
Ravi Teja, Trinadha Rao’s Film Announced Officially: ఈ ఏడాది క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో ఆయన ‘ఖిలాడీ’చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు డైరెక్టర్ శరత్ మందవాతో‘రామారావు ఆన్ డ్యూటీ’అనే సినిమాలో నటిస్తున్నాడు.తాజాగా త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం అక్టోబర్ 4న నుంచి సెట్స్ పైకి వెళ్లబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
రవితేజ కెరీర్‌లో 69వ చిత్రంగా ఈ సినిమా రూపొందుతుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నారు. వివేక్ కూబిబొట్ట సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు. కార్తిక్ ఘట్టమనేని సంగీతం అందించనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్, ఇతర నటీనటులు సహా మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
The action begins😎 #RT69 pic.twitter.com/v3S1SoyLQn
— Ravi Teja (@RaviTeja_offl) October 2, 2021