
ధనుష్‌కు జంటగా కాజల్?
నటుడు ధనుష్‌తో కాజల్ అగర్వాల్ రొమాన్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రంజనా చిత్రంతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసి అక్కడ హిట్ కొట్టిన ధనుష్‌కు ఇటీవల విడుదలైన నయ్యాండి నిరాశపరిచిందనే చెప్పాలి. ప్రస్తుతం వెళ్లై ఇల్లా పట్టదారి, కె.వి.ఆనంద్ దర్శకత్వంలో అనేగన్ చిత్రాలతో బిజీగా ఉన్న ధనుష్ తదుపరి తన సొంత సంస్థ ఉండర్ బార్ పతాకంపై రూపొందనున్న చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.
ఈ చిత్రానికి సురాజ్‌నుగాని, దురై సెంథిల్ కుమార్‌ను గాని దర్శకుడిగా ఎంపిక చేయాలనుకుంటున్నట్లు సమాచారం. 2014 తొలి భాగంలో సెట్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటి కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ ఉత్తరాది భామకు విజయ్‌తో నటిస్తున్న జిల్లా చిత్రం మినహా కోలీవుడ్, టాలీవుడ్‌లో నూతన చిత్రాలేవీ లేవు. త్వరలో కమల్‌హాసన్‌తో ఉత్తమ విలన్ చిత్రంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె ధనుష్‌తోను తొలిసారిగా జతకట్టడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.