బీఎస్‌ఎన్‌ఎల్‌ ​కొత్త అడుగు.. దేశంలో తొలి D2D | BSNL Viasat successful trial of D2D satellite services for first time in India | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ ​కొత్త అడుగు.. దేశంలో తొలి D2D

Published Thu, Oct 17 2024 8:42 AM | Last Updated on Thu, Oct 17 2024 10:26 AM

BSNL Viasat successful trial of D2D satellite services for first time in India

శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ వయాశాట్‌ (Viasat), ప్రభుత్వ టెల్కో బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) సహకారంతో భారతదేశంలో మొదటిసారిగా డైరెక్ట్-టు-డివైస్ కనెక్టివిటీని తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన ‍ట్రయల్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించింది.

బీఎస్‌ఎన్‌ఎల్‌తో కలిసి వయాశాట్‌ ఇంజనీర్లు ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌లో ఉపగ్రహ ఆధారిత టూ-వే మెసేజింగ్ సేవలను ప్రదర్శించారు. డీటుడీ కనెక్టివిటీ ద్వారా మొబైల్ ఫోన్‌లు, స్మార్ట్ వాచ్‌లు వంటి సాధారణంగా ఉపయోగించే పరికరాలు లేదా కార్లు, పారిశ్రామిక యంత్రాలు, రవాణా సాధనాలను ఎటువంటి ప్రత్యేక హార్డ్‌వేర్ అవసరం లేకుండానే శాటిలైట్‌ నెట్‌వర్క్‌కు అనుసంధానించవచ్చు.

ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్‌ దూకుడు.. ఇక మరింత ‘స్పీడు’

"ఈ ట్రయల్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి నాన్-టెరెస్ట్రియల్ నెట్‌వర్క్ (NTN) కనెక్టివిటీ కోసం వయాసాట్ టూ-వే మెసేజింగ్, ఎస్‌ఓఎస్‌ మెసేజింగ్‌ను ప్రదర్శించింది .దాదాపు 36,000 కి.మీల దూరంలోని వయాశాట్‌ జియోస్టేషనరీ ఎల్‌-బ్యాండ్ శాటిలైట్‌కు ఈ సందేశాలు చేరాయి. వయాశాట్‌ శాటిలైట్‌ నెట్‌వర్క్‌ని ఉపయోగించి సెల్ ఫోన్ కనెక్టివిటీకి శాటిలైట్‌ సేవలు అందించడం సాంకేతికంగా సాధ్యమవుతుందని ఈ ట్రయల్‌ ఫలితం రుజువు చేసింది" అని వయాశాట్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

ఏమిటీ D2D?
డైరెక్ట్ -టు - డివైస్  (D2D) అనేది సాధారణ స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి పరికరాలను ఎటువంటి అదనపు హార్డ్‌వేర్ అవసరం లేకుండా నేరుగా శాటిలైట్ నెట్‌వర్క్‌లకు అనుసంధానించే టెక్నాలజీ. సాంప్రదాయ ఇంటర్నెట్ సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాలు, ఇంటర్నెట్ అంతంత మాత్రమే ఉండే ప్రాంతాల్లో ఈ సాంకేతికత అవాంతరాలు లేని కనెక్టివిటీని అందిస్తుంది.

ప్రయోజనాలివే.. 
» సాంప్రదాయ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలు అందుబాటులో లేని మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీని అందిస్తుంది​
» వినియోగదారులు తమ లొకేషన్‌తో సంబంధం లేకుండా ఇంటర్నెట్ సేవలు, కమ్యూనికేషన్ సాధనాలను యాక్సెస్ చేయగలరు.
» సాంప్రదాయ శాటిలైట్‌ కమ్యూనికేషన్ పద్ధతులతో పోలిస్తే తక్కువ జాప్యంతో వేగవంతమైన డేటా ప్రసారానికి దారితీస్తుంది.
» అందుబాటులో ఉన్న స్పెక్ట్రమ్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు తోడ్పడుతుంది. మొత్తం నెట్‌వర్క్ పనితీరును మెరుగుపరుస్తుంది
» అదనపు హార్డ్‌వేర్ అవసరాన్ని తగ్గిస్తుంది. ఇది కనెక్టివిటీకి మరింత తక్కువ ఖర్చుతో కూడుకున్న పరిష్కారంగా మారుతుంది .
» అత్యవసర సేవలు , సముద్రయానం , విమానయానం వంటి వాటిలో ఉపయోగించుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement