Havish
-
హీరో? విలన్?.. నచ్చితే ఏ పాత్రైనా ఓకే!
"ఇండస్ట్రీలోకి రాకముందు సినిమాల్లో నటించాలనుకునేవాణ్ణి. అంతేకాని హీరోనా? విలన్‌గానా? అని ఆలోచించలేదు. ఇప్పుడూ అంతే.. కథ నచ్చితే ఏ పాత్రైనా చేస్తా" అన్నారు హీరో హవీష్. నువ్విలా, జీనియస్, రామ్‌లీలా, 7 వంటి చిత్రాల్లో నటించిన హవీష్ పుట్టినోజు నేడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "2011లో నువ్విలా చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాను. ఈ పదేళ్లలో నాలుగు సినిమాలు చేశాను. ఓ సినిమా విడుదలయ్యాక మరో సినిమా చేయడంతో ఇంత గ్యాప్ వచ్చింది" "రాక్షసుడు నిర్మిస్తున్నప్పుడు సినిమా సినిమాకీ గ్యాప్ ఇవ్వకూడదనే విషయం అర్థమైంది. ఇకపై గ్యాప్ రానివ్వకుండా సినిమాలు చేస్తాను. నేను హీరోగా దాసరి కిరణ్ కుమార్ నిర్మించనున్న సినిమా ఆగస్టులో మొదలవుతుంది. మరో సినిమా కూడా చేయనున్నాను. రవితేజ హీరోగా నేను నిర్మిస్తున్న ఖిలాడీ సినిమా 20 రోజులు షూటింగ్ మిగిలి ఉంది" అన్నారు. చదవండి: వాళ్లు నన్ను మోసం చేశారు: నటి షబానా అజ్మీ -
కొత్త కాంబినేషన్
హీరోలకు కెరీర్ స్టార్టింగ్ స్టేజ్‌లో కమర్షియల్ సక్సెస్ అవసరం. వాటిని అందించడంలో దర్శకుడు లింగుస్వామి మాస్టర్ అనుకోవచ్చు. విశాల్‌ను ‘పందెంకోడి’, కార్తీని ‘ఆవారా’తో అటు తమిళం, ఇటు తెలుగు భాషల్లో మంచి బ్రేక్‌ని అందించారు లింగుస్వామి. ఇప్పుడు హవీష్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమాకు దర్శకత్వం వహించనున్నారాయన. ఈ సినిమా ఆగస్ట్‌లో ప్రారంభం కానుంది. ఇదో మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుందని సమాచారం. సినిమాకు పని చేయనున్న మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. విశాల్, కార్తీ తమ కెరీర్లో మంచి మాస్ హీరోలుగా నిలబడే సినిమాలను ఇచ్చినట్లే హవీష్‌కు మంచి బ్రేక్‌ని అందించి లింగుస్వామి తన మ్యాజిక్ రిపీట్ చేస్తారా? చూడాలి. -
లింగుస్వామి దర్శకత్వంలో ‘సెవెన్’హీరో
యువ కథానాయకుడు హవీశ్ తమిళ స్టార్ట్ డైరెక్టర్స్‌లో ఒకరైన లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేయబోతున్నారు. ఆగస్టు నుంచి ఈ సినిమా షూటింగ్ రెండు భాషల్లో సమాంతరంగా రూపొందనుంది. రన్, పందెంకోడి వంటి చిత్రాలతో కమర్షియల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న లింగుస్వామి, స్టాఫ్ ఇమేజ్ ఉన్న హవీశ్ కాంబినేషన్లో సినిమా రూపొందడం అందరిలో ఆసక్తిని పెంచుతుంది. త్వరలోనే సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను ప్రకటిస్తామని చిత్ర బృందం తెలియజేసింది. నువ్విలా, రామ్ లీలా, జీనియస్ చిత్రాలతో అలరించిన హవీశ్ తాజాగా ‘సెవెన్’చిత్రంతో అలరించాడు. ఓ వైపు హీరోగా నటిస్తూనే నిర్మాతగానూ రాణిస్తున్నాడు. ఇక తమిళ క్రేజీ డైరెక్టర్ లింగుస్వామి తెలుగులో రూపొందిన `తఢాఖా` సినిమాను తమిళంలో రూపొందించారు. అలాగే ఈయన రూపొందించిన `సండైకోళి` తెలుగులో `పందెంకోడి`గా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. గత ఏడాది `పందెంకోడి `2 కూడా విడుదలైంది. అయితే ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా ఉంటుందని అందరూ భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా హవీశ్‌తో సినిమాను పట్టాలెక్కించేందుకు లింగుస్వామి సిద్దమయ్యారు. -
7(సెవెన్) మూవీ రివ్యూ
టైటిల్ : 7 (సెవెన్) జానర్ : థ్రిల్లర్ తారాగణం : హవీష్, రెహమాన్, రెజీనా, నందితా శ్వేతా, త్రిదా చౌదరి, అనీషా ఆంబ్రోస్, పూజితా పొన్నాడ, అదితి ఆర్య సంగీతం : చేతన్ భరద్వాజ్ దర్శకత్వం : నిజార్ షఫీ కథ, నిర్మాత : రమేష్ వర్మ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఎప్పుడూ ఉంటారు. సరైన కంటెంట్‌తో తెరకెక్కితే ఈ జానర్ సినిమాలు సీజన్‌తో సంబందం లేకుండ ఆడేస్తాయి. అందుకే లాంగ్ గ్యాప్ తరువాత హవీష్ హీరోగా నటించేందుకు ఈ జానర్నే ఎంచుకున్నాడు. దర్శకుడు రమేష్ వర్మ నిర్మాతగా మారి స్వయంగా కథ అందించి నిజార్ షఫీని దర్శకుడిగా పరిచయం చేస్తూ 7(సెవెన్) సినిమాను తెరకెక్కించాడు. మరి ఈ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? ఏకంగా ఆరుగురు హీరోయిన్లు నటించిన 7 ఆడియన్స్‌ను మెప్పించిందా? కథ ; రమ్య( నందితా శ్వేతా) అనే అమ్మాయి తన భర్త కార్తీక్ రఘునాథ్ (హవీష్) కనిపించటం లేదంటూ కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్‌కు వస్తుంది. తన భర్తతో దిగిన ఫోటోలను స్టేషన్లో ఇస్తుంది. ఆమె కథ విన్న ఏసీపీ విజయ్ ప్రకాష్ (రెహమాన్) షాక్ అవుతాడు. రమ్యను మోసం చేసినట్టుగానే కార్తీక్ గతంలో జెన్నీ అనే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకొని మోసం చేశాడని తెలుస్తుంది. దీంతో ఏసీపీ ఈ రెండు కేసులను మిస్సింగ్ కేసులా కాకుండా కార్తీక్ వీళ్లను కావాలనే మోసం చేసి వెళ్లిపోయాడన్న అనుమానంతో చీటింగ్ కేసుగా మార్చి ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. అదే సమయంలో చెన్నైలోనూ మరో అమ్మాయి (అదితి ఆర్య)ని కార్తీక్ మోసం చేశాడని తెలుస్తుంది. ఎంత ప్రయత్నించినా కార్తీక్ ఆచూకి దొరక్క పోవటంతో కార్తీక్ కోసం పేపర్ యాడ్ ఇస్తారు. చివరకు కార్తీక్‌ను అరెస్ట్ చేస్తారు. అయితే కార్తీక్ మాత్రం తాను ఎవరినీ మోసం చేయలేదని, అసలు ఆ అమ్మాయిలు ఎవరో తనకు తెలియదని చెప్తాడు. కార్తీక్ చెప్పేది నిజమేనా..? మరి ఆ అమ్మాయిలను మోసం చేసింది ఎవరు? వీరికి సరస్వతమ్మ (రెజీనా)కు ఉన్న సంబంధం ఏంటి? అసలు ఈ కథలో విలన్ ఎవరు? అన్నదే మిగతా కథ. నటీనటులు ; లాంగ్ గ్యాప్ తరువాత నటించిన హవీష్ ఇంట్రస్టింగ్ కథను ఎంచుకున్నాడు. అయితే కథకు తగ్గ స్థాయిలో వేరియేషన్స్ చూపించటంతో మాత్రం తడబడ్డాడనే చెప్పాలి. నటుడిగా ప్రూవ్ చేసుకునేందుకు హవీష్ ఇంకా కష్టపడాలి. హీరోయిన్లుగా కనిపించిన వారిలో కాస్త ఎక్కువ సేపు తెర మీద కనిపించిన పాత్ర రెజీనాదే. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో రెజీనా నటన ఆకట్టుకుంటుంది. ఇతర పాత్రల్లో నందితా, అనీషా, త్రిదా, అదితి ఆర్యలు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో రెహమాన్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. నటన పరంగానూ మెప్పించాడు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు పరవాలేదనిపించారు. విశ్లేషణ ; రమేష్ వర్మ ఇంట్రస్టింగ్ కథను తయారు చేసుకున్నా, స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కథనం థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన స్థాయి గ్రిప్పింగ్‌గా అనిపించదు. ఇంట్రస్టింగ్‌గా కథను మొదలు పెట్టిన దర్శకుడు, లవ్ స్టోరిలను మాత్రం చాలా స్లోగా నడిపించాడు. అసలు కథను ప్రారంభించేందుకు చాలా సమయం తీసుకున్నాడు. సెకండ్ హాఫ్ ను మాత్రం ఇంట్రస్టింగ్‌గా తెరకెక్కించాడు. కార్తీక్ పోలీసులకు దొరికిన తరువాత కథ వెంట వెంటనే మలుపులు తిరుగుతూ ఆసక్తికరంగా మారుతుంది. కానీ క్లైమాక్స్ విషయంలో మరోసారి తడబడ్డాడు నిజార్. దర్శకుడిగా తడబడినా సినిమాటోగ్రాఫర్‌గా మాత్రం నిజార్ షఫి ఫుల్ మార్క్స్ సాధించాడు. హీరోయిన్లను అందంగా చూపించటంతో పాటు ప్రతీ ఫ్రేమ్‌ను రిచ్‌గా కలర్ఫుల్గా చూపించటంలో సక్సెస్ అయ్యాడు. సినిమాకు మరో ఎసెట్ నేపథ్య సంగీతం. చేతన్ భరద్వాజ్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రతీ సీన్‌ను మరింత ఇంట్రస్టింగ్‌గా మార్చాడు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; నేపథ్య సంగీతం సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ ; ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగే కథనం ఫస్ట్ హాఫ్ స్లో నేరేషన్ సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
సస్పెన్స్ సెవెన్
హవీష్ హీరోగా నటించిన చిత్రం ‘7’. ఈ చిత్రానికి కెమెరామేన్ నిజార్ షఫీ దర్శకత్వం వహించారు. కథ అందించి, నిర్మించారు రమేష్ వర్మ. రెజీనా, నందితా శ్వేత, త్రిదా చౌదరి, అనీషా ఆంబ్రోస్, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో కొత్త హవీష్‌ను చూస్తారు. రమేష్ వర్మ సస్పెన్స్‌తో కూడిన మంచి కథ అందించారు. ఈ కొత్త కాన్సెప్ట్ ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుంది’’ అన్నారు. ‘‘సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. కథ విన్నప్పుడు చాలా ఎగై్జట్ అయ్యాను. నేను విన్న స్టోరీ లైన్‌నే ట్రైలర్‌గా చూపించాం. మంచి స్పందన లభిస్తోంది. అందరూ ప్యాషనేట్‌గా వర్క్ చేశారు. రమేష్ వర్మ సూపర్ కథ అందించారు. కథకు డైరెక్టర్ పూర్తి న్యాయం చేశారు. చైతన్యా భరద్వాజ్ మంచి సాంగ్స్ ఇచ్చారు. జి.ఆర్. మహర్షి తన డైలాగ్స్‌తో అదరగొట్టారు. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అని అన్నారు హవీష్. ‘‘ఈ చిత్రం నా కెరీర్లో సమ్‌థింగ్ స్పెషల్. రమ్య క్యారెక్టర్ నచ్చి బాగా నటించాను. హవీష్ లవ్లీ కోస్టార్. టీమ్ అంతా మంచి పాజిటివ్ జోష్‌లో ఉన్నాం’’ అన్నారు నందితా శ్వేతా. ‘‘నిజార్ షఫీ గారు ఎన్నో హిట్ సినిమాలకు కెమెరామేన్‌గా వర్క్ చేశారు. ఆయన దర్శకత్వం వహించిన ఈ ఫస్ట్ మూవీ ఆడియన్స్‌కు నచ్చుతుంది’’ అన్నారు పూజిత. ‘‘ఆడియన్స్‌కు ‘7’ డిఫరెంట్ మూవీగా నిలిచిపోతుంది’’ అన్నారు త్రిదా చౌదరి. -
‘సెవెన్’ విడుదలపై స్టే
సాక్షి, హైదరాబాద్ : నిజార్ షఫీ దర్శకత్వంలో హావీష్ హీరోగా రమేష్ వర్మ నిర్మించిన ‘సెవెన్’ సినిమా విడుదలపై హైదరాబాద్ సివిల్ కోర్టు స్టే విధించింది. ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం ఇస్తానని రమేష్ వర్మ తన దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నారని ఎన్నారై కిరణ్ కె.తలశిల పేర్కొన్నారు. అయితే తనకు సినిమాలో భాగస్వామ్యం ఇవ్వకపోగా.. తన దగ్గర తీసుకున్న డబ్బు కూడా వెనక్కి ఇవ్వలేదని వాపోయారు. ఈ విషయమై పలుమార్లు అడిగినా రమేష్ వర్మ స్పందించలేదని తెలిపారు. ఈ విషయం గురించి ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకు వెళ్లినా తనకు న్యాయం జరగకపోవడంతో.. న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సివచ్చిందని కిరణ్ తెలిపారు. -
వాళ్లు చెప్పిందొకటి.. చేసిందొకటి
‘‘తెలుగు అమ్మాయి కావాలి అని దర్శకులు అనుకున్నారు కాబట్టే ‘దర్శకుడు, రంగస్థలం, కల్కి’ సినిమాల్లో నాకు అవకాశాలు వచ్చాయి’’ అన్నారు పూజిత పొన్నాడ. కెమెరామెన్ నిజార్ షఫీ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘7’. హవీష్ హీరోగా, రెజీనా, నందితాశ్వేత, త్రిధాచౌదరి, అనీషా ఆంబ్రోస్, అదితీ ఆర్య, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. రమేష్ వర్మ నిర్మించిన ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ నెల 5న విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా పూజిత పొన్నాడ చెప్పిన విశేషాలు... ► నా తొలి ప్రాధాన్యం ప్రేమకథకే. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘7’ చిత్రంలో నాది సస్పెన్స్ రోల్. అందుకే నా పాత్ర గురించి ఎక్కువగా రివీల్ చేయకూడదు. సినిమాలో ఆరుగురు హీరోయిన్లు ఉన్నప్పటికీ ఎవరి కథ వారిదే. క్లైమాక్స్‌లో మెర్జ్ అవుతాయి. ఈ సినిమాలో లిప్‌లాక్ సీన్ లేని హీరోయిన్ని నేనే అనుకుంటాను. హావీష్ మంచి కో స్టార్. ‘రాజుగాడు’ సినిమాలో చేసినప్పుడే షఫీగారితో పరిచయం.ఆయన దర్శకత్వంలో నటించడం హ్యాపీ. ► ఎలాంటి టీమ్‌తో వర్క్ చేయకూడదో ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ’ సినిమా ప్రయాణం నేర్పించింది. ఈ సినిమా చేసినందుకు రిగ్రేట్ ఫీల్ అవుతున్నాను. స్క్రిప్ట్ నుంచి ప్రమోషన్, రిలీజ్ దాకా వారు చెప్పింది ఒకటి.. చేసింది మరొకటి. ఏదీ నేను అనుకున్నట్లు జరగలేదు. ఈ సినిమాకు ముందు స్క్రిప్ట్‌ని బట్టి మాత్రమే సినిమా చేసేదాన్ని. ఇప్పుడు మూవీ టీమ్‌ని కూడా పరిశీలించుకుంటున్నాను. ► ప్రస్తుతం ‘కల్కి’ సినిమాలో ఓ డిఫరెంట్ రోల్ చేస్తున్నాను. తెలుగులో కీర్తీ సురేశ్ లీడ్ రోల్ చేయనున్న చిత్రంలో నటించనున్నా. అదేవిధంగా మరో తమిళ సినిమాకి కూడా సైన్ చేశాను. -
ముద్దు సీన్లు ఉన్నాయని ముందు తెలియదు
‘‘సాధారణంగా నాకు థ్రిల్లర్స్ పెద్దగా ఆసక్తి లేదు. ఆ సబ్జక్టే కొంచెం డ్రైగా అనిపిస్తుంది. కానీ ఈ థ్రిల్లర్ ఒప్పుకోవడానికి కారణం కథ. ప్లస్ 6 హీరోయిన్లు ఉన్న తర్వాత ఇక డ్రైగా ఎందుకు ఉంటుంది? ఇలాంటి కథ ఎక్కడా రాలేదు’’ అన్నారు హవీష్. కెమెరామేన్ నిజార్ షఫీ దర్శకుడిగా మారి హవీష్ హీరోగా రెజీనా, నందితా శ్వేత, త్రిధా చౌదరి, అనీషా ఆంబ్రోస్, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా రూపొందించిన చిత్రం ‘7’. రమేశ్ వర్మ కథను అందించి, నిర్మించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ఈ నెల 5న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా హవీష్ పలు విషయాలు పంచుకున్నారు. ► సినిమాలో రెహమాన్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారు. ఆయన దృష్టిలో హీరోయిన్లు, నేను (6+1) 7 పాత్రలం. అందుకే ఆ టైటిల్ పెట్టాం. మొదట సినిమా అనుకున్నప్పటి నుంచి మరో నాలుగు రోజుల్లో సెట్స్ మీదకు వెళ్తాం అనేవరకూ కూడా తెలుగులో మాత్రమే తీయాలనునుకున్నాం. చివర్లో మరో నిర్మాత కూడా తోడవ్వడంతో తెలుగు, తమిళంలో నిర్మించాం. దర్శకుడు షఫీ పుట్టింది తమిళనాడులో అయినా తెలుగు సినిమాలు ఎక్కువ చేశారు. రెండు ప్రాంతాల వాళ్లకు అనుగుణంగా ఈ సినిమా తెరకెక్కించారు. నాకు ఒక్క ముక్క తమిళం రాదు. డైలాగ్స్ నేర్చుకోవడానికి గంటల గంటలు పట్టేది. ► కథలో బలం ఉండబట్టే ఆరుగురు హీరోయిన్లు నటించడానికి ఒప్పుకున్నారు. ఒకరితో ఫ్రెండ్ అవుతున్నాను అనుకునే లోపు ఆమె పార్ట్ షూటింగ్ పూర్తయి మరో హీరోయిన్ జాయిన్ అయ్యేవారు. ఇంత మంది హీరోయిన్లు ఉన్నప్పుడు చిన్న చిన్న ఫైట్స్ కామన్. ఇద్దరు హీరోయిన్స్ సెట్లో ఉన్నప్పుడు అక్కడి వాతావరణంలో తేడా నాకు అర్థం అయ్యేది. ► ఏ పని చేసినా నం.1గా ఉండాలనుకునే మనస్తత్వం నాది. అలానే కష్టపడతాను. మన పని మనం చేసుకుంటూ వెళ్తే సక్సెస్ ఆటోమేటిక్‌గా వస్తుంది. ఆ మధ్య ఓ పెద్ద ప్రాజెక్ట్‌లో హీరోగా అవకాశం వచ్చింది. చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. దాంతో నా గత చిత్రానికి, దీనికి ఇంత గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం ఓ మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. అభిషేక్ పిక్చర్స్ వాళ్లకు చేస్తున్నది ఫ్యామిలీ డ్రామా. అందులో మంచి లవ్‌స్టోరీ ఉంటుంది. ► మా ప్రొడక్షన్లో ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘రాక్షసుడు’ సినిమా చేస్తున్నాం. జూలై 18న రిలీజ్ అనుకుంటున్నాం. నా బ్యానర్లో నేను నటించకపోయినా ఫర్వాలేదు. ఆల్రెడీ బ్యానర్లో నిర్మాతగా నా పేరున్నట్టే. ప్రతి సినిమాలో నేనుండవసరం లేదు కదా. ► ‘7’లో కొన్ని లిప్‌లాక్ సన్నివేశాలు ఉన్నాయి. కథ చెప్పినప్పుడు ముద్దు సీన్లు ఉన్నాయని నాతో చెప్పలేదు. సెట్లోకి వెళ్లి హీరోయిన్ను ముద్దుపెట్టమంటే భయపడ్డాను. ‘ఒకవేళ తను కొడితే ఏంటి?’ అనుకున్నాను. మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత ధైర్యంగా చేసేశాను. ఏ రంగంలో అయినా మార్పు మంచిదే. అందరికీ చాన్స్ ఇవ్వాలనే పద్ధతిని నమ్ముతాను. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబుగారిని చూశాం. ఇప్పుడు జగన్‌గారికి అవకాశం ఇచ్చారు. ఆప్షన్ ఉండాలి. ఈయన సరిగ్గా పరిపాలించకపోతే ఆయన. ఆయన చేయకపోతే ఈయన.. అలా ఉండాలి. జగన్‌గారు రావడం ఖచ్చితంగా మంచిదే. ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదని ఎందుకు అనుకోవాలి. జగన్‌గారు యంగ్‌స్టర్, ప్రపంచాన్ని చూశాడు. ఆయన బాగా పాలించగలరని అనుకుంటున్నాను. -
లవ్‌స్టోరీకి క్లాప్
హవీష్ హీరోగా రాఘవ ఓంకార్ శశిధర్ దర్శకుడిగా పరిచయం కానున్న చిత్రం ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. దేవాన్ష్ నామా అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ వేడుకకు అతి«థిగా విచ్చేసిన దర్శకుడు సుకుమార్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా, సదానంద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఏషియన్ సునీల్ నారంగ్ స్క్రిప్ట్ అందించారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ– ‘‘నన్ను ప్రపంచానికి పరిచయం చేసిన తల్లిదండ్రులు ఎంత గొప్పవారో, ఓ దర్శకుడికి తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత, హీరో అంతే గొప్ప. 14 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ‘లడ్డు, నన్ను క్షమించు’ వంటి లఘుచిత్రాలను తీశాను. వాటికి నంది అవార్డులు, జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. నన్ను దర్శకుడిగా ఎంపిక చేసిన సుకుమార్‌గారికి ధన్యవాదాలు. అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. జూలై చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను జరపనున్నాం’’ అన్నారు. ‘‘మంచి ఫ్యామిలీ, రొమాంటిక్ లవ్‌స్టోరీ ఇది. ఇందులో హీరోగా నటిస్తున్నందుకు, ఆనందంగా ఉంది. శశి ప్రతిభ ఉన్న దర్శకుడు. భవిష్యత్‌లో పెద్ద దర్శకుడు అవుతాడు. అభిషేక్‌గారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్’’ అన్నారు హీరో హవీష్. ‘‘సుకుమార్, మేం నిర్వహించిన షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌లో శశిధర్ మొదటి బహుమతిని పొందారు. అలా శశిధర్‌కు దర్శకుడిగా తొలి అవకాశం కల్పించాం’’ అన్నారు అభిషేక్ నామా. ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ స్వరకర్త. -
రొమాంటిక్ డ్రామాలో హవీష్
యువ నటుడు హవీష్ కథానాయకుడిగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై కొత్త సినిమా ప్రారంభమైంది. రొమాటింక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్, ఏసియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ ముఖ్య అతిథులుగా హజరయ్యారు. హవీష్పై చిత్రీకరించిన తొలి షాట్‌కు సుకుమార్ క్లాప్ ఇవ్వగా సదానంద్ కెమెగా స్వీచ్ఆన్ చేశారు. సునీల్ నారంగ్ దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్‌కు స్క్రిప్ట్ అందచేశారు. త్వరలో పూర్తి నటీనటుల వివరాలు వెల్లడించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి జూలైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతమందిస్తుండగా సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. -
ఆరుగురు అమ్మాయిలు.. ఓ అబ్బాయి
అతడి పేరు కార్తీక్. ఆరుగురు అమ్మాయిలు అతనితో ‘ఐ థింక్... ఐయామ్ ఇన్ లవ్ విత్ యు కార్తీక్’ అన్నారు. దీంతో ఆరుసార్లు నవ్విన కార్తీక్ ఆరుగురికీ ముద్దులు పెట్టి, ముగ్గులోకి దింపాడు. ఇంతకీ అతడి కథేంటి? అన్నది జూన్ 5న తెలుస్తుంది. హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సెవెన్’. రెజీనా, నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. కిరణ్ స్టూడియోస్‌పై రమేష్ వర్మ ప్రొడక్షన్లో రమేష్ వర్మ నిర్మించారు. ఈ సినిమా వరల్డ్‌వైడ్ రైట్స్‌ను సొంతం చేసుకున్న అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాని జూన్ 5న విడుదల చేస్తోంది. సంస్థ అధినేత అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘సెవెన్’ ఫస్ట్ కాపీ చూశా. మైండ్ బ్లోయింగ్. థ్రిల్లర్ చిత్రాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుంది. ట్విస్ట్ వెనక ట్విస్ట్ ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తాయి. రమేష్ వర్మగారు ఫెంటాస్టిక్ స్టోరీ, స్క్రీన్ ప్లే రాశారు. ఈ సినిమాలో కొత్త హవీష్‌ను చూస్తారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్ భరద్వాజ్, సహ నిర్మాత: కిరణ్ కె. తలశిల (న్యూయార్క్), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామకృష్ణ, కెమెరా–దర్శకత్వం నిజార్ షఫీ. -
అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ‘సెవెన్’ రిలీజ్
హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సెవెన్. కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడక్షన్లో రమేష్ వర్మ నిర్మాణంలో డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. రెహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. రమేష్ వర్మ కథ అందించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇప్పటికే శుభం విశ్వనాధ్ సాహిత్యం అందించిన ‘సంపోద్దోయ్ నన్నే’, పులగం చిన్నారాయణ సాహిత్యం అందించిన ‘ఇదివరకెపుడు తెలియదు’ పాటలు విడుదలయ్యాయి. ఇటీవల సినిమా ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ కాపీ చూసిన అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా క్రేజీ ఆఫర్ ఇచ్చి ఈ సినిమా ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా అభిషేక్ నామా మాట్లాడుతూ ‘ఇటీవల సెవెన్ ఫస్ట్ కాపీ చూశాను. మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్. థ్రిల్లర్ ఫిల్మ్స్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందీ సినిమా. ఒక ట్విస్ట్ వెనుక మరొక ట్విస్ట్ ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తాయి. రమేష్ వర్మగారు ఫెంటాస్టిక్ స్టోరీ, స్క్రీన్ ప్లే రాశారు. నిర్మాణంలోనూ రాజీ పడలేదు. రిచ్‌గా సినిమా తీశారు. ఆయన కథ సినిమాకు ఒక హైలైట్ అయితే... హవీష్ యాక్టింగ్ మరో హైలైట్. నటుడిగా కొత్త హవీష్ ను ప్రేక్షకులు ఈ సినిమాలో చూస్తారు. మెచ్యూర్డ్ యాక్టింగ్ చేశాడు. రమేష్ వర్మ కథకు నిజార్ షఫీ న్యాయం చేశారు. ఆయన సినిమాటోగ్రఫీ సూపర్. ఆరుగురు హీరోయిన్ల పాత్రలు కథలో భాగంగా సాగుతాయి. ప్రేక్షకులకు ఒక హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతి ఈ సినిమా ఇస్తుంది. ఫస్ట్ కాపీ చూశాక... విపరీతంగా నచ్చడంతో సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ తీసుకున్నాను. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా మా సంస్థ ద్వారా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు. -
క్రైమ్ థ్రిల్లర్.. ఆకట్టుకుంటోన్న ‘7’ ట్రైలర్
క్రైమ్ థ్రిల్లర్స్ ఎక్కువగా తమిళ, మలయాళంలో వస్తుండగా.. ప్రస్తుతం తెలుగులో కూడా వీటి హవా కొనసాగుతోంది. తాజాగా ‘7’ ట్రైలర్‌ను విడుదల చేశారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. అమ్మాయిలు వరుసగా హత్యకు గురవటం, వాటికి కారణాలు ఏంటో తెలియకపోవడం, కార్తీక్ అనే కుర్రాడే ఈ హత్యలు చేశాడని పోలీసులు అనుమానించడం.. ఇలా ఈ కేసును చేదించడం.. ఈ క్రమంలో ఒకేలా ఇద్దరు ఉన్నారా? ఇలా ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది. ఈ చిత్రంలో నందితా శ్వేతా, రెజీనా, రెహమాన్ కీలకపాత్రల్లో నటిస్తుండగా.. చేతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. జూన్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆరు ప్రేమకథలు
‘‘ఆరుగురు అమ్మాయిలు.. ఆరు ప్రేమకథలు.. విచిత్రంగా ఆరు ప్రేమకథల్లోనూ అబ్బాయి ఒక్కడే. ఆరుగురు అమ్మాయిలను ఒకేసారి ప్రేమిస్తున్న ఆ అబ్బాయి మంచోడా? చెడ్డోడా?’’ తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటోంది ‘సెవెన్’ చిత్రబృందం. హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వం వహించిన చిత్రం ‘సెవెన్’. రెజీనా, అనీషా ఆంబ్రోస్, త్రిదా చౌదరి, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రమేష్ వర్మ కథ అందించడంతో పాటు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘‘సెవెన్’ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదో రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా. స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. ఊహించని మలుపులు ఉంటాయి’’ అన్నారు రమేష్ వర్మ. ఈ సినిమాకు కెమెరా: నిజార్ షపి, సంగీతం: చైతన్య భరద్వాజ్. -
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సెవెన్’
ఆరుగురు అమ్మాయిలు... ఆరు ప్రేమకథలు! ప్రతి ప్రేమ కథలోనూ అబ్బాయి ఒక్కడే! ఆరుగురు అమ్మాయిలను ఒకేసారి ప్రేమిస్తున్న అతడు మంచోడా? చెడ్డోడా? ప్రతి అమ్మాయి అతడే కావాలని ఎందుకు కోరుకుంటోంది? అనే ఇంట్రస్టింగ్ పాయింట్‌తో తెరకెక్కిన సినిమా సెవెన్. రమేష్ వర్మ స్వయంగా కథ అందించి ఈ సినిమాను నిర్మించారు. హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రెహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ నాలుగో వారంలో సినిమాలో తొలి పాటను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా రమేష్ వర్మ మాట్లాడుతూ ‘ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్. సినిమా బాగా వచ్చింది. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. ప్రేక్షకుల ఊహలకు అందని మలుపులతో కథనం సాగుతుంది. సినిమాలో వచ్చే ప్రతి ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ప్రతి ట్విస్ట్ వెనుక కథలో భాగంగా ఎమోషనల్ లవ్ స్టోరీ ఉంటుంది. ఏప్రిల్ నాలుగో వారంలో హవీష్, రెజీనాపై తెరకెక్కించిన తొలి పాటను విడుదల చేస్తున్నాం. మేలో సినిమాను విడుదల చేస్తాం’ అని తెలిపారు. -
నయా సినిమా.. నయా లుక్
తమిళంలో గతేడాది వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో ‘రాక్షసన్’ ఒకటి. ప్రస్తుతం ఈ సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రమేష్‌వర్మ పెన్మత్స తెరకెక్కిస్తారు. హవీష్ లక్ష్మణ్ కోనేరు బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముహూర్తం గురువారం జరిగింది. తొలి సన్నివేశానికి నిర్మాత కె.ఎల్.నారాయణ కెమెరా స్విచ్చాన్ చేయగా హీరో హవీష్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా హవీష్ మాట్లాడుతూ – ‘‘రాక్షసన్’ చిత్రాన్ని తెలుగులో మా బ్యానర్‌పై నిర్మించడం సంతోషంగా ఉంది. ప్రతిష్టాత్మకంగా, భారీగా నిర్మించనున్నాం. ఈ సినిమా కోసం శ్రీనివాస్ తన లుక్‌ని మార్చుకోబోతున్నారు. గురువారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలైంది’’ అన్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా రకుల్ ప్రీత్ నటించనున్నారని టాక్. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమెరా: వెంకట్ సి. దిలీప్. -
ఏడుతో లింకేంటి?
ఈ మధ్య రెజీనా ఒకటి రెండు మూడు నాలుగు అని అంకెలు లెక్కేస్తూ ఏడు రాగానే ఆగిపోతున్నారు. ఎందుకిలా? ఏడు రెజీనా లక్కీ నెంబరా అంటే.. కాదట. విషయం ఏంటీ అంటే... ‘7’ ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమా టైటిల్. అందుకే ఆ అంకెను అదే పనిగా పలుకుతున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకూ రెజీనా ‘ఏడు’ అంకె జపం చేస్తారేమో! ఇంతకీ కథలో 7కి లింక్ ఏంటి? అంటే సినిమా చూడాల్సిందే. కెమెరామేన్ నిజర్ షఫీ దర్శకుడిగా మారి, తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. రెహమాన్, హవీష్, రెజీనా, అనీషా ఆంబ్రోస్, పూజిత పొన్నాడ ముఖ్య పాత్రధారులు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చైతన్య భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. -
నేను రెడీ!
‘‘మాస్, యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ... ఏ జానర్ సినిమా చేయడానికైనా నేను రెడీ. కానీ, ఒక్క కండిషన్! కథ బాగుండాలి. పర్టిక్యులర్ జానర్‌కు నేను పరిమితం కావాలనుకోవడం లేదు. హీరోగా మంచి సినిమాలు చేయాలనీ, చక్కని పాత్రల్లో నటించాలనీ అనుకుంటున్నా’’ అన్నారు హవీష్. ఈ రోజు (ఆదివారం) ఈ యువ హీరో పుట్టినరోజు. ఈ సందర్భంగా హవీష్ మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకు నేను చేసిన మూడు సినిమాల్లో ‘నువ్విలా, జీనియస్’ బాగా ఆడాయి. ‘రామ్‌లీలా’ ఆశించినంతగా ఆడలేదు. కానీ, అందులో నా క్యారెక్టర్ బాగుంటుంది. హీరోగా నా కెరీర్ పట్ల, నటన పట్ల హ్యాపీగా ఉన్నాను. డ్యాన్సుల్లో మాత్రం ఇంకొంచెం మెరుగవ్వాలి. ‘రామ్‌లీలా’ తర్వాత ఓ పెద్ద దర్శకుడితో సినిమా అనుకున్నా. కానీ, కుదరలేదు. ఈలోపు పలు కథలు విన్నాను. ఏవీ నచ్చలేదు. ఓ మంచి కథ కోసం ఎదురు చూడడంతో కొంచెం గ్యాప్ వచ్చింది. ఈ బుధవారం నేను హీరోగా నటించబోయే నాలుగో సినిమా ప్రారంభమవుతుంది. ఇందులో ఐదుగురు హీరోయిన్లు నటించనున్నారు. జక్కం జవహర్‌బాబు, రమేశ్‌వర్మ (దర్శకుడు– ‘రైడ్’ ఫేమ్) ఈ చిత్రానికి నిర్మాతలు. ఫ్యామిలీ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమా ద్వారా సాయిశ్రీరామ్ అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. దీని తర్వాత జక్కం జవహర్బాబుగారి నిర్మాణంలో మరో సినిమా చేయనున్నా’’ అన్నారు. -
పేరున్న దర్శకుడు! పైకొస్తున్న హీరో!!
దర్శకుడిగా పరిచయమైనప్పటి ‘ఈరోజుల్లో’, తర్వాత ‘బస్‌స్టాప్’ చిత్రాలతో తనపై పడిన ముద్రను ‘భలే భలే మగాడివోయ్’తో చెరిపేసుకున్నారు మారుతి. ఆ సినిమాతో ఆయన స్థాయీ పెరిగింది. ఆ తర్వాత వెంకటేశ్‌ను ‘బాబు బంగారం’గా చూపించారు. ఇప్పుడు నాని, వెంకటేశ్ వంటి స్టార్స్‌తో కాకుండా అప్ కమింగ్ హీరో హవీశ్‌తో మారుతి సినిమా చేయాలనుకోవడం పలువుర్ని ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించనున్నారు. హవీశ్‌తో సినిమా చేయడానికి కారణం ఏంటని దర్శకుణ్ణి అడిగితే.. ‘‘ముందు నేనో కథ రాసుకుంటా. ఆ తర్వాత నా కథ ఏ హీరో సూటవుతుంది? ఈ కథకు ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తా. అతణ్ణే సంప్రతిస్తా. హవీశ్‌తో తీయబోయే సినిమాకి సైతం ఆ పద్ధతే పాటించా. కథకు అతనే కరెక్ట్’’ అన్నారు. ఇది రిస్కే కదా? అని ప్రశ్నిస్తే.. ‘‘వెంకటేశ్, నాని మినహా నేను పనిచేసిన వాళ్లందరూ అప్ కమింగ్ హీరోలే. జీవితంలో ప్రయోగాలు ఎందుకు చేయకూడదనే కసి చిన్నప్పటి నుంచి ఉంది. అదే సినిమా రంగం వైపు నడిపింది. ఈ స్థాయికి తీసుకొచ్చింది’’ అన్నారు. నిర్మాతలు వంశీ, ప్రమోద్ కథ విని చాలా ఎగ్జయిట్ అయ్యారని ఆయన చెప్పారు. కథ గురించి మారుతి మాట్లాడుతూ - ‘‘విచిత్రమైన ప్రేమకథ. రొమాంటిక్ ఎంటర్టైనర్. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉంది. త్వరలో హీరోయిన్, ఇతర వివరాలు వెల్లడిస్తాం’’ అన్నారు. -
ఫ్లాప్ హీరో కోసం సక్సెస్ఫుల్ టీం
జీనియస్ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో 'హవీష్'. తొలి సినిమాతోనే భారీ ప్రచారం దక్కినా.., సక్సెస్ మాత్రం సాధించలేకపోయాడు ఈ యంగ్ హీరో. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకొని మరోసారి రామ్‌లీలా సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే ఈ సారి కూడా లక్ వర్కవుట్ కాలేదు. మరోసారి డిజాస్టర్ టాక్ రావటంతో కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. తాజాగా ఓ సక్సెస్ఫుల్ టీం తెరకెక్కించబోయే సినిమాలో హవీష్‌కు హీరోగా ఛాన్స్ వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. భలే భలే మొగాడివోయ్ సినిమాతో దర్శకుడిగా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న మారుతి, ప్రస్తుతం వెంకటేష్ హీరోగా బాబు బంగారం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత హవీష్ హీరోగా ఓ సినిమాను డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను మిర్చి, రన్ రాజా రన్ లాంటి చిత్రాలను నిర్మించిన సక్సెస్ఫుల్ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మించనుంది. మరి ఈ సినిమాతో అయిన హవీష్ హీరోగా సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి. -
మంచి సినిమా తీస్తే... విజయం గ్యారెంటీ : కోనేరు సత్యనారాయణ
‘‘తొలి చిత్రం ‘నువ్విలా’, మలి చిత్రం ‘జీని యస్’తో మంచి నటుడనిపించుకున్న హవీష్ ఈ చిత్రంలో అన్ని రకాల రసాలూ పలికించి, భేష్ అనిపించుకున్నాడు. హవీష్‌కి ఇంకా మంచి సినిమాలు రావాలి’’ అని దర్శకుడు బి. గోపాల్ అన్నారు. హవీష్, అభిజిత్, నందిత కాంబినేషన్లో కోనేరు సత్యనారాయణ సమర్పణలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన చిత్రం ‘రామ్ లీల’. లంకాల బుచ్చిరెడ్డి సారథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి శ్రీపురం కిరణ్ దర్శకుడు. ఈ చిత్ర విజయోత్సవం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ - ‘‘200 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హౌస్‌ఫుల్ కలక్షన్స్‌తో విజయవంతంగా సాగుతోంది. హవీష్ ఎలాంటి పాత్ర అయినా చేయగలుగుతాడని నిరూపించిన చిత్రం ఇది. అభిజిత్, నందితల నటన కూడా ప్రధాన ఆకర్షణైంది’’ అన్నారు. మంచి సినిమా తీస్తే సక్సెస్ చేస్తారని మరోసారి ప్రేక్షకులు నిరూపించారని కోనేరు సత్యనారాయణ అన్నారు. హవీష్ మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రంలోని రామ్ పాత్ర గురించి దర్శకుడు చెప్పినప్పుడే ఎగ్జయిట్ అయ్యా. ఈ పాత్ర నాకు మంచి పేరు తెచ్చింది’’ అన్నారు. శ్రీపురం కిరణ్, విస్సు, లంకాల బుచ్చిరెడ్డి, ‘మల్టీ డైమన్షన్’ వాసు, నందిత తదితరులు పాల్గొన్నారు. -
'రామ్ లీల' సక్సెస్ మీట్..!
-
హవీష్ వాయిస్ బాగుంటుంది : పరుచూరి గోపాలకృష్ణ
‘‘అన్నగారు ఎన్టీఆర్ నటించిన ‘నా దేశం’ చిత్రాన్ని 21 రోజుల్లో తీశారు. ఆ సినిమా వంద రోజులాడింది. ఇప్పుడీ చిత్రాన్ని దాసరి కిరణ్‌కుమార్ 38 రోజుల్లో తీశారు. ఈ రోజుల్లో ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయడం చిన్న విషయం కాదు. ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించాలి. హవీష్ కంఠస్వరం గంభీరంగా ఉంటుంది. తన వాయిస్‌కీ, శారీరక భాషకూ తగ్గ పాత్రను ఇందులో చేశాడు’’ అని రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. కోనేరు సత్యనారాయణ సమర్పణలో హవీష్ హీరోగా దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన చిత్రం ‘రామ్‌లీలా’. లంకాల బుచ్చిరెడ్డి సారథ్యంలో రామదూత క్రియేషన్స్ పతాకంపై శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పాటల విజయోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. హవీష్ మాట్లాడుతూ -‘‘ ‘జీనియస్’ తర్వాత మళ్లీ ఇదే సంస్థలో చేయడం ఆనందంగా ఉంది. శ్రీపురం కిరణ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు. దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ -‘‘ఈ నెల 27న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం . సినిమా ఘనవిజయం సాధించడం ఖాయం. ‘జీనియస్’కి అర్ధశతదినోత్సవం జరిపాం. ఈ చిత్రానికి శత దినోత్సవం చేస్తాం. అంత నమ్మకం ఉంది’’ అని తెలిపారు. ‘‘ఈ చిత్రంలో మా అబ్బాయి హవీష్ కొత్తగా కనిపిస్తాడు. చిత్రబృందం అంతా ఎంతో కష్టపడి చేశారు. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది’’ అని కోనేరు సత్యనారాయణ చెప్పారు. ఎస్. గోపాలరెడ్డి, విస్సు, నందిత, చిన్నా, ముత్యాల రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రామ్ లీలలు
అమెరికాలో స్థిరపడిన తెలుగు కుర్రాడు... తెలివైన కుర్రాడు రామ్. జీవితాన్ని హ్యాపీగా, సాఫీగా ఎలా ఉంచుకోవాలో అతనికి బాగా తెలుసు. అందుకోసం ఎన్ని లీలలైనా చేస్తుంటాడు. ఈ క్రమంలో అతని జీవితంలో ఎదురైన మలుపులే ఈ ‘రామ్‌లీల’ సినిమా అంటున్నారు నిర్మాత దాసరి కిరణ్‌కుమార్. హవీష్, అభిజిత్, నందిత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి శ్రీపురం కిరణ్ దర్శకుడు. లంకాల బుచ్చిరెడ్డి సారథ్యంలో కోనేరు సత్యనారాయణ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘రోడ్డు ప్రయాణం నేపథ్యంలో సాగే సినిమా ఇది. హవీష్‌ను స్టార్‌గా నిలబెట్టే సినిమా అవుతుంది. అభిజిత్, నందిత పాత్రలు ఈ చిత్రానికి వెన్నుముకగా నిలుస్తాయి. ఎస్.గోపాల్‌రెడ్డి ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. అలాగే విస్సు రాసిన సంభాషణలు పటాసుల్లా పేలతాయి. మా నిర్మాత చాలా పెద్ద సినిమా స్థాయిలో ఎక్కువ థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు’’ అని చెప్పారు. -
‘రామ్‌లీల’ ఆడియో ఆవిష్కరణ