జోడీ రిపీట్‌? | Dhamaka Jodi repeat again Ravi Teja with Sreeleela | Sakshi
Sakshi News home page

జోడీ రిపీట్‌?

Published Tue, May 28 2024 12:01 AM | Last Updated on Tue, May 28 2024 12:01 AM

Dhamaka Jodi repeat again Ravi Teja with Sreeleela

‘ధమాకా!’ (2022) సినిమాలో తొలిసారి జంటగా నటించి ఆడియన్స్ను మెప్పించారు రవితేజ, శ్రీలీల. తాజాగా ఈ జోడీ రిపీట్‌ కానున్నట్లుగా తెలిసింది. రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమా నిర్మించనున్నారు. ఇది రవితేజ కెరీర్‌లో 75వ చిత్రం కావడం విశేషం.

ఇందులో లక్ష్మణ్‌ భేరి అనే పాత్రలో కనిపించనున్నారు రవితేజ. ఈ సినిమా చిత్రీకరణ జూన్  నెలాఖరులో ప్రారంభం కానుందని తెలిసింది. అయితే ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రీలీల నటించనున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. మరి.. ఈ ‘ధమాకా!’ జోడీ రిపీట్‌ అవుతుందా? వేచి చూడాలి. కాగా ఈ సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్‌ చేస్తామని ఇప్పటికే చిత్రయూనిట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement