Nayanthara's Connect Movie OTT Release Date and Platform Details - Sakshi
Sakshi News home page

Nayanthara : ఓటీటీలోకి వచ్చేస్తోన్న నయనతార కనెక్ట్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

Published Thu, Feb 16 2023 3:56 PM | Last Updated on Thu, Feb 16 2023 4:15 PM

Nayanthara Connect Movie OTT Release Date And Platform Details - Sakshi

నయనతార నటించిన లేటెస్ట్‌ హారర్‌ థ్రిల్లర్‌ కనెక్ట్‌. అశ్విన్‌ శరవణన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, రౌడీ పిక్చర్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ నిర్మించారు. బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఇందులో కీలక పాత్రలో కనిపించారు.

కుటుంబ నేపథ్యంలో హర్రర్‌ కథాంశంతో తెరెకెక్కిన ఈ సినిమా డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌ అయి రెండు నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించలేదు.

అయితే తాజాగా నెట్టింట అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఈనెల 24న ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి స్ట్రీమింగ్‌ కానంఉదట. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement