Trinadha Rao Nakkina
-
'అందరికీ ఇస్తుంది కానీ.. నాకు మాత్రం'.. నక్కిన త్రినాథరావు అభ్యంతరకర కామెంట్స్!
టాలీవుడ్ డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు (Trinadha Rao Nakkina) కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. హీరోయిన్ అన్షుపై (Actress Anshu) అసభ్యకర రీతిలో మాట్లాడారు. మజాకా మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన హీరోయిన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. దీంతో ఆయనపై మహిళా కమిషన్ సైతం సీరియస్ అయింది.మహిళా కమిషన్ ఆగ్రహం..తెలుగు సినిమా డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు పై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హీరోయిన్ అన్షుపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. త్రినాథరావు వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించినట్లు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద వెల్లడిచింది. దర్శకుడికి త్వరలోనే నోటీసు జారీ చేస్తామని తెలిపింది.(ఇది చదవండి: హీరోయిన్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. డైరెక్టర్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం)ఇలా చేయడం రెండోసారి..అయితే నక్కిన త్రినాథరావు అన్షుపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పాత వీడియో నెట్టింట వైరలవుతోంది. గతంలోనూ చౌర్య పాఠం మూవీ హీరోయిన్ పాయల్ రాధాకృష్ణపై కూడా ఇదే రీతిలో కామెంట్స్ చేశారు. 'అందరికీ హగ్ ఇస్తుంది కానీ.. నాకు మాత్రం ఇవ్వడం లేదు' అని ఈవెంట్లో మాట్లాడారు. మా యూనిట్లో అందరినీ హగ్ చేస్తుంది.. కానీ నేను ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లేదని అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేశారు. పేమేంట్ విత్ జీఎస్టీతో కలిపి మొత్తం ఇచ్చినా కూడా ఇప్పటికీ కూడా నాకు హగ్ ఇవ్వడం లేదు అని నక్కిన త్రినాథరావు అభ్యంతంకర వ్యాఖ్యలు చేశారు.ఇటీవల జరిగిన ఈవెంట్లో అన్షుపై కామెంట్స్ చేయడంతో పాత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో నక్కిన త్రినాథరావు ఇలా మాట్లాడటం తొలిసారి కాదని అంటున్నారు. తాజాగా మన్మధుడు హీరోయిన్‌పై అలా మాట్లాడటం రెండోసారని మండిపడుతున్నారు.అసలేం జరిగిందంటే..కాగా నక్కినేని త్రినాథరావు ప్రస్తుతం మజాకా సినిమా (Mazaka Movie)కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ లాంచ్ ఆదివారం (జనవరి 12న) జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు త్రినాధ రావు.. హీరోయిన్ అన్షు గురించి మాట్లాడాడు. అన్షును చూసేందుకే మన్మథుడు సినిమాకు వెళ్లామని, అందులో ఆమె ఓ రేంజ్లో ఉంటుందని చెప్పాడు. అలాంటి అన్షు.. మరోసారి హీరోయిన్గా కళ్లముందుకు వచ్చేసరికి నమ్మలేకపోయానన్నాడు.సన్నబడింది.. కానీ!అయితే అప్పటికి, ఇప్పటికి అన్షు కాస్త సన్నబడిందన్నాడు. మరీ ఇంత సన్నగా ఉంటే సరిపోదు, లావు పెరగమని చెప్పానంటూ హద్దులు దాటుతూ అసభ్యకరంగా మాట్లాడాడు. తన శరీరాకృతి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఇదే ఈవెంట్లో అల్లు అర్జున్ (Allu Arjun) ఇన్సిడెంట్ను రీక్రియేట్ చేశాడు. పుష్ప 2 ఈవెంట్లో బన్నీ.. తెలంగాణ సీఎం పేరు మర్చిపోయి వాటర్ బాటిల్ అడిగి.. కవర్ చేసి తర్వాత పేరు చెబుతాడు. సేమ్.. అలాగే ఇక్కడ కూడా త్రినాధరావు రెండో హీరోయిన్ పేరు మర్చిపోయినట్లు నాటకమాడాడు. సమయానికి గుర్తు రావడం లేదన్నట్లుగా వాటర్ బాటిల్ అడిగాడు. కాసేపటికి రీతూ వర్మ కదూ.. నిజంగానే నీ పేరు పేరు గుర్తుండదంటూ కవర్ చేశాడు. -
డైరెక్టర్ అసభ్యకర వ్యాఖ్యలు.. స్పందించిన మన్మథుడు హీరోయిన్
మన్మథుడు హీరోయిన్ అన్షు (Anshu)పై దర్శకుడు నక్కిన త్రినాధరావు (Trinadha Rao Nakkina) అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆమె శరీరాకృతి గురించి అభ్యంతరకరంగా మాట్లాడటంతో మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు సోషల్ మీడియాలోనూ నెటిజన్లు దర్శకుడి తీరును ఎండగడుతున్నారు. దీంతో తప్పు తెలుసుకున్న త్రినాధరావు హీరోయిన్ అన్షుతో పాటు మహిళందరికీ క్షమాపణలు తెలిపిన విషయం తెలిసిందే!నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారుతాజాగా ఈ వివాదంపై అన్షు స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ముందుగా మజాకా సినిమా టీజర్ (Mazaka Movie)ను ఇంతలా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలాకాలం తర్వాత మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్నాను. మీరు చూపిస్తున్న ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. త్రినాధరావు చేసిన వ్యాఖ్యల గురించి చాలా కథనాలు వస్తున్నాయి. నాకెన్నో సలహాలు, సూచనలిచ్చారుమీ అందరికీ చెప్పాలనుకుంటున్నదేంటంటే.. ఈ ప్రపంచంలోనే ఆయన చాలా మంచి వ్యక్తి. నన్ను తన ఫ్యామిలీ మెంబర్లా చూసుకున్నారు. తనపై నాకు చాలా గౌరవం ఉంది. మజాకా సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. త్రినాధ్ సర్‌తో కలిసి పని చేసినందుకు హ్యాపీగా ఉంది. తెలుగు ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇవ్వడానికి నాకు ఇంతకంటే మంచి దర్శకుడు దొరకరేమో! ఆయన నాకెన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు. తనపై నాకు ప్రేమ, గౌరవం తప్ప ఎలాంటి కోపం లేదు. దయచేసి ఈ వివాదాన్ని ఇక్కడితే ఆపేయండి' అని కోరింది.(చదవండి: త్వరలోనే తల్లి కాబోతున్న హీరోయిన్.. ఘనంగా సీమంతం)రెండు దశాబ్దాల తర్వాత రీఎంట్రీహీరోయిన్ అన్షు అప్పట్లో వచ్చిన మన్మథుడు సినిమాలో అందంతో, అమాయకత్వంతో ఆకట్టుకుంది. తర్వాత ప్రభాస్‌తో రాఘవేంద్ర సినిమా చేసింది. పెళ్లి తర్వాత లండన్‌లోనే సెటిలైపోయి సినిమాలకు దూరంగా ఉంటోంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత మజాకా మూవీతో అన్షు రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో అన్షుతో పాటు సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేశ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కథ, డైలాగ్స్ ప్రసన్న కుమార్ బెజవాడ అందించగా త్రినాధ రావు దర్శకత్వం వహించాడు.టీజర్ లాంచ్ ఈవెంట్లో అసభ్యకర వ్యాఖ్యలుఆదివారం (జనవరి 12న) మజాకా సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు త్రినాధరావు హీరోయిన్ అన్షుపై నోరు జారాడు. మొదటగా ఆమెకు పెద్ద అభిమానిని అన్నట్లుగా ప్రసంగం మొదలుపెట్టిన ఈయన చివరకు వచ్చేసరికి మాత్రం ఆమె శరీరాకృతి గురించి అసభ్య వ్యాఖ్యలు చేశాడు. అన్షు సన్నగా ఉందని.. ఇలా ఉంటే సరిపోదు.. లావెక్కాలి.. అంటూ అసహ్యకరంగా మాట్లాడాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా కమిషన్ త్రినాధరావు వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుంది. ఇక ఇదే ఈవెంట్లో హీరోయిన్ రీతూ వర్మ పేరు మర్చిపోయినట్లు నాటకం ఆడాడు త్రినాధరావు. దీనిపై కూడా నెట్టింట విమర్శలు వచ్చాయి. మజాకా సినిమా విషయానికి వస్తే ఇది వచ్చే నెల 21న విడుదల కానుంది.చదవండి: హీరోయిన్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. డైరెక్టర్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం -
హీరోయిన్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. డైరెక్టర్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం
తెలుగు సినిమా డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు (Trinadha Rao Nakkina)పై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హీరోయిన్ అన్షు (Actress Anshu)పై అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. త్రినాథరావు వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించినట్లు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద వెల్లడిచింది. దర్శకుడికి త్వరలోనే నోటీసు జారీ చేస్తామని తెలిపింది.హీరోయిన్ కోసమే సినిమా చూశా..కాగా నక్కినేని త్రినాథరావు ప్రస్తుతం మజాకా సినిమా (Mazaka Movie)కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ లాంచ్ ఆదివారం (జనవరి 12న) జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు త్రినాధ రావు.. హీరోయిన్ అన్షు గురించి మాట్లాడాడు. అన్షును చూసేందుకే మన్మథుడు సినిమాకు వెళ్లామని, అందులో ఆమె ఓ రేంజ్లో ఉంటుందని చెప్పాడు. అలాంటి అన్షు.. మరోసారి హీరోయిన్గా కళ్లముందుకు వచ్చేసరికి నమ్మలేకపోయానన్నాడు.సన్నబడింది.. కానీ!అయితే అప్పటికి, ఇప్పటికి అన్షు కాస్త సన్నబడిందన్నాడు. మరీ ఇంత సన్నగా ఉంటే సరిపోదు, లావు పెరగమని చెప్పానంటూ హద్దులు దాటుతూ అసభ్యకరంగా మాట్లాడాడు. తన శరీరాకృతి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఇదే ఈవెంట్లో అల్లు అర్జున్ (Allu Arjun) ఇన్సిడెంట్ను రీక్రియేట్ చేశాడు. పుష్ప 2 ఈవెంట్లో బన్నీ.. తెలంగాణ సీఎం పేరు మర్చిపోయి వాటర్ బాటిల్ అడిగి.. కవర్ చేసి తర్వాత పేరు చెబుతాడు. సేమ్.. అలాగే ఇక్కడ కూడా త్రినాధరావు రెండో హీరోయిన్ పేరు మర్చిపోయినట్లు నాటకమాడాడు. సమయానికి గుర్తు రావడం లేదన్నట్లుగా వాటర్ బాటిల్ అడిగాడు. కాసేపటికి రీతూ వర్మ కదూ.. నిజంగానే నీ పేరు పేరు గుర్తుండదంటూ కవర్ చేశాడు. పేరు మర్చిపోయినట్లుగా యాక్టింగ్ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా దర్శకుడి ఓవరాక్షన్ ఎక్కువైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అతడి కామెంట్లపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో త్రినాధరావు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరాడు. 'మహిళలకి, అన్షు గారికి, నా మాటలు వల్ల బాధపడ్డ ఆడవాళ్ళందరికీ క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను, నా ఉద్దేశ్యం ఎవరిని బాధ కలిగించడం కాదు తెలిసి చేసినా తెలియకుండా చేసిన తప్పు తప్పే.. మీరందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను' అని వీడియో రిలీజ్ చేశాడు. (చదవండి: మళ్లీ ‘దంచిన’ బాలయ్య.. పార్టీలో హీరోయిన్‌తో ఆ స్టెప్పులు! ఇప్పట్లో ఆగేలా లేడుగా)20 ఏళ్ల తర్వాత రీఎంట్రీహీరోయిన్ అన్షు చాలామంది గుర్తుండే ఉంటుంది. అప్పట్లో వచ్చిన మన్మథుడు సినిమాలో అందంతో, అమాయకత్వంతో ఆకట్టుకుంది. తర్వాత ప్రభాస్‌తో రాఘవేంద్ర సినిమా చేసింది. 20 ఏళ్ల తర్వాత ఆమె మజాకా మూవీతో రీఎంట్రీ ఇస్తోంది మజాకా సినిమా విషయానికి వస్తే ఇందులో సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేశ్, అన్షు ప్రధాన పాత్రల్లో నటించారు. కథ, డైలాగ్స్ ప్రసన్న కుమార్ బెజవాడ అందించగా త్రినాధ రావు డైరెక్షన్ చేస్తున్నాడు.ధమాకాతో బ్లాక్‌బస్టర్ హిట్రాజేశ్ దండ నిర్మిస్తున్న ఈ మూవీకి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది. త్రినాధరావు విషయానికి వస్తే.. ఈయన ప్రియతమా నీవచ కుశలమా సినిమాతో దర్శకుడిగా మారారు. మేం వయసుకు వచ్చాం, నువ్వలా నేనిలా, సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా.. ఇలా పలు సినిమాలు తెరకెక్కించాడు. మూడేళ్ల గ్యాప్ తర్వాత మజాకా మూవీ చేస్తున్నాడు. Yesterday was an unfortunate slip of the tongue by Dir #NakkinaTrinadhRaoIt’s a wrong example to set & we should have been cautious to avoid itTrinadh garu & Team #Mazaka apologise for the poor choice of words to Anshu garu & to all Women out there,We are because of you ♥️ pic.twitter.com/KQvLSeBtJ1— Sundeep Kishan (@sundeepkishan) January 13, 2025 చదవండి: పవన్ సినిమా..ఆ హీరోయిన్ పాలిట శాపమైందా ? -
మన్మథుడు హీరోయిన్‌పై డైరెక్టర్ అసభ్యకర వ్యాఖ్యలు
సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మజాకా (Majaka Movie). రీతూ వర్మ, అన్షు హీరోయిన్లుగా నటించారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ అందించగా త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఆదివారం (జనవరి 12న) ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు త్రినాధరావు హీరోయిన్ అన్షుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.హీరోయిన్ ఓ రేంజ్లో..ముందుగా త్రినాధ రావు (Trinadha Rao) మాట్లాడుతూ.. నా చిన్నప్పుడు మన్మథుడు సినిమా చూసి.. హీరోయిన్ (అన్షు) ఏంటి.. లడ్డూలా ఉందనుకునేవాళ్లం. హీరోయిన్ను చూసేందుకే సినిమాకు వెళ్లిపోయేవాళ్లం. ఆ మూవీలో ఓ రేంజ్లో ఉంటుంది. ఆ హీరోయిన్ మజాకాలో హీరోయిన్గా కళ్ల ముందుకు వచ్చేసరికి ఇది నిజమేనా? అని ఆశ్చర్యపోయాం. నేనే చెప్పా..అన్షు కొంచెం సన్నబడింది. నేనే తనను లావు పెరగమని చెప్పా.. అంటూ ఇంకా ఏదేదో మాట్లాడాడు. అతడి మాటలకు హీరోయిన్ అసౌకర్యానికి లోనయినట్లు తెలుస్తోంది. హీరోయిన్ శరీరం గురించి డైరెక్టర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి.కావాలనే..ఇక ఇదే ఈవెంట్లో సెకండ్ హీరోయిన్ పేరు.. అంటూ కావాలనే రీతూ వర్మ పేరు మరిచిపోయినట్లు నాటకం ఆడాడు. కాస్త వాటర్ ఇవ్వమని కొంత గ్యాప్ తీసుకుని గుర్తొచ్చింది రీతూవర్మ అని ఆమె పేరు చెప్పాడు. ఇదంతా చూసిన జనాలు.. డైరెక్టర్ ఓవరాక్షన్ ఎక్కువైందని కామెంట్లు చేస్తున్నారు. ఇక మజాకా మూవీ విషయానికి వస్తే.. ఇది ఫిబ్రవరి 21న విడుదల కానుంది. చదవండి: పెళ్లికి ముందే ప్రియుడితో పూజ.. అబ్బాయి పేరెంట్స్ అయినా ముందే చెప్పాలిగా -
తెలుగులో వస్తోన్న బ్లాక్ బస్టర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్!
కవిన్, అపర్ణ దాస్, మోనిక చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ్, విటీవి గణేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం పా..పా. ఈ చిత్రాన్ని గణేశ్ కె బాబు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన దా..దా సినిమాను మూవీ నీరజ సమర్పణలో పాన్ ఇండియా మూవీస్, జెకె ఎంటర్టైన్మెంట్స్ ఎంఎస్. రెడ్డి తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను డైరెక్టర్ త్రినాధ రావు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా త్రినాధరావు మాట్లాడుతూ.. 'తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన దా..దా మూవీని తెలుగులో పా..పా..గా మన ముందుకు తీసుకొస్తున్నారు. డైరెక్టర్ గణేష్ కె బాబు ప్రతి సీను చాలా బాగా రాసుకున్నాడు.ఇది ఒక నాన్న కథ మాత్రమే కాదు.. ఒక స్నేహితుడు కథ ఒక ఒక అమ్మ కథ ఒక లవర్ కథ. ఈ సినిమా నేను చూశాను కాబట్టి అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. ఈ సినిమాను ప్రేక్షకులు సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా'అని అన్నారు. నిర్మాత ఎంఎస్ రెడ్డి మాట్లాడుతూ.. 'డైరెక్టర్ త్రినాధరావుకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. గతంలో సాహసం చేయరా డింభక అనే మూవీతో మీ ముందుకు వచ్చాం. ఇప్పుడు ఈ పా..పా.. సినిమాతో వస్తున్నాం. ఈ దా..దా.. సినిమాని 50 రోజుల తర్వాత థియేటర్లో చూశాను. ఒక మంచి సినిమా చూశానని అనిపించింది. చెప్పగానే నా యూఎస్ ఫ్రెండ్స్ కూడా రియాక్ట్ అయ్యి తెలుగులో తీసుకొద్దామన్నారు. అతి త్వరలో ఈ సినిమాని మీ ముందుకు తీసుకు వస్తున్నాము. ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు. -
పల్లెటూరి వినోదం
తెలంగాణ నేపథ్యంలో రూపొందిన పల్లె కథా చిత్రం ‘తురుమ్ ఖాన్లు’. శివ కల్యాణ్ దర్శకత్వంలో ఎండీ ఆసిఫ్ జానీ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలోని ‘రంగు రంగుల చిలక...’ అంటూ సాగే తొలి పాటను దర్శకుడు త్రినాథరావు నక్కిన విడుదల చేశారు. ‘‘పల్లెటూరి పగ, ప్రతీకారాలతో వినోదాత్మకంగా, మహబూబ్ నగర్ స్లాంగ్‌లో రూపొందిన చిత్రం ఇది’’ అని యూనిట్ తెలిపింది. నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, అఖిలేష్ గోగు, రియాన్. ∙ఆసిఫ్ జానీ, నక్కిన త్రినాథరావు, శ్రీరామ్ -
ఆ రైటర్స్ లేకుండా హిట్టు కొట్టలేరా? సక్సెస్ ఫార్మాలా మిస్ అవుతుందా?
డైరెక్టర్స్ విజయం వెనుక వారి టాలెంట్ ఎంత వుంటుందో..అంతకు మించి రైటర్స్ సపోర్ట్ వుంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో రైటింగ్ తెలిసిన డైరెక్టర్స్ తక్కువ మంది ఉంటారు. అందుకే డైరెక్టర్స్ చాలా మంది.... స్టోరీతో పాటు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాయగల మంచి రైటర్స్ ను తమ టీమ్ లో వుండేలా ప్లాన్ చేసుకుంటారు. రైటర్ ప్లస్ డైరెక్టర్ కాంబినేషన్ వర్కౌవుట్ అయితే హిట్ సినిమా గ్యారెంటీ. అలా సక్సెస్ అందుకున్న డైరెక్టర్స్ చాలా మంది వున్నారు. వీరిలో ధమాకా మూవీతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ నక్కిన త్రినాథ్ రావు కూడా ఉన్నాడు. అందుకే ఏ డైరెక్టర్ తనకి సెట్ అయిన రైటర్‌ను మిస్ చేసుకోవాలనుకోడు..రైటర్ మారితే ఆ డైరెక్టర్ తనని తాను మళ్లీ ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.సేమ్ స్టిట్యూవేషన్ లో వున్న డైరెక్టర్ నక్కిన త్రినాధ్ రావు ఇప్పుడు సోలోగా సినిమా చేయబోతూ ..తన అదృష్టాన్ని చెక్ చేసుకోబోతున్నాడు. టాలీవుడ్ లో చాలా మంది డైరెక్టర్స్ రైటర్స్‌తో పాటు సక్సెస్ కూడా మిస్ చేసుకున్నారు. ఎందుకంటే టాలీవుడ్లో రైటర్స్ డిమాండ్ పెరిగిపోయింది. ఒకప్పుడు హీరోలందరూ కథల విషయంలో డైరెక్టర్స్ పై ఆధారపడే వారు. ఇప్పుడు హీరోలు రూట్ మార్చారు. రైటర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో స్క్రిప్ట్, స్క్రిన్ ప్లే డిస్కషన్స్ లో హీరోల జోక్యం పెద్ద గా వుండేది కాదు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. హీరోలు స్టోరీ తో పాటు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే పై కూడా చాలా ఫోకస్ పెడుతున్నారు. అందుకే రైటర్స్ కి డిమాండ్ పెరిగిపోయింది. స్టోరీ ఫిక్స్ అయిన తర్వాతే హీరోలు డైరెక్టర్ గురించి ఆలోచిస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టిన దర్శకులు ..ఇప్పుడు సరైన రైటర్స్ లేక ఫెయిల్ అవుతున్నారు. గతంలో డైరెక్టర్ విజయ్ భాస్కర్ వెనుక త్రివిక్రమ్ రైటర్‌గా ఉండేవాడు. త్రివిక్రమ్ రైటర్ నుంచి డైరెక్టర్‌గా టర్న్ తీసుకున్న తర్వాత విజయ్ భాస్కర్ డైరెక్టర్‌గా ఒక హిట్ కూడా అందించలేకపోయాడు. ఇక డైరెక్టర్ శ్రీను వైట్ల..రైటర్స్ కోన వెంకట్, గోపి మోహన్ తో కలిసి ఉన్నంత కాలం హిట్ సినిమాలు తీశాడు. వారితో విడిపోయిన తర్వాత శ్రీనువైట్ల సక్సెస్ రేట్ దారుణంగా పడిపోయింది. అలాగే దేశం గర్వించదగ్గ దర్శకుల్లో శంకర్ ఒకరు. శంకర్ టీమ్ లో సూజాత రంగరాజన్ అనే గొప్ప రైటర్ ఉండేవాడు. ఆయన రోబో సినిమా సమయంలో చనిపోయారు. ఆ తర్వాత శంకర్ సినిమా కథల్లో బలం తగ్గిపోయిందనే మాట వినిపిస్తుంది. అలాగే డైరెక్టర్ త్రినాథరావు నక్కిన, రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ కాంబోలో వచ్చిన సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా లాంటి సినిమాలు విజయం సాధించాయి. అయితే ఇప్పుడు బెజవాడ ప్రసన్న కుమార్ రైటర్ నుంచి డైరెక్టర్‌గా టర్న్ తీసుకున్నాడు. కింగ్ నాగార్జున ప్రసన్న కుమార్ కి డైరెక్టర్ గా తన మూవీ తెరకెక్కించే ఛాన్స్ ఇచ్చాడు. దీంతో త్రినాధరావు నక్కిన ఇప్పుడు సోలోగా సినిమా చేయాల్సి వస్తోంది. ధమాకా హిట్ తర్వాత ఐరా క్రియేషన్స్‌లో ఓ కొత్త సినిమా చేయబోతున్నాడు. మరి ఇన్నాళ్లు కలిసి వర్క్ చేసిన రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ లేకుండా నక్కిన త్రినాధరావు ఈ సినిమా తో సక్సెస్ అందుకుంటాడో లేదా చూడాలి. -
ఇలాంటి కంగ్రాట్స్ ఇంకా వినాలి
‘‘ధమాకా’ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవడం చాలా ఆనందంగా ఉంది. మా సినిమాని బాగా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని హీరో రవితేజ అన్నారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ధమాకా’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ–అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 23న రిలీజై, వంద కోట్ల క్లబ్లో చేరింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ‘ధమాకా 101 కోట్ల మాసివ్ సెలబ్రేషన్’ని నిర్వహించింది. ఈ వేడుకలో మేకర్స్, మీడియా ప్రతినిధుల చేతుల మీదుగా చిత్ర యూనిట్‌కు మొమెంటోలు అందించారు. అనంతరం రవితేజ మాట్లాడుతూ– ‘‘విశ్వప్రసాద్‌గారు, వివేక్ కూచిభొట్లగారికి బిగ్ కంగ్రాట్స్. అలాగే త్రినాథరావు, రచయిత ప్రసన్న, శ్రీలీలకి అభినందనలు.. ఇలాంటి కంగ్రాట్స్ ఇంకా వింటూనే ఉండాలి. సంగీత దర్శకుడు భీమ్స్ ఇలాగే ఇరగదీసేయాలి’’ అన్నారు. ‘‘ధమాకా’ కథకు ఓంకారం చుట్టిన ప్రసన్నకి, ఆయనకి సపోర్ట్‌గా నిలబడిన మరో రచయిత సాయి కృష్ణకి థ్యాంక్స్. ఈ కథని తొలుత విని ఓకే చేసిన వివేక్‌గారికి కృతజ్ఞతలు. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన రవితేజ, శ్రీలీలకి «థ్యాంక్స్’’ అన్నారు త్రినాథరావు నక్కిన. ‘‘ధమాకా’ని బ్లాక్ బస్టర్ చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్స్’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్, సహనిర్మాత వివేక్ కూచిభొట్ల. ‘‘నా కెరీర్ బిగినింగ్‌లో రవితేజగారు నాకు బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు’’ అన్నారు శ్రీ లీల. -
పండగ మీద పండగ చేసుకోవాలి
‘‘పండగ చేసుకుని రెండేళ్లయింది. మళ్లీ ఇప్పుడు పండగ (‘ధమాకా’ హిట్‌ని ఉద్దేశిస్తూ...). ఇకపై పండక్కి గ్యాప్ ఇవ్వొద్దు. పండగ మీద పండగ చేసుకోవాలి. మీ స΄ోర్ట్ (అభిమానులు, ప్రేక్షకులు) ఇలానే కొనసాగాలి’’ అని రవితేజ అన్నారు. రవితేజ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ధమాకా’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాలో జరిగిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో రవితేజ మాట్లాడుతూ– ‘‘ధమాకా’ సినిమాకు దర్శకుడు త్రినాథరావు డ్రైవర్ అయితే.. నేను కండక్టర్ని (నవ్వుతూ..). ఈ సినిమా సక్సెస్‌కి కారణమైన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘ధమాకా’ విజయం సమిష్టి కృషి’’ అన్నారు నక్కిన త్రినాథరావు. ‘‘రవితేజగారితో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాం’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. ‘‘ధమాకా’ విజయానికి ప్రధాన కారణం రవితేజ అన్న, ఆయన అభిమానులు’’ అన్నారు ఈ చిత్ర కథా రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ. ఈ కార్యక్రమంలో కె. రాఘవేంద్రరావు, హరీష్ శంకర్, బండ్ల గణేష్, తేజా సజ్జా ΄ాల్గొని ‘ధమాకా’ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. -
‘ధమాకా’ ట్విటర్ రివ్యూ
మాస్ మహారాజా రవి తేజ డబల్ రోల్ పోషించిన తాజా చిత్రం ధమాకా. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు(డిసెంబర్ 23)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘ధమాకా’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. First half chala.. intresting ga undi mana Vintage Ravi Anna ni malla Chudabotunamu.. Interval Scenes are also Good #Dhamaka@RaviTeja_offl @sreeleela14 @peoplemediafcy @TrinadharaoNak1 @VishwaPrasadtg @vivekkuchibotla — praveen kumar (@emmadipraveenk1) December 23, 2022 ఫస్టాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వింటేజ్ రవితేజను మరోసారి చూడబోతున్నాం. ఇంటర్వెల్ సీన్ కూడా బాగుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘పక్కా మాస్ కామెడీ ఎంటర్టైనర్. మంచి సినిమా. రవితేజ యాక్టింగ్ బాగుంది’అని ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. Pakka mass comedy entertainer Manchi cinema @RaviTeja_offl Anna ❤️🔥 Acting good #Dhamaka — Parveesh (@Parvesh7781) December 23, 2022 #Dhamaka 1st half: Story and screenplay is Flat but engages with comedy,songs,Few Hilarious moments and Interval🔥 Good 1st half @RaviTeja_offl energy levels🔥🔥#DhamakaReview #DhamakaDay — tolly_wood_UK_Europe (@tollywood_UK_EU) December 23, 2022 #Dhamaka 2nd half: same old flat screenplay With majority comedy scenes, Good songs and Action parts, climax is good👍🏻 Small surprise for Fans🔥 Good 2nd half Overall: A @TrinadharaoNak1 Commercial movie👍🏻#DhamakaReview #DhamakaFromDec23 #Dhamakafromtoday — tolly_wood_UK_Europe (@tollywood_UK_EU) December 23, 2022 first half is super , last 20 minutes Adirpoyindhi 💥💥 @RaviTeja_offl @sreeleela14 @peoplemediafcy @TrinadharaoNak1 @vivekkuchibotla #Dhamaka — ALLU VIJAY (@Bunnyvijju32) December 23, 2022 ధమాకా ఓవరాల్‌గా రొటీన్ , అవుట్‌డేటెడ్ మూవీ. సినిమాలో కొన్ని వినోదాత్మక సన్నివేశాలు అలరిస్తాయి. సంగీతం బాగుంది. కానీ మిగిలినవి చాలా ఫ్లాట్‌గా పడిపోతాయి . పదేళ్లకు పైగా నాటి సినిమాని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #Dhamaka Overall a Routine and Outdated Movie that does not entertain for the most part! The movie had a few entertaining scenes and music is decent but the rest falls very flat and gets irritating. It feels like we are watching a movie more than a decade old. Rating: 2.25/5 — Venky Reviews (@venkyreviews) December 23, 2022 Raviteja Anna Kii Hit Padithee ILLA untadaaa 😮❤️🔥🤩 Twitter Motham @RaviTeja_offl Anna Unaduu...#DhamakaDay #Dhamaka #BlockBusterDhamaka Kotesam Rtfs Navokodiii..🔥💯 — Blockbuster Dhamaka...💥 (@CherukuriRaju3) December 23, 2022 Director @TrinadharaoNak1 chala gap tisukoni oka manchi story icharu Ravi anna ni 🔥#Dhamaka — yAshwAnth™ 2.0 (@chittibabu1111) December 23, 2022 -
అందుకే ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్సులు ఇస్తాను : రవితేజ
‘‘కొంతమంది లైఫ్‌లో బోర్ కొడుతుందని అంటుంటారు. కానీ ‘బోర్’ అనే వర్డ్ నా డిక్షనరీలోనే లేదు. షూటింగ్ అంటే నాకు పండగ. జీవితంలోని ప్రతి మూమెంట్‌ని ఎంజాయ్ చేస్తాను. డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, నెగిటివిటీ వల్ల మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. త్వరగా ముసలివాళ్లం కూడా అయిపోతున్నాం. అందుకే వాటి తాలూకు ఆలోచనలను మనసుల్లో నుంచి తీసేస్తే హ్యాపీగా ఉంటాం’’అని హీరో రవితేజ అన్నారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన చిత్రం ‘ధమాకా’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో రవితేజ చెప్పిన విశేషాలు. ► ‘ధమాకా’ గురించి క్లుప్తంగా... ‘రాజా ది గ్రేట్’ తర్వాత నేను చేసిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ మూవీ ఇది. నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్. ► చిరంజీవి ‘రౌడీ అల్లుడు’ సినిమాతో కొందరు ‘ధమాకా’కు పోలిక పెడుతున్నారు... మా రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ ఈ మాట అన్నారు. తెలుగులో మంచి ఎంటర్టైనింగ్ చిత్రాలు చిరంజీవిగారితోనే మొదలయ్యాయి. మేం ఫాలో అవుతున్నాం. ‘ధమాకా’ కూడా ‘రౌడీ అల్లుడు’లాంటి ఎంటర్టైనింగ్ ఫిల్మే. ► త్రినాథరావుతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్... త్రినాథరావుతో పని చేయడం సరదాగా ఉంటుంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఎక్కువగా మాట్లాడడు కానీ ఈ సినిమాకు అతని మ్యూజిక్ సౌండ్ అదిరిపోయింది. బెజవాడ ప్రసన్నకుమార్ డైలాగ్స్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు. అదే విధంగా నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ పాజిటివ్ పీపుల్. ఇలాంటి వారికి సక్సెస్ వస్తే మరింత మందికి ఉపాధి దొరుకుతుంది. ► రీసెంట్గా జరిగిన మీ ఫ్యాన్స్ మీట్ విశేషాలు.. అభిమానులను కలవడం అనేది నాకే కాదు..అందరి హీరోలకూ జరుగుతుంటుంది. ఆ మూమెంట్స్‌ను బాగా ఎంజాయ్ చేశాను. ఈ పాజిటివ్నెస్ ముందుకు నడిపిస్తుంటుంది. ► రవితేజ అంటే ఎంటర్టైన్మెంట్. కానీ ఇటీవల సీరియస్ సినిమాలు కూడా చేశారు కదా.. యాక్టర్‌గా డిఫరెంట్ జానర్ సినిమాలను ప్రయత్నించాలి. ఫలితం ఎలా ఉన్నా ప్రయత్నాలను ఆపకూడదు. ► ఇటీవల కొత్త రచయితలు, దర్శకులతో ఎక్కువ సినిమాలు చేస్తున్నట్లున్నారు... ఎప్పట్నుంచో కొత్త రచయితలు, దర్శకులతో చేస్తున్నాను. వారితో పని చేయడం ఇష్టం. ఎందుకంటే కొత్తవారిలో నిరూపించుకోవాలనే కసి, తపన, ఉత్సుకత ఉంటాయి. ఒకప్పుడు నేనూ కొత్తవాడిలా వచ్చినవాడినే. అలాగే ఒకసారి కథ లాకయ్యాక నా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఓన్లీ ఇంప్రొవైజేషన్సే. ► కరోనా తర్వాత సినిమాల పట్ల ప్రేక్షకుల ధోరణి మారిపోయినట్లు అనిపిస్తోంది... కొంత ప్రభావం అయితే ఉండొచ్చు. కానీ పూర్తిగా కాదు. కరోనా తర్వాత సోషల్ డ్రామా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికిప్పుడు కొత్త కథలేం పుట్టవు. కానీ కథను ఎంత కొత్తగా చూపిస్తున్నామనే దాన్నిబట్టే సినిమాలు ఆడతాయి. నా ప్రతి సిని మాను నేను ఒకేలా ట్రీట్ చేస్తాను. అయితే ఒకసారి ఆడియన్స్ కనెక్ట్ అయితే, మరోసారి కనెక్ట్ కారు. ► ఫ్లాప్ ఇచ్చిన దర్శకులనూ ప్రోత్సహిస్తున్నారు... ఓ మనిషి టాలెంట్ ఒక ఫ్లాప్‌ను బట్టి తగ్గిపోయి, ఓ హిట్‌ని బట్టి పెరిగిపోయి.. ఆ లెక్క కరెక్ట్ కాదు. నా లెక్క కూడా ఇది కాదు. ఓ దర్శకుడు ఓసారి అనుకున్నది క్లిక్ అవుతుంది మరోసారి కాదు. సినిమా సక్సెస్ అవ్వలేదు కదా అని దర్శకుడి సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. హిట్స్ ఉన్నట్లే ఫ్లాప్‌లూ ఉంటాయి. ఇది ప్రతి డిపార్ట్మెంట్కు వర్తిస్తుంది. ► కథల ఎంపికలో మీ ధోరణి ఎలా ఉంటుంది? ఇదివరకు చాలా స్పీడ్‌గా ఉండేవాడిని. ఇప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటున్నాను. కథ నచ్చకపోతే సినిమా చేయను. డైరెక్టర్ కోసం, కాంబినేషన్ కోసం నేను సినిమాలు చేయను. ► పెరిగిపోతున్న ఓటీటీ కల్చర్ గురించి... ఓటీటీ కంటెంట్ వేరు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే కంటెంట్ వేరు. ఓటీటీలో సూపర్ కంటెంట్, పెర్ఫార్మెన్సెస్ను చూశాను. కానీ నేను దానికి ప్రభావితం కాలేదు. అక్కడ ఆల్రెడీ ఉన్నది ఇక్కడ చేయను. ► హీరోగా మీ అబ్బాయి లాంచ్ ఎప్పుడు? మా అబ్బాయి చదువుకుంటున్నాడు. ప్రస్తుతం ఆలోచన లేదు. ఇంకా చాలా టైమ్ ఉంది. ► చాలా గ్యాప్ తర్వాత చిరంజీవితో కలిసి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నటించారు... చిరంజీవిగారంటే నాకు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ కథ, నా పాత్ర నచ్చాయి. ఈ సినిమా చేయడానికి దర్శకుడు బాబీ కూడా ఓ కారణం కావొచ్చు. ఇక చిరంజీవిగారితో సినిమా చేయడం కచ్చితంగా మంచి ఎక్స్‌పీరియన్సే. ► పాన్ ఇండియా గురించి ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.. మీ అభిప్రాయం.. ప్రతి సినిమా పాన్ ఇండియా అవ్వదు. కథ కుదరాలి. నేను పాన్ ఇండియా ఫిల్మ్‌గా ‘టైగర్ నాగేశ్వరరావు’ చేస్తున్నాను. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది కాబట్టి అన్ని రకాల ఆడియన్స్‌కు ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను. ► మెడిటేషన్‌లాంటివి చేస్తుంటారా? నేనెప్పుడూ మెడిటేషన్ లోనే ఉంటాను. నాకు సినిమాలు తప్ప ఏమీ తెలియదు. దేన్నీ సీరియస్‌గా తీసుకోను. జీవితంలో రిగ్రెట్స్ లేవు. స్టార్ అనే ప్రెజర్‌ను తీసుకోను. భవిష్యత్ గురించి ప్లాన్ చేయను. ఓ ఫ్లోలో వెళ్లిపోతుంటాను. ► మీ తర్వాతి చిత్రాలు... ‘రావణాసుర’ షూటింగ్ 80 శాతం పూర్తయింది. ‘ఈగిల్’ సినిమా గురించి ఇప్పుడేం చెప్పలేను. -
పాత రవితేజగారిని చూస్తారు
‘‘రవితేజగారు ఎనర్జిటిక్ హీరో. నా దర్శకత్వంలో వచ్చిన ‘నేను లోకల్’, ‘సినిమా చూపిస్త మావ’, ‘హలో గురు ప్రేమకోసమే’, ‘మేం వయసుకు వచ్చాం’ సినిమాలూ ఎనర్జిటిక్‌గా ఉంటాయి. రవితేజగారి ఎనర్జీ, నా సినిమాల్లో ఉండే ఎనర్జీ... ఈ రెండూ కలిస్తే ఎలా ఉంటుందనే క్యూరీయాసిటీ ప్రేక్షకుల్లో వచ్చింది. ఈ సినిమాకు ‘డబుల్ ఇంపాక్ట్’ అనే క్యాప్షన్ పెట్టడానికి ఓ కారణం ఇదే’’ అన్నారు దర్శకుడు త్రినాథరావు నక్కిన. రవితేజ ద్విపాత్రాభినయం చేసిన తాజా సినిమా ‘ధమాకా: డబుల్ ఇంపాక్ట్’. ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటించారు. బెజవాడ ప్రసన్నకుమార్ కథ అందించిన ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ– ‘‘నాకు ఇష్టమైన హీరోల్లో ఒకరైన రవితేజగారితో సినిమా చేయాలనే కల ‘ధమాకా’తో నేరవేరింది. ఆయనతో సినిమా చేసే చాన్స్ రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. రవితేజగారితో సినిమా అంటే ప్రయోగాలు చేయాలనుకోను. ఈ విషయమే రవితేజగారికీ చెప్పాను. పాత రవితేజను ప్రేక్షకులు ఎక్కడో మిస్ అయ్యారు. మళ్లీ ఆ రవితేజను ఈ సినిమాలో చూస్తారు. ఇందులో స్వామిగా, ఆనంద్ చక్రవర్తిగా ఆయన రెండు పాత్రలు చేశారు. అయితే హీరోయిన్ ఒక్కరే. ఈ ఇద్దరిలో హీరోయిన్ ఫైనల్‌గా ఎవర్ని ఇష్టపడుతుందనేది సిల్వర్ స్క్రీన్ పైనే చూడాలి. శ్రీ లీల ఎనర్జిటిక్ అండ్ ట్యాలెంటడ్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు.. మంచి డ్యాన్సర్ కూడా. ఈ సినిమాకు సొంతంగా డబ్బింగ్ చెప్పింది. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడతో నాకు ‘సినిమా చూపిస్త్త మావ’ నుంచే జర్నీ ఉంది. ‘ధమాకా’కి మంచి ఇచ్చారు. త్వరలో ఆయన మంచి దర్శకుడు కాబోతున్నారు. భీమ్స్ అందించిన పాటలతో ‘ధమాకా’ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. విశ్వప్రసాద్, వివేక్గార్లు కంఫర్టబుల్ నిర్మాతలు. నా నెక్ట్స్ మూవీస్‌ని మైత్రీ మూవీ మేకర్స్, ‘దిల్’ రాజు, కృష్ణగార్ల సంస్థల్లో చేయాల్సి ఉంది’’ అన్నారు. -
‘డర్టీ ఫెలో’ని ఆదరించండి
శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2019 శిమ్రితీ బతీజా, నిక్కిషా రంగ్ వాల హిరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రానికి డర్టీ ఫెలో అనే టైటిల్‌ను ఖరారు చేసింది చిత్ర యూనిట్. రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఆడారి మూర్తి సాయి డైరెక్షన్ లో, జీ ఎస్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్ అనౌన్స్మెంట్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా కార్యక్రమంలో దర్శకుడు నక్కిన త్రినాథ్ రావు మాట్లాడుతూ.. మోషన్ పోస్టర్ బాగుంది . డర్టి ఫెలో టైటిల్ ఈ కథ కీ యాప్ట్ అయ్యేలా ఉంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ‘ఒక తండ్రి తన కొడుకుని సరైన మార్గంలో పెట్టకపోతే ఆ కొడుకు విచ్చల విడిగా పెరిగి, సమాజానికి హానికరంగా మారితే... ఆ తండ్రి తీసుకొనే నిర్ణయం ఏమిటి? అనేదే ఈ సినిమా కథాంశం అని హీరో శాంతి చంద్ర అన్నారు. ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని దర్శకుడు ఆడారి మూర్తి అన్నారు. ‘మంచి కథ కథనంతో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందాలని కోరుకుంటున్నాను’అని దర్శకుడు వీరశంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ డాక్టర్ సతీష్, హీరోయిన్ శిమ్రితీ బతీజా తదితరులు పాల్గొన్నారు. -
RT 69: 69వ సినిమాను అనౌన్స్ చేసిన రవితేజ
Ravi Teja, Trinadha Rao’s Film Announced Officially: ఈ ఏడాది క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో ఆయన ‘ఖిలాడీ’చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు డైరెక్టర్ శరత్ మందవాతో‘రామారావు ఆన్ డ్యూటీ’అనే సినిమాలో నటిస్తున్నాడు.తాజాగా త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం అక్టోబర్ 4న నుంచి సెట్స్ పైకి వెళ్లబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. రవితేజ కెరీర్లో 69వ చిత్రంగా ఈ సినిమా రూపొందుతుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నారు. వివేక్ కూబిబొట్ట సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు. కార్తిక్ ఘట్టమనేని సంగీతం అందించనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్, ఇతర నటీనటులు సహా మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. The action begins😎 #RT69 pic.twitter.com/v3S1SoyLQn — Ravi Teja (@RaviTeja_offl) October 2, 2021 -
రవితేజ @ 68
రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శ కత్వంలో ఓ సినిమా ఉండొ చ్చనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్త నిజమేనంటూ ఆదివారం చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. రవితేజకి ఇది 68వ సినిమా. ప్రసన్నకుమార్ బెజవాడ కథ–స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ చిత్రంలోని ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తారు. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే త్రినాథరావుతో చేసే సినిమా ఆరంభమవుతుంది. -
పాగల్ ప్రారంభం
‘హిట్’ వంటి హిట్ చిత్రం తర్వాత విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పాగల్’. ఈ చిత్రం ద్వారా నరేష్ కుప్పిలి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. విశ్వక్సేన్పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత పి. కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా హీరో రానా దగ్గుబాటి క్లాప్ ఇచ్చారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత ‘దిల్’ రాజు స్క్రిప్ట్‌ని సినిమా యూనిట్‌కు అందజేశారు. బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘విశ్వక్‌తో ‘పాగల్’ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఒక క్రేజీ సబ్జెక్టుతో ఈ చిత్రం తీస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులు చక్కబడ్డాక షెడ్యూళ్లను ప్లాన్ చేస్తాం. నరేష్ లాంటి ప్రతిభావంతుడిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘నరేష్ చెప్పిన స్క్రిప్ట్ ఎగ్జయిటింగ్‌గా అనిపించడంతో ‘పాగల్’ చిత్రాన్ని అంగీకరించా. సరికొత్త జానర్లో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు విశ్వక్సేన్. ‘‘టైటిల్‌ని బట్టి ఇది యాక్షన్ సినిమానా? అని అడుగుతున్నారు. లవ్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుంది. ఒక మంచి సినిమా చూశామనే తృప్తి ప్రేక్షకులకు కలుగుతుంది’’ అన్నారు నరేష్ కుప్పిలి. సంగీత దర్శకుడు రథన్, కెమెరామేన్ మణికంద¯Œ , ఎడిటర్ గ్యారీ, ప్రొడక్షన్ డిజైనర్ లతా తరుణ్ తదితరులు మాట్లాడారు. -
నవంబర్ నుంచి షురూ
ప్రస్తుతం ‘వెంకీ మామ’ సినిమాలో సందడి సందడి చేస్తున్నారు వెంకటేశ్. ఈ సినిమా దాదాపు పూర్తి కావొస్తోంది. ‘వెంకీ మామ’ తర్వాత వెంకీ ఏం చేయబోతున్నారు? అంటే.. ‘సినిమా చూపిస్త మామ’ ఫేమ్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారని తెలిసింది. ఈ సినిమాను నవంబర్‌లో సెట్స్ మీదకు తీసుకెళ్తారని సమాచారం. నాన్‌స్టాప్ సింగిల్ షెడ్యూల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నారు. వెంకటేశ్ ప్రస్తుతం చేస్తున్న ‘వెంకీ మామ’ అక్టోబర్ నెలలో రిలీజ్ కానుంది. ఇందులో వెంకటేశ్, నాగచైతన్య మామా అల్లుళ్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. -
నగరంలో ‘హలో గురు ప్రేమ కోసమే’ టీం సందడి
-
క్లైమాక్స్‌లో లవ్
ప్రేమని గెలిపించుకునే విషయంలో లాస్ట్ స్టెప్‌లోకి వచ్చేశారట హీరో రామ్. తన ప్రేమకి ఏర్పడ్డ అడ్డంకుల్ని కష్టపడి తొలగించుకుంటున్నారట. ఇదంతా ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమా కోసమే. రామ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ పార్ట్‌ను కాకినాడలో చిత్రీకరిస్తున్నారు. రామ్‌పై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమాను ఈ సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చే స్తున్నారు. -
రామ్ ‘హలో గురు ప్రేమ కోసమే’ ప్రారంభమైంది
-
రామ్ కొత్త సినిమా అప్డేట్
ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో మరో విజయాన్ని అందుకున్న యంగ్ హీరో రామ్, తన తదుపరి చిత్రాన్ని కొద్ది రోజుల క్రితం ప్రారంభించాడు. గత చిత్రం విజయం సాధించినా.. ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వకపోవటంతో తదుపరి చిత్రం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుకున్నాడు. సినిమా చూపిస్త మామ, నేను లోకల్ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తదుపరి చిత్రాన్ని చేస్తున్నాడు రామ్. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నాడు. ప్రకాజ్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. ప్రసన్నకుమార్ కథ అందిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2018 ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది.