first time
-
రాష్ట్రపతి పాలన తొలిగా ఏ రాష్ట్రంలో ఎందుకు విధించారు?
ఇంఫాల్: మణిపూర్‌లో గురువారం(ఫిబ్రవరి 15) నుంచి రాష్ట్రపతి పాలన విధించారు. దీనికిముందు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. మణిపూర్‌లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొత్త నేత విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోనందున రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. దేశంలో ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారనే విషయానికొస్తే..రాజ్యాంగాన్ని అమలు చేసే యంత్రాంగం విఫలమైనప్పుడు ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలన(President's rule) విధించవచ్చని రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 చెబుతోంది. అలాగే ఆర్టికల్ 356 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వాన్నయినా తొలగించి, ఆ రాష్ట్రాన్ని తన ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రపతి పాలన విధించడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం పరిపాలించలేని స్థితిలో ఉన్నప్పుడు లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సూచనలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైనప్పుడు కేంద్రం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు అవకాశం ఉంది. 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత నుంచి కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 356(Article 356)ను ఉపయోగిస్తూ వస్తోంది.దేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 1951 జూన్ 20న పంజాబ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలిసారిగా ఆర్టికల్ 356ను ఉపయోగించారు. ఆయన పంజాబ్ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించారు. నాడు పంజాబ్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం(Communist government)లో నెలకొన్న అంతర్గత విభేదాలను పరిష్కరించడానికే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతిని విధించారని కొందరు రాజకీయ నిపుణులు చెబుతుంటారు. కాగా అధికారిక రికార్డుల ప్రకారం 1959లో మొదటిసారిగా కేరళలో ఎన్నికైన కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించారు. జవహర్లాల్ నెహ్రూకు కేరళ వామపక్ష ప్రభుత్వం నచ్చకపోవడమే దీనికి ప్రధాన కారణమనే ఆరోపణలున్నాయి. ఇది కూడా చదవండి: బీపీకి ఆయుర్వేద ఔషధం.. త్వరలో అందుబాటులోకి.. -
నేడు రాష్ట్రపతి భవన్లో తొలి పెళ్లి బాజాలు.. వివాహం ఎవరికంటే..
న్యూఢిల్లీ: రాష్గ్రపతి భవన్.. దేశంలోని ప్రముఖ స్మారక నిర్మాణాలలో ఒకటైన ఈ భవన్లో తొలిసారిగా ఈరోజు(బుధవారం) ఒక వివాహ వేడుక జరగనుంది. 300 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ భవనం నాలుగు అంతస్తులతో 340 గదులను కలిగి ఉంది. ఢిల్లీలో ఉన్న ఈ చారిత్రాత్మక భవనం కొన్నేళ్లుగా ఉన్నత స్థాయి అంతర్జాతీయ ప్రముఖులకు ఆతిథ్యం ఇస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు దీనికి భిన్నంగా రాష్టప్రతి భవన్ ఒక వివాహానిక వేదికగా నిలవనుంది. ఫిబ్రవరి 12న రాష్ట్రపతి భవన్‌లోని మదర్ థెరిసా క్రౌన్ కాంప్లెక్స్‌లో ఒక జంట వివాహం చేసుకోబోతోంది. వధూవరులిద్దరూ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)లో పనిచేస్తున్నారు. ఈ వివాహానికి ఇరు కుటుంబాలవారు మాత్రమే హాజరుకానున్నారు. వధువు పేరు పూనమ్ గుప్తా. ఈమె సీఆర్పీఎఫ్లో వ్యక్తిగత భద్రతా అధికారిణి. వరుని పేరు అవనీష్ కుమార్. ఈయన సీఆర్పీఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్.74వ గణతంత్ర దినోత్సవ కవాతులో మహిళా బృందానికి పూనమ్ గుప్తా నాయకత్వం వహించారు. ఆమెకు కాబోయే భర్త అవనీష్ కుమార్ ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. పూనమ్ గుప్తా విధి నిర్వహణలో చూపిన అంకితభావాన్ని గుర్తించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో వారి వివాహానికి అనుమతినిచ్చారు.సీఆర్పీఎఫ్ అధికారిణి పూనమ్ గుప్తా మధ్యప్రదేశ్ నివాసి. గణితంలో గ్రాడ్యుయేషన్ చేశారు. అనంతరం ఆంగ్ల సాహిత్యంలో పీజీ చేశారు. బీఈడీ కూడా పూర్తి చేశారు. 2018లో ఆమె యూపీఎస్సీ సీఆర్పీఎఫ్ పరీక్షలో 81వ ర్యాంకు సాధించారు. బీహార్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో పూనమ్ గుప్తా ప్రశంసనీయమైన సేవలు అందించారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: పోటెత్తిన జనం.. కొనసాగుతున్న మాఘ పూర్ణిమ స్నానాలు -
బీఎస్ఎన్ఎల్ కొత్త అడుగు.. దేశంలో తొలి D2D
శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ వయాశాట్ (Viasat), ప్రభుత్వ టెల్కో బీఎస్ఎన్ఎల్ (BSNL) సహకారంతో భారతదేశంలో మొదటిసారిగా డైరెక్ట్-టు-డివైస్ కనెక్టివిటీని తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన ట్రయల్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించింది.బీఎస్ఎన్ఎల్తో కలిసి వయాశాట్ ఇంజనీర్లు ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ఉపగ్రహ ఆధారిత టూ-వే మెసేజింగ్ సేవలను ప్రదర్శించారు. డీటుడీ కనెక్టివిటీ ద్వారా మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు వంటి సాధారణంగా ఉపయోగించే పరికరాలు లేదా కార్లు, పారిశ్రామిక యంత్రాలు, రవాణా సాధనాలను ఎటువంటి ప్రత్యేక హార్డ్‌వేర్ అవసరం లేకుండానే శాటిలైట్ నెట్‌వర్క్‌కు అనుసంధానించవచ్చు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ దూకుడు.. ఇక మరింత ‘స్పీడు’"ఈ ట్రయల్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి నాన్-టెరెస్ట్రియల్ నెట్వర్క్ (NTN) కనెక్టివిటీ కోసం వయాసాట్ టూ-వే మెసేజింగ్, ఎస్ఓఎస్ మెసేజింగ్‌ను ప్రదర్శించింది .దాదాపు 36,000 కి.మీల దూరంలోని వయాశాట్ జియోస్టేషనరీ ఎల్-బ్యాండ్ శాటిలైట్‌కు ఈ సందేశాలు చేరాయి. వయాశాట్ శాటిలైట్ నెట్వర్క్ని ఉపయోగించి సెల్ ఫోన్ కనెక్టివిటీకి శాటిలైట్ సేవలు అందించడం సాంకేతికంగా సాధ్యమవుతుందని ఈ ట్రయల్ ఫలితం రుజువు చేసింది" అని వయాశాట్ ఒక ప్రకటనలో తెలిపింది.ఏమిటీ D2D?డైరెక్ట్ -టు - డివైస్ (D2D) అనేది సాధారణ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి పరికరాలను ఎటువంటి అదనపు హార్డ్‌వేర్ అవసరం లేకుండా నేరుగా శాటిలైట్ నెట్‌వర్క్‌లకు అనుసంధానించే టెక్నాలజీ. సాంప్రదాయ ఇంటర్నెట్ సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాలు, ఇంటర్నెట్ అంతంత మాత్రమే ఉండే ప్రాంతాల్లో ఈ సాంకేతికత అవాంతరాలు లేని కనెక్టివిటీని అందిస్తుంది.ప్రయోజనాలివే.. » సాంప్రదాయ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలు అందుబాటులో లేని మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీని అందిస్తుంది» వినియోగదారులు తమ లొకేషన్‌తో సంబంధం లేకుండా ఇంటర్నెట్ సేవలు, కమ్యూనికేషన్ సాధనాలను యాక్సెస్ చేయగలరు.» సాంప్రదాయ శాటిలైట్ కమ్యూనికేషన్ పద్ధతులతో పోలిస్తే తక్కువ జాప్యంతో వేగవంతమైన డేటా ప్రసారానికి దారితీస్తుంది.» అందుబాటులో ఉన్న స్పెక్ట్రమ్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు తోడ్పడుతుంది. మొత్తం నెట్వర్క్ పనితీరును మెరుగుపరుస్తుంది» అదనపు హార్డ్‌వేర్ అవసరాన్ని తగ్గిస్తుంది. ఇది కనెక్టివిటీకి మరింత తక్కువ ఖర్చుతో కూడుకున్న పరిష్కారంగా మారుతుంది .» అత్యవసర సేవలు , సముద్రయానం , విమానయానం వంటి వాటిలో ఉపయోగించుకోవచ్చు. -
Independence Day- 2024: ఆ 13 గ్రామాల్లో తొలిసారి మువ్వన్నెల జెండా రెపరెపలు
భారతదేశంలో నేటివరకూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయని కొన్ని ప్రాంతాలు ఉన్నాయని తెలిస్తే ఎవరికైనాసరే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఇది నిజం.. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత బస్తర్ ప్రాంతంలోని 13 గ్రామాల్లో నేటి వరకూ జాతీయ జెండాను ఎగురవేయలేదు. ఈరోజు (పంద్రాగస్టు) ఈ గ్రామాల్లో మువ్వన్నెల జండా రెపరెపలాడనుంది.ఈ వివరాలను రాష్ట్ర పోలీసు అధికారులు మీడియాకు తెలియజేశారు. ఈ గ్రామాల్లో నూతన భద్రతా బలగాల శిబిరాలు ఏర్పాటు చేసిన దరిమిలా అభివృద్ధికి మార్గం సుగమమైందన్నారు. బస్తర్ రీజియన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పీ సుందర్రాజ్ ఈరోజు (గురువారం) నెర్‌ఘాట్ (దంతెవాడ జిల్లా), పానిదోబిర్ (కంకేర్), గుండం, పుట్కేల్, చుత్వాహి (బీజాపూర్), కస్తూర్‌మెట్ట, మస్పూర్, ఇరాక్‌భట్టి, మొహంది (నారాయణపూర్), టేకలగూడెం, పువర్తి, లఖపాల్, పూలన్‌పాడ్ (సుక్మా) గ్రామాల్లో తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు.గత ఏడాది గణతంత్ర దినోత్సవాల అనంతరం ఈ ప్రాంతాల్లో భద్రతా శిబిరాలను ఏర్పాటు చేసినట్లు సుందర్రాజ్ మీడియాకు తెలిపారు. కొత్త క్యాంపుల ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతానికి కొత్త గుర్తింపు వచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాజధాని రాయ్‌పూర్‌తో సహా అన్ని జిల్లాల్లో సన్నాహాలు పూర్తి చేశారు. గురువారం ఉదయం రాయ్‌పూర్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి జాతీయ జెండాను ఎగురవేయనున్నారని అధికారులు తెలిపారు. -
తొలిసారి మెట్లదారిలో తిరుమల కొండెక్కిన యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
-
దేశంలో పెరిగిన ప్రధాన రిజర్వాయర్ల నీటిమట్టం
దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) శుభవార్త చెప్పింది. గత ఏడాది సెప్టెంబర్ తర్వాత దేశంలోని ప్రధాన జలాశయాల నీటిమట్టం తొలిసారిగా పెరిగిందని సీడబ్ల్యూసీ పేర్కొంది. అయితే స్వల్పంగానే నీటిమట్టం పెరగడంతో జలమండలి ఆందోళన వ్యక్తం చేస్తోంది.భారతదేశంలోని 150 రిజర్వాయర్లను పర్యవేక్షించే సీడబ్ల్యూసీ తాజా సమాచారాన్ని మీడియాకు వెల్లడించింది. 150 రిజర్వాయర్లలో 20 జలవిద్యుత్ ప్రాజెక్టులకు ఉపయుక్తమవుతున్నాయి. వీటి మొత్తం నిల్వ సామర్థ్యం 35.30 బిలియన్ క్యూబిక్ మీటర్లు (బీసీఎం. గత సంవత్సరం ఇదే కాలంలో అందుబాటులో ఉన్న నిల్వ 44.06 బీసీఎం. సాధారణ నిల్వ స్థాయి 50.422 బీసీఎం. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్‌లలో మొత్తం 19.663 బీసీఎం నిల్వ సామర్థ్యంతో 10 రిజర్వాయర్లు ఉన్నాయి. ఇవి సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో ఉన్నాయి.అసోం, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, త్రిపుర, నాగాలాండ్, బీహార్‌లతో సహా తూర్పు ప్రాంతంలో 23 రిజర్వాయర్లు ఉన్నాయి. వీటి మొత్తం నిల్వ సామర్థ్యం 20.430 బీసీఎం. ప్రస్తుత నిల్వ 3.979 బీసీఎం (19 శాతం). ఇది గత సంవత్సరం కంటే 20 శాతం తక్కువ. గుజరాత్, మహారాష్ట్రలోని పశ్చిమ ప్రాంతంలో 49 రిజర్వాయర్లు ఉన్నాయి. వీటి మొత్తం నిల్వ సామర్థ్యం 37.130 బీసీఎం. ప్రస్తుతం నిల్వ 7.949 బీసీఎం (21 శాతం). గత సంవత్సరం ఇది 27 శాతం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సహా మధ్య ప్రాంతంలో 26 రిజర్వాయర్లు ఉన్నాయి. వీటిలో 48.227 బీసీఎం నిల్వ సామర్థ్యం ఉంది. ప్రస్తుత నిల్వ 12.26 బీసీఎం(25 శాతం). గత సంవత్సరం ఇది 35 శాతం.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుతో సహా దక్షిణ ప్రాంతంలో 42 రిజర్వాయర్లు ఉన్నాయి. మొత్తం నిల్వ సామర్థ్యం 53.334 బీసీఎం. నిల్వ ఇప్పుడు 10.152 బీసీఎం (19.03 శాతం) వద్ద ఉంది. గత సంవత్సరం 19.43 శాతం. తాద్రీ నుంచి కన్యాకుమారి వరకు బ్రహ్మపుత్ర, సబర్మతి, పశ్చిమాన ప్రవహించే నదులలో సాధారణ నీటి నిల్వ కంటే మెరుగ్గా ఉన్నాయి. సింధు, సువర్ణరేఖ, మహి తదితర నదుల్లో నీటి నిల్వలు సాధారణ స్థాయికి చేరువలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మహానది, కావేరి, బ్రాహ్మణి, వైతరణి నదులో తక్కువ నీటి నిల్వలు నమోదయ్యాయి. -
Yoga Day: తొలిసారి వ్యోమగాముల యోగాసనాలు
అంతర్జాతీయ యోగా దినోత్సవం(జూన్ 21) నాడు తొలిసారిగా వ్యోమగాములు కూడా యోగాసనాలు వేయనున్నారు. ఇందుకోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ‘యోగా ఫర్ స్పేస్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొననున్నారు.అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో భారీ కార్యక్రమం జరగనుంది. దీనిలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఆరోజు వేలాది మంది యోగాభ్యాసకులతో పాటు ప్రధాని మోదీ కూడా యోగాసనాలు వేయనున్నారు. ఈ సందర్భంగా యూనియన్ ఆయుష్ సెక్రటరీ రాజేష్ కోటేచా మాట్లాడుతూ గత 10 ఏళ్లలో యోగా దినోత్సవం నాలుగు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నెలకొల్పిందని తెలిపారు. 2015లో 35,985 మంది భారతీయులు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి రాజ్‌పథ్‌లో యోగా చేశారు. ఈ యోగా సెషన్లో మొత్తం 84 దేశాలు పాల్గొన్నాయి.2015లో రాజస్థాన్‌లోని కోటాలో 1.05 లక్షల మంది ఒకేసారి యోగా సాధన చేశారు. 2023లో మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రపంచంలోని 23.4 కోట్ల మంది పాల్గొన్నారు. దృష్టిలోపం కలిగినవారు యోగాను సులభంగా నేర్చుకోవడానికి ఇటీవల బ్రెయిలీ స్క్రిప్ట్‌ను రూపొందించారు. అలాగే ‘ప్రొఫెసర్ ఆయుష్మాన్’ పేరుతో పిల్లలు యోగాసనాలు నేర్చుకునేందుకు కామిక్ పుస్తకాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. -
Lok Sabha Election Results 2024: ఏకంగా 280 కొత్త ముఖాలు
న్యూఢిల్లీ: పద్దెనిమిదో లోక్‌సభలో ఏకంగా 280 మంది ఎంపీలు మొదటిసారిగా దిగువసభకు ఎన్నికైన వారున్నారు. ఇందులో మాజీ సీఎంలు, సినీ తారలు, వారసులు, హైకోర్టు మాజీ జడ్డి తదితరులున్నారు. అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ నుంచి ఏకంగా 45 కొత్తముఖాలు కనిపించునున్నాయి. వీరిలో టీవీ రాముడు అరుణ్ గోవిల్, జెయింట్ కిల్లర్ కిశోరీలాల్ శర్మ, దళిత హక్కుల ఉద్యమకారుడు చంద్రశేఖర్ ఆజాద్ తదితరులున్నారు. మహారాష్ట్రలో 48 స్థానాలుండగా 33 మంది తొలిసారిగా ఎంపీలుగా గెలిచారు. స్కూల్ టీచర్ భాస్కర్ భాగ్రే ఎన్సీపీ (పవార్) తరఫున ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం డిండోరి నుంచి గెలుపొందారు. పీయూష్ గోయల్ కూడా లోక్‌సభకు రావడం ఇదే తొలిసారి. మాజీ ముఖ్యమంత్రులు నారాయణ్ రాణే (మహారాష్ట్ర), త్రివేంద్ర సింగ్ రావత్ (ఉత్తరాఖండ్), మనోహర్‌లాల్ ఖట్టర్ (హరియాణా), బిప్లవ్‌కుమార్ దేవ్ (త్రిపుర), జితిన్‌రామ్ మాంఝి (బిహార్), బస్వరాజ బొమ్మై (కర్నాటక), జగదీశ్ షెట్టర్ (కర్నాటక), చరణ్‌జిత్ సింగ్ చన్నీ (పంజాబ్)లు తొలిసారిగా దిగువసభలో అడుగుపెట్టనున్నారు. సినీ తారల్లో సురేష్ గోపి (త్రిసూర్), కంగనా రనౌత్ (మండి)లు తొలిసారి నెగ్గినవారే. రాజకుటుంబీకుల్లో ఛత్రపతి సాహు (కొల్హాపూర్), యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ (మైసూర్), కీర్తి దేవి దేవ్బర్మన్ (త్రిపుర ఈస్ట్)లు, ఎన్నికలకు ముందు హైకోర్టు జడ్జి పదవికి రాజీనామా చేసి బీజేపీ టికెట్‌పై పశి్చమబెంగాల్‌లోని తమ్లుక్ నుంచి పోటీ చేసిన గెలిచిన అభిజిత్ గంగోపాధ్యాయ్లు మొదటిసారి ఎంపీలుగా గెలిచిన వారే. ముస్లిం ఎంపీలు 24 మంది నూతన లోక్‌సభకు 24 మంది ముస్లిం ఎంపీలు ఎన్నికయ్యారు. మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ (టీఎంసీ), అసదుద్దీన్ ఓవైసీ, అస్సాంలో 10 లక్షల పైచిలుకు మెజారిటీతో నెగ్గిన కాంగ్రెస్ అభ్యర్థి రకీబుల్ హుస్సేన్‌లు ఉన్నారు. ఈసారి మొత్తం 78 మంది ముస్లిం అభ్యర్థులు పోటీచేయగా 24 మంది గెలిచారు. కిందటి లోక్‌సభలో 26 మంది ముస్లిం ఎంపీలు ఉండగా.. ఈసారి వారి సంఖ్య రెండు తగ్గింది. కాంగ్రెస్ నుంచి అత్యధికంగా ఏడుగురు ముస్లిం ఎంపీలు ఎన్నికకాగా, తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఐదుగురు, సమాజ్‌వాది నుంచి నలుగురు, ఇండియన్ ముస్లిం లీగ్ నుంచి ముగ్గురు ముస్లింలు ఎంపీలుగా గెలిచారు. -
పాక్‌లో బ్రిగేడియర్‌గా తొలిసారి... మైనారిటీ మహిళ
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో మైనారిటీ వర్గానికి చెందిన తొలి మహిళా బ్రిగేడియర్‌గా హెలెన్ మేరీ రాబర్ట్స్ చరిత్ర నెలకొల్పారు. ఆమె 26 ఏళ్లుగా సైన్యంలో పని చేస్తున్నారు. ప్రస్తుతం మెడికల్ కార్ప్స్లో సీనియర్ పాథాలజిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పాక్ జనాభాలో 96.47 శాతం మంది ముస్లింలే. హిందువులు 2.14%, క్రైస్తవులు 1.27% దాకా ఉంటారు. -
నాడు దూరదర్శన్‌లో తొలిసారి ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు..
2024 లోక్‌సభ ఎన్నికలు ముగుస్తున్న తరుణంలో ఈనెల 4న వెలువడబోయే ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మనకు టీవీల్లో లేదా స్మార్ట్ఫోన్లలో ఎన్నికల ఫలితాలను చూసే అవకాశం ఉంది. అయితే ఒకప్పుడు ఎన్నికల్లో ఎవరు గెలిచారో తెలుసుకునేందుకు మరుసటి రోజు వచ్చే వార్తాపత్రికల కోసం వేచి ఉండాల్సి వచ్చేది. అయితే ‘సత్యం శివం సుందరం’ నినాదంతో మనముందుకొచ్చిన దూరదర్శన్ ఎన్నికల ఫలితాలను తెలుసుకునేందుకు మరుసటి రోజు వరకూ వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చేసింది. 1971 ఎన్నికల ఫలితాలు దూరదర్శన్‌లో మొదటిసారి ప్రసారమయ్యాయి. నాటి ఎన్నికలు ఎంతో ఉత్కంఠభరితంగా సాగాయి. దీనికి కారణం అప్పటివరకూ ఐక్యంగా ఉన్న కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. దీంతో ఫలితాలపై దేశ ప్రజలకు ఎక్కడలేని ఆసక్తి ఏర్పడింది. నాటి ఎన్నికల్లో పలు రాజకీయ పార్టీలు ఉనికిలోకి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ పండిట్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రిల మరణానంతరం విచ్ఛిన్నమైంది. నాటి నేత కామరాజ్ నాయకత్వంలో కాంగ్రెస్ (ఓ), ఇందిరా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ (ఐ) ఏర్పడ్డాయి. ఎన్నికల ఫలితాలు ఇందిరా గాంధీ వర్గంలోని కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చాయి. భారీ మెజారిటీతో ఇందిరా గాంధీ ప్రధాని అయ్యారు.దూరదర్శన్ 1959 సెప్టెంబర్ 15న ప్రారంభమైంది. తొలినాళ్లలో మన దేశంలో టీవీని కొనుగోలు చేయడం సంపన్న కుటుంబాలకే పరిమితమయ్యింది. తరువాత టీవీలు క్రమక్రమంగా ప్రజలకు చేరువయ్యాయి. 1970 నాటికి ప్రభుత్వ కార్యక్రమాలను దూరదర్శన్ ముమ్మరంగా ప్రసారం చేయడం ప్రారంభించింది. అలాగే భారతదేశంలోని విస్తృత ఎన్నికల రంగంలోకి ప్రవేశించింది. 1971 ఎన్నికల ఫలితాలు దూరద్శన్లో ప్రసారమైనప్పుడు జనం ఎంతో ఆసక్తిగా గమనించారు. -
Droupadi Murmu In Ayodhya: అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (ఫొటోలు)
-
ఓటు వేస్తే టిఫిన్, తొలిసారైతే ఐస్‌క్రీమ్ కూడా..
దేశంలో ఎన్నికల పండుగ జరుగుతోంది. ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు ఓటు కోసం ఓటరు దేవుళ్లను వేడుకుంటున్నారు. అదేసమయంలో ఎన్నికల సంఘంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు ఓటు విలువపై అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు స్థానిక స్వచ్ఛంద సంస్థలు, దుకాణాలు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాయి. మే 13న ఇండోర్‌లో ఓటింగ్ జరగనుంది. ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహం అందించేందుకు స్థానిక ఫుడ్ మార్కెట్లలో ప్రత్యేక రాయితీలు అందిస్తున్నారు. మరోవైపు వేసవిని దృష్టిలో ఉంచుకుని ఓటర్లకు ఉపశమనం కలిగించేలా ప్రత్యేక ఏర్పాటు చేయనున్నారు. ఓటింగ్ జరిగే రోజున ఓటర్లకు ఉచితంగా ఐస్ క్రీం, పోహా, జలేబీ, శీతల పానీయాలు, ఇతర తినుబండారాలు అందించనున్నారు. ఈ ఆఫర్లలో వివిధ కేటగిరీలు, ఎంపికలు ఉన్నాయి. జిల్లా యంత్రాంగం వివిధ దుకాణాలకు ఇందుకు అనుమతులు మంజూరు చేసింది. అయితే ఓటర్లు ఈ విధమైన ప్రయోజనం పొందేందుకు తమ ఓటరు కార్డుతో పాటు వారి వేలిపై ఇంక్ గుర్తును చూపించాల్సి ఉంటుంది.అంతే కాదు తొలిసారి ఓటు వేయబోతున్న యువతకు ప్రత్యేక ఆఫర్‌ను కూడా ప్రకటించారు. పోలింగ్ జరిగే రోజున ఉదయం 9 గంటలలోపు ఓటు వేసే యువత, సీనియర్ సిటిజన్లకు పోహా, జిలేబీ, ఐస్ క్రీంలను ఉచితంగా అందించనున్నారు. అలాగే మంచూరియా, నూడుల్స్ కూడా ఉచితంగా అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి తోడు ఇండోర్‌లోని కొన్ని షాపింగ్ మాల్స్‌లో పోలింగ్ జరిగే రోజున పలు వస్తువులపై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు. -
మిస్ యూనివర్స్ పోటీలో తొలిసారి సౌదీ సుందరి
రియాద్: ఇస్లాం సంప్రదాయవాదానికి చిరునామాగా నిలిచే సౌదీ అరేబియా నుంచి ఒక ముద్దుగుమ్మ మిస్ యూనివర్స్ పోటీలకు సిద్ధమైంది. సౌదీ నుంచి ఇలా ఒక అమ్మాయి అంతర్జాతీయ అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహించడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. త్వరలో మలేసియాలో జరగబోయే విశ్వసుందరి పోటీల్లో తాను సౌదీ తరఫున పాల్గొనబోతున్నట్లు 27 ఏళ్ల మోడల్ రూబీ అల్ఖాతానీ సోమవారం ప్రకటించారు. సౌదీలోని రియాద్ నగరం ఈమె స్వస్థలం. ఇప్పటికే పలు అందాల పోటీల్లో పాల్గొన్నారు. కొద్ది వారాల క్రితం మలేసియాలో జరిగిన మిస్ అండ్ మిసెస్ గ్లోబల్ ఏషియన్లోనూ పాలుపంచుకున్నారు. ప్రపంచ సంస్కృతులపై అవగాహన పెంచుకుంటూనే మా సౌదీ సంప్రదాయాలు, సంస్కృతి, వారసత్వాన్ని విశ్వ వేదికలపై వివరిస్తా’ అని అరబ్ న్యూస్‌తో రూబీ అన్నారు. ఇప్పటికే మిస్ సౌదీ అరేబియా కిరీటాన్ని దక్కించుకున్న ఈమె మిస్ మిడిల్ ఈస్ట్(సౌదీ అరేబియా), మిస్ అరబ్ వరల్డ్ పీస్–2021, మిస్ ఉమెన్(సౌదీ అరేబియా) టైటిళ్లను గెలుపొందారు. ఈమెకు ఇన్‌స్టా గ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈమె మోడల్‌గానే కాదు కంటెట్ క్రియేటర్ గానూ రాణిస్తున్నారు. కఠిన ఆంక్షలతో ఫక్తు సంప్రదాయవాదిగా పేరుమోసిన 38 ఏళ్ల సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఇటీవలి కాలంలో సౌదీని సంస్కరణల బాటలో పయనింపజేస్తున్నారు. మహిళల డ్రైవింగ్‌కు, పురుషుల పార్టీలకు వెళ్లేందుకు, పురుష సంరక్షులు లేకున్నా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించారు. పూర్తి మద్యనిõÙధం అమల్లో ఉండే సౌదీలో తొలిసారిగా దౌత్యకార్యాలయాలుండే ప్రాంతంలో మద్యం అమ్మకాలకు అనుమతి మంజూరు చేశారు. -
సర్జరీ తర్వాత కెమెరా కంటపడిన బ్రిటన్ యువరాణి?
బ్రిటీష్ రాజకుటుంబానికి చెందిన కోడలు కేట్ మిడిల్టన్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటి మధ్య కేట్ మిడిల్టన్ మొదటిసారిగా బహిరంగంగా కనిపించారు. కేట్ మిడిల్టన్ ఇటీవల తన భర్త ప్రిన్స్ విలియమ్‌తో కలిసి లండన్ సమీపంలోని విండ్సర్ ఫార్మ్స్ లో కనిపించారు. బ్రిటీష్ మీడియా నివేదికల ప్రకారం కేట్ మిడిల్టన్ ఆ సమయంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆమె బహిరంగంగా కనిపించడంపై బ్రిటిష్ మీడియా హర్షం వ్యక్తం చేసింది. బ్రిటిష్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ప్రిన్స్ విలియం, ప్రిన్సెస్ కేట్ మిడిల్టన్ షాపింగ్ చేస్తూ కనిపించారు. దీనిపై బ్రిటన్ మీడియా సంతోషం వ్యక్తం చేస్తూ ‘కేట్.. మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉంది’ అని రాసింది. కొన్ని మీడియా సంస్థలు ఈ జంటకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాయి. ఒక క్రీడా కార్యక్రమానికి కేట్ మిడిల్టన్ తన భర్త, ముగ్గురు పిల్లలతో పాటు హాజరయ్యారని ఓ బ్రిటిష్ వార్తాపత్రిక పేర్కొంది. కేట్ మిడిల్టన్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ కారణంగా ఆమె గత ఏడాది చివరి నుండి బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఇటీవల మదర్స్ డే సందర్భంగా కేట్ మిడిల్టన్ ఫోటో రివీల్ అయ్యింది. అయితే అది వివాదాస్పదంగా మారింది. అప్పటి నుండి మిడిల్టన్ ఆరోగ్యంపై పుకార్లు వెల్లువెత్తాయి. దీనికితోడు బ్రిటిష్ రాజభవనమైన కెన్సింగ్టన్ ప్యాలెస్‌లోని పలువురు ఉద్యోగులు తాము కేట్‌ను చాలా రోజులుగా చూడలేదని పేర్కొన్నారు. దీంతో ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. I edited the video to enhance the image quality, and it's definitely #PrincessCatherine in the footage.#RoyalFamily #PrincessofWales pic.twitter.com/4yOdGwQ0Vm — Royal Gossip 🇬🇧 (@UKRoyalGossip) March 19, 2024 -
మూడు దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి..
రానున్న లోక్ సభ ఎన్నికలు పలు విశేషాలు, ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జరగనున్న 2024 లోక్‌సభ ఎన్నికలు అత్యంత సుదీర్ఘంగా జరగనున్నాయి. జూన్ 1న చివరి దశ ఓటింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు జూన్ నెలలో పోలింగ్ జరగడం మూడు దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. దేశంలో మొదటి లోక్‌సభ ఎన్నికలు జరిగిన 1951-52 తర్వాత ఇవే సుదీర్ఘమైన లోక్‌సభ ఎన్నికలు. 1951 అక్టోబర్ 25 నుంచి 1952 ఫిబ్రవరి 21 మధ్య దాదాపు నాలుగు నెలల పాటు లోక్‌సభకు మొదటి సార్వత్రిక ఎన్నికలు 68 దశల్లో జరిగాయి. 1991లో జూన్‌లో ఓటింగ్ 1991లో మాత్రమే లోక్‌సభ ఎన్నికలు జూన్ నెలలో జరిగాయి. ఆ సంవత్సరం మార్చి 13న కేంద్రంలోని ప్రధానమంత్రి చంద్రశేఖర్ నేతృత్వంలోని ప్రభుత్వం రద్దయిన తర్వాత మే 20, జూన్ 12, జూన్ 15 తేదీల్లో ఓటింగ్ జరిగింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా మూడు రాష్ట్రాల్లో పోలింగ్ వాయిదా పడింది. గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో ఎప్పుడూ ఎన్నికలు మే నెల తర్వాత జరగలేదు. 2019లో పోలింగ్ చివరి తేదీ మే 19 కాగా ఫలితాలు మే 23న వెల్లడయ్యాయి. 2014లో ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు మే 12 వరకు జరిగాయి. ఫలితాలు మే 16న ప్రకటించారు. 2009లో చివరి దశ పోలింగ్ మే 13న జరిగింది. -
‘హస్తం’, ‘చర్ఖా’ లేకున్నా ఇందిర ప్రభంజనం!
స్వతంత్ర భారతావనిలో జరిగిన ఐదవ సాధారణ ఎన్నికలు దేశంలో ఎన్నికల ప్రక్రియ రూపురేఖలను మార్చివేశాయి. 1971 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ హవాను దేశమంతా చూసింది. ఆమె నేతృత్వంలోని పార్టీ లోక్‌సభలో మొత్తం 545 స్థానాలకు గానూ 352 సీట్లు గెలుచుకుంది. నాడు కాంగ్రెస్ (ఓ)కి 16 సీట్లు మాత్రమే దక్కాయి. ఈ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలైంది. ఇందిర కాంగ్రెస్ (ఐ) పేరుతో ఎన్నికల బరిలోకి దిగారు. కాంగ్రెస్‌లోని వృద్ధ నాయకులకు వ్యతిరేకంగా తన సత్తా చాటారు. 1951-1952లో స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఈ ఎన్నికల సంప్రదాయం 1960ల చివరి వరకు కొనసాగింది. అయితే పలు అసెంబ్లీ స్థానాల పదవీకాలం ఇంకా ముగియకపోవడంతో ఎన్నికల తేదీలను ఏడాది పాటు వాయిదా వేయడం వల్ల జాతీయ, రాష్ట్ర షెడ్యూళ్లను వేరు చేయాల్సి వచ్చింది. 1971లో లోక్‌సభ ఎన్నికలకు మార్చి 1-10 తేదీల మధ్య ఎన్నికలు జరిగాయి. 15,12,96,749 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సంఖ్య 1967 లోక్‌సభ ఎన్నికల కంటే 30 లక్షలు తక్కువ కావడం విశేషం. నాడు 518 స్థానాలకు గాను 2,784 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మారిన గుర్తుతో ఇందిర ఎన్నికల్లో పోటీ చేశారు. స్వాతంత్య్రానంతరం మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా (కాంగ్రెస్ ‘ఆర్), కాంగ్రెస్ (ఓ)) విడిపోయినప్పుడు జరిగిన మొదటి ఎన్నికలివి. ఇందిరా గాంధీ నేతృత్వంలోని పార్టీ ఎన్నికల గుర్తు ఆవు, పాలు తాగుతున్న దూడ. కాంగ్రెస్ (ఓ) ఎన్నికల గుర్తు చర్ఖా తిప్పుతున్న మహిళ. -
కేరళ చరిత్రలో ఓ ట్రాన్స్ జెండర్ తొలిసారిగా శబరిమల..
సూర్యపేట: కేరళ చరిత్రలో ఓ ట్రాన్స్ జెండర్ తొలిసారి శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో జరిగే బ్రహోత్సవాలకు, ప్రతి అమావాస్యకు విచ్చేసే ట్రాన్‌జెండర్ జోగిని నిషా క్రాంతి ఆదివారం శబరిమల అయ్యప్ప ఆలయంలో స్వామివారిని దర్శించుకుంది. ట్రాన్స్ జెండర్ ఐడీ ఆధారంగా ఆమెకు కేరళ ప్రభుత్వం దర్శనానికి అనుమతిచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రాన్స్ జండర్లు చాలా మంది అయప్ప మాల ధరించి స్వామిని దర్శించుకోవాలని అనుకుంటున్నారని చెప్పింది. తనకు దర్శనం కల్పించిన కేరళ ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఇది ఒక శుభ పరిణామమని.. తాను కూడా అందరిలాగే శబరిమల కొండ ఎక్కి అయ్యప్పను దర్శించుకోవడంతో తన జన్మ ధన్యం అయిందని పేర్కొంది. ఇవి చదవండి: New year 2024: సరి ‘కొత్తగా’ సాగుదాం! -
పాక్ ఎన్నికల్లో తొలిసారిగా హిందూ మహిళ
పెషావర్: ముస్లింల ఆధిపత్యముండే పాకిస్తాన్లో ఫిబ్రవరిలో జరగబోయే దేశ సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలిసారిగా ఒక హిందూ మహిళ పోటీకి నిలబడింది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలోని పీకే–25 పార్లమెంట్ స్థానం నుంచి సవీరా పర్కాశ్ అనే మహిళ పోటీచేస్తున్నారు. హిందువు అయిన సవీరా వృత్తిరీత్యా వైద్యురాలు. పాకిస్తాన్ పీపుల్స్ పారీ్ట(పీపీపీ) తరఫున బునేర్ జిల్లాలో ఆమె నామినేషన్ దాఖలుచేశారు. -
తొలిసారి ఎమ్మెల్యేలు వీరే..!
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి తొలిసారిగా పలువురు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. గతంలో పోటీచేసి ఓడిపోయిన వాళ్లు, ఈ ఎన్నికల్లోనే తొలిసారి పోటీచేసిన వాళ్లలో కొందరిని ప్రజలు దీవించారు. వీరిలో అతి చిన్న వయసు వాళ్లు కూడా ఉండటం విశేషం. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో పాలకుర్తిలో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన యశస్వినిరెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై 8 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మెదక్ నుంచి పోటీచేసిన మైనంపల్లి రోహిత్‌రావు ప్రత్యర్థి బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిపై గెలుపొందారు. వేములవాడలో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన ఆదిశ్రీనివాస్ విజయం సాధించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో మక్కాన్‌సింగ్ రాజ్ ఠాగూర్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కంటోన్మెంట్ నుంచి మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాగార్జునసాగర్ నుంచి కాంగ్రెస్ సీనియర్‌నేత జానారెడ్డి కుమారుడు జయవీర్‌రెడ్డి నాగార్జునసాగర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాగర్‌కర్నూల్ జిల్లా నాగర్‌కర్నూల్ నుంచి కూచకుళ్ల రాజేష్‌రెడ్డి ఫస్ట్‌టైమ్ ఎమ్మెల్యేగా గెలవగా ఇదే జిల్లా నుంచి కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కలకుంట్ల మదన్మోహన్రావు తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నుంచి ముందుల శామ్యూల్ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం అందుకున్నారు. యాదాద్రి భువనగరి జిల్లా ఆలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల అయిలయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయన తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. గతంలో ఖమ్మం ఎంపీగా పనిచేసిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాలేరు నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయనకు కూడా ఫస్ట్‌టైమ్ అధ్యక్షా అనే ఛాన్స్ వచ్చింది. -
రైల్లో సీటు కింద... విమానంలో నెత్తి మీద
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తాజా సీజన్ లో కోల్‌కతాకు చెందిన ఒక గృహిణి తాను నవ్వడమే కాక అమితాబ్‌ను విపరీతంగా నవ్వించింది. కేబీసీ వల్ల మొదటిసారి విమానం ఎక్కిన ఆమె రైల్లోలాగా చీటికి మాటికి సీటు కింద చూసుకుంటూ లగేజీ ఉందా లేదాననే హైరానా విమానంలో లేకపోవడం తనకు నచ్చిందని చెప్పింది. ఇంకా సరదా కబుర్లు చెప్పి అమితాబ్‌ను నవ్వించిన అలోకిక భట్టాచార్య వైరల్ వీడియో గురించి.... సోనీ టీవీలో ప్రసారమవుతున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తాజా సిరీస్ తాజా ఎపిసోడ్లో కోల్‌కటాకు చెందిన అలోకిక భట్టాచార్య అనే గృహిణి అమితాబ్‌నే కాక ప్రేక్షకులను చాలా నవ్వించింది. ఆమె క్లిప్పింగ్‌ను అమితాబ్‌తో పాటు ఇతరులు ‘ఎక్స్’లో షేర్ చేయడంతో నెటిజన్లు ముచ్చటపడుతున్నారు. గత 17 ఏళ్లుగా ప్రయత్నిస్తే ఇప్పటికి కేబీసీలో పాల్గొనే అవకాశం దొరికిన అలోకిక ‘జై కేబీసీ’ నినాదంతో హాట్సీట్లో కూచుంది. ‘మీ ప్రయాణం ఎలా సాగింది?’ అని అమితాబ్ అడిగితే ‘కేబీసీ పుణ్యమా అని మొదటిసారి విమానం ఎక్కాను. మాలాంటి వాళ్లం రైలెక్కి ప్రతి పది నిమిషాలకూ ఒకసారి సీటు కింద లగేజ్ ఉందా లేదా చూసుకుంటాం. అర్ధరాత్రి మెలకువ వచ్చినా మొదట సీటు కిందే చూస్తాం. విమానంలో ఆ బాధ లేదు. లగేజ్ నెత్తి మీద పెట్టారు. పోతుందనే భయం వేయలేదు’ అనేసరికి అమితాబ్ చాలా నవ్వాడు. ‘కేబీసీ వాళ్లు ఎలాంటి ప్రశ్నలు వెతికి ఇస్తున్నారంటే నేనసలు ఏమైనా చదువుకున్నానా అని సందేహం వస్తోంది’ అని నవ్వించిందామె. ‘నువ్విలా నువ్వుతుంటే మీ అత్తగారు ఏమీ అనదా?’ అంటే ‘అంటుంది. కాని నేను నా జీవితంలో జరిగిన మంచి విషయాలు గుర్తు తెచ్చుకుని ఎప్పుడూ నవ్వుతుంటాను. అదే నా ఆరోగ్య రహస్యం. మూడు పూటలా అన్నం, పప్పు, చేపలు తింటూ కూడా సన్నగా ఎలా ఉన్నానో చూడండి. ఫ్రీగా. కొంతమంది ఇలా ఉండటానికి డబ్బు కట్టి జిమ్ చేస్తుంటారు’ అని నవ్వించిందామె. అలోకిక ఈ ఆటలో పన్నెండున్నర లక్షలు గెలిచి ఆట నుంచి విరమించుకుంది. ఆ మొత్తం ఆమెకు చాలా ముఖ్యమైనదే. కాని అమితాబ్‌తో నవ్వులు చిందించడం అంతకంటే ముఖ్యంగా ఆమె భావించింది. This clip of #KBC is so very endearing! Her innocent, Joyous State of being is infectious. @SrBachchan Sahab is equally amazing.. Now Watch it and get infected with Joy! pic.twitter.com/5ylvrUGhlH — Adil hussain (@_AdilHussain) December 1, 2023 -
ముగిసిన త్రైపాక్షిక నౌకాదళ విన్యాసాలు
సాక్షి, విశాఖపట్నం: భారత్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా దేశాల మధ్య తొలిసారిగా జరిగిన త్రైపాక్షిక నౌకాదళ విన్యాసాలు శుక్రవారంతో ముగిశాయి. ఇండో–పసిఫిక్ సముద్ర జలాల్లో ఈ నెల 20న మారిటైమ్ విన్యాసాలు మొదలయ్యాయి. భారత నౌకాదళం స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఐఎన్ఎస్ సహ్యాద్రి యుద్ధనౌక భారత్‌కు ప్రాతినిధ్యం వహించగా.. రాయల్ ఆస్ట్రేలియా, ఇండోనేషియా దేశాలకు చెందిన యుద్ధనౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. మూడు దేశాల మధ్య భాగస్వామ్యం బలోపేతం చేయడం, సామర్థ్యాల్ని మెరుగుపరిచేందుకు పరస్పర సహకారంతోపాటు ఇండో– పసిఫిక్ సముద్ర జలాల్లో స్థిరమైన శాంతియుత వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా ఈ త్రైపాక్షిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. చివరి రోజున వ్యూహాత్మక విన్యాసాలు, క్రాస్‌డెక్ ఆపరేషన్స్, హెలికాప్టర్ల క్రాస్‌డెక్ ల్యాండింగ్ తదితర విన్యాసాలు నిర్వహించారు. -
‘ఆఖరి సచ్’ కథ విన్నప్పుడు నేను షాక్ అయ్యాను
తమన్నా నటించిన తాజా వెబ్‌సిరీస్ ‘ఆఖరి సచ్’. 2018లో ఢిల్లీలో బూరారిప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన పదకొండుమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనలతో ‘ఆఖరి సచ్’ రూపొందింది. తమన్నా, అభిషేక్ బెనర్జీ, శివిన్ నారంగ్, రాహుల్ బగ్గా లీడ్ రోల్స్‌లో రాబీ గ్రేవాల్ దర్శకత్వం వహించారు. ఈ నెల 25 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ– ‘‘ఇందులో అన్య అనే ఇన్వేస్టిగేటివ్ పొలీసాఫీసర్ పాత్రలో నటించాను. ‘ఆఖరి సచ్’ కథ విన్నప్పుడు నేను షాక్ అయ్యాను. ఈ సిరీస్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నా కెరీర్లో తొలిసారిగా ఓ పొలీసాఫీసర్ పాత్రలో నటించాను. అలాగే నా కంఫర్ట్‌జోన్ దాటి చాలా ఎమోషన్స్‌తో కూడు కున్న అన్య పాత్రలో నటించాను’’ అని చెప్పుకొచ్చారు తమన్నా. -
100 శాతం ఆర్‌పీఈటీ బాటిళ్లు.. దేశంలో ఫస్ట్ టైమ్!
సాక్షి, న్యూఢిల్లీ: కోకా–కోలా సంస్థ 100 శాతం రీసైకిల్డ్ ప్లాస్టిక్ మెటిరీయల్ (ఆర్‌పీఈటీ) తో రూపొందించిన కిన్లే సీసాలను తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి విడుదల చేసింది. 100శాతం ఆర్పీఈటీతో రూపొందించిన సీసాను ఆహారం/పానీయాల కోసం ఉపయోగించడం దేశంలో ఇదే మొదటిసారి అని సంస్థ ప్రతినిధులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యర్థాలు లేని ప్రపంచం సృష్టించే క్రమంలో 2030 నాటికి ప్యాకేజింగ్‌లో కనీసం 50శాతం రీసైకిల్డ్ బాటిళ్లను ఉపయోగించే లక్ష్యంతో సంస్థ ఉన్నట్లు టెక్నికల్ ఇన్నోవేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎన్రిక్ అకర్మాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కోకా–కోలా ఫ్రాంచైజ్ భాగస్వామి సర్వారాయ సుగర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్బీపీపీ రామ్మోహన్ మాట్లాడుతూ... సంస్థ నిర్ణయం సుస్థిరమైన ప్లాస్టిక్ వాడకంపై ప్రభుత్వ దృక్పథానికి అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. -
భారీగా పెరిగిన విమాన ప్రయాణికులు.. లాభాల్లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ
న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. నష్టాలను వీడి రూ. 3,400 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2021–22) దాదాపు రూ. 804 కోట్ల నికర నష్టం ప్రకటించగా.. 2020–21లో మరింత అధికంగా రూ. 3,176 కోట్ల నష్టం నమోదైంది. గతేడాది ప్రధానంగా దేశీ విమాన ప్రయాణికులు భారీగా పెరగడంతో కంపెనీ ఆర్థికంగా బలపడింది. వెరసి కరోనా మహమ్మారి బయటపడ్డాక కంపెనీ తిరిగి లాభాల బాట పట్టడం గమనార్హం! కాగా.. ఇవి ప్రొవిజనల్ ఫలితాలు మాత్రమేనని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆడిట్ తదుపరి కంపెనీ తుది పనితీరు వెల్లడికానున్నట్లు తెలియజేశాయి. 2022లో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 47 శాతం జంప్‌చేసి 12.32 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది ఈ సంఖ్య 8.38 కోట్లు మాత్రమే. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో ప్రయాణికుల సంఖ్య 52 శాతం ఎగసి 3.75 కోట్లకు చేరింది. ఇదీ చదవండి: ఈక్విటీలలో భారీ పెట్టుబడులు.. ఇప్పటివరకూ రూ.30,945 కోట్లు -
ఇల్లు కాదు పాముల పుట్ట, సామాను సర్దేలోగా.. సంతోషం ఆవిరి
ఒకటి కాదు, రెండు కాదు.. పదేళ్లు పైసా పైసా కూడబెట్టి ఇల్లు కొనుక్కొంది ఓ మహిళ. తన కలల సౌధం ఎలా ఉండాలన్నదానిపై అన్ని జాగ్రత్తలు చెప్పింది. తీరా ఇంట్లోకి వెళ్లిన తర్వాత సీన్ రివర్సయింది. అమెరికాలోని కొలరాడోలో ఉండే ఓ మహిళ పేరు అంబర్ హాల్. ఆమెకు ఇద్దరు పిల్లలు. సింగిల్ మదర్ కావడంతో ఖర్చులన్నీ తగ్గించుకుని ఇంటి కోసం ప్రయత్నించింది. నాలుగు బెడ్ రూంలు, ఓ చిన్న లాన్, అవసరాలకు సరిపడా కాసింత చోటు.. వీటి కోసం గాలించగా.. చివరికి ఓ ఇల్లు దొరికింది. ఏప్రిల్‌లో దీనికి సంబంధించిన డబ్బంతా కట్టి నాలుగు రోజుల కింద లగేజీ తీసుకుని వచ్చింది. తన వెంట రెండు లాబ్రాడార్ కుక్కలు కూడా ఉన్నాయి. ఇంకా ఫర్నీచర్ కూడా సెట్ చేయలేదు. అంతలోనే కుక్కలు మొరగడంతో అనుమానం వచ్చింది అంబర్ హాల్‌కు. క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే.. ఓ పాము కనిపించింది. ఇంకొంచెం ముందుకు వెళ్లి చూస్తే మరికొన్ని పాములు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏ గోడ తవ్వినా పామే. ఏ మూల చూసినా పామే. చిన్నవి కొన్ని, పెద్దవి కొన్ని. కొంత ధైర్యం చేసి స్నేక్ క్యాచర్లను పిలవగా ఇప్పటివరకు దాదాపు 40 పాములను పట్టుకెళ్లారు. ఇంకో చోటికి వెళదామంటే ఖర్చులు భరించలేని పరిస్థితి. అందుకే ఎన్ని కష్టాలు ఎదురయినా అదే ఇంట్లో ఉంటోంది అంబర్ హాల్. A first-time homeowner was shocked when she found as many as 30 snakes "coming out of every hole and crevice" of her new house. pic.twitter.com/dthRHno5n6 — CNN (@CNN) May 14, 2023 ఇప్పటికీ రోజూ ఏదో ఓ చోట పాము కనబడుతూనే ఉంది. ఇంట్లో రోజూ పాములను పట్టడం దగ్గరున్న అడవిలో వదిలేయడం జరుగుతోంది. ఈ ఇంటికి సమీపంలో ఒకప్పుడు చిన్నపాటి మడుగు ఉండేదట. అక్కడ బోలెడు పాములుండేవట. బహుశా అవే పాములు ఈ ఇంటికి వరుస కట్టి ఉంటాయని అంచనా వేస్తున్నారు. తన దీనస్థితిని అర్థం చేసుకుని సాయం చేసేందుకు ముందుకు రావాలని అంబర్ హాల్ కోరుతున్నారు. కనీసం ఆ మడుగుపై కాంక్రీట్ స్లాబ్ వేయగలిగితే పాముల బెడద తప్పుతుందన్నది అంబర్ ఆశ. -
కొత్తా ఓటరండీ! ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం.. మాట వినే ప్రసక్తే లేదు
బెంగళూరులోని మహారాణి క్లస్టర్ యూనివర్సటీలో విద్యార్థిని ఎంజే గుణ. కొద్ది రోజుల క్రితమే ఆమెకు 18 ఏళ్లు నిండాయి. మొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకునే చాన్స్ వచ్చింది. ఎప్పుడెప్పుడు తమ నాయకుడ్ని ఎన్నుకునే రోజు వస్తుందాని ఆమె ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఆమె ఉద్దేశంలో నాయకుడంటే బాగా చదువుకుని, దార్శినికుడై ఉండాలి. ‘‘నేను ఓటు వేసే ముందు ఏ పార్టీ అని కూడా చూడను. మా నియోజకవర్గానికి అభ్యర్థి ఏం చేస్తాడన్నదే ముఖ్యం. ఆ తర్వాత అభ్యర్థి బ్యాక్‌గ్రౌండ్, విద్యార్హతలు, గతంలో చేసిన పని, భవిష్యత్‌లో ఏం చేయగలడు వంటివన్నీ చూశాకే ఓటేస్తా’’అని ఆమె కచ్చితంగా చెప్పింది. సునీత అనే మరొక ఫస్ట్ టైమ్ ఓటరు సరైన వ్యక్తిని ఎంపిక చేసుకునే సామర్థ్యం మనకున్నప్పుడే రాష్ట్రం, దేశం సరైన మార్గంలో వెళతాయని చెప్పుకొచ్చింది. వీరి మాటలు వింటే సంప్రదాయంగా రాజకీయ వ్యూహాలు రచిస్తూ, తాయిలాల ఆశ చూపిస్తూ వెళ్లే పార్టీల వైపు వీరు చూసే చాన్సే లేదు. కొత్తగా ఓటు హక్కు పొందడం అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం. తల్లిదండ్రులు చెప్పారనో, స్నేహితులు సిఫారసు చేశారనో ఎవరికి పడితే వారికి నేటి తరం ఓటు వెయ్యరు. సొంతంగా ఆలోచించి తమకు నచ్చిన అభ్యర్థికి తొలిసారి ఓటు వేస్తే ఆ కిక్కే వేరబ్బా అంటున్నారు. ఓటు వెయ్యడంలో ఉదాసీనత మచ్చుకైనా లేదు. ఉరిమే ఉత్సాహంతో చూపుడు వేలి మీద సిరా గుర్తు చూపిస్తూ ఫొటోలు దిగి ఓట్ల పండుగను సంబరంగా చేసుకుంటున్నారు. కర్ణాటకలో మెజార్టీ మార్కు దాటడానికి అత్యంత కీలకమైన కొత్త ఓటర్ల మదిలో ఏముంది ? గత ఎన్నికల్లో... మొదటి సారి ఓటు వేసే వారిలో కొత్త ఉత్సాహం, ఓటు వెయ్యాలన్న తపన ఎక్కువ ఉంటుంది. వారు తప్పనిసరిగా ఓటు వెయ్యడానికి పోలింగ్ కేంద్రాలకు కదిలి వెళతారు. గత 3 ఎన్నికల్లోనూ కొత్త ఓటర్లు ఓటు వేసే విధానాన్ని విశ్లేషిస్తే వారి నాడి పట్టుకోవడం కష్టమనే అభిప్రాయం కలుగుతుంది. సీఎస్డీఎస్–లోక్‌నీతి పోస్ట్ పోల్ సర్వే కొత్త ఓటరు అండదండ లేనిదే ఏ పార్టీ కూడా మెజార్టీ మార్క్ సాధించలేదు. కొత్త ఓటరు ఎటుంటే.. కర్ణాటకలో ఈ సారి 11 లక్షల మంది కొత్త ఓటర్లు రిజిస్టర్ చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018లో 7.7 లక్షలుంటే ఈ సారి వారి సంఖ్య 11 లక్షలకు చేరుకుంది. ప్రతీ సారి ఎన్నికల్లోనూ కొత్త ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. కొత్త ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగరు. మనీ, మద్యం కంటే అభివృద్ధికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మంచి, చెడులను తామే విశ్లేషించుకునే శక్తి సామర్థ్యాలున్నవారు. ఓపెన్ మైండ్‌తో ఉంటారు. పార్టీలు వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలైతే చేస్తున్నాయి. కర్ణాటకలో ఏదైనా పార్టీ మెజార్టీ మార్కు దాటాలంటే కొత్త ఓటర్లు అత్యత కీలకమని రాజకీయ విశ్లేషకుడు సందీప్ శాస్త్రి అభిప్రాయపడ్డారు. పార్టీల కొత్త పంథా..! మేము ఏం చేస్తాం అన్నది కాదు.. మీకేం కావాలన్నదే ముఖ్యం అని కొత్త ఓటర్ల మనసులో ఏముందో పార్టీలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్త ఓటర్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ ‘‘సెలబ్రేట్ యువర్ ఓటు’’అనే ప్రచారాన్ని ప్రారంభించింది. 18–23 మధ్య వయసున్న వారే లక్ష్యంగా చేసుకొని వారికి ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తోంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్పరిణామాలను అరికట్టడం, అందరికీ ఉన్నత విద్యనభ్యసించే అవకాశాన్నివ్వడం ప్రస్తుతం యువత ఆశిస్తుందని తెలుసుకొని ఆ దిశగా వ్యూహాలు పన్నుతోంది. దాంతో పాటు నిరుద్యోగులు తల్లిదండ్రులకి భారంగా మారకుండా రెండేళ్ల పాటు నెలకి రూ.3 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ యువ సంవాద్ కార్యక్రమం ద్వారా కొత్త ఓటర్ల ఆశలు, ఆకాంక్షల్ని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తోంది.కొత్త ఓటర్లను దృష్టిలో ఉంచుకునే బీజేపీ సిట్టింగ్‌లను కాదని అత్యధికంగా 60 మంది కొత్త ముఖాలకు టికెట్లిచ్చింది. జేడీ(ఎస్) పంచరత్న రథయాత్రలో యువతకే అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. కుమారస్వామి ప్రచారంలో యువతతోనే మాట్లాడుతూ వారి నాడి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త ఓటర్లు తమ వైపేనని ధీమాతో ఉంది. ఢిల్లీ, పంజాబ్‌లో యువ ఓటర్లను అధికంగా ఆకర్షించిన ఆప్ ఈసారి ఉన్నత విద్య అభ్యసించిన వారికే ఎక్కువగా టిక్కెట్లు ఇచ్చింది. 2008: ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ మార్కుకి కేవలం మూడు సీట్ల దూరంలో నిలిచిపోయింది. ఈ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన సగటు ఓటు షేరు కంటే కొత్త ఓటరు వేసిన ఓట్ల వాటా (మొత్తం పోలయిన కొత్త ఓటర్ల ఓట్లలో) ఎక్కువగా ఉంది. కొత్త ఓటర్ల ఓటు షేర్ మూడు శాతం ఎక్కువగా ఉంది. 2013: అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ఓటర్లు కాంగ్రెస్ వైపు స్వల్పంగా మొగ్గు చూపించారు. ఆ పార్టీకి వచ్చిన సగటు ఓట్ల కంటే కొత్త ఓటర్లు కాంగ్రెస్‌కు వేసిన ఓటు షేరు ఒక్క శాతం అధికంగా ఉంది. హస్తం పార్టీ గద్దెనెక్కింది. 2018: బీజేపీ మెజార్టీ మార్కుకి 9 సీట్ల దూరంలో ఉండిపోయింది. దీనికి కారణం కొత్త ఓటర్లేనని సీఎస్డీఎస్–లోక్‌నీతి గణాంకాల్లో తేలింది. బీజేపీకి పోలయిన సగటు ఓట్ల కంటే కొత్త ఓటర్ల షేరు ఆరు శాతం తక్కువగా ఉంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. 2013, 2018 ఎన్నికల్లో జేడీ(ఎస్) పార్టీకి సగటు ఓటు షేర్ కంటే తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారి ఓటు షేర్ నాలుగు శాతం అధికంగా ఉంది. దీంతో పట్టణ యువత జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కంటే ప్రాంతీయ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారని తేలుతోంది. -సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫస్ట్ టైమ్... ఐ ఫోన్ 14 పై భారీ డిస్కౌంట్
-
చరిత్రలోనే తొలిసారిగా తిరుపతిలో అద్భుత ఘట్టం
-
తెలంగాణలో మొదటి ‘గే’ వివాహం: జంటగా మారనున్న ఇద్దరు పురుషులు
హైదరాబాద్: తెలంగాణలోని తొలిసారి ఇద్దరు స్వలింగ సంపర్కులు పెళ్లితో ఒక్కటి కానున్నారు. హైదరాబాద్‌కు చెందిన సుప్రియో, అభయ్‌లకు 2013లో డేటింగ్ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో వీరిద్దరు ఎనిమిదెళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సుప్రియో హైదరాబాద్‌లో.. హోటల్ మెనేజ్మెంట్ స్కూల్లో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా.. అభయ్ సాఫ్ట్వేర్ కంపెనీలో డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వీరి ప్రేమకు పెద్దలు కూడా అంగీకారం తెలిపారు. దీంతో వీరు.. వచ్చే డిసెంబరులో వివాహంతో ఒక్కటికానున్నట్లు సుప్రియో జంట ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో ఇద్దరు స్వలింగ సంపర్కులు(గే) చేసుకుంటున్న తొలి వివాహం ఇదే. తమ వివాహనికి కుటుంబ సభ్యులను ఒప్పించడానికి ఎన్నో సంవత్సరాలు పట్టిందని సుప్రియో తెలిపాడు. కాగా, తమ పెళ్లిలో సంప్రదాయ బద్ధంగా మంగళస్నానాలు, సంగీత్ వంటి కార్యక్రమాలు ఉంటాయని స్వలింగ సంపర్కులు తెలిపారు. చదవండి: 300 అడుగుల లోతున పడిన బస్సు.. 13 మంది మృతి -
అందుకే మోనాల్‌ని హీరోయిన్గా తీసుకోలేదు : అఖిల్
బిగ్‌బాస్ ఫేం అఖిల్-మోనాల్ జోడీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక ఇద్దరూ వేర్వేరు ఆఫర్లతో బిజీ బిజీగా మారారు. అయినప్పటికీ వీరిద్దరు బిగ్‌బాస్‌లో ఉన్న బాండ్‌నే కొనసాగిస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. పార్టీలు, ఫంక్షన్లలోనూ ఇద్దరూ జంటగానే వెళ్తూ ఆ ఫోటోలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. కాగా 'ఫస్ట్‌టైం' అనే మూవీతో అఖిల్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అఖిల్‌కు జంటగా అనిక విక్రమన్ హీరోయిన్గా నటిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే అఖిల్‌కు జోడీగా మోనాల్‌ను తీసుకోకపోవడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కొత్త హీరోయిన్ను తీసుకునే బదులు మోనాల్‌ను ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో అఖిల్ క్లారిటీ ఇచ్చేశారు. మూవీకి ఎవరిని హీరోయిన్గా తీసుకోవాలనే ఛాయిస్ డైరెక్టర్దేనని,ఆయనే కొత్త హీరోయిన్ను ఎంపిక చేశారని బదులిచ్చారు. అంతేకాకుండా తామిద్దరం కలిసి తెలుగబ్బాయి-గుజరాతీ అమ్మాయి అనే వెబ్‌సిరీస్ చేయనున్నట్లు తెలిపాడు. ఇక సినిమా విషయానికి వస్తే.. బిగ్‌బాస్ నుంచి వచ్చాక దాదాపు 27 స్టోరీలు విన్నానని, 'ఫస్ట్ టైం' స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే ఓకే చేశానని చెప్పుకొచ్చాడు. సెప్టెంబర్‌లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని చెప్పాడు. చదవండి: మోనాల్‌తో వీడియో కాల్, అఖిల్ కామెంట్ వైరల్ నాగబాబు వాట్సాప్ డీపీ చూస్తే షాక్ అవ్వాల్సిందే! -
తెలంగాణలో ఇదే తొలిసారి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందుజాగ్రత్త చర్యగా విద్యాసంస్థలు మూసివేసిన సర్కారు మరోవైపు రోజూ నిర్వహించే కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచింది. సోమవారం 68,171 , మంగళవారం రికార్డు స్థాయిలో 70,280 పరీక్షలు నిర్వహించింది. రాష్ట్రంలో ఇంత భారీ సంఖ్యలో టెస్టులు నిర్వహించడం ఇదే తొలిసారి. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ముమ్మరంగా కొనసాగిస్తోంది. కాగా, మంగళవారం 431 మందికి కరోనా సోకిందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు బుధవారం నాటి బులెటిన్‌లో వెల్లడించారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 111 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 97,89,113 కోవిడ్ పరీక్షలు జరిగాయి. వీటిల్లో మొత్తం 3,04,298 కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజులో 228 మంది కోలుకోగా, ఇప్పటివరకు 2,99,270 మంది బాధితులు కోలుకున్నారు. తాజాగా ఇద్దరు చనిపోగా, ఇప్పటివరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 1,676కు చేరింది. ఇక రికవరీ రేటు 98.34 శాతానికి తగ్గగా మరణాల రేటు 0.55 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 3,352 ఉండగా, అందులో ఇళ్లు, కోవిడ్ కేర్ సెంటర్ల ఐసోలేషన్‌లో 1,395 మంది కరోనా బాధితులు ఉన్నారని శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 10 లక్షలకు పైగా టీకాలు రాష్ట్రంలో ప్రస్తుతం 60 ఏళ్లు పైబడినవారికి, 45 నుంచి 59 ఏళ్ల వయస్సులోని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకాలు వేస్తున్నారు. మంగళవారం నాటికి 60 ఏళ్లు పైబడిన 3,10,728 మంది టీకా వేయించుకున్నారు. 45–59 ఏళ్ల వయస్సు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు 1,47,718 మంది టీకా పొందారు. జనవరి 16 నుంచి ఇప్పటివరకు మొదటి డోస్ తీసుకున్నవారు 7,86,426 మంది కాగా, 2,24,374 మంది రెండో డోస్ తీసుకున్నారు. మొత్తం మొదటి, రెండో డోస్ టీకాల సంఖ్య 10,10,800కు చేరింది. మంగళవారం ఒక్క రోజులో 60 ఏళ్లు పైబడిన 20,198 మందికి మొదటి డోస్ టీకా వేయగా, 45–59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో 15,026 మందికి టీకా వేశారు. -
ఫస్ట్ టైమ్ కారు కొంటున్నారా? ఇటో లుక్కేయండి..!
సొంత ఇల్లు, కారు ఉండాలన్నది చాలా మంది కల. అయితే కారు కొనేటప్పుడు మనం చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ట్యాక్స్ విషయాలు, పేమెంట్ విధానం, ఏ మోడల్ కొనాలి, కొంత మంది విషయంలో అయితే సెంటిమెంట్లు.. ఇలా చాలా విషయాలను పరిశీలించాలి. మొదటిసారి కారుకొంటున్న వారు ముఖ్యంగా 10 విషయాల గురించి తెలుసుకుంటే మంచిది. 1. బడ్జెట్‌ను చూసుకోండి కొంత మంది విషయాల్లో తప్ప చాలా వరకు కారు కొనుక్కునే వారు మొత్తం డబ్బు ఒకేసారి చెల్లించి కాకుండా ఈఎంఐలో కారు కొంటారు. అయితే మీరు కారు తీసుకునేటప్పుడు మీ బడ్జెట్ ఎంత ఉంది, నెలవారీ మీ అవసరాలు పోను ఎంత మిగులుతుంది. ఎక్కువ భారం పడకుండా ఎంత వరకు ఈఎంఐ కట్టగలరో చూసుకొని కారును ఎంపిక చేసుకోవాలి. 2. ఎంత దూరం ప్రయాణించాలనుకుంటున్నారు కారు కొనే అవసరం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొంతమంది ఫ్యామిలీతో సరదగా బయటకు వెళ్లడానికి కారు కొంటే కొంత మంది ఆఫీస్ అవసరాల కోసం కొంటారు. మరి కొంతమంది లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడానికి కారును ప్రిఫర్ చేస్తారు. దీనిలో మీరు దేనికోసం కారు కావాలనుకుంటున్నారో సరిగా ఆలోచించుకొని దాని ప్రకారం మీ కారును సెలక్ట్ చేసుకోండి. 3.రీసెర్చ్ చేయండి: కారు కొనడానికి బడ్జెట్ ఎంత ఈఎంఐ ఎంత ఇలా అని ప్లాన్ చేసుకున్న తరువాత మార్కెట్లో మీ బడ్జెట్‌కు ఏ ఏ కార్లు అందుబాటులో ఉన్నాయో పరిశోధించండి. మీకు తెలిసిన వారిని కనుక్కోవడమే కాకుండా కొంత టైం వెచ్చించి గూగుల్‌లో మీరు కొనాలనుకుంటున్న కారు ఫీచర్స్, డ్రాబ్యాక్స్, రివ్యూ, వేరువేరు డీలర్ల గురించి చెక్ చేయండి. 4. ఏవిధంగా కొనాలో నిర్ణయించుకోండి కారు కొనడానికి కావాల్సినంత డబ్బు మీరు సమకూర్చుకోలేకపోతే మీరు లోన్ కోసం బ్యాంక్‌ల మీద కానీ, క్రెడిట్ కార్డు ఎజెన్సీల మీద కానీ ఆధారపడాల్సి వస్తుంది. దీని కోసం బ్యాంకులు వాటి వడ్డీ రేట్లను, క్రెడిట్ కార్డు ఎజెన్సీలను పరిశీలించి లోన్ తీసుకోండి. 5. మీ క్రెడిట్ స్కోర్ పెంచుకోండి: క్రెడిట్ స్కోర్ మంచిగా ఉంటే బ్యాంకులు మీకు రుణం ఇవ్వడానికి ఆసక్తిని చూపిస్తాయి. మీకు కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కాబట్టి లోన్ తీసుకునే ముందు మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోండి 6. పాత కారును ఎంచుకోవడానికి ప్రయత్నించండి మీరు మొదటి సారి కారు కొంటున్నట్లయితే పాత కారును ఎంచుకోవడానికి ప్రయత్నించండి. మార్కెట్లో ఐదేళ్ల నుంచి మూడేళ్ల ఓల్డ్ కారులు కూడా ఉంటాయి. మొదట వాటిని కొనండి. వీటిని కొనేటప్పుడు మీకు ఎక్కువ మార్జిన్ కూడా లభిస్తుంది. 7. టెస్ట్ డ్రైవ్‌కు వెళ్లండి మీ బడ్జెట్లో ఉన్న కారును నిర్ణయించుకున్న తరువాత ఒకటికి రెండుసార్లు టెస్ట్ డ్రైవ్‌కు వెళ్లండి. ఎందుకంటే మీకు ఆ కారు ఎంతవరకు సౌకర్యంగా ఉంది. ఎంత వరకు మీ అవసరాలకు సరిపోతుంది అనే విషయం అవగాహనకు వస్తుంది. 8. బేరం ఆడండి ఏ కారు కొనాలో నిర్ణయించుకున్న తరువాత దాని కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పూర్తిగా చదివి టర్మ్స్ అండ్ కండీషన్స్ తెలుసుకొండి. వారంటీ ఎంత కాలం ఉంది అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించండి. అనంతరం డీలర్‌తో మీరు ఎంతకు కొనాలనుకుంటున్నారో బేరం ఆడండి, దీని వలన మీకు ఇంకొంచెం తక్కువ రేటుకు కారు లభిస్తుంది. 9. కారును పరీక్షించండి మీరు సెకెండ్ హ్యాండ్ కారు బంధువుల నుంచి కానీ, మిత్రుల నుంచి కానీ లేదా డీలర్ల నుంచి కొనాలనుకుంటే దానిని కార్ల గురించి బాగా తెలిసిన వారి చేత టెస్ట్ చేయించండి. చాలా మెకానిక్ షోరూంలు ప్రీ ఇన్స్ఫెక్షన్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాయి. కాబట్టి అలాంటి వాటి దగ్గర మీరు కొనే కారును పరీక్షించండి. దాని ద్వారా కారు అసలైన పరిస్థితి మీకు అర్థం అవుతుంది. మీ డబ్బులకు సరైన విలువ దొరుకుతుంది. 10. రైడ్‌కు వెళ్లి ఎంజాయ్ చేయండి ఇక కారు కొనేటప్పుడు ఈ విషయాలన్ని చూసుకున్నతరువాత మీకు ఇష్టమైన కారును కొనుక్కొని మీ కోరిక నెరవేరిందనే సంతోషంలో ఒక డ్రైవ్‌కి వెళ్లి వచ్చేయండి. బడ్జెట్ ప్లానింగ్, రీసెర్చ్ అనేవి కారు కొనేటప్పుడు మీరు కచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. -
సూపర్ జ్వెరెవ్
మూడేళ్ల క్రితం జర్మనీ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ప్రపంచ మూడో ర్యాంకర్‌గా ఎదిగిన సమయంలో పురుషుల సింగిల్స్ విభాగంలో నయా తార అవతరించాడని టెన్నిస్ క్రీడా పండితులు విశ్లేషించారు. కానీ గత మూడేళ్లలో 23 ఏళ్ల జ్వెరెవ్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరి తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. అయితే ఏడు నెలలు తిరిగేలోపు జ్వెరెవ్ మరో మెట్టు ఎక్కాడు. తన అత్యుత్తమ ‘గ్రాండ్’ సెమీస్ ప్రదర్శనను సవరించి ఈసారి ఏకంగా ‘గ్రాండ్’గా ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు కేవలం విజయం దూరంలో నిలిచాడు. మరోవైపు మూడేళ్లుగా ‘బిగ్ త్రీ’ ఫెడరర్, నాదల్, జొకోవిచ్ నీడలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఆస్ట్రియా స్టార్ డొమినిక్ థీమ్ తన గ్రాండ్‌స్లామ్ టైటిల్ కలను సాకారం చేసుకోవడానికి నాలుగోసారి సిద్ధమయ్యాడు. జ్వెరెవ్, థీమ్ మధ్య ఫైనల్లో ఎవరు గెలిచినా తొలిసారి గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరిస్తారు. న్యూయార్క్: తమ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కలను నిజం చేసుకోవడానికి పురుషుల టెన్నిస్ భవిష్యత్ ఆశాకిరణాలు అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) ఒక్క విజయం దూరంలో నిలిచారు. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో వీరిద్దరూ తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీఫైనల్స్‌లో ఐదో సీడ్ జ్వెరెవ్ 3 గంటల 23 నిమిషాల్లో 3–6, 2–6, 6–3, 6–4, 6–3తో 20వ సీడ్ పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్)పై, రెండో సీడ్ థీమ్ 2 గంటల 55 నిమిషాల్లో 6–2, 7–6 (9/7), 7–6 (7/5)తో గత ఏడాది రన్నరప్, మూడో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా)పై గెలుపొందారు. ముఖాముఖి రికార్డులో థీమ్ 7–2తో జ్వెరెవ్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. వీరిద్దరు గ్రాండ్‌స్లామ్ టోర్నీ మ్యాచ్‌ల్లో మూడు సార్లు తలపడగా... మూడు సార్లూ్ల థీమ్‌నే విజయం వరించింది. రెండు సెట్లు చేజార్చుకొని... కరెనో బుస్టాతో జరిగిన సెమీఫైనల్లో జ్వెరెవ్ తొలి రెండు సెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతున్న దశలో పుంజుకున్నాడు. శక్తిమంతమైన సర్వీస్‌లతో, పదునైన రిటర్న్ షాట్లతో ఒక్కసారిగా విజృంభించాడు. మూడో సెట్లోని నాలుగో గేమ్‌లో బుస్టా సర్వీస్‌ను బ్రేక్ చేసిన జ్వెరెవ్ ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని సెట్ నెగ్గాడు. నాలుగో సెట్లోని ఏడో గేమ్‌లో బుస్టా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ జర్మనీ యువతార 4–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత 6–4తో సెట్‌ను గెల్చుకున్నాడు. నిర్ణాయక ఐదో సెట్లోనూ జ్వెరెవ్ నియంత్రణ కోల్పోకుండా ఆడాడు. తొలి గేమ్‌లో, ఆ తర్వాత తొమ్మిదో గేమ్‌లో బుస్టా సర్వీస్‌లను బ్రేక్ చేసిన జ్వెరెవ్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. జ్వెరెవ్ తన కెరీర్లో తొలిసారి వరుసగా తొలి రెండు సెట్లను కోల్పోయి... ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు నెగ్గి విజయాన్ని అందుకోవడం ఇదే ప్రథమం. మ్యాచ్ మొత్తంలో 24 ఏస్‌లు సంధించాడు. 8 డబుల్ ఫాల్ట్‌లతోపాటు 57 అనవసర తప్పిదాలు చేశాడు. అయితే 71 విన్నర్స్ కొట్టడం, నెట్ వద్దకు 50 సార్లు దూసుకొచ్చి 37 సార్లు పాయింట్లు గెలవడం, ఎనిమిది బ్రేక్ పాయింట్లు సంపాదించడం జ్వెరెవ్‌కు విజయాన్ని అందించాయి. తడబడి... నిలబడి... ఇప్పటికే మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో ఓడిపోయిన డొమినిక్ థీమ్ ఈసారి ఎలాగైనా విన్నర్స్ ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉన్నాడు. గతేడాది రన్నరప్ మెద్వెదేవ్‌తో జరిగిన సెమీఫైనల్లో థీమ్ ఆటలో ఇది స్పష్టంగా కనిపించింది. రెండో సెట్లో, మూడో సెట్లో సెట్ పాయింట్లు కాపాడుకున్న విధానం అతని సానుకూల దృక్పథాన్ని సూచిస్తోంది. రెండో సెట్లో మెద్వెదేవ్ తన సర్వీస్‌లో 5–4తో ఆధిక్యంలో ఉన్నపుడు సర్వీస్ నిలబెట్టుకొని ఉంటే సెట్ గెలిచేవాడు. కానీ థీమ్ అతని సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ఆ తర్వాత టైబ్రేక్‌లో పైచేయి సాధించాడు. ఇక మూడో సెట్లో ఒకదశలో థీమ్ 2–5తో వెనుకబడ్డాడు. కానీ థీమ్ ఒత్తిడికి లోనుకాకుండా మెద్వెదేవ్ సర్వీస్‌ను తొమ్మిదో గేమ్‌లో బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని స్కోరును 6–6తో సమం చేశాడు. మళ్లీ టైబ్రేక్‌లో తన ఆధిపత్యం చాటుకొని గెలిచాడు. సిగెముండ్–జ్వొనరేవా జంటకు ‘డబుల్స్’ మహిళల డబుల్స్ విభాగంలో అన్‌సీడెడ్ జోడీ లౌరా సిగెముండ్ (జర్మనీ)–వెరా జ్వొనరేవా (రష్యా) విజేతగా నిలిచింది. 80 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ఈ జంట 6–4, 6–4తో మూడో సీడ్ నికోల్ మెలికార్ (అమెరికా)–యిఫాన్ షు (చైనా) జోడీపై విజయం సాధించింది. విజేత సిగెముండ్–జ్వొనరేవా ద్వయంకు 4,00,000 డాలర్లు (రూ. 2 కోట్ల 94 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 6 యూఎస్ ఓపెన్ చరిత్రలో సెమీఫైనల్ మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు కోల్పోయి ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు నెగ్గి ఫైనల్ చేరిన ఆరో క్రీడాకారుడు జ్వెరెవ్. గతంలో జొకోవిచ్ (2011లో ఫెడరర్‌పై); ఆండీ రాడిక్ (2003లో నల్బందియాన్పై); జాన్ బోర్గ్ (1980లో యోహాన్ క్రీక్‌పై); వైటస్‡ జెరులైటిస్ (1979లో రోస్కో ట్యానర్పై); మాన్యుయెల్ ఒరాంటెస్ (1975లో గిలెర్మో విలాస్‌పై) ఈ ఘనత సాధించారు. 2 ఫైనల్లో థీమ్ విజయం సాధిస్తే థామస్ ముస్టర్ (1995లో ఫ్రెంచ్ ఓపెన్) తర్వాత గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన రెండో ఆస్ట్రియా ప్లేయర్‌గా నిలుస్తాడు. అంతేకాకుండా యూఎస్ ఓపెన్ నెగ్గిన తొలి ఆస్ట్రియా ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. 26 యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో 26 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన తొలి జర్మనీ ప్లేయర్‌గా జ్వెరెవ్ గుర్తింపు పొందాడు. 1994లో చివరిసారి మైకేల్ స్టిచ్ రూపంలో జర్మనీ ఆటగాడు ఈ టోర్నీలో ఫైనల్ చేరి ఫైనల్లో ఆండ్రీ అగస్సీ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. 2 ఫైనల్లో జ్వెరెవ్ గెలిస్తే బొరిస్ బెకర్ (1989లో) తర్వాత యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన రెండో జర్మనీ ప్లేయర్‌గా నిలుస్తాడు. అంతేకాకుండా 1991 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన జర్మనీ క్రీడాకారుడిగా గుర్తింపు పొందుతాడు. 1991లో చివరిసారి జర్మనీ క్రీడాకారులు బొరిస్ బెకర్ (ఆస్ట్రేలియన్ ఓపెన్), మైకేల్ స్టిచ్ (వింబుల్డన్) ఈ ఘనత సాధించారు. -
చమురుకు ఏమైంది..?
బ్యాంకుల్లో డబ్బుదాచుకుంటే మనమే తిరిగి బ్యాంకులకు వడ్డీకట్టాల్సివస్తే..? వామ్మో ఇదెక్కడి చోద్యం అంటారా? మనం ఎప్పడూ చూడలేదుకానీ, ఇప్పటికే ఈ నెగటివ్ వడ్డీరేట్లు జపాన్, యూరప్‌లోని కొన్ని దేశాల్లో అమల్లో ఉన్నాయి. ఇదే పరిస్థితి ఇప్పుడు ముడిచమురు విషయంలోనూ నెలకొంది. కరోనా మహమ్మారి దెబ్బకు ముడిచమురు ధర ఏకంగా మైనస్ 40 డాలర్లను తాకడంతో ప్రపంచం ఒక్కసారిగా నివ్వెరపోయింది. మరోరకంగా చెప్పాలంటే ఒక బాత్‌టబ్‌ను నింపే నీటికి వెచ్చించే ధర కంటే తక్కువ ఖర్చుతో క్రూడ్‌తో నింపేయొచ్చన్నమాట! ఊహించడానికే నమ్మశక్యంగా లేదు కదూ!! ఎదురుడబ్బులిచ్చిమరీ అమ్మకందారులు క్రూడ్ కొనండంటూ కొనుగోలుదారుల వెంటపడటం మరీ విడ్డూరం! అసలు క్రూడ్ ఇంతలా కుప్పకూలడానికి కారణాలేంటి? చరిత్రలో ఎన్నడూ జరగని ఈ మహాపతనానికి ఆజ్యం పోసిన పరిస్థితులను వివరించే ‘సాక్షి బిజినెస్ డెస్క్’ ప్రత్యేక కథనం ఇది... సాక్షి బిజినెస్ డెస్క్: ప్రపంచంలో ఏ వస్తువు ధరైనా గిరాకీ–సరఫరా(డిమాండ్–సప్లయ్) ఆధారంగానే నిర్దేశితమవుతుంది. ఒక్కసారిగా డిమాండ్ ఆవిరై.. సరఫరా అదే స్థాయిలో కొనసాగితే ధర కుప్పకూలక తప్పదు. క్రూడ్ విషయంలోనూ ఇదే జరిగింది. అమెరికాలో ఉత్పత్తి అయ్యే లైట్ స్వీట్ క్రూడ్(డబ్ల్యూటీఐ–వెస్ట్రన్ టెక్సాస్ ఇంటర్మీడియెట్) మే నెల ఫ్యూచర్స్ కాంట్రాక్టు బ్యారెల్ ధర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సోమవారం మైనస్‌లోకి జారిపోయింది. ఒకానొక దశలో క్రితం ముగింపు 18.27 డాలర్లతో పోలిస్తే ఏకంగా 307 శాతం కుప్పకూలి... మైనస్ 40.32 డాలర్లను తాకింది. చివరికి 280% నష్టంతో(55.9 డాలర్లు కోల్పోయి) మైనస్ 37.63 వద్ద ముగిసింది. అయితే, మంగళవారం ఈ కాంట్రాక్టు ధర 125 శాతం పైగా కోలుకొని 9.5 డాలర్లను తాకి ట్రేడవుతోంది. ఈ మే నెల కాంట్రాక్టు గడువు మంగళవారంతో ముగుస్తుంది. అంటే నేటి నుంచి జూన్ కాంట్రాక్టు ధరను క్రూడ్ ఫ్యూచర్స్ ప్రామాణిక రేటుగా పరిగణిస్తారన్నమాట! ఇది కూడా సోమవారం 17%పైగా కుప్పకూలి 20 డాలర్ల స్థాయిని తాకింది. మంగళవారం ఇది 67 శాతం క్షీణించి 6.5 డాలర్ల కనిష్టాన్ని చవిచూసింది. మరి ఈ మైనస్ రేటు సంగతేంటి? క్రూడ్ ఇంతలా కుప్పకూలడానికి డిమాండ్ పాతాళానికి పడిపోవడం, నిల్వచేసే కేంద్రాల్లో క్రూడ్ నిల్వలు నిండుకుండల్లా పేరుకుపోవడం ప్రధాన కారణాలు కాగా, ఫ్యూచర్స్ మార్కెట్లో తలెత్తే సాంకేతిక అంశాలు కూడా ఇందుకు ఆజ్యం పోశాయి. వాస్తవానికి క్రూడ్ కొనుగోలుదారులు (ప్రధానంగా రిఫైనరీలు, విమానయాన సంస్థలు, ట్రేడర్లు) భవిష్యత్తులో రేట్లు పెరుగుతాయన్న అంచనాతో తాజా కనిష్ట ధరల వద్ద క్రూడ్‌ను నిల్వ చేసుకుంటూ వస్తున్నారు. దీంతో నిల్వ సామర్థ్యం గరిష్టస్థాయికి చేరుకుంది. మంగళవారంతో గడువు తీరిన మే నెల కాంట్రాక్టులను కొనుగోలు చేసిన ట్రేడర్లు(లాంగ్ పొజిషన్లు తీసుకున్నవారు) గత్యంతరంలేని స్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫ్యూచర్స్‌లో కొన్న పొజిషన్లు(బ్యారెల్స్) డెలివరీ తీసుకోవడమో లేదంటే వచ్చే నెల కాంట్రాక్టు(జూన్)కు రోలోవర్(మారడమో) చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తగినంత స్టోరేజీ లేకపోవడంతో లక్షలాది బ్యారెళ్ల క్రూడ్‌ను డెలివరీ తీసుకోవడం అసాధ్యం. దీంతో అయినకాడికి అమ్ముకోవడంతో క్రూడ్ ధర ఒక్కసారిగా క్రాష్ అయింది. అయితే, కొనుగోలుదారులు ఎవరూ ముందుకురాకపోవడంతో ఎదురుడబ్బులిచ్చిమరీ తమ పొజిషన్లను వదిలించుకున్నారు. దీనివల్లే రేటు మైనస్‌లోకి జారిపోయింది. అంటే సోమవారం ఈ కాంట్రాక్టును కొన్నవారు డబ్బులేవీ చెల్లించకపోగా వాళ్లకే ఒక్కో బ్యారెల్‌కు ఎదురు 37–40 డాలర్లు లభించాయన్నమాట! ఈ క్రూడ్ క్రాష్‌లో ట్రేడర్లు(ప్రధానంగా కొన్ని బ్యాంకులు, ఇన్వెస్ట్మెంట్ సంస్థలు) కోట్లాది డాలర్ల నష్టాలను చవిచూశాయి. అయితే, ఈ మైనస్ పతనం అనేది ఏదోఒకసారి జరిగే పరిణామం మాత్రమేనని రిస్టాడ్ ఎనర్జీకి చెందిన మార్కెట్ ఎనలిస్ట్ లౌసీ డిక్సన్ పేర్కొన్నారు. 20 డాలర్ల స్థాయిలో చమురు కంపెనీలు మనుగడం సాగించడం కష్టసాధ్యమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. డిమాండ్ ఎందుకు ఢమాల్... కర్ణుడి చావుకు కోటి కారణాలన్నట్టు... క్రూడ్ ధర అంతకంతకూ పాతాళానికి పడిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటికే మందగమంనలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పుండుమీద కారంలా కరోనా కకావికలం చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చాలా దేశాలు లాక్డౌన్లను ప్రకటించడంతో ఆర్థిక వ్యవస్థలు స్తంభించిపోయి.. ప్రపంచం మాంద్యం కోరల్లోకి వెళ్తోంది. చైనా–అమెరికా వాణిజ్య యుద్ధం తర్వాత సౌదీ–రష్యాల మధ్య క్రూడ్ ధర పోరుకు తోడు ఇప్పుడు కరోనా కాటుతో ముడిచమురు రేటు క్రాష్ అయింది. అయితే, రోజుకు 9.7 మిలియన్ బ్యారల్స్మేర(ప్రపంచ ఉత్పత్తిలో 10%) ఉత్పత్తిని తగ్గించుకోవడానికి ఒపెక్, అనుబంధ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం తాత్కాలికంగా చమురు ధర క్షీణతను అడ్డుకున్నప్పటికీ.. కరోనా మహమ్మారి దెబ్బకు డిమాండ్ ఆవిరై ముడిచమురుకు ముచ్చెమటలు పట్టిస్తోంది. అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్(ఏపీఐ) అంచనాల ప్రకారం ప్రపంచ చమురు ఉత్పత్తి ప్రస్తుత రోజుకు 100 మిలియన్ బ్యారెల్స్ కాగా, డిమాండ్ 70 మిలియన్ బ్యారెల్స్ మాత్రమే ఉండటం గమనార్హం. నిండుకుండల్లా నిల్వలు... డిమాండ్‌ను మించిన అదనపు ఉత్పత్తిని నిల్వ చేయడానికి ఇప్పడు స్టోరేజీ కేంద్రాల సమస్య ప్రపంచానికి పెను సవాలుగా మారుతోంది. అమెరికాలో గరిష్ట స్థాయి క్రూడ్ స్టోరేజీ సామర్థ్యం 825 మిలియన్ బ్యారెల్స్ కాగా, గతంలో ఎప్పడూ 500 మిలియన్ బ్యారెల్స్ నిల్వను అధిగమించలేదు. కానీ ఇప్పుడు కేవలం 100 మిలియన్ బ్యారెల్స్ నిల్వ సామర్థ్యం మాత్రమే మిగిలి ఉండటం డిమాండ్–సరఫరాల మధ్య తీవ్ర అగాధానికి నిదర్శనం. దీంతో క్రూడ్‌ను తరలించే ట్యాంకర్ షిప్స్‌ను కూడా నింపేసి సముద్రంలో లంగరేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా రవాణాలో ఉన్న ప్రస్తుతం నిల్వలు 1600 మిలియన్ బ్యారెల్స్‌కు చేరినట్లు అంచనా(రెండు వారాల క్రితంతో పోలిస్తే రెట్టింపు). అయితే, ఒపెక్ దేశాల మధ్య ఇటీవల కుదిరిన ఉత్పత్తి కోత డీల్ మే నెల 1 నుంచి పట్టాలెక్కనుంది. అయినప్పటికీ... తాజా ధర పతనంతో ఈ ఒప్పందాన్ని ఎన్ని దేశాలు అమలు చేస్తాయన్నది మిలియన్ బ్యారెళ్ల ప్రశ్నే! ఒకవేళ ఈ డీల్ అమలైనా.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న డిమాండ్ పతనాన్ని ఉత్పత్తి కోతలతో పూడ్చుకోవడం కష్టమేననేది నిపుణుల విశ్లేషణ. డబ్ల్యూటీఐ క్రూడ్ అంటే... ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరకు ప్రామాణికంగా పరిగణించే మూడు రకాల్లో ఈ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్(డబ్ల్యూటీఐ) క్రూడ్ కూడా ఒకటి. మిగతావి బ్రెంట్ క్రూడ్, దుబాయ్ క్రూడ్(గల్ఫ్, ఇతరత్రా దేశాల్లో ఉత్పత్తి అయ్యే రకాలు) డబ్ల్యూటీఐ విషయానికొస్తే... ప్రధానంగా టెక్సాస్ కేంద్రంగా అమెరికాలో ఉత్పత్తి అయ్యే క్రూడ్ ధరనే ఉత్తర అమెరికా మొత్తం ప్రామాణికంగా తీసుకుంటుంది. దీనిలో సల్ఫర్ (0.24 శాతం), సాంద్రత కూడా తక్కువగా ఉండటంతో దీన్ని లైట్, స్వీట్ క్రూడ్‌గా పిలుస్తారు. అత్యంత నాణ్యమైన ఈ క్రూడ్‌ను శుద్ధిచేయడం చాలా సులువు. ప్రపంచవ్యాప్తంగా కమోడిటీ ట్రేడింగ్‌కు ప్రధాన కేంద్రమైన న్యూయార్క్ మెర్కెంటైల్ ఎక్సే్ఛంజీ(నైమెక్స్)లో క్రూడ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులకు కూడా డబ్ల్యూటీఐ ధరే ప్రామాణికం. 1983 ఏప్రిల్ నుంచి నైమెక్స్‌లో డబ్ల్యూటీఐ క్రూడ్ ఫ్యూచర్స్ ట్రేడవుతున్నాయి. ఇప్పటివరకూ ఇక్కడ నమోదైన ఆల్‌టైమ్ కనిష్ట ధర బ్యారెల్‌కు 9.75 డాలర్లు(1986 ఏప్రిల్‌లో) మాత్రమే. తాజాగా మైనస్ 40 స్థాయికి కుప్పకూలి చరిత్రాత్మక పతనాన్ని డబ్ల్యూటీఐ క్రూడ్ చవిచూసింది. ఇక ఈ క్రూడ్ డెలివరీలకు ప్రధాన స్టోరేజీ కేంద్రం ఒక్లహామాలోని కుషింగ్ అనే ప్రాంతం. దీని నిల్వ సామర్థ్యం 90 మిలియన్ బ్యారెల్స్. అమెరికాలో మొత్తం స్టోరేజీలో ఇది దాదాపు 13 శాతం కావడం గమనార్హం. రోజుకు 6.5 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ రాకపోకలు ఇక్కడి నుంచి జరుగుతుంటాయి. అందుకే ప్రపంచ క్రూడ్ పైప్‌లైన్ జంక్షన్‌గా కూడా దీన్ని పిలుస్తారు. డబ్ల్యూటీఐ కాంట్రాక్టులను డెలివరీ తీసుకుంటే ఇక్కడ స్టోర్ చేస్తారు. డిమాండ్ పడిపోవడంతో ఇక్కడ నిల్వలు గరిష్టానికి చేరుకోవడమే తాజా మహా పతనానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. రికవరీ ఎన్నేళ్లకో... కరోనా లాక్డౌన్స్ ఇంకా కొన్ని నెలలు పాటు కొనసాగే పరిస్థితులు నెలకొన్నాయి. విమానాలన్నీ రెక్కలు తెగిన పక్షుల్లా బిక్కచూపులు చూస్తున్నాయి. ప్రపంచమంతా మాంద్యంలోకి జారిపోతోంది. అంతర్జాతీయంగా విమానయాన సేవలతో పాటు లాక్డౌన్లతో రైలు, రోడ్డు రవాణా సేవలు, ప్రయాణాలన్నీ నిలిచిపోవడంతో క్రూడ్ కొనుగోళ్లు కుదేలవుతున్నాయి. ఒకవేళ లాక్డౌన్లు ఎత్తేసినప్పటికీ మునుపటి స్థాయికి డిమాండ్ చేరడానికి చాలా నెలలే పట్టొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్‌లాంటి అధిక క్రూడ్ డిమాండ్ దేశాల్లో పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు 50 శాతం పడిపోయిన విషయాన్ని కూడా వారు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కరోనా మహమ్మారికి మందో, వ్యాక్సినో కనుగొని.. దీనికి ఒక పరిష్కారం దక్కి... ఆర్థిక వ్యవస్థలు మళ్లీ గాడిలోపడేంత వరకూ క్రూడ్ ధర కుక్కినపేనులా పడుండాల్సిందేననేది నిపుణుల అభిప్రాయం. ముడిచమురు రేటు మళ్లీ పుంజుకోవడానికి కొన్ని నెలలే కాదు కొన్నేళ్లు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని వారు అంటున్నారు!! మరి బ్రెంట్ క్రూడ్ ఎందుకు ఇంతలా పడిపోలేదు? డిమాండ్ పతనం కారణంగా డబ్ల్యూటీఐతో పాటు బ్రెంట్ క్రూడ్ కూడా గత కొంతకాలంగా పడుతూనే వస్తోంది. ఏడాది వ్యవధిలో ఈ రెంటింటి ధరలు 80% పైనే పడిపోయాయి. ‘షేల్’ నిల్వల ఆసరాతో అధిక ఉత్పత్తి కారణంగా అమెరికాలో క్రూడ్‌ను నిల్వ చేసే సామర్థ్యం గరిష్ఠానికి చేరుకుంది. అయితే, బ్రెంట్ క్రూడ్‌ను అత్యధికంగా(ప్రపంచ ఉత్పత్తిలో మూడింట రెండొంతులు) వినియోగించే మిగతా ప్రపంచ దేశాల్లో స్టోరేజీ సామర్థ్యం ఇంకా మెరుగ్గానే ఉండటంతో దీని ధర ఆ స్థాయిలో కుప్పకూలలేదు. సోమవారం ఫ్యూచర్స్ మార్కెట్లో జూన్ కాంట్రాక్టు బ్రెంట్ క్రూడ్ ధర 10% పైగా దిగజారి 25 డాలర్ల స్థాయిలో ముగిసింది. ఇక మంగళవారం జూన్ కాంట్రాక్టు డబ్ల్యూటీఐ ధర ఒకానొక దశలో దాదాపు 67% పైగా దిగజారి 6.5 డాలర్ల కనిష్టాన్ని తాకింది. బ్రెంట్ ధర కూడా 30% క్షీణించి 18.13 డాలర్లను చూసింది. అయితే, అత్యంత బలహీన డిమాండ్‌తో బ్రెంట్ రేటు సైతం తీవ్రంగా కుల్పకూలొచ్చని ఐబీడబ్ల్యూ డెయిలీ ఆయిల్ బ్రీఫ్‌కు చెందిన ఇగోర్ విండిష్ హెచ్చరిస్తున్నారు. అబ్బో ఎంత చౌక... క్రూడ్ ధరలు మైనస్‌లోకి కుప్పకూలడం కేవలం తాత్కాలికమే. చమురు సంబంధ అంశాల కంటే ఆర్థికపరమైన కారణాలవల్లే ఈ పరిస్థితి తలెత్తింది. అయితే, క్రూడ్ కొనుగోలుకు ఇది శుభతరుణంగా నేను భావిస్తున్నా. ఎక్కడచూసినా ఎడాపెడా చౌకగా ఆయిల్ దొరుకుతోంది. సౌదీ ఆయిల్ దిగుమతులపై నిషేధాన్ని పరిశీస్తున్నా. – డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రెసిడెంట్ గతంలో నమోదైన రోజుకు 100 మిలియన్ బ్యారెళ్ల చమురు డిమాండ్ అనేది ప్రపంచానికి ఇక శాశ్వత గరిష్ట స్థాయిగా నిలిచిపోవచ్చు. మరింత మైలేజీనిచ్చే వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాల జోరుతోపాటు కరోనా కారణంగా వినియోగదారుల స్వభావంలో నెలకొనే మార్పులు కూడా క్రూడ్ డిమాండ్‌ను కోలుకోనీయకుండా చేయొచ్చు. క్రూడ్ ధరలు మైనస్‌లోకి కుప్పకూలడం అసాధారణమైన విషయం. ఇదంతా కలా.. నిజమా అనిపిస్తోంది. – లూయీస్ డిక్సన్, ఆయిల్ మార్కెట్స్ అనలిస్ట్, రిస్టాడ్ ఎనర్జీ -
సౌరాష్ట్రకు ‘జై’
గత ఏడు సీజన్లలో మూడుసార్లు ఫైనల్‌కు చేరినా... ఒక్కసారి కూడా రంజీ ట్రోఫీ గెలవలేకపోయిన సౌరాష్ట్ర ఎట్టకేలకు విజయబావుటా ఎగరేసింది. జైదేవ్ ఉనాద్కట్ నాయకత్వంలో తొలిసారి విజేతగా అవతరించింది. సొంత మైదానంలో హోరాహోరీగా సాగిన తుది పోరులో బెంగాల్‌పై సాధించిన 44 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సౌరాష్ట్రను చాంపియన్‌ను చేసింది. చివరి రోజు నాలుగు వికెట్లతో ఆధిక్యం కోసం బెంగాల్ పోరాడినా లాభం లేకపోయింది. చివరకు రంజీ చరిత్రలో ఎక్కువ సార్లు ఫైనల్లో ఓడిన జట్టుగా బెంగాల్ నిలిచింది. రాజ్‌కోట్: భారత దేశవాళీ క్రికెట్ ప్రధాన టోర్నీ రంజీ ట్రోఫీలో కొత్త చాంపియన్ అవతరించింది. జైదేవ్ ఉనాద్కట్ నేతృత్వంలోని సౌరాష్ట్ర జట్టు మొదటిసారి విజేతగా నిలిచింది. సౌరాష్ట్ర, బెంగాల్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ శుక్రవారం ‘డ్రా’గా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా సౌరాష్ట్రకు ట్రోఫీ ఖరారైంది. చివరి రోజు 72 పరుగులు చేస్తే ఆధిక్యం అందుకునే స్థితిలో ఆట కొనసాగించిన బెంగాల్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 381 పరుగులకు ఆలౌటైంది. దాంతో మొదటి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేసిన సౌరాష్ట్రకు 44 పరుగుల ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన సౌరాష్ట్ర ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 105 పరుగులు చేసింది. అయితే విజేత ఖరారైన నేపథ్యంలో ముందుగానే ఆటను నిలిపివేసేందుకు ఇరు జట్లు అంగీకరించాయి. ఆ వెంటనే సొంత గడ్డపై సౌరాష్ట్ర సంబరాలు మొదలయ్యాయి. విజేత సౌరాష్ట్రకు రూ. 2 కోట్లు ప్రైజ్‌మనీ లభించింది. ఉనాద్కట్ జోరు... సీజన్ మొత్తం తన అద్భుత బౌలింగ్, కెప్టెన్సీతో సౌరాష్ట్రను నడిపించిన ఉనాద్కట్ చివరి రోజు కూడా కీలక పాత్ర పోషించాడు. ఓవర్‌నైట్ స్కోరు 354/6తో బరిలోకి దిగిన బెంగాల్ జట్టు అనుస్తుప్ మజుందార్ (151 బంతుల్లో 63; 8 ఫోర్లు)పైనే తమ ఆశలు పెట్టుకుంది. అయితే ఆరో ఓవర్లోనే ఆ జట్టుకు దెబ్బ పడింది. ఉనాద్కట్ బౌలింగ్‌లో అనుస్తుప్ ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. బ్యాట్స్‌మన్ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. అదే ఓవర్లో మరో రెండు బంతులకే ఆకాశ్ దీప్ (0) రనౌటయ్యాడు. సింగిల్ తీసేందుకు అవకాశం లేకపోయినా షాట్ ఆడిన ఆకాశ్ ముందుకు వచ్చాడు. కీపర్ బారోత్ విసిరిన బంతి స్టంప్స్‌ను తాకలేదు. అయితే చురుగ్గా వ్యవహరించిన ఉనాద్కట్ వెంటనే దాన్ని అందుకొని వికెట్లపైకి విసిరాడు. అప్పటికీ క్రీజ్‌లో వెనక్కి రాని ఆకాశ్ వెనుదిరిగాడు. ముకేశ్ కుమార్ (5)ను ధర్మేంద్ర జడేజా పెవిలియన్‌కు పంపగా... కొద్ది సేపటికే ఇషాన్ పొరెల్ (1)ను అవుట్ చేసి ఉనాద్కట్ బెంగాల్ ఆట ముగించాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర తరఫున అవి బారోత్ (39) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హార్విక్ దేశాయ్ (21), విశ్వరాజ్ జడేజా (17), అర్పిత్ వసవాద (3) వికెట్లు తీయడంలో బెంగాల్ సఫలమైంది. ఇన్నింగ్స్ 34వ ఓవర్ చివరి బంతికి బారోత్ అవుట్ కాగానే ఇరు జట్లు ఆటగాళ్లు కరచాలానికి సిద్ధపడ్డారు. ►1 సౌరాష్ట్ర జట్టు రంజీ ట్రోఫీ గెలవడం ఇదే మొదటిసారి. 1950–51 సీజన్ నుంచి జట్టు ఈ పేరుతో బరిలోకి దిగుతోంది. అంతకుముందు సౌరాష్ట్రకు పూర్వ రూపంగా ఉన్న, ఇదే ప్రాంతానికి చెందిన రెండు జట్లు నవానగర్ (1936–37), వెస్టర్న్ ఇండియా (1943–44) రంజీల్లో విజేతలుగా నిలిచాయి. ఆ రెండు సార్లు ఫైనల్లో బెంగాలే ఓడింది. ►12 రంజీల్లో అత్యధిక సార్లు ఫైనల్లో ఓడిన జట్టుగా బెంగాల్ నిలిచింది. 14 సార్లు తుది పోరుకు అర్హత సాధించిన బెంగాల్ 2 సార్లు మాత్రమే టైటిల్ అందుకోగలిగింది. బెంగాల్ ఆఖరిసారిగా 1989–90లో టైటిల్ సాధించింది. ►67 ఈ సీజన్లో జైదేవ్ ఉనాద్కట్ తీసిన వికెట్లు. రంజీ చరిత్రలో ఒకే సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో జైదేవ్ రెండో స్థానంలో నిలిచాడు. గత ఏడాది బిహార్ బౌలర్ అశుతోష్ అమన్ 68 వికెట్లు పడగొట్టాడు. -
భారత్‌లో తొలి 5జీ లైవ్ వీడియో కాల్
న్యూఢిల్లీ: స్వీడన్‌కు చెందిన టెలికం కంపెనీ ఎరిక్సన్ 5జీ లైవ్ వీడియో కాల్‌ను తొలిసారిగా భారత్‌లో ప్రదర్శించింది. ఇది భారత్‌లో తొలి 5జీ వీడియో కాల్ అని, క్వాల్కామ్ భాగస్వామ్యంతో దీనిని ప్రదర్శిస్తున్నామని ఎరిక్సన్ హెడ్(సౌత్ ఈస్ట్ ఏషియా, ఓషియానియా, ఇండియా) నున్‌జో మిర్టిల్లో చెప్పారు. 5జీ సర్వీస్‌లు మిల్లీమీటర్‌వేవ్(ఎమ్‌ఎమ్‌వేవ్–28 గిగాహెట్జ్, 38 గిగాహెట్జ్ స్పెక్ట్రమ్ బాండ్స్) స్పెక్ట్రమ్ ద్వారా అందుతాయని వివరించారు. 5జీ, 4జీ మొబైల్‌నెట్‌వర్క్స్‌కు ఎమ్‌ఎమ్‌వేవ్ స్పెక్ట్రమ్ కీలకమైనదని పేర్కొన్నారు. ఇక్కడ జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2019లో ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి 5జీ ఫోన్లు.... ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), మెషీన్ టు మెషీన్ కమ్యూనికేషన్స్‌వంటి తాజా టెక్నాలజీలకు 5జీ కీలకం కానున్నదని మిర్టిల్లో పేర్కొన్నారు. 5జీ కారణంగా భారత్‌లో కొత్త అవకాశాలు అందివస్తాయని వివరించారు. వచ్చే ఏడాది నుంచి 5జీ టెక్నాలజీని సపోర్ట్ చేసే స్మార్ట్ఫోన్ల అమ్మకాలు పెరగనున్నాయని క్వాల్కామ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజెన్ వగాడియా పేర్కొన్నారు. ఇంటర్నెట్ స్పీడ్ అధికంగా ఉండే 5జీ సర్వీస్‌లు భారత్‌లో ఇంకా ఆరంభం కాలేదు. ఈ సర్వీసులు ఇప్పటికే అమెరికా, దక్షిణ కొరియాల్లో లభిస్తున్నాయి. 5జీ సర్వీసులకు సంబంధించిన స్పెక్ట్రమ్‌ను ఈ ఆర్థిక సంవత్సరంలోనే వేలం వేయనున్నామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. -
5 నుంచి వందే భారత్
న్యూఢిల్లీ: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తొలిసారిగా ఢిల్లీ–కత్రా (జమ్మూకశ్మీర్) మధ్య అక్టోబర్ 5 నుంచి పరుగులు పెట్టనుంది. ఈ మేరకు టికెట్ల బుకింగ్‌ను ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ప్రారంభించినట్లు రైల్వే ఆదివారం ప్రకటించింది. అక్టోబర్ 3న హోంమంత్రి అమిత్ షా వందే భారత్‌ను ప్రారంభించనున్నారు. కాగా, ఈ హైస్పీడ్ రైలు ఢిల్లీ–కత్రా మధ్య ప్రస్తుతమున్న 12 గంటల ప్రయాణ సమయాన్ని 8 గంటలకు తగ్గించనుంది. ఈ రైలులో న్యూఢిల్లీ నుంచి ఆఖరి స్టేషన్ అయిన శ్రీ వైష్ణో దేవి కత్రా వరకు ప్రయాణించడానికి కనీస చార్జీలు రూ.1,630 కాగా, గరిష్టంగా రూ.3,015గా నిర్ణయించారు. మంగళవారం తప్ప వారంలో అన్ని రోజులు ఈ రైలు సేవలనందిస్తుంది. ట్రైన్ నెం: 22439 న్యూఢిల్లీ–కత్రా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరి, కత్రాకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది. వందే భారత్‌కు మార్గమధ్యలో అంబాలా కంత్, లుథియానా, జమ్మూ తావి స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది. -
సౌదీ కీలక నిర్ణయం : తొలిసారి టూరిస్ట్ వీసా
సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగానికి ఊతమిచ్చే చర్యల్లో భాగంగా తొలిసారిగా పర్యాటక వీసాలు జారీ చేయనుంది. సౌదీ అరేబియా చమురు నుండి దూరంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను విస్తృతం చేసే ప్రయత్నంలో భాగంగా సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ విజన్ 2030 కార్యక్రమంలో తొలి అడుగు వేశారు. సౌదీ అరేబియా చమురు మౌలిక సదుపాయాలపై వినాశకరమైన దాడులు జరిగిన రెండు వారాల తరువాత ఈ ప్రకటన రావడం విశేషం. చమురు బావులపై ఇటీవల జరిగిన డ్రోన్ దాడుల్లో ఆ దేశ ఆదాయానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని పర్యాటకం ద్వారా భర్తీ చేసుకోవాలని సౌదీ సర్కార్ యోచిస్తోంది. "అంతర్జాతీయ పర్యాటకులను సౌదీ అరేబియాకు ఆహ్వానించడం తమ దేశానికి సంబంధించిన దొక చారిత్రాత్మక క్షణం" అని పర్యాటక చీఫ్ అహ్మద్ అల్-ఖతీబ్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే విదేశీ మహిళల కోసం రాజ్యం తన కఠినమైన దుస్తుల నియమావళిని కూడా సులభతరం చేస్తుందని, సౌదీ మహిళలకు ఇప్పటికీ బహిరంగ దుస్తులు ధరించే శరీర కవచం లేని అబయ వస్త్రాన్ని లేకుండా వెళ్ళడానికి వీలు కల్పిస్తుందని ఖతీబ్ చెప్పారు. సౌదీలోని పర్యాటక ప్రాంతాలను చూసి కచ్చితంగా ఆశ్యర్యానికి గురవుతారు. ఉత్కంఠభరితమైన సహజ ప్రకృతి సౌందర్యం, యునెస్కో గుర్తించిన ఐదు వారసత్వ ప్రదేశాలు పర్యాటకులను కచ్చితంగా కనువిందు చేస్తాయని సౌదీ ఓ ప్రకటనలో వెల్లడించింది. శనివారం నుంచి ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ టూరిస్ట్ వీసాల కోసం 49 దేశాల పౌరులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. -
లోక్‌సభలో తొలి అడుగులు
ప్రపంచంలోనే భారీ ఎన్నికలుగా నమోదైన 2019 లోక్‌సభ ఎన్నికల్లో అనేక రికార్డులు నమోదయ్యాయి. రాజకీయ ఉద్దండులైన ఎంతోమంది సీనియర్లను ఈ ఎన్నికల్లో మట్టికరిపించి ఓ సరికొత్త తరం పార్లమెంట్లో అడుగు పెట్టింది. ఈసారి ఏకంగా 300 మంది కొత్తవారు చట్టసభకు ఎన్నికవ్వడం ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓ ప్రత్యేకత. అందులో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన వారిలో బీజేపీ రాజకీయ వ్యూహకర్తగా పేరొందిన అమిత్ షా మొదలుకుని క్రికెటర్ గౌతమ్ గంభీర్, తేజస్వీ సూర్య, జర్నలిస్టు ఇంతియాజ్, దళిత ప్రతినిధి రమ్యా హరిదాస్తోపాటుగా గాయకులు, సినీరంగ ప్రముఖులు వంటి వారెందరో ఉన్నారు. అమిత్ షా (బీజేపీ– గుజరాత్) బీజేపీ అధ్యక్షుడు, నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే) చైర్పర్సన్, అమిత్‌షా లోక్‌సభలోకి తొలిసారిగా అడుగుపెడుతున్నారు. చిన్నప్పటి నుంచీ ఆరెస్సెస్‌లో చురుకైన కార్యకర్తగా ఉన్న అమిత్‌షా గుజరాతీ వ్యాపారవేత్త కుమారుడు. 1986లో బీజేపీలో చేరి 33 ఏళ్ళ వయస్సులో 1997లో తొలిసారిగా గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రెండు దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా, హోంమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన్ను గత ఐదేళ్ళుగా భారత రాజకీయాల్లో ప్రముఖ పాత్రపోషించేలా చేసింది. 1990 నుంచి ప్రధాని మోదీ తలలో నాలుకలా ఉంటూ, గుజరాత్‌లోనూ, దేశవ్యాప్తంగానూ బీజేపీని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. జోతిమణి (కాంగ్రెస్– తమిళనాడు) తమిళనాడులో కాంగ్రెస్ తరఫున ఎన్నికైన ఏకైక మహిళా అభ్యర్థి జోతిమణి. కరూర్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికై తొలిసారి లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. 22 ఏళ్ళకే రాజకీయాల్లోకి వచ్చిన జోతిమణి, మాజీ డిప్యూటీ స్పీకర్, నాలుగుసార్లు ఎంపీ అయిన ఎం.తంబిదురైని 4 లక్షలకుపైగా ఓట్ల తేడాతో ఓడించారు. ఇంతియాజ్ జలీల్ (ఎంఐఎం–ఔరంగాబాద్) ఎంఐఎం నుంచి లోక్‌సభలోకి ప్రవేశిస్తున్న పాత్రికేయుడు ఇంతియాజ్‌కి లోక్‌సభ సభ్యుడిగా ఇది తొలి అనుభవం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌నుంచి తొలుత ఈయన అభ్యర్థిత్వం తిరస్కరణకు గురైనా ప్రకాష్ అంబేడ్కర్ వంచిత్ బహుజన్ అఘాదీ పొత్తులో అదృష్టవశాత్తూ ఇంతియాజ్‌కి ఈ సీటు దక్కింది. శివసేన సీనియర్ నాయకుడు చంద్రకాంత్ ఖయిరేని అతితక్కువ ఓట్ల మెజారిటీతో ఓడించారు. పదిహేనేళ్ళ అనంతరం మహారాష్ట్ర నుంచి ఓ ముస్లిం లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిమీ చక్రవర్తి (తృణమూల్– పశ్చిమబెంగాల్) చిత్రపరిశ్రమనుంచి వచ్చి ఈ ఎన్నికల్లో రాణించిన వారిలో పశ్చిమబెంగాల్‌కి చెందిన మిమీ చక్రవర్తి, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి పోటీ చేసిన సన్నీడియోల్ ప్రముఖులు. ప్రముఖ సినీతార మిమీ చక్రవర్తి పశ్చిమబెంగాల్లోని జాదవ్‌పూర్ నుంచి లోక్‌సభకు తొలిసారిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి అనుపమ్ హజ్రాని దాదాపు మూడు లక్షల ఓట్ల మెజారిటీతో ఓడించి ఘన విజయం సాధించారు మిమీ చక్రవర్తి. బీజేపీ అభ్యర్థిగా గురుదాస్పూర్నుంచి పోటీ చేసిన సన్నీడియోల్ కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖడ్‌పై 82,459 ఓట్ల మెజారిటీతో గెలుపొంది తొలిసారిగా లోక్‌సభలోకి అడుగిడుతున్నారు. గౌతమ్ గంభీర్ (బీజేపీ–తూర్పు ఢిల్లీ) రాజకీయవేత్తగా మారిన సుపరిచిత క్రికెట్ క్రీడాకారుడు గౌతమ్ గంభీర్ కూడా తొలిసారి లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. తూర్పు ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన గౌతమ్ గంభీర్ ఆప్ అభ్యర్థి అతిషీ మర్లేనాపై గెలుపొందారు. హన్స్‌రాజ్ హన్స్ (బీజేపీ– నార్త్‌వెస్ట్ ఢిల్లీ ) నార్త్‌వెస్ట్ ఢిల్లీనుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన ప్రముఖ పంజాబీ సూఫీ గాయకుడు హన్స్‌రాజ్ హన్స్ కూడా మొదటిసారిగా లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. మాజీ ఎంపీ ఉదిత్‌రాజ్ స్థానంలో చివరి క్షణంలో హన్స్‌రాజ్ హన్స్‌ని బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. తొలినుంచి రాజకీయాల్లో ఆసక్తి కలిగిన హన్స్‌రాజ్‌హన్స్ పంజాబ్‌లోని జలంధర్ నుంచి శిరోమణి అకాలీదళ్ పార్టీతరఫున 2009 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2014లో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. 2016లో బీజేపీలో చేరారు. ప్రజ్ఞాఠాకూర్ (బీజేపీ–భోపాల్) మాలెగావ్ బాంబు పేలుళ్ళ కేసులో నిందితురాలు, సొంతపార్టీ బీజేపీలోనూ, బయటా విమర్శలనెదుర్కొంటున్న ప్రజ్ఞాఠాకూర్ సైతం తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన ప్రజ్ఞాఠాకూర్ కాంగ్రెస్ దిగ్గజం దిగ్విజయ్‌సింగ్‌ను మట్టికరిపించారు. రవిశంకర్ ప్రసాద్ (బీజేపీ–బిహార్) బిహార్‌లోని పాట్నా సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన రవిశంకర్ ప్రసాద్ సమీప ప్రత్యర్థి, బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హాను 2.84 లక్షల ఓట్ల మెజార్టీతో ఓడించి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టబోతున్నారు. స్మృతీ ఇరానీ (బీజేపీ–అమేథీ) గాంధీ కుటుంబాన్ని చిరకాలంగా ఆదరిస్తోన్న యూపీలోని అమేథీ నియోజకర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేసిన మాజీ మంత్రి స్మృతీ ఇరానీ ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై 55,120 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తొలిసారి లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. రమ్యా హరిదాస్ (కాంగ్రెస్– కేరళ) కేరళలోని అలత్తూర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున రమ్యాహరిదాస్ పోటీచేసి గెలుపొందారు. ఈ స్థానానికి ఓ దళిత మహిళ రమ్యాహరిదాస్ పేరు వినిపించగానే అంతా ముక్కున వేలేసుకున్నారు. హేమాహేమీలను వదిలేసి రాజకీయ అక్షరాభ్యాసం చేస్తోన్న పంచాయతీ స్థాయి నాయకురాలు రమ్యని ఎంచుకోవడం కాంగ్రెస్ సీనియర్లకు ససేమిరా మింగుడుపడలేదు. ఎన్ని విమర్శలెదురైనా, ఎంతమంది అగౌరవ పరిచినా మొక్కవోని దీక్షతో పోరాడి ఈ ఎన్నికల్లో గెలుపొందారు. రెండుసార్లు ఎంపీగా ఉన్న సీపీఎం నాయకుడు పీకే బిజూని ఓడించి తొలిసారి లోక్‌సభలోకి అడుపెడుతున్నారు రమ్యాహరిదాస్. మహువా మోయిత్రా (తృణమూల్ – పశ్చిమ బెంగాల్) పశ్చిమబెంగాల్లో బీజేపీ «సునామీకి తట్టుకొని నిలబడిన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మహువా మోయిత్రా తొలిసారిగా లోక్‌సభలోకి ప్రవేశించబోతున్నారు. కోల్‌కతాలో పుట్టిపెరిగి, అమెరికాలో చదువుకున్న మోయిత్రా 2008లో కాంగ్రెస్‌లో చేరి, ఆ తర్వాత తృణమూల్‌కి మారారు. 2016లో నదియా జిల్లాలోని కరీంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి అదే జిల్లాలోని కృష్ణానగర్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఫుట్‌బాల్ క్రీడాకారుడు కల్యాణ్ చౌబేపై 65,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తేజస్వీ సూర్య (బీజేపీ– కర్ణాటక) దక్షిణ బెంగళూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికైన తేజస్వీ సూర్య అత్యంత పిన్నవయస్కుడైన ఎంపీగా తొలిసారి లోక్‌సభలోకి అడుగుపెట్టబోతున్నారు. న్యాయవాద వృత్తిలో ఉన్న తేజస్వీ సూర్య ఏబీవీపీ నాయకుడిగా, ఆరెస్సెస్‌లో క్రియాశీలక కార్యకర్తగా ఉంటూ బీజేపీ యువమోర్చా నాయకుడిగా ఎదిగారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ‘‘మీరు మోదీతో ఉంటే దేశం పక్షాన ఉన్నట్టు, లేదంటే దేశానికి వ్యతిరేకంగా ఉన్నట్టు’’అంటూ తేజస్వీ చేసిన వీడియో వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. -
ఉత్సాహంగా ఓటేస్తాం
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ దేశమంతా సందడి నెలకొంది. తొలిదశ పోలింగ్‌కు మరికొన్ని రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా స్వస్థలాలకు వెళ్లేందుకు పలువురు సిద్ధమవుతుండగా, తొలిసారి ఓటుహక్కును వినియోగించుకునేందుకు యువతీయువకులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు లక్షలాది మంది ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏదేమైనా ఓటేయాల్సిందే.. తలకు మించిన భారమే అయినా ఈసారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్వస్థలమైన పశ్చిమబెంగాల్‌కు వెళతానని దక్షిణ ఢిల్లీలో ఉంటున్న టీ వ్యాపారి నిఖిల్ పట్వారియా(47) తెలిపారు. ‘ఇటీవల నా తండ్రి అంత్యక్రియలు జరిగాయి. నదియా జిల్లాలోని స్వగ్రామం కృష్ణనగర్‌కు వెళ్లాలంటే రూ.15,000 ఖర్చవుతుంది. అయినా సరే ఊరికి వెళ్లి ఓటు వేస్తాను’ అని వెల్లడించారు. తాను గత 21 సంవత్సరాలుగా ఢిల్లీలోని చిత్తరంజన్ పార్క్ ప్రాంతంలో టీ–అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. యువతలో అసంతృప్తి హైదరాబాద్‌లో రాజకీయ ప్రచార వ్యూహకర్తగా పనిచేస్తున్న అనుస్తుప్‌రాయ్ బర్మన్(25) ఎన్నికల నేపథ్యంలో స్వస్థలమైన బెంగాల్‌లోని బరసత్‌కు వెళుతున్నట్లు చెప్పారు. మే 19న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తాను ఓటు హక్కును వినియోగించుకుంటానని తెలిపారు. కాగా, సుస్థిరాభివృద్ధితో పాటు మైనారిటీలపై దాడులు, మూకహత్యలు, పెద్దనోట్ల రద్దుపై యువత ప్రధానంగా అసంతృప్తితో ఉన్నట్లు వెల్లడించారు. రఫేల్ ప్రభావం ఉంటుంది.. మతోన్మాదుల నియంత్రణలో గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని బిహార్‌కు చెందిన ప్రజాసంబంధాల అధికారి ప్రీతి సింగ్(27) అభిప్రాయపడ్డారు. ‘రఫేల్ ఒప్పందంపై చెలరేగిన వివాదం, అవినీతిమయమైన విద్యావ్యవస్థ ప్రధాన సమస్యగా మారాయి. మనకు మంచి నాయకుడు కావాలంటే ప్రతీఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. బిహార్‌లోని పట్నాసాహిబ్ లోక్‌సభ స్థానానికి మే 19న జరిగే ఎన్నికల్లో నా ఓటు హక్కును వినియోగించుకుంటాను’ అని ప్రీతి తెలిపారు. ఢిల్లీకి కేజ్రీవాల్ బెస్ట్.. ప్రధానిగా మోదీ.. ఢిల్లీకి చెందిన ఆటో డ్రైవర్లు రాజు, సకీల్ ఖాన్లు లోక్‌సభ ఎన్నికలపై మాట్లాడారు. ఆటో చార్జీలు పెంచాలని ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాజు, ఖాన్ స్పందిస్తూ..‘ఆటో చార్జీలు పెరిగితే ఎక్కే ప్రయాణికులు తగ్గిపోయే అవకాశముంది. ఈ నిర్ణయం ఆటో డ్రైవర్లకు నిజంగా> లబ్ధి చేకూరుస్తుందని నేను భావించడం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాలు, పనితీరుపై మేమంతా సంతృప్తిగా ఉన్నాం. కానీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ప్రధాని మోదీకే ఓటు వేస్తాం. ఆప్ ప్రభుత్వం ఢిల్లీలో మంచి పనులు చేపట్టింది. కానీ మోదీ కాకుండా మరో వ్యక్తిని ప్రధానిగా ఊహించుకోలేం. మోదీ గొప్ప ప్రధాని అయితే, కేజ్రీవాల్ గొప్ప సీఎం’ అని తెలిపారు. -
వరంగల్ : మొదటిసారైతే నేమి... గెలుస్తాం
రాజకీయాల్లో రాణించాలంటే అనుభవంతో పాటు వ్యూహ రచన, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పరిచయాలు, జనాల్లో పలుకుబడి ఉండాలి. ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం అలాంటి సంప్రదాయం నెమ్మదిగా రూపుమారుతోంది. ఇప్పటి వరకు జనాలకు అంతగా పరిచయం లేని వారు తెరపైకి వచ్చి హేమాహేమీలకు దీటుగా ప్రచారం చేస్తున్నారు. ఎంతో అనుభవం ఉన్నవారిలా ఉపన్యాసాలు ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. వారు వన్‌సైడే అనుకున్న చోట ఉత్కంఠ ఫలితాలకు తెరతీస్తున్నారు. సాక్షి, వరంగల్ రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో పోటీ చేయని వారు రాష్ట్ర అసెంబ్లీ–2018 ఎన్నికల బరిలో నిలిచారు. కొందరు కొత్తగా రాజకీయాల్లోకి వస్తే మరికొందరు రాజకీయాల్లో ఉంటు పోటీ చేయడం ఇదే తొలిసారి. వారసత్వం, వ్యాపార రంగాల నుంచి రాజకీయాల్లో వచ్చి ప్రచార జోరు పెంచుతున్నారు. దీంతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇలా ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్రులగా బరిలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సీనియర్ల సలహాలు.. రాజకీయ ఉద్ధండులకు తీసిపోకుండా వ్యూహాలు పన్ని ప్రచారంలో దూసుకెళ్తూ వారి వెన్నులో వణుకు పుట్టిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. పార్టీ సీనియర్లను గౌరదవిస్తూనే వారి సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎక్కడ అసంతృప్తి సెగ రాజుకోకుండా తమదైన శైలిలో ఆకర్షణగా నిలుస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని 12 నియోజకవర్గాల్లో 172 మంది బరిలో ఉండగా కొందరికీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. కాగా ఎలాంటి బెణుకు లేకుండా ప్రాంతాన్ని బట్టి అక్కడి సమస్యలను కళ్లకు కట్టే విధంగా వివరించడంతో పాటు వాటి పరిష్కార మార్గాలను పూసగుచ్చినట్లు తెలుపుతున్నారు. వారిలో ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచిన వారి వవరాలు ఇలా ఉన్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఇందిర.. సింగపురం ఇందిర తండ్రి దేవదానం కాంగ్రెస్ పార్టీ అభిమాని. వరంగల్‌కు ఇందిరాగాంధీ వచ్చిన సమయంలో ఇందిర పుట్టంది. దీంతో ఇందిరమ్మ పేరును తన బిడ్డకు నామకరణం చేశాడు దేవదానం. ఇందిర రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పదవులను నిర్వర్తిస్తున్నారు. కాగా ప్రస్తుతం పార్టీ స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్యకు గట్టి పోటీ ఇస్తున్నారు. డోర్నకల్‌లో లక్ష్మణ్ నాయక్.. డోర్నకల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా లక్ష్మణ్ నాయక్ పోటీ చేస్తున్నారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాలంటే మక్కువతోనే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచారు. బీజేపీలో వివిధ పదవులు చేపట్టారు. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురానికి చెందిన లక్ష్మణ్ నాయక్‌కు బీజేపీ డోర్నకల్‌లో ఆవకాశం ఇవ్వడంతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుం టున్నారు. వారసత్వంగా కీర్తిరెడ్డి మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కోడలు డాక్టర్ కీర్తిరెడ్డి బీజేపీ భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. 2009 నుంచి పార్టీలో క్రియాశీలక సభ్యురాలుగా కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ నుంచి సిరికొండ మధుసూదనాచారి, కాంగ్రెస్ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గండ్ర సత్యనారాయణ బరిలో ఉన్నారు. కీర్తిరెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడం కొత్త అయినప్పటికీ ప్రచారంలో తన పోటీదారులతో సమానంగా రాణిస్తున్నారు. ఎక్కడ వెనుకడుగు వేయడం లేదు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను కడిగిపారేస్తోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న నాయకురాలిగా మాట్లాడుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటోంది. మానుకోటలో హుస్సేన్ నాయక్.. మహబూబాబాద్ నియోజవర్గం నుంచి ప్రముఖ వ్యాపారవేత్త హుస్సేన్ నాయక్ బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. తొలుత కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఆయన బీజేపీ టికెట్‌ను దక్కించుకున్నారు. కొంత కాలంగా మహబూ బాబాద్ ప్రజలతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా మానుకోటలో టీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ శంకర్ నాయక్, కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ బరిలో ఉన్నారు. హుస్సేన్ నాయక్ తనను గెలిపించాలని .. మానుకోటను అభివృద్ధి చేసి చూపిస్తానని ఓటర్లను వేడుకుంటున్నారు. వ్యాపార రంగం నుంచి వద్దిరాజు రవిచంద్ర వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రజాకూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి వద్దిరాజు రవిచంద్ర బరిలో ఉన్నారు. గ్రానైట్ వ్యాపారంలో ఒదిగిపోయారు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం ఇదే తొలిసారి. కాగా తూర్పులో ద్విముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్‌కు గట్టి పోటీదారుడిగా రవిచంద్ర ప్రచారం కొనసాగిస్తున్నారు. ముందుగా ఒకింత తడబడిన ప్రస్తుతం తన వాణిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే అమలు చేస్తే పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. -
నా భార్య చిత్రహింసలు పెడుతోంది..
సాక్షి, విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ఓ భర్త గృహహింస చట్టం కింద కోర్టును ఆశ్రయించాడు. తన భార్య తనను చిత్ర హింసలు పెడుతుందంటూ రామ్‌కుమార్ అనే వ్యక్తి విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వివాహం జరిగి రెండు నెలలకే తన భార్య వేధింపులకు పాల్పడుతోందని విజయవాడ కంచికామకోటి నగర్‌కు చెందిన గోగు రామ్ కుమార్ అనే వ్యక్తి మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. విజయవాడ మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ పిటీషన్‌ను స్వీకరించడంతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అప్పటికే వివాహమైన సదరు మహిళ .. ఆ సంగతి దాచి తనను మరో వివాహం చేసుకుందని పేర్కొన్నాడు. పెళ్లైన రెండు నెలల నుంచి తనను మానసికంగా, శారీరకంగా ఆమె హింసిస్తోందని రామ్‌కుమార్ ఆరోపిస్తున్నాడు. కాగా, రాష్ట్రంలో ఈ తరహా తొలి కేసు ఇదే కావటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
రాహుల్ అధ్యక్షతన సీడబ్ల్యూసీ భేటీ
న్యూఢిల్లీ: పార్టీ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రాహుల్‌గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి తొలిసారి అధ్యక్షత వహించనున్నారు. దీంతో నూతన సారథికి సీడబ్ల్యూసీ ఘన స్వాగతం పలకనుంది. ఈ భేటీ శుక్రవారం ఉదయం పదిన్నరకు ప్రారంభమవుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ తెలిపారు. కాగా ఈ సమావేశ అజెండా అధికారికంగా వెల్లడి కానప్పటికీ దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఇందులో చర్చించ నున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కనబరిచిన ప్రభావవంతమైన పనితీరును పార్టీకి భవిష్యత్‌లో ఎలా అన్వయించాలో యోచించనున్నట్లు తెలిపారు. 2జీ కేసులో నిందితులందరూ నిర్దోషులన్న కోర్టు తీర్పుపైనా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, నరేంద్ర మోదీ ఈ కేసును ప్రచారాస్త్రంగా చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో అవినీతి జరగలేదన్న అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ఈ మేరకు ప్రణాళిక రూపొందించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వివరించాయి. గతంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ గైర్హాజరీలో పార్టీ ఉపాధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ సీడబ్ల్యూసీ సమావేశానికి అధ్యక్షత వహించినప్పటికీ పూర్తి స్థాయి అధ్యక్షుడిగా మాత్రం ఇదే తొలి భేటీ కావడం గమనార్హం. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ డిసెంబర్ 11న ఏకగ్రీవంగా ఎన్నిక కాగా 16న బాధ్యతలు చేపట్టారు. -
పార్లమెంట్లో ఫస్ట్ టైం.. ఏం మాట్లాడతాడో?
సాక్షి, న్యూఢిల్లీ : దాదాపు ఐదేళ్ల తర్వాత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తొలిసారి పార్లమెంట్లో గళం వినిపించబోతున్నాడు. గురువారం రాజ్యసభలో ఓ కీలక అంశంపై చర్చించబోతున్నాడు. విద్యార్థులకు ‘రైట్ టూ ప్లే’ అనే అంశంపై ఆయన ప్రసంగించబోతున్నారు. 2012లో సచిన్ పెద్దల సభకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన సభకు చాలా అరుదుగా హాజరవుతూ వస్తున్నారు. ఆయా సమయాల్లో కూడా చర్చల్లో పాల్గొనకుండా గప్ చుప్‌గా ఉంటున్నాడనే విమర్శలు వినిపించాయి కూడా. అయితే ఇప్పుడు తాను ప్రసంగించే అంశంపై స్వయంగా సచిన్ నోటీసు ఇవ్వటం విశేషం. రైట్ టూ ప్లే అండ్ ఫ్యూఛర్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ ఇండియా అనే అంశంపై సచిన్ సుదీర్ఘంగా ప్రసంగించనున్నాడు. విద్యతోపాటు ఆటలు కూడా తప్పనిసరి చేయాలని.. అందుకు అవసరమైన వసతులను ప్రభుత్వమే కల్పించాలని సచిన్ మాట్లాడబోతున్నాడు. దీనికి బీజేపీ నేత రాజీవ్ సింగ్ జువేవ్, కాంగ్రెస్ నేత పీఎల్ పూనియా మద్దతు ఇస్తూ తమ పేర్లను కూడా నోటీసులో పేర్కొన్నారు. ఆటలకు దూరంగా ఉంటున్న విద్యార్థుల సంఖ్య నానాటికీ ఎక్కువైపోతుందని.. ఈ విషయంలో పురోగతి కోసం సచిన్ చేసిన ప్రతిపాదనకు తాము అంగీకరిస్తున్నామని వారిద్దరూ తెలిపారు. ఒకవేళ సచిన్ చేసిన ప్రతిపాదన చట్ట రూపం దాలిస్తే.. విద్యాహక్కు, సమాచార హక్కులకు సవరణలు చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సచిన్ ప్రసంగం ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి నెలకొంది. -
రికార్డ్ స్థాయిల వద్ద ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా నిఫ్టీ రికార్డు గరిష్టాన్ని నమోదు చేయగా, సెన్సెక్స్ కూడా అదేబాటలో పయనించింది. అతేకంఆదు అల్ టైం రికార్డ్ 30,000వైపు దూసుకుపోతోంది. సెన్సెక్స్ 290 పాయింట్ల లాభంతో 29,910వద్ద ముగియగా, నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 9237వద్ద స్థిరపడింది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ రికార్డ్ స్థాయిలవద్ద, ప్రధానంగా నిఫ్టీ తొలిసారి 92వందల స్థాయిని తాకడం విశేషం. ఒక్కఐటీ మినహా దాదాపు అన్ని రంగాలు లాభపడగా, రియల్టీ, ఫార్మా, బ్యాంక్ నిఫ్టీ 1.4-0.5 శాతం మధ్య ఎగశాయి. రిలయన్స్, ఎల్ అండ్ టీ లాభాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. భారతి ఎయిర్ టెల్, విప్రో, బీపీసీఎల్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి.ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ వంటి దిగ్గజాలతోపాటు డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్, ఏసీసీ లాభపడగా, ఐవోసీ, హెచ్‌సీఎల్ టెక్, ఇండస్ఇండ్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ నష్టపోయాయి. మరోవైపు శ్రీరామ నవమి సందర్భంగా మంగళవారం(4న) స్టాక్ ఎక్స్ఛేంజీలకు సెలవు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లో ట్రేడింగ్ మళ్లీ బుధవారం(5న) యధావిధిగా మొదలుకానుంది. -
భారీగా పడిపోయిన ఇన్ఫోసిస్ నియామకాలు
హైదరాబాద్: ఒక వైపు దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ లో వివాదంకొనసాగుతుండగానే మరో షాకింగ్ న్యూస్ వెలుగు చూసింది. సంస్థలో ఉద్యోగుల నియమకాలు మొదటిసారి భారీగా పడిపోయాయి. 33ఏళ్ల చరిత్రలో తొలిసారి నెగిటివ్ గ్రోత్‌ను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫీ నియామకాలు భారీగా పడిపోయాయని సంస్థ సహ వ్యవస్థాపకులు ఎన్ ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యలను ఉటంకిస్తూ తెలంగాణ ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ప్రతిసంవత్సరం 20-25 వేలు నియామకాలు చేపట్టే సంస్థ ఈ ఏడాది కేవలం 6వేలమందిని మాత్రమే నియమించుకున్నట్టు ఐటి శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ నిపుణుల నియమకాలు 75 శాతం పడిపోయాయన్నారు. అలాగే వేరు వేరు కారణాల రీత్యా సుమారు 7 వేలమంది సంస్థను వీడారు. ఇండియాసాఫ్ట్-2017 కాన్ఫరెన్స్ లో ప్రసంగించిన జయేశ్ ఈ వివరాలను వెల్లడించారు. ఐటి పరిశ్రమపై కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్, డిజిటల్ ఇంటిలిజెన్స్ ప్రభావంపై మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా క్వార్టర్ 3 ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్బంగా కంపెనీ సీఈవో విశాల్ సిక్క ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిదినెలల్లో 5700మంది నియమించుకున్నట్టు చెప్పారు. అలాగే గత ఏడాది ఈ సంఖ్య 17 వేలుగా పేర్కొన్నారు. అయితే ఉద్యోగులను సంఖ్య పెంచుకునే అవకాశం ఉన్నప్పటికీ , నియామకరేటులో మందగమనం ఉండనుందని సూచించడం గమనార్హం. కాగా క్యూ 3 ఫలితాలు సమయంలో విడుదల చేసిన కంపెనీ ప్రకటన ప్రకారం డిసెంబర్ 31 నాటికి ఇన్ఫీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,99,763 ఉంది. సెప్టెంబర్ 30 నాటికి ఈ సంఖ్య 1,99,829 గాను, జూన్ 30 నాటికి 1,97,050గాను ఉంది. -
వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో
ముంబై: ఆద్యంతం ఓలటైల్ గా సాగిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి వరుసగా నాలుగవ రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. అలాగే భారీగా నెలకొన్న అమ్మకాల ఒత్తిడి తో నిఫ్టీ నాలుగు నెలల కనిష్టానికి చేరింది. సెన్సెక్స్ 97 పాయింట్లు క్షీణించి 27,430 వద్ద నిఫ్టీ 29 పాయింట్ల నష్టంతో 8,485 వద్ద క్లోజ్ అయ్యాయి. కీలక మద్దతుస్థాయిలను కోల్పోతున్న నిఫ్టీ సుమారు నాలుగు నెలల తరువాత మొదటిసారి 8,500 దిగువన ముగిసింది. చివరికి ఆరంభ నష్టాలనుంచి మిడ్ సెషన్లో కోలుకున్నప్పటికీ చివరి అర్థగంటలో పెరిగిన అమ్మకాలతో మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. అన్ని సెక్టార్లూ నష్టాల్లో ఉండగా, ఎఫ్ఎంసీజీ స్వల్పంగా లాభపడింది. ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్, ప్రభుత్వరంగ బ్యాంకింగ్, ఫార్మా, రియల్టీ, మెటల్స్, ఐటీ రంగాలు నెగిటివ్ గా ముగిశాయి. గ్రాసిమ్, ఏషియన్ పెయింట్స్, విప్రో, బీపీసీఎల్, అరబిందో, టాటా స్టీల్, స్టేట్‌బ్యాంక్, బీవోబీ, ఎన్టీపీసీ నష్టపోగా, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్ గాఅహిందాల్కో 4 శాతం లాభపడి టాప్ గెయినర్ గా నిలిచింది. ఇన్ఫ్రాటెల్, ఐటీసీ, ఏసీసీ, హీరోమోటో, భెల్, గెయిల్, టీసీఎస్, కొటక్ బ్యాంక్, హెచడీఎఫ్‌సీ బ్యాంక్ లాభపడ్డాయి. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి ఒక పైసా నష్టంతో 66.71వద్ద ఉంది. అయితే బంగారం ధరలుమాత్రం వెలవలబోయాయి. ఇటీవలి లాభాల నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా ఎంసీఎక్స్ మార్కెట్ లో 312 రూపాయల నష్టంతో పది గ్రా.పుత్తడి రూ. 30,354వద్ద ఉంది. -
13 ఏళ్లలో మొదటిసారి..
ఇస్లామాబాద్: పగటి పూట మాత్రమే ఉత్సాహంగా ఉంటూ.. రాత్రయితే డీలా పడిపోతున్న పాకిస్తాన్ 'సోలార్ కిడ్స్'.. రషీద్, హషీమ్‌లు ఎట్టకేలకు కొంత పురోగతి సాధించారు. తొమ్మిదేళ్ల వయసున్న రషీద్, పదమూడేళ్ల వయసుగల హసీమ్ సోదరులు బుధవారం రాత్రి తమ జీవితంలో మొదటి సారిగా రాత్రి వేళలో కొంత సమయాన్ని ఆస్వాదించారు. 13 ఏళ్లలో మొదటిసారిగా రాత్రి వేళ తన కుమారులు స్వయంగా మెట్లెక్కారనీ, కాసిన్ని మంచినీరు కూడా త్రాగారని వారి తండ్రి మహమ్మద్ హషిం హర్షం వ్యక్తం చేశాడు. పగటి పూట అందరు పిల్లల మాదిరిగానే ఉంటున్న ఈ చిన్నారులు సూర్యుడు అస్తమించడంతోనే వారి చైతన్యాన్ని కోల్పోతున్నారు. మళ్లీ సూర్యోదయం కాగానే శక్తి పుంజుకుంటున్నారు. దీనికి పరిష్కారం కోసం ఇటీవల వారికి నిర్వహిస్తున్న న్యూరోట్రాన్స్మిషన్ ట్రీట్మెంట్ మూలంగా కొంత మార్పు వచ్చిందని హషిం తెలిపాడు. అయితే ఈ చిన్నారుల డీఎన్ఏను పరీక్షించడం ద్వారా వైద్యులు వారి సమస్యకు పూర్తి పరిష్కారం చూపాలని భావిస్తున్నప్పటికీ.. ఇప్పటికే 300కు పైగా డీఎన్ఏ టెస్టులు నిర్వహించినా ఆశించిన ఫలితం మాత్రం లేదు. వీరికి పూర్తి స్థాయిలో నయం చేసేందుకు అమెరికాలోని మేరిలాండ్ యూనివర్సిటీ బృందం సైతం సహకారం అందిస్తోంది. అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారుల వైద్యరంగానికే సవాల్ విసురుతున్నారు. -
రామ్ చరణ్, అఖిల్, జీవా... తొలిసారిగా స్టేజ్ డ్యాన్స్!
అవార్డు వేడుకలంటే ఆటా పాటా కామన్. హీరో, హీరోయిన్లు హిట్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తుంటే, హుషారుగా వన్స్ మోర్ అనాలనిపిస్తుంది. ఈ సందడితో పాటు సినిమా పరిశ్రమకు సేవలందించి, చరిత్రలో నిలిచిపోయిన పెద్దలను గౌరవించుకుంటే అప్పుడు ఆ వేడుకకు నిండుదనం వస్తుంది. ఈ 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లో ‘ఐఫా-ఉత్సవమ్’ అవార్డుల వేడుక అత్యంత వైభవంగా ఈ విధంగానే జరగనుంది. జియోవన్ స్మార్ట్‌ఫోన్, రేనాల్ట్‌ల సహ సమర్పణలో ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఈ ‘ఐఫా-ఉత్సవమ్’ను అందిస్తోంది. చలన చిత్ర చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే మహానటుడు డా. అక్కినేని నాగేశ్వరరావు, శతాధికచిత్రాల నిర్మాత డా. డి. రామానాయుడు, దర్శక దిగ్గజం కె.బాలచందర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్మెస్ విశ్వనాథన్‌లకు ఈ వేదికపై నివాళులర్పించనున్నారు. ఇంకా దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు సేవలందిస్తున్న వారిని సత్కరించనున్నారు. ఇక.. ఈ అవార్డు వేడుకలో సందడి గురించి చెప్పాలంటే... మొదటిసారి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్న రామ్‌చరణ్ డ్యాన్సుల విషయంలో తన తండ్రి చిరంజీవికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు రామ్‌చరణ్. స్టయిలిష్‌గా డ్యాన్సులు చేసే చరణ్ ఇప్పటివరకూ ఆహూతుల ముందు ఏ వేదిక మీదా కాలు కదపలేదు. తొలిసారి ‘ఐఫా’ వేదికపై ఆయన డ్యాన్స్ చేయనుండడం విశేషం. ఈ అవార్డు వేడుకలకు చరణ్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్చొచ్చు. వేదికపై రెచ్చిపోవడానికి గచ్చిబౌలి స్టేడియంలో రామ్‌చరణ్ చాలా హుషారుగా రిహార్సల్స్ చేస్తున్నారు. అదిరిపోయేలా అఖిల్.. ‘మనం’లో కొన్ని సెకన్లు కనిపించి, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందని కితాబులందుకున్నారు అఖిల్. అలాగే మొదటి సినిమా ‘అఖిల్’తోనే ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించు కున్నారు. ఈ చిచ్చరపిడుగు లైవ్ పెర్ఫార్మెన్స్ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ‘ఐఫా’ వేదికపై అదిరిపోయే స్టెప్పులు వేయడానికి అఖిల్ కసరత్తులు చేస్తున్నారు. వారెవ్వా అనిపించాలనుకుంటున్న జీవా.. తమిళ హీరో జీవా కూడా ఇప్పటివరకూ ఏ అవార్డు వేడుకలోనూ డ్యాన్స్ చేయలేదు. ఇప్పుడు ‘ఐఫా’లో రెచ్చిపోవడానికి రెడీ అయ్యారు. మొదటిసారి స్టేజీపై డ్యాన్స్ చేయనున్నారు కాబట్టి, ఎక్కడా తగ్గేది లేదన్నట్లుగా ఉంది జీవా వ్యవహారం. వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేసి, అందరూ వారెవ్వా అనే విధంగా డ్యాన్స్ చేయాలనుకుంటున్నారు. ప్రముఖుల సమక్షంలో... పసందుగా... దక్షిణాది భాషలు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రరంగానికి చెందిన తారల అవార్డు వేడుక ఇది. ఈ వేడుకలో నాలుగు భాషలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. కమల్‌హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, నాగచైతన్య తదితరుల నటులతో పాటు అందాల తారలు కాజల్ అగర్వాల్, మమతా మోహన్‌దాస్, కావ్యా మాధవన్ వంటివారి సమక్షంలో ఈ వేడుక పసందుగా జరగనుంది. ఆ కలను ‘ఐఫా’ నెరవేర్చింది - తమన్నా సినిమాల్లోకి రాకముందు నేను ప్రముఖ కొరియోగ్రాఫర్ షియామక్ దావర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకుందామనుకున్నా. అనుకోకుండా సినిమాలకు అవకాశం రావడంతో అది నెరవేరలేదు. ఇప్పుడీ ‘ఐఫా’ కారణంగా అది నెరవేరింది. ఈ అవార్డుల వేదికపై నేను చేయనున్న డ్యాన్సులకు ఆయనే కొరియోగ్రఫీ చేస్తున్నారు. సోమవారం నా పెర్ఫార్మెన్స్ ఉంటుంది. నా స్టెప్స్‌ని కాపీ... పేస్ట్ చేయమన్నారు - దేవిశ్రీ ప్రసాద్ నాకు ఒక పట్టాన ఏదీ నచ్చదు. ట్యూన్ చేయడం అయినా, పాట పాడడం అయినా, చివరికి డ్యాన్స్ చేయడం అయినా. అందుకే ఈ వేదికపై నాతో కలిసి డ్యాన్స్ చేసేవాళ్లకు కొన్ని స్టెప్స్ చూపించాను. షియామక్ దావర్కి అవి నచ్చడంతో ‘అందరూ కాపీ పేస్ట్ చేయండి’ అన్నారు. -
ఔటర్‌పై మొదటిసారిగా డ్రంకెన్ డ్రైవ్..
హయత్‌నగర్: ఇన్నాళ్లూ నగరంలోపలే నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లను మొదటిసారి ఓటర్ రింగ్ రోడ్డుపైనా నిర్వహించారు ట్రాఫిక్ పోలీసులు. వనస్థలిపురం ట్రాఫిక్ సీఐ నరేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఔటర్‌రింగురోడ్డుపై డ్రంకన్ డ్రై వ్ చేపట్టారు. ఇందులో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 11 మంది డ్రై వర్లు పట్టుబడ్డారు. కాగా మినీ ట్రావెల్స్ బస్సు డ్రై వర్ మద్యం సేవించి నడుపుతుండగా ఇందులో 30 మంది బ్రహ్మకుమారీలు ప్రయాణిస్తున్నారు. అంతేగాక ఓ కారులో ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళ మద్యం సేవిస్తూనే వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కారు. వీరి కారులో నుంచి పోలీసులు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఔటర్‌రింగురోడ్డుపై గస్తీ నిర్వహించే ఓఆర్ఆర్ పెట్రోలింగ్ వాహనం డ్రై వర్ సైతం మద్యం సేవించి వాహనం నపుడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోవడం గమనార్హం. ఈ మేరకు పోలీసులు డ్రంకన్ డ్రై వ్‌లో పట్టుబడిన 6 కార్లు, ఒక లారీ, డీసీఎం, కోళ్ళ వ్యాన్, ఒక మినీ ట్రావెల్స్ బస్సు, ఓఆర్ఆర్ పెట్రోలింగ్ వాహనాలను సీజ్ చేసి డ్రై వర్లపై కేసులు నమోదు చేశారు. ఈ డ్రంకన్ డ్రై వ్‌లో ఎస్ఐ కష్ణయ్య, ఆర్ఎస్ఐ ఇమకర్, ఏఎస్ఐ ముత్యంరెడ్డి, 15 మంది సిబ్బంది పాల్గొన్నారు. -
తాగుబోతులా నా గురించి మాట్లాడేది
తనపై వచ్చిన విమర్శలపై తొలిసారి మాట్లాడిన క్లార్క్ సిడ్నీ: యాషెస్ సిరీస్ ఓటమితో కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తొలిసారి మౌనం విడాడు. తనపై వచ్చిన విమర్శలపై చాలా ఘాటుగా స్పందించాడు. యాషెస్ సిరీస్ పరాజయాల నేపథ్యంలో తన నాయకత్వాన్ని బహిరంగంగా ప్రశ్నించిన మాజీలు సైమండ్స్, హేడెన్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. తాగి దేశానికి ఆడిన వ్యక్తి తన కెప్టెన్సీ గురించి మాట్లాడతాడా? అంటూ సైమోపై ధ్వజమెత్తాడు. ‘నా నాయకత్వాన్ని అంచనా వేసే స్థాయి సైమండ్స్‌కు లేదు. తాగినోడు నాపై రాళ్లు వేస్తే చూస్తూ ఉండాలా’ అని క్లార్క్ వ్యాఖ్యానించాడు. కెరీర్ ఆరంభంలో బ్యాట్స్‌మన్‌కు దగ్గరగా ఫీల్డింగ్ చేయడానికి క్లార్క్ నిరాకరించేవాడని, బలవంతంగా హెల్మెట్ అప్పగిస్తే బ్యాగీ గ్రీన్‌ను వెనక్కి ఇచ్చేస్తానని పాంటింగ్‌ను బెదిరించేవాడని అప్పట్లో హేడెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే తన రికార్డులు వీటికి సమాధానం చెబుతాయని క్లార్క్ స్పందించాడు. ‘గత 12 ఏళ్లుగా నా విలువేంటో అందరికి తెలిసింది. దేశానికి ఎంత పేరు తెచ్చానో అందరూ చూశారు. నేను ఆడిన మ్యాచ్‌లే నేనేంటో నిరూపిస్తున్నాయి. ఒకవేళ పాంటింగ్ హర్బర్ బ్రిడ్జిపై నుంచి దూకమంటే మారుమాట్లాడకుండా దూకేస్తా. ఆసీస్‌కు ఆడటం నాకు ఇష్టం. దానికోసం ఎంతవరకైనా వెళ్లటానికి సిద్ధంగా ఉండేవాణ్ని’ అని ఈ మాజీ కెప్టెన్ వివరించాడు. కుక్క కూడా కోచింగ్ చేయగలదు.. తన నాయకత్వంలో ఆసీస్ జట్టు సంస్కృతి పూర్తిగా చెడిపోయిందని వ్యాఖ్యానించిన బుకానన్‌పై క్లార్క్ విమర్శలు గుప్పించాడు. ‘జాన్‌కు బ్యాగీ గ్రీన్ గురించి ఎక్కువగా తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే దాన్ని అతనెప్పుడూ ధరించలేదు. బుకానన్ నిజాలకు ఎప్పుడూ ఆమడ దూరంలో ఉంటాడు. అతని వల్లే ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం వచ్చిందనుకుంటున్నాడేమో... నా కుక్క కోచింగ్ ఇచ్చినా అంతే ఆధిపత్యం చూపెట్టేవాళ్లం. జట్టు సంస్కృతి భిన్నంగా ఉండాలని స్టీవ్ వా, గిల్‌క్రిస్ట్, పాంటింగ్‌లు ప్రయత్నించారు. కానీ నా హయాంలో ఇది కాస్త తగ్గింది. రానురాను మరింతగా మారిపోయింది. ఇది నన్ను చాలా నిరాశకు గురిచేసింది’ అని క్లార్క్ వ్యాఖ్యానించాడు. -
ఆ దేశంలో ఇదే 'తొలి ఎంఫిల్'
ఇస్లామాబాద్: పాకిస్థాన్ చరిత్రలోనే హిందీ భాషలో తొలి ఎంఫిల్ పూర్తయింది. ఆదేశ మిలటరీకి సంబంధించిన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ మోడరన్ లాంగ్వేజెస్(ఎన్యూఎంఎల్) షాహిన్ జఫార్ అనే విద్యార్థికి హిందీ భాషలో ఎంఫిల్ డిగ్రీ అందజేసింది. అతడు 'స్వతంత్రోత్రా ఉపన్యాసన్ మెయిన్ నశ్రిచిత్రాన్(1947-2000)' అనే టాపిక్‌పై ఇఫ్తికార్ హుస్సేన్ అరిఫ్ అనే ప్రొఫెసర్ వద్ద ఎంఫిల్ పూర్తి చేశాడు. ఇందులో విశేషమేమిటంటే హిందీ భాషలో ఎంపిల్ థిసీస్ నిపుణులు పాకిస్థాన్‌లో లేకుంటే భారత్‌లోని అలీఘడ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు హిందీ ప్రొఫెసర్ల ద్వారా దీనిని పరిశీలించి ఆమోదం తెలిపారు. -
తగ్గిన మొబైల్ ఫోన్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: ప్రపంచంలో మొబైల్ ఫోన్ల విక్రయాల్లో భారత్‌ది ప్రముఖ స్థానం. మొబైల్ ఫోన్ల ఉత్పత్తిదారులకు భారత్ అది పెద్ద మార్కెట్. కాగా గత 20 ఏళ్లలో భారతీయ మొబైల్ ఫోన్ల అమ్మకాలు తొలిసారి పడిపోవడం ఆశ్చర్యకరం. గత జనవరి నుంచి మార్చి వరకు 14.5 శాతం మేర విక్రయాలు తగ్గాయి. గతేడాది చివరి మూడు నెలల్లో 6.2 కోట్ల మొబైల్ విక్రయాలు జరగగా, ఈ ఏడాది తొలి మూడు నెలల్లో ఆ సంఖ్యం 5.3 కోట్లకు తగ్గింది. -
ఈ నెల 6న ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్
-
ఐశ్వర్యకు ఇదే ఫస్ట్ టైమ్!
ఐశ్వర్య రాయ్ అందాల రాశి. సిల్వర్ స్క్రీన్ కోసం ఆమె మేకప్ వేసుకొని నాలుగేళ్లైంది. ఆమె రీఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గర్భవతిగా ఉన్నప్పటి నుంచి ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు తన కుమార్తె ఆరాధ్య స్కూల్‌కు వెళుతోంది. ఐష్‌కు తీరిక చిక్కింది. అందుకే మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై మెరిసేందుకు సిద్ధమవుతోంది. అదీ ఇంతకు ముందు ఎప్పుడూ పోషించని పాత్రలో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. న్యాయవాదిగా నల్లకోటు వేసుకొని కోర్టులోకి ఎంట్రీకానుంది. ఐష్ న్యాయవాదిగా నటించడం ఇదే ఫస్ట్ టైమ్. సంజయ్ గుప్తా రూపొందిస్తున్న సినిమాలో ఐశ్వర్య రాయ్ ఓ పవర్‌పుల్ న్యాయవాది పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి 'జస్బా' అనే టైటిల్ ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఐష్ కొన్ని యాక్షన్ సీన్స్‌లో కూడా కనిపించనుంది. ఇందులో ఐష్‌కు జోడీగా ఇర్ఫాన్ ఖాన్ నటిస్తున్నారు. ఇర్ఫాన్‌ది ఈ చిత్రంలో సస్పెండ్ అయిన ఓ పోలీస్ ఆఫీసర్ పాత్ర. ఈ సినిమాలో జాన్ అబ్రహామ్ కూడా నటిస్తున్నారు. -
తొలిసారి అప్పు చేయనున్న ఏపీ !
రూ.2,000 కోట్ల అప్పునకు కేంద్రం అనుమతి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయిన తరువాత తొలిసారిగా ఈ నెలాఖరులోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.2,000 కోట్ల అప్పు చేయనుంది. ఇందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే అనుమతించింది. దీంతో ఈ నెలాఖరులోగా రూ.2,000 కోట్ల రుణ సమీకరణకు గాను సెక్యూరిటీల విక్రయానికి తేదీని ఖరారు చేయాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐకి లేఖ రాసింది. ఆర్బీఐ ప్రకటించిన తేదీన సెక్యూరిటీల వేలంలో పాల్గొనే ఆర్థిక సంస్థలు దాఖలు చేసే బిడ్ల ఆధారంగా మొత్తం రూ.2,000 కోట్లను సమీకరించాలా? లేక రూ.1,500 కోట్లనే సేకరించాలా? అనే విషయమై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇదిలా ఉండగా మరో రూ.3,000 కోట్ల అప్పు చేసేందుకు కూడా అనుమతించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది. -
ఫస్ట్ టైమ్ ఆన్లైన్లో ఆస్కార్ వేడుక!
ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆస్కార్ పండగ సందడి మొదలైంది. ఈరోజు సాయంత్రం లాస్ ఏంజిల్స్‌లో సుమారు ఐదున్నర గంటలకు డాల్బీ థియేటర్లో ఆరంభమవుతుంది ఈ వేడుక. మన భారతీయ కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజాము అన్నమాట. ఈ వేడుకను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 225 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది ఆస్కార్ కమిటీ మరో అడుగు ముందుకేసింది. ఆన్లైన్లో ఆస్కార్ వేడుకను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే అవకాశం కల్పిస్తోంది. అయితే యూఎస్‌లో ఉన్నవారికి మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని సమాచారం. -
ధనుష్‌కు జంటగా కాజల్?
నటుడు ధనుష్‌తో కాజల్ అగర్వాల్ రొమాన్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రంజనా చిత్రంతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసి అక్కడ హిట్ కొట్టిన ధనుష్‌కు ఇటీవల విడుదలైన నయ్యాండి నిరాశపరిచిందనే చెప్పాలి. ప్రస్తుతం వెళ్లై ఇల్లా పట్టదారి, కె.వి.ఆనంద్ దర్శకత్వంలో అనేగన్ చిత్రాలతో బిజీగా ఉన్న ధనుష్ తదుపరి తన సొంత సంస్థ ఉండర్ బార్ పతాకంపై రూపొందనున్న చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి సురాజ్నుగాని, దురై సెంథిల్ కుమార్‌ను గాని దర్శకుడిగా ఎంపిక చేయాలనుకుంటున్నట్లు సమాచారం. 2014 తొలి భాగంలో సెట్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో హీరోయిన్గా నటి కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ ఉత్తరాది భామకు విజయ్‌తో నటిస్తున్న జిల్లా చిత్రం మినహా కోలీవుడ్, టాలీవుడ్లో నూతన చిత్రాలేవీ లేవు. త్వరలో కమల్‌హాసన్‌తో ఉత్తమ విలన్ చిత్రంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె ధనుష్‌తోను తొలిసారిగా జతకట్టడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.