
బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు(పాత చిత్రం)
తిరుమల : హైదరాబాద్‌లో ఓటుకు నోటు కేసులో దొరికిపోయి పారిపోయి వచ్చిన ఏపీ సీఎం నారా చంద్ర బాబు నాయుడు, కర్ణాటక ప్రజలను బీజేపీకి ఓట్లు వేయవద్దని చెప్పడం విడ్డూరంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. తిరుమలలో విలేకరులతో మాట్లాడుతూ..తెలుగు, కన్నడ ప్రజల మధ్య విభేదాలు తలెత్తే విధంగా చంద్రబాబు నాయుడు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడి ఫ్యామిలీ తప్ప రాష్ట్రంలో మరెవరూ టీటీడీపీకి ఓట్లు వేయరని అన్నారు.
2019 ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ కచ్చితంగా విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ ఏపీకి కాబోయే సీఎం అని జోస్యం చెప్పారు. ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్ నుంచి విజయవాడకు మకాం మార్చారని, బాబు పిలుపులను కర్ణాటక ప్రజలు పట్టించుకోరని వ్యాఖ్యానించారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ, త్వరలోనే టీడీపీ అసలు రంగు బయటపడుతుందని అన్నారు.