ఎపిడమిక్‌ను ఎదుర్కొంటాం | Follow Epidemic | Sakshi
Sakshi News home page

ఎపిడమిక్‌ను ఎదుర్కొంటాం

Jun 6 2014 11:43 PM | Updated on Aug 18 2018 2:15 PM

ఎపిడమిక్‌ను ఎదుర్కొంటాం - Sakshi

ఎపిడమిక్‌ను ఎదుర్కొంటాం

ఏజెన్సీలో ఎపిడమిక్ తీవ్రతను ఎదుర్కొని నియంత్రిస్తామని పాడేరు ఐటీడీఏ పీవో వి.వినయ్‌చంద్ తెలిపారు. ఇక్కడి ప్రాంతీయ ఆస్పత్రిలో చేరిన డయేరియా బాధితులను శుక్రవారం పరామర్శించారు.

  • డయేరియా బాధితులకు మెరుగైన సేవలు
  •  అన్ని పీహెచ్‌సీలకు అంబులెన్స్‌లు, డాక్టర్లు
  •  వైద్య సేవల పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు
  •  ఐటీడీఏ పీవో వినయ్‌చంద్
  •  పాడేరురూరల్, న్యూస్‌లైన్ : ఏజెన్సీలో ఎపిడమిక్ తీవ్రతను ఎదుర్కొని నియంత్రిస్తామని పాడేరు ఐటీడీఏ పీవో వి.వినయ్‌చంద్ తెలిపారు. ఇక్కడి ప్రాంతీయ ఆస్పత్రిలో చేరిన డయేరియా బాధితులను శుక్రవారం పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆస్పత్రి వైద్యులకు సూచించారు. అన్ని వార్డుల్లోకి వెళ్లి సేవల తీరును అడిగి తెలుసుకున్నారు.

    అనంతరం విలేకరులతో మాట్లాడుతూ డయేరియా ప్రబలిన రవ్వలమామిడి, గిడ్డివలస, గొల్లమామిడి గ్రామాలతో పాటు మన్యంలోని అన్ని గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్య సమస్య తలేత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 36 పీహెచ్‌సీల్లో వైద్యుల కొరత లేకుండా చూస్తామన్నారు. అంబులెన్స్‌లను ఏర్పాటు చేసామన్నారు. సుదూర ప్రాంతాల నుంచి రోగులను తరలించేందుకు 1200 పల్లకీలను సిద్ధం చేసినట్టు చెప్పారు.

    ఈ సేవలన్నీ సోమవారం నుంచి అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. ఎపిడమిక్ ముగిసేంతవరకు పాడేరు, అరుకు ప్రాంతీయ ఆస్పత్రుల్లో డిప్యుటేషన్‌పై మైదాన ప్రాంతాల నుంచి వైద్యులను నియమిస్తామన్నారు. పీహెచ్‌సీ అభివద్ధి నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని సూచించారు. అవి చాలకుంటే ఐటీడీఏ నుంచి అదనంగా కేటాయిస్తామన్నారు.

    గ్రామాల్లో వైద్య సేవల పర్యవేక్షణకు డీడీ స్థాయి అధికారులను మండలానికొకరిని నియమిస్తామన్నారు. ఇప్పటికే 1200  గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీ చేపట్టామని, మిగిలిన గ్రామాల్లోనూ నెలాఖరుకు పూర్తి చేయనున్నట్టు తెలిపారు. గ్రామ స్థాయిలో విస్తృత వైద్య సేవలకు ఆశ కార్యకర్తలకు తరచూ శిక్షణ ఇస్తున్నామన్నారు. ఆయన వెంట ఏడీఎంహెచ్‌వో డాక్టర్ లీలాప్రసాద్, ఎస్పీహెచ్‌వో డాక్టర్ విశ్వేశ్వరరావు, ప్రాంతీయ ఆస్పత్రి వైద్యులు శ్రీనివాసరావు, కష్ణారావు ఉన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement