
ఏపీ ఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు(పాత చిత్రం)
తిరుపతి : కర్ణాటకలో ఏపీ ఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు అశోబ్ బాబు ప్రచారం వివాదాస్పదంగా మారింది. ఒక పార్టీకి అనుకూలంగా అశోక్ బాబు ప్రచారం చేయడంతో వివాదమైంది. బీజేపీ తిరుపతి నేత సామంచి శ్రీనివాస్, అశోక్ బాబు మీద కర్ణాటక ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీని అశోక్ బాబు కించపరిచే విధంగా మాట్లాడటం దారుణమని ఈ సందర్భంగా శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అలాగే బాధ్యాతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఒక రాజకీయ పార్టీకి ప్రచారం చేయడం నేరం అవుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment