services
-
రుతురాజ్ గైక్వాడ్ ఊచకోత.. విధ్వంసకర శతకం! సెలక్టర్లకు మెసేజ్
విజయ్ హజారే ట్రోఫీ టోర్నీ మ్యాచ్‌లో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ భారీ శతకం(Ruturaj Gaikwad Century) బాదాడు. సర్వీసెస్ జట్టు బౌలింగ్‌పై విరుచుకుపడుతూ పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి మహారాష్ట్రను విజయతీరాలకు చేర్చాడు.దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ టోర్నీ(Vijay Hazare Trophy 2024-25)లో భాగంగా మహారాష్ట్ర.. సోమవారం సర్వీసెస్‌తో తలపడింది. ముంబైలోని శరద్ పవార్ క్రికెట్ అకాడమీ బీకేసీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మహారాష్ట్ర తొలుత బౌలింగ్ చేసింది.రాణించిన సర్వీసెస్ కెప్టెన్ఈ క్రమంలో బ్యాటింగ్‌కు సర్వీసెస్ 204 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ మోహిత్ అహ్లావత్(61) అర్ధ శతకం బాదగా.. ఓపెనర్ సూరజ్ వశిష్ట్(22), మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పలివాల్(22), అర్జున్ శర్మ(24), పూనం పూనియా(26) ఫర్వాలేదనిపించారు.మహారాష్ట్ర బౌలర్లలో ప్రదీప్ దాధే, సత్యజీత్ బచ్చవ్ మూడేసి వికెట్లు కూల్చగా.. ముకేశ్ చౌదరి రెండు, అజిమ్ కాజీ, రజ్నీశ్ గుర్బానీ ఒక్కో వికెట్ తీశారు. వీరి దెబ్బకు 48 ఓవర్లలోనే సర్వీసెస్ బ్యాటింగ్ కథ ముగిసింది.57 బంతుల్లోనే రుతు శతకంఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాష్ట్ర 20.2 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి పని పూర్తి చేసింది. ఓపెనర్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ విశ్వరూపం ప్రదర్శించాడు. 57 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న రుతు.. మొత్తంగా 74 బంతుల్లో 16 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 148 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ ఓం భోస్లే(24) ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్ బ్యాటర్ సిద్ధేశ్ వీర్ 22 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఇక మహారాష్ట్రను ఒంటి చేత్తో గెలిపించిన రుతురాజ్ గైక్వాడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.మెగా టోర్నీకి రెడీఇక ఈ టోర్నీలో మహారాష్ట్రకు ఇది రెండో విజయం. తమ తొలి మ్యాచ్‌లో మహారాష్ట్ర రాజస్తాన్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించింది. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు రుతురాజ్ బ్యాట్ ఝులిపించడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ఫామ్ కొనసాగిస్తే మెగా టోర్నీ ఆడే టీమిండియాలో చోటు దక్కించుకోవడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా తన భారీ సెంచరీతో సెలక్టర్లకు గట్టి సందేశం పంపించాడని పేర్కొంటున్నారు.చదవండి: నేను బతికి ఉన్నానంటే.. అందుకు కారణం అతడే: వినోద్ కాంబ్లీ -
దేశంలోని ఏఏ నగరాల్లో మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయి?
దేశంలో శరవేగంగా పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగణంగా తగిన మౌలిక సదుపాయాలు ఏర్పడుతున్నాయి. వీటిలో ఒకటే మెట్రో రైళ్లు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు, కాలుష్యం నుండి నగరాలను కాపాడేందుకు మెట్రో రైళ్లు వరంలా మారాయి. ప్రస్తుతం దేశంలోని ఏఏ నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.కోల్‌కతా మెట్రో కోల్‌కతా మెట్రో 1984, అక్టోబర్ 24న తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఇది దేశంలోనే తొలి మెట్రో ప్రాజెక్టు. కోల్‌కతా మెట్రోను కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ (కేఎంఆర్సీ) నిర్వహిస్తోంది. కోల్‌కతా మెట్రోలో రోజుకు 5.5 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తుంటారు.ఢిల్లీ మెట్రో ఢిల్లీ మెట్రోను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ)పర్యవేక్షిస్తుంది. ఢిల్లీ మెట్రో 2002లో ప్రారంభమైంది. ప్రతిరోజూ 55 లక్షల మంది ప్రయాణికులు ఢిల్లీ మెట్రోలో ప్రయాణాలు సాగిస్తుంటారు.బెంగళూరు మెట్రో (నమ్మ మెట్రో) బెంగళూరు మెట్రో 2011, అక్టోబర్ 20న తన కార్యకలాపాలు ప్రారంభించింది. దీనిని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీఎల్)నిర్వహిస్తోంది. ఈ నెట్‌వర్క్‌లో రెండు లైన్లు, 64 స్టేషన్లు ఉన్నాయి. బెంగళూరు మెట్రోలో రోజుకు 5.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.హైదరాబాద్ మెట్రో హైదరాబాద్ మెట్రోలో మొత్తం 57 స్టేషన్లు ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో తన కార్యకలాపాలను 2017, నవంబర్ 29న ప్రారంభించింది. హైదరాబాద్ మెట్రోలో రోజుకు 4.5 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఈ మెట్రో నిర్వహణ బాధ్యత హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్)పై ఉంది.పూణే మెట్రో పూణే మెట్రో మూడు లైన్లు ఉన్నాయి. 23 స్టేషన్లతో కూడిన 54.58 కిలోమీటర్ల నెట్‌వర్క్‌ను పూణె మెట్రో కలిగి ఉంది. పూణే మెట్రో నిర్వహణ బాధ్యతను మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎంఆర్‌సీఎల్) పర్యవేక్షిస్తుంటుంది. పూణే మెట్రో తన కార్యకలాపాలను 2022, మార్చి 6న ప్రారంభించింది. ఈ మెట్రోలో ప్రతిరోజూ 60 వేల నుంచి 65 వేల మంది ప్రయాణిస్తుంటారు.చెన్నై మెట్రో చెన్నై మెట్రో మొత్తం పొడవు 55 కిలోమీటర్లు. దీని నిర్వహణ బాధ్యత చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ ఎల్)పై ఉంది. 2015లో ప్రారంభమైన ఈ మెట్రోలో ప్రస్తుతం 40 స్టేషన్లు ఉండగా, రోజుకు దాదాపు 2.1 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.ముంబై మెట్రో ముంబై మెట్రో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీఏ) పర్యవేక్షణలో ఉంది. 2014లో ప్రారంభమైన ఈ మెట్రోలో రోజుకు 1.5 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.అహ్మదాబాద్ మెట్రో అహ్మదాబాద్ మెట్రో నిర్వహణ బాధ్యత గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (జీఎంఆర్సీఎల్) చేతుల్లో ఉంది. 2019లో ప్రారంభమైన ఈ మెట్రోలో రెండు లైన్లు, 31 స్టేషన్లు ఉన్నాయి. అహ్మదాబాద్ మెట్రోలో ప్రతిరోజూ దాదాపు 30 వేల మంది ప్రయాణిస్తున్నారు.నాగ్‌పూర్ మెట్రో నాగ్‌పూర్ మెట్రో నెట్వర్క్ దాదాపు 38 కిలోమీటర్లు. నాగ్‌పూర్ మెట్రో నిర్వహణ బాధ్యత మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎంఆర్‌సీఎల్)పై ఉంది. నాగ్‌పూర్ మెట్రోలో ప్రతిరోజూ దాదాపు 1.2 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.కొచ్చి మెట్రో కొచ్చి మెట్రో 2017లో ప్రారంభమయ్యింది. దీని మొత్తం నెట్వర్క్ 27.4 కిలోమీటర్లు. కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ (కేఎంఆర్ఎల్)కొచ్చి మెట్రో నిర్వహణ బాధ్యత వహిస్తుంది. కొచ్చి మెట్రోలో రోజుకు 80 వేల మంది ప్రయాణిస్తున్నారు.లక్నో మెట్రో లక్నో మెట్రో నిర్వహణ బాధ్యత ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ (యూపీఎంఆర్సీ)పై ఉంది. ప్రస్తుతం లక్నో మెట్రోలో ఒక లైన్ ఉంది. లక్నో మెట్రోలో రోజుకు 40 వేల మంది ప్రయాణిస్తున్నారు. లక్నో మెట్రో 2017లో ప్రారంభమయ్యింది.జైపూర్ మెట్రో జైపూర్ మెట్రో 2015లో చాంద్‌పోల్- మానసరోవర్ మధ్య నడిచే సర్వీసుతో ప్రారంభమయ్యింది. 11 స్టేషన్లు ఉన్న ఈ మెట్రోను జైపూర్ మెట్రో రైల్ కార్పొరేషన్ (జేఎంఆర్సీ) పర్యవేక్షిస్తుంటుంది.కాన్పూర్ మెట్రోకాన్పూర్ మెట్రోను ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ (యూపీఎంఆర్సీ)నిర్వహిస్తోంది. ప్రస్తుతం కాన్పూర్ మెట్రో తొమ్మిది కిలోమీటర్ల పొడవుతో ఒక లైన్ కలిగివుంది. ఈ మెట్రో 2021, డిసెంబర్ 28 నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించింది.ఇది కూడా చదవండి: అగ్నికి ఆహుతై.. ఐదేళ్ల తర్వాత తెరుచుకున్న అందమైన చర్చి -
ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్.. సుడిగాలి ఇన్నింగ్స్!
భారత క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. సర్వీసెస్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పరుగుల సునామీ సృష్టించాడు. అయితే, శతకానికి కేవలం మూడు పరుగుల దూరంలో ఉన్నప్పుడు రుతురాజ్ అవుట్ కావడం దురదృష్టకరం.కాగా దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్ర జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రుతురాజ్ గైక్వాడ్.. ఇటీవల రంజీ ట్రోఫీ(ఫస్ట్‌క్లాస్ క్రికెట్)లో అదరగొట్టాడు. అయితే, దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రం రుతుకు శుభారంభం లభించలేదు. గత నాలుగు మ్యాచ్‌లలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ చేసిన పరుగులు వరుసగా.. 1, 19, 4, 2.48 బంతుల్లోనే 97 పరుగులుఈ నేపథ్యంలో రుతు టీ20 బ్యాటింగ్ తీరుపై విమర్శలు రాగా.. సర్వీసెస్‌తో మ్యాచ్ సందర్భంగా బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. ఆష్రిన్ కులకర్ణి(29)తో కలిసి మహారాష్ట్ర ఇన్నింగ్స్ ఆరంభించిన రుతు.. 48 బంతుల్లోనే 97 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి.ఇక 202కు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టిన రుతు.. సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఉన్నపుడు అవుటయ్యాడు. సర్వీసెస్ బౌలర్ మోహిత్ రాఠీ బౌలింగ్‌లో వికాస్ హథ్వాలాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రాహుల్ త్రిపాఠి విఫలంమిగతా వాళ్లలో రాహుల్ త్రిపాఠి(13) విఫలం కాగా.. సిద్ధార్థ్ మాత్రే మెరుపు ఇన్నింగ్స్(19 బంతుల్లో 32), ధన్‌రాజ్ షిండే(14 బంతుల్లో 32) ధనాధన్ బ్యాటింగ్‌తో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.చదవండి: టీ20 క్రికెట్లో పెను సంచలనం.. బరోడా జట్టు ప్రపంచ రికార్డు.. హార్దిక్ పాండ్యా లేకుండానే! -
SMAT 2024: రికీ భుయ్ ఊచకోత.. దుమ్మురేపుతున్న ఆంధ్ర జట్టు
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు విజయపరంపర కొనసాగుతోంది. టోర్నీలో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తున్న ఆంధ్ర జట్టు వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ గెలుపొందింది. గ్రూప్ ‘ఈ’లో భాగంగా ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో ఆంధ్ర జట్టు 23 పరుగుల తేడాతో సర్వీసెస్ జట్టును ఓడించింది.కెప్టెన్ రికీ భుయ్ విధ్వంసంటాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కెప్టెన్ రికీ భుయ్ (35 బంతుల్లో 84; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... ఓపెనర్ కోన శ్రీకర్ భరత్ (39 బంతుల్లో 63; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరిశాడు. మరోవైపు.. ప్రసాద్ (12 బంతుల్లో 28; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సర్వీసెస్ బౌలర్లలో పూనమ్ పూనియా, మోహిత్ రాఠి, వినీత్ ధన్కడ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన సర్వీసెస్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 199 పరుగులకు పరిమితమైంది.అగ్రస్థానంలోకెప్టెన్ మోహిత్ అహ్లావత్ (37 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), వినీత్ ధన్కడ్ (32 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలతో పోరాడారు. ఆంధ్ర బౌలర్లలో స్టీఫెన్, శశికాంత్ చెరో 3 వికెట్లు పడగొట్టగా... సత్యనారాయణ రాజు 2 వికెట్లు తీశాడు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఆంధ్ర జట్టు 16 పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తదుపరి పోరులో మంగళవారం కేరళతో ఆంధ్ర జట్టు ఆడుతుంది. స్కోరు వివరాలు ఆంధ్ర ఇన్నింగ్స్: కోన శ్రీకర్ భరత్ (సి) అరుణ్ (బి) పూనమ్ పూనియా 63; అశ్విన్ హెబర్ (సి) అరుణ్ (బి) విశాల్ 1; షేక్ రషీద్ (సి) అరుణ్ (బి) పుల్కిత్ నారంగ్ 21; రికీ భుయ్ (సి) వినీత్ (బి) విశాల్ 84; పైలా అవినాశ్ (సి) పూనమ్ పూనియా (బి) వినీత్ 5; ప్రసాద్ (సి) విశాల్ (బి) పూనమ్ పూనియా 28; శశికాంత్ (సి) పూనమ్ పూనియా (బి) వినీత్ 0; వినయ్ కుమార్ (నాటౌట్) 7; సత్యనారాయణ రాజు (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 222. వికెట్ల పతనం: 1–24, 2–63, 3–151, 4–175, 5–188, 6–209, 7–222, 8–222. బౌలింగ్: పూనమ్ పూనియా 4–0–37–2; గౌరవ్ శర్మ 3–0–43–0; విశాల్ గౌర్ 4–0–50–2; మోహిత్ రాఠి 4–0–35–0; పుల్కిత్ 1.5–0–17–1; వినీత్ ధన్కడ్ 2.1–0–24–2; నితిన్ తన్వర్ 1–0–16–0. సర్వీసెస్ ఇన్నింగ్స్: కున్వర్ పాఠక్ (సి) అవినాశ్ (బి) స్టీఫెన్ 2; రజత్ (సి) భరత్ (బి) శశికాంత్ 33; నితిన్ తన్వర్ (ఎల్బీ) రాజు 1; వినీత్ (సి) వినయ్ (బి) శశికాంత్ 51; మోహిత్ అహ్లావత్ (సి) రికీ భుయ్ (బి) రాజు 74; అరుణ్ (బి) శశికాంత్ 0; మోహిత్ రాఠి (సి) అవినాశ్ (బి) స్టీఫెన్ 5; గౌరవ్ శర్మ (రనౌట్/స్టీఫెన్) 3; పూనమ్ పూనియా (సి) ప్రసాద్ (బి) స్టీఫెన్ 17; విశాల్ గౌర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–4, 2–38, 3–50, 4–150, 5–150, 6–173, 7–175, 8–187, 9–199. బౌలింగ్: స్టీఫెన్ 4–0–26–3; శశికాంత్ 4–0–50–3; సత్యనారాయణ రాజు 4–0–39–2; వినయ్ కుమార్ 4–0–35–0; యశ్వంత్ 4–0–43–0. -
2030 నాటికి సేవల ఎగుమతులదే పైచేయి
న్యూఢిల్లీ: దేశ ఎగుమతుల్లో వస్తువులను సేవలు అధిగమించనున్నాయి. 2030 మార్చి నాటికి 618.21 బిలియన్ డాలర్లకు (51.92లక్షల కోట్లు) చేరుకుంటాయని స్వతంత్ర పరిశోధనా సంస్థ ‘గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్’ (జీటీఆర్ఐ) అంచనా వేసింది. అదే కాలంలో వస్తు ఎగుమతుల విలువ 613 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపింది. 2018–19 నుంచి 2023–24 వరకు దేశ వస్తు ఎగుమతులు ఏటా 5.8 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధి చెందాయని, ఇదే కాలంలో సేవల ఎగుమతులు 10.5 శాతం చొప్పున పెరుగుతూ వచ్చాయని జీటీఆర్ఐ నివేదిక తెలిపింది. ఇదే స్థాయిలో వృద్ధి కొనసాగితే 2030 మార్చి నాటికి సేవల ఎగుమతులు 618.21 బిలియన్ డాలర్లకు, వస్తు ఎగుమతులు 613 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా కట్టింది. ఐటీ, సాఫ్ట్వేర్, ఓబీఎస్ హవా.. భారత సేవల రంగం వృద్ధిలో అధిక భాగం సాఫ్ట్వేర్, ఐటీ సేవలు, ఇతర వ్యాపార సేవల (ఓబీఎస్) నుంచే ఉంటోందని.. 2023–24 ఎగుమతుల్లో వీటి వాటా 86.4 శాతంగా ఉన్నట్టు జీటీఆర్ఐ తెలిపింది. ఓబీఎస్ పరిధిలోని న్యాయ సేవలు, అకౌంటింగ్, పన్ను సంబంధిత సేవలు, మేనేజ్మెంట్ కన్సలి్టంగ్, మార్కెట్ పరిశోధన కలిపి 2023–24లో 10.28 బిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదైనట్టు జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. మొత్తం సేవలు ఎగుమతుల్లో ఓబీఎస్ వాటా 33.2 శాతంగా ఉన్నట్టు చెప్పారు. దేశంలో అత్యంత నైపుణ్య మానన వనరులు, అభివృద్ధి చెందుతున్న ఐటీ సదుపాయాలు అంతర్జాతీయ సేవల కేంద్రంగా భారత్ ప్రతిష్టను పెంచుతున్నట్టు జీటీఆర్ఐ తెలిపింది. జెనరేటివ్ ఏఐ, మెషిన్ లెరి్నంగ్(ఎంఎల్), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) భారత కంపెనీల అవకాశాలను అధికం చేస్తున్నట్టు పేర్కొంది. ‘‘సాఫ్ట్వేర్, ఐటీ సేవలు అతిపెద్ద విభాగంగా ఉండగా, వృద్ధిలో ఈ విభాగాన్ని ఓబీఎస్ దాటిపోనుంది. ప్రత్యేకమైన సేవలకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది’’అని శ్రీవాస్తవ తెలిపారు. యూఎస్ వెలుపల ఐటీ సేవల విస్తరణ.. యూఎస్‌కు బయట ఐటీ ఎగుమతులను వైవిధ్యం చేసుకోవడం మొదట చేయాల్సిన పనిగా జీటీఆర్ఐ పేర్కొంది. దేశ ఐటీ ఎగుమతుల్లో 70 శాతం యూఎస్‌కే వెళుతున్న నేపథ్యంలో, అక్కడి విధానాల్లో మార్పుల రిస్క్ ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడింది. ‘‘ప్రెసిడెంట్‌గా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ఔట్సోర్స్ను విమర్శించడం, హెచ్–1బి వీసా పాలసీల కట్టడి తదితర విధానాలు ఈ రిస్‌్కలను గుర్తు చేస్తున్నాయి. ఆటోమేషన్, కృత్రిమ మేథ (ఏఐ) 40 శాతం మేర ఐటీ ఉద్యోగులకు ముప్పుగా మారే ప్రమాదం కూడా ఉంది’’అని శ్రీవాస్తవ తెలిపారు. ఇతర మార్కెట్లకు విస్తరించడం, డిజిటల్ పరివర్తిన, ఏఐ ఇంటెగ్రేషన్ యూఎస్‌పై ఎక్కువగా ఆధారపడడాన్ని తగ్గిస్తాయని పేర్కొన్నారు. ఓబీఎస్ ఎగుమతులను ప్రోత్సహించాలని జీటీఆర్ఐ నివేదిక సూచించింది. ఈ విభాగంలో ఎగుమతులకు గణనీయమైన అవకాశాలున్నప్పటికీ, భారత సంస్థలు పూర్తి స్థాయిలో వినియోగంచుకోవడం లేదని పేర్కొంది. ఇంజనీరింగ్, పరిశోధన, మేనేజ్మెంట్ నిపుణులకు అంతర్జాతీయంగా ఉన్న అవకాశాలపై అవగాహన పెరిగితే వృద్ధి అవకాశాలను మరింత ఇతోధికం చేసుకోవచ్చని తెలిపింది. -
108 ఉద్యోగుల సమ్మె బాట
సాక్షి, అమరావతి: అత్యవసర విభాగమైన 108 అంబులెన్స్ సేవలను ప్రభుత్వమే నిర్వహించడం సహా 15 డిమాండ్ల సాధన కోసం సిబ్బంది సమ్మె బాట పట్టారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఒక రోజు రిలే దీక్షలు చేశారు. ప్రభుత్వం నిర్వహణ సంస్థలను పదేపదే మార్చడంతో తాము గ్రాట్యుటీ, ఎర్న్డ్ లీవులు, వార్షిక సెలవులను కోల్పోతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం ఈ నెల 25లోగా సానుకూలంగా స్పందించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే శాపాలు సీఎం చంద్రబాబు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు చిరుద్యోగుల పాలిట శాపాలుగా మారాయి. అస్మదీయులకు కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు 108, 104 నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందోను ప్రభుత్వం తప్పిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఉద్యోగ భద్రత లేక బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని, ఉన్నఫళంగా నిర్వహణ సంస్థను వెళ్లగొడితే ఆరి్థకంగా నష్టపోతామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఉద్యోగి ఒక సంస్థలో ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తే గ్రాట్యుటీ పొందేందుకు అర్హత ఉంటుంది. అరబిందో సంస్థ నిర్వహణ బాధ్యతలను 2020 జూలై 1నుంచి ప్రారంభించింది. 2027 వరకూ కాంట్రాక్ట్ కాలపరిమితి ఉంది. వచ్చే ఏడాది జూలై 1 నాటికి ఐదేళ్లు పూర్తి అవుతుంది. ఇంతలోనే ప్రభుత్వం ఆ సంస్థను వెళ్లగొట్టే చర్యలకు పూనుకుంటోందని, అలా జరిగితే 108లో పనిచేసే డ్రైవర్, ఈఎంటీ రూ.30 వేలు చొప్పున, 104లో పనిచేసే డ్రైవర్, డీఈవోలు రూ.15 వేల వరకూ గ్రాట్యుటీ నష్టపోతామని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వమే అందరికీ గ్రాట్యుటీ చెల్లించాలి కాంట్రాక్ట్ దక్కించుకుంటున్న కార్పొరేట్ కంపెనీలు సేవలను సక్రమంగా నిర్వహించడం లేదని మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే సేవలను నిర్వహించాలి. ఇదే ప్రధాన డిమాండ్‌గా సమ్మె నోటీసు ఇచ్చాం. ఈ నెల 25లోగా ప్రభుత్వం స్పందించని పక్షంలో ఏ క్షణమైనా సమ్మెకు దిగుతాం. ఐదేళ్లు తిరగకుండానే నిర్వహణ సంస్థను మారిస్తే మేం ఆర్థికంగా చాలా నష్టపోతాం. ఒక్క గ్రాట్యుటీ రూపంలోనే 108 ఉద్యోగులే రూ.30 వేల చొప్పున రూ.10 కోట్ల వరకూ నష్టపోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఐదేళ్లలోపే నిర్వహణ సంస్థ మారితే ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలి. – బి.కిరణ్‌కుమార్, ప్రెసిడెంట్, ఏపీ 108 సరీ్వసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ -
మారిన బీఎస్ఎన్ఎల్ లోగో: కొత్తగా ఏడు సర్వీసులు
ప్రభుత్వ రంగ నెట్వర్క్ 'భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్' (BSNL) కొత్త లోగోను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి 'జ్యోతిరాదిత్య సింధియా' ఆవిష్కరించారు. కొత్త లోగో విశ్వాసం, బలం, దేశవ్యాప్తంగా చేరువ కావడానికి ప్రాతినిధ్యం వహిస్తుందని బీఎస్ఎన్ఎల్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది.కొత్త లోగోమారిన కొత్త బీఎస్ఎన్ఎల్ లోగో గమనించినట్లయితే.. కాషాయ రంగు వృత్తాకారం మధ్యలో భారతదేశ చిత్రపటం ఉండటం గమనించవచ్చు. దానిపైన తెలుగు, ఆకుపచ్చ రంగులో కనెక్టివిటీ సింబల్స్ ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ అనేది నీలి రంగులో ఉంది. దానికి కింద కెనెక్టింగ్ భారత్ అనేది కూడా కాషాయ రంగులోనే ఉంది.ఏడు కొత్త సర్వీసులుస్పామ్-రహిత నెట్వర్క్: ఈ కొత్త సర్వీస్ వినియోగదారులను అవాంఛిత కాల్లు, మెసేజ్‌ల నుంచి బయటపడేస్తుంది. క్లీన కమ్యూనికేషన్ అనుభవాన్ని అందించడానికి దీనిని పరిచయం చేయడం జరిగింది.బీఎస్ఎన్ఎల్ వైఫై నేషనల్ రోమింగ్: వినియోగదారులు అదనపు ఛార్జీల గురించి చింతించకుండా దేశవ్యాప్తంగా వైఫై యాక్సెస్‌ని ఆస్వాదించవచ్చు. ప్రయాణ సమయంలో కనెక్ట్ అయి ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది.బీఎస్ఎన్ఎల్ ఐఎఫ్టీవీ: ఈ సర్వీస్ ఫైబర్ టు ది హోమ్ (FTTH) కనెక్షన్లతో వినియోగదారుల కోసం 500 ప్రీమియం ఛానెల్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. తద్వారా యూజర్ మంచి ఎంటర్టైన్మెంట్ పొందవచ్చు.ఎనీ టైమ్ సిమ్ కియోస్క్: ఎప్పుడైనా, ఎక్కడైనా సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. దీనికోసం ప్రత్యేక కేంద్రాలను యెఫ్తాను చేయనున్నారు.డైరెక్ట్-టు-డివైస్ సర్వీస్ (D2D): ఈ సర్వీస్ ద్వారా శాటిలైట్ టు డివైజ్ కనెక్టివిటీ పొందవచ్చు. కాబట్టి ఎక్కడి నుంచి అయినా ఎస్ఎంఎస్ సేవలను ఆస్వాదించవచ్చు.పబ్లిక్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ రిలీఫ్: బిఎస్ఎన్ఎల్ అత్యవసర సమయంలో కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడానికి కమ్యూనికేషన్, పబ్లిక్ సేఫ్టీ ఫీచర్లతో భద్రతమైన నెట్‌వర్క్‌ను అందిస్తుంది.గనులలో ప్రైవేట్ 5జీ: ఈ సర్వీస్ ద్వారా బీఎస్ఎన్ఎల్ మైనింగ్ ప్రాంతాల్లో ప్రత్యేకమైన 5జీ కనెక్టివిటీను అందిస్తుంది. రిమోట్ లొకేషన్లలోని కార్మికులకు కమ్యూనికేషన్ మరియు భద్రతను మెరుగుపరుస్తుంది.Today at #BSNL HQ, New Delhi, Hon'ble MoC Shri @JM_Scindia Ji, along with Hon'ble MoSC Shri @PemmasaniOnX Ji and Secretary DoT Shri @neerajmittalias Ji, unveiled BSNL’s new logo, reflecting our unwavering mission of "Connecting Bharat – Securely, Affordably, and Reliably." pic.twitter.com/EFvYbVASGx— BSNL India (@BSNLCorporate) October 22, 2024 -
బీఎస్ఎన్ఎల్ కొత్త అడుగు.. దేశంలో తొలి D2D
శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ వయాశాట్ (Viasat), ప్రభుత్వ టెల్కో బీఎస్ఎన్ఎల్ (BSNL) సహకారంతో భారతదేశంలో మొదటిసారిగా డైరెక్ట్-టు-డివైస్ కనెక్టివిటీని తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన ట్రయల్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించింది.బీఎస్ఎన్ఎల్తో కలిసి వయాశాట్ ఇంజనీర్లు ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ఉపగ్రహ ఆధారిత టూ-వే మెసేజింగ్ సేవలను ప్రదర్శించారు. డీటుడీ కనెక్టివిటీ ద్వారా మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు వంటి సాధారణంగా ఉపయోగించే పరికరాలు లేదా కార్లు, పారిశ్రామిక యంత్రాలు, రవాణా సాధనాలను ఎటువంటి ప్రత్యేక హార్డ్‌వేర్ అవసరం లేకుండానే శాటిలైట్ నెట్‌వర్క్‌కు అనుసంధానించవచ్చు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ దూకుడు.. ఇక మరింత ‘స్పీడు’"ఈ ట్రయల్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి నాన్-టెరెస్ట్రియల్ నెట్వర్క్ (NTN) కనెక్టివిటీ కోసం వయాసాట్ టూ-వే మెసేజింగ్, ఎస్ఓఎస్ మెసేజింగ్‌ను ప్రదర్శించింది .దాదాపు 36,000 కి.మీల దూరంలోని వయాశాట్ జియోస్టేషనరీ ఎల్-బ్యాండ్ శాటిలైట్‌కు ఈ సందేశాలు చేరాయి. వయాశాట్ శాటిలైట్ నెట్వర్క్ని ఉపయోగించి సెల్ ఫోన్ కనెక్టివిటీకి శాటిలైట్ సేవలు అందించడం సాంకేతికంగా సాధ్యమవుతుందని ఈ ట్రయల్ ఫలితం రుజువు చేసింది" అని వయాశాట్ ఒక ప్రకటనలో తెలిపింది.ఏమిటీ D2D?డైరెక్ట్ -టు - డివైస్ (D2D) అనేది సాధారణ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి పరికరాలను ఎటువంటి అదనపు హార్డ్‌వేర్ అవసరం లేకుండా నేరుగా శాటిలైట్ నెట్‌వర్క్‌లకు అనుసంధానించే టెక్నాలజీ. సాంప్రదాయ ఇంటర్నెట్ సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాలు, ఇంటర్నెట్ అంతంత మాత్రమే ఉండే ప్రాంతాల్లో ఈ సాంకేతికత అవాంతరాలు లేని కనెక్టివిటీని అందిస్తుంది.ప్రయోజనాలివే.. » సాంప్రదాయ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలు అందుబాటులో లేని మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీని అందిస్తుంది» వినియోగదారులు తమ లొకేషన్‌తో సంబంధం లేకుండా ఇంటర్నెట్ సేవలు, కమ్యూనికేషన్ సాధనాలను యాక్సెస్ చేయగలరు.» సాంప్రదాయ శాటిలైట్ కమ్యూనికేషన్ పద్ధతులతో పోలిస్తే తక్కువ జాప్యంతో వేగవంతమైన డేటా ప్రసారానికి దారితీస్తుంది.» అందుబాటులో ఉన్న స్పెక్ట్రమ్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు తోడ్పడుతుంది. మొత్తం నెట్వర్క్ పనితీరును మెరుగుపరుస్తుంది» అదనపు హార్డ్‌వేర్ అవసరాన్ని తగ్గిస్తుంది. ఇది కనెక్టివిటీకి మరింత తక్కువ ఖర్చుతో కూడుకున్న పరిష్కారంగా మారుతుంది .» అత్యవసర సేవలు , సముద్రయానం , విమానయానం వంటి వాటిలో ఉపయోగించుకోవచ్చు. -
అల్పాదాయ దేశాలకు ఆర్థిక వనరులు అందించాలి
న్యూఢిల్లీ: సాంకేతిక సహాయం, ఇతరత్రా సర్వీసుల ద్వారా అల్పాదాయ సభ్య దేశాలకు ఆర్థిక వనరులు అందుబాటులో ఉండేలా తోడ్పాటు అందించాలని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌కి (ఏఐఐబీ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. క్లయింట్ అవసరాలకు అనుగుణంగా సేవలు అందించే విధానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని పేర్కొన్నారు. ఉజ్బెకిస్తాన్‌లో ఏఐఐబీ బోర్డు గవర్నర్ల 9వ వార్షిక సమావేశం జరగనున్న నేపథ్యంలో బ్యాంక్ ప్రెసిడెంట్ జిన్ లికున్‌తో భేటీ సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మైక్రో బ్లాగింగ్ సైటు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. తొమ్మిదేళ్ల స్వల్ప వ్యవధిలోనే రుణ కార్యకలాపాలను ఏఐఐబీ వేగవంతంగా విస్తరించిందని మంత్రి ప్రశంసించారు. అలాగే సంస్థ గవర్నెన్స్ ప్రమాణాలు పాటించడంలోను, వృద్ధి సాధనలోను భారత్ కీలకపాత్ర పోషిస్తోందని బ్యాంకు తెలిపింది. మరోవైపు, ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్ అల్ కువారీతో కూడా సీతారామన్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించారు. ఏఐఐబీలో భారత్ రెండో అతి పెద్ద వాటాదారు, అతి పెద్ద క్లయింట్‌గాను ఉంది. ఆసియా దేశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆర్థిక వనరులను అందించే బహుళపక్ష డెవలప్మెంట్ బ్యాంకుగా, బీజింగ్ కేంద్రంగా ఏఐఐబీ ఏర్పడింది. ఇందులో చైనాకు అత్యధికంగా 2,97,804 షేర్లు ఉండగా, భారత్‌కు 83,673 షేర్లు ఉన్నాయి. -
Pets Spa: మేము నాటీ... మాకూ కావాలి బ్యూటీ! (ఫొటోలు)
-
Bangladesh: ఎట్టకేలకు ఇంటర్నెట్ సేవలు.. మూడు రోజులు 5జీబీ డేటా ఫ్రీ
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అంశంపై బంగ్లాదేశ్‌లో చెలరేగిన అందోళనలు సద్దుమణిగాయి. ఈ నేపధ్యంలో దేశంలో 10 రోజుల తర్వాత మొబైల్ ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం పునరుద్ధరించింది. రిజర్వేషన్ల అంశంపై సోషల్ మీడియాలో అసంబద్ధ వార్తలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకే దేశంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.దేశంలో ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించినట్లు ప్రకటించిన ప్రభుత్వం మూడు రోజుల పాటు వినియోగదారులందరికీ 5 జీబీ డేటా ఇంటర్నెట్ ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. ఈ విషయమై సమాచార, కమ్యూనికేషన్ల సాంకేతిక శాఖ సహాయ మంత్రి (ఐసీటీ) జునైద్ అహ్మద్ పాలక్ అధికారిక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం జూలై 18 నుంచి మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. రిజర్వేషన్ల అంశంపై దేశంలో జరిగిన హింసాయుత ఘటనల్లో సుమారు వందమంది మృతి చెందారు.యుద్ధ వీరుల బంధువులకు ప్రభుత్వ రంగ ఉద్యోగాలను రిజర్వ్ చేసే వ్యవస్థకు వ్యతిరేకంగా దేశంలోని ఢాకాతో పాటు ఇతర నగరాల్లో విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అది హింసాత్మకంగా మారింది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం ఈ హింసాకాండలో 100 మంది మరణించారు. అయితే, దీనిపై ఇంకా అధికారిక సమాచారం వెల్లడికాలేదు. మరోవైపు హింసాకాండ నేపథ్యంలో కర్ఫ్యూ విధించాలన్న తన నిర్ణయాన్ని ప్రధాని షేక్ హసీనా సమర్థించుకున్నారు. -
ఒకే ‘క్లౌడ్’ను నమ్ముకుంటే ఇంతే..
సాక్షి, అమరావతి: ఒక్క ‘క్లౌడ్’నే నమ్ముకొంటే ఇంతే.. మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ ప్రపంచానికి నేర్పిన గుణపాఠమిది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్లౌడ్ సర్వీసులు ఉన్నప్పటికీ, మైక్రోసాఫ్ట్ అజూర్ పైనే ఆధారపడిన సంస్థలన్నీ ఇప్పడు చిక్కుల్లో పడ్డాయి. ఐటీ, ఇతర రంగాలకు చెందిన సంస్థలు ఖర్చుల నియంత్రణ కోసం క్లౌడ్ సర్వీసులపై ఆధారపడుతుంటే ఇప్పుడు వాటి ఉనికే ప్రశ్నార్థకం అవుతోంది.తాజాగా మైక్రోసాఫ్ట్‌కు చెందిన క్లౌడ్ సర్వీసెస్ ‘అజూర్’ సంక్షోభంతో ఐటీ కంపెనీలు వాటి విధానంపై పునరాలోచనలో పడ్డాయి. అజూర్ సైబర్ సెక్యూరిటీలో ఒక అప్డేట్ సందర్భంగా తలెత్తిన సమస్యతో ప్రపంచవ్యాప్తంగా విమాన, బ్యాంకింగ్, స్టాక్ ఎక్సే్ఛంజ్, వైద్యం వంటి పలు రంగాల్లో సేవలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఐటీ కంపెనీలు దీనిపైనే దృష్టి పెట్టాయి. డేటా బ్యాకప్ కోసం క్లౌడ్ సర్వీసులపై ఆధారపడితే వాటిల్లో అజూర్ లాగా సమస్య తలెత్తితే సాధారణ సేవలకు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారిస్తున్నాయి.ఒక క్లౌడ్‌పైనే ఆధారపడొద్దుఐటీ కంపెనీలు డేటా బ్యాకప్ కోసం కేవలం ఒక క్లౌడ్ సర్వీసుపైనే ఆధారపడకుండా అత్యవసర సమయాల కోసం మరో క్లౌడ్ సర్వీసు కూడా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ అజూర్ కాకుండా పదికి పైగా ప్రముఖ క్లౌడ్ సర్వీసు సంస్థలు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్ ఫ్లాట్‌ఫాంలతో పాటు ఐబీఎం, ఒరాకిల్, ఆలీబాబా, డిజిటల్ ఓషన్, వీఎంవేర్, రెడ్‌హాట్ వంటి అనేక క్లౌడ్ సర్వీసులు ఉన్నాయి.తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అత్యంత చౌకగా క్లౌడ్ సర్వీసులు అందించే కోర్వేవ్ వంటి సంస్థలు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. ఇదే సమయంలో ఐటీ సంస్థలు కేవలం మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఒక ఐటీ వెండర్పైనే ఆధారపడకుండా ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్‌పైనా సేవలంగించడానికి సిద్ధంగా ఉండాలని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ప్రొఫెసర్ ఓకు ఇస్క్ చెబుతున్నారు.మైక్రోసాఫ్ట్‌తో పాటు మ్యాక్, లీనక్స్ వంటి ఐటీ వెండర్స్నూ వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఈ సంక్షోభానికి ప్రధాన కారణబమైన మైక్రోసాఫ్ట్‌కు సైబర్ సెక్యూరిటీ అందిస్తున్న క్రౌడ్‌స్ట్రైక్ చేసిన ప్రకటన దీనికి ఊతమిస్తోంది. సెబర్ సెక్యూరిటీలో అప్‌గ్రెడేషన్ సందర్భంగా తలెత్తిన సంక్షోభం కేవలం విండోస్కే పరిమితమైందని ఆ ప్రకటన తెలిపింది. మ్యాక్, లీనక్స్ వంటి వాటిపై ఈ ప్రభావం లేదని క్రౌడ్‌స్ట్రైక్ పేర్కొంది. అందువల్ల ఐటీ, ఇతర సంస్థలు ప్రత్యామ్నాయాలనూ అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.తప్పించుకున్న రష్యామైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ అప్‌గ్రెడేషన్‌లో తలెత్తిన సమస్యలతో ప్రపంచవ్యాప్తాంగా అనేక దేశాల్లో పలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. రష్యాలో మాత్రం ఆ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. దీనికి ప్రధాన కారణం ఇతర దేశాలపై రష్యా దాడులు. ఈ యుద్ధం కారణంగా అమెరికాకు చెందిన పలు సంస్థలు రష్యాకు తమ ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించాయి. అందుకే మైక్రోసాఫ్ట్ సంస్థ కొన్ని సంవత్సరాలు రష్యాకు ఎటువంటి సహకారం అందించలేదు.ఈ సంక్షోభానికి కారణమైన అమెరికాకు చెందిన క్రౌడ్ స్ట్రైక్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇంత వరకు రష్యాలో అడుగే పెట్టలేదు. దీంతో రష్యా సొంత సాఫ్ట్వేర్ పైనే ఆధారపడుతోంది. కాస్పర్స్క్రై వంటి స్వదేశానికి చెందిన సెబర్ సెక్యూరిటీ సేవలనే వినియోగించుకుంటోంది. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ అప్‌గ్రెడేషన్‌తో తలెత్తిన సంక్షోభం తమ దేశంలో ఎక్కడా కనిపించలేదని రష్యా ప్రకటించింది. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో యథావిధిగా విమాన సర్వీసులు
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం(జులై 19) తలెత్తిన సాంకేతిక సమస్య ముగిసిపోయింది. విమానాలు యథావిధిగా వెళుతున్నాయి. అన్నివిమాన సర్వీసులను విమానయాన సంస్థలు పునరుద్ధరించాయి. ప్రయాణికుల ఆన్లైన్ చెక్ఇన్ సాఫీగా సాగుతున్నాయి.మైక్రోసాఫ్ట్ విండోస్, క్లౌడ్‌లో సాఫ్ట్వేర్ అప్డేట్ సమస్య రావడంతో ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో ఆన్లైన్ చెక్ఇన్ ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
4జీ, 5జీ సర్వీసులు లేకుంటే కష్టమే.!
న్యూఢిల్లీ: 4జీ, 5జీ సర్వీసులు లేకపోవడం వల్లే ప్రైవేట్ టెల్కోలతో ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ పోటీపడలేకపోతోందంటూ ఆ సంస్థ ఉద్యోగుల యూనియన్ వ్యాఖ్యానించింది. గతంలో బీఎస్ఎన్ఎల్ నుంచి పోటీ వల్ల ప్రైవేట్ సంస్థలు టారిఫ్‌లను అడ్డగోలుగా పెంచకుండా కాస్త సంయమనం పా టించేవని, కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందని తెలిపింది. అవి లాభాల్లోనే ఉన్నప్పటికీ తాజాగా రేట్లను పెంచడం సరికాదని పేర్కొంది. కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల యూనియన్ ఈ మేరకు లేఖ రాసింది. మూడు టెల్కోలు – రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా – టారిఫ్‌లను 10–27 శాతం మేర పెంచిన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. యూజరుపై సగటున వచ్చే ఆదాయం (ఏఆర్పీ యూ) తక్కువగా ఉండటం వల్లే టారిఫ్‌లను పెంచాల్సి వచి్చందంటూ ప్రైవేట్ టెల్కోలు తప్పుదారి పట్టిస్తున్నాయని యూనియన్ ఆరోపించింది. 2023–24లో జియో రూ. 20,607 కోట్లు, ఎయిర్‌టె ల్ రూ. 7,467 కోట్ల లాభాలు ఆర్జించాయని, ఈ నే పథ్యంలో సామాన్యులపై భారం పడేలా టారి ఫ్లను పెంచడం సరికాదని పేర్కొంది. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సత్వరం తగు చర్యలు తీసుకోవాలని, సామా న్యుల ప్రయోజనాలను పరిరక్షించాలని కోరింది. -
నాట్స్ నాయకుడి సేవలకు నీతి ఆయోగ్ గుర్తింపు!
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ గత రెండేళ్లలో చేసిన సేవలను భారత నీతి ఆయోగ్ గుర్తించింది. ఈ రెండేళ్లలో నాట్స్ అధ్యక్షుడిగా బాపయ్య చౌదరి(బాపు) నూతి చేసిన సేవా కార్యక్రమాలు సమాజంలో స్ఫూర్తిని నింపేలా ఉన్నాయని నీతి అయోగ్ కొనియాడింది. బాపు నూతి సేవలను అభినందిస్తూ నీతి ఆయోగ్ సభ్యులు పద్మభూషణ్ డాక్టర్ విజయ్ కుమార్ సరస్వత్ గుర్తింపు పత్రాన్ని బాపు నూతికి అందించారు. గత రెండు సంవత్సరాలుగా వేలాది మందికి సహాయక సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు బాపు నూతికి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని నీతి ఆయోగ్ భవన్ లో బాపు నూతికి గుర్తింపు పత్రాన్ని ఇచ్చి విజయ్ కుమార్ అభినందించారు. ముఖ్యంగా నాట్స్ మన గ్రామం-మన బాధ్యత కార్యక్రమం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక సేవా కార్యక్రమాలు, దివ్యాంగుల కోసం ఆటిజం కేర్ అండ్ వీల్ పేరుతో మొబైల్ ఏర్పాటు చేయడాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆటిజం కేర్ ఆన్ వీల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ, అటవీ ప్రాంతాలలో దివ్యాంగులకు సహాయపడే విధంగా డాక్టర్స్, ఫిజియోథెరపిస్ట్, ఎడ్యుకేషన్ కిట్స్ ను పంపించి వారి ఎదుగుదలకు తోడ్పాటు అందించడం చాలా గొప్ప విషయం అని విజయ్ కుమార్ అన్నారు. నాట్స్, స్పర్ష్ ఫౌండేషన్ సంస్థలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని దివ్యాంగులకు, పిల్లలకు సేవా కార్యక్రమాలతో పాటు మొబైల్ వ్యాన్ ని ఏర్పాటు చేసి డాక్టర్స్ ద్వారా సేవలను అందించడం అభినందనీయమన్నారు. దివ్యాంగులకు పునరావాస కార్యక్రమాలు చేపట్టడం, గ్రామీణ గిరిజన తండాల్లోని వైద్య సేవలు, అవసరమైన వారిని గుర్తించి సహాయం అందించడం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో బాపు నూతి తో పాటు నాట్స్ డల్లాస్ నాయకులు రవి తాండ్ర, స్పర్ష్ ఫౌండేషన్ అధినేత పంచముఖి, డా. జ్యోతిర్మయి పాల్గొన్నారు.(చదవండి: నాట్స్ నూతన అధ్యక్షుడిగా మదన్ పాములపాటి) -
మరో రెండేళ్ల వయోపరిమితి పెంపు
సాక్షి, హైదరాబాద్: డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భాగంగా వివిధ యూనిఫామ్ సర్వీసులకు గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని యూనిఫామ్ సర్వీసులకు సంబంధించి రాబోయే రిక్రూట్మెంట్లకు ఇది వర్తించనుంది. యూనిఫామ్ సర్వీసుల పరిధిలోకి వచ్చే వివిధ సర్వీసులు, కేటగిరీల పోస్టులు.. పోలీస్, అగ్నిమాపక, జైళ్లశాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్), ఎక్సైజ్, రవాణా, అటవీశాఖ ఉద్యోగాలకు ఐదేళ్ల గరిష్ట వయోపరిమితిని పెంచుతూ ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో నిరుద్యోగుల నుంచి పెద్దసంఖ్యలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందడంతో మరింత మంది నిరుద్యోగ యువతకు అర్హత కల్పించే ఉద్దేశంతో యూనిఫామ్ సర్వీసెస్‌కు కూడా గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర గెజిట్‌లో ఈనెల 8న నోటిఫికేషన్‌ను పబ్లిష్ చేశారు. 8న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కూడా ఉత్తర్వులు జారీచేశారు. గతంలో జారీచేసిన ఉత్వర్వుల్లో యూనిఫామ్ సర్వీసులకు గరిష్ట వయోపరిమితిని పెంచకపోవడం గమనార్హం. -
టెలిమెడిసిన్‌లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి : రోగులకు టెలిమెడిసిన్ సేవలందించడంలో ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా 20.41 కోట్ల టెలిమెడిసిన్ సేవలందిస్తే అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 4.92 కోట్ల సేవలందించినట్లు ఆ శాఖ శుక్రవారం పార్లమెంట్ సమావేశాల్లో తెలిపింది. అంటే.. దేశం మొత్తం అందించిన టెలిమెడిసిన్ సేవల్లో ఒక్క ఏపీలోనే 24.4 శాతం అందించారు. అలాగే, మరేఇతర రాష్ట్రం కూడా నాలుగు కోట్లకు పైబడి ఈ సేవలందించలేదు. ఆంధ్రప్రదేశ్ తరువాత తమిళనాడు 3.02 కోట్లు.. ఆ తరువాత పశి్చమ బెంగాల్ 2.94 కోట్ల సేవలందించినట్లు కేంద్రం పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో అందిస్తున్న ఈ సేవలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గ్రామీణ రోగులకు సులభంగా స్పెషలిస్టుల సేవలు ఈ–సంజీవని టెలీమెడిసిన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల రోగులకు పెద్దపెద్ద డాక్టర్ల సలహాలు, సూచనలు సులభంగా అందుతున్నాయి. అలాగే, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఈ సేవలందించడంతో పాటు ఆయా ప్రాంతాల్లోని ప్రజల్లో టెలిమెడిసిన్ సేవల వినియోగంపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ–సంజీవని టెలిమెడిసిన్ కార్యకలాపాలపై చిన్న వీడియోలు, బ్రోచర్లు, కరపత్రాలతో పాటు సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక ఈ ఈ–సంజీవని టెలిమెడిసిన్ సేవలు ప్రస్తుతం 13 భాషల్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. హిందీ, కన్నడ, తమిళం, మళయాళం, తెలుగు, మరాఠీ, గుజరాతీ, అస్సామీ, ఒడియా, బెంగాలీ, పంజాబీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు హబ్, స్పోక్ మోడల్ ద్వారా నిపుణులతో సహా వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లోని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లకు టెలిమెడిసిన్ సేవలను అందిస్తున్నారు. ప్రజారోగ్యం పట్ల సీఎం వైఎస్ జగన్ సర్కారు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఆచరణలో అమలుచేసి చూపిస్తోంది. ఫలితంగా రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. మరోవైపు.. ఈ టెలిమెడిసిన్ సేవలందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హబ్‌లను ఏర్పాటుచేసింది. వీటికి రాష్ట్రవాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు వైఎస్సార్ పట్టణ ఆరోగ్య హెల్త్ క్లినిక్స్, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లను అనుసంధానం చేశారు. ఒక్కో హబ్‌లో ఇద్దరు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, కార్డియాలజీ స్పెషలిస్ట్‌లు ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, విలేజ్ క్లినిక్స్‌కు వచ్చిన రోగులకు స్పెషాలిటీ వైద్యుల సేవలు అవసరమైతే వెంటనే వైద్య సిబ్బంది టెలిమెడిసిన్ ద్వారా హబ్‌లోని వైద్యులను సంప్రదిస్తారు. హబ్‌లోని వైద్యులు ఆడియో, వీడియో కాల్ రూపంలో రోగులతో మాట్లాడి వారికి సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు ఏ మందులు వాడాలో తెలియజేస్తున్నారు. వారు సూచించిన మందులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్‌లోని వైద్య సిబ్బంది రోగులకు అందజేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ ద్వారా కూడా సేవలు.. ఇక స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు ఈ–సంజీవని (ఓపీడీ) యాప్ ద్వారా ఇంటి నుంచే వైద్యసేవలను పొందుతున్నారు. స్మార్ట్‌ఫోన్ లేనివారికి, ఆ ఫోన్లు వినియోగం తెలియని వారికి ఇళ్ల వద్దే ఈ–సంజీవని ఔట్ ఫేషెంట్ డిపార్ట్మెంట్ సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 42 వేల మంది ఆశా వర్కర్లకు స్మార్ట్ఫోన్లను పంపిణీ చేసింది. వీటిని హబ్‌లకు అనుసంధానించారు. ఈ ఆశా వర్కర్లు రోగులకు టెలిమెడిసిన్ సేవలందించడంతో పాటు ప్రజలకు వీటిపై అవగాహన కల్పిస్తారు. దీంతో రాష్ట్రంలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని రోగులు కూడా టెలిమెడిసిన్ ద్వారా స్పెషలిస్ట్ డాక్టర్ల వైద్య సలహాలు, సూచనలను పొందుతున్నారు. ఈ సేవలందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నందువల్లే రాష్ట్రంలో అత్యధికంగా టెలిమెడిసిన్ సేవలందించడం సాధ్యమైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. -
ఇంటర్ విద్యలో డిజిటల్ సేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉత్తమ సేవలు అందించేందుకు బోర్డు డిజిటల్ విధానాలను అనుసరిస్తోంది. ఇప్పటికే డిజి లాకర్లో 2006 నుంచి 2023 మధ్య ఇంటర్మీడియట్ పాసైన 68.73 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచగా, ఈ ఏడాది నుంచి ఫీజు చెల్లింపు నుంచి ప్రాక్టికల్స్ మార్కుల నమోదు వరకు అన్ని అంశాలను ఆన్లైన్ విధానంలోకి మార్చింది. దీంతో విద్యార్థులు, పాఠశాలల యాజమాన్యాలకు సమయాభావం తగ్గడంతో పాటు వేగవంతమైన సేవలు అందుబాటులోకి వచ్చినట్లయింది. గతంలో చలాన్ రూపంలో ఫీజు చెల్లించగా, వాటిని పరిశీలించి మదింపు చేసేందుకు బోర్డుకు చాలా సమయం పట్టేది. కానీ, ఈ ఏడాది ఫీజులను, నామినల్ రోల్స్‌ను కూడా ఆన్లైన్ చేయడంతో గత ఇబ్బందులన్నీ తొలగించినట్లయింది. ఇంటర్ పరీక్షలకు 9,59,933 మంది.. ఇక మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొదటి సంవత్సరంలో 5,17,591 మంది, రెండో ఏడాది 4,45,342 మంది మొత్తం 9,59,933 మంది పరీక్ష రాయనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1,559 పరీక్షా కేంద్రాలను సిద్ధంచేశారు. ఇప్పటికే ఆయా జూనియర్ కాలేజీల్లోని పరీక్ష జరిగే గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. అలాగే, ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలకు 2,130 సెంటర్లను సిద్ధంచేశారు. ఈసారి ప్రాక్టికల్స్ పూర్తయిన వెంటనే మార్కులను ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ఇందుకోసం ఇంటర్ బోర్డు ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఎక్కడా పొరపాట్లు జరగకుండా ఎగ్జామినర్ రెండుసార్లు ఆన్లైన్లో మార్కులు నమోదు చేసేలా చర్యలు తీసుకున్నామని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సుబ్బారావు ‘సాక్షి’కి తెలిపారు. ఇకపై ఇదే ఆన్లైన్ విధానం కొనసాగుతుందన్నారు. డిజిలాకర్‌లో 68.73 లక్షల సర్టిఫికెట్లు.. రాష్ట్రంలో ఇంటర్ పాసైన విద్యార్థులు తమ సర్టిఫికెట్లను ఆన్లైన్లో సులభంగా పొందే వెసులుబాటును ఇంటర్ బోర్డు అందుబాటులోకి తెచ్చింది. పాస్ సర్టిఫికెట్, మైగ్రేషన్, ఈక్వ లెన్సీ, జె న్యూనెస్ సర్టిఫికెట్లు ఎప్పుడు కావాలన్నా తీసుకునేలా ‘డిజిలాకర్’ (https://digilocker.gov.in)లో ఉంచింది. ఇందుకోసం ‘జ్ఞానభూమి’ ని డిజిలాకర్‌కు అనుసంధానించింది. ఇందులో ఇప్పటివరకు 2006 నుంచి 2023 వరకు ఇంటర్ పూర్తిచేసిన 68,73,752 మంది విద్యార్థుల సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచారు. సర్టిఫి కెట్లలో తప్పుపడిన పేరును సరిదిద్దేందుకు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీలను సవరించడం వంటి ఇతర సేవలను కూడా ఆన్లైన్లో డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా విద్యార్థులు పొందవచ్చు. డిజి లాకర్‌గా పిలుస్తున్న ‘డిజిటల్ డాక్యుమెంట్స్ రిపోజిటరీ’లో ఇంటర్ పరీక్షలు పూర్తిచేసిన విద్యార్థులు తమ పత్రాలను పొందవచ్చు. గతంలో సర్టిఫికెట్లు పోగొట్టుకున్న వారు ‘డూప్లికేట్’ పొందాలంటే పోలీసు వి భాగం ఎన్ఓసీ, నోటరీ అఫిడవిట్‌తో దరఖాస్తు చేయడంవంటి వ్యయప్రయాసలు పడాల్సి వచ్చే ది. ఈ ప్రక్రియకు స్వస్తి పలుకుతూ డిజి లాకర్‌తో జ్ఞానభూమిని అనుసంధానం చేయడంతో విద్యార్థి తన మొబైల్ ఫోన్లోని డిజిలాకర్ యాప్ ద్వారా సర్టిఫికెట్లను ఎప్పుడైనా, ఎక్కడైనా పొందే విధానాన్ని బోర్డు అందుబాటులోకి తెచ్చింది. -
ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేస్తున్నట్టు వస్తున్న ప్రచారం నిజం కాదని ప్రకటన
-
సెలవులు ఎలా గడుపుతారు? సర్వేలో వెల్లడైన ఆసక్తికర విషయాలు
సెలవులంటే ప్రతిఒక్కరికీ ఉత్సాహమే. ఒకప్పుడు ఎక్కడైనా బయటకు వెళ్లి సెలవులను ఆస్వాదించేవారు. అయితే సెలవులను గడిపే తీరు ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ యుగంలో మారిపోయింది. రానున్న క్రిస్మస్ సెలవుల సీజన్‌ను ఎలా గడుపుతారన్న దానిపై ప్రముఖ టెక్నాలజీ సంస్థ సిస్కో ప్రపంచవ్యాప్తంగా ఓ సర్వే చేపట్టింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. న్యూఢిల్లీ: వినియోగదారులు గతంలో కంటే ఈ సెలవుల సీజన్లో ఎక్కువ అప్లికేషన్లు, డిజిటల్ సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉందని సిస్కో నివేదిక వెల్లడించింది. భారతీయుల్లో 85 శాతం మంది ప్రధానంగా బ్యాంకింగ్, గేమింగ్, ఎంటర్టైన్మెంట్ యాప్‌ల వాడకం ద్వారా సెలవులను విస్తృతంగా ఉపయోగించుకుంటారని తెలిపింది. క్రిస్మస్, సెలవుల కాలంలో అప్లికేషన్లు, డిజిటల్ సేవల వినియోగాన్ని తెలుసుకోవడానికి యూఎస్, యూకే, యూఏఈ, జర్మనీ, భారత్ సహా వివిధ దేశాల్లో చేపట్టిన ఈ సర్వేలో 12,000 మంది పాలుపంచుకున్నారు. Cisco Survey: సిస్కో యాప్ డైనమిక్స్ సీజనల్ షాపింగ్ పల్స్ సర్వే ప్రకారం.. అప్లికేషన్లు, డిజిటల్ సేవలు ఇప్పుడు ఆనందదాయక సెలవులు/క్రిస్మస్లో ముఖ్యమైనవి అని 88 శాతం మంది అంగీకరిస్తున్నారు. సినిమాలు, టీవీ షోలు, క్రీడలు, సంగీతాన్ని ఆస్వాదించడానికి వినోద యాప్‌లను ఉపయోగించాలని 88 శాతం మంది భారతీయులు యోచిస్తున్నారు. 72 శాతం మంది అలెక్సా, స్మార్ట్ హోమ్ వంటి ఇంటర్నెట్తో అనుసంధానించిన పరికరాలను వినియోగించాలని, 60 శాతం మంది గేమింగ్ యాప్‌లను ఉపయోగించాలని భావిస్తున్నారు. 84 శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ కావడానికి సోషల్ మీడియా, వీడియో కాల్స్ సాధనాలను ఎంచుకున్నారు. చివరి నిమిషంలో బహుమతులు, తమ హాలిడే వంటకాల కోసం తుది పదార్థాలను కొనుగోలు చేసేందుకు 75 శాతం మంది రిటైల్ యాప్‌లను, అదే నిష్పత్తిలో చివరి నిమిషంలో చెల్లింపులు, బదిలీలకై బ్యాంకింగ్, బీమా యాప్‌లను వాడతారు. 78 శాతం మంది వార్తలు, సమాచార–ఆధారిత యాప్‌లను, 88 శాతం మంది టేక్ అవే కోసం ఫుడ్ డెలివరీ సేవలను వినియోగిస్తారు’ అని సర్వేలో తేలింది. -
మహాలక్ష్మీ పథకం.. మహిళలకు ఉచిత ప్రయాణం (ఫొటోలు)
-
డిజిటలైజేషన్ దిశగా టీఎస్ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: ప్రయాణీకులకు మెరుగైన, నాణ్యమైన సేవల్ని అందించేందుకు గానూ అత్యాధునిక సాంకేతికను టీఎస్ఆర్టీసీ వినియోగిస్తోంది. ఈ మేరకు ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ERP) ప్రాజెక్ట్ అమలుతో ఆధునికీకరణ వైపు దిశగా సాంకేతికతలో ముందడుగు వేసింది. 9 వేలకు పైగా బస్సులు, 50 వేల మంది ఉద్యోగులు, దాదాపు 10 వేల గ్రామాలను కలుపుతూ ప్రతిరోజూ 35 లక్షల కిలోమీటర్ల నడుపుతూ సుమారు 45 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సేవలు అందిస్తోంది. ఇంత విస్తృత నెట్వర్క్ కలిగి ఉన్న సంస్థ.. అన్ని సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చింది. డిజిటలైజేషన్ ఆవశ్యకతను గుర్తించి, ఈఆర్పీ ప్రాజెక్టులో భాగంగా సెంట్రలైజ్డ్ ఇంటిగ్రేటెడ్ సొల్యుషన్ (CIS)పై మొగ్గు చూపి వాటి సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అందుకు నల్సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సంస్థ ఓ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ బస్ భవన్లో మంగళవారం సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఈఆర్పీ సేవల్ని లాంఛనంగా ప్రారంభించారు. “సంస్థ సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈఆర్పీ ప్రాజెక్టును అమలు చేస్తున్నాం. పది నెలల వ్యవధి రికార్డు సమయంలో సంస్థ ఈఆర్పీ ప్రాజెక్టును అమలులోకి తెచ్చాం. CIS ప్రాజెక్ట్ సమర్థవంతమైన ఆదాయ నిర్వహణ, వ్యయ నియంత్రణ కోసం సకాలంలో చర్యలకు దోహదపడుతోంది. కేంద్రీకృత సమగ్రమైన డేటా లభ్యత, భద్రతతో పాటు మానవశక్తి వినియోగాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఆపరేషన్లపై కేంద్రీకృతం చేయడం, మార్గాలను క్రమబద్దీకరించడం, ఇంధన నిర్వహణ, వ్యక్తిగత స్టోర్లు, వర్క్‌షాపులు, ఆదాయ నిర్వహణ, పే రోల్ వంటి కార్యకలాపాల నిర్వహణలో రాష్ట్రంలోని అన్ని డిపోలు, జోన్లతో పాటు ప్రధాన కార్యాలయంలోని వివిధ విభాగాలన్నింటినీ ఈఆర్పీ ఏకీకృతం చేస్తోంది. ఈ సేవల్ని వినియోగించుకోవడంలో దేశంలోని ఆర్టీసీల్లో టీఎస్ ఆర్టీసీ మొదటిది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నెట్ వర్క్‌ను అప్ గ్రేడ్ చేశాం అని సంస్థ వీసీ అండ్ ఎండీ వి.సి.సజ్జనర్ అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్గత సామార్థాన్ని మెరుగుపరచాలనే ఉద్ధేశంతో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. సమర్థవంతమైన ఈ వ్యవస్థ సంస్థ అభివృద్ధికి దోహద పడగలదని ఆశిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మెరుగైన నాణ్యమైన సేవల్ని అందించేందుకు టీఎస్ ఆర్టీసీతో భాగస్వామ్యం కావడం తమకు సంతోషంగా ఉందని నల్సాఫ్ట్ సీఈఓ నల్లూరి వెంకట్ ఆనందం వ్యక్తం చేశారు. సమష్టి కృషి, అంకితభావంతో పని చేసి నిర్ధేశించుకున్న కాలానికి పూర్తి చేయగలిగామని చెప్పారు. ఆధునీక సాంకేతితను అందిపుచ్చుకోవడంలో టీఎస్ ఆర్టీసీ ముందంజలో ఉందన్నారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావడంలో సహకరించిన అధికారులకు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హన్స ఈక్విటీ పార్ట్నర్స్ త్రినాథ్ బాబు మాట్లాడుతూ, రోజువారీ కార్యకలాపాల్లో సాంకేతికతను ఉపయోగించకుండా ఏ సంస్థ కూడా పురోగమించదన్నారు. సీఐఎస్ ప్రాజెక్టు ద్వారా కార్యకలాపాల నిర్వహణ మరింత సౌలభ్యంగా మారే అవకాశం ఉందన్నారు. అనేక సవాళ్లను అధిగమిస్తూ టీఎస్ ఆర్టీసీ పురోగమించడం శుభపరిణామన్నారు. సీఓఓ డాక్టర్ వి రవీందర్, ఐటి కన్సల్టెంట్ శ్రీమతి దీపా కోడూర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పివి ముని శేఖర్, ఎస్ కృష్ణకాంత్, వి.వెంకటేశ్వర్లు, ఎ. పురోషోత్తం, ఆర్థిక సలహాదారు విజయ పుష్ప, చీఫ్ ఇంజనీర్ (IT) ఎం. రాజ శేఖర్, తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఆర్బీకేల్లోనూ పశు వైద్యసేవలు
సాక్షి, అమరావతి: మూగ, సన్న జీవాలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను మరింతగా పటిష్టపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో పశువులకు ఏ చిన్న సమస్య వచ్చినా మండల కేంద్రంలో ఉండే పశు వైద్యశాలలు, డిస్పెన్సరీలకు పరుగులెత్తాల్సి వచ్చేది. దీనివల్ల సకాలంలో వైద్యసేవలు పొందలేక పాడి రైతులు పడరాని పాట్లు పడేవారు. గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆర్బీకేలను రూరల్ లైవ్ స్టాక్ యూనిట్లుగా తీర్చిదిద్దడంతో పాడి రైతుల వెతలకు చెక్ పడింది. రాష్ట్రంలో మొత్తం 10,778 ఆర్బీకేలుండగా.. 7,272 ఆర్బీకేల పరిధిలో పాడి సంపద అధికంగా ఉంది. వీటిలో 4,652 ఆర్బీకేల్లో గ్రామ పశు వైద్య సహాయకులు, మిగిలిన ఆర్బీకేల్లో రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్ల (ఆర్‌ఎల్‌యూ) సిబ్బంది సేవలందిస్తున్నారు. రేషనలైజేషన్ అనంతరం 1,896 ఆర్బీకేల పరిధిలో వీఏహెచ్‌ఏలు అవసరమని గుర్తించగా.. ఆ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రతి ఆర్బీకేలో 105 రకాల మందులు పాడి సంపద ఉన్న ప్రతి ఆర్బీకేలో రూ.10 వేల విలువైన ట్రెవీస్ (ఇనుప చట్రాల)ను ఏర్పాటు చేశారు. కృత్రిమ గర్భోత్పత్తి కోసం పశు వీర్యాన్ని నిల్వ చేసేందుకు వీలుగా రూ.16.90 కోట్ల విలువైన లిక్విడ్ నైట్రోజన్ కంటైనర్లను ఆర్బీకేల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి ఆర్బీకేలో 105 రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నారు. మూడేళ్లలో ఆర్బీకేల ద్వారా రూ.24.30 కోట్ల విలువైన మందులను పంపిణీ చేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేకంగా రూ.24 కోట్ల విలువైన మందులను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు ఆర్బీకేల ద్వారా పశువులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేస్తున్నారు. జబ్బుపడిన జంతువులకు ప్రథమ చికిత్స అందించడంతో పాటు రైతుల ఇంటి గుమ్మం వద్దనే రోగ నిరోధక టీకాలు వేస్తున్నారు. నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాలు నిర్వస్తున్నారు. ఇనాఫ్ ట్యాగ్లు వేస్తున్నారు. ప్రతి మూగజీవానికి హెల్త్ కార్డులు ఇస్తున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్థిక చేయూత అందిస్తున్నారు. ప్రతి వారం పశువైద్యులు ఆర్బీకేలను సందర్శిస్తూ వీహెచ్‌ఏల సహాయంతో సేవలందిస్తున్నారు. ప్రతి ఆర్బీకేలో రూరల్ లైవ్ స్టాక్ యూనిట్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సేవలందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రతి ఆర్బీకేను ఓ రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్‌గా తీర్చిదిద్దాం. మూడేళ్లలో రూ.24.30 కోట్ల విలువైన మందులను పంపిణీ చేస్తే.. ఈ ఏడాది ప్రత్యేకంగా రూ.24 కోట్ల విలువైన మందులను అందుబాటులో ఉంచుతున్నాం. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, పశు సంవర్ధక శాఖ మంత్రి -
హైదరాబాద్ నుంచి అమృత్‌సర్‌కు విమాన సేవలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి మరో నాలుగు నగరాలకు విమాన సర్విసులు అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సహకారంతో దేశీయ విమానయాన సేవలను విస్తరించినట్లు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు తెలిపారు. వీటిలో మూడు నగరాలకు శుక్రవారం నుంచి (17వ తేదీ) సర్విసులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి అమృత్‌సర్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (ఐగీ 954) రోజూ ఉదయం 07:30కి హైదరాబాద్ నుంచి బయల్దేరి 10.15కి అమృత్‌సర్‌కు చేరుకుంటుంది. ఇక లక్నో–హైదరాబాద్ మధ్య వారానికి ఆరు సర్విసులు అందుబాటులో ఉంటాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (ఐగీ 953) హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2.30కి బయల్దేరి సాయంత్రం 4.35కి లక్నోకు చేరుకుంటుంది. అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ( ఐగీ 955) ప్రతీరోజు సాయంత్రం 7.45 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి రాత్రి 9.30 గంటలకు కొచ్చిన్‌కు చేరుకుంటుంది. గ్వాలియర్‌కు ఆరు సర్విసులు నవంబర్ 28 నుంచి హైదరాబాద్–గ్వాలియర్ మధ్య వారానికి మూడు సర్విసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విమానం హైదరాబా ద్ నుంచి మధ్యాహ్నం 2.30కి బయల్దేరి సాయంత్రం 4.20కి గ్వాలియర్ చేరుకుంటుంది. ఈ సందర్భంగా జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈవో ప్రదీప్ ఫణిక్కర్ మాట్లాడుతూ...ఈ మార్గాల్లో మెరుగైన అనుసంధానం కోసం కొత్త విమానాలు దోహదం చేయనున్నాయని చెప్పారు. -
ఆర్టీసీలో ‘మానసిక’ టెన్షన్!
ముందు రోజు రాత్రివిధులు నిర్వహించి వచ్చాడు ఆ డ్రైవర్.. మరుసటి రోజు రాత్రి విధులకు వెళ్లేలోపు కనీసం నాలుగు గంటలన్నా నిద్రపోవాలి.. కానీ దగ్గరి బంధువుల ఇంట్లో వేడుకకు వెళ్లాల్సి ఉంది, సెలవులు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో పగటి పూట వేడుకలో గడిపి, 110 కి.మీ. దూరంలోని తానుంటున్న పట్టణం నుంచి సొంత వాహనం నడుపుకుంటూ హైదరాబాద్ వచ్చి విజయవాడ బస్సు తీసుకుని బయలుదేరాడు. దారిలో ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొనటంతో మృతి చెందాడు. మరో 9 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ డ్రైవర్ కొన్నేళ్లుగా కుటుంబ వివాదాలతో సతమతమవుతున్నాడు.. దాదాపు కుటుంబ సభ్యులు వెలివేసినంత పనిచేశారు.. దీంతో అతని మానసిక స్థితి అదుపు తప్పింది. దూరప్రాంత బస్సు కావటంతో ఇద్దరు డ్రైవర్లు విధుల్లో ఉంటున్నారు. మరో డ్రైవర్ నడుపుతున్నప్పుడు అతను మద్యం సేవిస్తున్నాడు. ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేయగా, ఆ రోజు అధికంగా మద్యం తాగి ఉన్నట్టు తేలి అధికారులు కంగుతిన్నారు. అప్పుడు కాని అతన్ని విధుల నుంచి తప్పించలేదు. సాక్షి, హైదరాబాద్: ఇది తెలంగాణ ఆర్టీసీలో నెలకొన్న పరిస్థితి. సగటున ఒక్కో బస్సులో 60 మందికిపైగా ప్రయాణికులు ఉంటారు. వారిని క్షేమంగా గమ్యం చేర్చేది డ్రైవరే. కానీ, ఇప్పుడు ఆర్టీసీకి డ్రైవర్లపై పర్యవేక్షణే లేకుండా పోయింది. డ్రైవర్ భద్రంగా బస్సును గమ్యం చేర్చటమనేది డ్రైవింగ్ స్కిల్స్ పైనే కాకుండా, అతని మానసిక స్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే గతంలో డ్రైవర్‌పై నిఘా, పర్యవేక్షణ ఉండేది. కానీ, క్రమంగా నష్టాలను అధిగమించేందుకు ఆదాయంపైనే దృష్టి కేంద్రీకరించటం మొదలయ్యాక ఇది గతి తప్పింది. ఇప్పుడు డ్రైవర్ల కొరత కూడా ఉండటంతో, కచ్చి తంగా ఉన్నంత మంది విధులకు వచ్చేలా చూడ్డానికే అధికారులు పరిమితమవుతున్నారు. వారికి గతంలోలాగా సెలవులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో విధులు ముగిసిన తర్వాత నుంచి తిరిగి విధులకు వచ్చే వరకు ఆ డ్రైవర్ విషయాన్ని సంస్థ పట్టించుకోవటం లేదు. డ్యూటీకి వచ్చే సమయానికి అతని మానసిక స్థితి ఏంటో కూడా తెలుసుకోలేకపోతున్నారు. మద్యం తాగి ఉన్నాడా లేదా అన్న ఒక్క విషయాన్ని మాత్రమే తేల్చుకుని బస్సు అప్పగిస్తున్నారు. సెలవులు లేక.. ఒంట్లో కాస్త నలతగా ఉన్నా, విశ్రాంతి సమయంలో నిద్రపోలేని పరిస్థితిలో ఉన్నా, రకరకాల వివాదా లతో మానసికంగా ఆందోళనతో ఉన్నా.. డ్రైవింగ్ సరిగా చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో తనకు సెలవు కావాలంటూ డ్రైవర్లు అడుగుతారు. అయితే, సెలవు ఇస్తే డ్రైవర్ల కొరత వల్ల సరీ్వసునే రద్దు చేసుకోవాల్సి వస్తోంది. దీంతో వా రికి సెలవుల్లేక విధులకు హాజరు కావాల్సి వస్తోంది. విజయవాడ మార్గంలో జరిగిన యాక్సిడెంట్లో చనిపోయిన డ్రైవర్.. ఆ రోజు నిద్రలేమితో ఉండి కూడా సెలవుకు దరఖాస్తు చేయకుండా డ్యూటీకి హాజరయ్యాడని తెలిసింది. ఆ విధానమేమైంది..? గతంలో ప్రతి డిపోలో స్పేర్ డ్రైవర్లు ఉండేవారు. డ్యూటీ చేయలేని స్థితిలో డ్రైవర్ ఉంటే అతని స్థానంలో మరో డ్రైవర్‌ను పంపే వారు. కానీ 13 ఏళ్లుగా డ్రైవర్ల రిక్రూట్మెంట్ లేకపోవటం, రిటైర్మెంట్లు, మరణించడం, పదోన్నతులు.. వంటి కారణాల వల్ల డ్రైవర్లకు కొరత ఏర్పడింది. గతంలో డ్రైవర్ల మానసిక స్థితిని తెలుసుకునే విధానం ఉండేది. ఏవైనా కారణాలతో వారు మానసికంగా కుంగిపోతున్నారా అన్నది సంస్థకు తెలిసే ఏర్పాటు ఉండేది. ప్రతి సంవత్సరారంభంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించేవారు. వాటికి డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు పాల్గొనాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా డ్రైవర్ల స్థితిగతులపై ఆర్టీసీకి సమాచారం చేరేది. డ్రైవర్లతోపాటు, వారి కుటుంబ సభ్యులకు కూడా కౌన్సిలింగ్ చేసేవారు. డ్యూటీకి–డ్యూటీకి మధ్య చాలినంత నిద్ర ఉండేలా చూడాలంటూ కుటుంబ సభ్యులకు సూచించేవారు. ఇప్పుడు ఆ వారోత్సవాలు సరిగా నిర్వహించటం లేదు. సంవత్సరంలో ఒకసారి ప్రమాదరహిత వారోత్సవాలు నిర్వహించేవారు. ఆ వారంలో ఒక్క బస్సు కూడా ప్రమాదానికి గురి కాకుండా డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలుండేవి. ఇది కూడా వారి నైపుణ్యం, మానసిక స్థితి తెలుసుకునేందుకు ఉపయోగపడేది. ఇప్పుడు దీన్ని నిర్వహించటం లేదు. వరుస ప్రమాదాలతో.. చాలా విరామం తర్వాత మళ్లీ ఆర్టీసీ డ్రైవర్ల కుటుంబ సభ్యులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది. ఇటీవలి వరుస ప్రమాదాలతో సంస్థలో టెన్షన్ నెలకొంది. డ్యూటీకి వచ్చేప్పుడు సరైన స్థితితో డ్రైవర్లు ఉండేలా చూడాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులది అని అధికారులు చెబుతున్నారు. వారు రెస్ట్ సమయంలో తగినంతగా నిద్రపోవటం, సెల్ఫోన్లతో ఎక్కువ సేపు గడపకుండా చూడటం, అనవసర వివాదాలతో ఒత్తిడికి గురికాకుండా చూడటం.. లాంటి అంశాలపై కుటుంబ సభ్యులు దృష్టి సారించాలని చెప్పనున్నారు. కానీ, గతంలో ఉన్నట్టు పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేస్తే తప్ప ఇది ఫలించే సూచనలు కనిపించటం లేదు. డ్రైవర్లపై పని ఒత్తిడి తగ్గటంతోపాటు డ్రైవింగ్ చేయలేని పరిస్థితి ఉంటే సెలవు ఇచ్చే ఏర్పాటు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అది జరగాలంటే, తాత్కాలిక పద్ధతిలోనైనా డ్రైవర్ల రిక్రూట్మెంట్ ఉండాలని వారు పేర్కొంటున్నారు.