పాన్ ఇండియా కథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. పెళ్లి అయ్యి, ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయినా కథానాయకిగా తగ్గేదేలే అంటున్న నటి ఈ భామ. నాలుగు పదుల వయసులోనూ సీనియర్ హీరోల నుంచి, యూత్ హీరోల వరకూ నటిస్తూ తన ఇమేజే వేరు అంటున్నారు. ఈమె మాధవన్, సిద్ధార్థ్‌తో కలిసి నటించిన టెస్ట్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్దం అవుతోంది. అదేవిధంగా ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రం రాక్కాయి, మన్నాంగట్టి సిన్స్ 1960, మూక్కుత్తి అమ్మన్ 2, కన్నడంలో టాక్సిక్, మలయాళంలో ఎంఎంఎంఎన్ చిత్రాలు చేస్తున్నారు.
ఇలా తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న నయనతార తాజాగా తెలుగులో నటుడు ప్రభాష్ కథానాయకుడిగా నటిస్తున్న రాజాసాబ్ చిత్రంలో ప్రత్యేక పాటలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఇప్పుడు ఆమె నటిస్తున్న చిత్రాల్లో యువ నటుడు కవిన్‌తో జత కడుతున్న చిత్రం ఒకటి. దీని గురించి నయనతార పేర్కొంటూ తాను తొలి జనరేషన్‌కు చెందిన నటుడు రజనీకాంత్, మోహన్‌లాల్, మమ్ముట్టిలతోనూ, రెండవ జనరేషన్‌కు చెందిన విజయ్, అజిత్‌లతోనూ, మూడవ జనరేషన్‌కు చెందిన సూర్య, విక్రమ్‌తోనూ, నాలుగవ జనరేషన్‌కు చెందిన ధనుష్, శింబుతోనూ అయిదవ జనరేషన్‌కు చెందిన శివకార్తికేయన్‌తోనూ నటించినట్లు చెప్పారు.
తాజాగా ఆరో జనరేషన్‌కు చెందిన కవిన్‌తో జత కడుతున్నట్లు చెప్పారు. ఇలా ఆరు జనరేషన్స్‌కు చెందిన వారితో కథానాయకిగా నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇది రిమేర్కబుల్ జర్నీ అని పేర్కొన్నారు. కాగా నయనతార, నటుడు కవిన్ జంటగా నటిస్తున్న చిత్రానికి విష్ణు ఎడవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన దర్శకుడు లోకేశ్ కనకరాజ్ శిష్యుడు కావడం గమనార్హం. కాగా ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్డూడియో పతాకంపై ఎస్‌ఎస్.లలిత్‌కుమార్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ప్రేమ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో నటి నయనతార పాత్ర చాలా కొత్తగా ఉంటుందని చిత్ర వర్గాలు పేర్కొన్నారు. దీంతో చిత్రంపై ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment