Vinay Chand
-
ఏపీలో నేటి నుంచి పేదలందరికీ ఇళ్లు మెగా గ్రౌండింగ్ డ్రైవ్
-
Cyclone Yaas: ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష
-
తుఫాన్ నేపథ్యంలో విశాఖలో ముందస్తు జాగ్రత్తలు
-
ఆరోగ్య శ్రీ రెమిడిసివిర్ 2500లకే ఇవ్వాలి: కలెక్టర్ వినయ్ చంద్
-
విశాఖ : కోవిడ్ నియంత్రణకు పెద్ద ఎత్తున చర్యలు
-
ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి కలెక్టర్ :వినయ్ చంద్
-
సోషల్ మీడియాలో చూసి.. వెంటనే
సాక్షి, విశాఖపట్నం: ప్రజల సమస్యలు ఏవిధంగా తెలిసినా తక్షణమే స్పందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన అధికార యంత్రాంగాన్ని స్ఫూర్తిమంతంగా కదిలిస్తోంది. సమావేశాల్లో, ‘స్పందన’ కార్యక్రమంలో వచ్చిన విజ్ఞాపనలను సత్వరమే పరిష్కరించడంలో విశాఖ జిల్లా కలెక్టరు వి.వినయ్‌చంద్ ముందున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో కనిపించిన ఓ పోస్టు విషయంలోనూ అదే స్పందన చూపించడం ప్రభుత్వ పనితీరుకు అద్దంపడుతోంది. విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలో కూండ్రం గ్రామానికి చెందిన మజ్జి పవిత్ర తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (చదవండి: అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్) తన తండ్రి అప్పలనాయుడికి పెరాలసిస్ వచ్చిందని, చేతిలో డబ్బులు లేక ఇంటి దగ్గరే ఉంచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ఆర్థిక సహాయం తమకేమీ వద్దని, తన పోస్టు సీఎం గారి వద్దకు చేరేలా చూడాలని, లేదా ఉచిత ఆసుపత్రి ఏదైనా ఉన్నా చెప్పాలని కోరింది. ఆ పోస్టును చూసిన కలెక్టర్ వినయ్‌చంద్ సత్వరమే స్పందించారు. కేజీహెచ్ సూపరింటెండెంట్‌తో మాట్లాడి బెడ్ ఏర్పాటు చేయించారు. ఆర్డీవోను పంపించి అప్పలనాయుడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకొచ్చేవరకూ పర్యవేక్షించారు. కేజీహెచ్‌లో మంచి వైద్యం అందించడంతో అప్పలనాయుడు కోలుకున్నారు.(చదవండి: రైతులకు విద్యుత్ ఎప్పటికీ ఉచితమే) -
క్రేన్ నిర్వహణలో నిర్లక్ష్యం: వినయ్ చంద్
సాక్షి, విశాఖపట్నం: క్రేన్ నిర్మాణంలో లోపం కారణంగానే హిందూస్ధాన్ షిప్ యార్డులో క్రేన్ ప్రమాదానికి గురైందని విశాఖపట్నం కలెక్టర్ వినయ్ చంద్ అన్నారు. ఈ నెల 1న క్రేన్ ప్రమాదంలో చోటు చేసుకున్న ప్రమాదంలో పది మంది మృతి చెందడంతో.. ఐదుగురు ఆంధ్రా యూనివర్సిటీ ఫ్రొఫెసర్లు, విశాఖ ఆర్డిఓ, ఆర్ అండ్ బి ఎస్ఈలతో కమిటీ నియమించామని తెలిపారు. ఆ కమిటీ బుధవారం షిప్ యార్డులో జరిగిన ప్రమాదంపై నివేదికను అందజేసిందని తెలిపారు. కమిటీ వారం రోజులపాటు క్షేత్రస్థాయిలో పూర్తిగా పరిశీలించి నివేదిక అందించిందని పేర్కొన్నారు. క్రేన్ నిర్వహణలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందని, 70 టన్నుల లోడ్‌కి సంబంధించి క్రేన్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్న సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదని నిపుణుల కమిటీ నివేదికలో స్పష్టం చేసిందన్నారు. క్రేన్‌కి సంబంధించి కార్బన్ బ్రషెష్ పడిపోవడం, ఇన్సులేటర్స్ పాడై మూడుసార్లు మార్చారని తెలిపారు. గతంలో ట్రయల్ రన్ చేస్తున్న సమయంలోనే గేర్ బాక్స్‌లో ఆయిల్ లీకేజ్ జరిగిందని వివరించారు. (విశాఖ: షిప్ యార్డ్ ప్రమాదంపై నివేదిక) గేర్ బాక్స్ ఫెయిల్యూర్ వల్ల భారీ శబ్దంతో క్రేన్ కుప్పకూలిందన్నారు. ప్రమాదం కేవలం పది సెకన్లలోనే జరిగిపోయిందని, క్రేన్ స్ట్రక్చరల్ డిజైనింగ్, డ్రాయింగ్స్ థర్డ్‌పార్టీతో పరిశీలించలేదని స్పష్టం చేశారు. క్రేన్ నిర్మాణంలోనే లోపాలున్నాయని, సామర్థ్యానికి తగ్గట్లుగా క్రేన్ నిర్మాణం జరగలేదని తెలిపారు. నిపుణులతోనే తప్పనిసరిగా లోడ్ టెస్టింగ్ పరిశీలన జరపాలన్నారు. థర్డ్‌పార్టీ ఆధ్వర్యంలోనే ట్రయల్ రన్ నిర్వహించాలని నిపుణులు సూచించారని తెలిపారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు. -
మానవతా థృక్పథంతో ముందుకు రావాలి
సాక్షి, విశాఖపట్నం: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ కొన్ని తీర్మానాలను చేసినట్లు మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో రోజుకు మూడు వేల మందికి కోవిడ్ టెస్ట్‌లు చేస్తున్నారు. వీటి సంఖ్య ఐదు వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. హోమ్ ఐసొలేషన్ ద్వారా వైద్యం అందించాలని భావిస్తున్నాము. ఐసీఎంఆర్ అనుమతితో మరికొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరీక్షలకు అనుమతి ఇస్తాము. అత్యవసర వైద్యం అందించడానికి సిబ్బందిని నియమిస్తున్నాము. మానవతా థృక్పథంతో ఉన్న వైద్యసిబ్బంది కోవిడ్ సేవలు అందించడానికి ముందుకు రావాలి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా వైద్యవిభాగంలో లోపాలు ఉన్నాయి. వాటిన్నిటినీ సరిదిద్దుకుంటూ ప్రజలకు కోవిడ్‌పై అవగాహన కల్పిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. (ఎల్లో మీడియా క్షణక్షణం ప్రజల్ని భయపెడుతోంది) ఆక్సిజన్ కొరత లేదు: కలెక్టర్ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ.. 400మంది ఇప్పటికే ఐసోలేషన్‌లో ఉన్నారు. రానున్నకాలంలో మరింత మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. జిల్లాలో ఆక్సిజన్ కొరత లేదు. ఇండస్ట్రియల్ ఆక్సిజన్‌ను మెడికల్ ఆక్సిజన్‌గా మారుస్తున్నాము. జిల్లాలో అదనంగా మొత్తం 22 ఆస్సత్రులు కోవిడ్ ఆస్పత్రులుగా గుర్తించాం. ఇప్పటికే 4వేల బెడ్స్ ఉన్నాయి. వీటిని 7వేల వరకు పెంచనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. (విశాఖకు తప్పిన మరో ప్రమాదం) -
ఏపీ క్యాడర్ నా అదృష్టం..
‘చిన్నతనంలో నేను నడక రాక పడిపోయినప్పుడు అమ్మ నన్ను భుజం మీద వేసుకుని లాలించేది.. రాత్రి నిద్రలో భయపడి కలవరించినప్పుడు.. ప్రేమనంతా వేళ్లల్లో నింపి నా జుత్తు సవరించేది’’ అని అమ్మతో తన జ్ఞాపకాల్ని ఓ కవి చాలా హృద్యంగా వర్ణిస్తారు. అలాగే మన కలెక్టర్ వినయ్‌చంద్ కూడా నాలుగు మాటలు చెబితే అందులో మూడు అమ్మ కోసమే మాట్లాడుతారు. అమ్మ ప్రభావం తన జీవితం మీద ఎలా ఉందో వివరిస్తారు. ఐఏఎస్ అధికారిని చేయాలనేది నాన్న ఆశయం.. కానీ నా చిన్నప్పుడే ఆయన చనిపోయారు... నన్ను సమాజానికి సేవలందించే ప్రయోజకుడిగా తీర్చిదిద్దాలని ఆయన ఏ విధంగా కలలు గన్నారో అమ్మ చెప్పేది అంటూ గుర్తు చేసుకున్నారు. అమ్మ మాట వల్లే ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉద్యోగానికి స్వస్తి చెప్పేశా... తదేక దీక్షతో ఐఏఎస్ సాధించా... పది మందికీ మంచి చేయడానికి ఇంతకు మించిన సర్వీసు మరొకటి లేదు... నాన్న ఆశయమేమిటో అమ్మ చెప్పకపోయుంటే ఆయనలాగే నేనూ ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గానే ఉండిపోయేవాడిని... అని జిల్లా కలెక్టర్ వాడ్రేవు వినయ్‌చంద్ తన హృదయ రాగంలో ఆవిష్కరించారు. సాక్షి, విశాఖపట్నం: చదువులో చురుకుదనం.. అపారమైన విషయ పరిజ్ఞానం.. సమస్యను గుర్తించే నేర్పరితనం.. సవాళ్లను స్వీకరించడం.. వెరసి సమాజానికి తనవంతు కర్తవ్యంగా సేవ చేయాలన్న దృక్పథం వాడ్రేవు వినయ్‌చంద్‌ను సివిల్స్ వైపు అడుగులు వేసేలా చేశాయి. కజిన్ స్ఫూర్తి.. ఐఏఎస్‌గా చూడాలన్న అతని నాన్న కలను నిజం చేసేందుకు ఎలక్ట్రికల్ ఇంజినీర్ ఉద్యోగానికి స్వస్తి చెప్పేసి.. కలెక్టర్ అయ్యేందుకు దీక్షబూనారు. తొలి ప్రయత్నంలోనే ఐఆర్టీఎస్ వచ్చినా.. ఐఏఎస్ లక్ష్యంగా పెట్టుకుని నిరంతర శ్రమతో రెండో ప్రయత్నంలో సాధించారు. ఫలితంగా అఖిలభారత స్థాయిలో 18వ ర్యాంకు వచ్చింది. సివిల్స్‌కు సిద్ధమయ్యే సమయంలోనే పరిపాలనపై అవగాహన, ఎదుట వ్యక్తులను అంచనా వేయడంలో పట్టు సాధించారు. శిక్షణ అనంతరం వివిధ హోదాల్లో పని చేసిన వినయ్‌చంద్ పనితనంలో తన ముద్రవేశారు.‘ ఆ రోజు నాన్న ఆశయమేమిటో అమ్మ చెప్పకపోయుంటే ఆయనలాగే నేనూ ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గానే ఉండిపోయేవాడిని...’ అంటున్న కలెక్టర్.. ‘సాక్షి’ హృదయరాగంలో తన బాల్యం, చదువు, అలవాట్లు, విధి నిర్వహణలో ఎదురైన సవాళ్లు, సాధించిన విజయాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. మా పూర్వీకులది కృష్ణా జిల్లా, బందరు(మచిలీపట్నం)లో ఉండేవారు. మా నాన్న వాడ్రేవు పవన్ కిశోర్ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పని చేశారు. అందువల్ల తొలుత ఖమ్మం జిల్లా పాల్వంచలో ఉండేవాళ్లం. ఒకటో తరగతి అక్కడే చదివాను. అదే సమయంలో మా నాన్న చనిపోయారు. తర్వాత మా అమ్మకు నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్)లో ఉద్యోగం వచ్చింది. దీంతో విజయవాడకు మా కుటుంబ నివాసం మారింది. అక్కడి సత్యనారాయణపురంలోనే నా బాల్యం అంతా గడిచింది. రెండో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విజయవాడలోనే విద్యాభ్యాసం సాగింది. పదోతరగతి వరకు సెయింట్ మాథ్యూస్ పబ్లిక్ స్కూల్లో చదివా. తర్వాత నలందా జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ పూర్తి చేశాను. ఎంసెట్‌లో 414 ర్యాంకు సాధించాను. జైపూర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లో సీటు వచ్చింది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ హానర్స్ చేశాను. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సీఎస్సీ అనే మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అప్పుడే అమెరికాలోని అలబామా రాష్ట్రంలో బర్మింగ్‌హామ్‌కు ఆర్నెల్ల పాటు కంపెనీ విధుల నిమిత్తం వెళ్లొచ్చా. ‘ఆంగ్లం’పై పట్టుతో సర్వీస్ సివిల్ సర్వీస్ పరీక్షల్లో తొలి ప్రయత్నం (2006)లోనే 632 ర్యాంకు సాధించాను. రైల్వే ట్రాఫిక్ సర్వీస్(ఐఆర్టీఎస్) వచ్చింది. కానీ ఆ ఉద్యోగంలో చేరలేదు. నోయిడా నుంచి ఢిల్లీకి మకాం మార్చేశాను. ఏడాది పాటు తదేక దీక్షతో చదివాను. వాజీరామ్ అండ్ రవి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాను. ఆంగ్లంపై పట్టు ఉండటం, చిన్నప్పటి నుంచి రైటింగ్ స్కిల్స్ పెంచుకోవడం ఇందుకెంతో ఉపకరించాయి. 2007లో రెండో ప్రయత్నంలో ప్రిలిమ్స్ రాశాను. తర్వాత మెయిన్స్‌లో విజయవంతమయ్యాను. 2008లో జరిగిన ఇంటర్వ్యూలో సంతృప్తిగా సమాధానాలు ఇచ్చాను. ఫలితంగా అఖిలభారత స్థాయిలో 18వ ర్యాంకు వచ్చింది. తర్వాత ముస్సోరిలో శిక్షణ పూర్తి చేసిన తర్వాత కలిపిన మార్కులతో వేసే ఫైనల్ ర్యాకింగ్‌లో నేను ఏడో స్థానంలో నిలిచాను. డబుల్ ఎం.ఎ చేసినట్లే.. యూపీఎస్సీ పరీక్షలకు అప్పట్లో రెండు ఆప్షనల్ సబ్జెక్టులు ఉండేవి. నేను ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌ను అయినప్పటికీ కొత్త సబ్జెక్టులైన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (పాలనాశాస్త్రం), సైకాలజీ (మనస్తత్వ శాస్త్రం) ఆప్షనల్స్‌గా ఎంచుకున్నా. మానవ వనరులకు సంబంధించిన వీటిని ఎంతో మనసు పెట్టి చదివాను. ఈ రెండింటినీ పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో అధ్యయనం చేశాను. తక్కువ కాలంలోనే పట్టు సాధించడంతో డబుల్ ఎం.ఎ. చేసినట్లు అయ్యింది. వీటిపై అవగాహన వల్ల పరిపాలనలో, ఎదుటి వ్యక్తులను అంచనా వేయడంలో ఎంతగానే ఉపయోగపడుతోంది. అతిపెద్ద డివిజన్లతో ఆరంభం ముస్సోరిలో రెండో దఫా శిక్షణ తర్వాత 2010 సెప్టెంబర్‌లో ప్రకాశం జిల్లా కందుకూరు రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్‌గా తొలి పోస్టింగ్ వచ్చింది. రాష్ట్రంలో 31 మండలాలున్న మదనపల్లి రెవెన్యూ డివిజన్ అతి పెద్దది. తర్వాత 24 మండలాలతో రెండో స్థానంలో ఉన్న కందుకూరులో పనిచేయడం రెవెన్యూ పరమైన అంశాలపై ఎంతో అనుభవాన్ని ఇచ్చింది. ఏడాది తర్వాత మదనపల్లి రెవెన్యూ డివిజన్‌కు సబ్ కలెక్టరుగా బదిలీ అయ్యింది. విస్తీర్ణం చూస్తే విజయనగరం జిల్లా కన్నా పెద్దగా ఉండే డివిజన్ ఇది. బ్రిటిష్ వారి కాలం నుంచే కొనసాగుతున్న ఈ డివిజన్‌కు నేను 149వ సబ్‌కలెక్టర్‌ను. అక్కడి చారిత్రాత్మకమైన పర్యాటక ప్రాంతం హార్సిలీ హిల్స్ అభివృద్ధికి కృషి చేశాను. రెండేళ్లలో రెండు అతిపెద్ద రెవెన్యూ డివిజన్ల్లో పనిచేయడం ద్వారా నా ఐఏఎస్ ఉద్యోగ ప్రస్థానం ఆరంభమైంది. ప్రపంచ తెలుగు మహాసభలతో అనుభూతి 2012 మేలో చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పోస్టింగ్ వచ్చింది. 2013 జనవరిలో తిరుపతిలో జరిగిన ప్రపంచ నాలుగో తెలుగు మహాసభలు విజయవంతం కావడానికి నా వంతు పాత్ర పోషించాను. పాడేరులో కోరి అడుగుపెట్టా సీనియర్ ఐఏఎస్ అధికారి సాల్మన్ ఆరోఖ్యరాజ్ తొలుత పాడేరు సబ్‌కలెక్టర్‌గా పనిచేశారు. తర్వాత ఆయన చిత్తూరు కలెక్టర్‌గా వచ్చిన సమయంలోనే నేను అక్కడ జాయింట్ కలెక్టరుగా ఉన్నా. పాడేరులో ఆయన ఎన్నో అనుభవాలను తరచుగా చెప్పేవారు. దీంతో పాడేరులో పనిచేయాలనే ఆసక్తి కలిగింది. సాధారణంగా జేసీ స్థాయిలో పనిచేసిన తర్వాత ఐటీడీఏ పీవోగా వెళ్లేవారు ఎవరూ ఉండరు. కానీ నేను కావాలని 2013 అక్టోబరులో పాడేరు ఐటీడీఏ పీవోగా వచ్చాను. ఈ పోస్టులోకి ఏడేళ్ల తర్వాత వచ్చిన ఐఏఎస్ అధికారిని నేనే. 2015 జనవరి వరకు పనిచేశాను. కొద్ది సమయమే అయినా అపురూపమైన అనుభవాలను మిగిల్చింది. అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, హాస్టళ్లు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఇలా ప్రాథమిక వసతులకు సంబంధించిన భవనాలు పెద్ద ఎత్తున నిర్మించడానికి చర్యలు తీసుకున్నాను. అప్పట్లో ఏజెన్సీ మొత్తానికి పాడేరులో మాత్రమే రెండు బ్యాంకులు ఉండేవి. రెండు మూడు వందల రూపాయలు తీసుకోవడానికి గిరిజనులు గంటల తరబడి బారులు తీరేవారు. బ్యాంకర్లను ఒప్పించి పాడేరులోనే మరో రెండు బ్యాంకులతో పాటు జి.మాడుగుల, ముంచంగిపుట్టు, చింతపల్లి తదితర మండల కేంద్రాల్లో మొత్తం ఏడు కొత్త బ్యాంకులను ఏర్పాటు చేయడంలో సఫలమయ్యాను. ‘కాఫీ’రైతులకు అండగా... విశాఖ జిల్లాను కుదుపేసిన హుద్‌హుద్ తుపాను ఏజెన్సీలో కాఫీ రైతులకూ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కాఫీ మొక్కలకు నీడనిచ్చే సిల్వర్ ఓక్ చెట్లన్నీ కూలిపోయాయి. నష్టపరిహారం చెల్లించే విషయంలో అప్పటివరకు కాఫీ మొక్కకు గుర్తింపే లేదు. కానీ వాటికి అత్యంత ముఖ్యమైన నీడనిచ్చే సిల్వర్ ఓక్ చెట్లు పడిపోయాయి. వీటి వల్ల కాఫీ మొక్కలకు నష్టం వాటిల్లుతుందని, అందుకు నష్టపరిహారం ఇవ్వాలనే కోణంలో మొట్టమొదటిగా నేనే అధికారులతో సర్వే చేయించాను. అలా ప్రభుత్వం నుంచి కాఫీ రైతులకు రూ.30 కోట్ల మేర నష్టపరిహారం ఇప్పించడం నాకెంతో సంతృప్తిని ఇచ్చింది. పెద్దలు కుదిర్చిన సంబంధమే.. నేను వరంగల్‌లో అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడే 2010 ఏప్రిల్ 8న వివాహమైంది. నా భార్య సౌమ్య కీర్తి. కృష్ణా జిల్లా నేపథ్యమే అయినా ఆమె కుటుంబం హైదరాబాద్‌లో ఉండేవారు. మా బంధువుల ద్వారా పెద్దల కుదిర్చిన సంబంధమే మాది. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలోనే ఎం.ఫార్మసీ చదివింది. మా పెళ్లి అయ్యే సమయానికి ఆమె హైదరాబాద్‌లోని థెరడోస్ ల్యాబ్స్ అనే ఔషధ పరిశోధన సంస్థలో యాంటీ క్యాన్సర్ డ్రగ్‌పై రీసెర్చ్ అసిస్టెంట్‌గా పని చేసింది. సంగీతంలో ఆమెకు మంచి ప్రావీణ్యం ఉంది. ఇటీవల విశాఖ ఉత్సవాల్లో వేదికపై ఆమె పాడిన ‘రాములో రాములో’ పాటతో నేనూ సరదాగా గొంతు కలిపా. మేడారం జాతర ఎంతో నేర్పింది వరంగల్ జిల్లాలో రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు కోటి మంది భక్తులు తరలివస్తుంటారు. నేను అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఈ జాతర ఏర్పాట్లకు సమన్వయ అధికారిగా వ్యవహరించే అవకాశం వచ్చింది. అప్పటి వరంగల్ కలెక్టర్ ఎన్.శ్రీధర్ ప్రోత్సాహంతో 40 శాఖల అధికారులను సమన్వయం చేస్తూ దిగ్విజయంగా జాతరను ముగించాం. నా కెరీర్లో ఫస్ట్ టాస్క్ ఇదే. నాన్న మాట అమ్మ చెప్పింది నా ఐదేళ్ల వయసులోనే నాన్న చనిపోయారు. కానీ ఆయన ఆశయం అమ్మ లక్ష్మీ నాగ గిరిజ రూపంలో అలాగే ఉంది. ప్రజాసేవకు ఐఏఎస్‌ను మించిన సర్వీసు ఈ దేశంలోనే లేదని, నన్ను ఎలాగైనా ఐఏఎస్ అధికారిని చేయాలని తరచుగా అమ్మతో అనేవారట. నాన్న అలా ఆశించేవారంటూ అమ్మ అప్పుడప్పుడూ చెప్పినా.. నేనెప్పుడూ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇంజినీరింగ్ పూర్తి చేయడంపైనే దృష్టిపెట్టాను. తర్వాత ఎంబీఏ చదవాలనుకున్నాను. ఏపీ క్యాడర్ నా అదృష్టం సొంత ప్రాంతమైన ఏపీ క్యాడర్ రావడం నా అదృష్టం. 2008 ఆగస్టులో ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో ఐఏఎస్ శిక్షణ మొదలైంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆ సంస్థలో అడుగుపెట్టడం మరపురాని అనుభూతి. 2009 మే వరకు అక్కడే శిక్షణ. అదే సంవత్సరంలో శిక్షణలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వరంగల్ జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పోస్టింగ్ వచ్చింది. ఆ సమయంలోనే నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని స్వయంగా కలిసే అవకాశం వచ్చింది. కజిన్ స్పూర్తితో సివిల్స్‌పై దృష్టి మా కజిన్ ఎల్.వెంకటేశ్వర్లు 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉత్తరప్రదేశ్ క్యాడర్. నేను నోయిడా ప్రాంతంలో పనిచేస్తున్నపుడే ఆయన గౌతమబుద్ధ జిల్లాకు కలెక్టర్‌గా వచ్చారు. సెలవు వచ్చిదంటే ఆయన వద్దకు వెళ్తుండేవాణ్ని. పేదరికం ఎక్కువగా ఉండే ఉత్తరప్రదేశ్‌లో ప్రజల సంక్షేమం కోసం తాను చేస్తున్న పనుల గురించి మాటల సందర్భంలో చెబుతుండేవారు. ఉద్యోగంలో చేరింది మొదలుకుని ఉద్యోగ విరమణ వరకు ప్రజలకు చేరువగా ఉండి సేవ చేసే అవకాశం ఉన్న అత్యున్నత సర్వీసు ఐఏఎస్ మాత్రమేనని తెలుసుకున్నా. అదే సమయంలో నన్ను ఐఏఎస్ అధికారిగా చూడాలన్న మా నాన్న గారి ఆశయం నా మదిలో మెదిలింది. పది మంది సహాయం చేయాలనే భావనతో 2006లో ఇంజినీర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాను. సివిల్ సర్వీసెస్ పరీక్షలపైనే పూర్తిగా దృష్టి పెట్టాను. ‘తిరుపతి’లో పుణ్యక్షేత్రం తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా 2015 జనవరి నుంచి రెండున్నరేళ్ల పాటు పనిచేశాను. ఆ సమయంలో తిరుపతిలో కొత్త పార్కులను అభివృద్ధి చేయించాను. విమానాశ్రయం వద్ద సుందరీకరణకు ప్రాధాన్యం ఇచ్చాను. 2016లో ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నాను. 2017లో తిరుపతిలో సైన్స్ కాంగ్రెస్ విజయవంతంగా జరగడానికి తగిన ఏర్పాట్లు చేశాను. వ్యక్తిగతం.. పేరు: వాడ్రేవు వినయ్‌చంద్ తల్లిదండ్రులు: లక్ష్మీ నాగగిరిజ, వాడ్రేవు పవన్ కిశోర్ భార్య: సౌమ్య కీర్తి, పిల్లలు: అమృత, అనీష్ భరద్వాజ్ ఇష్టమైన క్రీడ: టెన్నిస్ వినోదం: కొత్త సినిమా వస్తే చూడాల్సిందే ఇష్టమైన పనులు: పుస్తక పఠనం. ఆర్థిక, చరిత్ర, ఫిలాసపీ పుస్తకాలు ఎక్కువగా చదువుతా. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం రాసిన పుస్తకాలు ఎంతో ఆసక్తిగా ఉంటాయి. సమయం దొరికితే: కుటుంబానికే కేటాయిస్తా అదృష్టం: ఏపీ క్యాడర్‌కి కేటాయించడం ర్యాంకులు: ఎంసెట్:414 సివిల్స్: 18 ఇష్టమైన హీరో: చిరంజీవి నచ్చిన హీరోయిన్: అనుష్క ఆస్వాదించే విందు: అరిటాకులో వడ్డించే ఆంధ్రా భోజనం ఉద్యోగ పర్వం: అసిస్టెంట్ కలెక్టర్ వరంగల్: మేడారం జాతర నిర్వహణ క్షేత్ర స్థాయి పరిపాలన, సమన్వయాన్ని నేర్పింది. కందుకూరు రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్: రెవెన్యూ పరమైన అంశాలపై పట్టు సాధించేలా చేసింది. చిత్తూరు జాయింట్ కలెక్టర్: తిరుపతిలో జరిగిన ప్రపంచ నాలుగో తెలుగు మహాసభలు విజయవంతమయ్యేలా కృషి చేశా. మాతృభాష రుణం తీర్చుకున్నా. పాడేరు ఐటీడీఏ పీవో: గిరిజనుల సేవలో తరించే భాగ్యం లభించింది. కలెక్టర్ పోస్టింగ్: ప్రకాశం, విశాఖపట్నం మరిచిపోలేనిది: ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీక్ ఘటన విపత్తు నిర్వహణ నేర్పింది. సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడం మరచిపోలేని అనుభవం. ప్రాణనష్టం తగ్గించడం, సత్వరమే బాధితులకు నష్టపరిహారం ఇప్పించడం ఎంతో సంతృప్తినిచ్చే అంశాలు. -
‘కరోనాపై మూడంచెల వ్యవస్థతో జాగ్రత్తలు’
సాక్షి, విశాఖపట్నం: కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా విషమ పరిస్థితుల్లో ఉన్న రోగుల కోసం జిల్లాలో 7 వేలకు పైగా అత్యవసర బెడ్స్‌ను సిద్దం చేస్తున్నామని విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. మెడికల్ అసోషియేషన్ ప్రతినిధులతో కలెక్టర్ శనివారం సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోజురోజుకి కరోనా తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో రెండు, మూడు నెలల కార్యచరణను మరో 2,3 రోజుల్లో సిద్దం చేస్తున్నామని చెప్పారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో మూడంచెల వ్యవస్ధ ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకొనున్నామన్నారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న పేషేంట్ల కోసం ప్రత్యేకంగా వైద్య నిపుణులతో కూడిన టెలీ మెడిసిన్ సెంటర్‌ని అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. ప్రత్యేక వైద్య చికిత్స అందించాల్సి ఉన్న కరోనా పేషేంట్లను మాత్రమే కోవిడ్ ఆసుపత్రులకి తరలిస్తామని తెలిపారు. అత్యవసర పరిస్ధితుల కోసం సుమారు 15 లక్షల వ్యయంతో పది డిజిటల్ ఎక్స్‌రే మిషన్లు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే కోవిడ్ ఆసుపత్రులు, సెంటర్లలో నాణ్యమైన భోజన సదుపాయాలు అందించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. కొత్త మార్గదర్శకాల ఆధారంగా భోజనం మరింత నాణ్యత ఉండేలా ఒక్కొక్క కాంట్రాక్టర్‌కి ఒక సెంటర్ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉన్నామన్నారు. విశాఖలో డి టైప్ ఆక్సిజన్ సిలిండర్లకు కొరత లేదని ఈ సందర్భంగా కలెక్టర్ స్ఫష్టం చేశారు. -
విశాఖ ప్రమాదంపై నివేదిక అందజేత
సాక్షి, విశాఖపట్నం : విశాఖ పరవాడ ఫార్మా సిటీ సాల్వెంట్ కంపెనీలో చోటుచేసుకున్న ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ నియమించిన విచారణ కమిటీ నివేదిక అందజేసింది. ఐదుగురు సభ్యులతో కూడా కూడిన ఈ కమిటీ.. ప్రమాదంపై పూర్తి స్థాయిలో నివేదికను రూపొందించింది. ప్రమాదం జరిగిన తీరు ఆ తర్వాత నెలకొన్న పరిణామాలపై రెండు పేజీల నివేదికను కలెక్టర్‌కు అందజేసింది. సాల్వెంట్ రికవరీ రియాక్టర్ వద్ద డై మిథైల్ సల్ఫాక్సైడ్ శుద్దిచేసే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టుగా కమిటీ నివేదికలో పేర్కొంది. సాంకేతిక లోపాన్ని గుర్తించి సరిచేయడంలో విఫలం కావడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు కమిటీ సభ్యులు ప్రాథమికంగా అంచనా వేశారు.(విశాఖ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం) ‘రాత్రి 9 గంటలకు షిఫ్ట్ మారే సమయంలో డై మిథైల్ సల్ఫాక్సైడ్ శుద్ధి కోసం వేర్వేరు రసాయనాలు పంపించే క్రమంలో కొంత అధికపీడనం నెలకొనడంతో అదుపుచేయడానికి కెమిస్ట్ మల్లేష్ ముందుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అదే సమయంలో కింది అంతస్తులో వచ్చిన స్పార్క్ తో ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఆపరేటర్ శ్రీనివాస్ మృతి చెందారు’ అని కమిటీ తన నివేదికలో పేర్కొంది. మరోవైపు సాల్వెంట్ కంపెనీలో జరిగిన ప్రమాదంపై పరవాడ పోలీస్ స్టేషన్లో 304/ఏ, 328 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.(విశాఖ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తే సహించం) శ్రీనివాసరావు కుటుంబానికి పరిహారం విశాఖ పరవాడ ఫార్మా సిటీ సాల్వెంట్ ఫాక్టరీ జరిగిన ప్రమాదంలో మృతిచెందిన శ్రీనివాస్‌రావు కుటుంబానికి యజమాన్యం తరఫున రూ. 35 లక్షలు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 15 లక్షల పరిహారం అందజేయనున్నారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన రూ. 20 లక్షల పరిహారం ప్రకటించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న మల్లేష్‌కు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. -
విశాఖ ప్రమాదం: నలుగురు సభ్యులతో కమిటీ
సాక్షి, విశాఖపట్నం: పరవాడ ఫార్మాసిటీలో రోజుల వ్యవధిలోనే మరో ప్రమాదం జరగడాన్ని జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిగణిస్తోంది. కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై కలెక్టర్ వినయ్ చంద్ నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ప్రమాదంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కమిటీ సభ్యులని ఆదేశించారు. డై మిథైల్ సల్ఫాక్సైడ్ వల్ల భారీ మంటలు ఏర్పడ్డాయని, ప్రమాదంపై పూర్తి విచారణ జరుపుతున్నామని కలెక్టర్ వినయ్ చంద్ అన్నారు. వరుస ప్రమాదాల నేపధ్యంలో మరోసారి జిల్లా స్ధాయిలో సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. పరవాడ ఘటనపై విశాఖ ఆర్డీఓ, విచారణ కమిటీ సభ్యుడు కిషోర్ మాట్లాడుతూ.. పరవాడ సాల్వేషన్ కంపెనీలో జరిగిన ప్రమాదంపై విచారణ చేస్తున్నాం. వాల్వ్ దగ్గర శాంపిల్ కలెక్షన్ చేస్తున్న సమయంలో ఏర్పడిన విద్యుత్ స్పార్క్ వల్ల ప్రమాదం జరిగిందని ప్రాధమిక అంచనా. ఈ ఫార్మా కంపెనీలో కనీస విద్యార్హత, అనుభవం లేకుండా కేవలం పదవ తరగతి చదివిన వారిని కెమిస్ట్ గా పనిచేయడాన్ని గుర్తించాం. ప్రమాదం తర్వాత ఉండాల్సిన రక్షణ పరికరాలు కూడా లేకుండా ఉన్నాయి. తమ ఉద్యోగులకి కంపెనీలు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. డై మిధైల్ సల్ఫ్ఆక్సైడ్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలను వాడే చోట కనీస అవగాహన లేని వారిని నియమించుకున్నారు. ప్రమాదంపై ఎలా స్పందించాలో ప్రజలని రక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవగాహన కల్పించాల్సి ఉంది. ప్రమాద ఘటనలో ఒకరు మరణించారు. మంటలను పూర్తిగా అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రమాద స్థలంలో రక్షణ పరికరాలు అందుబాటులో లేకపోవడం, రక్షణ పరికరాలు ఉపయోగించడంలో కూడా అవగాహన లేకపోవడాన్ని గుర్తించాం. ఈ తరహా ప్రమాదాలు ఇకపై జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని విచారణ కమిటీ సభ్యుడు కిషోర్ తెలిపారు. కాగా.. ఫార్మా సిటీలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక కార్మికుడు చనిపోయినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాంకీ సాల్వెంట్ ఫాక్టరీలో రాత్రి 10.30 ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించగా.. కార్మికుడు శ్రీనివాసరావు అగ్నికి ఆహుతయ్యాడు. గాయాలపాలైన మరో కార్మికుడు మల్లేష్‌ను గాజువాకలోని ఆస్పుపత్రి తరలించారు. ప్రమాద సమయంలో అక్కడ మొత్తం ఆరుగురు కార్మికులు ఉన్నారు. మిగతా కార్మికులు సురక్షితంగా ఉన్నట్టు జిల్లా అధికారులు తెలిపారు. ఉదయానికల్లా మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని వెల్లడించారు. చదవండి: విశాఖ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం విశాఖ ప్రమాదంపై హోంమంత్రి దిగ్భ్రాంతి -
విశాఖ ప్రమాదం: నలుగురు సభ్యులతో కమిటీ
-
ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరిన్ తరలింపు
సాక్షి, విశాఖ : ఎల్జీ పాలిమర్స్‌లో లీకైన స్టైరిన్‌ను తరలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించినట్లు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. స్టైరిన్‌ను తరలించే ప్రక్రియ ప్రారంభమైందని, ఎల్జీ పాలిమర్స్‌లో పరిస్థితి అదుపులో ఉందన్నారు. లీకైన ట్యాంక్‌తో పాటు అయిదు ట్యాంకుల్లో 12 నుంచి 13వేల టన్నుల స్టైరిన్ ఉందని, వాటిని నౌకల ద్వారా కొరియాకు తరలించనున్నట్లు చెప్పారు. మూడు నుంచి అయిదు రోజుల్లో తరలింపు ప్రక్రియ పూర్తి అవుతుందని కలెక్టర్ వెల్లడించారు. (బాధితులను ఇళ్లకు చేర్చండి: సీఎం జగన్) అలాగే బాధితులకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారని, ఇప్పటికే మృతుల కుటుంబాలకు కోటి పరిహారం అందించినట్లు చెప్పారు. బాధిత గ్రామాలలో ఇంటిలో ప్రతి కుటుంబ సభ్యునికి పదివేల రూపాయలు ఆర్దిక సహాయం అందచేస్తామన్నారు. ఒక్కొక్కరికి రూ.10వేలు పరిహారం రేపటి (మంగళవారం) నుంచి అందిస్తామన్నారు. ఇవాళ సాయంత్రానికి డీశానిటైజేషన్ పూర్తయ్యాక... కోలుకున్న వారితో పాటు పునరావాస కేంద్రాల్లో ఉన్నవారిని గ్రామాలకు తరలిస్తామని, బాధితులకు పూర్తి భరోసా కల్పిస్తామన్నారు. గ్రామంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఇక స్టైరిన్ గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, వైద్య బృందాలు, జీవీయంసీ పారిశుద్ద్య బృందాలు నిర్విరామంగా పని చేస్తున్నాయన్నారు. (బాధితులను ఇళ్లకు చేర్చండి: సీఎం జగన్) -
అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే గ్రామాల్లోకి
సాక్షి, విశాఖ : ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద స్టైరిన్ గ్యాస్ లీకేజీ పూర్తిగా అదుపులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. ప్రస్తుతం పరిశ్రమ వద్ద స్టెరైన్ లీకేజీ జీరో శాతానికి చేరుకుందని ఆయన వెల్లడించారు. ఢిల్లీ, ముంబై నుంచి వచ్చిన నిపుణులు ఎల్జీ పాలిమర్స్ వద్ద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రమాద ఘటనపై రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు.భద్రతాపరంగా ఇక ఇబ్బంది ఉండదని నిపుణులు స్పష్టం చేశారని కలెక్టర్ పేర్కొన్నారు. నిరంతరాయంగా ట్యాంక్ వద్ద స్టైరిన్ శాతాన్ని, ఉష్ణోగ్రతలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. (అణువణువూ శోధన) ఇక ప్రమాదం జరిగిన సమీపంలోని అయిదు గ్రామాలలో నిపుణుల సూచలన మేరకు శానిటైజ్ చేయబోతున్నట్లు కలెక్టర్ చెప్పారు. ప్రజల భద్రత, ఆరోగ్యమే తమకు ప్రధానమన్న కలెక్టర్... గ్రామాలలోకి ప్రజలని అనుమతించే విషయంలో నిపుణుల సూచనలని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని మట్టి, నీరు తదితర శాంపిల్స్‌ను నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్ నిపుణులు సేకరించినట్లు కలెక్టర్ తెలిపారు. (బాబు నిర్వాకం.. విశాఖకు శాపం) గ్రామాలలోకి ప్రజలు ఇంకా వెళ్లవద్దని, శానిటైజేషన్ ప్రక్రియకి ఒకటి, రెండు రోజులు పడుతుందని చెప్పారు. భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ప్రజలని గ్రామాలలోకి వెళ్లనిస్తామని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకి ప్రభుత్వం తరపున కోటి రూపాయిల నష్టపరిహారాన్ని ఇచ్చే ప్రక్రియ ప్రారంభించామన్నారు. ఒకట్రొండు రోజులలో బాధిత కుటుంబాలకి చెక్‌లు అందిస్తామని తెలిపారు. (నిశ్శబ్దం నిర్మానుష్యం) -
బాధితుల భద్రతే ముఖ్యం
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులకు, గ్రామాల్లో వారి ఆస్తులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్‌ను ఆదేశించారు. గ్యాస్ ప్రభావం తగ్గిన తర్వాత సురక్షిత పరిస్థితి ఏర్పడి.. బాధితులు తమ గ్రామాలకు తిరిగి వెళ్లేవరకూ షెల్టర్లలో వసతి కల్పించాలని సూచించారు. గురువారం ఆయన కేజీహెచ్‌లో బాధితులను పరామర్శించిన అనంతరం ఆంధ్రా వైద్య కళాశాలలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. దుర్ఘటన జరిగిన తీరుపై సీఎం ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులు వెల్లడించిన విషయాలు, సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. రిఫ్రిజిరేషన్ సరిగా జరగకే.. ► ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో తెల్లవారుజామున గ్యాస్ లీక్ అయ్యింది. ఘటన జరిగిన ప్రదేశంలో 2,500 కిలోలీటర్ల ట్యాంకు, మరొకటి 3,500 కిలోలీటర్ల సామర్థ్యం ఉన్నవి ఉన్నాయి. ► 2,500 కేఎల్ ట్యాంకు నుంచే తొలుత గ్యాస్ లీక్ మొదలైంది. దీనిలో 1,800 కేఎల్ స్టైరీన్ ద్రవ రూపంలో ఉంది. 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకూ ఇది సురక్షితం. సాంకేతిక కారణాల వల్ల రిఫ్రిజిరేషన్ సరిగా జరగలేదు. దీంతో అది గ్యాస్ రూపంలోకి మారి లీక్ అయ్యింది. ► గ్యాస్ లీకైన వెంటనే కంపెనీ పరిసరాల్లోని వెంకటాపురం, పద్మనాభపురం, ఎస్సీ, బీసీ కాలనీల్లోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ప్రధానంగా వెంకటాపురం గ్రామంపై తీవ్ర ప్రభావం పడింది. 5.30 గంటలకల్లా అధికార యంత్రాంగం ఘటన స్థలికి చేరుకుంది. ► గురువారం ఉదయం 9.30 గంటల సమయానికి 122.5 పీపీఎం స్థాయిలో గ్యాస్ గాలిలో ఉంది. ఇది పూర్తిగా తగ్గాలి. దీనికి 24 గంటల సమయం పట్టవచ్చు. దీనివల్ల శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో పాటు చర్మ వ్యాధుల ప్రమాదం ఉంటుంది. ► గ్యాస్ ప్రభావం పరిధి 1.5 కి.మీ నుంచి 2 కి.మీ ఉంటుంది. మధ్యాహ్నం సమయానికి పరిస్థితి అదుపులోకి వచ్చింది. గ్యాస్ లీకేజీ ప్రదేశంలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి నీటిని వెదజల్లుతున్నాం. ఈ ప్రమాదం కారణంగా పది మంది చనిపోయారు. 22 పశువులు మృత్యువాత పడ్డాయి.(పెద్దాయనా.. ఎలా ఉన్నావు?) మరోసారి నిపుణులతో అధ్యయనం ► బాధిత ప్రజలకు పునరావాసం కల్పించే బాధ్యత జిల్లా కలెక్టర్ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వాతావరణంలో గ్యాస్ విష ప్రభావాన్ని మరోసారి నిపుణులతో అధ్యయనం చేయించాలని, పూర్తిగా సురక్షితమని తేలిన తర్వాతే బాధితులను ఇళ్లకు పంపాలన్నారు.షెల్టర్లను ఏర్పాటు చేసి, మంచి భోజనం అందించాలన్నారు. గ్రామాల్లో ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని సూచించారు. ► ప్రమాద సంఘటన సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన స్పందించిన జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, పోలీసు అధికారులను సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు. సైరన్ ఎందుకు మోగలేదు? ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై ముఖ్యమంత్రి ఆగ్రహం విష వాయువు లీకేజీ దుర్ఘటనకు సంబంధించి సైరన్ ఎందుకు మోగలేదని ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన కేజీహెచ్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన అనంతరం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం, మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెల్లవారుజామున స్టైరీన్ గ్యాస్ లీక్ అయినప్పుడు సమీప గ్రామాల ప్రజలను ఎందుకు అప్రమత్తం చేయలేదని ఆరా తీశారు. ఆ సమయంలో అలారం ఎందుకు మొగలేదని ప్రశ్నించారు. దీనిపై ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఆ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజల సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని సీఎస్ నీలం సాహ్నిని సీఎం ఆదేశించారు. ప్రమాద ప్రభావిత ఐదు గ్రామాల ప్రజల సంరక్షణ బాధ్యతను ఐదుగురు మంత్రులు ఆళ్లనాని, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాసులకు అప్పగించారు. (విశాఖ విషాదం) -
విశాఖలో మొట్టమొదటి కరోనా కేసు
సాక్షి, విశాఖపట్నం : విశాఖ నగరంలో మొట్టమొదటి కరోనా వైరస్ కేసు నమోదైందని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 20 కేసులు నమోదు కాగా 13 మంది పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారని, మిగిలిన వారు కూడా కోలుకుంటున్నారని వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పకడ్బందీ చర్యల కారణంగానే కరోనా కేసులు నియంత్రించగలిగామన్నారు. మార్చి 18న వచ్చిన తొలి కేసుతో తామంతా పూర్తిస్ధాయి చర్యలతో కరోనా నియంత్రణపై ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లామన్నారు. కరోనా నియంత్రణకి ఐఏఎస్ అధికారులు, సీనియర్ అధికారులతో 22 కమిటీలు నియమించామని చెప్పారు. 3 వేల మందికి పైగా విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి హోం క్వారంటైన్లో ఉంచామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారి కోసం సీనియర్ వైద్యులు, పల్మనాలజిస్ట్‌లతో పాటు 230 మంది ఆంధ్రా మెడికల్ పీజీ డాక్టర్లతో బృందాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరికీ ప్రతి రోజూ ఫోన్ చేసి ఆరోగ్య పరిస్ధితులపై ఆరా తీశామన్నారు. ( ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి ) అనుమానం వచ్చిన వారి శాంపిల్స్ సేకరించామని, కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కి అనుసంధానంగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. రెండు షిఫ్టులలో 20 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు క్షేత్రస్దాయిలో పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రతీ టీమ్‌లో సీనియర్ వైద్యులు, వాలంటీర్లు, జీవీఎంసీ ప్లానింగ్ సిబ్బంది ఉంటారని, కరోనా నియంత్రణలో జిల్లా యంత్రాంగానికి వాలంటీర్ల పనితీరు మరింతగా ఉపయోగపడిందన్నారు. కరోనా పాజిటివ్ కేసులని దాస్తున్నామని చేస్తున్న ఆరోపణలు అబద్దమన్నారు. కరోనా పాజిటివ్ కేసులని దాచాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఒక కేసు దాచినా ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని, తప్పుడు ప్రచారాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఐసీఎంఆర్ నిబంధనల మేరకే విశాఖలోని కేజీహెచ్‌లో వైరాలజీ ల్యాబ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ( హాస్పిటల్ నుంచి కరోనా పేషెంట్ పరార్ ) కాగా, విశాఖలో మూడో విడత ఇంటింటి సర్వే పూర్తయింది. 60 సంవత్సరాలు దాటి దగ్గు, జలుబు లక్షణాలు ఉన్న వృద్ధులకు ట్రూ నాట్ పరీక్షలు వైద్య సిబ్బంది నిర్వహిస్తున్నారు. విశాఖలో పాజిటివ్ లక్షణాలతో ఏడుగురు వ్యక్తులు ఇంకా చికిత్స పొందుతున్నారు. -
విశాఖలో కోలుకుంటున్న కోవిడ్ బాధితుడు
సాక్షి, విశాఖపట్నం/గన్నవరం/వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ)/నెల్లూరు అర్బన్: విశాఖలో కోవిడ్ బారినపడిన వృద్ధుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ శుక్రవారం స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన ఆ వృద్ధుడికి గురువారం కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆయన నివాసం ఉంటున్న అల్లిపురం ప్రాంతం మొత్తాన్ని వైద్యారోగ్య శాఖ తమ ఆధీనంలోకి తీసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచే అల్లిపురం వివేకానంద కాలనీలో బ్లీచింగ్, ఫాగింగ్ పనులు చేపట్టారు. వార్డు వలంటీరు, ఏఎన్ఎం, ఆశావర్కర్ ఒక టీమ్‌గా మొత్తం 141 బృందాల్ని ఏర్పాటు చేశారు. బాధితుడి సన్నిహితులు 11 మందిని క్వారంటైన్‌కు తరలించారు. ఫ్రాన్స్ నుంచి వచ్చిన విద్యార్థిని హైదరాబాద్‌కు తరలింపు ఫ్రాన్స్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఓ విద్యార్థినిని కోవిడ్ వైద్య పరీక్షల అనంతరం శుక్రవారం అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్‌కు చెందిన సంజనారాజ్ ఉన్నత చదువుల నిమిత్తం ఫ్రాన్స్‌కు వెళ్లింది. కృష్ణా జిల్లాలోని సన్నిహితుల ఇంటికి వెళ్లేందుకు ఎయిరిండియా విమానంలో 19వ తేదీ రాత్రి గన్నవరం చేరుకుంది. విమానాశ్రయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ యువతితోపాటు ఇతర దేశాల నుంచి వచ్చిన మరో ఐదుగురు విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. వీరికి వైరస్ లక్షణాలు నిర్ధారణ కానప్పటికీ ఇంటర్నేషనల్ టెర్మినల్‌లోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. స్వీయ గృహ నిర్బంధంలో ఉండేందుకు ఐదుగురిని అంబులెన్స్‌లో వారి స్వస్థలాలకు పంపారు. అలాగే విజయవాడ పాతబస్తీకి చెందిన హేమంత్ (23) ఉన్నత విద్య అభ్యసించేందుకు ఏడాది క్రితం పారిస్ వెళ్లాడు. కోవిడ్ ప్రభావంతో ఈ నెల 16న విజయవాడ వచ్చాడు. రెండు రోజులుగా అతడు జ్వరంతో బాధపడుతుండటంతో వైద్యులు అతడిని శుక్రవారం ఆస్పత్రికి తరలించారు. అబుదాబి నుంచి వచ్చిన ఆరుగురు నెల్లూరు ఆస్పత్రికి తరలింపు కాగా, అబుదాబి (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) నుంచి శుక్రవారం చెన్నై ఎయిర్‌పోర్టుకు, అక్కడ నుంచి నెల్లూరు చేరుకున్న ఆరుగురిని పరీక్షల నిమిత్తం అధికారులు సర్వజనాస్పత్రికి తరలించారు. వీరంతా ఉభయగోదావరి, విశాఖ జిల్లాలకు చెందినవారు. -
‘అతను చనిపోయాడన్న వార్తలు అవాస్తవం’
సాక్షి, విశాఖపట్నం : జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్‌కు సంబంధించి అప్రమత్తంగా ఉన్నామని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. విశాఖ నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్నింటిలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విశాఖలో కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తి క్షేమంగానే ఉన్నాడని చెప్పారు. ఐసోలేషన్ వార్డులో బాధితుడికి చికిత్స కొనసాగుతుందని వెల్లడించారు. అతను చనిపోయాడనే వార్తలు అవాస్తమని.. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. విశాఖ నగరంలో క్వారంటైన్ కోసం నాలుగు వేల బెడ్స్ని సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందులో 500 పైగా బెడ్స్ని ఐసోలేషన్ కోసం వినియోగించుకోనున్నట్టు చెప్పారు. విశాఖలో ఒక పాజిటివ్ కేసు నమోదైందని.. ఈ నేపద్యంలో 115 బృందాలతో మరొకసారి కొన్ని ప్రాంతాలలో ఇంటింటి సర్వే చేపడుతున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి నెలాఖరువరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, మాల్స్ మూసివేశామన్నారు. కరోనాపై ఎవరూ భయాందోళనలు చెందవద్దని.. కరోనాపై ప్రజలకి అవగాహన కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. విద్యార్థులు ఇంటి వద్దే ఉండాలి : ఏయూ రిజిస్టార్ కరోనా దృష్ట్యా ఆంధ్ర్ర యూనివర్సిటీ, దాని అనుబంధ కళాశాలలు, హాస్టళ్లు మూతపడ్డాయి. హాస్టళ్లను ఖాళీ చేయించిన అధికారులు 9 వేల మందికి పైగా విద్యార్థులను, పరిశోధకులను స్వస్థలాలకు తరలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు యూజీసీ ఆదేశాల ప్రకారం మార్చి 31వరకు విద్యార్థులతోపాటు, టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు సెలవు ప్రకటిస్తున్నట్టు రిజిస్టార్ కృష్ణమోహన్ తెలిపారు. మార్చిలో యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్టు స్పష్టం చేశారు. మార్చి 31 తర్వాత సమీక్ష అనంతరం తదుపరి కార్యచరణ ప్రకటిస్తామన్నారు. స్వస్థలాలకు వెళ్లిన విద్యార్థులు బయట తిరగకుండా ఇంటి వద్దే ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దు : మంత్రి అవంతి కరోనా వైరస్‌పై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రజలను కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా నగరంలోని వివిధ రంగాల ప్రతినిధులతో శుక్రవారం మంత్రి అవంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్‌కు అతిగా భయపడవద్దని, అలా అని నిర్లక్ష్యం కూడా వహించవద్దని తెలిపారు. కరోనా వైరస్ గాలి ద్వారా సోకదని.. ఒకరినొకరు ముట్టుకోవడం వలన వ్యాపిస్తుందని చెప్పారు. మార్చి 31వ తేదీ వరకు అత్యవసర పని ఉంటే తప్ప నగరవాసులు బయటకు రావద్దని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజలంతా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. పెళ్లిలు, ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకుంటే మంచిదని సూచించారు. ప్రజలు సభలు, సమావేశాలకు దూరంగా ఉండాలని కోరారు. విద్యాసంస్థలు తప్పకుండా సెలవులు ప్రకటించాలన్నారు. చదవండి : ప్రముఖ బాలీవుడ్ సింగర్‌కు కరోనా పాజిటివ్ తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా -
కరోనాపై అతి భయం, నిర్లక్ష్యం వద్దు: మంత్రి
సాక్షి, విశాఖపట్నం: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అతిగా భయపడోద్దని, అదే విధంగా అజాగ్రత్తగా కూడా ఉండొద్దని మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చారించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుండా చెందకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైల్వే,బస్సు స్టేషన్లలో స్కీనింగ్ నిర్వహించే విధంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పాడేరు, అరుకులో ఐసోలేషన్ వార్డులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. అంతేగాక ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. కరోనాపై పోలీస్ శాఖ అప్రమత్తం ఇక కరోనా వైరస్ నిర్ధారించే యంత్రం కేజిహెచ్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వివిధ రూపాల్లో ప్రజలకు అవగాహన కార్యాక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు కరోనా బారిన పడకుండా వ్యక్తిగతంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ.. నిన్న(బుధవారం) విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చిన 185 మంది ప్రయాణికులకు కూడా హూమ్ క్వారంటైన్లో ఉంచుతున్నామని చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారమే కరోనా లక్షణాలు లేని వారిని వాళ్ళ ప్రాంతాలకు పంపిస్తున్నామన్నారు. ఇక ప్రస్తుతం జిల్లాలో ఆరు అనుమానిత కేసులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. (శానిటైజర్ తయారీకి కావాల్సినవి..) అలాగే విశాఖ పోర్టు చైర్మన్ కె. రామ్మోహనరావు కరోనా పై విశాఖ పోర్టులో అప్రమత్తంగా ఉన్నామన్నారు. ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి 59 నౌకలు విశాఖ తీరానికి వచ్చాయని, ఆ నౌకలలో సిబ్బందికి ప్రత్యేకంగా వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నౌకలు విశాఖ తీరానికి చేరుకోవడానికి 15 నాటికల్ మైళ్ల దూరం ముందే మాకు సమాచారం వస్తుందని, అందులో పనిచేస్తున్న విదేశీ సిబ్బందులేవరినీ బయటకి రాకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. షిప్‌లోని సిబ్బంధికి తామే ఆహారం అందిస్తున్నామని,ఇప్పటివరకు దాదాపు 1270 మంది సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా ప్రభావం లేదని నిర్ధారించికున్నామన్నారు. (కరోనా నివారణకు ఢిల్లీ కమిషనర్ ఆదేశాలు) చైనా, సింగపూర్ తదితర ప్రభావిత దేశాల నుంచి వచ్చిన 8 నౌకలను కూడా పూర్తిగా పరీక్షించామని, కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలుమేరకు కరోనాపై నిరంతరం అప్రమత్తత కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఇక వైద్య పరీక్షల నిమిత్తం పది మంది సిబ్బంది చొప్పున మూడు వైద్య బృందాలను ప్రత్యేకంగా స్క్రీనింగ్ నిర్వహించడానికి ఏర్పాటు చేశామన్నారు. వైద్య పరీక్షల తర్వాతే పోర్టులో లోడింగ్, అన్ లోడింగ్ చేస్తున్నామని, గతంలో షిప్లో అన్ లోడింగ్‌కు రెండు , మూడు రోజుల సమయం పట్టేదని.. ఇపుడు వైద్య పరంగా తీసుకుంటున్న జాగ్రత్తలతో వారం రోజుల వరకు సమయం పడుతోందని ఆయన అన్నారు. (తల్లి.. బిడ్డలు.. మధ్య కరోనా!) -
పారదర్శకంగా భూ సమీకరణ..
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో భూ సమీకరణ పారదర్శకంగా జరుగుతోందని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు. అర్హులైన అందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం మేరకు జిల్లాలో ఆరు వేల ఎకరాల భూ సమీకరణ చేస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో సెంట్ల భూమిని ఇళ్లు నిర్మాణం కోసం అర్హులైన పేదలకు కేటాయిస్తున్నట్లు వివరించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం భూ సేకరణ చేస్తున్నామని అదంతా పూర్తిగా ప్రభుత్వ భూమిలో మాత్రమే జరుగుతోందన్నారు. దీనికోసం నిర్దిష్టమైన లే అవుట్లు కూడా రూపొందించడమే కాకుండా మార్చి 10 నాటికి పూర్తిస్థాయిలో ప్రక్రియ పూర్తి చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రైతులకు నష్టం కలిగించం.. ప్రభుత్వ భూములను సాగుచేస్తున్న వ్యక్తులు కూడా నిర్దిష్టమైన ఆధారాలను బట్టి అభివృద్ధి చేసిన లే అవుట్లలో 900, 450 గజాల చొప్పున కేటాయించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ సిటీ లో ఇళ్ల కోసం రూ. 25 వేలు చొప్పున నగదు డిపాజిట్ చేసిన లబ్ధిదారులకు కేటాయింపు జరుగుతుందని వివరించారు. ఎక్కడ ప్రైవేట్ భూములు తీసుకోవడం కానీ, రైతులకు నష్టం కలిగించే రీతిలో భూ సేకరణ గాని సమీకరణ గాని ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. భూ సమీకరణ కోసం రూ.1300 కోట్లు.. గిరిజన ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు వచ్చాయని ఆయా ప్రాంతాల్లో వారికి భూములు కేటాయింపు జరుగుతుందని చెప్పారు. ప్రధానంగా ఏజెన్సీలో పాడేరు ప్రాంతంలో ఎక్కువగా ప్రభుత్వ భూమి ఉండడంతో ఆ ప్రాంతంలో ఎక్కువ మందికి ఇళ్ల స్థలాలు కేటాయింపు జరుగుతుందన్నారు. పినగాడి లో పేదల కోసం రూపొందిస్తున్న లే అవుట్ లో మా భూమి పూర్తిగా ప్రభుత్వ ఖాళీ స్థలం గా చెప్పారు. రైతులకు ఇబ్బంది కలిగించే రీతిలో ఎక్కడ భూమి తీసుకోవడం లేదన్నారు. రైతులకు భూ సమీకరణ కింద ఇచ్చే ప్రతి రూపాయి నేరుగా వారి ఖాతాలోనే వేస్తున్నామ ని చెప్పారు.. భూసమీకరణ కోసం రూ. 1300 కోట్లు ప్రభుత్వం నిర్దేశించిందని కలెక్టర్ వెల్లడించారు. -
వివిధ శాఖల అధికారులతో మంత్రి అవంతి సమీక్ష
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో నాణ్యతతో కూడిన అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని పర్యాటక శాఖ మంత్రి అవంతీ శ్రీనివాస్ అధికారులను అదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, వివిధ శాఖల జిల్లా అధికారులతో పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ వంటి పనులపై జీవీఎంసీ సమావేశ మందిరంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో రోడ్లు భవనాలు, తాగునీటి ప్రాజెక్టులు మొదలైనవి నిర్మించే క్రమంలో నాణ్యతను తప్పకుండా పాటించాలని అధికారులకు మంత్రి సూచించారు. ఆర్థిక సంవత్సరం పుర్తవుతున్నందున మంజురైనా అభివృద్ధి పనులన్నింటినీ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతంలోని 10 నియోజకవర్గాలకు సంబంధించి జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయా అధికారులతో, ఎమ్మెల్యేలతో నియోజకవర్గాల వారిగా సమీక్షించారు. రోడ్లు, తాగునీటి పనులు, భవనాలు ఎన్ని మంజూరు అయ్యాయో, వాటిలో పూర్తి అయినవి, వివిధ దశల్లో ఉన్న నిర్మాణ పనుల వివరాలు, సమస్యలపై చర్చించారు. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాలను వెంటనే పూర్తి చేయాలనన్నారు. ప్రభుత్వ విప్ బూడి ముత్యాలు నాయుడు మాట్లాడుతూ.. నిర్మాణాలు చేసేటప్పుడు ఎక్కడైనా పొరపాటు జరిగితే వెంటనే సరి చేసుకోవాలన్నారు. నాణ్యతా లోపాలను గుర్తించినట్లయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హచ్చరించారు. ఇక జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ అధికారులు సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వివిధ శాఖల అధికారులతో సమన్వయంతో సంప్రదించి పనులు చేపట్లాలని సూచించారు. నియోజకవర్గ ఇంచార్జీలు, అధికారులు ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి అభివృద్ధి పనులను సమీక్షిస్తూ ఉండాలనిన్నారు. కాగా ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు యువీ సూర్యనారాయణ రాజు, కరణం ధర్మశ్రీ, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మీ జిల్లా పంచాయతీ అధికారి ఆర్ గోవిందరావుతో పాటు తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో పట్టాలపైకి మెట్రో రైలు ప్రాజెక్టు
విశాఖ జిల్లాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక దృష్టి ఉంది. జిల్లా, నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని, పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని ఆయన ఆదేశించారు. ఆ మేరకు జిల్లా అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆ క్రమంలోనే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రణాళిక సిద్ధమవుతోంది. రూ.8 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నారు. విశాఖ నగరంలో మంచినీటి ఎద్దడి శాశ్వత నివారణకు పక్కా ప్రణాళిక రూపొందించాం. విశాఖ మన్యంలో నర్సింగ్, మెడికల్ కళాశాలల ఏర్పాటుకు స్థల సేకరణ జరుగుతోంది. ఇలా కొత్త కొత్త ప్రాజెక్టులతో త్వరలోనే జిల్లా రూపురేఖలు మారిపోనున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకం జిల్లా వ్యాప్తంగా అర్హులైన అందరికీ అందాలి.. అన్ని వర్గాలకూ న్యాయం జరగాలి.. వెరసి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో విశాఖ అగ్రస్థానంలో నిలవాలి. అదే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజా ఫిర్యాదుల వేదిక అయిన స్పందనలో అందుతున్న ఫిర్యాదుల పరిష్కారంలో రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉన్నామన్నారు. 11 బృహత్తర పథకాలకు అర్హులను గుర్తించే నవశకం సర్వే కార్యక్రమాన్ని పక్కాగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టించేందుకు జిల్లాలో జరిగిన యత్నాలను విజయవంతంగా అడ్డుకున్నామని.. నిల్వలు పెంచి వినియోగదారులకు కావలసినంత ఇసుక సరఫరా చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. శనివారం సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ప్రభుత్వ కార్యక్రమాల అమలుతీరును వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. మహరాణిపేట (విశాఖ దక్షిణ): ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాల అమలులో విశాఖ జిల్లా అగ్రస్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్ అన్నారు. స్పందన అర్జీదారుల సమస్యలు పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపెట్టామన్నారు. ఇసుక సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను అర్హులకు చేర్చడానికి ఉద్దేశించిన నవశకం కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే చురుగ్గా జరుగుతోందని తెలిపారు. విశాఖ సమగ్ర అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇంకా పలు అంశాలపై శనివారం ఆయన సాక్షికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు.. మెట్రో రైలుకు ప్రతిపాదనలు సిద్ధం.. శరవేగంగా విస్తరిస్తున్న విశాఖ మహానగరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మెట్రోరైలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. విశాఖలో మెట్రో రైలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తొలి బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించింది. ఈ నేపథ్యంలో గతంలో విశాఖ మెట్రో ప్రాజెక్టుపై రూపొందించిన ప్రణాళిక తెరపైకి వచ్చింది. సుమారు 40 మెట్రో స్టేషన్లు నిర్మించి 99 రైళ్లు తిరిగేలా ప్రాజెక్టు రూపకల్పన చేయగా..