![Minister Avanthi Srinivas Review Meeting With Collector And Officials In Visakhapatnam - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/31/avanthi-srinivas.jpg.webp?itok=T2mx5Iki)
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో నాణ్యతతో కూడిన అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని పర్యాటక శాఖ మంత్రి అవంతీ శ్రీనివాస్ అధికారులను అదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, వివిధ శాఖల జిల్లా అధికారులతో పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ వంటి పనులపై జీవీఎంసీ సమావేశ మందిరంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో రోడ్లు భవనాలు, తాగునీటి ప్రాజెక్టులు మొదలైనవి నిర్మించే క్రమంలో నాణ్యతను తప్పకుండా పాటించాలని అధికారులకు మంత్రి సూచించారు. ఆర్థిక సంవత్సరం పుర్తవుతున్నందున మంజురైనా అభివృద్ధి పనులన్నింటినీ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతంలోని 10 నియోజకవర్గాలకు సంబంధించి జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయా అధికారులతో, ఎమ్మెల్యేలతో నియోజకవర్గాల వారిగా సమీక్షించారు. రోడ్లు, తాగునీటి పనులు, భవనాలు ఎన్ని మంజూరు అయ్యాయో, వాటిలో పూర్తి అయినవి, వివిధ దశల్లో ఉన్న నిర్మాణ పనుల వివరాలు, సమస్యలపై చర్చించారు. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాలను వెంటనే పూర్తి చేయాలనన్నారు.
ప్రభుత్వ విప్ బూడి ముత్యాలు నాయుడు మాట్లాడుతూ.. నిర్మాణాలు చేసేటప్పుడు ఎక్కడైనా పొరపాటు జరిగితే వెంటనే సరి చేసుకోవాలన్నారు. నాణ్యతా లోపాలను గుర్తించినట్లయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హచ్చరించారు. ఇక జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ అధికారులు సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వివిధ శాఖల అధికారులతో సమన్వయంతో సంప్రదించి పనులు చేపట్లాలని సూచించారు. నియోజకవర్గ ఇంచార్జీలు, అధికారులు ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి అభివృద్ధి పనులను సమీక్షిస్తూ ఉండాలనిన్నారు. కాగా ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు యువీ సూర్యనారాయణ రాజు, కరణం ధర్మశ్రీ, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మీ జిల్లా పంచాయతీ అధికారి ఆర్ గోవిందరావుతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment