న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా దాదాపు తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు సమ్మె ప్రారంభించడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ, తొమ్మిది యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఈ సమ్మె పిలుపు ఇచ్చింది. ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు గురువారం విధులు బహిష్కరించారు. సమ్మె రెండవరోజూ కొనసాగుతున్న నేపథ్యంలో శుక్రవారం కూడా బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది.
ప్రభుత్వం మొండి విధానం వల్లే...
ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం చేసిన ప్రకటన ప్రకారం, గురువారం దాదాపు రూ.18,600 కోట్ల విలువైన 20.4 లక్షల చెక్కుల లావాదేవీలు జరగలేదు. ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి విధానం వల్ల దేశ వ్యాప్తంగా లక్షకు పైగా బ్యాంకింగ్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు బ్రాంచీల కార్యకలాపాలు నిలిచిపోయినట్లు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, డీఎంకే. సీపీఐ, సీపీఎం, టీఎంసీ, ఎన్‌సీపీ, శివసేనసహా పలు రాజకీయ పార్టీలు సమ్మెకు మద్దతు నిచ్చినట్లు తెలిపారు. కాగా, ఇంటర్ బ్యాంక్ చెక్ క్లియరెన్స్ ఇబ్బందులు మినహా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి ప్రైవేటు బ్యాంకులు యథాపూర్వం విధులు నిర్వహించాయి.
చదవండి:యూజర్లకు ఎల్‌ఐసీ హెచ్చరిక! పర్మిషన్ లేకుండా అలా చేస్తే..
Comments
Please login to add a commentAdd a comment