ఈ ప్రాజెక్టులో స్వల్ప మార్పులు చేసి మెట్రో రైలుని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు మొదలవుతున్నాయి. ఏజెన్సీలో మెడికల్ నర్సింగ్ కళాశాలలు.. పాడేరులో మెడికల్ కళాశాల ఏర్పాటుకు స్థల సేకరణ ప్రక్రియ వేగవంతం చేశాం. పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోనే 25 ఎకరాల అనువైన స్థలాన్ని గుర్తించాం. ఇటీవలే వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి పర్యటించి స్థలాన్ని పరిశీలించారు. అరకులో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు స్థల సేకరణ యత్నాలు జరుగుతున్నాయి. నగరంలో శాశ్వత మంచినీటి పథకం.. విశాఖ జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రాజెక్టుకి రూపకల్పన చేసింది. భవిష్యత్తులో తలెత్తే నీటిఎద్దడి నుంచి నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా బృహత్తర ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేశ్వరం జలాశయం నుంచి విశాఖకు గోదావరి జలాలు తీసుకొచ్చేందుకు రూ.2,750 కోట్ల అంచనా వ్యయంతో భారీ పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు కానుంది. ఏలేశ్వరం జలాశయం నుంచి 156 కిలోమీటర్ల పొడవునా పైప్‌లైన్ ఏర్పాటు చేస్తారు. భౌగోళిక పరిస్థితులను బట్టి 2.2 నుంచి 2.5 మీటర్ల వ్యాసార్థం ఉన్న పైపులు అమర్చుతారు. అవసరమైన ప్రాంతాల్లో పంప్ సెట్స్, సంపులు నిర్మిస్తారు. ప్రతి మండల కేంద్రంలో ఒక ట్యాపింగ్ పాయింట్ ఏర్పాటు చేయనున్నారు. గ్రామాలకు, పారిశ్రామిక అవసరాలకు ఎలాంటి ఆటంకం లేకుండా రోజూ నీటిని అందించేలా ప్రాజెక్టు డిజైన్ చేశారు. రోజుకు 10 నుంచి 15 టీఎంసీల నీటిని ఈ పైప్‌లైన్ ద్వారా సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఈ భారీ వాటర్ గ్రిడ్ ద్వారా విశాఖ జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలకూ ఈ నీటిని అందించనున్నారు. ఏలేశ్వరం నుంచి కాకినాడ సెజ్‌కు, తుని మున్సిపాలిటీకి, తూర్పుగోదావరి జిల్లాలోని శివారు గ్రామాలకు ఈ వాటర్ గ్రిడ్ ద్వారా నీటిని అందిస్తారు. విశాఖ జిల్లాలో పైప్‌లైన్ వచ్చాక నక్కపల్లి సెజ్‌కు, నక్కపల్లి, పాయకరావుపేట నగర పంచాయతీ, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీలకు, విశాఖ రూరల్ మండలాల్లోని అన్ని గ్రామాలకు, మహా విశాఖ నగర పరిధిలోని ప్రాంతాలకు నీటిని అందించనున్నారు. సంక్షేమ పథకాల అమలుకు పెద్దపీట.. విశాఖలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పెద్ద పీట వేస్తున్నాం. ప్రభుత్వం చేపట్టే అన్ని పథకాలను అర్హులకు అందేలా చర్యలు చేపట్టాం. ముఖ్యంగా రైతు భరోసా, అగ్రిగోల్డ్ బాధితులకు సహాయం చేయడం వంటి పనులు విజయవంతంగా చేపట్టాం. ఇప్పడు వైఎస్సార్ మత్స్యకార భరోసా అర్హులైన అందరికీ అందేలా పలు చర్యలు చేపట్టాం. అగ్రిగోల్డ్ బాధితులకు పదివేల రూపాయలలోపు అందడానికి కృషి చేశాం. బాధితులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇసుక కృత్రిమ కొరతపై ఉక్కుపాదం.. జిల్లాలో ఇసుక కృత్రిమ కొరత సృష్టించడానికి అనేక మంది ప్రయత్నాలు చేశారు. వాటిని ఎదుర్కొని అవసరం ఉన్న వారికి ఇసుక అందేలా చర్యలు చేపట్టాం. ఎవరైనా ఇసుక కృత్రిమ కొరత సృష్టించినా, అక్రమాలకు పాల్పడినా, అక్రమ నిల్వలు చేపట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇసుక సమస్య విశాఖలో లేకుండా చర్యలు తీసుకున్నాం. స్పందనలో వచ్చే ప్రతి ఆర్జీదారు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకుంటున్నాం. అర్జీదారుల సమస్యను సీఎం జగన్మోహన్రెడ్డి ఎంతో ఓపికతో వింటున్నారు. సీఎం స్ఫూర్తితో విశాఖలో పనిచేస్తున్నాం. ఇదే తరహాలో పనిచేయడం వల్ల విశాఖ జిల్లా అగ్రస్థానంలో ఉంది. చురుగ్గా ఇంటింటి సర్వే కార్యక్రమం.. వైఎస్సార్ నవశకం అమలు కోసం ఇంటింటి సర్వే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. గ్రామం లేదా వార్డు ఒక యూనిట్‌గా తీసుకొని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నాం. సంక్షేమ పథకాలకు అర్హుల గుర్తింపు, ఇప్పటివరకూ పథకంలో లేని వారి పేర్ల నమోదు ఈ ఇంటింటి సర్వే ప్రధాన ఉద్దేశ్యం. పింఛన్‌కు, ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యానికి, ఉపకార వేతనాలు, కార్పొరేషన్ల రుణాలు పొందడానికి రేషన్‌కార్డు ఒక్కటే ఆధారమవుతోంది.అలాకాకుండా నవశకం పథకంలో ఉండే ప్రతి పథకానికో కార్డు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందులో భాగంగా బియ్యం కార్డు, వైఎస్సార్ పింఛన్ కానుక కార్డు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు, జగనన్న విద్యాదీవెన/జగనన్న వసతి దీవెన కార్డు..ఇలా నాలుగు రకాల కార్డులను ప్రత్యేకంగా అందజేయనున్నాం. ఉగాదికి పట్టాల పంపిణీ.. ఉగాది నాటికి జిల్లాలో మూడు లక్షల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించాం. అందులో భాగంగా ప్రభుత్వ స్థలాల కోసం అన్వేషణ చేస్తున్నాం. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకపోతే ప్రైవేటు స్థలాలను కొనుగోలు చేస్తాం. ఇప్పటికే స్థలాలు సేకరించాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశాం. అర్హులైన పేదలందరికీ పట్టాలు, ఇళ్లు ఇవ్వాలనే ప్రభుత్వ ధ్యేయం మేరకు పనిచేస్తున్నాం. జనవరి నుంచి పూర్తి స్థాయిలో సచివాలయ వ్యవస్థ.. గతంలో ప్రజలు ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వచ్చేవారు. కానీ ఇప్పడు గ్రామ సచివాలయం ప్రజల వద్దకు వస్తోంది. ఈ వ్యవస్థ ఎంతో గొప్పది. జనవరి నుంచి గ్రామ సచివాలయాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. అక్కడే అనేక సమస్యలకు పరిష్కారానికి వేదిక అవుతుంది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి అర్హతల సడలింపు. దాదాపు ప్రతి కుటుంబానికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం పలు అర్హతలను సడలించింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న సీఎం ఆశయం మేరకు అధికారులు పనిచేస్తున్నారు. పటిష్టంగా పర్యవేక్షణ.. వైఎస్సార్ నవశకం కార్యక్రమం నెల రోజుల పాటు ఒక యజ్ఞంలా సాగుతుంది. ఇంటింటి సర్వేతో మొదలై డిసెంబరు 20న లబ్ధిదారులకు కార్డులు అందజేసే వరకూ పటిష్ట కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. కార్యక్రమం ఆద్యంతం పర్యవేక్షణకు ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి నియోజకవర్గానికి ఒక్కో ప్రత్యేక అధికారిని నియమించాం. జిల్లా స్థాయిలో జిల్లాపరిషత్తు సీఈవో, జాయింట్ కలెక్టరు, జాయింట్ కలెక్టరు–2 పర్యవేక్షిస్తారు. శాఖల వారీగా జిల్లా పంచాయతీ అధికారి, జీవీఎంసీ కమిషనర్, జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా పౌరసరఫరాల అధికారి, జిల్లా వైద్యాధికారి, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు, బీసీ సంక్షేమ శాఖ ఉపసంచాలకులు పరిశీలకులుగా వ్యవహరిస్తారు. గ్రామ, వార్డు వలంటీర్లు తాము సర్వే చేసి తీసుకొచ్చిన డేటాను ప్రతి రోజు సాయంత్రం గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్పగిస్తారు. -
నెల రోజుల పాటు ‘వైఎస్సార్ నవశకం’ కార్యాచరణ
సాక్షి, విశాఖపట్నం: ఇది నవ శకారంభం. గ్రామం లేదా వార్డు ఒక యూనిట్‌గా తీసుకొని అక్కడ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంతృప్తికర (సాట్యురేషన్) విధానంలో సంక్షమ పథకాలు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ నవశకం కార్యక్రమం శ్రీకారం చుట్టుకుంటోంది. రాజకీయ, వర్గ, కుల, మతాలకు అతీతంగా ఈ ప్రక్రియ సాగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకు కార్యాచరణ సిద్ధమైంది. జిల్లాలో బుధవారం నుంచే ఇంటింటి సర్వే ప్రారంభం కానుంది. పభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో ఇదొక భాగం మాత్రమేనని జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్ చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వద్దనున్న డేటాబేస్‌లో తప్పుల సవరణ, మార్పులు చేర్పులు, సంక్షేమ పథకాలకు అర్హుల గుర్తింపు, ఇప్పటివరకూ పథకంలో లేనివారి పేర్ల నమోదు ఈ ఇంటింటి సర్వే ప్రధాన ఉద్దేశమని అన్నారు. వైఎస్సార్ నవశకం కార్యక్రమంపై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... పథకాల అర్హతల సడలింపు... పలు సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రభుత్వం పలు అర్హతలను సడలించింది. ఉదాహరణకు గతంలో రేషన్ కార్డు పొందాలంటే కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.60 వేలు, పట్టణాల్లో రూ.75 వేలు గరిష్టంగా ఉండేది. దాన్ని ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు గరిష్టంగా ఉండాలని మార్పులు చేశారు. ఈ ప్రకారం అర్హుల సంఖ్య పెరుగుతుంది. అందుకే ఇదొక ఇంక్లూజివ్ ప్రోగ్రామ్. ఇప్పటికే రేషన్కార్డులున్న వారితో పాటు కొత్తగా అర్హులను గుర్తించినవారికీ బియ్యం కార్డు, పింఛన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, జగనన్న విద్యాదీవెన/జగనన్న వసతి దీవెన కార్డు అందజేస్తాం. నెల రోజుల కార్యాచరణ వైఎస్సార్ నవశకం కార్యక్రమం నెల రోజుల పాటు ఒక యజ్ఞంలా సాగుతుంది. బుధవారం నుంచి ఇంటింటి సర్వేతో మొదలై డిసెంబరు 20వ తేదీన లబ్ధిదారులకు కార్డుల అందజేసే వరకూ పటిష్ట కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. కార్యక్రమం ఆద్యంతం పర్యవేక్షణకు ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి నియోజకవర్గానికి ఒక్కో ప్రత్యేక అధికారిని నియమించాం. జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తు సీఈవో, జాయింట్ కలెక్టరు, జాయింట్ కలెక్టరు–2 పర్యవేక్షిస్తారు. ఇక శాఖల వారీగా జిల్లా పంచాయతీ అధికారి, జీవీఎంసీ కమిషనర్, జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా పౌరసరఫరాల అధికారి, జిల్లా వైద్యాధికారి, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు, బీసీ సంక్షేమ శాఖ ఉపసంచాలకులు పరిశీలకులుగా వ్యవహరిస్తారు. తుది జాబితాల ప్రదర్శన... సర్వేలో పథకాలకు ఎవ్వరైతే అనర్హులని తేల్చారో వారి జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో డిసెంబరు 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకూ ప్రదర్శిస్తాం. ఒకవేళ ఎవ్వరైనా తమకు అర్హత ఉన్నా ఈ జాబితాలో పేరు ఉంటే గ్రామసభ/వార్డు సభలో అభ్యర్థన ఇవ్వవచ్చు. అలా వచ్చిన అభ్యర్థనలపై ప్రభుత్వం నిర్దేశించిన సంక్షేమ పథకాల అర్హతల ఆధారంగా మరోసారి పునఃపరిశీలన చేస్తాం. ఈ మేరకు సరిదిద్ది 8, 9వ తేదీల్లో అర్హుల జాబితాను ప్రదర్శిస్తాం. 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ మరోసారి అభ్యంతరాలేమైనా ఉంటే వినిపించేందుకు అవకాశం ఇస్తాం. చివరకు అర్హులను ఖరారు చేయడానికి 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ గ్రామసభ, వార్డు సభలను నిర్వహిస్తాం. నాలుగు పథకాలకు సంబంధించిన కార్డుల ముద్రణ 18వ తేదీన ప్రారంభించి రెండ్రోజుల్లో ముగిస్తాం. 20వ తేదీన అర్హులకు కార్డులు అందజేస్తాం. ప్రధాన అనర్హతలు ఇవే... సంక్షేమ పథకాల్లో ఎక్కువవాటికి కామన్‌గా ఆరు ప్రధాన అనర్హతలు ఉన్నాయి. సొంతదైనా లేదా అద్దెదైనా సరే ఇంటి విద్యుత్తు వినియోగం 300 యూనిట్లకు మించకూడదు. పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగులకు మించిన విస్తీర్ణంలో సొంత ఇల్లు ఉండకూడదు. వ్యవసాయ భూమి విషయానికొస్తే మూడెకరాలకు మించి మాగాణి, పదెకరాలకు పైగా మెట్టభూమి ఉండకూడదు. ఈ రెండు పరిమితులకు లోబడి మాగాణి, మెట్ట భూమి కలిపి పదెకరాల వరకూ గరిష్టంగా ఉండవచ్చు. టాక్సీలు, ట్రాక్టర్లు మినహా మరే నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. కుటుంబంలో ఎవ్వరూ కూడా ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ ఉండకూడదు. ఈ విషయంలో పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఆదాయపన్ను చెల్లింపుదారులై ఉండకూడదు. ఈ వివరాలతో కూడిన ప్రిపాపులేటెడ్ డేటా కాపీతో వలంటీర్లు సర్వే చేస్తారు. పై అనర్హతల్లో ఏమాత్రం తేడాలున్నా ఆయా విషయాన్ని బట్టి రెవెన్యూ, విద్యుత్తు, రవాణా, మున్సిపల్ శాఖలకు పునఃపరిశీలన కోసం పంపిస్తాం. నాలుగు రకాల కార్డులు ‘‘ఇప్పటివరకూ రేషన్ సరుకులు తీసుకోవకానికే కాదు పింఛన్‌కు, ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యానికి, ఉపకార వేతనాలు, కార్పొరేషన్ల రుణాలు పొందడానికి రేషన్‌కార్డు ఒక్కటే ఆధారమవుతోంది. అలాకాకుండా పథకానికొక కార్డు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. బియ్యం కార్డు, వైఎస్సార్ పింఛన్ కానుక కార్డు, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు, జగనన్న విద్యాదీవెన/జగనన్న వసతి దీవెన కార్డు... ఇలా నాలుగు రకాల కార్డులను ఆయా పథకాల లబ్ధిదారులకు ప్రత్యేకంగా అందజేయడమే వైఎస్సార్ నవశకం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. రైస్ కార్డు ఇస్తున్నామంటే పాత రేషన్ కార్డు తీసేస్తామని కాదు. రేషన్ కార్డు ఎప్పటిలాగే కొనసాగుతుంది. పాతవారితో పాటు కొత్తగా రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి రైస్‌కార్డు అందజేస్తాం. ఏడు రకాల పథకాలు వైఎస్సార్ మత్స్యకార భరోసా, వైఎస్సార్ నేతన్న నేస్తం, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం, అమ్మ ఒడి, వైఎస్సార్ కాపు నేస్తంతో పాటు చేతివృత్తిపై ఆధారపడిన దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక సహాయం, ఇమామ్‌లు, మౌజమ్‌లు, పాస్టర్లు, అర్చకులకు గౌరవ వేతనం తదితర ఏడు రకాల పథకాలను అందించడానికి వైఎస్సార్ నవశకం కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. 40 వేలమంది సిబ్బంది సిద్ధం నెల రోజుల పాటు జరిగే వైఎస్సార్ నవశకం కార్యక్రమంలో దాదాపు 40 వేల మంది ఉద్యోగులు, సిబ్బంది పాలుపంచుకుంటున్నారు. వారిలో 23 వేల మంది గ్రామ, వార్డు వలంటీర్లు క్షేత్రస్థాయిలో జరిగే ఇంటింటి సర్వే చేయడానికి సిద్ధమయ్యారు. వారికి 12 వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సహకారం అందిస్తారు.’’ విద్యా దీవెనలో మార్పులు జగనన్న విద్యాదీవెన పథకం కింద అర్హులైన విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ (ఆర్టీఎఫ్) వర్తిస్తుంది. ఇక జగనన్న వసతిదీవెన పథకం విషయానికొస్తే ప్రతి విద్యార్థికీ భోజనం, వసతి ఖర్చుల కోసం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం ఏటా రూ.20 వేలు ఇస్తోంది. ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలతో పాటు విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ బోర్డు గుర్తింపు ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. ఈ పథకాలకు అర్హత పొందాలంటే కుటుంబ వార్షికాదాయం రూ.2.5 లక్షలకు మించకూడదు. పదెకరాల మాగాణి లేదా 25 ఎకరాల్లో మెట్ట భూమి ఉండవచ్చు. మాగాణి, మెట్ట భూమి కలిపి 25 ఎకరాలకు మించకూడదు. పారిశుద్ధ్య కార్మికులు మినహా మరే ఒక్క కుటుంబసభ్యుడు ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ అయిఉండకూడదు. టాక్సీ, ఆటో, ట్రాక్టరు వంటివి తప్ప మరే సొంత నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. కుటుంబంలో ఆదాయపన్ను చెల్లింపుదారులు ఉండకూడదు. పట్టణాల్లో 1500 చదరపు అడుగులకు మించి భవనం ఉండకూడదు. అంతా సహకరించాలి గ్రామ వలంటీర్లు, వార్డు వాలంటీర్లు ఇంటింటి సర్వే చేయడానికి వచ్చినప్పుడు ప్రజలంతా సహకరించాలి. ఈ సర్వే ఎవరికో నష్టం చేయడానికో, ఉన్న రేషన్ కార్డు తీసేయడానికో కాదనే విషయాన్ని గుర్తించాలి. ఎవరి కార్డులనూ తీయబోం. ప్రతి గ్రామ వలంటీరుకు 50 కుటుంబాలు చొప్పున, వార్డు వలంటీరుకు వంద కుటుంబాల చొప్పున కేటాయించాం. గ్రామ వలంటీరు తన పరిధిలో రోజుకు ఐదు, వార్డు వలంటీరు పది కుటుంబాల చొప్పున మాత్రమే సర్వే చేస్తారు. వివిధ సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను గుర్తించడానికి నిర్దిష్టమైన వివరాలతో కూడిన ప్రిపాపులేటెడ్ డేటా షీట్‌ను సర్వే ఫామ్‌తో కలిపి ఇస్తాం. ఈ సర్వే నిర్వహణలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు సహకరిస్తారు. వలంటీర్లు పూర్తి చేసిన సర్వే ఫామ్స్‌లోని వివరాలను ఎప్పటికప్పుడు డేటా ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఈ డేటాను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు అందిస్తారు. ఈనెల 30వ తేదీ వరకూ జరిగే సర్వే వివరాలను డిసెంబరు 1వ తేదీలోగా కంప్యూటరీకరణ ప్రక్రియను సకాలంలో పూర్తయ్యేలా సచివాలయాల్లో ఏర్పాట్లు చేశాం. ఏరోజుకు ఆరోజే డేటా ఎంట్రీ గ్రామ, వార్డు వలంటీర్లు తాము సర్వే చేసి తీసుకొచ్చిన డేటాను ప్రతి రోజు సాయంత్రం గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్పగిస్తారు. ఈ డేటా ఎంట్రీ విషయంలో అక్కడి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. అలాగే రైస్‌కార్డులకు సంబంధించి వీఆర్వో, పింఛన్లుకు సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్, ఆరోగ్యశ్రీకి హెల్త్ అసిస్టెంట్... ఇలా వారివారి శాఖలకు సంబంధించి నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. లబ్ధిదారులకు ఎలాంటి నష్టం లేకుండా... వైఎస్సార్ నవశకం పూర్తిగా ఇంక్లూజివ్ ప్రోగ్రామ్. అంటే ఇప్పటికే సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందుతున్న ఏ ఒక్కరినీ తొలగించబోరు. ఆయా లబ్ధిదారులకు ఎలాంటి నష్టం కలిగించకుండా అన్ని అర్హతలూ ఉండి సంక్షేమ పథకాలకు దూరంగా ఉన్నవారికి కొత్తగా లబ్ధి చేకూర్చాలనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి అర్హతల సడలింపు దాదాపు ప్రతి కుటుంబానికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం పలు అర్హతలను సడలించింది. వార్షికాదాయం రూ.5 లక్షలలోపున్న వారంతా అర్హులే. భూయజమానులైతే 12 ఎకరాల్లోపు మాగాణి లేదా 35 ఎకరాల్లోపు మెట్ట భూమి ఉండవచ్చు. మెట్ట, మాగాణి కలిపి 35 ఎకరాలకు మించకూడదు. పట్టణాల్లో 3వేల చదరపు అడుగుల విస్తీర్ణం మించి భవనం ఉండకూడదు. వ్యక్తిగతంగా ఒక్క కారు మాత్రమే ఉండాలి.