మెజారిటీతో విజయం సాధిస్తాం
-
కాంగ్రెస్ మేనిఫెస్టో పై మోదీ సంచలన వ్యాఖ్యలు
-
ఉచిత బస్సు ప్రయాణం,రూ.3 వేలు నిరుద్యోగభృతి కర్ణాటక మేనిఫెస్టో చూస్తే
-
ఆ తిట్లతో రాస్తే పుస్తకాలు నిండుతాయి
-
నా పని నేను చేస్కుంటా కాంగ్రెస్ నేతలపై మోదీ ఫైర్
-
విషం చుట్టూ తిరుగుతున్న కన్నడ రాజకీయం
-
బొమ్మనహళ్లిలో భారీ మెజారిటీతో గెలుస్తా : సతీష్ రెడ్డి
-
Karnataka Assembly Election 2023: ఎన్నికలు ముగిశాకే సీఎం ఎంపిక: ఖర్గే
శివాజీనగర: కర్ణాటకలో ఎన్నికలు ముగిసిన తరువాతే ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించి, హైకమాండ్ చర్చించి ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తుందని తెలిపారు. ఎన్నికలకు ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం తమ సంప్రదాయం కాదని చెప్పారు. సోమవారం చిక్కమగళూరులో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ లింగాయత్ ముఖ్యమంత్రిని ప్రకటించాలన్న బీజేపీ సవాల్‌పై స్పందిస్తూ తమ పార్టీలో కులాల వారీగా సీఎంను ప్రకటించడం లేదన్నారు. బీజేపీలో అవినీతి ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజలు విసుగెత్తారని, అదే ఇతరులపై చిన్న ఆరోపణ వస్తే వెంటనే సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేస్తారని ఆరోపించారు. -
రసకందాయంలో కర్నాటకం.. పార్టీలు చిన్నవి.. ప్రభావం పెద్దది
కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వేడి పెరిగిపోతోంది. ఎన్నికల బరిలో ఉన్న పదుల సంఖ్యలో చిన్న పార్టీలు ఎవరి ఓటు బ్యాంకుని చీలుస్తాయన్న చర్చ మొదలైంది. చిన్న పార్టీలకు సొంతంగా విజయం సాధించే బలం లేకపోయినప్పటికీ జయాపజయాలను మార్చే సత్తా కలిగి ఉన్నాయి. ఇంతకీ ఈ చిన్న పార్టీలు ఎవరి ఓటు బ్యాంకుని కొల్లగొడతాయి? ప్రధాన పార్టీల్లో ఎవరికి నష్టం? ఎవరికి లాభం? కర్ణాటక ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. రాజకీయ పార్టీల ప్రచార హోరు తీవ్రతరమైంది. గత ఎన్నికల్లో కీలక స్థానాల్లో 3 వేల లోపు మెజార్టీయే లభించడంతో ప్రతీ ఓటు కీలకంగా మారింది. ఇలాంటి సమయంలో చిన్న పార్టీలు, ఎన్నికల బరిలో దిగిన కొత్త పార్టీలు ప్రధానపార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్)ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గత ఎన్నికల్లో బెంగుళూరులోని 18 నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పటికీ అభ్యర్థులు డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఇప్పుడు ఆప్ పరిస్థితి వేరు. ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉండడంతోపాటు జాతీయ పార్టీ హోదా దక్కించుకుంది. కర్ణాటక ఓటరు మొదట్నుంచి ప్రాంతీయ పార్టీల కంటే, జాతీయ పార్టీలవైపు మొగ్గు చూపిస్తున్నాడు. కేజ్రివాల్ ఢిల్లీ మోడల్ పాలన పట్ల యువత, మహిళల్లో విపరీతమైన ఆకర్షణ ఉంది. అందుకే ఈ సారి ఆప్‌ను కూడా ప్రధాన పార్టీలు ముప్పుగానే పరిగణిస్తున్నాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి అనుబంధంగా పనిచేసే సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు కోస్తా కర్ణాటకలో గట్టి పట్టుంది. అధికార వ్యతిరేకతకు చిన్న పార్టీలతో చెక్! కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. 40% కమీషన్ల సీఎంగా పేరు పడడం, యడ్డీయూరప్ప స్థానంలో వచ్చి ఆ స్థాయిలో ప్రతిభ కనబరచలేకపోవడంతో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్, హిందూత్వ కార్డుతో ఎన్నికల బరిలో దిగిన బీజేపీ చిన్న పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం తమ విజయావకాశాలను పెంచుతాయని ఆశల పల్లకిలో విహరిస్తోంది. గుజరాత్, యూపీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం, బీఎస్పీ కాంగ్రెస్ ఓటు బ్యాంకునే చీల్చడంతో బీజేపీ ఘన విజయం సాధించింది. కర్ణాటకలో కూడా అదే పునరావృతమై బహుముఖ పోటీ జరుగుతుందని, అది బీజేపీకి లాభం చేకూరుస్తుందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కర్ణాటకలో గత ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే అక్కడ ప్రజలు జాతీయ పార్టీలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. లేదంటే అతి పెద్ద ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. గత ఎన్నికల్లో చిన్న పార్టీలు, స్వతంత్రులు కలిపి 6% వరకు మాత్రమే ఓట్లను సంపాదించాయి. పార్టీ అనుసరించే సిద్ధాంతాలే ముఖ్యమైనవని, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అవినీతిని అంతమొందిస్తామంటూ రొటీన్ హామీలిస్తే ప్రజల నుంచి స్పందన కరువై చిన్న పార్టీలు మనుగడ సాధించడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ సారి ఎన్నికల్లో మొదటిసారిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కేఆర్ఎస్ పార్టీ మాత్రం తాము ప్రజల మద్దతుతోనే ఎన్నికల బరిలో దిగామని చెబుతోంది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా 40 వేల మంది ఆర్థిక సాయం చేసి పార్టీలో సభ్యులుగా చేరారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రవికృష్ణ రెడ్డి తెలిపారు. 50 స్థానాల్లో ప్రభావం కర్ణాటకలో చిన్న పార్టీలు ఏకంగా 50 సీట్లలో ప్రభావం చూపించనున్నాయి. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్పీపీ), కర్ణాటక రాష్ట్ర సమితి (కేఆర్ఎస్), నటుడు ఉపేంద్రకు చెందిన ఉత్తమ ప్రజాకీయ పార్టీ (యూపీపీ)లతో పాటు అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎంఐఎం గట్టి ప్రభావాన్ని చూపిస్తాయనే అంచనాలున్నాయి. 69 గుర్తింపులేని రిజిస్టర్డ్ పార్టీలు బరిలో ఉన్నాయి. గత ఎన్నికల్లో 30 స్థానాల్లో 5 వేల కంటే తక్కువ మెజార్టీ రావడం, చిన్న పార్టీల సంఖ్య బాగా పెరిగిపోవడంతో ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. సాక్షి, నేషనల్ డెస్క్ -
కర్ణాటకలో కొత్త పార్టీని స్థాపించిన గాలి జనార్దన్ రెడ్డి..
-
కర్ణాటక ఎన్నికలో ధన ప్రవాహం
-
కర్ణాటకలో మళ్లీ అధికారం బీజేపీదే..!
-
‘కర్ణాటక’ స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్‌గా టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. గురువారంతో నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు మొత్తం 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ బుధవారం ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఇందులో ఇద్దరు తెలంగాణ నాయకులకు అవకాశం లభించింది. పీసీసీ అధ్యక్షుడితో పాటు మాజీ క్రికెటర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్‌ను కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చింది. ఇప్పటికే ఎనిమిది మంది రాష్ట్ర నాయకులను కాంగ్రెస్ అధిష్టానం అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పరిశీలకులుగా నియమించింది. చదవండి: బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల.. తెలంగాణ నుంచి ఆమెకు చోటు! కాగా, బుధవారం బెంగళూరులోని రాడిసన్ హోటల్లో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశానికి వీరంతా హాజరయ్యారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో స్టార్ క్యాంపెయినర్లుగా నియమించిన వారితో పాటు కర్ణాటక సరిహద్దు జిల్లాలకు చెందిన తెలంగాణ జిల్లాల నాయకత్వాన్ని ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా వినియోగించుకోవాలని అధిష్టానం నిర్ణయించింది. చదవండి: TSRTC: వినూత్న ప్రయోగం.. సర్ అనండి.. సర్రున అల్లుకుపొండి -
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల.. తెలంగాణ నుంచి ఆమెకు చోటు!
న్యూడిల్లీ: త్వరలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. మొత్తం 40 మందికి ఈ లిస్ట్‌లో చోటు కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ జోషి, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్, మన్సూక్ మాండవీయ, భగవంత్ ఖూబా, ముఖ్యమంత్రులు బస్వరాజ్ బొమ్మై, యోగీ ఆదిత్యనాథ్ సింగ్, హిమంతబిశ్వ శర్మ, శివరాజ్ సింగ్ చౌహాన్, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. ఈ జాబితాలో తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకి చోటు కల్పించారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చోటు కల్పించారు. ఇప్పటికే డీకే అరుణ కర్ణాటక సహ ఇన్ చార్జీగా బాధ్యతలు చేపడుతున్నారు. కర్ణాటక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. కొద్దిరోజులుగా పూర్తిగా కర్ణాటకకే పరిమితమై ప్రజలకు చేరువవుతున్నారు. ఇక స్టార్ క్యాంపెయినర్లలో పేర్కొన్న వారంతా మే 10 జరగబోయే ఎన్నికల కోసం కాషాయ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొననున్నారు. చదవండి: త్రిముఖ పోరులో కన్నడనాట కులాల కోలాటం.. కరుణ కోసం పార్టీల ఆరాటం -
రాహుల్ కోలార్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రెసిడెంట్, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ రేపు కర్ణాటకలో Karnataka Elections పర్యటించనున్నారు. కోలార్(కర్ణాటక)లో ఆదివారం నిర్వహిస్తున్న జై భారత్ ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. అయితే ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ.. ఏం మాట్లాడబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఎందుకంటే.. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇదే కోలార్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఆయన్ని కోలుకోలేని దెబ్బ కొట్టాయి. 2019 ఏప్రిల్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా కోలార్‌లో ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. మోదీ ఇంటి పేరును ప్రస్తావించి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై నేరపూరితమైన పరువు నష్టం దావా, ఈ కేసులో దోషిగా తేల్చిన సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించడం, ఎంపీగా ఆయనపై అనర్హత వేటు పడడం.. ఇదంతా తెలిసిందే. దీంతో.. ఎంపీ పదవిపై వేటు పడిన అనంతరం అదే కోలార్‌లో ఆయన ప్రసంగిస్తుండడంతో ఆసక్తి నెలకొంది. ఆచితూచీ మాట్లాడతారా? లేదంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అక్కడి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తారా? అనేది చూడాలి. వాస్తవానికి ఈ ర్యాలీని తొలుత ఏప్రిల్ 5వ తేదీన నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ, ఎన్నికల సన్నాహాకాలు, అభ్యర్థుల ఎంపికతో పాటు రాహుల్ గాంధీ కోర్టును ఆశ్రయించడం.. తదితర కారణాలతో వాయిదా వేస్తూ వచ్చింది కాంగ్రెస్. కాంగ్రెస్‌కు కోలార్ ఎంతో ముఖ్యమైన స్థానం. ఇక్కడి నుంచి పోటీ చేయాలని(రెండో స్థానంగా) మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే వరుణ(మైసూర్)స్థానం నుంచి ఆయన పోటీ చేయడం ఖాయమైంది. అయితే కాంగ్రెస్ మాత్రం కోలార్‌లో ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఆదివారం ఉదయం బెంగళూరుకు చేరుకోనున్న రాహుల్ గాంధీ.. నేరుగా కోలార్‌కు వెళ్తారు. అక్కడ కాంగ్రెస్ జై భారత్ ర్యాలీలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత బెంగళూరులో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయం సమీపంలో కొత్తగా నిర్మించిన ఇందిరా గాంధీ భవన్‌ను ప్రారంభిస్తారు. 750 మంది కూర్చునేలా ఆఫీస్ కమ్ ఆడిటోరియంగా దీనిని నిర్మించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు కర్ణాటక జనరల్ సెక్రెటరీ ఇంఛార్జి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కర్ణాటక ఎన్నికలు.. మిత్రపక్షం హ్యాండిచ్చిందిగా! -
కర్ణాటక ఎన్నికల్లో సీనియర్లకు హ్యాండిచ్చిన బీజేపీ
కర్ణాటక ఎన్నికల్లో సీనియర్లకు హ్యాండిచ్చిన బీజేపీ -
ఎన్నికల వేళ కర్ణాటకలో హవాలా డబ్బు కలకలం
-
ముందుగానే పక్క పార్టీకి వెళ్లి టికెట్ కన్ఫర్మ్ చేసుకుందామనే భావన
-
కర్నాటక ఎన్నికల్లో చక్రం తిప్పుతున్న కేసీఆర్: రేవంత్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ మోడల్ దేశానికే ప్రమాదం అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే, కర్నాటకలో కాంగ్రెస్‌ను అస్థిరపరచాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కాగా, రేవంత్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కాంగ్రెస్‌ను అస్థిరపరిచే కుట్రను మొదలుపెట్టారు. కర్నాటక ఎన్నికల్లో కుమారస్వామికి కేసీఆర్ వందల కోట్లు ఇస్తున్నారు. అక్రమ సొమ్ముతో దేశరాజకీయాలను శాసించాలని చూస్తున్నారు. జేడీఎస్ ద్వారా తన అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వేలకోట్లు సమకూర్చుతా అని బేరసారాలు మొదలుపెట్టారు. భూములను వనరులుగా పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నారని అన్నారు. తనతో ఉన్న వాళ్లుకు భూములు పంచుతున్నారని ఆరోపించారు. హైటెక్ సిటీ వద్ద తన అనుచరుడికి 60 ఏళ్లు పాటు లీజుకు 15 ఎకరాలను రాసిచ్చినట్టు చెప్పుకొచ్చారు. భూమి విషయంలో అధికారుల ఆదేశాలు కాదని కేసీఆర్ భూమిని కట్టబెట్టారని ఆరోపించారు. ఇంత అన్యాయం ఉంటుందా? అని ప్రశ్నించారు. ఏ ఎన్నికల వచ్చినా కేసీఆర్ వందలాది కోట్లు ఖర్చుపెడ్డుతున్నారు. ఎన్నికలకు ముందు, తర్వాత కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత? అని అడిగారు. ఈ విషయంపై దేశంలో ఉన్న అన్ని రాజకీయల పార్టీలకు లేఖలు రాస్తాను. కేసీఆర్ అవినీతిని వివరిస్తాను అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీబీఐకి కూడా లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు రేవంత్. -
కర్ణాటక ఎన్నికలు: బడా నిర్మాత కారులో రూ.39 లక్షల వెండి వస్తువులు సీజ్!
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల కమీషన్ ఇప్పటికే ఎన్నికల్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలను కూడా ముమ్మరం చేసింది. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు అధికారులు జరుపుతున్న తనిఖీల్లో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌కు చెందిన కారులో వెండి వస్తువులను అధికారులు సీజ్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ మారింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని దావంగెరె శివార్లలోని హెబ్బలు టోల్ సమీపంలోని చెక్ పోస్ట్ వద్ద ఓ బీఎండబ్ల్యూ కారులో లక్షలు విలువైన వెండి వస్తువులను ఈసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐదు బాక్సల్లో వెండి వస్తువులను ఉంచి ఐదు చెన్నై నుంచి ముంబయి తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ కారులోని వ్యక్తులు సరైన పత్రాలు చూపించకపోవడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 66 కేజీల వెండి గిన్నెలు, స్పూన్లు, ప్లేట్లు ఉండగా.. వాటి విలువ సుమారు రూ.39లక్షల పైనే ఉండచ్చని అధికారులు పేర్కొన్నారు. డ్రైవర్ సుల్తాన్ ఖాన్ తో పాటు కారులో ఉన్న హరిసింగ్ పై దావణగెరె రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తులో, కారు బోనీ కపూర్‌కు చెందిన బేవ్యూ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రిజిస్టర్ చేసినట్లు అధికారులు కనుగొన్నారు. హరి సింగ్‌ను విచారించగా.. ఆ వస్తువులు బోనీ కపూర్ కుటుంబానికి చెందినవేనని చెప్పినట్లు సమాచారం. ఆ వస్తువులకు సరైన పత్రాలు చూపించని కారణంగానే వాటిని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆ వస్తువులు బోనీ కపూర్ కుటుంబానికి చెందినవేనా? కాదా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతల వల్లే జనాభా పెరిగింది
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ సౌకర్యం లేనందునే, దేశంలో జనాభా పెరిగిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. కర్ణాటకలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘అధికారంలోకి వస్తే ఉచితంగా కరెంటు ఇస్తామని కాంగ్రెస్ ఇప్పుడు హామీ ఇస్తోంది కానీ, గతంలో ఆ పార్టీ ప్రభుత్వ హయాంలో కరెంటు సరఫరా సరిగా చేయలేకపోయింది, గ్రామాల్లో అస్సలే కరెంటు లేదు. ఫలితంగా జనాభా పెరిగిపోయింది’అని అన్నారు. ప్రధాని మోదీ హయాంలో 24 గంటలూ విద్యుత్ ఉంటోందని చెప్పారు. -
అమిత్ షా రహస్య సర్వే.. 30 మంది ఎమ్మెల్యేలకు షాక్!
సాక్షి, బెంగళూరు: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా త్వరలో విధానసభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో రహస్య సర్వే నిర్వహించారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో పలువురు బీజేపీ ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని, వారికి టికెట్లు ఉండవని చెబుతున్నారు. సుమారు 30 మంది ఎమ్మెల్యేలను పక్కనపెట్టి కొత్తవారికి టికెట్లు ఇస్తారని ఆ సర్వే సమాచారం. దీంతో అక్కడ ఎమ్మెల్యేల కంటే బలమైన నాయకుల్ని గుర్తించే పనిలో ఉంది. అమిత్‌షా ఆదేశాలతో రహస్య సర్వే బృందం ఈ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో సొంత బలంతో గద్దెనెక్కాలని బీజేపీ భావిస్తోంది. జేడీఎస్‌కు పట్టున్న పాత మైసూరులో పాగా వేయాలని చేరికలను ప్రోత్సహిస్తోంది. చదవండి: నిర్మలా సీతారామన్‌కు కర్ణాటక మొండిచేయి? -
అప్పుడేదో వ్యంగ్యం ప్రదర్శించా అంతే: రాహుల్ గాంధీ
‘‘నీరవ్.. లలిత్.. నరేంద్ర మోదీ.. ఇలా ఈ దొంగలంతా ఒకే ఇంటిపేరుతో ఉండడం ఎలా?’’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రెండేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు మళ్లీ తెర మీదకు వచ్చాయి. ఆ టైంలో రాహుల్‌కి వ్యతిరేకంగా పరువు నష్టం దావా వేశాడు ఓ బీజేపీ నేత. ఈ కేసుకు సంబంధించి గురువారం సూరత్ కోర్టులో ప్రత్యక్షంగా హాజరైన రాహుల్.. మేజిస్ట్రేట్ ముందు తన చివరి స్టేట్మెంట్ ఇచ్చారు. సూరత్: తనకు వ్యతిరేకంగా దాఖలైన పరువునష్టం దావా కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తుది వాంగ్మూలం ఇచ్చారు. ‘‘నేను ఏ కమ్యూనిటీని లక్క్ష్యంగా చేసుకుని ఆ కామెంట్ చేయలేదు. కేవలం ఆ సమయానికి వ్యంగ్యం ప్రదర్శించా అంతే. అంతకుమించి నాకేం గుర్తులేదు’’ అని రాహుల్ కోర్టుకు తెలియజేశారు. కాగా, ఈ కేసులో స్వయంగా హాజరై స్టేట్మెంట్ ఇవ్వాలని వారం క్రితమే రాహుల్‌ను మేజిస్ట్రేట్ ఏఎన్ దవే ఆదేశించారు. ఇక ఇరువర్గాల స్టేట్మెంట్స్ రికార్డు పూర్తి కావడంతో జులై 12 నుంచి ఈ కేసులో కోర్టులో వాదనలు జరగనున్నాయి. కాగా, 2019లో కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఏప్రిల్13న కోలార్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ తన ప్రసంగంలో పై వ్యాఖ్యలు చేశాడు. అయితే మోదీ ఇంటిపేరుతో ఉన్నవాళ్లంతా దొంగలే అని అర్థం వచ్చేలా రాహుల్ మాట్లాడాడని, ప్రధానిని అగౌరవపరిచారని, తన పరువుకూ భంగం కలిగిందని చెబుతూ బీజేపీ నేత పూర్ణేష్ మోదీ, రాహుల్‌పై దావా వేశాడు. ఈ కేసులో 2019 అక్టోబర్‌లోనే రాహుల్ ఇంతకు ముందు హాజరై.. ఆరోపణల్ని నమోదు చేయొద్దని, తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని కోర్టును అభ్యర్థించారు కూడా. చదవండి: ఆత్మనిర్భర్ అంటే..:రాహుల్ గాంధీ -
మెరుపులా వచ్చి మాయమవుతున్న సినీ స్టార్లు..
