
తాడేపల్లి: వైఎస్సార్‌సీపీలో నూతన నియామకాలు జరిగాయి. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా కరణం ధర్మశ్రీను నియమించారు. చోడవరం నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు.
మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్తగా బూడి ముత్యాల నాయుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా తిప్పల దేవన్ రెడ్డి, పి.గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్తగా గన్నవరపు శ్రీనివాస రావు, కాగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వరికూటి అశోక్ బాబును నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.
Comments
Please login to add a commentAdd a comment