Connect
-
11 నదుల అనుంధానానికి రూ. 40 వేల కోట్లు
దేశంలో నదుల అనుసంధానం వివిధ ప్రాంతాలు తాగు,సాగునీటి అవసరాలను తీరుస్తుందనే మాట మనం ఎప్పటి నుంచో వింటున్నాం. దీనిని రాజస్థాన్‌లో సాకారం చేసేందుకు మోదీ సర్కారు ముందుకొచ్చింది.రాజస్థాన్‌లోని 11 నదులను అనుసంధానం చేసేందుకు దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నారని, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాజస్థాన్‌ను నీటి మిగులు రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గుజరాత్లో జరిగిన సుచి సెమికాన్ సెమీకండక్టర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాటిల్ మాట్లాడుతూ, భవిష్యత్తులో నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వాటర్ హార్వెస్టింగ్‌పై కృషి చేయాలని ఆయన వివిధ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు.రాజస్థాన్‌లో తీవ్రమైన నీటి సంక్షోభం ఉందని, నరేంద్ర మోదీ ప్రారంభించనున్న 11 నదులను అనుసంధానించే ప్రాజెక్టుతో రాష్టంలో తలెత్తుతున్న నీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. రాజస్థాన్-మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు ద్వారా ఆయా రాష్ట్రాలలో నీటి ఎద్దడి తగ్గుతుందన్నారు. నూతనంగా చంబల్, దాని ఉపనదులైన పార్వతి, కలిసింద్, కునో, బనాస్, బంగంగా, రూపారెల్, గంభీరి, మేజ్ తదిర ప్రధాన నదులను అనుసంధానం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఫలితంగా ఝలావర్, కోట, బుండి, టోంక్, సవాయి మాధోపూర్, గంగాపూర్, దౌసా, కరౌలి, భరత్పూర్, రాజస్థాన్‌లోని అల్వార్ మధ్యప్రదేశ్‌లోని గుణ, శివపురి, షియోపూర్, సెహోర్‌లతో సహా కొత్తగా ఏర్పడిన 21 జిల్లాలకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: ప్రధాని మోదీ పర్యటించిన దేశాలివే.. మీరూ ట్రిప్‌కు ప్లాన్ చేసుకోవచ్చు -
నెలలోపే ఓటీటీ వస్తుంటే.. ఈ సినిమాలకేమైంది?
ప్రస్తుత సినిమా ప్రపంచంలో ఓటీటీలదే హవా. తమ అభిమాన స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడొస్తాయా అని చూస్తున్నారు అభిమానులు. సినిమా రిలీజైన మొదటి రోజు నుంచే.. ఏ ఓటీటీలో వస్తుంది? ఏ రోజు స్ట్రీమింగ్ అవుతుందని తెలుసుకోవాలని తహతహలాడుతుంటారు. పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలు, బ్లాక్ బస్టర్స్ సైతం నెల తర్వాతే ఓటీటీల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రిలీజై నెలల గడుస్తున్నా కొన్ని సినిమాలు ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. ఇంతకీ ఆ సినిమాలేవీ? ఎందుకు రాలేదు? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం. అఖిల్ ఏజెంట్… అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. ఏప్రిల్‌లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో కనిపించారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను సోనీ లివ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అసలు కథేంటంటే? రామకృష్ణ అలియాస్ రిక్కీకి రా(RAW) ఏజెంట్ కావాలనేది కల. దానికోసం మూడుసార్లు పరీక్ష రాసి పాస్ అయినా రిజెక్ట్ అవుతాడు. మహాదేవ్(మమ్ముట్టి) రా చీఫ్. భారతదేశాన్ని టార్గెట్ చేసిన ది గాడ్ (డినో మోరియా)ని అంతం చేయాలనేది ఈయన లక్ష్యం. అందుకోసం ఓ మిషన్ ప్లాన్ చేస్తాడు. అనుకోకుండా ఈ మిషన్‌లో భాగమవుతాడు. ఇంతకు మహాదేవ్.. రిక్కీకి ఏం చేయమన్నాడు? రిక్కీ రా ఏజెంట్ కల నేరవేరిందా? మహాదేవ్ మిషన్ పూర్తయిందా? లేదా? అన్నదే 'ఏజెంట్' స్టోరీ. నయనతార కనెక్ట్… లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కనెక్ట్. థియేటర్లలో మంచి వసూళ్లను రాబట్టిన ఈ మూవీ ఓటీటీలో మాత్రం రిలీజ్ కాలేదు. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. ఈ సినిమా గతేడాది డిసెంబర్లో థియేటర్లలో విడుదలైంది. నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఈ మూవీని నిర్మించాడు. కనెక్ట్ ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ సినిమా మాత్రం ఇప్పటివరకు ఓటీటీ రిలీజ్ కాలేదు. ఆదా శర్మ.. ది కేరళ స్టోరీ ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ.. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం రిలీజ్ నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఓటీటీకి రావడం లేదు. సెన్సిటివ్ కంటెంట్ కావడంతోనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. -
ఇజ్రాయెల్ నీలి నక్షత్రం రహస్యం ఏమిటి? వారిని ఎలా కాపాడుతుంది?
ఇజ్రాయెల్ జెండాలో మనకు కనిపించే నీలిరంగు నక్షత్రాన్ని డేవిడ్ నక్షత్రం అని అంటారు. 14వ శతాబ్దం మధ్యకాలం నుండి యూదులు తమ జెండాపై ఈ గుర్తును ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కారణంగా చాలామంది ఇజ్రాయెల్‌తో పాటు యూదుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇందుకోసం వారు ఇంటర్నెట్లో శోధిస్తున్నారు. ఇదేవిధంగా కొందరు జుడాయిజం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు మనం ఇజ్రాయెల్ జెండాపై ఉన్న నీలి నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ గుర్తును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ గుర్తుతో వారి చరిత్రకు విడదీయరాని అనుబంధం ఉంది. ఇజ్రాయెల్ జెండాలో కనిపించే నీలిరంగు నక్షత్రాన్ని డేవిడ్ నక్షత్రం అని చెబుతారు. 14వ శతాబ్దం నుండి యూదులు ఈ గుర్తును తమ జెండాపై ముద్రిస్తున్నారు. తరువాతి కాలంలో అది యూదుల మత చిహ్నంగా మారింది. దీనితో పాటు 1896 సంవత్సరంలో జియోనిస్ట్ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఈ జెండాను చేతబట్టారు. యూదులు అధికారికంగా 1948, అక్టోబర్ 28న దీనిని ఇజ్రాయెల్ జెండాగా స్వీకరించారు. భూమిపై ప్రళయం వచ్చినప్పుడు ఈ నక్షత్రం తమను కాపాడుతుందని యూదు మతానికి చెందిన ప్రజలు గాఢంగా నమ్ముతారు. అందుకే ఈ నక్షత్రాన్ని డేవిడ్ షీల్డ్ అని కూడా అంటారు. చరిత్రకారులు ఈ నక్షత్రాన్ని 3500 సంవత్సరాల క్రితమే యూదులు స్వీకరించారని భావిస్తారు. హిబ్రూ, ఇజ్రాయెల్ బానిసలు తాము ఈజిప్టు బానిసత్వం నుండి విముక్తి పొందినప్పుడు ఈ నక్షత్రాన్ని స్వీకరించారు. ఈ నక్షత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అది నక్షత్రం కాదని, రెండు త్రిభుజాల కలయిక అని అనిపిస్తుంది. కిందునున్న త్రిభుజం డేవిడ్ రాజు చిహ్నం అని, పైన కనిపించేది డేవిడ్ పట్టుకున్న డాలు అని చెబుతారు. ఇది కూడా చదవండి: భారత రైతులు ఇజ్రాయెల్‌పై ఎందుకు ఆధారపడుతున్నారు? -
వసతులు, సౌకర్యాలపై బిల్డర్లు దృష్టి సారించాలి
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో భూమి లభ్యత పరిమితంగా ఉండటంతో డెవలపర్లు ఎత్తయిన నిర్మాణాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. భవనాల ఎత్తు పెరిగే కొద్దీ సమస్యలు ఉంటాయి. అందుకే ఎత్తు మాత్రమే కొలమానం కాకుండా సౌకర్యాలు, వసతులు కూడా దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు చేపట్టాలి’అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు డెవలపర్లకు సూచించారు. హైదరాబాద్‌లో శనివారం నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) రజతోత్సవాలు జరిగాయి. ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధమైన రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం కేంద్రం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) తీసుకొచ్చి ఏళ్లు గడుస్తున్నా...ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు రెరా ప్రతినిధులను నియమించకపోవటం శోచనీయమన్నారు. ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్వేస్, హైవేస్, రైల్వేస్‌తో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగం.. వెరసి హైదరాబాద్ హ్యాపెనింగ్ సిటీ అని వెంకయ్య కొనియాడారు. చంద్రుడిపై ఇళ్లు కట్టే స్థాయికి నరెడ్కో ఎదుగుతుందని ఛలోక్తి విసిరారు. సమర్థ నాయకుడితోనే అభివృద్ధి: వేముల స్థిర, సమర్థవంతమైన నాయకుడితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మెరుగైన మౌలిక వసతులు, శాంతి భద్రతలు బాగున్న చోట పెట్టుబడులు వాటంతటవే వస్తాయని ఈ విషయంలో హైదరాబాద్ ముందున్నదని చెప్పారు. కార్యక్రమంలో నరెడ్కో జాతీయ అధ్యక్షుడు రజన్ బండేల్కర్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళల్లో క్రీడాస్ఫూర్తికి..
తాన్వీ హన్స్, శ్వేతా సుబ్బయ్య. ఒకరు ఫుట్ బాల్ క్రీడాకారిణి, మరొకరు ఫిట్నెస్ ట్రైనర్. ఈ ఇద్దరు ఏడేళ్ల క్రితం బెంగళూరులో మహిళల కోసం సరదాగా ఓ స్పోర్ట్స్ సెషన్‌ను ఏర్పాటు చేశారు.అది మొదలు ఇప్పుడు దేశం అంతటా మహిళల కోసం స్పోర్ట్స్ సెషన్ లు, నెట్వర్కింగ్ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు దాదాపు 5000 మందికి పైగా ఈ మహిళా నెట్వర్క్ ఉమెన్ స్పోర్ట్స్ కమ్యూనిటీని విస్తరించడానికి ట్రావెల్ గ్రూప్స్ ఏర్పాటు చేస్తుంటారు. 14 ఏళ్లలోపు అమ్మాయిల నుంచి అరవై ఏళ్లకు పైగా వయసున్న బామ్మలు కూడా వీరి గ్రూప్‌లో సభ్యులు. ఈ నెల నుంచి సెప్టెంబర్ వరకు మహిళల్లో క్రీడాస్ఫూర్తి నింపడానికి ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు తాన్వి, శ్వేత. క్రీడల ద్వారా కనెక్ట్ అయిన మహిళల సంఘంగా తాన్వి, శ్వేతలు ఏర్పాటు చేసిన ‘సిస్టర్స్ ఇన్ స్వెట్’ గురించి చెప్పుకోవచ్చు ప్రోఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్ అయిన తాన్వీ హన్స్ 2017లో ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్లింది. అక్కడ ఆమెకు శ్వేత సుబ్బయ్య పరిచయం అయ్యింది. తన ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్లలో శ్వేత ఒకరు. కొద్దిరోజుల్లోనే వారిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. ‘‘ఒకసారి జరిగిన ఫ్రెండ్స్ పార్టీలో లేడీస్ అంతా ‘మాకు కూడా క్రీడలు నేర్పించవచ్చు కదా! అని అడిగారు. దాంతో ఆ వీకెండ్లో ఒక గ్రౌండ్ బుక్ చేసి, కొంతమంది మహిళలను ఆహ్వానించాం. అదొక ఫన్ సెషన్ అనుకున్నాం. నలుగైదుగురు వస్తారు అనుకుంటే ఏకంగా 17 మంది మహిళలు వచ్చారు’ అని నాటి రోజులను గుర్తుచేసుకుంటుంది తాన్వి. సరదాగా మొదలై.. 35 ఏళ్ల వయసున్న మహిళల కోసం గంటన్నర స్పోర్ట్స్ సెషన్‌ను మొదటిసారి ఏర్పాటు చేశారు. ఆ సమయంలో శ్వేత ఫిట్నెస్ ట్రైనర్‌గా... తాన్వి క్రీడల కోసం మహిళలు తమ శరీరాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో వివరించింది. అంతా సరదాగా జరిగిన ఈ కార్యక్రమం తర్వాత కొత్త ఆలోచనకు దారి వేసింది. ‘ఆ మొదటి సెషన్ తర్వాత లేడీస్ మా వద్దకు వచ్చారు. ఈప్రోగ్రామ్ చాలా బాగుందని, ప్రతి వారాంతంలో తమకోసం ఓ సెషన్ ఏర్పాటు చేయాలని కోరారు. అలా ఈ కమ్యూనిటీ మొదలైంది’ అని వివరిస్తుంది తాన్వి. స్కూళ్లు, కాలేజీల తర్వాత క్రీడల నుండి తప్పుకుంటున్న మహిళల ఆలోచనల్లో తిరిగి స్పోర్ట్స్ పట్ల జీవం పోయడమే తమ ధ్యేయంగా చెబుతారు వీరు. ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, టచ్ రగ్బీతో సహా ఇతర స్పోర్ట్స్ ఫార్మాట్లతో ఈ గ్రూప్ రన్ అవుతోంది. అన్ని వయసుల వారూ.. . ‘‘2017లో మొదటి సెషన్ప్రారంభమైనప్పుడు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలు అని మాత్రమే అనుకున్నాం. ఆ తర్వాత సగటు వయసు 25 నుంచి 30కి చేర్చాం. కానీ, మాతో ఆడుకోవడానికి ఉత్సాహం చూపే 12–14 ఏళ్ల వయసున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. అలాగే, 65 ఏళ్ల మహిళలు కూడా ఆసక్తి చూపారు. అలా చిన్న వయసు నుంచి సీనియర్ మహిళల వరకు అందరూ మా గ్రూప్‌లో ఉన్నారు. వీరితోపాటు పరిశ్రమల యజమానులు, తల్లులు, గృహిణులు, విద్యార్థులూ ఉన్నారు. కాలేజీల్లో ఆడుకోవడానికి విద్యార్థులకు అవకాశం ఉందని మొదట్లో మేం అనుకునేవాళ్లం. కానీ, అలాంటి వ్యవస్థ చాలా వరకు మన విద్యా సంస్థల్లో లేదని తెలిసింది. మొత్తమ్మీద వివిధ రకాలప్రోఫైల్స్ మా వద్దకు చేరాయి. సాధారణంగా క్రీడలు అబ్బాయిలు, పురుషుల కోసమే అనే ఆలోచన మన సంస్కృతిలో పాతుకుపోయాయి. స్కూల్ స్థాయిలో మన దగ్గర కొన్ని విద్యా సంస్థలు అమ్మాయిలకు క్రీడల్లో అవకాశాలను ఇస్తాయి. కానీ, వారి ఎంపికలో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. కాలేజీల్లోనూ ఇదే తేడా కనిపిస్తుంది. అందువల్లే, క్రీడల్లో పాల్గొనాలని ఉన్నా మహిళలు డ్రాప్‌ఔట్ అవుతుంటారు. వీటన్నింటినీ ఆలోచించి మేం ఈ ఏర్పాటు చేశాం’ అని తాన్వి చెబుతుంది. ‘మహిళలు ఇతర మహిళలతో ఆడుకోవడానికి మేం అవకాశాలు కల్పిస్తున్నాం. దీని వల్ల వారు సుఖంగా, సురక్షితంగా ఉంటారు. తమ కోసం మంచి సమయం గడుపుతారు’ అంటుంది శ్వేత. బెంగళూరులో ప్రతివారం ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, టచ్ రగ్బీ సెషన్స్ నిర్వహిస్తున్నారు ఈ టీమ్. అలాగే, ప్రతి ఆదివారం, మూడు నెలలకోసారి సైక్లింగ్ ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. స్విమ్ సెషన్స్ కూడా నిర్వహిస్తూ తమ బృంద సభ్యులను మరింత ఉల్లాసపరుస్తున్నారు. ఇందుకోసం స్పెషల్‌గా తమలోనే కోచ్‌లను నియమించుకుంటున్నారు. ఆసక్తి ఉన్నవాళ్లు ఎవరైనా వీరి బృందంలో చేరవచ్చు. ‘ఈ స్పోర్ట్స్ కమ్యూనిటీలో చేరడానికి మహిళలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. క్రీడల్లో పాల్గొనడానికి మాత్రం నామమాత్రపు రుసుము చెల్లించాలి’ అని చెబుతున్నారు తాన్వీ, శ్వేత. ప్రతి ఈవెంట్‌కు స్పాన్సర్లను వెతకడం, వాటి ద్వారా ఖర్చులు తగ్గించడం వల్ల క్రీడల్లో పాల్గొనే మహిళలు ఈ సెషన్స్‌లో సంతోషంగా పాల్గొంటున్నారని వివరిస్తున్నారు. -
ఐఫోన్ యూజర్లకు కొత్త యాప్..
ఐఫోన్ (iPhone) యూజర్లకు కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఐఫోన్లను కంప్యూటర్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. యాపిల్ యాప్ స్టోర్‌లో మైక్రోసాఫ్ట్ ఫోన్ లింక్ (Microsoft Phone Link) యాప్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ యాప్‌తో ఐఫోన్ యూజర్లు నేరుగా విండోస్ (Windows) పీసీకి స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు.మ ఇదీ చదవండి: Kresha Gupta: రూ.100 కోట్ల ఫండ్.. స్టాక్ మార్కెట్ యువ సంచలనం ఈమె! ఇంతకుముందు ఐఫోన్‌ను మ్యాక్‌బుక్ ల్యాప్‌టాప్‌తో మాత్రమే కనెక్ట్ చేసుకునే వీలు ఉండేది. ఈ కొత్త అప్డేట్తో ఐఫోన్ యూజర్లు తమ ఫోన్లను విండోస్ పీసీలకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. iOS కోసం కొత్త ఫోన్ లింక్ యాప్ 85 మార్కెట్లలో 39 భాషల్లో విడుదల చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ ఏడాది మొదట్లో ఈ ఫీచర్‌ను ప్రకటించారు. విండోస్ 11 యూజర్లందరూ మే నెల మధ్య నాటికి ఫోన్ లింక్‌లో ఐఫోన్ సపోర్ట్‌కు యాక్సెస్ పొందుతారని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్‌లో మైక్రోసాఫ్ట్ ఫోన్ లింక్ యాప్ అందుబాటులోకి వచ్చినా విండోస్ పీసీలలో ఐఫోన్‌తో కనెక్షన్‌కు సపోర్ట్ చేయడం లేదు. దీన్ని సరిచేయడానికి మైక్రోసాఫ్ట్ కొత్త యాప్ లేదా సిస్టమ్ అప్డేట్ను విడుదల చేయవచ్చు. అయితే ఈ సమస్య యూజర్లందరికీ లేదు. ఇదీ చదవండి: EPFO: పీఎఫ్ ఈ-పాస్‌బుక్ డౌన్లోడ్ కావడం లేదా? బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలంటే.. విండోస్ 11 పీసీలో ఒకవేళ iOS ఫోన్ లింక్ యాప్‌కి సపోర్ట్ చేసి ఎనేబుల్ చేసుకుంటే తమ ఐఫోన్‌ను పీసీకి కనెక్ట్ చేసుకుని కాల్స్, సందేశాలు, కాంటాక్టలను యాక్సెస్ చేసుకునేందుకు iOS సపోర్ట్ చేస్తుందని మైక్రోసాఫ్ట్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. ఇలా కనెక్ట్ చేసుకోండి.. విండోస్ పీసీలో ఫోన్ లింక్ యాప్ iOSతో కనెక్షన్‌కు సపోర్ట్ చేస్తే ఐఫోన్‌ను పీసీకి కనెక్ట్ చేసుకోవడం చాలా సులభం. ఐఫోన్లో యాపిల్ స్టోర్ Microsoft Phone Link యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత 'iPhone'ని ఎంచుకుని, QR కోడ్‌తో సెటప్‌ను పూర్తి చేయండి. అనంతరం నోటిఫికేషన్ ప్రాధాన్యతలను సెట్ చేసుకోండి. తర్వాత ఐఫోన్లో ఫోన్ లింక్ యాప్‌ను ఓపెన్ చేయండి లేదా విండోస్ 11 పీసీ టాస్క్‌బార్‌లో ‘ఫోన్ లింక్’ కోసం సెర్చ్ చేయండి. ఇప్పుడు ఐఫోన్‌ను విండోస్ పీసీకి కనెక్ట్ చేసుకోండి. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
ఓటీటీలోకి వచ్చేస్తోన్న నయనతార కనెక్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
నయనతార నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ కనెక్ట్. అశ్విన్ శరవణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, రౌడీ పిక్చర్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ నిర్మించారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో కనిపించారు. కుటుంబ నేపథ్యంలో హర్రర్ కథాంశంతో తెరెకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయి రెండు నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించలేదు. అయితే తాజాగా నెట్టింట అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఈనెల 24న ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు టాక్ వినిపిస్తుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి స్ట్రీమింగ్ కానంఉదట. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. -
చాలా గ్యాప్ తర్వాత మూవీ ప్రమోషన్లో నయన్, హాలీవుడ్ నటిలా లేడీ సూపర్ స్టార్
తల్లయిన తర్వాత లేడీ సూపర్ స్టార్ తొలిసారి పబ్లిక్‌లోకి వచ్చింది. గత కొంతకాలంగా నయన్ పెద్దగా బయటకు రావడం లేదనే విషయం తెలిసిందే. తన మూవీ ప్రమోషన్స్‌లో సైతం హాజరకావడం లేదు. సినిమాకు సంతకం చేసినప్పుడే చిత్రం దర్శక-నిర్మాతలకు నయన్ ముందుగానే ఈ కండిషన్ పెట్టేదట. అందుకే ఆమె ఏ మూవీ ఈవెంట్స్ అయినా చివరికి తన చిత్రం ప్రమోషన్స్‌కి దూరంగా ఉండేది. కానీ, తాజాగా నయన్ తన తీరును మార్చుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె చాలాకాలం తర్వాత మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంది. నయన్ తాజా చిత్రం కనెక్ట్ మూవీ ప్రచారంలో ఆమె చురుగ్గా పాల్గొంటోంది. చదవండి: ఒకే ఫ్రేంలో రామ్ చరణ్-అల్లు అర్జున్.. మురిసిపోతున్న ఫ్యాన్స్ ఈ నేపథ్యంలో ఇటీవల మీడియాకు ప్రదర్శించిన కనెక్ట్ మూవీ ప్రివ్యూ షోకు నయన్ తన భర్త విఘ్నేశ్ శివన్‌లో కలిసి హాజరైంది. అక్కడ హాలీవుడ్ నటిలా స్టైలిష్‌గా కనిపించిన ఆమెను చూసి అభిమానులంతా స్టన్ అయ్యారు. పెళ్లయ్యాక నయన్ మరింత అందంగా, స్టైలిష్‌గా మెకోవర్ అయ్యిందంటూ చర్చించుకుంటున్నారు. ఇక ఈ షో హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ అభిమాని నయన్‌ను పిలిచి ఐ లవ్ యూ మామ్ అని అన్నాడు. మరికొందరు కనెక్ట్ చిత్రం బాగుందంటూ ప్రసంశలు కురిపించారు. దీంతో ఆమె చాలా థ్యాంక్స్ అంటూ చిరునవ్వులు చిందించింది. చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ ప్రదీప్? ఆమెతోనే ఏడడుగులు! నయనతార ప్రధాన పాత్రలో నటించిన కనెక్ట్ చిత్రాన్ని ఆమె భర్త దర్శకుడు విఘ్నేశ్ శివన్ తన రౌడీ పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. గతంలో నయనతార నటించిన మాయ, తాప్సీ నటించిన గేమ్ ఓవర్ చిత్రాల దర్శకుడు అశ్విన్ శరవణన్ దీన్ని తెరకెక్కించారు. హార్రర్, థ్రిల్లర్ ఇతి వృత్తంతో కూడిన ఈ చిత్రం హాలీవుడ్ చిత్రాల తరహాలో 99 నిమిషాల నిడివితో రూపొందడం విశేషం. ఇది లాక్డౌన్ నేపథ్యంలో హర్రర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందింది. ఈ చిత్రంలో నయనతారతో పాటు సత్యరాజ్, వినయ్‌రాయ్, బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్ ముఖ్యపాత్రలు పోషించారు. కాగా కనెక్ట్ చిత్రాన్ని ఈ నెల 22వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు విఘ్నేష్ శివన్ ఈ సందర్భంగా తెలిపాడు. -
కేవలం హిందీతోనే వర్క్ ఔట్ అవ్వదు! రాహుల్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంగ్ల విద్యను సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు పాఠశాలలో ఆంగ్ల విద్యను బోధించొద్దని గొడవ చేస్తున్నారు. కానీ వాళ్ల పిల్లలను మాత్రం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌లోనే చదివిస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. కానీ పేద రైతులు, కూలీలు తమ పిల్లలు మంచిగా ఇంగ్లీష్ నేర్చుకుని మంచి పొజిషన్లో ఉండాలని కలలు కంటారని రాహుల్ అన్నారు. ఈ మేరకు ఆయన రాజస్తాన్‌లో అల్వార్‌లో భారత్ జోడోయాత్రలో భాగంగా పర్యటిస్తున్నప్పుడూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కేవలం హిందీ మాత్రమే నేర్చుకుంటే..ప్రపంచంలో ఇతరులతో మాట్లాడటం సాధ్యం కాదని, కేవలం ఆంగ్ల విద్యతోనే అది సాధ్యం అవుతుందని అన్నారు. కాబట్టి మాకు రైతులు, కూలీల పిల్లలు అమెరికన్లతో పోటీపడి ఇంగ్లీష్‌ని నేర్చుకుని తాము అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాని చెప్పారు. రైతులు పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదవకూడదని కూడదని బీజేపీ కోరుకుంటోందంటూ రాహుల్ ఆరోపణలు చేశారు. అంతేగాదు ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ..హిందీ, తమిళం వంటి ఇతర భాషలను చదవకూడదని చెప్పడం లేదు. ప్రపంచంతో కనెక్ట్ అవ్వాలంటే ఇంగ్లీష్ తెలుసుకోవాలని అన్నారు. రాజస్తాన్‌లో తాము దాదాపు 1700 ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రారంభించినట్లు తెలిపారు. అమెరికన్ పిల్లలకు సవాలు విసురుతూ... విద్యార్థులు ధీటుగా ఇంగ్లీష్ చదవాలని కోరుకుంటున్నాను అని రాహుల్ గాంధీ చెప్పారు. (చదవండి: విద్యార్థులు, సెక్యూరిటీ గార్డుల మధ్య ఘర్షణ..పలువురికి గాయాలు) -
'కనెక్ట్' సినిమాకి ఇంటర్వెల్ ఉండదు.. కారణమిదే : డైరెక్టర్
‘‘ప్రేక్షకులు చూపు తిప్పుకోకుండా చూసే సినిమాలు తెరకెక్కించడానికి ఇష్టపడతాను. గతంలో నేను చేసిన సినిమాలు అలాంటివే. ఇప్పుడు చేసిన ‘కనెక్ట్’ కూడా ఆ తరహా చిత్రమే’’ అన్నారు దర్శకుడు అశ్విన్ శరవణన్. నయనతార కథానాయికగా ‘మయూరి’, తాప్సీ లీడ్ రోల్లో ‘గేమ్ ఓవర్’ వంటి చిత్రాలను తెరకెక్కించారు అశ్విన్ శరవణన్. మళ్లీ నయనతార కథానాయికగా ఆయన దర్శకత్వం వహింన తాజా చిత్రం ‘కనెక్ట్’. ఈ నెల 22న యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా అశ్విన్ శరవణన్ మాట్లాడుతూ – ‘‘హారర్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో ‘కనెక్ట్’ చిత్రాన్ని రపొందించాను. లాక్డౌన్లో పనుల మీద వేరే ప్రాంతానికి వెళ్లినవాళ్లు కుటుంబానికి దరంగా అక్కడే స్ట్రక్ అయ్యారు. అలా ఓ తల్లీకతురు ఒక ఇంట్లో ఉండిపోతారు. అయితే కొన్ని రోజులకు కూతురు ప్రేతాత్మ ఆవహింనట్లు ప్రవర్తిస్తుంటుంది. అప్పుడు కూతుర్ని కాపాడుకోవడానికి ఆ తల్లి ఏం చేసింది? అనేది కథ. మామూలుగా హాలీవుడ్ చిత్రాలకు ఇంటర్వెల్ ఉండదు. కథ ఒక ఫ్లోలో వెళుతున్నప్పుడు విరామం ఇస్తే ప్రేక్షకులు డైవర్ట్ అవుతారని పెట్టరు. మా ‘కనెక్ట్’కి కూడా ఉండదు. ఈ సినిమా నిడివి గంటన్నర మాత్రమే. అదే మూడు గంటల సినిమా అయితే ఇంటర్వెల్ ఇవ్వాల్సి వచ్చేది. ఇక నయనతార మంచి నటి. ఆమె ఈ కథ విని అంతర్జాతీయ స్థాయి సినిమాగా నిర్మిస్తే బాగుంటుందనుకున్నారు. అందుకే తన భర్త విఘ్నేష్‌తో కలిసి నిర్మించారామె’’ అన్నారు. -
నయన్ హారర్ థ్రిల్లర్ కనెక్ట్, ఈ సినిమాకు ఇంటర్వేల్ లేదు: డైరెక్టర్
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన మరో లేటెస్ట్ హార్రర్ చిత్రం కనెక్ట్. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయన్ స్వయంగా నిర్మించింది. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. డిసెంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ అశ్విన్ శరవణన్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మూవీ విశేషాలను పంచుకున్నాడు. ♦ లాక్డౌన్లో కుటుంబాలు కలిసి లేవు. ఏదో పని మీద మరో ప్రాంతానికి వెళ్లిన వాళ్లు అక్కడే స్ట్రక్ అయ్యారు. అలా ఒక కుటుంబంలోని తల్లీ కూతురు ఇంట్లో ఉండిపోతారు. కొద్ది రోజులకు కూతురి ప్రవర్తనలో అనూహ్య మార్పులు వస్తాయి. ప్రేతాత్మ ఆవహించినట్లు ఆమె బిహేవ్ చేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో బిడ్డను తల్లి ఎలా కాపాడుకుంది అనేదే ఈ సినిమా కథ. గూస్ బంప్స్ తెప్పించే హార్రర్ థ్రిల్లర్ ఇది. ♦ ఆ పాపను ఆవహించిన ఆత్మను పోగొట్టేందుకు ఆ తల్లి.. ఫాదర్ అగస్టీన్ హెల్ప్ కోరుతుంది. ఈ పాత్రలో అనుపమ్ ఖేర్ నటన ఆకట్టుకుంటుంది. ఇలాంటి క్యారెక్టర్స్ ప్రేక్షకులు నమ్మేలా ఉండాలి. ఆ సహజత్వాన్ని అనుపమ్ ఖేర్ తన నటనతో చూపించారు. ♦హాలీవుడ్ చిత్రాల్లో సినిమాకు ఇంటర్వెల్ ఉండదు. కథలోని ఫీల్ పోతుందని వారు విరామాలు పెట్టరు. ఒక ఫ్లోలో వెళ్తున్న కథకు విరామం ఇస్తే ప్రేక్షకులు డైవర్ట్ అవుతారు. ఈ చిత్రంలోనూ ఇంటర్వెల్ ఉండదు. హార్రర్ థ్రిల్ పంచుతూ ఏక బిగిన కథ సాగుతుంటుంది. సినిమా నిడివి గంటన్నర ఉంటుంది కాబట్టి చూడటం సులువు. ఇటీవల హిట్ అయిన చాలా సినిమాల నిడివి మూడు గంటలు ఉంది. వాటికి ఇంటర్వెల్ గంటన్నరు ఇచ్చారు. కాబట్టి మా సినిమాను కంటిన్యూగా చూడటంలో ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బందులు పడరని అనుకుంటున్నా. ప్రేక్షకులు ఆదరిస్తే ఇలాంటి పద్ధతిలో మరిన్ని సినిమాలు రూపొందుతాయి. అప్పుడు థియేటర్లో ఆరేడు షోస్ ప్రదర్శించే వీలు కూడా కలుగుతుంది. ♦ నయనతారతో గతంలో మాయా (తెలుగులో మయూరి) అనే చిత్రాన్ని రూపొందించాను. ఆమె పట్ల నాకు గౌరవం ఉంది. దర్శకుడిగా నేనంటే ఆమెకు నమ్మకం. అందుకే మళ్లీ ఈ సినిమాను నయనతారతోనే చేశాను. ఈ కథ విన్నాక ఆమెకు బాగా నచ్చింది. దీన్ని ఒక అంతర్జాతీయ స్థాయి చిత్రంగా నిర్మించాలన్నది నయనతార కోరిక. అందుకే విఘ్నేష్ తో కలిసి ఆమె ప్రొడ్యూస్ చేసింది. మాకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ సమకూర్చింది. ♦ నటిగా నయనతారను అడ్మైర్ చేస్తాను. ఈ సినిమాలో ప్రతి సీన్ ఆమె నటన ఆకట్టుకుంటుంది. ఆద్యంతం తన పర్మార్మెన్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఒక డిఫరెంట్ కథను చూపిస్తున్నప్పుడు నటీనటుల ఎంత ప్రామిసింగ్ గా కనిపిస్తే అంత సినిమాకు అడ్వాంటేజ్. ఆ విషయంలో నయనతార టాప్ యాక్ట్రెస్. ♦ ఈ సినిమాకు పృథ్వీ సంగీతాన్ని అందించారు. సౌండ్ డిజైనింగ్ కోసమే మూడు నెలల సమయం తీసుకున్నాం. అందుకే క్వాలిటీ చాలా బాగా వచ్చింది. ♦ ప్రేక్షకులను చూపు తిప్పుకోకుండా చేసే ఇలాంటి తరహా చిత్రాలను తెరకెక్కించడానికి ఇష్టపడతాను. ఇలాంటి చిత్రాలకు మన దగ్గర మంచి డిమాండ్ ఉంటుంది. తెలుగులో మసూద మంచి విజయాన్ని సాధించింది. తెలుగు, తమిళ పరిశ్రమలు ప్రస్తుతం కలిసి పనిచేస్తున్నాయి. ఇదొక ఆరోగ్యకరమైన వాతావరణం. ♦ టాలీవుడ్ నాని సినిమాలంటే ఇష్టం. ఆయనకు గతంలో మయూరి కథ చెప్పాను. తనే సినిమా ప్రొడ్యూస్ చేస్తానన్నాడు. ఆయనతో ఒక సినిమా రూపొందించాలని ఉంది. -
ప్రతి క్షణం ప్రమాదం
నయనతార లీడ్ రోల్లో అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘కనెక్ట్’. సత్యరాజ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రధారులు. ఈ నెల 22న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ‘కనెక్ట్’ తెలుగు వెర్షన్‌ను యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేస్తోంది. తెలుగు ట్రైలర్‌ను సోషల్ మీడియాలో ప్రభాస్ షేర్ చేశారు. దేశంలో లాక్డౌన్ విధించడానికి 24 గంటల ముందు అంటూ ట్రైలర్ సాగుతుంది.‘నాన్నా నేను చెప్పేది విను.’, ‘నీతో ఉన్నది మన అమ్ము కాదు.. అక్కడ ఉన్న ప్రతిక్షణం నీ ప్రాణానికి ప్రమాదం’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. -
ఉత్కంఠభరితంగా నయనతార కనెక్ట్ మూవీ.. అర్థరాత్రి ట్రైలర్ రిలీజ్
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన మరో హారర్ చిత్రం కనెక్ట్. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయన్ స్వయంగా నిర్మించింది. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. డిసెంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం అర్థరాత్రి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. కరోనా లాక్డౌన్ సమంలో అందరూ ఇంటికే పరిమితం కావడం, ఇదే సమయంలో నయన్ ఆన్లైన్ మీటింగ్‌లో పాల్గొననగా వారికి దెయ్యం ఉన్నట్లు కొన్ని శబ్దాలు వినిపించడం వంటివి క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. 2.22 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 99 నిమిషాల నిడివితో ప్రయోగాత్మకంగా ఇంటర్వెల్ బ్రేక్ లేకుండా ఈ సినిమాను రిలీజ్ చేయబోతుండటం మరో విశేషం. పూర్తిగా హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌కు తగ్గట్లే సినిమాలోనూ సస్పెన్స్ క్రియేట్ చేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. -
రవితేజ, నిఖిల్‌తో బాక్సాఫీస్ వార్కి సై అంటున్న నయన్!
క్రిస్మస్ పండక్కి సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి. వచ్చే సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉండటంతో..ఈ క్రిస్మస్ ను బెస్ట్ అప్సన్ గా ఎంచుకున్నాయి.మాస్ మహారాజా రవితేజ ధమాకా సినిమాతో రంగంలో దిగుతున్నాడు. రవితేజకు జోడిగా శ్రీలీలా నటించింది. ఇప్పటికే మూవీ టీజర్,పాటలు రిలీజ్ చేశారు. డిసెంబర్ 23న ఈ చిత్రం విడుదల కానుంది. మరో వైపు క్రిస్మస్ కు నిఖిల్ కూడా 18 పేజేస్ తో వస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అలాగే ఓ పాటతో కూడా ఆకట్టుకున్నారు. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. పలనాటి సూర్య ప్రతాప్ మూవీ దర్శకుడు. నిఖిల్ ,అనుపమా పరమేశ్వరన్ నటించిన కార్తికేయా 2 పాన్ ఇండియా హిట్ కొట్టింది. దాంతో ఈ సినిమా మీద బజ్ బాగా పెరిగింది. రొమాంటిక్ కామెడీ జోనర్ తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ,నిఖిల్ తమ సినిమాతో పండక్కి రాబోతుంటే...నయన తార కూడా కనెక్ట్ మూవీతో రంగంలోకి దిగుతుంది. హర్రర్ జోనర్ లో ఈ మూవీ రూపొందింది. ఇప్పటికే ఈ మూవీ నుండి టీజర్ విడుదల చేశారు.యూవీ క్రియేషన్స్ బ్యానర్ తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేస్తుంది. ఇక 99 నిమిషాల నిడివి కల ఈ మూవీలో ఇంటర్వెల్ అనేది ఉండదట..అంటే..ఆడియన్స్ కు సినిమా మొదలయినప్పటి నుండి ..క్లైమాక్స్ వరకు..విశ్రాంతి ఇవ్వరన్న మాట. మరి క్రిస్మస్ పండక్కి..ఏ సినిమా ఎక్కువ ఆకట్టుకుందో చూడాలి. -
దెయ్యంతో నయన్‌కు సంబంధం ఏంటి? 'కనెక్ట్' స్టోరీ లైన్ ఇదే!
తమిళ సినిమా: వరుస సక్సెస్‌లు అందుకుంటున్న అగ్ర నటి నయనతార. మాయ చిత్రంతో ఈమె హర్రర్ కథా చిత్రాల ప్రస్థానం మొదలైంది. తాజాగా కనెక్ట్ చిత్రం ద్వారా ముందుకొస్తోంది. నయన్ ప్రధాన పాత్ర పోషించగా ఆమె భర్త, దర్శకుడు విగ్నేష్ శివన్ తన రౌడీ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మించడం విశేషం. వినయ్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మాయ చిత్రం ఫేమ్ అశ్విన్ శరవణన్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 22వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అశ్విన్ శరవణన్ మాట్లాడుతూ.. ఇది లాక్డౌన్ కాలంలో జరిగే కథ చిత్రంగా ఉంటుందన్నారు. కుటుంబ నేపథ్యంలో సాగే హర్రర్ సన్నివేశంతో కూడిన చిత్రం కలెక్ట్ అని చెప్పారు. నయనతార ఇంట్లోకి దెయ్యం ఎలా వస్తుంది? దాంతో ఎవరు బాధింపునకు గురవుతారు? చివరికి దాన్ని ఎలా తరిమేస్తారు అన్న ఆసక్తికత విషయాలతో ఈ చిత్రం ఉంటుందన్నారు. కథ విన్న తరువాత నయనతారకు నచ్చడంతో చిత్రాన్ని తామే నిర్మిస్తామని చెప్పి విఘ్నేష్ శివన్‌ను కలవమని చెప్పారన్నారు. ఆయనకీ కథ నచ్చడంతో కనెక్ట్ సెట్‌పైకి వెళ్లిందని తెలిపారు. హాలీవుడ్ చిత్రంలా కనెక్ట్ చిత్రం నిడివి 90 నిమిషాలు మాత్రమే ఉంటుందని చెప్పారు. దీన్ని థీయోటర్లలో రోజుకు ఆరు ఆటలు ప్రదర్శించే సౌలభ్యం ఉంటుందని అన్నారు. ఈ విషయమై థియేటర్ల యాజమాన్యాలతో సంప్రదిస్తున్నట్లు అశ్విన్ శరవణన్ తెలిపారు. -
నయనతార హారర్ థ్రిల్లర్ మూవీ 'కనెక్ట్'.. రిలీజ్ ఎప్పుడంటే?
నయనతార కథానాయికగా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ 'కనెక్ట్'. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ నిర్మించగా.. దర్శకుడు అశ్విన్ శరవణన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. హారర్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో దర్శకుడు అశ్విన్ శరవణన్ ఓ స్పెషలిస్ట్. నయనతార కథానాయికగా ఆయన తెరకెక్కించిన 'మయూరి' సినిమా తెలుగులో ఘన విజయం సాధించింది. అలాగే తాప్సీ నాయికగా శరవణన్ తెరకెక్కించిన 'గేమ్ ఓవర్' కూడా సూపర్ హిట్టయింది. 'కనెక్ట్' చిత్రాన్ని కూడా అదే తరహాలో ఆసక్తి కలిగించేలా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇటీవల నయనతార పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కనెక్ట్ టీజర్‌కు బాగా రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఈ నెల 22న టాలీవుడ్లో విడుదల చేసేందుకు యూవీ క్రియేషన్స్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశాయి. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్‌తోపాటు సత్యరాజ్, వినయ్ రాయ్, హనియ నఫిస కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి పృథ్వి చంద్రశేఖర్ సంగీతమందించారు. -
కోడలు పిల్లవి తీరే కష్టాలు కావు!
‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ హిట్ అయిన డబ్బింగ్ సీరి యల్స్‌లో ఒకటి. అమాయకురాలైన ఓ కోడలు మహా గడుసుదైన అత్త గారి ఇంట పడే కష్టాలే ఈ సీరియల్. విషయం పాతదే అయినా అందరిళ్లలో జరిగేది కాబట్టి వెంటనే కనెక్ట్ అయిపోయారు ప్రేక్షకులు. దాంతో పండగ చేసుకున్నారు నిర్వా హకులు. అయితే పరిస్థితి ఎలా అయ్యిందంటే... ఆదరిస్తున్నారు కదా అని సీరియల్‌ని సాగదీసు కుంటూ పోతున్నారు. ఇది మన వాళ్ల సమస్య కాదు. ఒరిజినల్తోనే ఉంది సమస్య. 2010 మేలో మొద లైంది ‘సాథ్ నిభానా సాథియా’. ఇప్పటికీ కొనసా...గు...తూ...నే... ఉంది. అత్తగారు మారిపోయింది. కోడల్ని ఆదరించింది. అయినా సీరియల్ ఆగలేదు. కొత్త కొత్త పాత్రలు... కొత్త కొత్త సమస్యలు! తెలుగువారు చూడాల్సిన ట్విస్టులు ఇంకా చాలానే ఉన్నాయి. మరి ఎంతకీ తీరని కోడలు పిల్ల కష్టాలు మనవాళ్ల మనసుల్ని కలచివేసి కంటతడి పెట్టిస్తాయో లేక వాటిని చూడలేక ఏమిటీ నస అని ఏడిపిస్తాయో చూడాలి! -
సిమ్ కార్డు లేకుండా రోమింగ్ ఇంటర్నెట్!
వినియోగదారులకు లెనోవో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తోంది. సిమ్ కార్డు లేకుండా ఇంటర్నెట్ సౌకర్యంతోపాటు, గ్లోబల్ రోమింగ్ సేవలనూ అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. సాధారణంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం వెళ్లినపుడు వినియోగదారులు రోమింగ్ అప్ డేట్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ టెలికాం సంస్థలు ఇటీవల ఉచిత రోమింగ్ సౌకర్యాన్ని కల్పించినా మిగిలిన ప్రైవేటు వినియోగదారులంతా రోమింగ్ ఛార్జీల మోత భరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో లెనెవో 'కనెక్ట్' అనే అత్యాధునిక సదుపాయాన్ని వినియోగదారులకు అందిస్తోంది. ఒక్కసారి రీచార్జి చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఆ ప్లాన్ ఎక్కడైనా వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది. ముందుగా ఈ సరికొత్త ప్లాన్‌ను చైనాలో ప్రవేశపెడుతోంది. వినియోగదారులకు రోమింగ్ ఖర్చులు తగ్గించేందుకు లెనోవో కృషిచేస్తోంది. ఒక్క స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు బిల్డ్ ఇన్ కనెక్టివిటీ ఉన్న పీసీ, టాబ్లెట్ వంటి ఏ పరికరాల్లోనైనా లోకల్ సిమ్ తోనే ఏదేశంలోనైనా ఇంటర్నెట్ కమ్యూనికేషన్ సేవను వాడుకునేలా చేస్తోంది. దీంతో వినియోగదారులకు బిల్లుల మోతను తగ్గిస్తోంది. కనెక్ట్ ఫీచర్‌తో ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే సుమారు 50 దేశాల్లో ఎక్కడ తిరిగినా రోమింగ్ సమస్య లేకుండా ఇంటర్నెట్ వాడుకునే వీలు కల్పిస్తోంది. థింక్ ప్యాడ్ ల్యాప్ టాప్‌కూ త్వరలో ఈ సదుపాయాన్ని యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికాల్లోని మరో 45 దేశాల్లో అందించేందుకు లెనొవో ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మొబైల్ వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్ గా పేరు తెచ్చున్న లెనొవో ప్రపంచవ్యాప్తంగా 11 మిలియన్ల మంది యూజర్లను కలిగి ఉంది. తాజాగా ఈ కనెక్ట్ వర్చువల్ డేటా నెట్వర్క్ సేవలను ప్రారంభించి గ్లోబల్ రోమింగ్ సర్వీసుతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు మరింత చేరువ కానుంది. తరచుగా ప్రయాణాలు చేసేవారికి, వ్యాపారస్తులకు ఈ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉందని లెనొవో వైస్ ప్రెసిడెంట్ వాంగ్ ష్వాయి చెబుతున్నారు.