వెండితెరపై అలవోకగా సాహసకృత్యాలను పండించే నటీనటులు నిజజీవిత రాజకీయాల్లోను, ఎన్నికల్లోను కూడా అదే హవా కొనసాగించాలని రావడం, వారిలో కొందరంటే కొందరే ప్రజామోదం పొందడం జరుగుతోంది. ఎక్కువమంది నటీనటులు పెద్ద ప్రభావం చూపకుండానే రాజకీయాలను చాలించుకోవడం విశేషం. సాక్షి, బెంగళూరు: ఎన్నికలు వస్తే చాలు రాష్ట్ర రాజకీయా ల్లో సినీ స్టార్లు తళుక్కున మెరుస్తుండడం సహజం. కానీ అలా రాజకీయాల్లోకి మెరుపులా వచ్చి మాయమవుతున్నవారే అధికంగా ఉన్నారు. బహుభాషా నటుడు ప్రకాశ్‌రాజ్ కొన్ని నెలలుగా బీజేపీ, ప్రధాని మోదీపై విమర్శల యుద్ధం ప్రారంభించి తాజాగా బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అదృష్టం పరీక్షించుకుంటున్నారు. గతంలో కూడా ఇక్కడ పలువురు ఐటీ, పారిశ్రామిక ప్రముఖులు పోటీ చేసి ఓటమి మూటగట్టుకున్నారు. ప్రకాశ్ రాజ్ భవితవ్యం ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది. ఎన్నికల తర్వాత ఆయన రాజకీయాల్లో కొనసాగుతారా లేక చాలా మందిలా మళ్లీ సినిమాలకు వెళ్లిపోతారా? అని కొందరు ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ఊరించిన ఉపేంద్ర ఇక శాండల్‌వుడ్‌లో విలక్షణ నటుడు ఉపేంద్ర రాజకీయాల్లో రియల్స్టార్లా సత్తా చూపలేకపోతున్నారు. ఉత్తమ ప్రజాకీయ పార్టీ (యూపీపీ) ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలో నిలిపారు. వీరిలో ఎక్కువమంది పెద్దగా ఊరూపేరు లేనివారే. దీంతో ఎన్నికలపై ప్రభావం చూపలేకపోతున్నారని చెప్పాలి. మండ్యలో వార్ ఇక ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మాత్రం మండ్య నియోజకవర్గమనే చెప్పాలి. రెబెల్‌స్టార్ సతీమణి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తుండడం, ఆమెకు బీజేపీ మద్దతిస్తుండడం సంచలనంగా మారింది. ఆమె పోటీదారు, జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ కూడా వర్ధమాన హీరోనే. ప్రచారంలో హోరాహోరీగా తలపడుతున్నారు. వీరితో పాటు చాలా మంది గతంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వెండితెరపై మెరిసిన చాలా మంది రాజకీయాల్లో హిట్లు కొట్టలేకపోయారు. అంబరీశ్ రాజకీయాల్లో విజయం సాధించారు. అంబరీశ్ కేంద్రం,రాష్ట్రంలో మంత్రిగా పనిచేశా రు .అంతేకాకుండా పలుమార్లుఎన్నికల్లో గెలిచారు. ప్రముఖ నటి రక్షిత బీఎస్ఆర్ పార్టీలో చేరారు. తరువాత రాజకీయాల్లో కనిపించలేదు. పూజాగాంధీ జేడీఎస్ పార్టీలో చేరి కొద్దిరోజులు హల్చల్ చేశారు. పలు ఎన్నికల్లో ప్రచారం చేసినా తరువాత రాజకీయాల నుంచి దాదాపు దూరమయ్యారు. నటులు శ్రీనాథ్, జగ్గేశ్, చంద్రు, తారా, శ్రుతి, మాళవిక వంటివారు బీజేపీలో తగిన స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఉమాశ్రీ, జయమాల వంటి వారు ఇప్పటికీ విజయాన్ని కొనసాగిస్తున్నారు. రాజకీయాల్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు. శాండల్‌వుడ్ సీనియర్ నటుడు అనంత్‌నాగ్ గతంలో జేహెచ్ పటేల్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా జేహెచ్ పటేల్, రామక్రిష్ణ హెగ్డే వంటి ముఖ్యమంత్రులతో సన్నిహితుడిగా పేరుపొందారు. మండ్య మాజీ ఎంపీ రమ్య కాంగ్రెస్‌లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. సోషల్ మీడియా విభాగం చీఫ్‌గా ట్విట్టర్లో కాక పుట్టిస్తుంటారు. చిత్రదుర్గ మాజీ ఎంపీ శశికుమార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద పనిచేస్తూ కొనసాగుతున్నారు. కొన్ని సినిమాల్లో ప్రముఖ పాత్రలు పోషించిన ఎమ్మెల్యే ఇప్పుడు బీసీ పాటిల్ మంత్రి పదవి కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. స్టార్ హీరోలు యశ్, దర్శన్ ఈ ఎన్నికల్లో సుమలత తరఫున మండ్యలో జేడీఎస్, కాంగ్రెస్‌లను ఢీకొంటున్నారు. -
సుమలతపై కుమారస్వామి ఘాటు విమర్శలు
మండ్య: అంబరీశ్ మరణించిన బాధ తాలూకు ఛాయలే సుమలతలో కనిపించడం లేదని సీఎం హెచ్డీ కుమారస్వామి విమర్శించారు. మండ్య నగరంలోని బందిగౌడ లేఔట్లో ఉంటున్న మాజీ ఎంపీ జి.మాదేగౌడతో సీఎం బుధవారం భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుమలతా ప్రసంగాలను గమనిస్తున్నానని, ఆమె ముఖంలో భర్త చనిపోయిన బాధ ఏమాత్రం లేదని విమర్శించారు. నాటకీయంగా సినిమా డైలాగ్‌లు చెబుతూ ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మండ్య జిల్లాలో సుమారు 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కష్టాలపై తాను స్పందిస్తానని తెలిపారు. రైతు కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం కోసం సాయం చేస్తానన్నారు. సుమలతా ఆటలు ఎక్కువ కాలం సాగవని విమర్శించారు. మైసూరులోని ఏ హోటల్లో కుర్చొని డబ్బులు ఇచ్చి పుచ్చుకున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తనకు అన్ని విషయాలు తెలుసునని తెలిపారు. మండ్యలో సీఎం తనయుడు నిఖిల్ జేడీఎస్ అభ్యర్థిగా, సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. బీఎస్ఎఫ్ భద్రత తెచ్చుకోండి సుమలతకు ప్రత్యేక భద్రత కావాలంటే బీఎస్ఎఫ్ లేదా సరిహద్దులో గస్తీ కాసే వారిని భద్రతకు పెట్టుకోవచ్చని, అవసరమైతే తానే కేంద్రానికి లేఖ రాస్తానని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ఎవరి ఫోన్లను ట్యాప్ చేయట్లేదని తెలిపారు. కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక దర్యాప్తు చేసుకోవచ్చని తెలిపారు. తాను ఎవరిని జోడెద్దులు, దొం గ ఎద్దులు అని సంభోధించలేదన్నారు. దొంగ ఎద్దులు అని మాట్లాడినట్లు వచ్చినవన్నీ మీడియా సృష్టేనన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం కొన్ని ఎద్దులు వస్తాయని మాత్రమే తాను వ్యాఖ్యానించినట్లు తెలిపారు. ఎవరికి ఓట్లు వేయాలనే విషయం ప్రజలకు తెలుసునని చెప్పారు. -
కాంగ్రెస్-జేడీఎస్ 2019లోనూ..
సాక్షి, బెంగళూరు : 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్-జనతా దళ్ సెక్యులర్లు కలసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు కర్ణాటక కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారం ప్రకటన చేశారు. కాంగ్రెస్-జేడీఎస్‌ల మధ్య కేబినేట్ విస్తరణ పంపకాలు ఓ కొలిక్కి వచ్చినట్లు చెప్పారు. ఈ నెల 6వ తేదీన కేబినేట్‌ను విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఇరువర్గాలు ఓ ఉమ్మడి కమిటీని కూడా ఏర్పాటు చేశాయి. దీనికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య నేతృత్వం వహించనున్నారు. ప్రతి నెలా ఒకసారి ఈ కమిటీ భేటీ అవుతుంది. మొత్తం 34 శాఖల్లో కాంగ్రెస్‌కు 22(హోం, ఇరిగేషన్, ఆరోగ్యం, వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమ తదితరాలు), జేడీఎస్‌కు 12(ఎక్సైజ్, పీడబ్ల్యూడీ, విద్య, పర్యాటకం, రవాణా తదితరాలు) దక్కాయి. -
బీజేపీకి మెజారిటీ రాకుండా ‘వెంకన్న చౌదరి’ అడ్డుకున్నారు
-
2019 ఎన్నికల కోసం ప్రార్థనలకు పిలుపు
న్యూఢిల్లీ: భారతదేశ ప్రజాస్వామిక విలువలు, లౌకిక వ్యవస్థకు దేశంలోని ప్రస్తుత ‘అల్లకల్లోల రాజకీయ వాతావరణం’ ముప్పుగా పరిణమించిందని ఢిల్లీ ఆర్చిబిషఫ్ అనిల్ కౌటో చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరలేపాయి. కర్ణాటకలో ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఢిల్లీ ఆర్చిడయోసిస్ పరిధిలోని అన్ని చర్చిలు, మత సంస్థలకు ఆయన లేఖ రాస్తూ.. 2019 సాధారణ ఎన్నికల నేపథ్యంలో మే 13 నుంచి ప్రార్థనా ఉద్యమానికి పిలుపునిచ్చారు. దేశం కోసం ప్రతీ శుక్రవారం క్రైస్తవులు ఉపవాసం ఉండాలని ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యల్ని కేంద్ర ప్రభుత్వం తప్పపడుతూ.. అవి కౌటో వివక్షపూరిత మనస్తత్వాన్ని చాటిచెపుతున్నాయని విమర్శించింది. అయితే తన లేఖ మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కాదని కౌటో మంగళవారం వివరణిచ్చారు. ‘దేశం కోసం వారానికి ఒక రోజు వెచ్చించాలని నేను చెప్పాను. ముఖ్యంగా ఎన్నికలు వస్తున్నందున ఈ సూచన చేశాను. అందువల్ల ఇది ఏ విధంగాను నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాసిన లేఖ కాదు. గత నాలుగేళ్లలో వార్తా పత్రికలు, మీడియాలో ఎన్నో వార్తలు చూశాం. ప్రజల ఆహార అలవాట్లు, దాడుల ఘటనలతో పాటు నలుగురు న్యాయమూర్తులు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం చూశాం. వీటిపై న్యాయవ్యవస్థ స్థాయిలో ఆందోళన వ్యక్తమైంది. ఒక పౌరుడిగా నేను కూడా ఆందోళన వ్యక్తం చేశాను’ అని లేఖలోని అంశాల్ని ఆయన సమర్థించుకున్నారు. -
గవర్నర్ తలదించుకునేల చేశారు : జీవన్ రెడ్డి
సాక్షి, కరీంనగర్ : కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ తలదించుకునే పని చేశారని టీసీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీ రాజకీయాలను నిరసిస్తూ కాంగ్సెస్ పార్టీ హుజురాబాద్ లో నిర్వహించిన నిరసన ర్యాలీలో మాజీ ఎంపీ పొన్నాల ప్రభాకర్, వి. హన్మంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ముఖ్యం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ముఖ్యమని అన్నారు. ప్రధాన మంత్రి మోదీకి నిజంగా నైతిక విలువలు ఉంటే వెంటనే రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే వ్యక్తి సీఎం కేసీఆర్ ఇప్పుడు కర్ణాటక విషయంపై ఎందుకు నోరు మెదపడం లేదని ఆరోపించారు. -
‘బలపరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్‌దే గెలుపు’
సాక్షి, హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కర్ణాటకలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బీజేపీపై నిప్పులు చెరిగారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో విధంగా అన్ని రాష్ట్రాలలోనూ అధికారంలోకి వచ్చేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని అన్నారు. అధికారమే పరమావధిగా అక్రమ మార్గం గుండా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని భట్టి ఆరోపించారు. కర్ణాటకలో మెజారిటీ కలిగిన కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి కాకుండా.. సాధారణ మెజారిటీ లేకపోయినా.. అతి పెద్ద పార్టీ పేరుతో బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం అత్యంత హేయనీయమన్నారు. గవర్నర్ తీసుకున్న చర్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడంతో పాటు.. ఖూనీ చేసినట్లు ఉన్నాయని విమర్శించారు. లౌకికవాద ప్రభుత్వాలతోనే దేశ సమగ్రతకు హానీ జరగకుండా ఉంటుందనే భావనతో జేడీఎస్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిందని తెలిపారు. వారంరోజుల సమయంలో ఎమ్మెల్యేలను భయపెట్టి, లేదా కొనుగోలు చేసి, వారిని ప్రలోభపెట్టి తమవైపుకు తిప్పుకునే ఆలోచనకు ఇది నిదర్శమని అన్నారు. కర్ణాటకలో రేపు శాసనసభలో జరిగే బలపరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు విజయం సాధిస్తాయనే ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక వెళ్లి జేడీఎస్‌కు ఓటేయమని ప్రజలకు పిలుపు ఇచ్చిన కేసీఆర్ తాజా పరిణామాలపై ఎందుకు స్పందించడం లేదని విమర్శించారు. కేసీఆర్ మద్దతు ప్రకటించిన పార్టీ అధికారంలోకి రాబోతోందని, ఆయన చెప్పిన వ్యక్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందన్నారు. -
ఓడిపోతే నోరు నొక్కేస్తారా?: నటుడు
ముంబై: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ సంపూర్ణ మెజార్టీ రాక హంగ్ పరిస్థితులు ఏర్పడిన సందర్భంగా ఆ రాష్ట్ర గవర్నర్ బీజేపీ మనిషంటూ బాలీవుడ్ నటుడు ఉదయ్ చోప్రా ట్వీట్ చేశారు. గవర్నర్ వజుభాయ్ వాలా బీజేపీ, ఆరెస్సెస్ మనిషి కావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానిస్తారో అందరికీ తెలిసిన విషయమేనంటూ ట్వీటర్ వేదికగా ఆయన చేసిన కామెంట్ వైరల్ అయింది. దీనిపై బీజేపీ అభిమానులు సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఉదయ్‌ని ‘బాలీవుడ్ రాహుల్ వచ్చేశాడు’ అంటూ కొందరు కామెంట్ చేయగా, ‘నువ్వూ రాజకీయాల్లోకి రాకపోయావా’ అంటూ మరికొందరు నెటిజన్లు ఆయనపై కామెంట్ల వర్షం కురిపించారు. అయితే వీటిపై స్పందించిన ఉదయ్... ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు వ్యక్తం చేసే కనీస హక్కు అందరికీ ఉందని వారందరికీ సమాధానం ఇచ్చాడు. తనకు కలిగిన అభిప్రాయం తప్పని అనుకోవడం లేదని తెలిపారు. ఓడిపోయిన వ్యక్తికి కూడా తన గోడు వెల్లబోసుకునే స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో ఉందని ఉదయ్ తెలిపారు. కాగా, లాంగెర్ మీనాక్షి అనే నెటిజన్.. ‘ఓడిపోయిన వారికి అభిప్రాయాలు చెప్పుకొనే స్వేచ్ఛ ఉందనీ.. అయితే బావిలో కప్పలా ఆలోచించే వారు, లోకజ్ఞానం లేకుండా మాట్లాడేవారు.. నోరు మూసుకుని ఉంటే మంచిది’ అని చేసిన ట్వీట్‌పై ఉదయ్ స్పందించారు. ‘మనది ప్రజాస్వామ్య దేశం. ఓడిపోయినంత మాత్రాన నోరు నొక్కేస్తారా..! ఎవరి అభిప్రాయాలు వారివి’ అంటూ రీట్వీట్ చేశారు. కాగా వజుభాయ్ వాలాను బీజేపీ, ఆరెస్సెస్ మనిషంటూ ఉదయ్ చేసిన ట్వీట్‌పై మరో నెటిజన్.. భారత రాష్ట్రపతి కాక పూర్వం ప్రణబ్ ముఖర్జీ కూడా కాంగ్రెస్ మనిషే కదా..! అంటూ ట్రోల్ చేశారు. Not really. In a democracy a loser is allowed to have opinions too — Uday Chopra (@udaychopra) May 15, 2018 I just googled the governor of Karnataka https://t.co/5vUFe5Tttq BJP guy and RSS hmmm I guess we all know what’s gonna happen — Uday Chopra (@udaychopra) May 15, 2018 -
చంద్రబాబును తిప్పికొట్టిన కన్నడ ప్రజలు
-
చంద్రబాబుపై ట్వీట్ చేసిన రాంమాధవ్
సాక్షి,న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కమల వికాసంపై బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ కర్ణాటకలో బీజేపీ ప్రభంజనంపైస్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తన విమర్శలను ఎక్కుపెట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు పన్నిన రాజకీయ వ్యూహాలను, కుట్రల్ని కన్నడ ప్రజలు పటాపంచలు చేశారన్నారు. బీజేపీకి ఓటు వేయొద్దని ప్రచారం చేయించినా ఆయన ఎత్తుగడలను కర్ణాటక తెలుగు ప్రజలు తిరస్కరించారన్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో బీజేపీకి గత ఎన్నికలతోపోలిస్తే 6నుంచి 20కిపైగా సీట్లు పెరిగాయన్నారు. అంతేకాదు దక్షిణాదిలో తమ విజయ దుందుభి మొదలైందంటూ ట్వీట్ చేశారు. కన్నడ నాట బీజేపీ విజయానికి ప్రధాని మోదీ, అమిత్‌షాతో పాటు స్థానిక నాయకత్వం చేసిన కృషి ఫలించిందన్నారు. ముఖ్యంగా మోదీ చరిష్మా, అమిత్ షా వ్యూహాలు బీజేపీని గెలిపించాయన్నారు. సిద్దరామయ్య ప్రభుత్వం పై వ్యతిరేకతకు తోడు నిర్ణయాత్మక తీర్పు ఇవ్వాలన్న తమ విజ్ఞప్తిని ప్రజలు అంగీకరించారన్నారు. కర్ణాటక బీజేపీ నాయకులు ఐకమత్యంతో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇకనైనా తన పరిస్థితి ఏమిటో ఆత్మపరిశీలన చేసుకోవాలి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా రాదనీ, చంద్రబాబు వాదాన్ని కర్ణాటక తెలుగు ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. కులం, వారసత్వం, డబ్బు రాజకీయాలకు భిన్నంగా ఏపిలో నూతన రాజకీయాలను తీసుకొస్తామని రాం మాధవ్ స్పష్టం చేశారు. రైతులు, దళితులకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదనీ, ఇది కేవలం విపక్షాల దుష్ప్రచారమేనని ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్లు, టెంట్లతో ఒరిగేదేమీ లేదనీ, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమదే విజయమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్నికల ఫలితాలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, మరో సీనియర్ నేత పురందేశ్వరి కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో సిద్ధరామయ్య మహిళా వ్యతిరేక విధానాలను ప్రజలు తిరస్కరించారని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. కర్ణాటకలో తమ పార్టీ ఎలా పని చేసిందో తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాగే ముందుకు వెళతామని ఆమె తెలిపారు. In Karnataka, TDP n Chandrababu Naidu have used all tactics to dissuade Telugu voters from supporting BJP. But in Hyderabad Karnataka where most Telugus live, BJP has increased its tally from 6 to 20+. People have rejected CBN’s politics. Our Southward March has begun. — Ram Madhav (@rammadhavbjp) May 15, 2018 -
‘తప్పుడు ప్రచారాలు పటాపంచలు’
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చరిత్రాత్మక విజయం సాధించిందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి వ్యతిరేకంగా పన్నిన కుట్రలు, తప్పుడు ప్రచారాలు పటాపంచలయ్యాయన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. తెలంగాణలోనూ కర్ణాటక ఫలితాలే పునరావృతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణ భారతం పేరుతో విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రయత్నాలకు కర్ణాటక గెలుపు కనువిప్పులాంటిదని తెలిపారు. -
కన్నడ పోరు: మార్కెట్ల జోరు
సాక్షి,ముంబై: ఒకవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాలు లెక్కింపు పక్రియ ఉత్కంఠను రాజేస్తున్నాయి. బీజీపే 90కిపైగా స్థానాల్లో లీడింగ్‌లో ఉన్న నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు ఆరంభ నష్టాలనుంచి పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 222 పాయింట్లకు పైగా పుంజుకుని 35,779 వద్ద, నిఫ్టీ 57పాయింట్లు ఎగిసి 10865 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నిఫ్టీ 11000 వేల స్థాయి వైపు పరుగులు పెడుతోంది. మెటల్, ఫార్మ, రియల్టీ, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లలో కొనుగోళ్ల దోరణి నెలకొంది. పవర్‌గ్రిడ్, హెచ్‌యూఎల్, టెక్ మహీంద్రా, గెయిల్, టాటా స్టీల్, టైటన్, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3-1 శాతం లాభపడుతుండగా, టాటా మోటార్స్, ఇన్ఫ్రాటెల్, గ్రాసిమ్, ఐషర్, హెచ్‌పీసీఎల్, హెచ్‌సీఎల్ టెక్, సిప్లా నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
అందుకే ఓడిపోతున్నా : యోగీశ్వర
సాక్షి, బెంగళూరు : దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఈరోజు (మంగళవారం) మధ్యాహ్నం లోపు నాయకుల భవితవ్యం తేలనుంది. గెలుపే ధ్యేయంగా జోరుగా ప్రచారం చేసిన నేతలు ఫలితాల నేపథ్యంలో కూడా ఆరోపణల పర్వం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నపట్టణ బీజేపీ అభ్యర్థి యోగీశ్వర కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. జేడీఎస్ - కాంగ్రెస్‌లు కుమ్మక్కయ్యాయని, బ్లాక్ మనీ వెదజల్లి తనను ఓడించేందుకు కుట్ర పన్నాయని ఆయన ఆరోపించారు. జేడీఎస్ అభ్యర్థి కుమారస్వామిని కాంగ్రెస్ గెలిపిస్తోందని.. అందుకే తాను ఓడిపోతున్నాని అసహనం వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం జేడీఎస్ అభ్యర్థి కుమారస్వామి చెన్నపట్టణ, రామనగర స్థానాల్లో ముందంజలో ఉన్నారు. -
కర్ణాటక ఫలితాలు కీలకం..!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు కీలకం కానున్నాయి. రేపు(మంగళవారం) వెలువడే ఈ ఫలితాలతో పాటు ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణ గణాంకాలు, ఈ వారంలో వెలువడే కంపెనీల ఆర్థిక ఫలితాలు, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని విశ్లేషకులంటున్నారు. కర్ణాటక ఫలితాలు స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులకు కారణమవుతాయని కోటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ ఎనలిస్ట్ సంజీవ్ జర్బాడే పేర్కొన్నారు. ఇరాన్ అణు డీల్ నుంచి అమెరికా వైదొలగడం, తదనంతర పరిణామాలు యుద్ధ పరిస్థితులను తలపింపజేయనున్నాయని, ఇది స్టాక్ మార్కెట్‌పై తీవ్రంగా ప్రభావం చూపగలదని శామ్కో సీఈఓ జిమీత్ మోదీ అంచనా వేస్తున్నారు. ముడి చమురు ధరలు, డాలర్ బలపడుతుండటం బుల్స్‌కు ప్రతికూలమని, మార్కెట్‌పై ఒత్తిడి తప్పదని వివరించారు. నేడు ‘టోకు’ ద్రవ్యోల్బణ గణాంకాలు... టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు (సోమవారం) వెలువడతాయి. ఈ వారంలో హిందుస్తాన్ యూనిలివర్, లుపిన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హిందాల్కో, ఐటీసీ, బజాజ్ ఆటో, బ్లూస్టార్, బాంబే డైయింగ్, ఆర్‌కామ్, టాటా స్టీల్, టీవీఎస్ మోటార్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, అమర రాజా బ్యాటరీస్, తదితర కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తాయి. శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెల్లడించిన కెనరా బ్యాంక్, యూకో బ్యాంక్, ఓరయంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ తదితర బ్యాంక్ షేర్లపై ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుంది. ఈ బ్యాంక్‌లన్నీ భారీ నష్టాలను ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఔషధ విధానంలో భయపడిన స్థాయిలో భారీ సంస్కరణలు లేకపోవడంతో ఫార్మా షేర్లు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. 8 రోజుల్లో.. రూ.12,671 కోట్లు వెనక్కి... మన మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల ఉపసంహరణ జోరుగా సాగుతోంది. ఈ నెల ఎనిమిది ట్రేడింగ్ సెషన్లలో మన క్యాపిటల్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.12,671 కోట్లు వెనక్కి తీసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమనడం, ప్రభుత్వ సెక్యూరిటీల రాబడులు పెరగడం, కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో లాభాల స్వీకరణ దీనికి ప్రధాన కారణాలు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్ నుంచి రూ.4,030 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.8,641 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకున్నారు. -
‘కాబోయే కర్ణాటక ముఖ్యమంత్రి ఆయనే’
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విజయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఆయన గురువారం బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాదామిలో భారీ రోడ్డు షోలో ప్రసంగించారు. సీఎం చాముండేశ్వరీలో ఎప్పుడో ఓడిపోతాననే భయంతో బాదామిలో పోటీ చేశారు. చాముండేశ్వరీలోనే కాదు, బాదామిలో బీజేపీ రోడ్డు షోకు పెద్ద సంఖ్యలో జనం వచ్చిన తీరు చూస్తుంటే అక్కడ,ఇక్కడ రెండింటిలోను సీఎం సిద్ధరామయ్యకు ఓటమి తథ్యం అని అమిత్‌షా జోస్యం చెప్పారు. రెండు నియోజకవర్గాల్లో సీఎం ఓటమి చెందడంతో పాటు కర్ణాటకలో కాంగ్రెస్‌పార్టీని జనం తిరస్కరిచండంతో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందన్నారు. తాను నెల రోజులుపైగా కర్ణాటకలో అన్ని జిల్లాలో పర్యటించానని ప్రతి జిల్లాలో మంచి బీజేపీకి జనం నీరాజాలు పలికారని, చివరి రోజు సీఎం పోటీ చేస్తున్న బాదామి రోడ్డు షోలో పాల్గొంటే ఇక్కడ జనం చేస్తుంటే సీఎం ఓటమి ఖాయమని తేలిపోయింది,తమ పార్టీ అభ్యర్థి శ్రీరాములు భారీ మెజార్టీతో గెలుపొందుతారనే విశ్వాసం ఏర్పడిందన్నారు. సీఎం సిద్ధరామయ్య మరో నాలుగు రోజులు మాత్రమే సీఎం కుర్చీలో ఉంటారని,ఆ తర్వాత తమ పార్టీ నేత, యాడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి కాబోతున్నారని అన్నారు. యడ్యూరప్ప సీఎంగా బాధ్యతలు చేపట్టాక కేంద్రం నుంచి కర్ణాటకకు ప్రత్యేక నిధులు కేటాయిస్తారని,దేశంలోనే కర్ణాటకను అన్ని విధాలుగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లుతామన్నారు. అవినీతి కూపంలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి జనం బుద్ధి చెప్పాలని పిలపునిచ్చారు. ఈకార్యక్రమంలో మాజీ సీఎంలు యడ్యూరప్ప, జగదీష్‌శెట్టర్, బీజేపీ అభ్యర్థి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమిత్ షా బెంగుళూరులో విలేకరులతో మాట్లాడుతూ..స్వాతంత్ర్య భారతదేశంలో అత్యంత ఘోరంగా విఫలమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఘాటుగా విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు కర్ణాటకలోనే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతుల ఆత్మహత్యలను తగ్గించిందని పేర్కొన్నారు. కానీ కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం రైతు ఆత్మహత్యలను నిలువరించడంలో విఫలమైందన్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వంపై ప్రజలు కోపంగా ఉన్నారని చెప్పారు. కర్ణాటక అభివృద్ధి, రాజధాని బెంగుళూరుపై ఆధారపడి ఉందని, కానీ బెంగుళూరుకు సిద్ధరామయ్య సర్కార్ చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. -
ఘోర ప్రమాదం: ముగ్గురు పోలీసుల మృతి
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని బాల్కోట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్నికల విధుల కోసం బెంగళూరు నుంచి వెళుతున్న పోలీసుల వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ముగ్గురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రాథమిక చికిత్స అనంతరం బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన వారిని సీఐడీ విభాగం డీఎస్పీ, సీఐ, వాహనం డ్రైవర్‌గా గుర్తించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
ఆపరేషన్ అశోక్..టీడీపీకి షాక్!
-
నిజమైతే.. నమ్మించే పనే లేదు
అబద్ధానికున్న గుణమే అది. ఏనాటికైనా నశిస్తుంది. నిజమన్నది తాత్కాలికంగా నశించినట్లు కనిపించినా, ఏ వైపు నుంచో మెల్లిగా తలెత్తి ఆకాశం వైపు చూస్తుంది. ఓ వెలుగు రేఖ భూమిపై విచ్చుకున్నట్లు! నిజం అన్నది కొన్నిసార్లు మనం విన్నదానికి భిన్నంగా ఉంటుంది. అంటే అది అబద్ధం అని. పెద్దపెద్దవాళ్ల విషయంలో అబద్ధాలు చాలా త్వరగా ప్రచారం అవుతాయి. ఆ ప్రచారపు అబద్ధాలు ఎన్నాళ్లు జీవంతో ఉంటాయన్నది, ప్రచారం చేసేవాళ్ల హోదా, స్థాయిలను బట్టి కాస్త అటు ఇటుగా ఉంటుంది తప్ప, నిజాలుగా అవి ఏనాటికీ స్థిరపడిపోవు. అబద్ధానికున్న గుణమే అది. ఏనాటికైనా నశిస్తుంది. నిజమన్నది తాత్కాలికంగా నశించినట్లు కనిపించినా, ఏ వైపు నుంచో మెల్లిగా తలెత్తి ఆకాశం వైపు చూస్తుంది. ఓ వెలుగు రేఖ భూమిపై విచ్చుకున్నట్లు! ఏదైనా ఒకటి ప్రచారంలోకి వచ్చినప్పుడు అది అబద్ధమా? నిజమా అన్నది తేలేలోపు అబద్ధం నిజమైతే బాగుండని ఆశించే వాళ్లు, అది నిజమే కనుకైతే అబద్ధమైపోవాలని ఆకాంక్షించే వాళ్ల మధ్య నిజానిజాల ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఈ రెండు వాదనల మధ్య ఎవరు బలంగా నిలబడ్డారు, ఎవరు బలహీనమైపోయారు అనే దానితో నిమిత్తం లేకుండా అంతిమ సత్యానికే ఆ ఘర్షణ దారితీస్తుంది. గాంధీజీ కాంగ్రెస్ లేని భారతదేశాన్ని ఆకాంక్షించారని కొన్నాళ్లుగా రాజకీయ నాయకులు ప్రచారం చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికలు దగ్గరపడ్డాయి కనుక ఈ ప్రచారం మరింత ఎక్కువైంది. గాంధీజీ అలా అనలేదని, ఆయన కోట్ ను, మిస్ కోట్ చేశారని వ్యతిరేక పక్షం వాదిస్తోంది. ఇందులోని సత్యాసత్యాలు ఎలా ఉన్నా ఒకటి మాత్రం వాస్తవం. దారీతెన్నూ లేని ఘర్షణ ఇది. ‘‘నువ్వు నిజం అంటున్నదానిని ముందు నువ్వు నమ్మాలి. అలా కాకుండా నమ్మించడానికి పంపే సందేశం అయితే కనుక ఆ నిజం తిరస్కారానికి గురవుతుంది’’ అనేవారు గాంధీజీ. నిజమే కదా! -
అశోక్ బాబు చంద్రబాబు తొత్తు
సాక్షి, విజయవాడ : కర్ణాటకలో ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ప్రచారం నిర్వహించడం వివాదస్పందగా మారింది. ఇప్పటికే ఆయనపై బీజేపీ నాయకులు కర్ణాటక ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అశోక్ బాబుపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జమ్ముల శ్యామ్ కిశోర్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాల్సిన అశోక్ బాబు చంద్రబాబుకు తొత్తుగా పనిచేయడం ఎంతవరకు సరైనదని ప్రశ్నించారు. అశోక్ బాబు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఉద్యోగ నిబంధనలకు వ్యతిరేకమని తెలిపారు. అశోక్ బాబుతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇతర ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగానే అశోక్ బాబు కర్ణాటక, తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని శ్యామ్ కిశోర్ వ్యాఖ్యానించారు. రేపు కర్ణాటకలోని తెలుగు ప్రజలకు ఏదైనా జరిగితే అశోక్ బాబు బాధ్యత వహిస్తాడా అని ప్రశ్నించారు. టీడీపీ నాయకుల డబ్బులతో అశోక్‌బాబు, మిగతా ఉద్యోగులు బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడాన్ని హేయమైన చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీని చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే పార్టీకి దగ్గర చేయడానికి ప్రయత్నిస్తుడటంతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే చంద్రబాబు ప్రజల దృష్టి మరల్చేందుకు.. కేంద్రం అన్యాయం చేసిందని చెబుతున్నారని విమర్శించారు. -
అశోక్ బాబును ఉద్యోగం నుండి తొలగించాలి
-
మోదీ సర్కార్ ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తుంది
-
ఆరోపణలపై అశోక్‌బాబు వివరణ
సాక్షి, అమరావతి: తనపై వచ్చిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు స్పందించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆరోపణలపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఏ పార్టీకి అనుకూలం కాదంటూనే తెలుగుదేశం పార్టీని అశోక్‌బాబు వెనకేసుకొచ్చారు. చంద్రబాబు పరిపాలనకు ఇబ్బందొస్తుందని ఉద్యమాలు చేయడం లేదన్నారు. ప్రధాని మోదీ పాలన బీజేపీ, నాన్ బీజేపీ అన్న విధానంలో నడుస్తోందని పేర్కొన్నారు. టీడీపీ తరపున బెంగళూరు పర్యటనకు వెళ్లలేదని తెలిపారు. ఏపీ హక్కుల సాధన సమితి నుంచి 150 మంది వెళ్లామన్నారు. ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని అశోక్‌బాబు ప్రకటించారు. కాగా, అశోక్‌బాబు, తెలుగుదేశం నాయకులు ఆదివారం బెంగళూరులో సమావేశం పెట్టి తెలుగువారు బీజేపీకి ఓటెయ్యవద్దని, కాంగ్రెస్‌కు వేయాలని సూచించడం తెలుగు సంఘాల మధ్య గొడవకు దారితీసింది. మార్తహళ్లి–వైట్‌ఫీల్డ్ రోడ్డులోని ఒక హోటల్లో ‘ఆంధ్రప్రదేశ్ హక్కుల పోరాట వేదిక’ పేరిట అశోక్‌బాబు బృందం సమావేశం నిర్వహించింది. సమావేశానికి వస్తున్న కొందరు తెలుగువారిని టీడీపీ సానుభూతిపరులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారి మధ్య వాదనలతో ఉద్రిక్తత నెలకొంది. -
ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబుపై కేసు
తిరుపతి : కర్ణాటకలో ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోబ్ బాబు ప్రచారం వివాదాస్పదంగా మారింది. ఒక పార్టీకి అనుకూలంగా అశోక్ బాబు ప్రచారం చేయడంతో వివాదమైంది. బీజేపీ తిరుపతి నేత సామంచి శ్రీనివాస్, అశోక్ బాబు మీద కర్ణాటక ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీని అశోక్ బాబు కించపరిచే విధంగా మాట్లాడటం దారుణమని ఈ సందర్భంగా శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అలాగే బాధ్యాతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఒక రాజకీయ పార్టీకి ప్రచారం చేయడం నేరం అవుతుందన్నారు. -
కర్ణాటకలో కాంగ్రెస్‌దే అధికారం
అమలాపురం (ఏపీ): కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని, అక్కడి తెలుగువారంతా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని ఏఐసీసీ కార్యదర్శి రుద్రరాజు నివాసంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ని ఎలాగైనా ఓడించాలని ప్రధాని నరేంద్రమోదీ వీధి స్థాయి నాయకునిలా దిగజారి మరీ ప్రచారం చేశారన్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అంటూ మోదీ చేసిన అడ్డగోలు సంస్కరణలతో ఇబ్బందులు పడిన ప్రజలు కర్ణాటక ఎన్నికల ద్వారా బుద్ధి చెప్పనున్నారని జోస్యం పలికారు. సమావేశంలో గిడుగు రుద్రరాజు, పీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్, ఏఐసీసీ సభ్యుడు కేబీఆర్ నాయుడు, పీసీసీ అధికార ప్రతినిధి ముషిణి రామకృష్ణారావు, పీసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
‘కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్‌కి ఓపెనింగ్స్’
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ ధీమా వ్యక్తం చేశారు. కన్నడలో పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఊమెన్ చాందీ ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా చాందీ శనివారం ఓ వార్తా ఛానల్‌తో మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎక్కువ సీట్లు సాధిస్తుందన్నారు. 2019లో కేంద్రంలో అధికారంలోకి రావడానికి కర్ణాటక ఎన్నికలు ఎంతో కీలకమైనవిగా పేర్కొన్నారు. కన్నడ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై పూర్తి విశ్వాసం ఉందని, ఆ విశ్వాసమే పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తుందని తెలిపారు. కర్ణాటక, కేరళ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, కేరళ ప్రజలు లక్షలాది మంది కర్ణాటకలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారని తెలిపారు. కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఓపెనింగ్స్ లాంటివని, త్వరలో జరగనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. 2019లో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్నారు. గత 70 ఏళ్ళుల్లో కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధికి ఎంతో చేస్తే... మోదీ తన స్వార్ధ రాజకీయం కోసం దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. -
కర్నాటక ఎన్నికలపై తెలుగు ఓటర్ల ప్రభావం
-
చంద్రబాబుపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే
తిరుమల : హైదరాబాద్‌లో ఓటుకు నోటు కేసులో దొరికిపోయి పారిపోయి వచ్చిన ఏపీ సీఎం నారా చంద్ర బాబు నాయుడు, కర్ణాటక ప్రజలను బీజేపీకి ఓట్లు వేయవద్దని చెప్పడం విడ్డూరంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. తిరుమలలో విలేకరులతో మాట్లాడుతూ..తెలుగు, కన్నడ ప్రజల మధ్య విభేదాలు తలెత్తే విధంగా చంద్రబాబు నాయుడు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడి ఫ్యామిలీ తప్ప రాష్ట్రంలో మరెవరూ టీటీడీపీకి ఓట్లు వేయరని అన్నారు. 2019 ఎన్నికలలో వైఎస్సార్సీపీ కచ్చితంగా విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ ఏపీకి కాబోయే సీఎం అని జోస్యం చెప్పారు. ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్ నుంచి విజయవాడకు మకాం మార్చారని, బాబు పిలుపులను కర్ణాటక ప్రజలు పట్టించుకోరని వ్యాఖ్యానించారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ, త్వరలోనే టీడీపీ అసలు రంగు బయటపడుతుందని అన్నారు. -
భారత్‌లోనూ ‘కేంబ్రిడ్జ్ అనలిటికా’లు
న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ అనలిటికా అనే కన్సల్టెన్సీ సంస్థ 8.7 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే అంతకు మించిన సమాచార కుంభకోణాలు మన దేశంలోనే జరుగుతున్న విషయం ‘ఇండియా టుడే’ రహస్య పరిశీలనలో తాజాగా తేటతెల్లమైంది. ఆన్లైన్ వ్యవస్థ, సమాచారంపై దేశంలో సరైన నియంత్రణ, చట్టాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఎన్నికల్లో ప్రజల ఓట్లను ప్రభావితం చేయడం కోసం భారత్‌లోనూ వివిధ ప్రధాన నగరాల్లో కన్సల్టెన్సీ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఉద్యోగాల కోసం జాబ్ పోర్టళ్లలో రెజ్యూమె పెట్టినప్పుడు, షాపింగ్ యాప్‌లు, ఆఫ్‌లైన్ స్టోర్లలో షాపింగ్ చేసినప్పుడు, క్రెడిట్, డెబిట్ కార్డులు వాడినప్పుడు, బ్యాంకులు, టెలికం, డీటీహెచ్ సేవలను ఉపయోగించుకున్నప్పుడు.. ఇలా ప్రతీ సందర్భంలోనూ కోట్లాది మంది ప్రజల అమూల్యమైన సమాచారాన్ని అవి తస్కరిస్తున్నాయి. తర్వాత ఆ వివరాలను ఉపయోగించుకుని వినియోగదారుల అభిరుచులను బట్టి వారి ఓట్లను ప్రభావితం చేసేలా వివిధ రాజకీయ పార్టీలతో ఒప్పందాలు కుదుర్చుకుని మొబైల్‌తోపాటు వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల్లోనూ మెసేజ్‌లు పంపిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికలను ప్రభావితం చేస్తాం.. ఢిల్లీకి చెందిన ‘జనాధార్’ అనే కన్సల్టెన్సీ సంస్థ వ్యవస్థాపకుడు మనీశ్ మాట్లాడుతూ అనేక మార్గాల్లో సేకరించిన ఓటర్ల జాబితా తమ వద్ద ఉందనీ, ఈ నెలలోనే జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తామని ఇండియా టుడే విలేకరికి హామీనిచ్చాడు. రెండోసారి విలేకరి మనీశ్‌ను కలిసినప్పటికి దక్షిణ బెంగళూరు నియోజకవర్గానికి చెందిన రెండు లక్షల ఓటర్ల వివరాలను అతను సేకరించి పెట్టాడు. ఓటరు పేరు, చిరునామా, ఫోన్ నంబర్, పాన్, ఆధార్ నంబర్, ఆర్థిక పరమైన వివరాలు కూడా ఉన్నాయి.‘ఎవరైనా ఉద్యోగం కోసం జాబ్ పోర్టళ్లలో రెజ్యూమె పెట్టినా, క్రెడిట్ కార్డు వాడినా, లాయల్టీ ప్రోగ్రాంలలో సభ్యత్వం తీసుకున్నా వారికి సంబంధించిన సమాచారం నాకు అందుతుంది. వారు వారి సమాచారాన్ని ఎక్కడ ఇచ్చినా అది నాకు చేరుతుంది’ అని మనీశ్ చెప్పుకొచ్చాడు. అయితే బెంగళూరు నగరంలోని ఒక నియోజకవర్గ ఓటర్ల సమాచారాన్ని ఇచ్చేందుకే అతను ఏకంగా 1.2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు. టెలికం అధికారులతో లాలూచీ.. టెలికాం కంపెనీల అధికారులతో కుమ్మక్కయ్యి ఒక్కో ప్రాంతంలోని టవర్ల నుంచి ప్రతి వినియోగదారుడి సమాచారాన్ని తాము సేకరిస్తున్నామని పోల్స్టర్ అనే మరో సంస్థ ప్రతినిధి వెల్లడించారు. అలాగే ఓటు హక్కుపై అవగాహన కల్పించే నెపంతో తమ సిబ్బంది వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడి ఓటర్ల సమాచారాన్ని సేకరిస్తారని కూడా ఆయన తెలిపారు. ఈ విధంగా వచ్చిన సమాచారంతో కనీసం 5 నుంచి 6 శాతం ఓటర్లను ప్రభావితం చేయొచ్చని వివరించారు. ఢిల్లీకి చెందిన మావరిక్ డిజిటల్, ముంబై కేంద్రంగా పనిచేసే క్రోనో డిజిటల్ తదితర కంపెనీలు కూడా ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు అక్రమ మార్గాల్లో సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఇండియా టుడే పరిశీలనలో బయటపడింది. -
పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు మారడం లేదు?
ఇటీవల పెట్రోల్, డీజిల్ ధర మంట తెలిసిందే. గత వారం క్రితం రికార్డు స్థాయిల్లో ఈ ధరలు పెరుగుతూ వచ్చాయి. దీనికి కారణం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడమేనని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నాయి. కానీ గత ఆరు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పైకి ఎగుస్తున్న, దేశీయంగా మాత్రం ఎలాంటి ప్రభావం కనిపించడం లేదు. విడ్డూరమని అనిపించినా ఇది నిజం. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంధన ధరల సవరణ వద్దని ప్రభుత్వం చమురు కంపెనీలను కోరగా, ప్రభుత్వ ఆదేశాలను అవి పాటిస్తున్నట్టు సమాచారం. ఏప్రిల్ 24 నుంచి ఈ ధరల్లో మార్పు లేదు. అప్పటి నుంచి లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.74.63, కోల్‌కత్తాలో రూ.77.32, ముంబైలో రూ.82.48, చెన్నైలో రూ.77.43గా ఉన్నాయి. బెంగళూరులో ఒక్క లీటరు పెట్రోల్ ధర రూ.75.82గా ఉంది. బెంగళూరులోని 28 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు మొత్తంగా 224 సెగ్మెంట్లలో మే 12న పోలింగ్ జరుగబోతోంది. ఈ సమయంలో ధరల పెంపు అంత మంచిది కాదని ప్రభుత్వం భావిస్తోంది. గత వారం క్రితం వరకు భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో, నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్షాలు మండిపడ్డాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెంపును ప్రధానమైన అంశంగా తీసుకున్న విపక్షాలు, కర్నాటక ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా కూడా మలుచుకున్నాయి. దీంతో గత ఆరు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరల పెంపును ప్రభుత్వం చేపట్టడం లేదు. పెట్రోలు ధరల్లో మార్పు ఎందుకు లేదన్న విషయమై అటు ప్రభుత్వ రంగ చమురు సంస్థల నుంచి గానీ, ఇటు ప్రభుత్వ పెద్దల నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. ఇక ఎన్నికలు ముగియగానే, ఒక్కసారే ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకుంటాయని తెలుస్తోంది. గత సంవత్సరం జూలై నుంచి పరిశీలిస్తే పెట్రోలు ధర రూ. 11కు పైగా, డీజిల్ ధర రూ. 12కు పైగా పెరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచవద్దని చమురు కంపెనీలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లడం సర్వసాధారణమే. ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఎన్నికల సమయంలో కూడా పెట్రోలు, డీజిల్ ధరలను కొంతకాలం సవరించలేదు. -
యూపీలోనే పొత్తు.. బయట లేదు : ఎస్పీ
లక్నో: త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ- బీఎస్పీ వేర్వేరుగా పోటీ చేస్తున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ అధికారం ప్రతినిధి రాజేంద్ర చౌదరి తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్, పుల్పూర్ ఉపఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమిగా పోటీ చేసి బీజేపీని ఓడించిన విషయం తెలిసిందే. ఇకముందు కూడా యూపీలో బీఎస్పీ-ఎస్పీ మధ్య పొత్తు ఉంటుందని అఖిలేష్, మాయావతి ఇదివరకే స్పష్టంచేశారు. కర్ణాటకలో మాత్రం రెండు పార్టీలు వేరువేరుగా పోటిచేస్తున్నట్లు ఎస్పీ ప్రకటించింది. బీఎస్పీ అధినేత్రి మాయావతి జేడీఎస్‌తో కలిసి ఎన్నికల్లో పోటి చేస్తున్నట్లు ఎన్నికల ముందే ప్రకటించారు. జేడీఎస్‌తో పొత్తుపెట్టుకున్న బీఎస్పీ కర్ణాటకలో 20 స్థానాల్లో పోటిచేస్తుంది. ఎస్పీ ఒంటరిగా 27 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలిపినట్లు ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు రాబిన్ మాథ్యుస్ తెలిపారు. కర్ణాటకలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పర్యటిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నా... ఇంతవరకూ అభిలేష్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మాయావతి కర్ణాటకలో మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడతో కలిసి మైసూర్, చిత్రదుర్గ ప్రాంతాల్లో పలు ర్యాలీల్లో పాల్గొన్నారు. ఎస్పీ- బీఎస్పీ కూటమి ఉత్తరప్రదేశ్‌కే పరిమితమని, ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో కూటమిలేదని రాజేంద్ర చౌదరి స్పష్టం చేశారు. -
అభివృద్ధి నినాదంతో మేం ప్రజల్లోకి వెళ్తున్నాం
-
మభ్య పెట్టి గెలవాలనుకోవట్లేదు: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ ; ప్రజలను మభ్యపెట్టి గెలవాలని బీజేపీ ఏనాడూ ప్రయత్నించలేదని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం బీజేపీ శ్రేణులను ఉద్దేశించి నమో యాప్ ద్వారా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కుల-మతాలను వాడుకోం... ప్రస్తుతం దేశంలో కులం, మతాలను కొందరు రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారని మోదీ దుయ్యబట్టారు. ‘కులం, మతం కోసం పోరాటం అంటూ కొందరు రాద్ధాంతాలు చేస్తున్నారు. కానీ, ఈ హంగామా అంతా ఎన్నికలు అయ్యే వరకే. గెలిచాక వాళ్లు ప్రజలను పట్టించుకోరు. కానీ, బీజేపీకి అలాంటి సిద్ధాంతాలు లేవు. అభివృద్ధే ధ్యేయంగా మేం ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు కర్ణాటక అభివృద్ధి కోసం మూడు ఎజెండాలు సిద్ధం చేసుకున్నాం.. అభివృద్ధి-త్వరగతిన అభివృద్ధి-రాష్ట్రాభివృద్ధి’ అని ప్రధాని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన ఆయన ప్రస్తుతం దేశంలో రాజకీయాల దుస్థితికి ఆ పార్టీ చేసిన నిర్వాకాలే కారణమని ఆక్షేపించారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచిపెడితేనే రాజకీయాల్లో స్వచ్ఛత సాధ్యమౌతుందని ఆయన పేర్కొన్నారు. ‘అభివృద్ధి నినాదంతో మేం ప్రజల్లోకి వెళ్తున్నాం. తద్వారా వారి విశ్వసనీయత చురగొంటామన్న నమ్మకం ఉంది. అంతేగానీ ప్రజలను మభ్యపెట్టి ఓట్లేయించుకోవాలన్న ఉద్దేశ్యం మాకు లేదు’ అని మోదీ తెలిపారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 1న నేరుగా ఆయన కర్ణాటకకు వెళ్లి.. ఉడిపిలో నిర్వహించబోయే భారీ ర్యాలీలో పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే 225 సీట్లు ఉన్న కర్ణాటక రాష్ట్రానికి మే 12 ఎన్నికలు జరగనున్నాయి. మే 15న ఫలితాలు వెలువడతాయి. తిరిగి అధికారం కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్.. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని బీజేపీ... అద్భుతాలు చేస్తామంటూ జేడీఎస్ పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. -
క్యాష్‌కి ఎందుకీ కటకట వచ్చింది?
ఏటీఎం అంటే ఎనీ టైమ్ మనీ కాదు.. ఎనీ టైమ్ మూత.. అవును.. మళ్లీ కరెన్సీ సంక్షోభం కల్లోలాన్ని రేపుతోంది. ఒక్కసారిగా ఏడాదిన్నర క్రితం పెద్ద నోట్ల రద్దు నాటి పరిస్థితులు పునరావృతమయ్యాయి. నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులు కనబడితే ఇప్పుడు కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్,గుజరాత్,ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ అవే బోర్డులు దర్శనమిస్తున్నాయి. వాస్తవానికి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున కొత్త నోట్లు పంపిణీలోకి వచ్చాయి. ఆర్బీఐ డేటా ప్రకారంపెద్ద నోట్ల రద్దు చేసిన రెండు నెలలకి , అంటే 2017 జనవరి నాటికి కేవలం 8.9 లక్షల కోట్ల విలువ చేసే నోట్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. అలాంటిది ఈ ఏడాది ఏప్రిల్ 6 నాటికి 18.4 లక్షల కోట్లు విలువ చేసే నోట్లు చెలామణిలోకి వచ్చాయి. మరి పుష్కలంగా కొత్త నోట్లను ముద్రించినా క్యాష్‌కి ఎందుకీ కటకట వచ్చింది? ఎఫ్ఆర్డీఐ బిల్లు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిత ఫైనాన్సియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ –2017 (ఎఫ్ఆర్డీఐ) బిల్లు చట్టరూపం దాలిస్తే బ్యాంకుల్లో తమ సొమ్ముకు భద్రత ఉండదని ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది .బ్యాంకుల్లో జరుగుతున్న భారీ స్కామ్‌లతో ఆ వ్యవస్థపైనే నమ్మకం సడలిపోతోంది. దీంతో బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బులు తీసేవారే తప్ప వేసేవారి సంఖ్య తగ్గిపోతోంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల్లో డిపాజిట్లు 15.3 శాతంగా ఉంటే ఈ ఏడాది గణనీయంగా పడిపోయింది.. 2018, మార్చి ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కేవలం 6.7 శాతం మాత్రమే డిపాజిట్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో నగదు డిపాజిట్ల కంటే నగదుని విత్ డ్రాయల్స్ ఎక్కువగా ఉంటోందని ఆర్బీఐ అధ్యయనంలో తేలింది. కర్ణాటక ఎన్నికలు మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఆ రాష్ట్రంలో నగదు అవసరం అనూహ్యంగా పెరిగిపోయింది. పార్టీలకతీతంగా నాయకులందరూ ఎన్నికల ప్రచారం కోసం డబ్బుని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. తమకున్న సంబంధ బాంధవ్యాలను వినియోగించి ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి భారీగా నోట్లకట్టలను తీసుకువస్తున్నారు. రూ. 2 వేల నోట్ల అక్రమ నిల్వలు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు కూడా ఉండడంతో చాలా చోట్ల రాజకీయ నేతలు ముందుగానే జాగ్రత్త పడుతున్నట్టుగా ఉంది. ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు పన్నుతున్న వివిధ పార్టీలు ఇప్పటికే భారీ సంఖ్యలో 2 వేల నోట్లను అక్రమంగా నిల్వ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. 2 వేల నోట్లు చెలామణిలోకి వచ్చిన తర్వాత వాటిని తీసుకువెళుతున్నవారే తప్ప, తిరిగి డిపాజిట్ చేస్తున్న వారు మాత్రం కనిపించడం లేదు. మరోవైపు ఆర్బీఐ నుంచి కొత్తగా 2 వేల నోట్లు సరఫరా కూడా నిలిచిపోయింది. ఇది కూడా ప్రస్తుతం క్యాష్ కొరతకి ఒక కారణమేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఏటీఎం మిషన్లలో మార్పులు కొన్నాళ్ల క్రితం ఆర్బీఐ కొత్తగా మార్కెట్లోకి విడుదల చేసిన రూ. 200 నోట్లను ఏటీఎం మిషన్లలో ఉంచడానికి వీలుగా చాలా చోట్ల సాంకేతికపరంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు.. దేశవ్యాప్తంగా 2.2 లక్షల ఏటీఎంలు ఉంటే వాటిల్లో సగానికి పైగా ఏటీఎంలలో రూ. 200 నోట్లు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో ఏటీఎం మిషన్ల నుంచి 200 నోట్లు కూడా వచ్చేలా చేయడానికి సాఫ్ట్‌వేర్‌ని అప్డేట్ చేస్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. పంటలు, పండుగ సీజన్ కొన్ని రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితులు కూడా ఏటీఎంలు మూతపడడానికి కారణంగా కనిపిస్తోంది. రబీ పంటలు కోతకు రావడంతో రైతులకు భారీగా నగదు చెల్లించాల్సి వస్తోంది. ఇక అసోం తదితర ఈశాన్య రాష్ట్రాల్లో బైశాఖి, బిహు వంటి పంటల పండుగల జరుపుకుంటున్నారు. అందుకోసం పెద్ద మొత్తంలో నగదుని డ్రా చేయడంతో క్యాష్‌కి కటకట ఏర్పడింది. అయిదు రెట్లు ఎక్కువగా రూ.500 నోట్ల ముద్రణ దేశంలో కరెన్సీ కొరత తాత్కాలికమేనని, తర్వలోనే దీనిని పరిష్కరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు. కావల్సినంత నగదు బ్యాంకుల్లో ఉందని అకస్మాత్తుగా వినియోగం పెరగడంతో ఈ పరిస్థితి వచ్చిందంటూ ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు నోట్ల ముద్రణను అయిదు రెట్లు పెంచుతున్నామంటూ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. రూ. 500 నోట్లను రోజుకి 500 కోట్లు ముద్రిస్తున్నామని ఆయన చెప్పారు. మరికొద్దిరోజుల్లో రోజుకి 2,500 కోట్ల విలువ చేసే అయిదువందల నోట్లను చెలామణిలోకి తెస్తామని వెల్లడించారు. మరో నెలరోజుల్లో 75 వేల కోట్ల విలువ చేసే 500 నోట్లు అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా కరెన్సీ కష్టాలను తొలగిస్తామని వివరించారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
కర్ణాటకలోని తెలుగువారంతా ఆ పార్టీకే ఓటేయండి
-
కర్ణాటకలోని తెలుగువారంతా ఆ పార్టీకే ఓటేయండి
సాక్షి, బెంగళూరు: మరికొద్ది రోజుల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలోని తెలుగు ప్రజలంతా జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) పార్టీకి మద్దతు తెలపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు. ఫెడరల్ ఫ్రంట్ వ్యూహ చర్చల్లో భాగంగా శుక్రవారం బెంగళూరుకు వెళ్లిన ఆయన.. మాజీ ప్రధాని, జేడీఎస్ కురువృద్ధుడు హెచ్డీ దేవేగౌడను కలుసుకున్నారు. గౌడతో భేటీ సందర్భంగా జాతీయ రాజకీయాలతోపాటు కర్ణాటక-తెలంగాణల మధ్య నెలకొన్న సమస్యలపైనా కేసీఆర్ చర్చించారు. ఈ భేటీలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి గౌడ, సీఎం వెంట సినీనటుడు ప్రకాశ్ రాజ్, పలువురు టీఆర్ఎస్ ముఖ్యులు పాల్గొన్నారు. పెద్దాయన హామీ ఇచ్చారు: దేవేగౌడతో భేటీ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘‘ దేశ ప్రజల కోసమే బీజేపీ, కాంగ్రేసేతర ఫ్రంట్‌గా మేం ఏర్పడుతున్నాం. 70 ఏళ్ల స్వతంత్ర్య భారతంలో మౌళికమైన మార్పులు రాలేదు. 70 టీఎంసీల నీరు వృధాగా పోతున్నా, 40 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలుగుతున్నాం. పాలకుల అసమర్థత వల్లే రాష్ట్రాల మధ్య జలయుద్ధాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితి మారాలి. రైతులు, సామాన్యుల మేలు కోసమే ఫ్రంట్‌ను ఏర్పాటుచేస్తున్నాం. దానికి తన ఆశీస్సులు ఉంటాయని దేవేగౌడ గారు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలోని తెలుగు ప్రజలంతా జేడీఎస్‌కు మద్దతిచ్చి ఓటేయాలని కోరుతున్నా’’ అని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ఆలోచనలో న్యాయముంది: ‘‘స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తైనా దేశం చాలా సమస్యలను జయించలేకపోయిందన్న మాట వాస్తవం. కీలకమైన అంశాల ప్రాతిపతికన జాతీయ స్థాయిలో ఫ్రంట్ అవసరం. కేసీఆర్ ప్రయత్నాలకు మేం అండగా ఉంటాం. ఆయన కార్యాచరణ బాగుంది. మున్ముందు కొన్ని నిర్ణయాలు తీసుకుని కలిసి నడవాలనుకుంటున్నాం’’ అని దేవేగౌడ మీడియాతో చెప్పారు. -
కుమారన్న ‘కింగ్ మేకర్’ అవుతారా?
హర్దనహళ్ళి దొడ్డెగౌడ కుమారస్వామి.... అభిమానులు, జేడీ(ఎస్) కార్యకర్తలు అభిమానంగా పిలుచుకునే కుమారన్న... సిద్దరామయ్యకు కంటిలో నలుసుగా మారబోతున్నారా? కర్ణాటకలో అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలనే కాంగ్రెస్ ఆశలకు గండికొట్టబోతున్నారా? కుమారస్వామి బహిరంగ సభలకు భారీ సంఖ్యలో హాజరవుతున్న ప్రజల్ని చూస్తుంటే కర్ణాటక ఎన్నికలు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తాయని అనిపిస్తోంది. రెండు నెలల క్రితం వరకు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ... జేడీ(ఎస్) ని పెద్దగా లెక్కలోకి వేసుకోలేదు. పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తున్న కుమారస్వామి బహిరంగ సభలకు, ర్యాలీలకు ప్రజలు భారీసంఖ్యలో హాజరవుతున్నారు. వాస్తవానికి రాహుల్‌గాంధీ, అమిత్‌షాల మీటింగ్‌ల కన్నా ఎక్కువ సంఖ్యలోనే. కుమారస్వామి వెంట చెప్పుకోదగ్గ పేరున్న నాయకులు లేరు. అలాగే కాంగ్రెస్, బీజేపీలకున్న హంగూ ఆర్బాటం కూడా లేదు. కాని భారీగా హాజరవుతున్న ప్రజలు కుమారస్వామిలో, జేడీ(ఎస్) నాయకుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీలలాగే జేడి(ఎస్)కి కూడా అత్యంత కీలకమైనవి. 2006లో కాంగ్రెస్ – జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకల నేపధ్యంలో బీజేపీతో జతకట్టి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన కుమారస్వామి 20 నెలలపాటు అధికారాన్ని చెలాయించారు. కర్ణాటక చరిత్రలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. 2008 ఎన్నికల్లో అధికారం కోల్పోయాక కర్ణాటకలో పునర్వైభవం కోసం జేడీ(ఎస్), కుమారస్వామి తీవ్రంగానే కృషి చేస్తున్నారు. ఈ సారి గెలవకపోతే కర్ణాటకలో జేడీ(ఎస్) ఉనికి ప్రశ్నార్థకమవుతుందనే భయం కుమారస్వామిలో ఉంది. పాత మైసూరు ప్రాంతంలో జేడీ(ఎస్)కి మంచిపట్టు ఉంది. కనీసం 75 అసెంబ్లీ సీట్లలో జేడీ(ఎస్) కాంగ్రెస్‌కి గట్టిపోటీ ఇస్తోంది. మైసూర్, హాసన్, మాండ్య, తుమకూరు జిల్లాలతో పాటు బెంగళూరు శివారు ప్రాంతాల్లో జేడీ(ఎస్) ప్రభావం గట్టిగానే కనపడుతోంది. అనూహ్యంగా బలం పుంజుకుంటున్న జేడీ(ఎస్) కాంగ్రెస్‌ని కొంత కలవరానికి గురిచేస్తోంది. ఆరు నెలలక్రితం గుండె ఆపరేషన్ చేయించుకున్న కుమారస్వామి తొందరగానే కోలుకున్నారు. అనారోగ్య ఛాయలేమి కనపడకుండా రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటిస్తున్నారు. భారీ సంఖ్యలో హాజరవుతున్న ప్రజల ఓట్లను రాబట్టుకోగలిగితే ఎన్నికల ఫలితాల తర్వాత కుమారస్వామి ‘కింగ్ మేకర్’ అయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. కాంగ్రెస్ కాని, బీజేపీ గానీ స్వంతంగా అధికారాన్ని చేజిక్కుంచుకోగలిగితే జేడీ(ఎస్) ఉనికి ప్రశార్థకమవుతుంది. ఈ నేపధ్యంలోనే ‘హంగ్ అసెంబ్లీ’ వస్తే కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పవచ్చనేది జేడీ(ఎస్) ఆశ. జేడీ(ఎస్)ని బీజేపీ ‘బీటీమ్’ గా సిద్దరామయ్య ప్రచారం చేస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందనేది కాంగ్రెస్ ఆరోపణ. బీజేపీ మాత్రం జేడీ(ఎస్) వీలైనన్ని కాంగ్రెస్ సీట్లను తగ్గించగలిగితే కర్ణాటకలో గెలవొచ్చనే వ్యూహంలో ఉంది. ఎవరికో ‘బీటీమ్’ గా ఉండాలని కాదు... ఎన్నికల్లో మేమే గెలవబోతున్నామని కుమారస్వామి బహిరంగ సభల్లో చెబుతున్నారు. సిద్దరామయ్య, యెడ్యూరప్పల కన్నా తన పాపులారిటీ ఎక్కువని కుమారస్వామి నమ్మకం. ఇక కాంగ్రెస్ పార్టీ తన దాడిని ఎక్కువగా బీజేపీపైనే కేంద్రీకరించాలని ఆ పార్టీ నాయకుల ఆలోచన. కుమారస్వామిపై దాడి ఉదృతం చేస్తే అది జేడీ(ఎస్)కే మేలు చే స్తుందని వారి భయం. ఎవరి వ్యూహాలు వారివి. కర్ణాటక ప్రజలు మే 12 ఎన్నికల్లో ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే... – ఎస్ గోపీనాథ్‌రెడ్డి -
కర్నాటకలో మొదలైన ప్రలోభాల పర్వం