
ఒకప్పుడు విలన్లను చూస్తేనే భయపడేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. విలన్లు కూడా మంచి ఎత్తూపొడుగూ ఉంటున్నారు. హీరోలతో పోటీపడేలా బాడీని మెయింటైన్ చేస్తున్నారు. ఫిట్‌నెస్‌తో అబ్బురపరుస్తున్నారు. ఈ జాబితాలో నటుడు ఆదిత్య మీనన్ (Adithya Menon) ఉన్నాడు. మిర్చి, బిల్లా, పుష్ప.. ఇలా ఎన్నో సినిమాల్లో విలనిజం పండించిన ఆయన తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
హీరోగా ఛాన్సులు..
ఆదిత్య మాట్లాడుతూ.. హీరోలకు బాధ్యత ఎక్కువ ఉంటుంది. అందుకే హీరోగా అవకాశాలు వచ్చినా వదిలేసుకున్నాను. వివిధ రకాల పాత్రలు చేయడం ఇష్టం. అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాను. కెరీర్ ప్రారంభంలో వచ్చిన పాత్రలన్నీ చేసుకుంటూ పోయాను. తర్వాత నాకు ఏవి సెట్టవుతాయి? ఏవి సెట్టవవు? అని ఆలోచించి సెలక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటున్నాను.
(చదవండి: రూ.50 లక్షల ప్రైజ్‌మనీ.. ఇంతవరకు ముట్టనేలేదు: బిగ్‌బాస్ విజేత)
చిత్రవిచిత్ర దేశాలకు వెళ్తుంటా..
నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. దేశవిదేశాలు తిరుగుతూ ఉంటాను. అందరూ వెళ్లే ప్రదేశాలకు కాకుండా భిన్నమైన ప్లేసెస్‌కు వెళ్తుంటాను. అక్కడి ప్రజల గురించి, అలవాట్ల గురించి తెలుసుకుంటాను. వారి వంటకాలు ట్రై చేస్తాను. అక్కడ గుర్రపు మాంసం తిన్నాను. ఇదే కాదు పాము మాంసం, కప్ప కాళ్లు, మొసలి మాంసం తిన్నాను. పాము తోలు తీసి, ముక్కలు చేసి వండిస్తారు, బాగుంటుంది. నేను నాస్తికుడిని, భగవంతుడు ఉన్నాడని నమ్మను అని చెప్పుకొచ్చాడు.
సినిమా
ఆదిత్య మీనన్.. తెలుగులో బిల్లా, సింహా, అధినాయకుడు, కృష్ణం వందే జగద్గురుం, ఈగ, బాద్‌షా, బలుపు, మిర్చి, పవర్, లయన్, పండగ చేస్కో, రుద్రమదేవి, అమర్ అక్బర్ ఆంటోని, కార్తికేయ 2, పుష్ప 2.. ఇలా పలు చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. ఈయన తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ అనేక సినిమాలు చేశాడు.
చదవండి: కావాలనే రాంగ్ మెడిసిన్ ఇచ్చారు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో నటుడు
Comments
Please login to add a commentAdd a comment