
యువ నటుడు హవీష్ కథానాయకుడిగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై కొత్త సినిమా ప్రారంభమైంది. రొమాటింక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్, ఏసియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ ముఖ్య అతిథులుగా హజరయ్యారు. హవీష్‌పై చిత్రీకరించిన తొలి షాట్‌కు సుకుమార్ క్లాప్ ఇవ్వగా సదానంద్ కెమెగా స్వీచ్‌ఆన్ చేశారు.
సునీల్ నారంగ్ దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్‌కు స్క్రిప్ట్ అందచేశారు. త్వరలో పూర్తి నటీనటుల వివరాలు వెల్లడించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి జూలైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతమందిస్తుండగా సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment