సాక్షి, విజయవాడ : కర్ణాటకలో ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ప్రచారం నిర్వహించడం వివాదస్పందగా మారింది. ఇప్పటికే ఆయనపై బీజేపీ నాయకులు కర్ణాటక ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అశోక్ బాబుపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జమ్ముల శ్యామ్ కిశోర్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాల్సిన అశోక్ బాబు చంద్రబాబుకు తొత్తుగా పనిచేయడం ఎంతవరకు సరైనదని ప్రశ్నించారు. అశోక్ బాబు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఉద్యోగ నిబంధనలకు వ్యతిరేకమని తెలిపారు. అశోక్ బాబుతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇతర ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉద్దేశపూర్వకంగానే అశోక్ బాబు కర్ణాటక, తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని శ్యామ్ కిశోర్ వ్యాఖ్యానించారు. రేపు కర్ణాటకలోని తెలుగు ప్రజలకు ఏదైనా జరిగితే అశోక్ బాబు బాధ్యత వహిస్తాడా అని ప్రశ్నించారు. టీడీపీ నాయకుల డబ్బులతో అశోక్‌బాబు, మిగతా ఉద్యోగులు బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడాన్ని హేయమైన చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీని చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే పార్టీకి దగ్గర చేయడానికి ప్రయత్నిస్తుడటంతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే చంద్రబాబు ప్రజల దృష్టి మరల్చేందుకు.. కేంద్రం అన్యాయం చేసిందని చెబుతున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment