Dhamaka Box Office Collection: Ravi Teja's Movie Enter Into Rs 100 Crore Club - Sakshi
Sakshi News home page

Dhamaaka Day 15 Collections: రవితేజ కెరీర్‌లోనే తొలి చిత్రంగా ధమాకా.. రెండు వారాల కలెక్షన్స్‌ ఎంతంటే?

Published Fri, Jan 6 2023 11:20 AM | Last Updated on Fri, Jan 6 2023 12:03 PM

Dhamaka Box Office Collection: Ravi Teja Movie Enter Into Rs 100 Crore Club - Sakshi

మాస్ మహారాజా రవితేజ, ‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ధమాకా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. డిసెంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సక్సెఫుల్‌గా మూడో వారంలోకి అడుగుపెట్టింది. విడుదలైన తొలి షో నుంచే ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్‌ను సొంతంగా చేసుకుంది. బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం తాజాగా రూ. 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. విడుదలైన రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల పైనే గ్రాస్‌ వసూళు చేసిన చిత్రంగా ధమాకా రికార్డు క్రియేట్‌ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా మూవీ టీం ప్రకటించింది. 

ఇక రవితేజ కెరీర్‌లో రూ. 100 కోట్ల కలెక్షన్స్‌ సాధించిన తొలి చిత్రంగా ధమాకా నిలిచింది. ఫుల్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో రవితేజ స్క్రిన్‌ ప్రెజెన్స్‌, ఎనర్సీ, ఆయన కామెడీ టైమింగ్‌ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మరోసారి రవితేజ ఈ సినిమాతో తన మాస్‌ మార్క్‌ను చూపించారు. రవితేజ మాస్‌ స్టామినా, స్టార్‌ పవర్‌తో ధమాకా పైసా వసూల్‌ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. కాగా నక్కిన త్రినాథరావు డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించారు. రవితేజకు జోడీగా నటించిన హీరోయిన్‌ శ్రీలీల తన అందంతో, డ్యాన్స్‌ స్టెప్పులతో అదరగొట్టింది.

చదవండి: 
పఠాన్‌ డిజాస్టర్‌ అయ్యిందిగా..! నెటిజన్‌ విమర్శకు షారుక్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌
అందుకే నా ట్విటర్‌ అకౌంట్‌ను నిలిపివేశారు: నటుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement