
అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. గతంలో ఏసీటీవోగా పని చేసిన సమయంలో అశోక్‌బాబు తప్పుడు సమాచారం ఇచ్చారనే అభియోగాలపై కేసు నమోదు చేసింది సీఐడీ. తన సర్వీసు రికార్డు లేకుండానే తప్పుడు సమాచారం ఇచ్చారని కేసు నమోదైంది. బీకాం చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారనే అభియోగంపై కేసు నమోదు చేశారు.
తప్పుడు సమాచారం ఇచ్చి రికార్డులను ట్యాంపరింగ్ చేయడమే కాకుండా, ఎన్నికల అఫిడవిట్‌లో కూడా డిగ్రీ చదివినట్లు పేర్కొన్నారనే అభియోగాల కింద కేసులు నమోదు చేశారు. అశోక్ బాబు పైన సెక్షన్ 477A, 465,420 కింద కేసు నమోదు చేశారు. 2021లో అశోక్‌బాబుపై లోకాయుక్తాలో కేసు నమోదు కాగా, ఆ కేసును సీఐడీకి అప్పగించాలని లోకాయుక్తా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment