మక్తల్ రూరల్, న్యూస్‌లైన్: మండలంలోని చిట్యాల గ్రామస్తులు అతిసారవ్యాధి బారినపడి అల్లాడుతున్నారు. ఆది వారం వాకిటి లింగప్ప(40) అనే వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గు రై మృతిచెందాడు. గ్రామంలో కూలీనాలి పనులు చేసుకునే ఆయన రెండురోజుల క్రితం వాంతులు, విరేచనాలు చేసుకున్నాడు. ఆస్పత్రికి చూపించినా ఫలితం లేకపోయింది. చివరికి ఆరోగ్య పరిస్థితి విషమించడతో కనుమూశాడు. ఇదిలాఉండగా మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్రామానికి చెందిన రేణమ్మ, మంజుల, రాములమ్మ, కి ష్టప్ప, ఆదెమ్మ, లింగమ్మ, కిష్టప్పలతో పాటు మరికొందరు అనారోగ్యానికి గురికావడంతో మక్తల్ ప్రభుత్వ, పలు ప్రై వేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో తా త్కాలిక వైద్యశిబిరం ఏర్పాటుచేసినా అక్కడికి వెళ్లేందుకు బాధితులు ఆసక్తి చూపడం లేదు.
గ్రామంలో సరఫరా అయ్యే తాగునీరు కలుషితం కావడం, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారడంతోనే అతిసార ప్రబలిందని వైద్యులు గుర్తించారు. గ్రామంలో తాగునీటి సరఫరా బంద్ కావడంతో వ్యవసాయబోరుబావుల నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. అతిసార ప్రబలినప్పటి నుంచి ఇప్పటివరకు అధికారులు వారిపైపు కన్నెత్తిచూడకపోవడం గమనార్హం. ఇదిలాఉండగా నెలరోజుల క్రితం మండలంలోని యర్సన్‌పల్లి గ్రామంలో అతిసార బారినపడి 40మందికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్యసిబ్బంది ఒక్కో సెలైన్ బాటిల్ ఎక్కించి, నాలుగు మాత్రలు ఇచ్చి పంపించేశారు.
మంచం పట్టిన చిట్యాల
Published Tue, Aug 13 2013 4:57 AM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM
Advertisement