కోలీవుడ్‌లో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈయన హీరో, విలన్ అన్న తారతమ్యం లేకుండా పాత్ర నచ్చితే నటించడానికి రెడీ అంటున్నారు. గత ఏడాదిలో 'జవాన్' చిత్రంలో షారుఖ్ ఖాన్‌కు విలన్‌గా నటించి ప్రశంసలు అందుకున్నారు. అంతకుముందే విజయ్ కథానాయకుడిగా నటించిన మాస్టర్ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించి ఆ చిత్ర విజయంలో భాగమయ్యారు. ఇక ఇటీవల ఈయన కథానాయకుడిగా నటించిన మహారాజా చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. తాజాగా విడుదలై 2 చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.
ప్రస్తుతం ఈయన నటిస్తున్న ట్రైన్, ఏస్, గాంధీ టాకీస్ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. కాగా తాజాగా విజయ్ సేతుపతి కథానాయకుడిగా మరో చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. కమర్షియల్ డైరెక్టర్‌గా పేరుగాంచిన హరి దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటించే విషయమై చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. దర్శకుడు హరి గతంలో సూర్యతో సింగం సీక్వెల్స్ చిత్రాలను తెరకెక్కించి హిట్ అందుకున్నారు. ఆపై హీరో విశాల్‌తో పూజై సినిమాతో బిగ్ హిట్ ఇచ్చారు.
ఇప్పుడు విజయ సేతుపతితో సినిమా నిజమైతే వారిద్దరి కాంబినేషన్లో తెరకెక్కే తొలి చిత్రం ఇదే అవుతుంది. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై నటి నయనతార, విగ్నేష్ శివన్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సంస్థలో పలు వైవిద్య భరిత సక్సెస్‌ఫుల్ చిత్రాలను నిర్మించిన నయనతార విగ్నేశ్ శివన్ లు తాజాగా విజయ్ సేతుపతి హీరోగా చిత్రం చేస్తున్నారన్న ప్రచారం జరగడంతో దీనిపై ఆసక్తి నెలకొంది. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment