నయనతారను హెచ్చరిస్తూ ధనుష్‌ అడ్వకేట్‌ మరో నోటీసు | Danush Advocate Against Notice Issued On Nayanthara | Sakshi
Sakshi News home page

నయనతారను హెచ్చరిస్తూ ధనుష్‌ అడ్వకేట్‌ మరో నోటీసు

Nov 18 2024 4:20 PM | Updated on Nov 18 2024 5:19 PM

Danush Advocate Against Notice Issued On Nayanthara

కోలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ నయనతారను హెచ్చరిస్తూ ధనుష్‌  లాయర్‌ మరో నోటీసు పంపారు. నయనతారపై తెరకెక్కించిన డాక్యుమెంటరీలో తమ సినిమాకు సంబంధించిన ఫుటేజీని తొలగించాలని ఆయన కోరారు. ఈమేరకు ఇప్పటికే నోటీసులు కూడా పంపడం జరిగిందని ఆయన గుర్తుచేశారు. 24 గంటల్లో ఆ ఫుటేజీని తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని ధనుష్‌ లాయర్‌ మరోసారి హెచ్చరిస్తూ నయన్‌కు నోటీసులు పంపారు.

నయనతార డాక్యుమెంటరీ కోసం ధనుష్‌ నిర్మాతగా వ్యవహరించిన 'నేనూ రౌడీనే' సినిమా నుంచి మూడు సెకండ్ల వీడియోను ఆమె ఉపయోగించుకుంది. దీంతో ధనుష్‌ కాపీరైట్‌ చట్టం కింద నయన్‌పై రూ. 10 కోట్లు నష్టపరిహారం కేసు వేశారు. అయితే, తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో ఆ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్‌ అవుతుండంతో అందులో ఈ సినిమా నుంచి తీసుకున్న ఫుటేజీ కూడా ఉంది. దీంతో ధనుష్‌ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఆమెతో పాటు నెట్‌ఫ్లిక్స్‌కు హెచ్చరికతో ధనుష్‌ అడ్వకేట్‌ నోటీసు జారీ చేశారు.

ధనుష్‌ లాయర్‌ తాజాగా నయన్‌ అడ్వకేట్‌కు ఒక లేఖ  ఇలా రాశారు 'నా క్లయింట్‌కు హక్కులు కలిగి ఉన్న సినిమాలోని వీడియోను నయనతార డాక్యుమెంటరీలో ఉపయోగించారు. ధనుష్‌ అనుమతి లేకుండా అలా చేయడం చట్టరిత్యా నేరం. 24 గంటల్లో దానిని తొలగించాలి. ఈ విషయంలో మీ క్లయింట్‌కు (నయనతార) సలహా ఇవ్వండి. లేని పక్షంలో మీ క్లయింట్‌కు వ్యతిరేకంగా నా క్లయింట్  చట్టపరమైన తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.   రూ. 10 కోట్ల నష్టపరిహారం విషయంలో నయనతారతో పాటు నెట్‌ఫ్లిక్స్ ఇండియా కూడా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది.' అని ప్రకటన ముగించారు. దీంతో నయనతారకు పుట్టినరోజు కానుకను ధనుష్‌ ఇలా ప్లాన్‌ చేశాడా అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement