
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: శు.ద్వాదశి ఉ.9.34 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: ఆశ్లేష రా.2.58 వరకు, తదుపరి మఖ, వర్జ్యం: ప.3.32 నుండి 5.08 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.38 నుండి 9.26 వరకు, తదుపరి రా.11.00 నుండి 11.48 వరకు, అమృతఘడియలు: రా.1.28 నుండి 2.07 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 6.16, సూర్యాస్తమయం: 6.04.
మేషం: కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
వృషభం: కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మిథునం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో అవాంతరాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
కర్కాటకం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సమావేశాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
సింహం: కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. స్థిరాస్తిపై సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
కన్య: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుబాటు కాగలవు.
తుల: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
వృశ్చికం: కష్టానికి ఫలితం కనిపించదు. కొన్ని ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
ధనుస్సు: మిత్రులతో కలహాలు. ఆదాయం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మకరం: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. ప్రముఖుల నుంచి కీలక సందేశం. స్థిరాస్తివృద్ధి. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
కుంభం: ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. పనులలో జాప్యం. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపూరితంగా ఉంటాయి.
మీనం: ఆర్థిక ఇబ్బందులు. సోదరులతో కలహాలు. దూరప్రయాణాలు. ఆస్తి కొనుగోలులో ఆటంకాలు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment