‘‘రవితేజగారు ఎనర్జిటిక్ హీరో. నా దర్శకత్వంలో వచ్చిన ‘నేను లోకల్’, ‘సినిమా చూపిస్త మావ’, ‘హలో గురు ప్రేమకోసమే’, ‘మేం వయసుకు వచ్చాం’ సినిమాలూ ఎనర్జిటిక్‌గా ఉంటాయి. రవితేజగారి ఎనర్జీ, నా సినిమాల్లో ఉండే ఎనర్జీ... ఈ రెండూ కలిస్తే ఎలా ఉంటుందనే క్యూరీయాసిటీ ప్రేక్షకుల్లో వచ్చింది. ఈ సినిమాకు ‘డబుల్ ఇంపాక్ట్’ అనే క్యాప్షన్ పెట్టడానికి ఓ కారణం ఇదే’’ అన్నారు దర్శకుడు త్రినాథరావు నక్కిన. రవితేజ ద్విపాత్రాభినయం చేసిన తాజా సినిమా ‘ధమాకా: డబుల్ ఇంపాక్ట్’. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించారు. బెజవాడ ప్రసన్నకుమార్ కథ అందించిన ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు.
ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ– ‘‘నాకు ఇష్టమైన హీరోల్లో ఒకరైన రవితేజగారితో సినిమా చేయాలనే కల ‘ధమాకా’తో నేరవేరింది. ఆయనతో సినిమా చేసే చాన్స్ రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. రవితేజగారితో సినిమా అంటే ప్రయోగాలు చేయాలనుకోను. ఈ విషయమే రవితేజగారికీ చెప్పాను. పాత రవితేజను ప్రేక్షకులు ఎక్కడో మిస్ అయ్యారు. మళ్లీ ఆ రవితేజను ఈ సినిమాలో చూస్తారు. ఇందులో స్వామిగా, ఆనంద్ చక్రవర్తిగా ఆయన రెండు పాత్రలు చేశారు. అయితే హీరోయిన్ ఒక్కరే.
ఈ ఇద్దరిలో హీరోయిన్ ఫైనల్‌గా ఎవర్ని ఇష్టపడుతుందనేది సిల్వర్ స్క్రీన్ పైనే చూడాలి. శ్రీ లీల ఎనర్జిటిక్ అండ్ ట్యాలెంటడ్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు.. మంచి డ్యాన్సర్ కూడా. ఈ సినిమాకు సొంతంగా డబ్బింగ్ చెప్పింది. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడతో నాకు ‘సినిమా చూపిస్త్త మావ’ నుంచే జర్నీ ఉంది. ‘ధమాకా’కి మంచి ఇచ్చారు. త్వరలో ఆయన మంచి దర్శకుడు కాబోతున్నారు. భీమ్స్ అందించిన పాటలతో ‘ధమాకా’ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. విశ్వప్రసాద్, వివేక్‌గార్లు కంఫర్టబుల్ నిర్మాతలు. నా నెక్ట్స్ మూవీస్‌ని మైత్రీ మూవీ మేకర్స్, ‘దిల్’ రాజు, కృష్ణగార్ల సంస్థల్లో చేయాల్సి ఉంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment