Ravi Teja Speech At Dhamaka 101 Cr Success Celebrations - Sakshi
Sakshi News home page

ఇలాంటి కంగ్రాట్స్‌ ఇంకా వినాలి

Published Mon, Jan 9 2023 3:35 AM | Last Updated on Mon, Jan 9 2023 9:31 AM

 3:43 Ravi Teja Speech at Dhamaka 101 Cr Success Celebrations - Sakshi

వివేక్, టీజీ విశ్వప్రసాద్, రవితేజ, శ్రీలీల, కృతి, నక్కిన త్రినాథరావు, భీమ్స్‌

‘‘ధమాకా’ చిత్రం బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ అవడం చాలా ఆనందంగా ఉంది. మా సినిమాని బాగా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని హీరో రవితేజ అన్నారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ధమాకా’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ–అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌ 23న రిలీజై, వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ‘ధమాకా 101 కోట్ల మాసివ్‌ సెలబ్రేషన్‌’ని నిర్వహించింది. ఈ వేడుకలో మేకర్స్, మీడియా ప్రతినిధుల చేతుల మీదుగా చిత్ర యూనిట్‌కు మొమెంటోలు అందించారు.

అనంతరం రవితేజ మాట్లాడుతూ– ‘‘విశ్వప్రసాద్‌గారు, వివేక్‌ కూచిభొట్లగారికి బిగ్‌ కంగ్రాట్స్‌. అలాగే త్రినాథరావు, రచయిత ప్రసన్న, శ్రీలీలకి అభినందనలు.. ఇలాంటి కంగ్రాట్స్‌ ఇంకా వింటూనే ఉండాలి. సంగీత దర్శకుడు భీమ్స్‌ ఇలాగే ఇరగదీసేయాలి’’ అన్నారు. ‘‘ధమాకా’ కథకు ఓంకారం చుట్టిన ప్రసన్నకి, ఆయనకి సపోర్ట్‌గా నిలబడిన మరో రచయిత సాయి కృష్ణకి థ్యాంక్స్‌. ఈ కథని తొలుత విని ఓకే చేసిన వివేక్‌గారికి కృతజ్ఞతలు. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన రవితేజ, శ్రీలీలకి «థ్యాంక్స్‌’’ అన్నారు త్రినాథరావు నక్కిన. ‘‘ధమాకా’ని బ్లాక్‌ బస్టర్‌ చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్స్‌’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్, సహనిర్మాత వివేక్‌ కూచిభొట్ల. ‘‘నా కెరీర్‌ బిగినింగ్‌లో రవితేజగారు నాకు బిగ్‌ బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చారు’’ అన్నారు శ్రీ లీల.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement