Box Office Collections Clash With Nayanthara Connect, Ravi Teja Dhamaka And Nikhil 18 Pages Movies - Sakshi
Sakshi News home page

రవితేజ, నిఖిల్‌తో బాక్సాఫీస్‌ వార్‌కి సై అంటున్న నయన్‌!

Published Wed, Dec 7 2022 5:01 PM | Last Updated on Wed, Dec 7 2022 8:35 PM

Christmas 2022: Nayanthara Fight With Ravi Teja And Nikhil - Sakshi

క్రిస్మస్ పండక్కి సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి. వచ్చే సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉండటంతో..ఈ క్రిస్మస్ ను బెస్ట్ అప్సన్ గా ఎంచుకున్నాయి.మాస్ మహారాజా రవితేజ ధమాకా సినిమాతో రంగంలో దిగుతున్నాడు. రవితేజకు జోడిగా శ్రీలీలా నటించింది. ఇప్పటికే మూవీ టీజర్,పాటలు రిలీజ్ చేశారు. డిసెంబర్‌ 23న ఈ చిత్రం విడుదల కానుంది. 

మరో వైపు క్రిస్మస్ కు నిఖిల్ కూడా 18 పేజేస్ తో వస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అలాగే ఓ పాటతో కూడా ఆకట్టుకున్నారు. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. పలనాటి సూర్య ప్రతాప్ మూవీ దర్శకుడు. నిఖిల్ ,అనుపమా పరమేశ్వరన్ నటించిన కార్తికేయా 2 పాన్ ఇండియా హిట్ కొట్టింది. దాంతో ఈ సినిమా మీద బజ్ బాగా పెరిగింది. రొమాంటిక్ కామెడీ జోనర్ తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రవితేజ,నిఖిల్ తమ సినిమాతో పండక్కి రాబోతుంటే...నయన తార కూడా కనెక్ట్ మూవీతో రంగంలోకి దిగుతుంది. హర్రర్ జోనర్ లో ఈ మూవీ రూపొందింది. ఇప్పటికే ఈ మూవీ నుండి టీజర్ విడుదల చేశారు.యూవీ క్రియేషన్స్ బ్యానర్ తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేస్తుంది. ఇక 99 నిమిషాల నిడివి కల ఈ మూవీలో ఇంటర్వెల్ అనేది ఉండదట..అంటే..ఆడియన్స్ కు సినిమా మొదలయినప్పటి నుండి  ..క్లైమాక్స్ వరకు..విశ్రాంతి ఇవ్వరన్న మాట. మరి క్రిస్మస్ పండక్కి..ఏ సినిమా ఎక్కువ ఆకట్టుకుందో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement