Dhamaka
-
రవితేజ ధమాకా సీక్వెల్ టైటిల్ ఫిక్స్..
-
జోడీ రిపీట్?
‘ధమాకా!’ (2022) సినిమాలో తొలిసారి జంటగా నటించి ఆడియన్స్‌ను మెప్పించారు రవితేజ, శ్రీలీల. తాజాగా ఈ జోడీ రిపీట్ కానున్నట్లుగా తెలిసింది. రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమా నిర్మించనున్నారు. ఇది రవితేజ కెరీర్లో 75వ చిత్రం కావడం విశేషం.ఇందులో లక్ష్మణ్ భేరి అనే పాత్రలో కనిపించనున్నారు రవితేజ. ఈ సినిమా చిత్రీకరణ జూన్ నెలాఖరులో ప్రారంభం కానుందని తెలిసింది. అయితే ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రీలీల నటించనున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. మరి.. ఈ ‘ధమాకా!’ జోడీ రిపీట్ అవుతుందా? వేచి చూడాలి. కాగా ఈ సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
ప్రముఖ నిర్మాత కుమారుడితో 'దృశ్యం' పాప సినిమా
మలయాళ నటి ఎస్తర్ అనిల్. 'దృశ్యం' చిత్రంలో హీరో వెంకటేశ్ చిన్న కూతురిగా కనిపించి అందరినీ మెప్పించింది. ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో హీరోయిన్గా మరోసారి కనిపించనుంది. 2020లో ‘జోహార్’ సినిమాతో తెలుగులో హీరోయిన్గా ప్రస్థానం మొదలుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత ‘దృశ్యం’ సీక్వెల్లోనూ అలరించింది. దీంతో తెలుగు వారికి మరింత దగ్గరైంది.తాజాగా తెలుగులో హీరోయిన్గా ఎస్తర్ అనిల్‌కు మరో ఛాన్స్ దక్కింది. ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ కుమారుడు సాహిదేవ్ విక్రమ్ హీరోగా మరో సినిమాతో రానున్నాడు. వీరిద్దరూ జోడిగా ఒక సినిమా రాబోతుంది. విక్రమ్ ఇప్పటికే రేసుగుర్రం, రుద్రమదేవి, పటాస్ లాంటి సినిమాల్లో బాలనటుడిగా అలరించాడు. ఆపై గోలీసోడా అనే కన్నడ సినిమాలో హీరోగా కనిపించాడు.విక్రమ్ కూడా తెలుగులో ఇప్పటికే ఎవడు తక్కువ కాదు, వర్జిన్ స్టోరీ వంటి చిన్న చిత్రాలతో ఆయన అలరించాడు. తాజాగా ఎస్తర్- విక్రమ్ జంటగా తెరకెక్కనున్న సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ధమాకా సినిమాతో భారీ హిట్ కొట్టిన నక్కిన త్రినాథరావు ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాతగా ఉన్నారు. వెంకట కృష్ణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. ప్రొడక్షన్ -2 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమానికి సుమంత్, సందీప్ కిషన్‌లు ముఖ్య అతిధులుగా హజరయ్యారు. -
ప్రముఖ నిర్మాత కుమారుడితో 'దృశ్యం' పాప సినిమా
మలయాళ నటి ఎస్తర్ అనిల్. 'దృశ్యం' చిత్రంలో హీరో వెంకటేశ్ చిన్న కూతురిగా కనిపించి అందరినీ మెప్పించింది. ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో హీరోయిన్గా మరోసారి కనిపించనుంది. 2020లో ‘జోహార్’ సినిమాతో తెలుగులో హీరోయిన్గా ప్రస్థానం మొదలుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత ‘దృశ్యం’ సీక్వెల్లోనూ అలరించింది. దీంతో తెలుగు వారికి మరింత దగ్గరైంది. తాజాగా తెలుగులో హీరోయిన్గా ఎస్తర్ అనిల్‌కు మరో ఛాన్స్ దక్కింది. ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ కుమారుడు సాహిదేవ్ విక్రమ్ హీరోగా మరో సినిమాతో రానున్నాడు. వీరిద్దరూ జోడిగా ఒక సినిమా రాబోతుంది. విక్రమ్ ఇప్పటికే రేసుగుర్రం, రుద్రమదేవి, పటాస్ లాంటి సినిమాల్లో బాలనటుడిగా అలరించాడు. ఆపై గోలీసోడా అనే కన్నడ సినిమాలో హీరోగా కనిపించాడు. విక్రమ్ కూడా తెలుగులో ఇప్పటికే ఎవడు తక్కువ కాదు, వర్జిన్ స్టోరీ వంటి చిన్న చిత్రాలతో ఆయన అలరించాడు. తాజాగా ఎస్తర్- విక్రమ్ జంటగా తెరకెక్కనున్న సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ధమాకా సినిమాతో భారీ హిట్ కొట్టిన నక్కిన త్రినాథరావు ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాతగా ఉన్నారు. వెంకట కృష్ణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. ప్రొడక్షన్ -2 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమానికి సుమంత్, సందీప్ కిషన్‌లు ముఖ్య అతిధులుగా హజరయ్యారు. View this post on Instagram A post shared by ESTHER ANIL (@_estheranil) -
‘ధమాకా’ 1 ఇయర్ మరియు ‘ఈగిల్’ ట్రైలర్ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'ధమాకా' జోడీ రిపీట్.. ఈసారి మాత్రం!
మాస్ మహారాజ రవితేజ 'ధమాకా' మూవీ పేరు చెప్పగానే అందరికీ హీరోయిన్ శ్రీలీలనే గుర్తొస్తుంది. ఇందులో వేరే లెవల్ ఎనర్జీతో డ్యాన్సులేసింది. సినిమాలో కొన్నిచోట్ల హీరోని డామినేట్ కూడా చేసింది. స్టోరీ పరంగా ఈ సినిమాలో కొత్తగా ఏం లేకపోయినా శ్రీలీల వల్ల ఓ ఫ్రెష్ నెస్ వచ్చి, హిట్ అయిందని కూడా చెప్పొచ్చు. అలాంటిది రవితేజతో శ్రీలీల మరోసారి కలిసి రచ్చ చేసేందుకు సిద్ధమైపోయిందట. తెలుగులో ఈ మధ్య కాలంలో శ్రీలీలకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి రాలేదు. ఎందుకంటే ఈ బ్యూటీ చేతిలో ఏకంగా తొమ్మిది వరకు కొత్త మూవీస్ ఉన్నాయి. గుంటూరు కారం, భగవంత్ కేసరి, ఉస్తాద్ భగత్ సింగ్, ఆదికేశవ.. ఇలా బోలెడన్నీ సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో కొత్త చిత్రం వచ్చినట్లు తెలుస్తోంది. అదే రవితేజ-గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్. 'డాన్ శీను', 'బలుపు', 'క్రాక్' చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న రవితేజ-గోపీచంద్ మలినేని.. ఇప్పుడు మరో సినిమా కోసం కలిసి పనిచేయబోతున్నారు. 'వీరసింహారెడ్డి' తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న గోపీచంద్.. రవితేజకు ఓ కథ చెప్పి ఒప్పించారట. ఇందులో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలా అనే చర్చ వచ్చినప్పుడు శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. దాదాపు కన్ఫర్మ్ కూడా అయిపోయిందట. అధికారిక ప్రకటన ఇంకా మిగిలుందట. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలోకి 22 సినిమాలు.. ఆ ఒక్కటి మాత్రం!) -
సంచలనం సృష్టిస్తున్న రవితేజ శ్రీలీల..
-
శ్రీ లీల స్పీడ్ ని అందుకోలేకపోతున్న స్టార్ హీరోయిన్స్
-
‘ధమ్కీ ఇచ్చిన దాస్!’.. కంగుతిన్న ప్రేక్షకులు
విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో నటించిన తెరకెక్కించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. ఉగాది కానుకగా ఈ మూవీ మార్చి 22న థియేటర్లలోకి వచ్చింది. విశ్వక్ సేన్ తొలి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా చూసేందుకు ఆశగా వెళ్లిన ప్రేక్షకులకు షాక్ తగిలింది. తెరపై మూవీ పడగానే ఆడియన్స్ అంత ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ సినిమాకు బదులుగా మరో సినిమా వేయడంతో అంతా గోల గోల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నంలోని సుకన్య థియేటర్లో నేడు రిలీజ్ అయిన దాస్ కా ధమ్కీ మూవీకి బుదులుగా రవితేజ ధమాకా చిత్రాన్ని వేశారు. కొత్త సినిమా అని వెళ్లిన ఆడియన్స్‌కి పాత సినిమా టైటిల్ కనిపంచడంతో రచ్చ రచ్చ చేశారు. అది గ్రహించిన థియేటర్ యాజమాన్యం వెంటనే తప్పును సరిదిద్దుకుంది. వెంటనే ‘దాస్ కా ధమ్కీ’ మూవీ ప్రదర్శించడంతో ప్రేక్షకులంతా కూల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో పలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ధమ్కీ ఇచ్చిన దాస్’ అంటూ తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు. ధమ్కీ ధమాఖా దబిడి దిబిడి😂#Dhamaka is Played instead of #Dhamki in Vizag sukanya theatre this morning Theatre Management Got Confused with the names itseems#DasKaDhamki@VishwakSenActor @RaviTeja_offl pic.twitter.com/IOU5CR3vcX — Mr.RK (@RavikumarJSP) March 22, 2023 -
ఎండల్లో హాయ్ హాయ్..అంటున్న స్టార్స్.. సమ్మర్ టార్గెట్‌గా భారీ సినిమాలు
వేసవి వస్తోందంటే సినిమాల సందడి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు స్నేహితులతోనో, కుటుంబ సభ్యులతోనో సినిమాకి వెళుతుంటారు. మండే ఎండల్లో కూల్ కూల్‌గా ఏసీ థియేటర్లో కూర్చుని సినిమాని ఆస్వాదిస్తుంటారు. అందుకే సమ్మర్ టార్గెట్‌గా ఎక్కువ సినిమాలు సిల్వర్ స్క్రీన్‌కి వస్తుంటాయి. ఈ ఏప్రిల్‌లో తొమ్మిది సినిమాలకుపైగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ‘మే’కి మాత్రం ఇప్పటికి విడుదల తేదీ ఖరారైన సినిమా ఒకే ఒక్కటి ఉంది. నాగచైతన్య ‘కస్టడీ’ మే 12న విడుదల కానుంది. మరి.. ఏప్రిల్‌లో విడుదల కానున్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం... ♦ ‘ధమాకా’ చిత్రంతో వంద కోట్ల క్లబ్లో చేరారు హీరో రవితేజ. దీంతో ఆయన నటిస్తున్న తర్వాతి సినిమా ‘రావణాసుర’పై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ, అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొం దుతున్న ఈ సినిమాలో రవితేజ లాయర్పాత్రలో కనిపిస్తారు. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ కథానాయికలుగా నటిస్తున్నారు. ♦ వైవిధ్యమైన కథలు, విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ‘అల్లరి’ నరేశ్. వినోదాత్మక చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన ఆయన ‘నాంది’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ వంటి చిత్రాల్లో సీరియస్ రోల్స్‌లో నటించారు. ప్రస్తుతం నరేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉగ్రం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఎమోషనల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మిర్నా మీనన్ హీరోయిన్. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ మూవీని ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు మేకర్స్. ♦ నటుడు, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా నటించిన చిత్రం ‘రుద్రుడు’. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ . కదిరేశన్∙స్వీయ దర్శకత్వంలో ఫైవ్‌స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ పతాకంపై రూపొం దిన ఈ తమిళ చిత్రం తెలుగు, కన్నడ, మలయాళంలోనూ విడుదల కానుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొం దిన ఈ సినిమాని గత ఏడాది డిసెంబర్ 23న విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించినా వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడంతో రిలీజ్ కాలేదు. ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు కొత్త డేట్ ప్రకటించింది యూనిట్. ♦ సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 15వ చిత్రం ‘విరూపాక్ష’. బైక్ ప్రమాదం నుంచి కోలుకున్న ఆయన ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర–సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్‌ఎ న్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 21న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. 1990 నేపథ్యంలో ఫారెస్ట్ బేస్డ్ విలేజ్‌లో జరిగే కథాంశంతో ఈ మూవీ రూపొం దుతోందని సమాచారం. ♦ అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్నపాన్ ఇండియా చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాక్షీ వైద్య కథానాయికగా చేస్తున్నారు. రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. స్పై థ్రిల్లర్‌గా రూపొం దుతోన్న చిత్రమిది. ఈ మూవీ కోసం సిక్స్‌ప్యాక్ దేహం, పొడవాటి హెయిర్ స్టైల్‌తో స్టైలిష్‌గా మేకోవర్ అయ్యారు అఖిల్. ఫారిన్లో చిత్రీకరించే ఓ ఫైట్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలిసింది. ♦ ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ (పీఎస్– 1)’. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమాను తీశారు మణిరత్నం. తొమ్మిదో శతాబ్దం నాటి చోళ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష ప్రధానపాత్రల్లో నటించారు. లైకాప్రొ డక్షన్స్ , మద్రాస్ టాకీస్ నిర్మించిన ఈ చిత్రం తొలి భాగం ‘పీఎస్ 1’ గత ఏడాది సెప్టెంబర్ 30నపాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. తెలుగులో నిర్మాత ‘దిల్’ రాజు రిలీజ్ చేశారు. మలి భాగాన్ని ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ చిత్రయూనిట్ ఓ వీడియోను విడుదల చేసింది. ♦ తెలుగు చిత్ర పరిశ్రమకి ‘ఉప్పెన’లా దూసుకొచ్చారు పంజా వైష్ణవ్ తేజ్. ‘కొండపొలం, రంగరంగ వైభవంగా’ తర్వాత తన నాలుగో చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో చేస్తున్నారు వైష్ణవ్ తేజ్. శ్రీకాంత్ రెడ్డి దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం గత ఏడాది జూన్ల్ ప్రారంభమైంది. తన కెరీర్లో తొలిసారి మాస్, యాక్షన్ మూవీ చేస్తున్నారు వైష్ణవ్ తేజ్. ఈ సినిమా ఏప్రిల్ 29న బాక్సాఫీస్ బరిలో నిలుస్తోంది. ∙ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బోళా శంకర్’. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా చిరంజీవి చెల్లెలిపాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్టైన్మెంట్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. మరి ముందుగా ప్రకటించినట్లు ఏప్రిల్ 14న ‘బోళా శంకర్’ రిలీజ్ అవుతుందా? మరో కొత్త డేట్‌ని అనౌన్స్ చేస్తారా? అనేది తెలియాలంటే వేచి చూడాలి. సమంత లీడ్ రోల్లో నటించినపాన్ ఇండియా చిత్రం ‘శాకుంతలం’. ప్రముఖ కవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ గుణశేఖర్. శకుంతల, దుష్యంత మహారాజు అజరామరమైన ప్రేమకథను ఈ మూవీలో చూపిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమా విడుదల ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడి ఫైనల్‌గా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
మిస్టర్ కల్యాణ్ ట్రైలర్‌ను విడుదల చేసిన ధమాకా డైరెక్టర్
ఉషశ్రీ సమర్పణలో శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న సినిమా మిస్టర్ కల్యాణ్.ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో మాన్యం కృష్ణ, అర్చన, హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంతో పండు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సప్తగిరి, ధనరాజ్, తాగుబోతు రమేష్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలె పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ను ధమాకా మూవీ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన బెస్ట్ విషెస్ తెలియజేశారు. మిస్టర్ కళ్యాణ్ ట్రైలర్ బాగుందని, మేకింగ్, లొకేషన్స్, డైలాగ్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని పేర్కొన్నారు. -
'ధమాకా' నుంచి దండకడియాల్ వీడియో సాంగ్ వచ్చేసింది..
మాస్ మహారాజ రవితేజ, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ధమాకా. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందించారు.కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని అన్ని సాంగ్స్ సూపర్‌హిట్‌గా నిలిచాయి. తాజగా ఈ చిత్రం నుంచి 'దండకడియాల్ .. దస్తి రుమాల్' సాంగ్ ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో విడుదలైంది. రవితేజ, శ్రీలీల మాస్ స్టెప్పులు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. గత నెల22న ఓటీటీలోకి వచ్చేసిన ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియన్స్‌ని ఆకట్టుకుంటోంది. -
సింగర్ మంగ్లీ ఒక్కో పాటకు ఎన్ని లక్షలు తీసుకుంటుందో తెలుసా?
సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరర్లేదు. మట్టిలో నుంచి పుట్టిన మాణిక్యం ఆమె. న్యూస్ చానల్లో యాంకర్‌గా కెరీర్‌ని స్టార్ట్ చేసి.. స్టార్ సింగర్‌గా మారిపోయారు. మొదట్లో తెలంగాణ యాసలో పాటలు పాడుతూ.. బతుకమ్మ సాంగ్స్‌తో ఫేమస్ అయింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడం.. అందులో ఆమె పాడిన పాటలన్నీ సూపర్ హిట్ కావడంతో మంగ్లీ జీవితమే మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్లో ఆమె స్టార్ సింగర్‌గా కొనసాగుతుంది. ఆమె ఆలపించిన పాటల్లో ‘రాములో రాముల’, ‘సారంగదరియా’, ‘జింతక్ చితక్’, ‘ఊరంతా’, ‘బుల్లెట్’, ‘జ్వాలా రెడ్డి’, ‘రా రా రక్కమ్మ’, ‘కన్నె అదిరింది’ వంటి సాంగ్స్ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ని తెచ్చిపెట్టాయి. ఇలా ఆమె పాడిన పాటలన్నీ సూపర్ హిట్‌గా నిలవడంతో .. పారితోషికాన్ని ఆమాంతం పెంచేసిందట మంగ్లీ. ఒకప్పుడు ఒక్కో పాటు కేవలం రూ.20,000 మాత్రమే తీసుకున్న మంగ్లీ.. ఇప్పుడు రూ.2-3 లక్షల వరకు వసూలు చేస్తుందట. సినిమా విజయంలో మంగ్లీ పాటలు కూడా కీలకం అవుతుండడంతో నిర్మాతలు అంత మొత్తంలో ఇవ్వడానికి వెనకడుగు వేయడం లేదట. మంగ్లీకి సొంతంగా ఓ యూట్యూబ్ చానల్ కూడా ఉంది. అందులో ఆమె సొంతంగా నిర్మించిన పాటలను విడుదల చేస్తుంది. దాని ద్వార కూడా మంగ్లీకి మంచి ఇన్కమే వస్తోంది. మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇలా నాలుగైదు రకాలుగా మంగ్లీ భారీగా సంపాదిస్తోందని ఇండస్ట్రీ టాక్. చిత్తూరు జిల్లాలోని మారుమూల ప్రాంతానికి చెందిన సత్యవతి రాథోడ్(మంగ్లీ అసలు పేరు)..ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇలా స్టార్ సింగర్‌గా రాణించడం నిజంగా అభినందించాల్సిన విషయమే. -
దర్శకుడు స్క్రీన్ ప్లేతో గేమ్ ఆడుకున్నారు: పరుచూరి గోపాలకృష్ణ
మాస్ మహారాజా రవితేజ, ‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ధమాకా'. విడుదలైన కొద్ది రోజుల్లోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో రవితేజ ఎనర్జీ, శ్రీలీల డ్యాన్స్ ప్రేక్షకులకు కట్టి పడేశాయి. తాజాగా ఈ చిత్రం ప్రముఖ సినీ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ తన సమీక్షను వెల్లడించారు. ఈ సినిమా దర్శకుడు నక్కిన త్రినాథరావు స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆడుకున్నారని అన్నారు. రవితేజ డ్యూయల్ రోల్ ఈ చిత్రానికి అదనపు బలాన్నిచ్చిందని తెలిపారు. రావు రమేశ్ పాత్ర పూర్తిస్థాయి క్యారెక్టరైజేషన్ లేనప్పటికీ మెప్పించిందన్నారు. (అఫీషియల్: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న 'ధమాకా') ఒక్క మాటలో చెప్పాలంటే తన తండ్రి కాని తండ్రి ఆస్తిని లాక్కోవాలని చూసే విలన్ పని పట్టిన ఓ హీరో కథే ఈ సినిమా. ఈ సినిమాలో రావు రమేశ్, శ్రీలీల పాత్రలు చూస్తే ఫర్ఫెక్ట్ క్యారెక్టరైజేషన్ అనేది అవసరం లేదని చెప్పడానికి ఉదాహరణలు. రచయిత ఎలాంటి కష్టం లేకుండా ఈ పాత్రలను సృష్టించాడు. రావురమేశ్ పక్కన హైపర్ ఆదిని పెట్టి వారిద్దరి సన్నివేశాలు అలా సరదాగా తీసుకెళ్లిపోతాయన్నారు. హీరోని ఓ వ్యక్తి తలపై కొడితే అతడు కిందపడిపోవడంతో కథ మొదలవుతుంది. సాధారణంగా ఒక మాస్ హీరోకి ఇలాంటి ప్రారంభ సన్నివేశాలు ఉండవు. ఈ విషయంలో దర్శకుడు త్రినాథరావు చాలా ధైర్యం చేశారు. ఎక్కడా సస్పెన్స్ పెడతారో అక్కడ సెంటిమెంట్ పండదని దర్శకుడు నమ్మాడు. అందుకే అక్కడే ఆ ఇద్దరు రవితేజలు ఒక్కరనే విషయాన్ని ఇంటర్వెల్ ముందే చెప్పేశాడు. ఎవరికీ ఎవరనేది చెప్పేశారు. అలాగే 18 రోజుల క్రితమే ఏమై ఉంటుందనేదే కథలో ట్విస్ట్‌తో అక్కడే లాక్ చేశారు. ఇలా చేయడం వల్లే రూ.40 కోట్ల బడ్జెట్‌తో తీస్తే రూ.110 కోట్ల వసూళ్లు రాబట్టిందని సినీ విశ్లేషకుల అంచనా. అంటే రూపాయికి రూపాయిన్నర లాభం వచ్చినట్టే. ఆనంద చక్రవర్తి, నందగోపాల్ మధ్య ఆస్తి ఎవరూ తీసుకుంటారనేది ముందే చెప్పేశారు. అందులో ఎలాంటి ట్విస్ట్‌లు పెట్టలేదు. ఈ సినిమా ఏంటీ అంటే ప్రేక్షకులతో దర్శకుడు, రచయితలు ఆడుకున్నారు. ఒక్క క్షణం పక్కకు వెళితే సినిమా అర్థం కాదన్న రీతిలో ఆడుకున్నారు. అతను తాను కాదని చెబుతూ ప్రేక్షకులను ఫుల్స్ చేస్తున్న సీన్లు అద్భుతం. నేను విశాఖలో సినిమా చూశా. థియేటర్లో చూసేటప్పుడు ఆ ఫర్మామెన్స్ కనిపిస్తుంది. రవితేజ కవ్విస్తూ నవ్విస్తాడు. అతను ఎమోషన్‌లోనైనా ఒదిగిపోతారు రవితేజ అంటూ కొనియాడారు పరుచూరి. నక్కిన త్రినాథరావు స్క్రీన్‌ప్లేతో ఆడుకున్న తీరు అద్భుతం. స్క్రీన్ ప్లేతో ఆడుకోవడం అందరికీ సాధ్యం కాదు. ఆ లిస్ట్‌లో చాలామంది గొప్ప దర్శకులు ఉన్నారు. (ఇది చదవండి: కలెక్షన్ల మోత మోగిస్తున్న రవితేజ) సినిమాలో 'ఆ డైలాగ్.. నీలో నాకు విలన్ కనిపిస్తే.. నాలో నీకు హీరో కనిపిస్తాడురోయ్.' అనే డైలాగ్ తూకం వేసి మరీ రాసుకున్నారు. ఫైట్ సీన్లలో మాటలతో కట్టిపడేశాడు. అందులో మళ్లీ గాంధేయవాదం గురించి చెప్పారు. రావు రమేశ్ రవితేజకు నమస్కారం పెట్టగానే నేను నవ్వాను. నాకు రెండు సినిమాలు గుర్తొచ్చాయి. సమరసింహారెడ్డిలో సత్యనారాయణను చూడగానే నమస్కారం పెడితే అక్కడే అర్థమైపోతుంది. ఇంద్రలో కూడా ప్రకాశ్ రాజ్ చిరంజీవికి దండం పెడితే అంతే క్రేజ్ వచ్చింది. ఇదేదో నాకు చీటింగ్ షాట్లా అనిపించింది. ఇందులో ఉన్నట్లు కొన్ని పాత్రలు కన్ఫ్యూజన్ అనిపించింది. క్లైమాక్స్ పోలీస్ స్టేషన్లో మనసుకు హత్తుకునేలా ఉంది. ఈ చిత్రంలో అన్యాయంగా ఒకరి సొమ్మును ఆక్రమించొద్దు అనే నీతిని అందించారు నక్కిన. ఇది నిజం. నీది నీదే. నాది నాదే. ఆయన ఇస్తే తీసుకుందాం అనేది మంచి సందేశం. ఈ చిత్రంలో మరో ట్విస్ట్ ఏంటంటే రెండు రవితేజ క్యారెక్టర్స్ ఏంటీ అనేదే. ఈ సినిమా చూస్తే కచ్చితంగా మెచ్చుకుంటారు. పాత్రలన్నింటినీ దాచుకోకుండా రివీల్ చేస్తే ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో చూపించారు. ఈ చిత్రబృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు పరుచూరి గోపాలకృష్ణ. -
ధమాకాలో దుమ్మురేపిన పల్సర్ బైక్ సాంగ్ వచ్చేసింది..
మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధమాకా’. శ్రీలీల ఇందులో హీరోయిన్గా నటించింది. పక్కా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద దుమ్మరేపింది. ఇక ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అందులో పల్సర్ బైక్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రవితేజ, శ్రీలీల మాస్ డ్యాన్స్‌తో ఇరగదీశారు. తాజాగా ఈ పాట ఫుల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. -
ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ 'ధమాకా'
మాస్ మహారాజా రవితేజ, ‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ధమాకా'. విడుదలైన కొద్ది రోజుల్లోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో రవితేజ ఎనర్జీ, శ్రీలీల డ్యాన్స్ ప్రేక్షకులకు కట్టి పడేశాయి. తాజాగా ఈ చిత్రం ఇవాల్టి నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. కాగా.. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిటిటల్ రైట్స్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈరోజు నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో థియేటర్లలో చూడడం మిస్సయినా వారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. -
2023: నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాల జాతర.. అన్ని భారీ, పాన్ ఇండియా ప్రాజెక్ట్సే
ఓటీటీలో ఈ ఏడాది కొత్త సినిమాల జాతర నెలకొననుంది. థియేటర్లో సంక్రాంతి పండుగ సందడి ఉండగానే.. ఓటీటీలో కొత్త సినిమాలను వరుస పెట్టి ప్రకటిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఈ సంక్రాంతికి డిజిటల్ ప్రియులను ఆకర్షించే పనిలో పడింది. ఎప్పుడు సినిమాలు రిలీజ్ అనంతరం ప్రకటన ఇచ్చే నెట్‌ఫ్లిక్స్ ఈసారి థియేట్రికల్ రిలీజ్‌కు ముందే కొత్త సినిమాలను వరుస పెట్టి ప్రకటిస్తోంది. చదవండి: Priyanka Jawalkar: పవన్ కల్యాణ్‌తో అసలు నటించను! ఎందుకంటే.. సంక్రాంతి సంందర్భంగా తెలుగులో రాబోయే స్టార్ హీరోల సినిమాలను అనౌన్స్ చేసింది. వాటిలో భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని రిలీజ్‌కు సిద్దంగా ఉండగా.. మరికొన్ని షూటింగ్ దశలోనే ఉన్నాయి. అవేంటంటే చిరంజీవి భోళా శంకర్, మహేశ్ బాబు ఎస్ఎస్ఎమ్బి 28, వరుణ్ తేజ్ వీటీ 12, అనుష్క ప్రోడక్షన్ నెం. 14, సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష, నాని దసరా, డీజే టిల్లు 2 ఇంకా ఎన్నో కొత్త ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. చదవండి: హృతిక్‌ను కించపరచడం నా ఉద్దేశం కాదు: ఆ కామెంట్స్‌పై జక్కన్న స్పందన ఇక విడుదలైన 18 పేజెస్, ధమాకా చిత్రాలు కూడా త్వరలో ఇక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి. ఒక్క తెలుగు సినిమాలే కాదు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలను కూడా వరుసగా ప్రకటిస్తోంది. అందులో అయినప్పుడు అతి తర్వలో మీ నెట్‌ఫ్లిక్స్‌లో రాబోయే చిత్రాలు ఇవే అంటూనే థియేట్రికల్ రిలీజ్ అనంతరమే అని స్పష్టం చేసింది. నెట్‌ఫ్లిక్స్ జోరు చూస్తుంటే ఈ ఏడాది సినీ ప్రియులకు సినిమాల జాతర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ చిత్రాలేవో చూద్దాం! View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
మ్యూజికల్ ధమాకా
-
అఫీషియల్: ఓటీటీలో 'ధమాకా'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
మాస్ మహారాజా రవితేజ, ‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ధమాకా'. విడుదలైన కొద్ది రోజుల్లోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో రవితేజ ఎనర్జీ, శ్రీలీల డ్యాన్స్ ప్రేక్షకులకు కట్టి పడేశాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిటిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ చిత్రం ఈనెల 22 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ప్రకటించింది. దీంతో థియేటర్లలో చూడడం మిస్సయినా వారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. Andhariki maanchi kick icche subhavaartha. Dhamaka, coming soon to Netflix🔥 #DhamakaOnNetflix pic.twitter.com/iLj7nhQG7y — Netflix India South (@Netflix_INSouth) January 12, 2023 -
'ధమాకా' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే..
మాస్ మహారాజా రవితేజ, ‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ధమాకా' సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రూ. 100కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. రవితేజ ఎనర్జీ, శ్రీలల డ్యాన్స్ ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి.. రవితేజ మాస్ స్టామినా, స్టార్ పవర్‌తో ధమాకా పైసా వసూల్ ఎంటర్టైనర్గా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటిరోజు నుంచే హిట్‌టాక్‌ను తెచ్చుకుంది. ఇక త్వరలోనే ధమాకా చిత్రం ఓటీటీలో సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ డిటిటల్ రైట్స్‌ను దక్కించుకున్నట్లు సమాచారం. నెట్టింట అందుతున్న సమాచారం ప్రకారం.. ఈనెల 22న ధమాకా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. ఇది తెలిసి రవితేజ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. Telugu Film #Dhamaka Will Premiere On January 22nd On Netflix pic.twitter.com/nj4FlkinK1 — OTT Streaming Updates (@streamngupdates) January 11, 2023 -
ఇలాంటి కంగ్రాట్స్ ఇంకా వినాలి
‘‘ధమాకా’ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవడం చాలా ఆనందంగా ఉంది. మా సినిమాని బాగా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని హీరో రవితేజ అన్నారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ధమాకా’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ–అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 23న రిలీజై, వంద కోట్ల క్లబ్లో చేరింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ‘ధమాకా 101 కోట్ల మాసివ్ సెలబ్రేషన్’ని నిర్వహించింది. ఈ వేడుకలో మేకర్స్, మీడియా ప్రతినిధుల చేతుల మీదుగా చిత్ర యూనిట్‌కు మొమెంటోలు అందించారు. అనంతరం రవితేజ మాట్లాడుతూ– ‘‘విశ్వప్రసాద్‌గారు, వివేక్ కూచిభొట్లగారికి బిగ్ కంగ్రాట్స్. అలాగే త్రినాథరావు, రచయిత ప్రసన్న, శ్రీలీలకి అభినందనలు.. ఇలాంటి కంగ్రాట్స్ ఇంకా వింటూనే ఉండాలి. సంగీత దర్శకుడు భీమ్స్ ఇలాగే ఇరగదీసేయాలి’’ అన్నారు. ‘‘ధమాకా’ కథకు ఓంకారం చుట్టిన ప్రసన్నకి, ఆయనకి సపోర్ట్‌గా నిలబడిన మరో రచయిత సాయి కృష్ణకి థ్యాంక్స్. ఈ కథని తొలుత విని ఓకే చేసిన వివేక్‌గారికి కృతజ్ఞతలు. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన రవితేజ, శ్రీలీలకి «థ్యాంక్స్’’ అన్నారు త్రినాథరావు నక్కిన. ‘‘ధమాకా’ని బ్లాక్ బస్టర్ చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్స్’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్, సహనిర్మాత వివేక్ కూచిభొట్ల. ‘‘నా కెరీర్ బిగినింగ్‌లో రవితేజగారు నాకు బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు’’ అన్నారు శ్రీ లీల. -
రవితేజ ‘ధమాకా’ మూవీ 100 కోట్ల మ్యాసివ్ ఫెస్టివల్ (ఫొటోలు)
-
రూ. 100 కోట్ల క్లబ్‌లోకి ధమాకా.. రవితేజ కెరీర్లోనే తొలి రికార్డు!
మాస్ మహారాజా రవితేజ, ‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ధమాకా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సక్సెఫుల్‌గా మూడో వారంలోకి అడుగుపెట్టింది. విడుదలైన తొలి షో నుంచే ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌ను సొంతంగా చేసుకుంది. బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం తాజాగా రూ. 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. విడుదలైన రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల పైనే గ్రాస్ వసూళు చేసిన చిత్రంగా ధమాకా రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా మూవీ టీం ప్రకటించింది. ఇక రవితేజ కెరీర్లో రూ. 100 కోట్ల కలెక్షన్స్ సాధించిన తొలి చిత్రంగా ధమాకా నిలిచింది. ఫుల్ అవుట్ అండ్ అవుట్ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో రవితేజ స్క్రిన్ ప్రెజెన్స్, ఎనర్సీ, ఆయన కామెడీ టైమింగ్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మరోసారి రవితేజ ఈ సినిమాతో తన మాస్ మార్క్‌ను చూపించారు. రవితేజ మాస్ స్టామినా, స్టార్ పవర్‌తో ధమాకా పైసా వసూల్ ఎంటర్టైనర్గా నిలిచింది. కాగా నక్కిన త్రినాథరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. రవితేజకు జోడీగా నటించిన హీరోయిన్ శ్రీలీల తన అందంతో, డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టింది. చదవండి: పఠాన్ డిజాస్టర్ అయ్యిందిగా..! నెటిజన్ విమర్శకు షారుక్ స్ట్రాంగ్ కౌంటర్ అందుకే నా ట్విటర్ అకౌంట్‌ను నిలిపివేశారు: నటుడు -
రికార్డ్స్ బద్దలు కొట్టిన ధమాకా..
-
‘పల్సర్‌బైక్’ పాటకి రవితేజ, శ్రీలీల అదిరిపోయే స్టెప్పులు
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ధమాకా’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. ఇప్పటికే డిసెంబర్ 23న విడుదలైన ఈ మాస్ ఎంటర్టైనర్ ఇప్పటికే రూ.94 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. వంద కోట్ల క్లబ్లో చేరడానికి రెడీ అవుతోంది. రవితేజ ఎనర్జీ, యాక్షన్ ఎలిమెంట్స్.. శ్రీలీల గ్లామర్, డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఓ సన్నివేశంలో రవితేజ, శ్రీలీల కలిసి ప్రైవేట్ ఆల్బమ్ ‘పల్సర్ బైక్’ పాటకి వేసే స్టెప్పులు థియేటర్స్‌లో ఈళలు వేయిస్తోంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన టీజర్‌ని చిత్రబృందం రిలీజ్ చేసింది. అందులో రవితేజ, శ్రీలీల వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, రవితేజ డబల్ రోల్ పోషించిన ఈ చిత్రానికి నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ-స్క్రీన్‌ప్లే-మాటలు అందించారు. -
వంద కోట్లకు చేరువలో ధమాకా, మేకింగ్ వీడియో రిలీజ్!
మాస్ మహారాజ రవితేజ నటించిన మాస్ ఎంటర్టైనర్ ధమాకా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. కేవలం 9 రోజుల్లోనే రూ.77 కోట్లు రాబట్టిన ఈ సినిమా కొత్త ఏడాది మొదటి రోజును బాగా క్యాష్ చేసుకుంది. పదవ రోజు ఏకంగా రూ.12 కోట్లపై చిలుకు వసూళ్లు సాధించింది. దీంతో ధమాకా కలెక్షన్లు రూ.89 కోట్లకు చేరాయి. ఈ స్పీడు ఇలాగే కొనసాగితే త్వరలోనే ఈ మూవీ వంద కోట్ల క్లబ్బులో చేరడం ఖాయం. ఇకపోతే తాజాగా చిత్రయూనిట్ ధమాకా మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో షూటింగ్ అంతా ఎంత సరదాగా సాగిపోయిందో చూపించారు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ సినిమా అదిరిపోయిందని, ధమాకా రూ.100 కోట్ల క్లబ్బులో ఎప్పుడు చేరుతుందా? అని వెయిట్ చేస్తున్నామంటున్నారు. కాగా నక్కిన త్రినాథరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. రవితేజకు జోడీగా నటించిన హీరోయిన్ శ్రీలీల తన అందంతో, డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టింది. చదవండి: ఫ్యాన్స్ అత్యుత్సాహం.. ఈవెంట్లో నటుడికి గాయం చిరు వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి స్పెషల్ పోస్టర్లు చూశారా? -
2022 చాలా కష్టంగా గడిచింది..రవితేజ ఎమోషనల్ పోస్ట్
చాలా కాలం తర్వాత ‘ధమాకా’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మాస్ మహారాజా రవితేజ. డిసెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం..ఇప్పటికీ భారీ కలెక్షన్స్‌ని రాబడుతూ.. సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.77 కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ధమాకా విజయంపై తాజాగా రవితేజ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ‘ధమాకా’లాంటి మర్చిపోలేని సినిమాతో 2022కు వీడ్కోలు చెబుతున్నాం. ఇంతటి విజయాన్ని అందించిన అభిమానులకు థ్యాంక్స్. ఈ సక్సెస్ ను గతేడాదిలో మనం కోల్పోయిన దిగ్గజాలకు అంకితం చేస్తున్నాను. ఈ ఏడాది ఎంతో కష్టంగా గడిచింది. కానీ మీ షరతులు లేని ప్రేమ నన్ను ముందుకు సాగేలా చేసింది. 2023లో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను’అని రవితేజ ట్వీట్ చేశారు. #HappyNewYear2023 🤗 pic.twitter.com/Xuxw28TCty — Ravi Teja (@RaviTeja_offl) January 1, 2023 -
ఆగని ధమాకా జోరు.. కలెక్షన్ల మోత మోగిస్తున్న రవితేజ
మాస్ మహారాజ రవితేజ 2022కి గ్రాండ్‌గా ముగింపు పలికాడు. రామారావు ఆన్ డ్యూటీతో అభిమానులను నిరుత్సాహపరిచినా ధమాకాతో డబుల్ కిక్ ఇచ్చాడు. నక్కిన త్రినాథరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటించింది. ప్రసన్నకుమార్ కథ అందించాడు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 23న విడుదలైంది. రిలీజైన మొదటి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం మరో రికార్డు బద్ధలు కొట్టింది. కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.77 కోట్లు రాబట్టింది. గతవారం తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ వసూళ్లు రాబట్టిన మొదటి చిత్రంగా నిలిచింది. మాస్ మహారాజ దూకుడుకు వీకెండ్ బాగా కలిసిరావడంతో కలెక్షన్ల వర్షం కురిసింది. Most Watched & Most Celebrated Film #Dhamaka 💥🤩#DhamakaBlockBuster Book your 🎫 👇https://t.co/iZ40p9utmY@RaviTeja_offl @sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada@sujithkolli pic.twitter.com/PTlu0nakay — People Media Factory (@peoplemediafcy) December 31, 2022 MassMaharaja @RaviTeja_offl 's MASSive 9️⃣ Days NonStop Rampage 💥#DhamakaBlockBuster in Cinemas Now 🥳🤩#Dhamaka Book your tickets nowhttps://t.co/iZ40p9utmY@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada pic.twitter.com/9XQM56e3iF — People Media Factory (@peoplemediafcy) January 1, 2023 చదవండి: నవీన్ అన్నా, ఉన్నావా? చచ్చావా? నా తప్పుల నుంచి ఎన్నో నేర్చుకున్నా -
పండగ మీద పండగ చేసుకోవాలి
‘‘పండగ చేసుకుని రెండేళ్లయింది. మళ్లీ ఇప్పుడు పండగ (‘ధమాకా’ హిట్‌ని ఉద్దేశిస్తూ...). ఇకపై పండక్కి గ్యాప్ ఇవ్వొద్దు. పండగ మీద పండగ చేసుకోవాలి. మీ స΄ోర్ట్ (అభిమానులు, ప్రేక్షకులు) ఇలానే కొనసాగాలి’’ అని రవితేజ అన్నారు. రవితేజ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ధమాకా’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాలో జరిగిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో రవితేజ మాట్లాడుతూ– ‘‘ధమాకా’ సినిమాకు దర్శకుడు త్రినాథరావు డ్రైవర్ అయితే.. నేను కండక్టర్ని (నవ్వుతూ..). ఈ సినిమా సక్సెస్‌కి కారణమైన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘ధమాకా’ విజయం సమిష్టి కృషి’’ అన్నారు నక్కిన త్రినాథరావు. ‘‘రవితేజగారితో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాం’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. ‘‘ధమాకా’ విజయానికి ప్రధాన కారణం రవితేజ అన్న, ఆయన అభిమానులు’’ అన్నారు ఈ చిత్ర కథా రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ. ఈ కార్యక్రమంలో కె. రాఘవేంద్రరావు, హరీష్ శంకర్, బండ్ల గణేష్, తేజా సజ్జా ΄ాల్గొని ‘ధమాకా’ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. -
అలా చేస్తే ధమాకా ఒక్కరోజే ఆడేది: బండ్ల గణేశ్ కామెంట్స్ వైరల్
మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం ‘ధమాకా. ఈనెల 23న విడుదలైన చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల హీరోయిన్గా నటించింది. తొలి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. రవితేజ ఎనర్జీ, యాక్షన్ ఎలిమెంట్స్.. శ్రీలీల గ్లామర్, డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. తాజాగా ఈ చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన నిర్మాత బండ్ల గణేశ్ రవితేజపై ప్రశంసల వర్షం కురిపించాడు. రవితేజను పొగుడుతూ సక్సెస్ మీట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. టాలీవుడ్లో 12 మంది దర్శకులను పరిచయం చేసిన ఏకైక హీరో రవితేజ అని కొనియాడారు. నిర్మాత బండ్ల గణేశ్ మాట్లాడుతూ.. 'ధమాకా వేడుకకు నేను వస్తానని ముందే ఫోన్ చేసి చెప్పి మరీ వచ్చా. ఇప్పటివరకు ఆస్తమించిన రవిని చూశాం. ఎప్పటికీ అస్తమించని రవితేజ గురించి నేను మాట్లాడుదామని వచ్చా. రవితేజ ఎప్పటికీ వెలుగునిచ్చే సూర్యుడు. నేను రవితేజ ఫ్యాన్ అని చెప్పుకోవాలంటే గర్వం ఉండాలి. 12 మంది దర్శకులను టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఏకైక హీరో రవితేజ. అదృష్టం కలిసొచ్చిన వాళ్లు సూపర్స్టార్లు, మెగాస్టార్లు అవుతారు. పదేళ్లయినా రవితేజ ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. కొంతమంది రవితేజ పని అయిపోయిందనుకుంటారు. ఆయన ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాడు. ఆయన ఒక అరాచకం. రవితేజను చూస్తే నల్లమల అడవుల్లో నిగనిగలాడే నల్లతాచులా ఉన్నాడు. ఫుట్‌బాల్‌లో అర్జెంటీనా ప్లేయర్ మెస్సీ, క్రికెట్లో విరాట్ కోహ్లీలా రవితేజ వన్‌మ్యాన్ షో చూపించాడు. దటీజ్ రవితేజ. ఎప్పుడేం చేయాలో, ఎవరిని ఎప్పుడు పైకి తేవాలో తెలిసిన వ్యక్తి రవితేజ. ధమాకాలో ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆయన అద్భుతంగా కనిపించాడు.' అని ఉద్వేగభరితంగా ప్రసంగింంచారు. -
ధమాకా సక్సెస్ మీట్.. దేవకన్యలా దర్శనమిచ్చిన శ్రీలీల (ఫొటోలు)
-
'ధమాకా' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
రవితేజ కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడా? మాస్ మహారాజ ఆన్సర్ ఇదే
మాస్ మహారాజ రవితేజ ధమాకాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇక చిరంజీవితో వాల్తేరు వీరయ్య మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ టీం పలు ఇంటర్వ్యూలో పాల్గొంటుంది. తాజాగా ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్న రవితేజకు తనయుడు మహాధన్ భూపతి సినీ ఎంట్రీపై ప్రశ్న ఎదురైంది. గత కొన్నిరోజులుగా మహాధన్ త్వరలోనే హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 'ఇడియట్ 2' సీక్వెల్‌తో కొడుకును పరిచయం చేయనున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై రవితేజను ప్రశ్నించగా.. ఇలాంటి వార్తలు వినడం ఇదే మొదటిసారి అని, ప్రస్తుతానికి అలాంటి ప్లాన్స్ ఏమీ లేవని తేల్చిచెప్పాడు. -
బాక్సాఫీస్‌పై ‘ధమాకా’ మోత..రూ.50 కోట్ల మార్క్ దిశగా పరుగులు!
మాస్ మహారాజా ‘ధమాకా’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. శ్రీలీల హీరోయిన్గా నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ 23ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. రవితేజ ఎనర్జీ, యాక్షన్ ఎలిమెంట్స్.. శ్రీలీల గ్లామర్, డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తొలి రోజే రూ.10 కోట్ల గ్రాస్ వసూలు సాధించిన ఈ చిత్రం.. ఐదు రోజుల్లో మొత్తం రూ.49 కోట్ల కలెక్షన్స్ రాబట్టి క్రాక్ తర్వా త మళ్లీ ఆ రేంజ్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇదే ఊపు కొనసాగితే ఈ వారాంతలో వంద కోట్ల గ్రాస్ మార్కును కూడా టచ్ అయ్య చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాల చెబుతున్నాయి. ఈ సినిమాకు మాస్‌తో పాటు క్లాస్ సెంటర్స్‌లోనూ మంచి స్పందన రావడం విశేషం. మాస్ మహారాజా రవి తేజ డబల్ రోల్ పోషించిన ఈ చిత్రానికి నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ-స్క్రీన్‌ప్లే-మాటలు అందించారు. MassMaharaja @RaviTeja_offl 's MASSive 5️⃣ Days BoxOffice Rampage 💥#DhamakaBlockBuster in Cinemas Now 🥳🤩#Dhamaka Book your tickets nowhttps://t.co/iZ40p9utmY@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada pic.twitter.com/7xAKb4X78o — People Media Factory (@peoplemediafcy) December 28, 2022 -
ధమాకా.. మూడు రోజుల కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
Dhamaka Movie Box Office Collection Day 3: మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ధమాకా. పెళ్లిచూపులు బ్యూటీ శ్రీలీల రవితేజతో జోడీ కట్టింది. బాక్సాఫీస్ వద్ద వీరిద్దరి జోడీ కాసుల వర్షం కురిపిస్తోంది. మాస్ యాక్షన్‌కు, తీన్మార్ స్టెప్పులకు ప్రేక్షకులు థియేటర్లలో ఈలలు వేస్తున్నారు. త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేసిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. గత శుక్రవారం (డిసెంబర్ 23న) రిలీజైన ఈ చిత్రం మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. మొదటిరోజే రూ.10 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ మూవీ మూడు రోజుల్లో రూ.32 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. చూస్తుంటే క్రిస్మస్ సెలవులను ధమాకా బాగానే క్యాష్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. MassMaharaja @RaviTeja_offl 's MASSive 3️⃣ Days MASS Rampage 💥#DhamakaBlockBuster in Cinemas Now 🥳🤩#Dhamaka Book your tickets nowhttps://t.co/iZ40p9utmY@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada pic.twitter.com/6sD6Ev5F7O — People Media Factory (@peoplemediafcy) December 26, 2022 చదవండి: సెన్సేషన్‌గా అవతార్ 2, మొత్తం కలెక్షన్స్ ఎంతంటే? -
ధమాకా.. మేం ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్ వస్తోంది : నిర్మాత
‘‘ధమాకా’ కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్. రవితేజ ఎనర్జీని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేస్తూ చేసిన మూవీ ఇది. సినిమాలోని ప్రతి ఎలిమెంట్‌ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. రవితేజ, శ్రీలీల జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ధమాకా’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ – అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పై రూపొందిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘త్రినాథరావు, రచయిత ప్రసన్న కలిసి ‘ధమాకా’ కథ చెప్పారు. ఇది రవితేజగారికి బావుంటుందనుకున్నాం. గ్రాండ్‌గా నిర్మించాం. ‘ధమాకా’కి గ్రాండ్‌గా ఓపెనింగ్స్ వచ్చాయి. బీ, సీ సెంటర్ల నుంచి వచ్చే స్పందనను మేం ఊహించాం. అయితే మల్టీప్లెక్స్ ఆడియన్స్ నుండి మేం ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన వస్తోంది. మా బ్యానర్ నుంచి ఇప్పటికే మూడు ప్రాజెక్ట్స్‌ని ఓటీటీలో విడుదల చేశాం. ప్రస్తుతం నాగశౌర్య – శ్రీనివాస్ అవసరాల ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, గోపీచంద్–శ్రీవాస్ కాంబినేషన్లో ‘రామబాణం’, లావణ్య త్రిపాఠితో ఒక ప్రాజెక్ట్ ఉంది. కొన్ని పెద్ద చిత్రాలు కూడా ఉన్నాయి’’ అన్నారు. -
బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్న ‘ధమాకా’.. ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..
మాస్ మహారాజా హీరోగా నటించిన తాజా చిత్రం ‘ధమాకా’. శ్రీలీల హీరోయిన్గా నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ శుక్రవారం(డిసెంబర్ 23) ప్రేక్షకుల ముందుకు వచ్చి..తొలిరోజే మంచి టాక్ని సంపాదించుకుంది. రవితేజ ఎనర్జీ, యాక్షన్ ఎలిమెంట్స్.. శ్రీలీల గ్లామర్, డ్యాన్స్ ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయి. రొటీన్ కథే అయినప్పటికీ.. రవితేజ నుంచి ఫాన్స్ ఏం ఆశిస్తారో అవన్నీ ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు త్రినాధ రావు నక్కిన. అందుకే ఈ సినిమా తొలి రోజు ఈ సినిమా భారీ కలెక్షన్స్‌ని రాబట్టింది. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.10 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. (చదవండి: ధమాకా మూవీ రివ్యూ) ఈ సినిమా మాస్‌తో పాటు క్లాస్ సెంటర్స్‌లోనూ అనూహ్యంగా బిజినెస్ చేసింది. నైజాంతో సహా చాలా సెంటర్లలో రవితేజకి ధమాకా బిగ్గెస్ట్ డే వన్ గ్రాసర్‌గా నిలిచింది. నైజాంలో రూ.2.10 కోట్లు, సీడెడ్‌లో రూ.72 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.56 లక్షలు, ఈస్ట్ రూ.24 లక్షలు, వెస్ట్ 26 లక్షలు, గుంటూరు రూ.40 లక్షలు, కృష్ణాలో రూ.25 లక్షల చొప్పున వసూలు చేసింది. ఓవర్సీస్లో కూడా ఈ చిత్రానికి మంచి ఓపెన్సింగ్ వచ్చాయి. క్రిస్మస్ సెలవులు ఉండడంతో ఈ వీకెండ్ కలెక్షన్లు భారీగాపెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. MassMaharaja @RaviTeja_offl 's MASSive Box Office Rampage 💥#DhamakaBlockBuster in Cinemas Now 🥳🤩#Dhamaka Book your tickets nowhttps://t.co/iZ40p9utmY#DhamakaFromDec23@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada pic.twitter.com/pr8bQO2z2R — People Media Factory (@peoplemediafcy) December 24, 2022 -
" ధమాకా " మూవీ పబ్లిక్ టాక్
-
Dhamaka Review: ‘ధమాకా’ మూవీ రివ్యూ
టైటిల్: ధమాకా నటీనటులు: రవితేజ, శ్రీలీల, జయరాం, సచిన్ ఖేడ్కర్, తణికెళ్ల భరణి, రావు రమేశ్ తదితరులు నిర్మాణ సంస్థలు: పుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాత: టీజీ ప్రసాద్ దర్శకత్వం : త్రినాథరావు నక్కిన కథ, మాటలు, స్క్రీన్‌ప్లే: ప్రసన్న కుమార్ బెజవాడ సంగీతం: భీమ్స్ సెసిరోలియో సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని ఎడిటర్: ప్రవీణ్ పూడి విడుదల తేది: డిసెంబర్ 23, 2022 కథేంటంటే.. కథేంటంటే.. స్వామి(రవితేజ) ఓ మిడిల్ క్లాస్ యువకుడు. చెల్లి పెళ్లి చేయాలనే బాధ్యతతో ఉద్యోగం చేస్తుంటాడు. ఓ కారణం చేత అతని ఉద్యోగం పోతుంది. వేరే ఉద్యోగం కోసం వెతుకున్న సమయంలో అతని చెల్లి స్నేహితురాలు ప్రణవి(శ్రీలీల)తో ప్రేమలో పడతాడు. మరో వైపు పీపుల్స్ మార్ట్ కంపెనీ అధినేత చక్రవర్తి(సచిన్ ఖేడ్కర్) తన కొడుకు ఆనంద్ చక్రవర్తి(రవితేజ)ని తన కంపెనీకి ఈసీవోగా చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే ఆనంద్ మాత్రం అందుకు ఒప్పుకోడు. ఇదే క్రమంలో పీపుల్స్ మార్ట్ కంపెనీపై జేపీ(జయరాం) కన్నుపడుతుంది. దేశంలో నెంబర్ వన్‌గా కొనసాగే కంపెనీలను బలవంతంగా తన వశం చేసుకునే జేపీ.. పీపుల్స్ మార్ట్ కంపెనీని కూడా చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. మరి జేపీని ఆనంద్ చక్రవర్తి ఎలా అడ్డుకున్నాడు? మిడిల్ క్లాస్‌కు చెందిన స్వామికి వ్యాపారవేత్త ఆనంద్‌కు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఇంతకీ ప్రణవి ఇష్టపడింది స్వామినా లేదా ఆనంద్ చక్రవర్తినా? జేపీ కాకుండా పీపుల్స్ మార్ట్ దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్న మరో వ్యక్తి ఎవరు? పీపుల్స్ మార్ట్ కంపెనీతో స్వామికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఆ కంపెనీకి ఎవరు సీఈఓగా నియమితులయ్యారనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. మాస్ అనే పదానికి పర్యాయపదంలా కనిపిస్తాడు రవితేజ. ఆయన ఎనర్జీ, కామెడీ టైమింగ్ అంటే అందరికి చాలా ఇష్టం. అయితే ఈ మధ్య కాలంలో రవితేజ సినిమాలలో ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది. సీరియస్ సబ్జెక్ట్‌నే ఎక్కువగా టచ్ చేస్తున్నాడు. పాత రవితేజ మిస్ అవుతున్నామనే భావన అభిమానులతో పాటు సీనీ ప్రేమికుల్లోనూ ఉంది. ‘ధమాకా’తో రవితేజ ఆ లోటుని తీర్చాడు. తెరపై ఒకప్పటి రవితేజను చూస్తారు. కథ మాత్రం రొటీన్‌గా ఉంటుంది. పాత కథనే అటు ఇటుగా మార్చి దానికి కొత్త ట్రీట్మెంట్ ఇచ్చి స్క్రీన్‌ప్లేతో మాయ చేయడం ప్రసన్న కుమార్‌కు అలావాటు. ‘ధమాకా’ చిత్రంలోనూ ప్రసన్న కుమార్ అదే ఫాలో అయ్యాడు. రొటీన్ కథే అయినప్పటికీ.. కామెడీ, యాక్షన్, ఎమోషన్ ఇవన్నీ సమ పాళ్లలో ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు త్రినాథరావు. రవితేజ నుంచి అభిమానులు ఏం ఆశిస్తారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. సినిమా మొత్తం రవితేజ వన్ మ్యాన్ షోగా సాగుతుంది. శ్రీలీల గ్లామర్, డ్యాన్సులు ఈ సినిమాకు చాలా ప్లస్. ఓ ఫైట్.. కామెడీ సీన్లతో ఫస్టాఫ్ అంతా జాలీగా సాగుతుంది. కథతో కొత్తదనం లేకున్నా.. కామెడీ, పాటలు ప్రేక్షకులను బోర్ కొట్టించకుండా చూస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. ఒక సెకండాఫ్‌లో కథ రొటీన్‌గా సాగుతుంది. సాగదీత సీన్స్ ఇబ్బంది కలిగిస్తాయి. అయితే మధ్యలో వచ్చే ఓ ఫోక్ సాంగ్ అలరిస్తుంది. లాజిక్స్‌ని వెతక్కుండా మాస్ సినిమాను ఎంజాయ్ చేసే వాళ్లకు ఈ సినిమా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. రవితేజ సినిమాలలో కథ మొత్తం అతని చుట్టే తిరుగుతుంటుంది. ఇక ఈ సినిమాలో కూడా ఆయన వన్ మ్యాన్ షో నడిచింది. డ్యూయల్ రోల్లో ఆయన రెచ్చిపోయి నటించాడు. వ్యాపారవేత్త ఆనంద్ చక్రవర్తిగా, మిడిల్ క్లాస్ యువకుడు స్వామిగా రెండు రెండు విభిన్న పాత్రలో కనిపించిన రవితేజ.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. స్టైల్, యాక్షన్ తో మాస్ ఆడియన్స్‌ను అలరించటంలో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ప్రణవిగా శ్రీలీల తనదైన నటనతో ఆకట్టుకుంది. ఎక్స్ప్రెషన్స్, డాన్య్ విషయంలో రవితేజతో పోటీ పడి నటించింది. రావు రమేశ్, హైపర్ ఆదిల మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగా పండాయి. పీపుల్స్ మార్ట్ కంపెనీ అధినేత చక్రవర్తిగా సచిన్ ఖేడ్కర్, జేపీగా జయరాం తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ తరహా క్యారెక్టర్స్‌లో నటించడం వారికి కొత్తేమి కాదు. తనికెళ్ల భరణి, అలీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం భీమ్స్ సెసిరోలియో సంగీతం. అదిరిపోయే పాటలు.. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. ‘జింతాక్’ పాట థియేటర్స్‌లో ఈళలు వేయిస్తుంది. ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్, స్క్రీన్‌ప్లే బాగుంది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. -
‘ధమాకా’ ట్విటర్ రివ్యూ
మాస్ మహారాజా రవి తేజ డబల్ రోల్ పోషించిన తాజా చిత్రం ధమాకా. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు(డిసెంబర్ 23)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘ధమాకా’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. First half chala.. intresting ga undi mana Vintage Ravi Anna ni malla Chudabotunamu.. Interval Scenes are also Good #Dhamaka@RaviTeja_offl @sreeleela14 @peoplemediafcy @TrinadharaoNak1 @VishwaPrasadtg @vivekkuchibotla — praveen kumar (@emmadipraveenk1) December 23, 2022 ఫస్టాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వింటేజ్ రవితేజను మరోసారి చూడబోతున్నాం. ఇంటర్వెల్ సీన్ కూడా బాగుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘పక్కా మాస్ కామెడీ ఎంటర్టైనర్. మంచి సినిమా. రవితేజ యాక్టింగ్ బాగుంది’అని ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. Pakka mass comedy entertainer Manchi cinema @RaviTeja_offl Anna ❤️🔥 Acting good #Dhamaka — Parveesh (@Parvesh7781) December 23, 2022 #Dhamaka 1st half: Story and screenplay is Flat but engages with comedy,songs,Few Hilarious moments and Interval🔥 Good 1st half @RaviTeja_offl energy levels🔥🔥#DhamakaReview #DhamakaDay — tolly_wood_UK_Europe (@tollywood_UK_EU) December 23, 2022 #Dhamaka 2nd half: same old flat screenplay With majority comedy scenes, Good songs and Action parts, climax is good👍🏻 Small surprise for Fans🔥 Good 2nd half Overall: A @TrinadharaoNak1 Commercial movie👍🏻#DhamakaReview #DhamakaFromDec23 #Dhamakafromtoday — tolly_wood_UK_Europe (@tollywood_UK_EU) December 23, 2022 first half is super , last 20 minutes Adirpoyindhi 💥💥 @RaviTeja_offl @sreeleela14 @peoplemediafcy @TrinadharaoNak1 @vivekkuchibotla #Dhamaka — ALLU VIJAY (@Bunnyvijju32) December 23, 2022 ధమాకా ఓవరాల్‌గా రొటీన్ , అవుట్‌డేటెడ్ మూవీ. సినిమాలో కొన్ని వినోదాత్మక సన్నివేశాలు అలరిస్తాయి. సంగీతం బాగుంది. కానీ మిగిలినవి చాలా ఫ్లాట్‌గా పడిపోతాయి . పదేళ్లకు పైగా నాటి సినిమాని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #Dhamaka Overall a Routine and Outdated Movie that does not entertain for the most part! The movie had a few entertaining scenes and music is decent but the rest falls very flat and gets irritating. It feels like we are watching a movie more than a decade old. Rating: 2.25/5 — Venky Reviews (@venkyreviews) December 23, 2022 Raviteja Anna Kii Hit Padithee ILLA untadaaa 😮❤️🔥🤩 Twitter Motham @RaviTeja_offl Anna Unaduu...#DhamakaDay #Dhamaka #BlockBusterDhamaka Kotesam Rtfs Navokodiii..🔥💯 — Blockbuster Dhamaka...💥 (@CherukuriRaju3) December 23, 2022 Director @TrinadharaoNak1 chala gap tisukoni oka manchi story icharu Ravi anna ni 🔥#Dhamaka — yAshwAnth™ 2.0 (@chittibabu1111) December 23, 2022 -
అందుకే ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్సులు ఇస్తాను : రవితేజ
‘‘కొంతమంది లైఫ్‌లో బోర్ కొడుతుందని అంటుంటారు. కానీ ‘బోర్’ అనే వర్డ్ నా డిక్షనరీలోనే లేదు. షూటింగ్ అంటే నాకు పండగ. జీవితంలోని ప్రతి మూమెంట్‌ని ఎంజాయ్ చేస్తాను. డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, నెగిటివిటీ వల్ల మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. త్వరగా ముసలివాళ్లం కూడా అయిపోతున్నాం. అందుకే వాటి తాలూకు ఆలోచనలను మనసుల్లో నుంచి తీసేస్తే హ్యాపీగా ఉంటాం’’అని హీరో రవితేజ అన్నారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన చిత్రం ‘ధమాకా’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో రవితేజ చెప్పిన విశేషాలు. ► ‘ధమాకా’ గురించి క్లుప్తంగా... ‘రాజా ది గ్రేట్’ తర్వాత నేను చేసిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ మూవీ ఇది. నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్. ► చిరంజీవి ‘రౌడీ అల్లుడు’ సినిమాతో కొందరు ‘ధమాకా’కు పోలిక పెడుతున్నారు... మా రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ ఈ మాట అన్నారు. తెలుగులో మంచి ఎంటర్టైనింగ్ చిత్రాలు చిరంజీవిగారితోనే మొదలయ్యాయి. మేం ఫాలో అవుతున్నాం. ‘ధమాకా’ కూడా ‘రౌడీ అల్లుడు’లాంటి ఎంటర్టైనింగ్ ఫిల్మే. ► త్రినాథరావుతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్... త్రినాథరావుతో పని చేయడం సరదాగా ఉంటుంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఎక్కువగా మాట్లాడడు కానీ ఈ సినిమాకు అతని మ్యూజిక్ సౌండ్ అదిరిపోయింది. బెజవాడ ప్రసన్నకుమార్ డైలాగ్స్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు. అదే విధంగా నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ పాజిటివ్ పీపుల్. ఇలాంటి వారికి సక్సెస్ వస్తే మరింత మందికి ఉపాధి దొరుకుతుంది. ► రీసెంట్గా జరిగిన మీ ఫ్యాన్స్ మీట్ విశేషాలు.. అభిమానులను కలవడం అనేది నాకే కాదు..అందరి హీరోలకూ జరుగుతుంటుంది. ఆ మూమెంట్స్‌ను బాగా ఎంజాయ్ చేశాను. ఈ పాజిటివ్నెస్ ముందుకు నడిపిస్తుంటుంది. ► రవితేజ అంటే ఎంటర్టైన్మెంట్. కానీ ఇటీవల సీరియస్ సినిమాలు కూడా చేశారు కదా.. యాక్టర్‌గా డిఫరెంట్ జానర్ సినిమాలను ప్రయత్నించాలి. ఫలితం ఎలా ఉన్నా ప్రయత్నాలను ఆపకూడదు. ► ఇటీవల కొత్త రచయితలు, దర్శకులతో ఎక్కువ సినిమాలు చేస్తున్నట్లున్నారు... ఎప్పట్నుంచో కొత్త రచయితలు, దర్శకులతో చేస్తున్నాను. వారితో పని చేయడం ఇష్టం. ఎందుకంటే కొత్తవారిలో నిరూపించుకోవాలనే కసి, తపన, ఉత్సుకత ఉంటాయి. ఒకప్పుడు నేనూ కొత్తవాడిలా వచ్చినవాడినే. అలాగే ఒకసారి కథ లాకయ్యాక నా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఓన్లీ ఇంప్రొవైజేషన్సే. ► కరోనా తర్వాత సినిమాల పట్ల ప్రేక్షకుల ధోరణి మారిపోయినట్లు అనిపిస్తోంది... కొంత ప్రభావం అయితే ఉండొచ్చు. కానీ పూర్తిగా కాదు. కరోనా తర్వాత సోషల్ డ్రామా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికిప్పుడు కొత్త కథలేం పుట్టవు. కానీ కథను ఎంత కొత్తగా చూపిస్తున్నామనే దాన్నిబట్టే సినిమాలు ఆడతాయి. నా ప్రతి సిని మాను నేను ఒకేలా ట్రీట్ చేస్తాను. అయితే ఒకసారి ఆడియన్స్ కనెక్ట్ అయితే, మరోసారి కనెక్ట్ కారు. ► ఫ్లాప్ ఇచ్చిన దర్శకులనూ ప్రోత్సహిస్తున్నారు... ఓ మనిషి టాలెంట్ ఒక ఫ్లాప్‌ను బట్టి తగ్గిపోయి, ఓ హిట్‌ని బట్టి పెరిగిపోయి.. ఆ లెక్క కరెక్ట్ కాదు. నా లెక్క కూడా ఇది కాదు. ఓ దర్శకుడు ఓసారి అనుకున్నది క్లిక్ అవుతుంది మరోసారి కాదు. సినిమా సక్సెస్ అవ్వలేదు కదా అని దర్శకుడి సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. హిట్స్ ఉన్నట్లే ఫ్లాప్‌లూ ఉంటాయి. ఇది ప్రతి డిపార్ట్మెంట్కు వర్తిస్తుంది. ► కథల ఎంపికలో మీ ధోరణి ఎలా ఉంటుంది? ఇదివరకు చాలా స్పీడ్‌గా ఉండేవాడిని. ఇప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటున్నాను. కథ నచ్చకపోతే సినిమా చేయను. డైరెక్టర్ కోసం, కాంబినేషన్ కోసం నేను సినిమాలు చేయను. ► పెరిగిపోతున్న ఓటీటీ కల్చర్ గురించి... ఓటీటీ కంటెంట్ వేరు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే కంటెంట్ వేరు. ఓటీటీలో సూపర్ కంటెంట్, పెర్ఫార్మెన్సెస్ను చూశాను. కానీ నేను దానికి ప్రభావితం కాలేదు. అక్కడ ఆల్రెడీ ఉన్నది ఇక్కడ చేయను. ► హీరోగా మీ అబ్బాయి లాంచ్ ఎప్పుడు? మా అబ్బాయి చదువుకుంటున్నాడు. ప్రస్తుతం ఆలోచన లేదు. ఇంకా చాలా టైమ్ ఉంది. ► చాలా గ్యాప్ తర్వాత చిరంజీవితో కలిసి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నటించారు... చిరంజీవిగారంటే నాకు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ కథ, నా పాత్ర నచ్చాయి. ఈ సినిమా చేయడానికి దర్శకుడు బాబీ కూడా ఓ కారణం కావొచ్చు. ఇక చిరంజీవిగారితో సినిమా చేయడం కచ్చితంగా మంచి ఎక్స్‌పీరియన్సే. ► పాన్ ఇండియా గురించి ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.. మీ అభిప్రాయం.. ప్రతి సినిమా పాన్ ఇండియా అవ్వదు. కథ కుదరాలి. నేను పాన్ ఇండియా ఫిల్మ్‌గా ‘టైగర్ నాగేశ్వరరావు’ చేస్తున్నాను. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది కాబట్టి అన్ని రకాల ఆడియన్స్‌కు ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను. ► మెడిటేషన్‌లాంటివి చేస్తుంటారా? నేనెప్పుడూ మెడిటేషన్ లోనే ఉంటాను. నాకు సినిమాలు తప్ప ఏమీ తెలియదు. దేన్నీ సీరియస్‌గా తీసుకోను. జీవితంలో రిగ్రెట్స్ లేవు. స్టార్ అనే ప్రెజర్‌ను తీసుకోను. భవిష్యత్ గురించి ప్లాన్ చేయను. ఓ ఫ్లోలో వెళ్లిపోతుంటాను. ► మీ తర్వాతి చిత్రాలు... ‘రావణాసుర’ షూటింగ్ 80 శాతం పూర్తయింది. ‘ఈగిల్’ సినిమా గురించి ఇప్పుడేం చెప్పలేను. -
హీరోయిన్ శ్రీలీల గ్లామర్ ఫోటోలు
-
ధమాకా వివాదం: క్షమాపణలు కోరిన డైరెక్టర్ త్రినాథ్ నక్కిన
‘ధమకా’ మూవీ వివాదంపై తాజాగా డైరెక్టర్ త్రినాథ్ రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఉప్పర కులస్థులను క్షమాపణలు కోరారు. ఈ మేరకు గురువారం(డిసెంబర్ 22) జరిగిన ధమాకా మూవీ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఇటీవల జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్లో నేను ఉప్పర అనే పదం వాడాను. అది తెలిసి చేయలేదు. తెలియక జరిగిన తప్పుకు ఉప్పర సోదరులకు నన్ను క్షమించాలి. రవితేజ అభిమానుల్లో ఉప్పర సోదరుడు కూడా భాగమే. ఇక నుంచి ఉప్పార అనే పదాన్ని నా సినిమాల్లో వాడను. నాపై కోపాన్ని సినిమాపై చూపించకండి. నేను బీసీనే. ఉప్పర సోదరులు కూడా బీసీలో భాగమే. సినిమా ప్రేక్షకుల్లో మీరు కూడా భాగమే. ఇకపై ఉప్పర పదాన్ని రాజకీయ నాయకుల, సినీ నటులు, ఇతరులు కూడా బహిష్కరించాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు త్రినాథ్ రావు ‘నీ ఉప్పర లొల్లి’ ఏంటి అని వ్యాఖ్యానించారు. దీంతో తమని ధమాకా డైరెక్టర్ తమని అవమానించారంటూ ఉప్పర కులస్తుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే డైరెక్టర్ త్రినాథ్ తమకు వెంటనే క్షమాపణాలు చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సగర ఉప్పర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ ఆధ్వర్యంలో కులస్తులు బుధవారం ఫిలించాంబర్ వద్ద ఆందోళన చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ చాంబర్ వద్ద బైఠాయించారు. ఆయన దిష్టి బొమ్మ తగలబెట్టి ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. -
ధమాకా సినిమాకు ధమ్కీ.. దర్శకుడు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): ఉప్పర కులస్తులను ధమాకా సినిమా దర్శకుడు త్రినాథరావు ప్రీ రలీజ్ ఈవెంట్లో అవమానించారని వెంటనే తమ కులస్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సగర ఉప్పర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ ఆధ్వర్యంలో కులస్తులు బుధవారం ఫిలించాంబర్ వద్ద ఆందోళన చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ చాంబర్ వద్ద బైఠాయించారు. దర్శకుడు త్రినాథ్‌రావు దిష్టిబొమ్మ దహనం చేస్తున్న సగర ఉప్పర సంఘం ప్రతినిధులు ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు త్రినాథ్ రావు ‘నీ ఉప్పర లొల్లి’ ఏంటి అంటూ హేళన చేశారని ఆరోపించారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. సంఘం గ్రేటర్ అధ్యక్షుడు మోడల రవి సాగర్, కోశాధికారి రామస్వామి, ఫిలింనగర్ అధ్యక్షుడు మధుసాగర్, ప్రధాన కార్యదర్శి నాగేష్ సాగర్, డి.రాంచందర్, చెన్నయ్య, సీతారాములు, వెంకటస్వామి, మూసాపేట్ సగర సంఘం అధ్యక్షుడు లోకేష్ సాగర్, రామకృష్ణ సాగర్, అంజయ్య నగర్ అధ్యక్షుడు ఆంజనేయులు సాగర్, బి.శేఖర్ పాల్గొన్నారు. -
రవితేజతో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడ్డా: శ్రీలీల
‘రెండో సినిమానే రవితేజ లాంటి స్టార్ హీరోతో నటించే అవకాశం రావడంతో మొదట్లో టెన్షన్ పడ్డా. రవితేజతో మాట్లాడడానికి ఇబ్బంది పడేదాన్ని. కానీ ఆయన నన్ను చాలా మోటివేట్ చేశారు.సెట్లో చాలా సపోర్ట్ చేశారు. ఆయనతో పని చేయడంలో ఒక కంఫర్ట్ ఉంటుంది’అని అన్నారు శ్రీలీల. మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘ధమాకా’. కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ మూవ ఈ డిసెంబర్ 23న విడుదలతుంది. ఈ సందర్భంగా శ్రీలీల మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు.. ► దర్శకుడు త్రినాథరావు నక్కిన గారు తన గత చిత్రం 'హలో గురు ప్రేమకోసమే' చిత్రంలో ఓ పాత్ర కోసం నన్ను సంప్రదించారు. అప్పుడే రచయిత ప్రసన్న కూడా పరిచయమయ్యారు. కానీ కొన్ని కారణాల వలన అది కుదరలేదు. పెళ్లి సందడి విడుదల కాకముందే 'ధమాకా' కథ చెప్పారు. కథ చెప్పిన పది నిమిషాలకే ప్రాజెక్ట్ చేస్తానని చెప్పాను. ఈ చిత్రం మంచి ఎంటర్ టైనర్. చాలా హిలేరియస్ గా ఉంటుంది. నాకు ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు చాలా ఇష్టం. ► తక్కువ సమయంలోనే రవితేజ గారితో పని చేసే అవకాశం రావడం చాలా లక్కీగా ఉంది. రవితేజ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. కిక్, విక్రమార్కుడు సినిమాలు ఎన్ని సార్లు చూశానో లెక్కలేదు. ఆయన్ని మొదటిసారి సెట్ లో చూసినప్పుడు ఒక సర్ ప్రైజ్ ఫీలింగ్. పాత్రలో వేరియేషన్స్ ని చాలా ఈజీగా చూపించగలరు. ఇంత ఈజీగా ఎలా చేయగలుగుతున్నారని ఆయన్ని అడుగుతుంటాను. 'విక్రమార్కుడు' డ్యుయల్ రోల్ ఎంత అవుట్ స్టాండింగా చేశారో.. ధమాకాలో అంతే అద్భుతంగా చేశారు. ► దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన గత చిత్రాలన్ని చూశా. ‘నేను లోకల్’ పాటలు బెంగళూర్ లో ఉనప్పుడు తెగ వినేదాన్ని. అందులో కీర్తి సురేష్ గారి పాత్ర నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆయనతో వర్క్ చేయడం చాలా అనందంగా ఉంది. ఆయన చాలా పాజిటివ్ పర్సన్. ► ఈ చిత్రంలో ప్రణవి అనే పాత్రలో కనిపిస్తా. డబల్ రోల్ తో ట్రావెల్ అయినప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇద్దరూ ఇష్టం అంటే.. ముగింపు ఎలా ఉంటుందనేది ఇందులో ట్విస్ట్ ఫ్యాక్టర్. ► ధమాకా టీమ్‌తో నాకు చాలా స్వీట్ మెమోరీస్ ఉన్నాయి. స్పెయిన్ లో జింతాక్ పాట షూట్ చేసినప్పుడు నా కాస్ట్యుమ్ బ్యాగ్ పోయింది. చాలా టెన్షన్ పడ్డాను. ఐతే మేము ఉండే లొకేషన్ నుంచి మూడు గంటలు ప్రయాణించి మా డీవోపీ, డైరెక్టర్ వేరేవేరే ప్రదేశాలకు వెళ్లి అక్కడ నా కోసం షాపింగ్ చేసి అక్కడ నుంచి ఫోటోలు పెట్టి ఓకే చేశారు. మా ఫ్యామిలీ మెంబర్స్ నా కోసం షాపింగ్ చేస్తున్నట్లు అనిపించింది. అదొక మంచి క్యూట్ మూమెంట్. ► పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు చాలా ఆప్యాయంగా చూసుకున్నారు. కొన్ని సందర్భాల్లో మోరల్ సపోర్ట్ ఇచ్చారు. 'మన అమ్మాయి' అనే వైబ్ ఇచ్చారు. వారి నిర్మాణంలో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ధమాకా విడుదల కోసం చాలా ఎక్సయిటెడ్ గా ఎదురుచూస్తున్నాను. అదే సమయంలో లోపల చిన్న నెర్వస్ నెస్ కూడా ఉంది(నవ్వుతూ) ► నేను బేసిగ్గా స్విచాన్ స్విచాప్ పర్సన్ ని. యాక్టర్ అన్నప్పుడు అందరి దృష్టి నాపై ఉంటుంది. మెడిసిన్ చదువు విషయానికి వస్తే .. అక్కడ మనల్ని మనలానే వదిలేస్తారు. ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేసుకోవడం ఇష్టం. షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో చదువుకుంటాను. ► కొత్త సినిమాల విషయానికొస్తే.. బాలకృష్ణ గారు, అనిల్ రావిపూడి సినిమా ఇటివలే షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అలాగే బోయపాటి-రామ్ గారి సినిమా కూడా చేస్తున్నాను. వైష్ణవ్ తేజ్‌తో చేస్తున్న సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అలాగే వారాహి ప్రొడక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాను. నితిన్ గారితో ఒక సినిమా చేస్తున్నాను. ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి. త్వరలోనే ఆయా నిర్మాణ సంస్థలు వెల్లడిస్తాయి. -
రవితేజతో వర్క్ చేయడంపై శ్రీలీల ఏమన్నదంటే..?
-
హైదరాబాద్‌లో ధమాకా హీరోయిన్ శ్రీలీల సందడి
హైదరాబాద్‌లో సినీ నటి పెళ్లి సందడి ఫేమ్, ధమాకా హీరోయిన్ శ్రీలీల సందడి చేశారు. గచ్చిబౌలి ఖానాపూర్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన వజ్రా గ్రూప్స్ రిసార్ట్స్ పూజా కార్యక్రమంలో నటి పాల్గొన్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లేస్ ఎంతగానో అనుగుణంగా రూపోందించారని శ్రీలీల అన్నారు. ఈ నెల 25న రిలీజ్ అయ్యే ధమాకా కచ్చితంగా రికార్డు సృష్టిస్తుందని అన్నారు. ఈ రిసార్ట్స్ అతి పెద్ద లాన్, ఎసీ హాల్, పూల్ సైడ్ మినిలాన్, రిసార్ట్స్ విత్ 50 రూమ్స్ అందుబాటులో ఉంటాయని ఆహ్వానం ఎండీ అరుణ్ కుమార్ తెలిపారు. ఇప్పటి వజ్ర ఇవెంట్స్ మూవీ ఇండస్ట్రీస్‌లో సక్సెస్‌తో పాటు ఇప్పుడు హాస్పిటాలిటీ రంగంలో కూడా రాణిస్తూ ఆహ్వానం రిసార్ట్స్ ప్రారంభించామని ఎండీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సినీనటీ శ్రీలీలతో పాటు ఎండీ అరుణ్ కుమార్, కౌన్సిలర్ అమరేందర్ రెడ్డి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
ఈ వారం థియేటర్లు, ఓటీటీలో సందడి చేసే సినిమాలివే..!
క్రిస్మస్ సందర్భంగా ఈవారం థియేటర్లకు కొత్త సినిమాలు క్యూ కట్టాయి. సినీ ప్రేక్షకులకు విందు పంచేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే జేమ్స్ కామెరూన్ 'అవతార్-2' థియేటర్లలో అలరిస్తోంది. ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీలో విడుదలకు సిద్ధమైన చిత్రాలపై ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: రవితేజ 'ధమాకా' ట్రైలర్ అవుట్.. మాస్ యాక్షన్ అదిరిపోయింది) రవితేజ 'ధమాకా': మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'ధమాకా'. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రినాథ రావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 23న థియేటర్లలో సందడి చేయనుంది. 18 పేజెస్ లవ్ స్టోరీ: నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజెస్. ‘జీఏ 2’ పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ కథ అందించారు. ఆయన శిష్యుడు, ‘కుమారి 21ఎఫ్’ డైరెక్టర్ సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల 23న ప్రేక్షకులను అలరించనుంది. 'లాఠీ'తో వస్తున్న విశాల్: విశాల్ తాజా చిత్రం 'లాఠీ'. సునయన కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ప్రభు ముఖ్య పాత్ర పోషించారు. ఆర్. వినోద్ కుమార్‌ను దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నటులు నందా, రమణ కలిసి రాణా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఈ భారీ చిత్రానికి సుబ్రమణ్యం చాయాగ్రహణం, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో రూపొందింది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 22వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. నయన్‌తో కనెక్ట్: లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన మరో లేటెస్ట్ హార్రర్ చిత్రం 'కనెక్ట్'. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయన్ స్వయంగా నిర్మించింది. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. డిసెంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది. ‘సర్కస్’ రణ్వీర్ సింగ్, పూజాహెగ్డే, జాక్వెలైన్ ఫెర్నాండెజ్, వరుణ్ శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం సర్కస్. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్, బాద్షా, లీజో జార్జ్ సంగీతమందించారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈనెల 23 విడుదల కానుంది. ఓటీటీకీ రెడీ అయిన చిత్రాలు ♦ ఆహా ►'మసూద'- డిసెంబర్ 21 ♦ నెట్‌ఫ్లిక్స్ ► జయ జయ జయ జయహే-డిసెంబర్ 22 ♦ వెబ్‌సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్ ఎమిలి ఇన్ పారిస్ - డిసెంబరు 21 ఎలైస్ ఇన్ బోర్డర్ ల్యాండ్ - డిసెంబరు 22 గ్లాస్ ఆనియన్: నైవ్స్ అవుట్ మిస్టరీ - డిసెంబరు 23 ద ఫాబ్యూలస్ - డిసెంబరు 23 ద టీచర్ - డిసెంబరు 23 అమెజాన్ ప్రైమ్ టామ్ క్లాన్సీస్ జాక్ ర్యాన్- డిసెంబరు 21 జీ5 షడ్యంత్ర -డిసెంబరు 18 పిచర్స్ -డిసెంబరు 23 డిస్నీ+హాట్‌స్టార్ బిగ్బెట్ - డిసెంబరు 21 సోనీ లివ్ కాఠ్మాండు కనెక్షన్ - డిసెంబరు 23 తారా వర్సెస్ బిలాల్- డిసెంబరు 23 -
ఆ ఫుడ్ వల్లే ఎనర్జిటిక్ గా ఉన్నాను : హీరోయిన్ శ్రీలీల
-
రవితేజ ‘ధమాకా’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
'ధమాకా' ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
రవితేజ పెద్ద మాస్ హీరో అవుతాడని అప్పుడే ఊహించాను: రాఘవేంద్రరావు
‘‘నేను దర్శకత్వం వహించిన ‘అల్లరి ప్రియుడు’ చిత్రంలోని ఆర్కెస్ట్రా గ్రూపులో రవితేజ ఒకడు. ఆ టీమ్‌లో రవితేజ డ్రమ్స్ వాయించాడు. తను భవిష్యత్‌లో పెద్ద మాస్ హీరో అవుతాడని అప్పుడే ఊహించాను. ఇక ‘పెళ్ళి సందడి’(2021) సినిమాలో ఫ్లూటు వాయించి ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించారు శ్రీలీల. వీరిద్దరితో ‘ధమాకా’కి కనకవర్షం కురవాలి’’ అని డైరెక్టర్ కె.రాఘవేంద్ర రావు అన్నారు. రవితేజ, శ్రీలీల జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ధమాకా’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘ధమాకా’ సినిమా పెద్ద హిట్ కావాలి. త్వరలో రవితేజ కొడుకు కూడా హీరో కాబోతున్నాడు’’ అన్నారు. రవితేజ మాట్లాడుతూ– ‘‘ధమాకా’ విజయంపై టీమ్ అంతా పూర్తి నమ్మకంతో ఉన్నాం. త్రినాథరావు, రైటర్ ప్రసన్న, శ్రీలీల, భీమ్స్ నెక్ట్స్ లెవల్‌కి వెళతారు. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల మంచి పాజిటివ్ నిర్మాతలు. ఏ విషయంలోనూ రాజీపడని నిర్మాత అభిషేక్ అగర్వాల్’’ అన్నారు. ‘‘నేనూ రవితేజగారి అభిమానినే. ‘ధమాకా’ సక్సెస్ అవుతుంది’’ అన్నారు త్రినాథరావు నక్కిన. ‘‘సినిమా ఇండస్ట్రీలో స్టార్ అవ్వడానికి ఉన్న ప్రతి మెట్టు ఎక్కి వచ్చిన హీరో ఒక్క రవితేజగారే’’ అన్నారు రైటర్ ప్రసన్న కుమార్. ‘‘భీమ్స్ అవుట్‌డేట్ అయిపోయాడని చాలామంది అనుకున్నారు. ‘ధమాకా’ తో నన్ను మళ్లీ నిలబెట్టిన రవితేజగారికి థ్యాంక్స్’’ అన్నారు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో. ‘‘ధమాకా’ పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభొట్ల. ‘‘ధమాకా’కు ప్రేక్షకులు అద్భుత విజయం చేకూర్చాలి’’ అన్నారు శ్రీలీల. ఈ వేడుకలో డైరెక్టర్స్ నందినీ రెడ్డి, బీవీఎస్ రవి, మారుతి, శ్రీవాస్, సుధీర్ వర్మ, కృష్ణచైతన్య, వంశీ, వై.విజయ్, విజయ్ కనకమేడల, దర్శక–నటులు శ్రీనివాస్ అవసరాల, సముద్రఖని, నిర్మాత అభిషేక్ అగర్వాల్, ఫైట్‌మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
ధమాకా హీరోయిన్ శ్రీలీలతో " స్పెషల్ చిట్ చాట్ "
-
పాత రవితేజగారిని చూస్తారు
‘‘రవితేజగారు ఎనర్జిటిక్ హీరో. నా దర్శకత్వంలో వచ్చిన ‘నేను లోకల్’, ‘సినిమా చూపిస్త మావ’, ‘హలో గురు ప్రేమకోసమే’, ‘మేం వయసుకు వచ్చాం’ సినిమాలూ ఎనర్జిటిక్‌గా ఉంటాయి. రవితేజగారి ఎనర్జీ, నా సినిమాల్లో ఉండే ఎనర్జీ... ఈ రెండూ కలిస్తే ఎలా ఉంటుందనే క్యూరీయాసిటీ ప్రేక్షకుల్లో వచ్చింది. ఈ సినిమాకు ‘డబుల్ ఇంపాక్ట్’ అనే క్యాప్షన్ పెట్టడానికి ఓ కారణం ఇదే’’ అన్నారు దర్శకుడు త్రినాథరావు నక్కిన. రవితేజ ద్విపాత్రాభినయం చేసిన తాజా సినిమా ‘ధమాకా: డబుల్ ఇంపాక్ట్’. ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటించారు. బెజవాడ ప్రసన్నకుమార్ కథ అందించిన ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ– ‘‘నాకు ఇష్టమైన హీరోల్లో ఒకరైన రవితేజగారితో సినిమా చేయాలనే కల ‘ధమాకా’తో నేరవేరింది. ఆయనతో సినిమా చేసే చాన్స్ రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. రవితేజగారితో సినిమా అంటే ప్రయోగాలు చేయాలనుకోను. ఈ విషయమే రవితేజగారికీ చెప్పాను. పాత రవితేజను ప్రేక్షకులు ఎక్కడో మిస్ అయ్యారు. మళ్లీ ఆ రవితేజను ఈ సినిమాలో చూస్తారు. ఇందులో స్వామిగా, ఆనంద్ చక్రవర్తిగా ఆయన రెండు పాత్రలు చేశారు. అయితే హీరోయిన్ ఒక్కరే. ఈ ఇద్దరిలో హీరోయిన్ ఫైనల్‌గా ఎవర్ని ఇష్టపడుతుందనేది సిల్వర్ స్క్రీన్ పైనే చూడాలి. శ్రీ లీల ఎనర్జిటిక్ అండ్ ట్యాలెంటడ్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు.. మంచి డ్యాన్సర్ కూడా. ఈ సినిమాకు సొంతంగా డబ్బింగ్ చెప్పింది. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడతో నాకు ‘సినిమా చూపిస్త్త మావ’ నుంచే జర్నీ ఉంది. ‘ధమాకా’కి మంచి ఇచ్చారు. త్వరలో ఆయన మంచి దర్శకుడు కాబోతున్నారు. భీమ్స్ అందించిన పాటలతో ‘ధమాకా’ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. విశ్వప్రసాద్, వివేక్గార్లు కంఫర్టబుల్ నిర్మాతలు. నా నెక్ట్స్ మూవీస్‌ని మైత్రీ మూవీ మేకర్స్, ‘దిల్’ రాజు, కృష్ణగార్ల సంస్థల్లో చేయాల్సి ఉంది’’ అన్నారు. -
థియేటర్లో టికెట్లు అమ్మిన హీరోయిన్.. ఫోటోలు వైరల్
పెళ్లిసందడి ఫేమ్, టాలీవుడ్ యంగ్ హీరోయిన్ చేసిన పని వైరల్‌గా మారింది. తాజాగా మాస్ మహారాజా రవితేజతో కలిసి 'ధమాకా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది ముద్దు గుమ్మ. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ఇవాళ మొదలయ్యాయి. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల హైదరాబాద్‌లోని ఓ థియేటర్లో టికెట్లు అమ్మి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో శ్రీలీల చూసిన అక్కడి యూత్ ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం ఈనెల 23న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ శ్రీలీల హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్లో కాసేపు సందడి చేసింది. అక్కడికి వచ్చిన అభిమానులతో కలిసి సరదాగా డ్యాన్స్ కూడా చేసింది. ఏకంగా టికెట్ కౌంటర్లో కూర్చుని హీరోయిన్ టికెట్స్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా క్యూ కట్టారు. Mind Nunchi povatle #Sreeleela #Dhamaka ❤ 😍 💖 ❣ 💕 pic.twitter.com/EKd6zXRovh — MehRRRaj (@mdgouse13116) December 17, 2022 -
రవితేజ 'ధమాకా' ట్రైలర్ అవుట్.. మాస్ యాక్షన్ అదిరిపోయింది
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'ధమాకా'. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రినాథ రావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ఇవాళ విడుదల చేశారు. డిసెంబర్ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన మాస్ పాటలు, టీజర్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ట్రైలర్ చూస్తే ఫుల్ మాస్ యాక్షన్ సినిమాలా ఉంది. రవితేజ అభిమానులకు ఫుల్ మాస్ యాక్షన్‌ను చూపించబోతున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. ట్రైలర్ రిలీజ్‌పై రవితేజ ట్వీట్ చేశారు. ఈనెల 23 థియేటర్లలో కలుద్దాం అంటూ పోస్ట్ చేశారు. Here it is! The #Dhamaka Trailer 🔥 This DEC 23rd is going to be an entertaining one for you all 😊 థియేటర్స్ లో కలుద్దాం 😎 - https://t.co/t2SOj2VNi4#DhamakaFromDec23 pic.twitter.com/FW1nvjWN2d — Ravi Teja (@RaviTeja_offl) December 15, 2022 -
రవితేజ 'ధమాకా' ట్రైలర్ రిలీజ్ డేట్‌కు ముహూర్తం ఫిక్స్
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ధమాకా. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రినాథ రావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన మాస్ పాటలు, టీజర్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈనెల 15న ధమాకా ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. MassMaharaja @RaviTeja_offl 's Mass Storm From Dec 15th💥#Dhamaka Trailer Releasing on Dec 15th🤩#DhamakaFromDec23 Subscribe to 👇https://t.co/tixSag3AVp@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada @sujithkolli @AAArtsOfficial pic.twitter.com/P0X9AebVqj — People Media Factory (@peoplemediafcy) December 11, 2022 -
నాలోనే ఓ చిన్న రవితేజ ఉన్నాడు... ‘ధమాకా’ అలా ఉంటుంది: ప్రసన్న కుమార్
‘రవితేజ కోసం కథ రాయడం పెద్దగా కష్టం అనిపించలేదు. ఎందుకంటే నాలోనే ఓ చిన్న రవితేజ ఉన్నాడు. నా వ్యక్తిత్వం కూడా ఆయనలాగే ఉంటుంది. నా గత సినిమాలు చూసినా కూడా అందులో హీరో పాత్రలలో రవితేజ ప్రభావం ఉంటుంది. తెలియకుండానే ఆయన ఇంపాక్ట్ నాలో ఉంది’అని సినీ రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ అన్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ధమాకా'. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 23న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించిన ప్రసన్న కుమార్ తాజాగా మీడియాలో ముచ్చటించారు. ఆ విశేషాలు. ► వివేక్ గారు నేను కలసి ఒక సినిమా చేయాలని అనుకున్నాం. మొదట వాళ్లకి సైన్ చేశాను. అదే సమయంలో రవితేజ గారు నా వర్క్ నచ్చి అభినందించాలని పిలిచారు. తర్వాత చాలా రోజులు సరదాగా మాట్లాడుకున్నాం. నేను ఏదీ ఆశించలేదు. కొన్ని రోజుల జర్నీ తర్వాత ..'ఏదైనా ఉంటే చెప్పు.. మనం చేద్దాం' అని రవితేజ గారు అన్నారు. దీంతో వర్క్ చేయడం స్టార్ట్ చేశాం. మొదట ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం. అయితే వేరే కారణాలు వల్ల అది కురలేదు. తర్వాత ధమాకా కథ చెప్పాను. లాక్ డౌన్ లో స్క్రిప్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేశాం. ఎంటర్ టైన్ మెంట్ అనేది రవితేజ బలం. మా బలం కూడా అదే. ఇద్దరం కలసి మంచి ఎంటర్ టైనర్ చేయాలని ధమాకా చేశాం. ► ఈ చిత్రంలో రవితేజది డ్యూయల్ రోల్. ఒక రిచ్ క్యారెక్టర్, ఒక పూర్ క్యారెక్టర్ వుంటుంది. ఒక ఇన్సిడెంట్‌ని రెండు డిఫరెంట్ క్యారెక్టర్లు ఎలా చూస్తారనేదానిపై బేస్ అయిన సినిమా. రౌడీ అల్లుడికి మరో వెర్షన్ అనుకుంటున్నాను. ► ఈ చిత్రంలో రావు రమేష్ హైపర్ ఆది కాంబినేషన్ అవుట్ స్టాండింగ్ గా ఉంటుంది. వాళ్ళు కనిపిస్తే చాలు నవ్వుతారు. కొంతమందికి సినిమా చూపించాం. చూసిన వారంతా అవుట్ స్టాండింగ్ అంటున్నారు. అలీ గారి పాత్ర కూడా బాగుంటుంది. హీరో హీరోయిన్ మధ్య సీక్వెన్స్ లు, ఆఫీస్ సీన్స్ హిలేరియస్ గా ఉంటాయి. ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఐదు నిమిషాల ఎపిసోడ్ సినిమా రేంజ్ ని డిసైడ్ చేసే ఎంటర్ టైన్ మెంట్ సీక్వెన్స్. ► దర్శకుడు త్రినాథరావు నక్కినతో నాకు మంచి బాండింగ్ ఉంది. నేను ఒక సీన్ చెబితే దాని అవుట్ పుట్ ఎలా ఉంటుందో ఆయన కి తెలిసిపోతుంది. డైలాగ్ రాసిన తర్వాత ఈ సీన్ బాగుంటుందని చెబితే.. నాపై నమ్మకంతో వదిలేస్తాడు. బయట ఈ కంఫర్ట్ ఉండకపోవచ్చు. మా ఇద్దరికి మంచి సింక్ కుదిరింది. ► కథ రాసి పేపర్లు ఇచ్చిపోయే రైటర్ని కాదు నేను. సినిమా ప్రాసస్ ని ఎంజాయ్ చేస్తాను. సినిమా సెట్ లో ఉంటాను. నేను పెట్టిన ఎఫర్ట్ కి తగ్గట్టె పారితోషికం ఇస్తారు. ► చిన్న స్థాయి నుంచి వచ్చి స్టార్ రైటర్ గా ఎదిగారని ఎవరైన అంటుంటే ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు నేను అమ్మానాన్నలకు బెటర్ లైఫ్‌ని ఇస్తున్నాను. ఇంట్లో వాళ్ళకి కావాల్సింది ఇవ్వగలుగుతున్నాను. వాళ్ళ అవసరాలని తీరుస్తున్నపుడు మనం సక్సెస్ అయ్యామనే ఫీలింగ్ కలుగుతుంటుంది. ► నాగార్జున గారి కోసం ఒక స్క్రిప్ట్ చేస్తున్నాను. ఇది రీమేక్ అని వార్తలు వచ్చాయి. అది అవాస్తవం. నా సొంత కథే. విశ్వక్ సేన్ చేస్తున్న దాస్ కా ధమ్కి షూటింగ్ పూర్తి చేసుకుంది. మరో చిన్న సినిమా కూడా చేస్తున్నా. -
రవితేజ మాస్ స్టెప్పులు.. ఆకట్టుకుంటున్న హుషారైన పాట
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ధమాకా. శ్రీలల ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్,పాటలు సినిమాపై మాంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో మాస్ బీట్ సాంగ్ విడుదలైంది. 'దండకడియాల్ దస్తీ రుమాల్ మస్తుగున్నోడంటివే పిల్లో' అంటూ సాగే ఈ సాంగ్ జానపద బాణీలో జోష్‌ఫుల్‌గా ఉన్నాయి. భీమ్స్, సాహితి చాగంటి, మంగ్లీ ఈ పాటను పాడారు. జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. రవితేజ, శ్రీలీల మాస్ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. డిసెంబర్ 23న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. -
రవితేజ, నిఖిల్‌తో బాక్సాఫీస్ వార్కి సై అంటున్న నయన్!
క్రిస్మస్ పండక్కి సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి. వచ్చే సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉండటంతో..ఈ క్రిస్మస్ ను బెస్ట్ అప్సన్ గా ఎంచుకున్నాయి.మాస్ మహారాజా రవితేజ ధమాకా సినిమాతో రంగంలో దిగుతున్నాడు. రవితేజకు జోడిగా శ్రీలీలా నటించింది. ఇప్పటికే మూవీ టీజర్,పాటలు రిలీజ్ చేశారు. డిసెంబర్ 23న ఈ చిత్రం విడుదల కానుంది. మరో వైపు క్రిస్మస్ కు నిఖిల్ కూడా 18 పేజేస్ తో వస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అలాగే ఓ పాటతో కూడా ఆకట్టుకున్నారు. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. పలనాటి సూర్య ప్రతాప్ మూవీ దర్శకుడు. నిఖిల్ ,అనుపమా పరమేశ్వరన్ నటించిన కార్తికేయా 2 పాన్ ఇండియా హిట్ కొట్టింది. దాంతో ఈ సినిమా మీద బజ్ బాగా పెరిగింది. రొమాంటిక్ కామెడీ జోనర్ తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ,నిఖిల్ తమ సినిమాతో పండక్కి రాబోతుంటే...నయన తార కూడా కనెక్ట్ మూవీతో రంగంలోకి దిగుతుంది. హర్రర్ జోనర్ లో ఈ మూవీ రూపొందింది. ఇప్పటికే ఈ మూవీ నుండి టీజర్ విడుదల చేశారు.యూవీ క్రియేషన్స్ బ్యానర్ తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేస్తుంది. ఇక 99 నిమిషాల నిడివి కల ఈ మూవీలో ఇంటర్వెల్ అనేది ఉండదట..అంటే..ఆడియన్స్ కు సినిమా మొదలయినప్పటి నుండి ..క్లైమాక్స్ వరకు..విశ్రాంతి ఇవ్వరన్న మాట. మరి క్రిస్మస్ పండక్కి..ఏ సినిమా ఎక్కువ ఆకట్టుకుందో చూడాలి. -
వందేళ్లైనా రవితేజను మర్చిపోను: భీమ్స్ సిసిరోలియో
‘‘రవితేజగారితో ‘బెంగాల్ టైగర్’ చిత్రం చేశా. ఆయన ‘ధమాకా’ చిత్రానికి రెండోసారి అవకాశం ఇవ్వడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. ‘బెంగాల్ టైగర్’కి మించిన పాటలు ‘ధమాకా’లో ఉన్నాయి. రవితేజగారు నాకు గొప్ప నమ్మకాన్ని ఇచ్చారు.. వందేళ్ల తర్వాత కూడా దీన్ని మర్చిపోను’’ అని సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అన్నారు. రవితేజ, శ్రీలీల జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధమాకా’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ–అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఈ నెల 23న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ– ‘‘రవితేజగారిని చూస్తే చాలు పాటలు, ప్రేమ, భక్తి పుడతాయి. భీమ్స్ పనైపోయిందనే కామెంట్లు విన్నప్పుడు అవకాశం ఇచ్చారు రవితేజగారు. ‘ధమాకా’కి రవితేజగారికి పాటల పూజ చేశానేమో అనిపిస్తోంది. నా కెరీర్లో కొంత గ్యాప్ వచ్చింది.. ఈ గ్యాప్‌ని ఫుల్‌ఫిల్ చేసేలా పదిహేను సినిమాలు చేస్తున్నాను. వాటిల్లో వచ్చే ఏడాది ఏప్రిల్‌లోపు పది సినిమాలు రిలీజవుతాయి’’ అన్నారు. -
మాస్ మహారాజా మూవీ అప్డేట్.. 'వాట్స్ హ్యాపెనింగ్' అంటున్న రవితేజ
మాస్ మహరాజా రవితేజ లేటేస్ట్ మూవీ 'ధమాకా'. యాక్షన్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 23న థియేటర్లలోకి సందడి చేయనుంది. (చదవండి: 'దీపావళికి మాస్ మహారాజా సర్ప్రైజ్.. ధమాకా టీజర్ రిలీజ్) తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. 'వాట్స్ హ్యాపెనింగ్' అంటూ సాగే సాంగ్ విడుదల చేయడంతో రవితేజ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లోని మాస్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రంలో జయరాం, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, రావు రమేశ్, ఆలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
'దీపావళికి మాస్ మహారాజా సర్ప్రైజ్.. ధమాకా టీజర్ రిలీజ్
మాస్ మహరాజా రవితేజ లేటేస్ట్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. యాక్షన్, కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న 'ధమాకా' టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. దీపావళి కానుకగా రవితేజ్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 23న థియేటర్లలోకి సందడి చేయనుంది. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ విడుదలైన టీజర్‌ను చూస్తే రవితేజ మాస్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. టీజర్‌ను చూస్తే..' నేను మీలో విలన్ని చూస్తే.. మీరు నాలో హీరోని చూస్తారు' అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. చివర్లో రవితేజ డైలాగ్ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. 'అటు నుంచి ఒక బుల్లెట్ వస్తే.. ఇటు నుంచి దీపావళే' వార్నింగ్ ఇవ్వడం రవితేజ మాస్‌ను ఓ రేంజ్‌కు తీసుకెళ్లింది. జయరాం, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, రావు రమేశ్, ఆలీ ఈ చిత్రంలో లకపాత్రలు పోషించారు. -
ఆమె ఫెర్ఫామెన్స్‌కు టాలీవుడ్ ఫిదా.. రూ. కోటి అయినా ఓకేనట!
మొదటి సినిమాతో ఓవర్ నైట్ ఫేమ్ అందుకోవడం..వెంట వెంటనే సినిమా ఆఫర్స్ తలుపు తట్టడం చాలా రేర్ గా జరుగుతుంది. ఇటీవల కాలంలో కృతి శెట్టి మాత్రమే ఇలాంటి ఇమేజ్ అందుకుంది. తెలుగులో అరడజనుకు పైగా చిత్రాల్లో నటించింది. ఇప్పుడు కృతి దారిలోనే వెళ్తోంది పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల వెళ్తోంది. పెళ్లి సందడి సినిమా సోసోగా ఆడియానా..ఆమె ఫెర్ఫామెన్స్‌కు టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఫిదా అయ్యారు.వరుస ఆఫర్స్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లోనూ తన పేరు వినిపించడం కామన్ అయిపోయింది. ప్రస్తుతం రవితేజ తో ధమాకాలో కనిపించనుంది.నవీన్ పొలిశెట్టి న్యూ ఫిల్మ్ అనగనగా ఒక రాజు లోనూ నటిస్తోంది.వైష్ణవ్ తేజ్ తో కూడా జోడి కడుతోందని ప్రచారం సాగుతోంది. ఈ మూవీస్ తో పాటు ఇంకా చాలా చిత్రాల్లో శ్రీలీల పేరు వినిపిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ నటిస్తున్న న్యూ మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించనుందట. అలాగే వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ నటించే చిత్రంలోనూ శ్రీలీల హీరోయిన్ అని ప్రచారం సాగుతోంది. ఇక వరుస ఆఫర్స్‌తో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోవడంతో.. రెమ్యునరేషన్ కూడా పెంచేసిందట ఈ శాండల్ వుడ్ భామ. ఒక్కో సినిమాకు రూ. కోటి డిమాండ్ చేస్తుందట. ఈ భామకు ఉన్న క్రేజ్ దృష్ట్యా కోటి అయినా.. ఓకే అంటున్నారట నిర్మాతలు. -
స్పెయిన్‌లో పెళ్లి సందడి హీరోయిన్‌తో రవితేజ రొమాన్స్..
Mass Hero Ravi Teja, Sreeleela In Dhamaka Movie Shooting: రవితేజ, శ్రీలీల కలిసి స్పెయిన్‌లో ఆడిపాడుతున్నారు. ఈ ఆటాపాటా వీరిద్దరూ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ కోసమే. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ధమాకా’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. పాటల చిత్రీకరణ కోసం ఈ చిత్రబృందం స్పెయిన్‌లో ల్యాండ్ అయింది. చదవండి: ప్రశాంత్ కిషోర్‌తో తమిళ స్టార్ హీరో భేటీ.. పోలిటికల్ ఎంట్రీకీ సంకేతమా? ప్రస్తుతం రవితేజ, శ్రీలీలపై ఓ రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది. స్పెయిన్‌లోని ప్లాజా డి ఎస్పానా అనే హిస్టారికల్ లొకేషన్లో రొమాంటిక్ పాటను చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: వివేక్ కూచి¿ొట్ల, సంగీతం: భీమ్స్, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని. చదవండి: రామ్ చరణ్ అర్ధరాత్రి ఇంటి ముందుకొచ్చేవాడు: జూనియర్ ఎన్టీఆర్ -
స్పెయిన్‌లో ధమాకా
Ravi Teja Movie Shoot in Spain: స్పెయిన్‌లో రవితేజ డాన్సింగ్ స్టెప్పులు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే ‘రామారావు: ఆన్ డ్యూటీ’ చిత్రం కోసం స్పెయిన్‌లో సాంగ్ షూట్లో రవితేజ పాల్గొంటున్నారు. రవితేజ హీరోగా చేస్తున్న మరో చిత్రం ‘ధమాకా’ తదుపరి షెడ్యూల్ కూడా స్పెయిన్‌లోనే జరగనుంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో శ్రీ లీల హీరోయిన్. స్పెయిన్‌లో ఈ సినిమా పాటల చిత్రీకరణను ప్లాన్ చేశారు. జానీ మాస్టర్ ఈ సాంగ్స్‌కు కొరియోగ్రాఫర్. పాటలతో పాటు రవితేజ, శ్రీలీల మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్‌ను కూడా చిత్రీకరించాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరిలియో సంగీతదర్శకుడు. -
వాలంటైన్స్ డే: స్పెషల్ సర్‌ప్రైజస్!
ప్రేమికుల దినోత్సవం (ఫిబ్రవరి 14) సందర్భంగా సోమవారం ప్రేమతో పలు అప్డేట్స్ ఇచ్చాయి ఆయా చిత్రబృందాలు. ఒకరు సాంగ్‌తో సర్ప్రైజ్ చేస్తే, మరొకరు టీజర్ గిఫ్ట్స్ ఇచ్చారు. ఇంకొకరు ప్రేయసి లుక్స్‌ను రివీల్ చేశారు. ఇలా ఎవరికి వీలైనట్లు వారు ప్రేమికుల రోజున అప్డేట్స్తో ఆడియన్స్‌కు లవ్ గిఫ్ట్స్ ఇచ్చారు. ఈ బహుమతుల తాలూకు వివరాల్లోకి మీరూ ఓ లుక్కేయండి. ‘‘పిల్లలూ పరీక్షలు ముగించుకోండి. పెద్దలు సమ్మర్ సందడికై తయారుకండి. ఫన్ పిక్నిక్కి డేట్ ఫిక్స్ చేశాం’ అంటూ ‘ఎఫ్ 3’ టీమ్ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. మే 27న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా, రాజేంద్రప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించారు. పిల్లలు పరీక్షలు ముగించుకోండి🤩 పెద్దలు సమ్మర్ సందడికై తయారుకండి🔥 ఫన్ పిక్నిక్ కి డేట్ ఫిక్స్ చేశాం!🔐 No change in date Anymore! 😎 Most Awaited FUN Franchise ➡️ #F3Movie ON MAY 27th🥳#F3OnMay27@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @ThisIsDSP @SVC_official @adityamusic pic.twitter.com/PTjLnKvQbF — Sri Venkateswara Creations (@SVC_official) February 14, 2022 ఇక ఈ ప్రేమికుల రోజున డాక్టరు ప్రేరణకు ప్రపోజ్ చేశాడు విక్రమాదిత్య. ‘రాధేశ్యామ్’ చిత్రంలోని సీన్ ఇది. ఈ సినిమా వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో జ్యోతిష్కుడు విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజా హెగ్డే కనిపిస్తారు. కె. రాధాకృష్ణ ్ణకుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న విడుదల కానుంది. ఇక సిల్వర్ స్క్రీన్‌పై తన కొత్త ప్రేయసి ఎవరనేది అధికారికంగా చెప్పేశారు రవితేజ. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తాను హీరోగా నటిస్తున్న ‘ధమాకా’ చిత్రంలో ప్రణవి అనే అమ్మాయిని ప్రేమిస్తారు రవితేజ. ప్రణవి అంటే ఎవరో కాదండోయ్. ‘పెళ్లి సందడి’తో పరిచయమైన శ్రీ లీల అన్నమాట. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. మరోవైపు ‘వారియర్’ మనసులో విజిల్ వేసి మరీ ప్రేమ పుట్టించింది మహాలక్ష్మి. రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో ‘ది వారియర్’ అనే యాక్షన్ ఫిల్మ్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోన్న కృతీ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో విజిల్ మహాలక్ష్మి పాత్రలో కనిపిస్తారు కృతి. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇంకోవైపు ఆద్య పక్కన ఉంటే చాలు ప్రపంచాన్నే మర్చిపోతున్నారు శర్వానంద్. ఆద్యా అంటే శర్వా రీల్ లైఫ్ పార్ట్నర్. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రంలో శర్వానంద్‌కు జోడీగా చేసిన రష్మికా మందన్నాయే ఈ ఆద్య. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని ‘హో... ఆద్య’ అనే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. మరోవైపు ‘లవ్ మొళి’ అవతారం ఎత్తారు నవదీప్. అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్, ఫంకూరీ గిద్వానీ జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ మొళి’. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రశాంత్ రెడ్డి తాటికొండ నిర్మిస్తున్నారు. వీతోపాటు మరికొన్ని చిత్రబృందాలు సాంగ్స్, కొత్త పోస్టర్స్‌తో ప్రేమికుల దినోత్సవానికి ప్రేక్షకులకు ప్రేమ కానుక ఇచ్చారు. -
రీ ఎంట్రీ ఇస్తున్న నటుడు వేణు తొట్టెంపూడి..
నటుడు వేణు తొట్టెంపూడి గుర్తున్నాడు కదా.. స్వయంవరం సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టాడు. ఆ తర్వాత చిరునవ్వుతో, చెప్పవే చిరుగాలి మూవీల్లో లీడ్ రోల్ పోషించిన ఆయన.. హనుమాన్ జంక్షన్, పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా సినిమాల్లో నటించి తన గ్రాఫ్‌ను పెంచుకున్నాడు. హీరోగా, కమెడియన్‌గా తన నటనతో నటనతో అలరించిన ఆయన కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. రీసెంట్‌గానే రవితేజ హీరోగా చేస్తున్న రామారావు ఆన్‌డ్యూటీ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా రవితేజ హీరోగా చేస్తున్న ధమాకా సినిమాలో ముఖ్య పాత్ర పోషించనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ రానుంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీల నటించనుంది. -
అలా రూ.72 కోట్లు సొంతం చేసుకున్న రవితేజ!
మాస్ మహారాజా రవితేజ కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ‘క్రాక్’ తర్వాత ఏకంగా ఐదు సినిమాలు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. వాటిలో రెండు సినిమాలు షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఖిలాడి మూవీ ఫిబ్రవరి 11న విడుదల కాబోతుంది. ఈ మూవీతో మాస్ మహారాజా బాలీవుడ్‌కి కూడా పరిచయం కాబోతున్నాడు. ఇక శరత్ మండవ తెరకెక్కిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’సినిమా షూటింగ్ ఎండింగ్ దశకు చేరుకుంది. స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో నటిస్తున్నారు. మరో హీరో వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా తర్వాత మాస్ మహారాజా.. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’మూవీ చేయనున్నాడు. రవితేజ 70వ చిత్రమిది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ న్యాయవాదిగా కనిపించనున్నాడు. సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక వీటితో పాటు సెట్‌పైకి వెళ్లిన రవితేజ మరో చిత్రం ‘ధమాకా’.డబుల్ ఇంపాక్ట్ అంటూ ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్‌తో ఈ మూవీ రూపొందుతోంది. మాస్ కథలకి, పాత్రలకు పెట్టింది పేరైన రవితేజ ఈ చిత్రాల్లోనూ అదే తరహాలో సందడి చేయనున్నట్లు ఇటీవల విడుదలైన పోస్టర్లను బట్టి తెలుస్తోంది. ఈ నాలుగు చిత్రాలు సెట్స్‌పై ఉండగానే.. తన 71వ చిత్రానికి ‘టైగర్ నాగేశ్వరరావు’టైటిల్ ప్రకటించాడు రవితేజ. స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ అయిన ‘టైగర్ నాగేశ్వరరావు’బయోపిక్ ఇది. రవితేజ కెరీర్లో అత్యంత భారీగా, పాన్ ఇండియా స్థాయిలో రూపొందబోతుంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ విడుదల కానుంది. విటితో పాటు చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య మూవీలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు రవితేజ. ఇలా వరుస సినిమాలతో ఈ ఏడాదంతా ఫుల్ బిజీగా ఉన్న రవితేజ.. దాదాపు రూ. 300 కోట్ల మేర బిజినెస్ చేయబోతున్నాడని టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు ఒక్కో సినిమాకు రూ.12 కోట్ల చొప్పున.. ఆరు సినిమాలకు గాను ఏకంగా రూ. 72 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ‘క్రాక్’తర్వాత రవితేజ కెరీర్మూడు పూలు ఆరుకాయలు అనేంతలా మారిపోయింది. -
నాకు రెండు సార్లు బర్త్ డే విష్ చెప్పండి: కార్తీక్ ఆర్యన్
Kartik Aryan Wants To Wish Him Twice On His Birth Day: నవంబర్ 22న బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతడికి డబుల్ సెలబ్రేషన్స్ దక్కాయి. హీరో తాజా చిత్రం 'ధమాకా' నవంబర్ 19న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సినిమా అభిమానులు, ప్రేక్షకుల ఆదరణను పొందుతోంది. అందుకే అతని బర్త్‌డే కేక్‌పై కూడా 'ధమాకా బాయ్' అని రాసి సెలబ్రేట్ చేశారు. కార్తీక్ తన బర్త్‌డే కేక్‌ను పోస్ట్ చేస్తూ 'మళ్లీ పుట్టిన రోజు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. నాకు రెండు సార్లు శుభాకాంక్షలు చెప్పండి'. అంటూ నవ్వుతూ క్యాప్షన్ ఇచ్చాడు. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి కార్తీక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 'పుట్టినరోజు శుభాకాంక్షలు కార్తీక్. మీకు ఎప్పుడూ ప్రేమ, సుఖశాంతులు కలగాలని కోరుకుంటున్నా' అని అనుష్క శర్మ విష్ చేశారు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా కార్తీక్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్తీక్‌ను శిల్పా శెట్టి ధమాకా అని పిలుస్తూ 'నీలో ధమాక వంటి ప్రతిభ ఉంది. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. పుట్టిన రోజు శుభాకాంక్షలు' అని ఇన్‌స్టా గ్రామ్‌లో స్టోరీ పెట్టారు. ఈ హీరోకు అభిమానుల ఫాలోయింగ్ భారీగానే ఉంది. బాలీవుడ్లో తనదైన సముచితమైన స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కార్తీక్ తనను తాను ఫ్యాన్ మేడ్ హీరోగా అభివర్ణించాడు. 'నేను అదృష్టవంతున్ని. నేను పూర్తిగా ఫ్యాన్ మేడ్ హీరోని. నా అభిమానులు, ప్రేక్షకుల వల్లే నేను ఇక్కడ ఉన్నాను. నా అభిమానులు నాలో కొంత భాగంగా భావిస్తున్నాను. నా ప్రయాణంలో వారు కూడా భాగమే. వారు నాకు చాలా ప్రేమ ఇచ్చారు. అది వారికి ఎలా తిరిగి ఇవ్వాలో తెలియదు. నేను వారిని నిరాశపర్చకుండా సాధ్యమైనంత వరకూ పనిచేయడానికి ప్రయత్నిస్తాను. వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయను.' అని తెలిపాడు. 'ధమాకా' చిత్రాన్ని కరోనా కారణంగా ముంబైలో రికార్డు స్థాయిలో కేవలం 10 రోజుల్లోనే చిత్రీకరించారు. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్‌తో పాటు మృణాల్ ఠాకూర్, అమృతా సుభాష్, వికాస్ కుమార్, విశ్వజీత్ ప్రధాన్ నటించారు. -
హ్యాపీ మొబైల్ క్యాష్ బ్యాక్ ధమాకా ఆఫర్లు
హైదరాబాద్: హ్యాపీ మొబైల్స్ దీపావళి పండుగ సందర్భంగా ‘‘క్యాష్ బ్యాక్ ధమాకా’’ పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఎలాంటి లక్కీ డ్రా లేకుండా ప్రతి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతి అందించనుంది. మొబైల్, ల్యాప్ ట్యాబ్, టీవీల కొనుగోళ్లపై 10% వరకు క్యాష్ బ్యాక్‌ను పొందొచ్చు. శాంసంగ్, ఒప్పో, వివో మొబైళ్ల కొనుగోలుపై రూ.3000 వరకు, ఐఫోన్ కొనుగోలుపై రూ. 6000 వరకు, స్మార్ట్ టీవీల కొనుగోలుపై రూ. 3000 వరకు క్యాష్ బ్యాక్‌ను అందించవచ్చు. అన్ని మొబైల్ ఉపకరణలపై 60% వరకు తగ్గింపు పొందవచ్చు. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్సర్వ్, మొబిక్విక్, పేటీఎంల ద్వారా 10% వరకు తక్షణ క్యాష్ బ్యాక్‌ను పొందొచ్చు. ప్రత్యేక ఆఫర్లను కస్టమర్లు వినియోగించుకోవాలని కంపెనీ సీఎండీ కృష్ణ పవన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోట సంతోష్ తెలిపారు. -
ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్: ఇన్వర్టర్ ఏసీలపై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ల సేల్కు తెర తీసింది. ‘ మాన్సూన్ ధమకా సేల్’ పేరుతో 4 రోజుల అమ్మకాలను ప్రారంభించింది. జూన్ 30 వరకు జరగనున్న ఈ అమ్మకాల్లో స్పెషల్ డిస్కౌంట్లను అందిస్తుంది. అలాగే హెచ్డీఎఫ్సీ, ఎస్బిఐ క్రెడిట్ కార్డుల కొనుగోళ్లకు ప్రత్యేక క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ముఖ్యంగా శాంసంగ్, ఎల్జీ, ప్యానసోనిక్, బ్లూస్టార్, వర్ల్‌పూల్, కేరియర్, వోల్టాస్, ఒనిడా కంపెనీల ఏసీలపై 41 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. శాంసంగ్: 1.5 టన్నుల 5 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ: రూ .34,990 (అసలు రూ. 56,990) 38 శాతం తగ్గింపు 5 స్టార్ బీఇ రేటింగ్, టర్బో కూలింగ్ ఫీచర్‌తో పాటు డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ దీని సొంతం. క్యారియర్ 4-ఇన్ -1 కన్వర్టిబుల్ కూలింగ్ 1.5 టన్నుల స్ప్లిట్ ఇన్వర్టర్ ఎసి: రూ .39,990 (అసలు రూ .61,990) 35శాతం తగ్గింపు వోల్టాస్ 2 ఇన్ 1 కన్వర్టిబుల్ కూలింగ్ 1.2 టన్ను 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఎసి: రూ .28,990 (అసలు రూ. 54,990) వద్ద లభిస్తుంది 47శాతం తగ్గింపు వర్ల్‌పూల్ 1.5 టన్ను 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ రూ .31,490 (అసలు ధర రూ .53,420) 41 శాతం తగ్గింపు బ్లూ స్టార్ 1.2 టన్ను 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ: రూ .30,490 (అసలు ధర రూ .50,000). 39 శాతం తగ్గింపు చదవండి : ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు ఊరట -
డబుల్ రోల్‌తో నాని 'ధమాకా'!
టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో నాని. ఎవడే సుబ్రహ్మణ్యం, భలేభలే మగాడివోయ్ చిత్రాలతో విజయాన్నందుకున్న ఈ హీరో.. తాజాగా 'కృష్ణగాడి వీరప్రేమగాథ' సినిమాతోనూ మంచి వసూళ్లే రాబడుతున్నాడు. ఈ సినిమా పట్ల హిట్ టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమాలో డబుల్ రోల్‌తో డబుల్ 'ధమాకా' ఇవ్వడానికి నాని సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని రెండు పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు 'ధమాకా' అని టైటిల్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇంద్రగంటి మోహనకృష్ణతో చాలాకాలం తర్వాత నాని మళ్లీ సినిమా చేస్తున్నాడు. 'అష్టాచెమ్మా' లాంటి హిట్ సినిమాతో నాని చిత్రసీమకు పరిచయం చేసింది మోహనకృష్ణనే. వీరిద్దరి కాంబినేషన్లో మళ్లీ తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేదిత థామస్, సురభి హీరోయిన్లుగా కనిపించనున్నారని సమాచారం. నివేదిత చివరిసారిగా కమలహాసన్ 'పాపనాశనం' చిత్రంలో కనిపించగా.. 'ఎక్స్‌ప్రెస్ రాజా'గా సురభి విజయాన్నందుకుంది.