
టాలీవుడ్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు ఇటీవల మజాకా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద మజాకా దూసుకెళ్తోంది. ఇటీవల మజాకా మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా మజాకా సినిమాను నవ్వుతూ ఎంజాయ్ చేయాలని డైరెక్టర్ త్రినాథరావు ఆడియన్స్‌కు సూచించారు.
(ఇది చదవండి: సినిమా చూసిన దిల్ రాజు ఆ ఒక్క మాట అన్నారు: మజాకా డైరెక్టర్)
అయితే ఒక పక్కా మజాకా సక్సెస్ ఎంజాయ్ చేస్తూనే మరో సినిమా పనిలో నిమగ్నమయ్యారు దర్శకుడు త్రినాథరావు. అప్పుడే మరో యంగ్ హీరోతో సినిమా చేసేందుకు రెడీ అయిపోయారు. టాలీవుడ్‌లో పలు సూపర్ హిట్స్ కొట్టిన డైరెక్టర్ యువ హీరో హవీశ్ కోనేరుతో జతకట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే రివీల్ చేయనున్నారు. ప్రతిభావంతులైన యువ హీరోలను ప్రోత్సహిస్తూ తనదైన స్టైల్లో ముందుకెళ్తున్నారు. తెలుగులో సినిమా చూపిస్తావా మావా, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా లాంటి సినిమాలతో సూపర్‌హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు త్రినాథరావు. కాగా.. కోనేరు నువ్విలా, జీనియస్, సెవెన్ లాంటి సినిమాలతో యంగ్ హీరో హవీశ్ గుర్తింపు తెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment