రవితేజ మాస్‌ స్టెప్పులు.. ఆకట్టుకుంటున్న హుషారైన పాట | Dandakadiyal Lyrical Song From Dhamaka Movie Is Out Now | Sakshi
Sakshi News home page

Dhamaka Movie : ఊరమాస్‌.. మాస్‌ స్టెప్పులతో ఆకట్టుకుంటున్న రవితేజ, శ్రీలీల

Published Thu, Dec 8 2022 1:18 PM | Last Updated on Thu, Dec 8 2022 3:19 PM

Dandakadiyal Lyrical Song From Dhamaka Movie Is Out Now - Sakshi

మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ధమాకా. శ్రీలల ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా  షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్‌,పాటలు సినిమాపై మాంచి హైప్‌ను క్రియేట్‌ చేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో మాస్‌ బీట్‌ సాంగ్‌ విడుదలైంది.

'దండకడియాల్ దస్తీ రుమాల్ మస్తుగున్నోడంటివే పిల్లో' అంటూ సాగే ఈ సాంగ్‌ జానపద బాణీలో జోష్‌ఫుల్‌గా ఉన్నాయి.  భీమ్స్, సాహితి చాగంటి, మంగ్లీ ఈ పాటను పాడారు. జానీ మాస్టర్‌ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. రవితేజ, శ్రీలీల మాస్‌ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. డిసెంబర్‌ 23న ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement