Karanam Dharmasri
-
మీ రాజీనామా స్టీల్ ప్లాంట్ సమస్యకు పరిష్కారం కాదు.. !
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్సదే విజయం: ధర్మశ్రీ
-
మళ్లీ జగనే అధికారంలోకి వస్తారు
-
కళ్లు ఉన్న కబోది లోకేషం..
-
ప్రతి నెల లోకేష్ జేబులోకి 500 కోట్లు
-
చోడవరంలో సామాజిక సాధికార యాత్రకు భారీ ఏర్పాట్లు
-
రైతు సంక్షేమం కోసం ఆలోచించే నాయకుడు సీఎం జగన్
-
చంద్రబాబు అరెస్ట్ అక్రమం కాదు.. అనివార్యం: మంత్రి అంబటి
సాక్షి, అమరావతి: చంద్రబాబుది అక్రమ అరెస్టుకాదని, అనివార్యమైన అరెస్టు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అరెస్టు చేయటం వలన సింపతి వస్తుందని టీడీపీ, ఎల్లోమీడియా చూసిందని, దీన్ని కక్షసాధింపుగా ప్రజలు చూస్తారని భావించారు కానీ అవేవీ జరగలేదని అన్నారు. భారీగా అక్రమాలు చేసినా చంద్రబాబును అరెస్టు చేయకపోతే రాజ్యాంగానికి విలువ ఏముంటుందని పేర్కొన్నారు. సీఐడీవారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం వలన కేసుకు అనుగుణంగా వారు వ్యవహరించారని చెప్పారు,. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా చేసినందునే చంద్రబాబు అరెస్టు అయ్యారని మంత్రి అంబటి అన్నారు. స్కిల్ కేసులో ఇప్పుడు అరెస్టు అయ్యారని.. ఇంకా రింగు రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లోనూ విచారణ జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు అరెస్టుకు ముందు చాలా లోతైన విచారణ జరిగిందన్నారు. షెల్ కంపెనీలకు డబ్బు తరలించి, తర్వాత తన ఖాతాలోకి వేసుకున్నట్టు తేలిందని పేర్కొనఆనరు. సీమెన్స్ కంపెనీతో సంబంధం లేకుండానే వ్యవహారం నడిపారన్నారు. ఆ కంపెనీ కూడా ఈ విషయం చెప్పిందని, రూ.330 కోట్ల ప్రజాధనాన్ని దోచుకొని లూటీ చేశారని విమర్శించారు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయలేరు మంత్రి అంబటి మాట్లాడుతూ.. అన్యాయంగా అరెస్టు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏంటి? ఎన్నికలకు ముందు అరెస్టు చేస్తే చంద్రబాబుకు సింపతీ పెరుగుతుందని మాకు తెలీదా? కానీ వ్యవస్థలు సక్రమంగా పని తమపని తాము చేసుకునేలా మేము ఫ్రీహ్యాండ్ ఇచ్చాం. చట్టానికి వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయలేరు. సీమెన్స్ కంపెనీ ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టలేదు. రూ.330 కోట్లు ఇవ్వటానికి వీల్లేదని సీఎస్ కృష్ణారావుతో సహా ఫైనాన్స్ అధికారులు నోట్ ఫైల్ రాశారు. కానీ చంద్రబాబు ఒత్తిడి చేసి నిధులు విడుదల చేయించారు. అంతదారుణంగా అక్రమాలు చేస్తే అరెస్టు చేయకూడదా?. చట్టబద్దంగానే సీఐడీ అరెస్టు చేసింది. చంద్రబాబు పిఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పరారయ్యారు. చంద్రబాబు సహకారంతోనే వారిద్దరూ పరారయ్యారు. ఫైబర్ నెట్, రింగ్ రోడ్ విచారణ కూడా జరుగుతుంది. ఎంతటి వారైనా తప్పు చేస్తే చట్టం, న్యాయం సహించదు. రోడ్డుమీదకు వచ్చి గొడవలు చేస్తే సహించేదిలేదు. ప్రజలకు ఇబ్బందులు కల్హిస్తే అణచివేస్తాం. ప్రజల నుండి దూరం చేయలేరంటూ పొలిటికల్ డైలాగులు కుదరవు. కోర్టులో వాస్తవాలు చెప్పుకుంటే మంచిది. ప్రభుత్వ సొమ్ము కాజేసిన సంగతిని పవన్ కల్యాణ్ తెలుసుకుని మాట్లాడాలి. వాసస్తవాలు తెలియాలంటే ఆ వివరాలు మేము పవన్‌కు పంఇస్తాం. పవన్ వత్తాసు పలకటం ఏంటి షూటింగ్ వదిలి బయటకు రాలేని పవన్, ప్రజలను రోడ్డు మీదకు రమ్మనటం ఏంటి?. గావుకేకలు షూటింగ్లో పెట్టటం కాదు, బయటకు వచ్చి మాట్లాడాలి. ఒక దోపిడీ దారునికి పవన్ కల్యాణ్ వత్తాసు పలకటం ఏంటి?. చంద్రబాబు, పవన్.. ఇద్దరూ ఎవరికి ఆపద వచ్చినా పూలబొకేలు ఇచ్చుకుంటుంటారు. ఇప్పుడు చంద్రబాబు వద్దకు వచ్చి ఒక పూలబొకేని పవన్ ఇస్తే మంచిది. చంద్రబాబు, పవన్ అవినీతి గోదావరిలో దిగాలనుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు. బీజేపీ అధ్యక్షురాలు కూడా మా బావ అవినీతి చేయలేదని చెప్పటం లేదు. అరెస్టు ప్రొసీజర్ గురించే ఆమె మాట్లాడుతున్నారు. అంతేకానీ మా బావ నీతిమంతుడని చెప్పలేదంటేనే అర్థం చేసుకోవచ్చు. లోకేష్ పాత్ర కూడా ఉందని తేలితే ఆయన్ని కూడా అరెస్టు చేస్తారు. చదవండి: చంద్రబాబు పాపం పండింది: మంత్రి అమర్నాథ్ తప్పు చేశానని చంద్రబాబుకు తెలుసు రాజకీయ కక్షతో బాబును అరెస్ట్ చేయించాల్సిన అవసరం మాకు లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాజకీయమే చేయాలంటే 4 ఏళ్లుగా బాబు, లోకేష్ బయట తిరేవారు కాదని అన్నారు. రాష్ట్ర ఖజానాను దోచుకున్న బాబుకు కచ్చితంగా శిక్ష పడాల్సిందేనని వ్యాఖ్యనించారు. తప్పు చేశానని చంద్రబాబుకు తెలుసని పేర్కొన్నారు. బాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై 2018లో జీఎస్టీ కేసు పెట్టిందని డొల్ల కంపెనీల ద్వారా లావాదేవీలు జరిగాయని తేలిందన్నారు. చంద్రబాబు ఒత్తిడి మేరకు చేశామని సెక్రటరీనే ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. ఇప్పుడు MOU అని సిమెన్స్ కంపెనీ కోర్టులో వాంగ్మూలం ఇచ్చిందని గుర్తు చేశారు. యువతను చంద్రబాబు మోసం చేశాడని విమర్శించారు. యువతకు స్కిల్స్ నేర్చించలేదు కానీ.. తన స్కిల్స్‌తో వ్యవస్థను మేనేజ్ చేశాడని దుయ్యబట్టారు. స్కిల్ డెవెలప్మెంట్ స్కామ్ శాంపిల్ మాత్రమే.. ఇలాంటి స్కామ్‌లు చాలా చేశాడని అన్నారు. అన్నీ కేసుల్లో స్టేలపైనే ఎవరి పాపాలు పండుతాయో ఎవరికి శిక్ష వెయ్యాలో ఆ దేవుడికి బాగా తెలుసు. దివంగత ఎన్టార్ ఆత్మ క్షోభ , బాధ కూడా గతంలో వినిపించారు.. అది ఇప్పటికి పాపం పండింది. చంద్రబాబు చేసిన అక్రమాలు ఒక్కటి కాదు. ఏలేటి స్కామ్, లిక్కర్ స్కామ్‌లో అన్ని కేసులలో స్టేలపైనే జీవిస్తున్నాడు. పాపలన్నీ బద్దలైనాయిఅన్నింటికి శిక్ష తప్పదు. -మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చట్టానికి ఎవరూ అతీతులు కాదు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు సక్రమమే. చట్టానికి ఎవరు అతీతులు కాదు.. గతంలోనూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల అరెస్టులు జరిగాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్‌లో వేల కోట్ల అక్రమాలకు చంద్రబాబు పాత్ర ఉంది కనుకనే అరెస్ట్ చేశారు. - నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు అరెస్టుకు రాజకీయ సంబంధం లేదు చంద్రబాబు అరెస్టును స్వాగతిస్తున్నాం. ఆయన అరెస్టుకు రాజకీయానికి సంబంధం లేదు. స్కిల్ డెవలప్ మెంట్లో ఏం జరిగింది అనేది అసెంబ్లీ సాక్షిగా పూర్తిగా చర్చించాం. అసలు సంబంధంలేని సీమెన్ కంపెనీ పేరుతో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు. సీమెన్ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తితో మాట్లాడి ఈ విధంగా అవినీతికి పాల్పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ కంపెనీ కూడా ఎంక్వయిరీ చేసి దీనికి మాకు సంబంధం లేదని తేల్చేసింది. పూర్తిస్థాయిలో చర్చించి రూ. 370 కోట్లు ఏ విధంగా అవినీతి జరిగింది అని ప్రభుత్వ సంస్థలు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాతే చంద్రబాబును అరెస్టు చేశారు. దీనిలో ఏ విధమైన రాజకీయ కోణం గానీ కక్ష సాధింపులు గాని లేవు. దొరికిపోయాడు కాబట్టే నన్ను ఏ క్షణమైనా అరెస్టు చేస్తారంటూ మూడు రోజుల నుంచి చంద్రబాబు చెబుతున్నాడు. -నందిగామ ఎమ్మెల్యే,మొండితోక జగన్ మోహన్ రావు చంద్రబాబు అరెస్టు సమంజసమే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిలో కూరుకు పోయారు. సీఐడీ పూర్తిస్థాయిలో విచారణ జరిపింది. 2018లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిధులు దారిమళ్లాయి. హవాలా రూపంలో చంద్రబాబు స్కాంకు పాల్పడ్డాడు. చంద్రబాబు అరెస్టు సమంజసమే. అవినీతికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేస్తే రాజకీయం చేయడం తగదు. -అనకాపల్లి జిల్లా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చంద్రబాబు నాయుడు అవినీతి సామ్రాట్ చంద్రబాబు నాయుడు అవినీతి సామ్రాట్. స్కిల్ డెవలప్మెంట్ స్కాం సూత్రధారి చంద్రబాబే. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అనేక కుంభకోణాల్లో భాగస్వామి. చంద్రబాబు వేల కోట్ల అక్రమాల్లో స్కిల్ డెవలప్మెంట్ స్కాం చాలా చిన్నది. చంద్రబాబు పాపం పండింది.. చంద్రబాబు ను జైలుకు పంపాలి. -రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పూర్తి ఆధారాలతో అరెస్ట్ చంద్రబాబు నాయుడు అరెస్టుపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పూర్తి ఆధారాలతోనే ఆయన్ను అరెస్ట్ చేశారు. కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలనుకుంటే 2021లోనే అరెస్టు చేయొచ్చు. స్కిల్ డెవలప్మెంట్ పేరిట ప్రజల సొమ్ము రూ. 360 కోట్లు దోచేసశాడు. జీఎస్టీ,ఇంటెలిజెన్స్, ఐటీ, ఈడీ, సెబ్ ఇలా అన్ని కూడా మూడు సంవత్సరాల నుంచి దర్యాప్తు చేస్తూ పూర్తి ఆధారాలతో అరెస్టు చేశారు. - ఎమ్మెల్యే తలారి వెంకట్రావు -
నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తున్న అప్పన్న స్వామి
-
‘తుని–సబ్బవరం’ను జాతీయ రహదారిగా మార్చండి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలోని తుని–సబ్బవరం రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని కేంద్ర జాతీయ రహదారులు, రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విజ్ఞప్తి చేశారు. బుధవారం కేంద్ర మంత్రితో భేటీ అనంతరం ధర్మశ్రీ మీడియాతో మాట్లాడారు. 133 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రహదారికి రూ.2,200 కోట్లు ఖర్చవుతుందన్నారు. దీనికి సంబంధించి డీపీఆర్ కూడా పూర్తయిందని చెప్పారు. రహదారి పనులు వేగంగా చేపట్టాలని కేంద్రమంత్రికి వినతి పత్రం అందజేశానన్నారు. ఈ రహదారి పూర్తయితే ఏడు నియోజకవర్గాల్లో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. -
‘జనసేన’ సైకో చర్య.. దాడి ఘటనపై మంత్రి జోగి రమేష్ హెచ్చరిక
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద తనపై దాడి జరిగిందని మంత్రి జోగి రమేష్ తెలిపారు. కర్రలు, రాళ్లతో దాడికి దిగారని, ఈ ఘటనలో తమ వాళ్లకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. కాగా విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. గర్జన సభ నుంచి ఎయిర్‌పోర్టు వెళ్తుండగా వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేష్ కార్లపై దాడికి తెగబడ్డారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. జనసేన కార్యకర్తల విధ్వంసంతో ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. జనసేన కార్యకర్త దాడిలో మంత్రి జోగి రమేష్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. మంత్రి రోజా సహాయకుడితోపాటు పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై మంత్రి జోగి స్పందిస్తూ.. గర్జనను పక్కదారి పట్టించేందుకే తాగుబోతులతో దాడులు జరిపించారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదని హెచ్చరించారు. తమతో పెట్టుకుంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో తిరగలేడని ధ్వజమెత్తారు. సంబంధిత వార్త: విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద జనసేన కార్యకర్తల వీరంగం.. పవన్ సమాధానం చెప్పాలి వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేష్‌లపై విశాఖ ఎయిర్‌పోర్టులో జనసైనికుల దాడిపై తక్షణమే పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. వైజాగ్ ఎయిర్‌పోర్టులు మంత్రులు రోజా, జోగి రమేష్ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఒక్క ఎమ్మెల్యే లేకపోతేనే ఎంత దౌర్జన్యం చేస్తే.. ఐదారు సీట్లు గెలిస్తే ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారోనని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి సంబంధించిన విజువల్స్, ఫోటోలు ఉన్నాయని.. దాడి చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. వై వి సుబ్బారెడ్డి,జోగి రమేష్ లపై విశాఖ ఎయిర్‌పోర్టులో జనసైనికుల దాడిపై తక్షణమే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి!— Ambati Rambabu (@AmbatiRambabu) October 15, 2022 గర్జనను పక్కదారి పట్టించేందుకే గర్జనను పక్కదారి పట్టించేందుకే జనసేన దాడులు చేసిందని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండిపడ్డారు. వందమంది రౌడీలతో దాడులు చేశారని తెలిపారు. జనసేన చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పవన్ కల్యాణ్ రౌడీయిజం చేస్తున్నాడా? దాడి ఘటనపై పవన్ తక్షణమే సమాధానం చెప్పాలి. మీకు వందమంది ఉంటే.. మాకు పదివేల మంది ఉన్నారు. పవన్ పిచ్చి వేషాలు వేస్తే చీరెస్తాం’ -ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ -
మంత్రుల కార్లపై కర్రలు , రాళ్లతో దాడిచేసిన జనసేన కార్యకర్తలు
-
వికేంద్రీకరణ కోసం రాజీనామాకు నేను సిద్ధం: కరణం ధర్మశ్రీ
-
స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను అందించిన కరణం ధర్మశ్రీ
సాక్షి, విశాఖపట్నం: వికేంద్రీకరణ కోసం రాజీనామాకు సిద్ధమని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈక్రమంలోనే విశాఖపట్నంలో వికేంద్రీకరణకు మద్దతుగా జరుగుతున్న జేఏసీ మీటింగ్‌లో స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్‌కు అందజేశారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు దమ్ముంటే వికేంద్రీకరణ వ్యతిరేకంగా రాజీనామా చేయాలని సవాల్ చేశారు. అమరావతికి మద్దతుగా అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి తిరిగి పోటీ చేయాలని కరణం ధర్మశ్రీ సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే, ఈనెల 15న విశాఖ రాజధానికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహిస్తామని వికేంద్రీకరణ జేఏసీ ప్రకటించింది. టూ టౌన్ అంబేడ్కర్ విగ్రహం నుంచి ర్యాలీ జరుగుతుందని తెలిపింది. త్వరలో మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు కూడా వెల్లడించింది. చదవండి: (Visakhapatnam: అవసరమైతే రాజీనామాకు సిద్ధం: అవంతి శ్రీనివాస్) -
ఎన్టీఆర్‌పై ప్రేమ ఉన్నట్టు ఇప్పుడు డ్రామాలు చేస్తున్నారు: కరణం ధర్మశ్రీ
-
ధర్మశ్రీకి అందలం.. అభిమానుల ఆనందం
చోడవరం(అనకాపల్లి జిల్లా): అనుభవజ్ఞుడికి సముచిత స్థానం లభించింది. ఆయన సేవలకు తగిన గుర్తింపు దక్కింది. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని ప్రభుత్వ విప్‌గా నియమించడంతో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చోడవరం నియోజకవర్గంతోపాటు అనకాపల్లి జిల్లాలో అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. బీఈడీ బీఎల్ చదవిన ధర్మశ్రీ రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలని భావించి యువజన కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2004లో వైఎస్సార్ హయాంలో మాడుగుల ఎమ్మెల్యేగా, డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ధర్మశ్రీ వైఎస్సార్సీపీలో రాష్ట్ర కార్యదర్శిగా పదవి నిర్వహించారు. 2019లో చోడవరం ఎమ్మెల్యేగా 30 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన ఆ యనను ఈ ఏడాది ప్రారంభంలో కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి పార్టీని బలోపేతంగా చేస్తూ నియోజకవర్గాల పార్టీ ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయడంలో తన వంతు పాత్ర పోషించారు. ఈ పరిస్థితుల్లో తాజాగా రాష్ట్రప్రభుత్వంలో కీలకమైన ప్రభుత్వ విప్ పదవికి ధర్మశ్రీని నియమించడంపై సర్వత్రా ఆనందం వ్యక్తమైంది. చోడవరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచి, బాణసంచాలు కాల్చి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడువాక సత్యారావు, జెడ్పీటీసీ మారిశెట్టి విజయశ్రీకాంత్, ఎంపీపీ గాడి కాసు అప్పారావు, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు నాగులాపల్లి రాంబాబు, వైఎస్ ఎంపీపీలు బైన ఈశ్వరరావు, బుద్ద గంగరాజు, ఎంపీటీసీల ఫ్లోర్‌లీడర్ పల్లా రమణ, మార్కెట్ కమిటీ చైర్మన్ గూనూరు శంకరరావు, మండల ప్రతినిధి దొడ్డి వెంకట్రావు(డీవీఆర్), పట్టణ ప్రతినిధి దేవరపల్లి సత్య పాల్గొన్నారు. -
డీఎస్సీకి ఎంపికైన ఎమ్మెల్యే ధర్మశ్రీ
చోడవరం: రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ 1998 డీఎస్సీలో ఎంపికయ్యారు. రాజకీయాల్లోకి రాకముందు.. సుమారు పాతికేళ్ల క్రితం ధర్మశ్రీ డీఎస్సీ రాసి అర్హత సాధించారు. ఇన్నాళ్లకు ఆయనకు టీచర్‌గా ఉద్యోగావకాశం వచ్చింది. ఈ విషయమై ఆయనను కదిలించగా.. ‘అప్పుడు నా వయసు సుమారు 30 ఏళ్లు. మద్రాసు అన్నామలై యూనివర్సిటీలో బీఈడీ చదివాను. ఉపాధ్యాయునిగా స్థిరపడాలనుకున్నాను. 1998 డీఎస్సీ రాశాను. అర్హత సాధించినా అది పెండింగ్‌లో పడటంతో న్యాయవిద్య (బీఎల్) చదవడం ప్రారంభించాను. ఆ సమయంలోనే రాజకీయ అరంగేట్రం చేసి కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగంలో క్రియాశీలకంగా వ్యవహరించాను. ఈ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అనుచరునిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని, ఈ రోజు వైఎస్సార్సీపీలో సముచిత స్థానంలో ఉన్నాను. అప్పుడే ఉద్యోగం వస్తే రాజకీయాల కంటే ఉపాధ్యాయ వృత్తికే ప్రాధాన్యం ఇచ్చేవాడిని. సీఎం జగన్మోహనరెడ్డి తీసుకున్న చొరవ వల్ల పాతికేళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయుల స్వప్నం నెరవేరింది. ముఖ్యమంత్రికి డీఎస్సీ 1998 బ్యాచ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా’ అన్నారు. -
సీఎం జగన్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, అనకాపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటం, కార్యకర్తల కృషి వలనే వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించిందని టీటీడీ ఛైర్మన్, ఉమ్మడి విశాఖ జిల్లా కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అనకాపల్లి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా కరణం ధర్మశ్రీ ఆదివారం వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ గెలిచిన తర్వాత మూడేళ్లు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టారు. కార్యకర్తలకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుంది. పాదయాత్రలో ప్రజల కష్టాలను కళ్లారా చూశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దాదాపు అన్ని హామీలను అమలు చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సీఎం ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదు. నవరత్నాల ద్వారా సీఎం జగన్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఎల్లో మీడియా పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తోంది. ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలి. గడపగడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి' అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. చదవండి: (మీరెంతమంది కలిసొచ్చినా.. సీఎం జగన్ సింగిల్‌గానే: దాడిశెట్టి రాజా) ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ మాట్లాడుతూ.. చంద్రబాబును మించిన ఐరెన్ లెగ్ ఎవరూ లేరు. చంద్రబాబు ఐరెన్ లెగ్ 1 అయితే లోకేష్ 2. చంద్రబాబు పాలనలో అంతా కరువు కటకాలే. సీఎంగా జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం సుభిక్షంగా ఉంది. వైఎస్ జగన్ గోల్డెన్ లెగ్ అని మంత్రి అమరనాథ్ అన్నారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. ధర్మశ్రీని అనకాపల్లి జిల్లా అధ్యక్షుడుగా నియమించడం సంతోషకరమైన విషయం. వచ్చే ఎన్నికల్లో వైస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుంది. అందుకు కలిసి కట్టుగా అందరం పని చేస్తాము. అనకాపల్లి జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటాము. వైవీ సుబ్బారెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ రావడం మన అదృష్టం. సీఎం జగన్ పాలనలో ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు. మే 11 నుంచి ప్రారంభం కానున్న గడప గడపకు వైస్సార్సీపీని విజయవంతం చేస్తామ'ని మంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. చదవండి: (పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ కౌంటర్) -
పార్టీ నిర్ణయాలకు అంతా కట్టుబడి ఉండాలి
చోడవరం (అనకాపల్లి జిల్లా): వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం చోడవరంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి స్థానం కల్పించకపోవడంతో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్ధపడటంతో వారందర్నీ ఎమ్మెల్యే నివారించారు. పదవులు వస్తుంటాయి, పోతుంటాయని.. ప్రజలకు ఎప్పుడూ సేవచేసే అదృష్టం వచ్చినప్పుడు దానికి న్యాయం చేయాలన్నారు. వివిధ సమీకరణాల వల్ల తనకు మంత్రి వర్గంలో స్థానం దక్కకపోయినప్పటికీ సీఎం జగన్మోహన్రెడ్డి అభిమానం తనపైన, నియోజకవర్గ ప్రజలపైన ఎప్పుడూ ఉంటుందన్నారు. పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా అంకిత భావంతో రానున్న రోజుల్లో పార్టీ అభివృద్ధికి మరింత పనిచేయాలన్నారు. సమావేశంలో జెడ్పీటీసీలు మారిశెట్టి విజయశ్రీకాంత్, దొండా రాంబాబు, పోతల లక్ష్మీశ్రీనివాస్, తలారి రమణమ్మ, ఎంపీపీ గాడి కాసు, యర్రంశెట్టి శ్రీనివాసరావు, పైల రాజు, మండల అధ్యక్షులు పల్లా నర్సింగరావు, మడ్డు అప్పలనాయుడు, కంచిపాటి జగన్నాథరావు, కొళ్లిమళ్ల అచ్చెంనాయుడు, డీసీసీబీ డైరెక్టర్ మూడెడ్ల శంకరరావు, విశాఖ డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నిజం చెప్పడం మా నైజం, ఇజం
-
టీడీపీ తీరును రాష్ట్ర ప్రజలు ఛీదరించుకుంటున్నారు
-
చంద్రబాబు ఇచ్చిన నెల జీతం తీసుకుని పట్టాభి మాట్లాడుతున్నారు: ధర్మశ్రీ
-
అక్కసుతోనే అయ్యన్నపాత్రుడు పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు
-
‘చంద్రబాబుది బషీర్‌బాగ్ కాల్పుల చరిత్ర’
సాక్షి, విజయవాడ: రైతులు, వ్యవసాయం గురించి మాడ్లాడే నైతికత ప్రతిపక్ష నేత చంద్రబాబుకి లేదని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం పట్ల టీడీపీకి చిత్తశుద్ది ఉంటే 23 సీట్లు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. దివంగత వైఎస్సార్ ఉచిత విద్యుత్ అంటే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని విమర్శించిన బాబుకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని దుయ్యబట్టారు. ప్రతీ విషయాన్ని రాజకీయం చేయడం చంద్రబాబుకి అలవాటన్నారు. తమది రైతుల సంక్షేమ ప్రభుత్వమని, పార్టీ పేరులోనే రైతు ఉందని గుర్తుచేశారు. ‘నివర్’ తుపాన్‌తో నష్టపోయిన రైతాంగాన్ని ప్రతిపక్షనేతగా పరామర్శించని బాబు అసెంబ్లీలో రైతుల గురించి ఏం మాడ్లాడతారని సూటిగా ప్రశ్నించారు. రూ. 86 వేల కోట్లను మాఫీ చేస్తానని గత ఎన్నికలలో హామీ ఇచ్చి ఎంత మాఫీ చేశారో చెప్పగలరా అని నిలదీశారు. రాష్ట్రంలో 50 లక్షలమంది రైతులకి రైతు భరోసా పధకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం తమదని నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులందరినీ అసదుకుంటామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ప్రకటించారని తెలిపారు. రైతులకి వేలకోట్ల రూపాయిలని బకాయిలు పెట్టిన చంద్రబాబు రైతుల గురించి ఏముఖం పెట్టుకుని మాడ్లాడతారని గుడివాడ అమర్నాథ్ అన్నారు. అదే విధంగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. రైతు పేరు ఎత్తే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. రైతు ద్రోహి, రైతులను అరెస్ట్ చేయించిన ఘనత చంద్రబాబుదని మండిపడ్డారు. తుఫాన్ వల్ల నష్ట పోయిన రైతులను ఏనాడు చంద్రబాబు ఆదుకోలేదన్నారు. రైతు పక్షపాతి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తుఫాన్ పరిహారం ప్రకటించిన తర్వాత చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ప్రారంభమయ్యాయి. మొదటి అంశంగా సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. -
వైఎస్సార్సీపీలో చేరిన ప్రముఖ కన్నడ నటుడు
సాక్షి, రోలుగుంట (చోడవరం): ప్రముఖ కన్నడ సినీ నటుడు గొంది సిద్ధూ తన అనుచరులతో ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. ఆయన సొంత ఊరు.. విశాఖ జిల్లా రోలుగుంట మండలం బీబీపట్నం. రత్నంపేటలో జరిగిన సభలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పార్టీ కండువా వేసి సిద్ధూను ఆహ్వానించారు. ఈ సందర్భంగా నటుడు సిద్ధూ మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ గ్రామానికి వచ్చిన కరణం ధర్మశ్రీ బోరు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి ఎమ్మెల్యే అయిన వెంటనే నెరవేర్చారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం వైఎస్ జగన్ ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ప్రశంసించారు. అంతేకాకుండా పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలుచేయడంలో ఆయనను మించిన సీఎం ఎవరూ ఉండరని, ఉండబోరని కొనియాడారు. (అవినీతిపై తిరుగులేని అస్త్రం)