కల్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ‘డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’. సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా, మరో హీరోయిన్ మాళవికా నాయర్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల 29న ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో ఈ చిత్రసంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ మాట్లాడుతూ– ‘‘డెవిల్’ సినిమాలో మూడు పాటలు ఉన్నాయి. ఇది పీరియాడికల్ ఫిల్మ్ కాబట్టి ప్రత్యేక వాయిద్యాలను వాడాం. ‘దూరమే..’ పాటను బుడాపెస్ట్‌లో షూట్ చేశాం. అలాగే ‘దిస్ ఈజ్ లేడీ రోజ్..’ పాటను ర్యాపర్ రాజకుమారితో పాడించాం. ఈ పాట సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. అలాగే నేపథ్య సంగీతం చాలా బాగుంటుంది.
అయితే సంగీత దర్శకులు, నటీనటులు ఎంత ఎఫర్ట్ పెట్టినా విజువల్ సపోర్ట్ ఉండాలి. ఈ విషయంలో ఈ చిత్రం కెమెరామేన్ సౌందర్ రాజన్‌గారు ప్రాణం పెట్టి అద్భుతంగా వర్క్ చేశారు. సెకండాఫ్‌లోని ఓ ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్‌లో కల్యాణ్‌రామ్ గారి నట విశ్వరూపాన్ని ఆడియన్స్ చూస్తారు. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డులు రావొచ్చని నాకనిపిస్తోంది’’ అని అన్నారు.
ఇంకా మాట్లాడుతూ– ‘‘భవిష్యత్‌లో డైరెక్షన్ చేసే అవకాశం ఉంది. ఇద్దరు గిటారిస్ట్స్ మాత్రమే ఉండేలా ఓ సినిమా, డ్రమ్స్ శివమణిగారి బయోపిక్ తీయాలని ఉంది. ‘యానిమల్’ తర్వాత బాలీవుడ్‌లో చాలా అవకాశాలు వస్తున్నాయి. అవి చర్చల దశలో ఉన్నాయి. ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా గారు చేయనున్న ‘స్పిరిట్’ సినిమాకు సంగీతం అందించనున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment