Devil
-
డేంజర్ ‘డెవిల్’ ఫిష్!
తెనాలి: అత్యంత ప్రమాదకరమైన డెవిల్ ఫిష్ (దెయ్యపు చేప) గుంటూరు జిల్లా కొల్లిపర మండలం దావులూరులోని చేపల చెరువులో ప్రత్యక్షమైంది. నదులు, సముద్రాలకే పరిమితం కావాల్సిన ఈ చేపలను చూసి రైతు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. దావులూరుకు చెందిన కోట రాంబాబు వ్యవసాయం చేస్తూనే, ఎకరంన్నర విస్తీర్ణం గల చెరువులో చేపల పెంపకం చేస్తున్నారు. గత ఆగస్టులో మార్కెట్ డిమాండ్ కలిగిన బొచ్చె, రాగండి, గడ్డి చేపల సీడ్‌ను రెండు వేల కౌంటు చెరువులో వేశారు. రోజూ మేత వేస్తున్నారు. ఫీడింగ్ ఎలా ఉంది? చేపలు ఎదుగుతున్నాయా? వ్యాధులు ఏమైనా అశించాయా? అనేది తెలుసుకునేందుకు బుధవారం వల వేయించి చేపలు పట్టించాడు. వాస్తవంగా తాము చెరువులో వేసిన చేపలు ఒకటీ, రెండూ మాత్రమే వస్తూ, డెవిల్ చేపలు ఎక్కువ పడుతుండడాన్ని గమనించాడు. వలకు బొచ్చె, రాగండి చేపలు తక్కువగా రావటమే కాదు...వచ్చి న ఒకటీ ఆరా చేప కూడా అర కిలో బరువు తూగాల్సి ఉంటే, కేవలం పావు కిలోకు మించలేదని చెప్పారు. అంటే డెవిల్ చేపలు రోజూ వేస్తున్న మేతను, చేపలను కూడా తినేస్తున్నాయన్న నిర్ధారణకు వచ్చి, ఆందోళనలో పడ్డాడు. కృష్ణానదికి మూడునెలల క్రితం వచ్చిన భారీ వరదలతో డెవిల్‌ఫిష్ ఇతర ప్రాంతాలకు విస్తరించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి డెవిల్‌ఫిష్ 2016లో తొలిసారిగా కృష్ణానదిలో విజయవాడ వద్ద కనిపించింది. భూమిమీద కూడా వెళ్లే సామర్థ్యం ఉన్న ఈ డెవిల్ ఫిష్, ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 65 శాతం నీటివనరులకు విస్తరించిందని అంచనా వేస్తున్నారు. స్థానిక చేపల జాతులను విపరీతంగా తినేస్తూ.. సున్నితమైన జల జీవావరణ వ్యవస్థనూ దెబ్బతిస్తుంది. విభిన్నమైన ఆహారాలను తీసుకునే ఈ చేపలు అసాధారణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని పేరు. ఆక్సిజను లేని పరిస్థితిని కూడా తట్టుకుంటాయి. కొన్ని సందర్భాల్లో వలలకు నష్టం చేయడంతో పాటు మత్స్యకారులకు గాయాలను కూడా చేసిన ఘటనలున్నాయి. 152 విభిన్న మంచినీటి చేప జాతులకు నిలయమైన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో డెవిల్ ఫిష్‌ను నియంత్రించాల్సిన ఆవశ్యకత ఉందని, లేకుంటే చేపల చెరువులు, పంట కాలువలు, నదుల్లో చేపల ఉత్పత్తికి ముప్పు వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఈ సరస్సులో దయ్యం ఉందట!
ఈ సరస్సు చూడచక్కగా ఉంటుంది. ఇందులోని నీళ్లు స్వచ్ఛంగా తళతళలాడుతూ ఉంటాయి. అయినా, జనాలు ఈ సరస్సు పేరు వింటేనే భయపడతారు. గుండెధైర్యం ఉన్న కొద్దిమంది ఇక్కడకు పిక్నిక్లకు వస్తుంటారు. అలాంటి వారు కూడా ఈ సరస్సు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సరస్సులో దయ్యం ఉందన్న ప్రచారమే జనాల భయానికి కారణం. అమెరికాలోని లాంగ్ ఐలండ్‌లో ఉన్న ఈ సరస్సు పేరు ‘రోంకోంకోమా లేక్’. ఇక్కడి స్థానికులు ఈ సరస్సు నీళ్లల్లో అరికాళ్ల మునివేళ్లను ముంచడానికి కూడా భయపడతారు. రోంకోంకోమా సరస్సులో దయ్యం ఉందనే గాథకు మూలాలు పదిహేడో శతాబ్ది చివరికాలం నుంచి ఉన్నాయి. ఇక్కడి స్థానిక మూలవాసులైన ‘సెటాకెట్’ తెగకు చెందిన యువరాణి టుస్కావాంటా ఈ ప్రాంతంలో కట్టెలు కొట్టుకునేందుకు వచ్చే తెల్లజాతి యువకుడితో ప్రేమలో పడింది. టుస్కావాంటా తండ్రి వారి ప్రేమను నిరాకరించడంతో ఆమె సరస్సులో దూకి ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఆమె ఆత్మ ఈ సరస్సులోనే ఉందని, సరస్సులోకి వచ్చే పురుషులను బలిగొంటూ ఉందని లాంగ్ ఐలండ్ జనాలు చెప్పుకుంటుంటారు. గడచిన శతాబ్దకాలంలో ఈ సరస్సులో పడి 160 మందికి పైగా యువకులు అంతుచిక్కని పరిస్థితుల్లో మరణించారు. ఈ సరస్సులోని దయ్యం ఏడాదికి కనీసం ఒక యువకుడినైనా బలిగొంటుందని ఇక్కడి జనాల నమ్మకం. ఈ సరస్సు తీరంలో డేవిడ్ ఇగ్నేరీ (74) దాదాపు ముప్పయి ఏళ్ల పాటు లైఫ్‌గార్డ్‌గా పనిచేశాడు. తాను పనిచేసిన కాలంలోనే ఈ సరస్సులో పడి ముప్పయి మంది మరణించారని, వారందరూ యువకులేనని అతడు చెబుతున్నాడు. స్థానికుల నమ్మకాలు, భయాలకు తోడు ఈ సరస్సులో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడంతో ఇక్కడి జనాలు సరస్సులో పడి ఆత్మాహుతి చేసుకున్న యువరాణి కట్టెబొమ్మను భారీసైజులో ఇక్కడ నెలకొల్పారు. అమెరికా పర్యాటక శాఖ ఇక్కడ ఈ గాథను వివరిస్తూ, పెద్ద పెద్ద హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం విశేషం. -
Devil Fish: ఇటువంటి చేపను మీరెప్పుడైనా చూశారా?
ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం తలాయి గ్రామం సమీపంలో పెద్దవాగులో ఓ వింత చేప లభ్యమైంది. పనెం శంకర్ చేపలు పట్టేందుకు వెళ్లగా.. అతడికి ఈ చేప దొరికింది. నల్లమచ్చలతో ఆకారం వింతగా ఉండటంతో చేపను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు.ఈ విషయమై జిల్లా మత్స్యశాఖ ఫీల్డ్ అధికారి మధుకర్‌ను సంప్రదించగా.. ఈ చేపను డెవిల్ ఫిష్ అంటారని తెలిపారు. ఎక్కువగా ప్రాణహిత జలాల్లో సంచరిస్తుందని పేర్కొన్నారు. అయితే జిల్లాలో ఇప్పటివరకు జాలర్లకు దొరికిన ఘటనలు లేవని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ వైపు జిలాల్లో ఎక్కువగా వీటి సంచారం ఉంటుందని, ఈ చేపలు తినేందుకు పనికి రావని తెలిపారు.ఇవి చదవండి: చచ్చిన ఎలుకల కోసం రైల్వే పైలెట్ ప్రాజెక్ట్ -
కన్నడ హీరో దర్శన్‌కు మరో షాక్!
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి డెవిల్ సినిమా డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ అయిన మిలన ప్రకాశ్‌కు పోలీసులు మరోసారి విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు. శుక్రవారంనాడు ప్రకాశ్ విజయనగర ఏసీపీ ముందు హాజరయ్యారు. మరోసారి విచారణకు రావాలని శనివారం పోలీసులు ప్రకాశ్‌కు నోటీసులు ఇచ్చారు. రేణుకాస్వామి హత్య తరువాత హీరో దర్శన్ మైసూరులో డెవిల్ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఈ అంశాలపై సమాచారం కోసం ప్రకాశ్‌ను విచారించారు. 66 వస్తువుల సీజ్ రేణుకాస్వామి హత్యకేసుకు సంబంధించి దర్యాప్తు చేసిన పోలీసులు మొబైల్ఫోన్లో కలిపి మొత్తం 66 వస్తువులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. రేణుకాస్వామి దుస్తులు, సీసీ కెమెరాల ఫుటేజీ, మొబైల్ ఫోన్లు, దాడికి వాడిన వస్తువులు తదితరాలను సేకరించారు.కరావళి నుంచి దర్శన్ ఔట్?పరప్పన అగ్రహార జైలులో ఊచలు లెక్కిస్తున్న దర్శన్‌కు మరో షాక్ తగిలింది. కొత్తగా నిర్మిస్తున్న కరావళి సినిమా నుంచి దర్శన్‌ను తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తున్న కరావళిలో దర్శన్ ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల విడుదలైన పోస్టర్లో దర్శన్ కనిపించలేదు. దర్శన్ స్థానంలో కిచ్చ సుదీప్ నటిస్తున్నట్లు సమాచారం. ఇది దర్శన్ ఫ్యాన్స్‌కు మింగుడుపడడం లేదు. -
డెవిల్స్ పూల్! ఆ నీళ్లల్లో అడుగుపెడితే ప్రాణాలకు గ్యారెంటీ లేదట!!
క్వీన్స్లండ్, ఆస్ట్రేలియన్ బుష్‌లో ‘బబిందా బౌల్డర్స్ పూల్’ అనే విస్తారమైన ఈత కొలను.. సహజ అందాలకు కొలువు. కానీ ఆ నీళ్లల్లో అడుగుపెడితే ప్రాణాలకు గ్యారెంటీ లేదట. 1959 నుంచి ఇప్పటి వరకు ఆ కొలనులో పడి సుమారు 21 మందికి పైగా చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కొన్ని మృతదేహాలు ఇంకా దొరకను కూడా లేదు. ఆ కొలను రాళ్ల మధ్య ఉంటుంది. అక్కడ నీరు ఉన్నట్టుండి పెరుగుతుంది, అకస్మాత్తుగా తగ్గుతుంది.కాలాన్ని బట్టి.. సమయాన్ని బట్టి మారుతుంది. పైగా ఆ రాతికొండలకు లోతైన గోతులు, గుంతలు ఉంటాయి. వాటిల్లో నీళ్లు నిండి.. కొన్ని చోట్ల ఆ గుంతలు కనిపించను కూడా కనిపించవు. ఆ క్రమంలోనే అక్కడ చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు ఆ గోతుల్లో ఇరుక్కుని.. బయటికి రాలేక చనిపోతున్నారు. ఆ కొలనులో నీరు నిండుగా ఉన్నా.. నేల మట్టానికి చేరుకున్నా.. కళ్లు చెదిరే అందం అక్కడి ప్రకృతి సొంతం. అందుకే ఆ అందాలను చూడటానికి, ఈత కొట్టడానికి జనాలు ఎగబడుతుంటారు. కొన్ని డేంజర్ జోన్స్‌ని సూచిస్తూ హెచ్చరికలు, గమనికలు ఉన్న బోర్డ్స్ కనిపిస్తూనే ఉంటాయి. అయినా ప్రమాదాలు ఆగడంలేదు.అక్కడికి వచ్చే వారిలో ఒకరిని ఆ కొలను దగ్గరుండే దయ్యం ఎన్నుకుంటుందని.. వారిని చావుకు ఆహ్వానిస్తుందని.. బాధితులంతా అలా చనిపోయినవారేనని కొందరు స్థానికుల నమ్మకం. ఆ తరహాలోనే.. సమీపంలో నివసించే ఆదివాసులు.. హడలెత్తించే విషాద గాథనూ వినిపిస్తుంటారు. కొన్నేళ్ల క్రితం యిండింజి తెగకు చెందిన ఊలానా అనే అందమైన యువతి.. వరూనూ అనే ఆ జాతి పెద్దను వివాహం చేసుకుని.. కొత్త జీవితాన్ని ప్రారంభించిందట.అయితే వివాహమైన కొన్నాళ్లకి ఊలానా జీవితంలోకి మరొక తెగకు చెందిన డైగా అనే యువకుడు రావడంతో.. అది వారి మధ్య ప్రేమకు దారితీసింది. కొంతకాలం గుట్టుగా సాగిన ఆ బంధం.. ఉన్నట్టుండి బంధువుల మధ్య పంచాయతీకి రావడంతో అవమానాన్ని తట్టుకోలేక ఊలానా.. బబిందా బౌల్డర్స్ పూల్‌లో దూకి ఆత్మహత్య చేసుకుందట. అయితే ఆమె ఆ కొలనులోకి దూకే క్రమంలోనే ‘డైగా డైగా’ అని అరిచిందట. ఆ అరుపులకు డైగా కూడా అదే కొలనులో దూకి చనిపోయాడు.అయితే డైగా దూకడం, చనిపోవడం అంతా.. ఊలానా చనిపోతూనే కళ్లరా చూసిందట. తాను చనిపోతున్న సమయంలోనే.. తన ప్రియుడి చావుని చూస్తూ.. భీకరంగా ఏడ్చిందట. ఆ కన్నీరే ఆ కొలను నీటిమట్టాన్ని పెంచిందని.. కొలనులో ప్రమాదకరమైన గుంతలను ఏర్పరచిందని వారంతా చెబుతారు. అందుకే ఆ ప్రాంతాన్ని వారు హాంటెడ్ ప్రదేశంగా నమ్మి.. అటువైపు పోవద్దని హెచ్చరిస్తుంటారు.మొదట బాధితుడు లేదా బాధితురాలి శరీరంలోకి డైగా ఆత్మ చేరుతుందని.. నీటిలో ఉన్న ఊలానా ఆత్మ.. ప్రేమగా ‘డెగా డైగా’ అని పిలవగానే.. బాధితులు తమపై తాము నియంత్రణ కోల్పోయి.. నీటిలో ఇరుక్కునేలా డైగా ఆత్మ చేస్తుందని.. అలా ఆత్మల ప్రేమకు అమాయకులు బలవుతున్నారనేది స్థానికుల మాట.మరోవైపు 1940లో జాన్ డొమినిక్ అనే ఎనిమిదేళ్ల బాలుడు ఆ నీటిలో మునిగి చనిపోయాడు. అతడి కుటుంబం అక్కడే అతడి పేరున స్మారక ఫలకాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆ ఫలకాన్ని తన్నిన ఓ యువకుడు.. ఆ తర్వాత నుంచి అదృశ్యమయ్యాడని, డొమినిక్ ఆత్మే అతడ్ని మాయం చేసిందనే మరో హారర్ స్టోరీ వినిపిస్తూ ఉంటుంది.ఒకానొక సాయంత్ర వేళ ఒక జంట ఆ కొలను అందాలు చూడటానికి వెళ్తే.. ఉన్నట్టుండి నీళ్లు అనకొండలా పైకి లేచి.. రాళ్ల మీదున్న వారిని కొలనులోకి లాక్కెళ్లడం ఓ వ్యక్తి కళ్లారా చూశాడట. అప్పటి నుంచి ఆ కొలనుపై పుకార్లు మరింతగా పెరిగిపోయాయి. ఏదిఏమైనా ఆ ప్రదేశంలో ఏ శక్తి ఉంది? ఎందుకు అంతమంది చనిపోతున్నారు? అనేది మాత్రం నేటికీ మిస్టరీనే. – సంహిత నిమ్మన -
వామ్మో దెయ్యం..!
గోవిందరావుపేట: మండల పరిధిలోని చల్వాయి వట్టెవాగులో దెయ్యం సంచరిస్తుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఐదారులు నెలల నుంచి వట్టెవాగులో దెయ్యం తిరుగుతుందంటూ ప్రచారం సాగుతోంది. అయితే దెయ్యం ఫొటోఅని చెబుతూ ఓ చిత్రాన్ని సామాజిక మాద్యమాల్లో పోస్టు చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామానికి 5కిలోమీటర్ల దూరంలో ఉన్న వట్టెవాగుకు పరిసరాల్లోని పంటపొలాలకు రైతులు రేయింబవళ్లు పనులకు వెళ్తుంటారు. కొందరు జంతువేటకు వెళ్తోండగా.. మరికొందరు వట్టెవాగులో ఇసుక దందా చెస్తుంటారు. దీనికి తోడు ఈ మధ్యకాలంలో కొంతమంది వట్టెవాగు పరిసర ప్రాంతాల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారని చుట్టుపక్కల గ్రామాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో వీరిలో ఎవరో ఒకరు తమ పని సులభంగా ఏఆటంకం లేకుండా జరిగేందుకు ఇలా దెయ్యం ఉందని ప్రచారం చేస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. ఏదిఏమైనప్పటికీ స్థానికంగా ప్రభుత్వ అధికారులు ఇలాంటి ప్రచారంపై అవగాహన కల్పించి ప్రజల్లోని అభద్రతాభావాన్ని పోగొట్టాలని కోరుతున్నారు. -
రెండు ఓటీటీల్లోకి పూర్ణ నటించిన హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే
మరో హారర్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన పూర్ణ నటించిన హారర్ మూవీ ఇది. ఇందులో 'బిగ్‌బాస్ 7' ఫేమ్ శుభశ్రీ కూడా ఓ కీలక పాత్ర చేసింది. తాజాగా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుందని, ఒకేసారి రెండు ఓటీటీల్లో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎప్పుడు రాబోతుంది? (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) హీరోయిన్గా తెలుగు, తమిళంలో సినిమాలు చేసిన పూర్ణ.. ప్రస్తుతం సహాయ పాత్రలు, డ్యాన్స్ నంబర్స్ చేస్తూ బిజీగా మారింది. మొన్నీమధ్య 'గుంటూరు కారం'లో కుర్చీ మడతపెట్టి సాంగ్‌లో కిరాక్ స్టెప్పులేసి అదరగొట్టేసింది. ఈమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ హారర్ మూవీ 'డెవిల్'. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు నెల తిరగకుండానే టెంట్ కోటా, అమెజాన్ ప్రైమ్‌లోకి స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సులున్నాయి. మార్చి 1 నుంచి రెండు ఓటీటీల్లో 'డెవిల్' స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. హేమ(పూర్ణ) అలెక్స్ అనే ఫేమస్ లాయర్ని పెళ్లి చేసుకుంటుంది. కానీ అతడు తన ఆఫీస్‌లోనే పనిచేసే సోఫియా(శుభశ్రీ)తో రిలేషన్షిప్లో ఉంటాడు. ఓరోజు యాక్సిడెంట్ ద్వారా హేమ జీవితంలోకి రోషన్(త్రిగుణ్) వస్తాడు. ఆ తర్వాత ఏమైంది? రోషన్, హేమల బంధం గురించి తెలిసిన అలెక్స్ ఏం చేశాడు? చివరకు ఏమైందనేదే కథ. పూర్ణ యాక్టింగ్ బాగానే చేసినా థియేటర్లలో సినిమా ఫెయిలైంది. ఓటీటీలో కాబట్టి టైంపాస్ కోసమైనా సరే చూసేస్తారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?) -
రెండు వారాల్లోనే ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ స్టార్ హీరో సినిమా!
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ‘డెవిల్’. అభిషేక్ పిక్చర్స్‌ఫై అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ అంచనాల మధ్య గతేడాది డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కల్యాణ్ రామ్ డెవిల్ సినిమా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. బ్రిటీష్ కాలంలోని గూఢచారి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఈనెల 14 నుంచి స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ట్వీట్ చేశారు. థియేటర్లలో చూడడం మిస్సయినవారు ఎంచక్కా కుటుంబంతో కలిసి చూసేయండి. Wishing everyone a happy Sankranti! Can't wait to watch #Devil on Amazon Prime Video on Jan 14. @NANDAMURIKALYAN @iamsamyuktha_ #Devilthemovie - The British Secret Agent. @amazonIN pic.twitter.com/VAfWJQ8Gw5 — ABHISHEK PICTURES (@AbhishekPicture) January 13, 2024 -
వరుస హిట్స్‌తో జోరు చూపిస్తున్న సంయుక్త మీనన్
బ్యూటీ విత్ టాలెంట్ అనే గుర్తింపు మలయాళ హీరోయిన్స్ కు ఉంది. వారి లెగసీని టాలీవుడ్ లో కొనసాగిస్తోంది హీరోయిన్ సంయుక్తా మీనన్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ హీరోయిన్...ఐదు వరుస సూపర్ హిట్ సినిమాలతో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారింది. భీమ్లా నాయక్ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ సరసన బింబిసార, ధనుష్ తో కలిసి సార్, సాయి ధరమ్ తేజ్ జోడీగా విరూపాక్ష మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకుంది. రీసెంట్ గా కల్యాణ్ రామ్ డెవిల్ తో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్..ఇలా సంయుక్తా చేసిన ప్రతి సినిమాలోనూ ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. చేసిన ప్రతి సినిమా సక్సెస్ కావడంతో సంయుక్తా ఉంటే సినిమాకు ఒక పాజిటివ్ వైబ్, క్రేజ్ ఉంటుందనే పేరు టాలీవుడ్ దర్శక నిర్మాతలు, హీరోల్లో వచ్చేసింది. కంటిన్యూగా వస్తున్న సక్సెస్ తో సంయుక్తా మీనన్ కు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ దక్కుతున్నాయి. ప్రస్తుతం ఆమె నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభులో నాయికగా నటిస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమ తన ప్రతిభను గుర్తించి అందిస్తున్న అవకాశాలు, ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానం ఎంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తున్నాయని చెబుతోంది సంయుక్తా మీనన్. మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ తో నటిగా పేరు తెచ్చుకోవాలని ఉందని అంటోంది. -
తారక్‌పై కోపం కల్యాణ్ రామ్ మీద తీర్చుకున్న చంద్రబాబు, బాలయ్య బ్యాచ్
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ సినిమా భారీ అంచనాల మధ్య శుక్రవారం (డిసెంబర్ 29) విడుదలైంది. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్ లైన్‌తో వచ్చిన ఈ సినిమాకు మంచి ప్రచారమే దక్కింది. సినిమా విడుదలకు ముందు కల్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలతో డెవిల్ నష్టపోయాడని తెలుస్తోంది. మరోవైపు జూ ఎన్టీఆర్ మీద ఉన్న కోపాన్ని టీడీపీ సోషల్ మీడియా విభాగం కల్యాణ్ రామ్ మీద చూపించిందా..? అంటే నిజమే అని నేటి డెవిల్ కలెక్షన్స్ చెబుతున్నాయి. డెవిల్ విడుదలకు ముందు కల్యాణ్ రామ్ ఏం అన్నారు 2024 ఎన్నికల్లో ఎటువైపు ఉంటారని ఒక ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్‌కు ప్రశ్న ఎదురైంది. అందుకు సమాధానంగా ఆయన ఇలా చెప్పారు. 'ఇది నా ఒక్కడి నిర్ణయం కాదు.. ఫ్యామిలీ అంతా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. అందువల్ల ఫ్యామిలీ అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత చెబుతాను.' అన్నాడు. వెంటనే కల్యాణ్ రామ్‌కు మరో ప్రశ్న ఎదురైంది. ఫ్యామిలీ అంటే ఎవరు..? మీరు, ఎన్టీఆర్‌నే కదా.. ఇంకెవరు లేరు కదా.. అని మళ్లీ అడిగితే, అవును, మేమిద్దరమే మిగిలాం.. ఇద్దరమే కలిసి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. కానీ తన తాత గారి సొంతమైన టీడీపీ పార్టీ ఉంది కదా.. అటువైపే ఉంటామని ఆయన చెప్పలేదు. దీంతో టీడీపీలో గుబులు ఏర్పడింది. తారక్ మీద టీడీపీ బ్యాచ్‌లో కోపం.. ఎఫెక్ట్ చూపిన డెవిల్ కలెక్షన్స్ చంద్రబాబు, బాలకృష్ణ ఇద్దరూ ఒకవైపు ఉంటే జూ ఎన్టీఆర్ మరోవైపు ఉన్నాడు. వారి మధ్య అనేక విభేదాలతో కూడిన కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నారా లోకేష్‌కు తారక్ ఎక్కడ పోటీ తగులుతాడో అని కావాలనే టీడీపీకి జూ ఎన్టీఆర్‌ను దూరం చేశాడు చంద్రబాబు. ఈ విషయం జగమెరిగిన సత్యం. టీడీపీ కోసం గతంలో ప్రాణాలకు తెగించి ఎన్టీఆర్ పనిచేశాడు. అతనిలోని టాలెంట్‌ను గమనించి చంద్రబాబు జాగ్రత్త పడుతూ వచ్చాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ ప్రచారం చేసిన అన్నీ ప్రాంతాల్లో టీడీపీ ఓడిపోయిందని పచ్చ మీడియాలో ప్రచారం చేపించాడు. దీంతో తారక్ పార్టీకి దూరం అయ్యాడు. కాలక్రమేనా అలాంటి పాపాలే చంద్రబాబును వెంటాడాయి. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కానీ చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు కానీ తారక్ రియాక్ట్ కాలేదని, టీడీపీ బ్యాచ్ ఓపెన్‌గానే గగ్గోలు పెట్టింది. అలా తారక్‌తో వైరంతో పాటు దూరం పెరిగింది. చాలా ఏళ్ల నుంచి చంద్రబాబు, బాలయ్యకు తారక్ దూరంగానే ఉన్నాడు. దీంతో తారక్‌పై టీడీపీ నేతలు కోపం పెంచుకున్నారు. ఇదే తన అన్నగారు అయిన కల్యాణ్ రామ్ చిత్రంపై ఎక్కువగా ప్రభావం పడింది. టీడీపీకి చెందిన పలు సోషల్ మీడియా ఖాతాల నుంచి బహిరంగంగానే పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబు, బాలకృష్ణ, టీడీపీ అభిమానులు ఎవరూ డెవిల్ సినిమా వైపు వెళ్లకండి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. డెవిల్ సినిమాను బహిష్కరిస్తున్నట్లు వారు ఓపెన్‌గానే ప్రచారం చేశారు. సినిమా బాగున్నా కూడా ఇంత తక్కువ మొత్తంలో కలెక్షన్స్ రావడం ఏంటి..? అంటూ ట్రేడ్ అనలిస్ట్‌లే ఆశ్చర్య పోతున్నారు. తారక్, కల్యాణ్ రామ్ ఇద్దరూ టీడీపీ వైపు రాకుంటే వారి సినిమాలకు టికెట్లు కూడా చిరగవు అని భయపెడుతూ పచ్చ మిడీయాలో డిబెట్లు కూడ జరిగిన విషయం తెలిసిందే. కానీ అక్కడ ఉండేది టైగర్ అని టీడీపీ మంద మరిచిపోయినట్లు ఉంది. -
Devil Success Celebrations: కల్యాణ్ రామ్ ‘డెవిల్’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
రామ్ చరణ్ పేరు ఎత్తగానే కళ్యాణ్ రామ్ రియాక్షన్ చూడండి
-
అమెరికాలో జాబ్ చేసుకునే వాడిని సినిమాల్లోకి ఎందుకు వచ్చానంటే..!
-
Devil Movie Review: డెవిల్ మూవీ రివ్యూ
టైటిల్: డెవిల్ నటీనటులు: కల్యాణ్ రామ్, సంయుక్త మీనన్, మాళవిక నాయర్, సంయుక్త మీనన్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్, సత్య, ఎస్తర్ నోరోన్హా నిర్మాణ సంస్థ: అభిషేక్ పిక్చర్స్ కథ-మాటలు: శ్రీకాంత్ విస్సా దర్శకత్వం: అభిషేక్ నామా సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్. ఎస్ ఎడిటర్: తమ్మిరాజు విడుదల తేది: డిసెంబర్ 29,2023 కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1945లో సాగుతుంది.స్వాతంత్రం కోసం పని చేస్తున్న ఆజాద్ హింద్ ఫౌజ్ చీఫ్ సుభాష్ చంద్రబోస్ ఇండియాకు వస్తున్నట్లు తన అనుచరులకు తెలియజేస్తాడు. తన ఎక్కడ ల్యాండ్ అవ్వాలనేది కోడ్ రూపంలో తెలియజేయాలని తన ముఖ్య అనుచరుడు త్రివర్ణకు లేఖ ద్వారా తెలియజేస్తారు. చంద్రబోస్ ఇండియాకు వస్తున్నట్లు తెలుసుకున్న బ్రిటీష్ ఆర్మీ.. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. అదే సమయంలో మద్రాసు ప్రెసిడెన్సీలోని రాసపాడు జమీందారు కూతురు విజయ(అభిరామి) హత్య జరుగుతుంది. ఈ కేసు విచారణ బాధ్యతలను బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (కల్యాణ్ రామ్)కు అప్పజెప్పుతారు. డెవిల్కి విజయ కజిన్ నైషేద(సంయుక్త మీనన్)పై అనుమానం కలుగుతుంది. ఆమెతో ప్రేమలో పడినట్లు నటించి అసలు విషయం తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. బోస్‌ను పట్టుకునే ఆపరేషన్‌కు ఈ కేసుతో ఉన్న సంబంధం ఏంటి? బోస్ ముఖ్య అనుచరుడు త్రివర్ణ ఎవరు? బోస్ ఇండియాకు వస్తున్నట్లు బ్రిటీష్ సైన్యానికి ఎలా తెలిసింది? నైషేదను రహస్యంగా కలుస్తున్న వ్యక్తి ఎవరు? ఈ కథలో మాళవిక నాయర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. డెవిల్ కథ, కథనం రెండూ పాతవే. హీరో సీక్రెట్ ఏజెంట్‌గా ఉండి ఓ ఆపరేషన్‌లో పాల్గొనడం.. అతను తన ఒరిజినాలిటీ కప్పిపుచ్చి మరోలా నటించడం.. ప్రీక్లైమాక్స్ అసలు విషయం తెలియడం.. ఆ తర్వాత ఓ భారీ ఫైట్.. శుభం కార్డు.. ఈ తరహా కథలు తెలుగులో చాలానే వచ్చాయి. డెవిల్ కథ కూడా అదే. కాకపోతే సుభాష్ చంద్రబోస్ చుట్ట కథను నడిపించడం ఈ సినిమాకు ఉన్న ప్రత్యేకత. కథనం మాత్రం కొత్త సీసాలో పాత సారానే అన్నట్లుగా సాగుతుంది. ఊపిరి బిగపట్టుకొని చూసే సన్నివేశాలను సైతం చాలా సింపుల్‌గా తెరకెక్కించారు. సుభాష్ చంద్రబోస్ పాయింట్‌తో కథను చాలా ఆసక్తికరంగా ప్రారంభించారు. ఆ తర్వాత కథంతా జమీందారు కూతురు హత్య చుట్టూ తిరుగుతుంది. ఆ హత్య ఎవరు చేశారనేది సస్పెన్స్‌లో పెట్టి ప్రతి పాత్రపై అనుమానం కలిగేలా కథనాన్ని నడిపించాడు దర్శకుడు. అయితే ఈ క్రమంలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కహనీ మాత్రం కథను పక్కదోవ పట్టించడమే కాకుండా.. నీరసంగా సాగుతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్ బాగుటుంది. అలాగే అక్కడ ట్విస్ట్ రివీల్ చేసి ద్వితియార్థంపై ఆసక్తి కలిగించేలా చేశారు. సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు బాగుంటాయి. అయితే ఈ తరహా ట్విస్టులు గతంలో చాలా సినిమాల్లో చూశాం. ఇక అసలు ట్విస్ట్ రివీల్ అయ్యాక కథపై ఆసక్తి పూర్తిగా సన్నగిల్లుతుంది. క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఈజీగా అర్థమైపోతుంది. ఇక చివర్లో హీరో చేసే యాక్షన్ సీన్ మరింత బోరింగ్ అనిపిస్తుంది. వీఎఫ్ఎక్స్ మరింత పేలవంగా ఉన్నాయి. ఈ సినిమా దర్శకుడు మారడం.. చివరకు అభిషేక్ నామానే ఆ బాధ్యతలు తీసుకొని తెరకెక్కించాడు. అయితే నిర్మాతగా ఆయన సినిమాను రిచ్‌గా తెరకెక్కించగలిగాడే తప్ప.. దర్శకుడిగా మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. ఎవరెలా చేశారంటే.. కల్యాణ్ రామ్ నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకోవడమే కాదు.. ఆ పాత్రల్లో జీవిస్తాడు కూడా. నెగెటివ్ షేడ్స్ ఉన్న డెవిల్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. యాక్షన్ సీన్స్ తెరకెక్కించిన విధానం బాగోలేదు కానీ కల్యాణ్ రామ్ ఉన్నంతలో చక్కగా నటించాడు. నైషేదగా సంయుక్త మీనన్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. ఇక మాళవిక నాయర్‌కి ఈ చిత్రంలో మంచి పాత్ర లభించింది. ఆమె నిడివి తక్కువే అయినా..గుర్తిండిపోయే పాత్ర తనది. శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్, సత్య, ఎస్తర్ నోరోన్హా, సెఫీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథకి స్పీడ్ బ్రేకర్లుగా అడ్డు తగులుతాయే తప్ప ఆకట్టుకునేలా లేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. ద్వితియార్థంలో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
Devil Twitter X Review: ‘డెవిల్’ ట్విటర్ రివ్యూ
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డెవిల్’. అభిషేక్ పిక్చర్స్‌ఫై అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది. సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంపై మొదట్లో భారీ అంచనాలేమీ లేవు కానీ.. ప్రచార చిత్రాలు విడుదలైన తర్వాత సినిమాపై ఆసక్తి పెరిగింది. ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 29) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్లు ఫస్ట్ డే ఫస్ట్‌షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. డెవిల్ ఎలా ఉంది? కల్యాణ్ రామ్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర విషయాలు ట్విటర్(ఎక్స్)వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. డెవిల్ చిత్రానికి ఎక్స్‌లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా బాగుందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. కల్యాణ్ రామ్ వన్‌మ్యాన్ షో అని చెబుతున్నారు. అదే సమయంలో వీఎఫ్ఎక్స్ విషయంలో చిత్ర బృందం మరింత జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేదని కామెంట్ చేస్తున్నారు. #Devil review : Decent First half with Good interval block👌 Very good second half with good twist and turns 💥💥 Hituuuuuu bommmaaaaaaa👌 3.5/5 — Chennai Tarak (@chennaitarak) December 29, 2023 ఫస్టాఫ్ బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. సెకండాఫ్‌లో వచ్చే మలుపులు, ట్విస్టులు ఆకట్టుకున్నాయంటూ ఓ నెటిజన్ 3.5 రేటింగ్ ఇచ్చాడు. #Devil Review: 2.75/5 Average 1st Half ,Decent 2nd Half👍 Slow Screenplay, seems dragged at times BGM is Good👍@NANDAMURIKALYAN acting 👍 Songs are okay, few twists worked. Overall An Average Movie. Can give it a try for its setup and visuals#Devara #Salaar #GunturKaaram pic.twitter.com/mCHfwT4zG8 — GS (@Thanks2Cinema) December 28, 2023 ఫస్టాఫ్ యావరేజ్, సెకండాఫ్ డీసెకంట్, స్లో స్క్రీన్‌ప్లే, కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. బీజీఎం అదిరిపోయింది. కల్యాణ్ రామ్ యాక్టింగ్ బాగుంది అంటూ మరో నెటిజన్ 2.75/5 రేటింగ్ ఇచ్చాడు. Slow paced with good interval...Few scenes are boring 🥱....Bad screenplay, director has good stry but unable to potray..May be because of last moment director changes..#Devil — karthik (@karthik170920) December 28, 2023 Good 1st Half 👍 Good story point A Bit slow to takeoff but Gripped well and maintained intriguingly well Perfect blend of Commercial elements and investigative narration Bgm👍 Interval bang is good Vfx could have been much better #Devil — PKC (@PKC997) December 28, 2023 #Devil First Half : “DECODING BEGINS” 👉INTERESTING FIRST HALF WITH GOOD INTERVAL BLOCK 👉@NANDAMURIKALYAN Excellent Performance with Extraordinary Production Values 👉#HarshavardhanRameshwar impresses with his BGM#DevilReview #NandamuriKalyanRam — PaniPuri (@THEPANIPURI) December 29, 2023 ' -
ఈ సినిమా నా బిడ్డలాంటిది..ఆ విషయంలో మాత్రమే బాధపడ్డా: డెవిల్ డైరెక్టర్
నందమూరి హీరో కల్యాణ్ రామ్ డెవిల్ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని నవీన్ మేడారం దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్గా నటించింది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై నిర్మించగా.. శ్రీకాంత్ విస్సా కథను అందించారు. అయితే ఇప్పటికే పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఈనెల 29న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే గతంలో ఈ ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ నవీన్ తప్పుకుంటున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో దర్శక-నిర్మాతగా అభిషేక్ నామా పేరు తెరపైకి వచ్చింది. తాజాగా ఈ వివాదంపై నవీన్ మేడారం స్పందించారు. ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించినప్పటికీ తనకు క్రెడిట్ దక్కలేదంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. నవీన్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'డెవిల్ చిత్రం కోసం దాదాపు మూడేళ్లు శ్రమించా. స్క్రిప్ట్‌తో సహా సినిమాలోని ప్రతి అంశాన్ని నా ఆలోచనకు అనుగుణంగా తెరకెక్కించా. ఈ సినిమాను హైదరాబాద్, వైజాగ్, కారైకుడిలో షూట్ చేశాం. చిన్న చిన్న సన్నివేశాలతో సహా దాదాపు 105 రోజులు కష్టపడ్డాం. నేను అనుకున్న విధంగా ఈ చిత్రం తెరకెక్కించా. నాకు కేవలం ప్రాజెక్ట్ మాత్రమే కాదు. ఈ సినిమా నా బిడ్డలాంటిది. ఎవరు ఎన్ని చెప్పినా డెవిల్ నా సినిమానే.' అని రాసుకొచ్చారు. ఇప్పటిదాకా ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను మౌనంగా ఉన్నా. కానీ నా మౌనాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకే ఈ పోస్ట్ పెడుతున్నా. అహంకారం, దురాశతో తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితంగానే ఈ వివాదం మొదలైంది. ఈ వివాదంలో చిత్రబృందానికి సంబంధించిన ఏ వ్యక్తిపైనా నేను చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు. దర్శకుడిగా నాకు క్రెడిట్ ఇవ్వలేదనే బాధపడుతున్నా. నా టాలెంట్‌పై నాకు నమ్మకం ఉంది. నా కెరీర్లో మరింత ముందుకు వెళ్లాలనుకుంటున్నా.' అని పోస్ట్ చేశారు. కల్యాణ్‌రామ్ ఈ సినిమా కోసం ఎంతో శ్రమించారని.. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మూవీ తప్పకుండా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నా. డిసెంబర్ 29న ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని వీక్షించాలని కోరుకుంటున్నా. మరో కొత్త చిత్రానికి సంతకం చేశా. ఆసక్తికరమైన స్క్రిప్ట్ కోసం పనిచేస్తున్నా. త్వరలోనే వెల్లడిస్తానని నవీన్ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Naveen Medaram (@naveen_medaram) -
ఈ హిట్‌తో ఈ ఏడాదికి వీడ్కోలు
∙‘డెవిల్’ సినిమా సీక్వెల్‌కి 50 శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ‘డెవిల్’ కి వచ్చే స్పందన బట్టి సీక్వెల్ చేయాలా? వద్దా అనేది ప్రకటిస్తాం. తమ్ముడి (ఎన్టీఆర్) ‘దేవర’ సినిమా 85 శాతం షూటింగ్ పూర్తయింది. మేం చేసే సినిమాల ఔట్పుట్ గొప్పగా ఉండాలనుకుంటాం.. అందుకే జాగ్రత్తలు తీసుకుని చేస్తాం. నేను, తారక్ ‘దేవర’ విషయంలో క్లియర్‌గా ఉన్నాం. మేం సంతృప్తి చెందిన వెంటనే సినిమా గురించి అప్డేట్ ఇస్తాం. అంతేకానీ అప్డేట్ ఇవ్వాలనే ఒత్తిడితో పని చేయలేం కదా? ► ‘‘నటుడిగా ఇరవై ఏళ్ల ప్రయాణంలో (మొదటి చిత్రం ‘తొలి చూపులోనే’ – 2003) చాలా సంతోషంగా ఉన్నాను. ఈ వృత్తిలో చాలా నేర్చుకున్నాను.. వేరే వృత్తిలో అయితే ఇంత నేర్చుకోలేకపోయేవాడినేమో? సినిమాల వల్ల ఎంతోమందితో మాట్లాడటం, పని చేయడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. వ్యక్తిగతంగా ఓ మంచి తండ్రిగా, భర్తగా పరిణితి చెందాను’’ అని హీరో కల్యాణ్ రామ్ అన్నారు.అభిషేక్ పిక్చర్స్ పై అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘డెవిల్’. కల్యాణ్ రామ్ హీరోగా, సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ చెప్పిన విశేషాలు. ► 2021లో ‘బింబిసార’ షూటింగ్ టైమ్‌లో రచయిత శ్రీకాంత్ విస్సా నాకు ‘డెవిల్’ కథ చెప్పారు. 1940 బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఈ కథలో హీరో క్యారెక్టర్ కొత్తగా అనిపించింది. నన్ను దృష్టిలో పెట్టుకునే కథ రాశారా? అని అడిగాను. ‘‘నేను ‘డెవిల్’ని కథగానే రాశాను. అభిషేక్ నామాగారు మీకు చెప్పమన్నారు. మీరు కమర్షియల్ హీరో కదా.. ఇలాంటి కథ ఒప్పుకుంటారా?’’ అని శ్రీకాంత్ విస్సా అన్నారు. హీరో క్యారెక్టర్, బ్యాక్‌డ్రాప్ అలాగే ఉంచి, కమర్షియల్ పంథాలో స్క్రిప్ట్‌లో మార్పులు చేయమన్నాను. శ్రీకాంత్ రెండు, మూడు నెలలు సమయం తీసుకుని మార్పులు చేర్పులు చేయడంతో సినిమాప్రారంభించాం. ► ప్రేక్షకులకు కొత్త తరహా చిత్రాలు అందించేందుకు ప్రయత్నిస్తుంటాను. అయితే ఒక్కోసారి వాణిజ్య అంశాలు మిస్ అవుతుంటాను. నా గత చిత్రం ‘అమిగోస్’కి మరికొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలనే ఆలోచన నాకు ఆ రోజు రాలేదు. డైరెక్టర్‌తో మాట్లాడి ఆ పని చేసుండాల్సింది.. ఆ తప్పు నాదే. అందువల్ల మిస్‌ఫైర్ అయిందనుకుంటున్నాను. కానీ, ‘డెవిల్’లో వాణిజ్య అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఇన్వెస్టిగేటివ్ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ అవడం నాకు కొత్తగా అనిపించింది. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అదే అనుభూతి చెందుతారు. ‘డెవిల్’ హిట్‌తో 2023కి వీడ్కోలు పలుకుతామనే నమ్మకం ఉంది. ► ‘డెవిల్’లో నా క్యారెక్టర్లో గ్రే షేడ్స్ ఉండవు. ప్రతి విషయాన్ని వివరంగా చూపిస్తున్నాం. ఈ చిత్రాన్ని అభిషేక్ నామాగారు అద్భుతంగా తీశారు. నా అంచనాలకు మించి సౌందర్ రాజన్‌గారు విజువల్స్ ఇచ్చారు. కాస్ట్యూమ్ డిజైనర్ రాజేశ్‌తో 2017 నుంచి వర్క్ చేస్తున్నాను. ‘డెవిల్’లో నా పాత్ర కోసం దాదాపు 90 కాస్ట్యూమ్స్‌ని వాడాం. నా పాత్రకి భారతీయతను ఆపాదించే ప్రయత్నం చేశారాయన. ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ మంచి నేపథ్య సంగీతం అందించారు. ‘బింబిసార’కి కీరవాణిగారిలా ‘డెవిల్’ విషయంలో హర్షవర్ధన్ న్యాయం చేస్తాడా? అనుకున్నాను. అయితే సినిమా చూసిన తర్వాత సంతోషంగా అనిపించింది. ‘బింబిసార’ హిట్ తర్వాత సంయుక్తా మీనన్‌తో మళ్లీ నటించాను. హీరోకు సమానంగా తన పాత్రకిప్రాధాన్యత ఉంటుంది. మాళవిక పాత్ర కూడా చక్కగా ఉంటుంది. ప్రతి పాత్రకుప్రాధాన్యం ఉంటుంది. నేను ఒకే సమయంలో రెండు పడవల ప్రయాణం (నటుడు–నిర్మాత) చేయాలనుకోను. నటనకు ఎంత కష్టపడాలో.. నిర్మాణంలో అంతకు మించి కష్టపడాలి. ‘ఓం’ సినిమా విషయంలో నాకు ఆ విషయం అర్థమైంది. అప్పటి నుంచి మా బ్యానర్లో చేసే సినిమాలకు సంబంధించిన సినిమాల కథ మాత్రమే నేను వింటాను. మిగిలిన విషయాలన్నీ మా హరిగారు చూసుకుంటారు. -
Devil Movie: కళ్యాణ్ రామ్ 'డెవిల్' రన్‌టైమ్ ఎంతంటే?
సినీ లవర్స్.. ఈ డిసెంబర్ నెలను ఎంతగానో ఎంజాయ్ చేశారు. పాన్ ఇండియా రేంజ్లో యానిమల్, డంకీ, సలార్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అందరి దృష్టి నందమూరి కళ్యాణ్ రామ్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’ సినిమాపై పడింది. ఈ ఏడాది భారీ అంచనాలతో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు అలాంటి అంచనాలతో ‘డెవిల్’ రానుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. రన్ టైమ్ ఎంతంటే? గత ఏడాది బింబిసార వంటి సోషియో ఫాంటసీ చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించాడు కళ్యాణ్ రామ్. ఈ ఏడాదిని ‘డెవిల్’తో ఘనంగా పూర్తి చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్లకు అద్భుత స్పందన లభించింది. బ్రిటీష్ కాలంలో గూఢచారి ఎలా ఉండేవారనే విషయాన్ని అసలు ఎవరూ ఊహించలేరు. అలాంటి కొత్త విషయాన్ని డెవిల్ మూవీలో ఆవిష్కరిస్తుండటం విశేషం. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. 2 గంటల 26 నిమిషాలుగా డెవిల్ రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు. నెక్స్ట్ లెవల్.. ప్రతి ఫ్రేమ్‌ని రిచ్‌గా అప్పటి బ్రిటీష్ కాలాన్ని ఆవిష్కరిస్తూ రూపొందించారు. మేకింగ్ పరంగా బడ్జెట్ విషయంలో నిర్మాత అభిషేక్ నామా ఎక్కడా రాజీపడలేదని స్పష్టమవుతోంది. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ, గాంధీ నడికుడికర్ ఆర్ట్ వర్క్ ఆకట్టుకుంటున్నాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన నేపథ్య సంగీతం వీటన్నింటినీ నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేలా ఉంది. డెవిల్ సినిమా ఈ నెల 29న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా మాటలు, స్క్రీన్ ప్లే, కథను అందించారు. తమ్మిరాజు ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. చదవండి: కొత్త వ్యాపారం మొదలుపెట్టిన మనోజ్- మౌనిక.. దేశం నలుమూలలా తిరిగి.. -
ప్రభాస్ 'స్పిరిట్' సినిమా ఛాన్స్ నాకే దక్కింది: మ్యూజిక్ డైరెక్టర్
కల్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ‘డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’. సంయుక్తా మీనన్ హీరోయిన్గా, మరో హీరోయిన్ మాళవికా నాయర్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల 29న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో ఈ చిత్రసంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ మాట్లాడుతూ– ‘‘డెవిల్’ సినిమాలో మూడు పాటలు ఉన్నాయి. ఇది పీరియాడికల్ ఫిల్మ్ కాబట్టి ప్రత్యేక వాయిద్యాలను వాడాం. ‘దూరమే..’ పాటను బుడాపెస్ట్‌లో షూట్ చేశాం. అలాగే ‘దిస్ ఈజ్ లేడీ రోజ్..’ పాటను ర్యాపర్ రాజకుమారితో పాడించాం. ఈ పాట సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. అలాగే నేపథ్య సంగీతం చాలా బాగుంటుంది. అయితే సంగీత దర్శకులు, నటీనటులు ఎంత ఎఫర్ట్ పెట్టినా విజువల్ సపోర్ట్ ఉండాలి. ఈ విషయంలో ఈ చిత్రం కెమెరామేన్ సౌందర్ రాజన్‌గారు ప్రాణం పెట్టి అద్భుతంగా వర్క్ చేశారు. సెకండాఫ్‌లోని ఓ ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్‌లో కల్యాణ్‌రామ్ గారి నట విశ్వరూపాన్ని ఆడియన్స్ చూస్తారు. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డులు రావొచ్చని నాకనిపిస్తోంది’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘భవిష్యత్‌లో డైరెక్షన్ చేసే అవకాశం ఉంది. ఇద్దరు గిటారిస్ట్స్ మాత్రమే ఉండేలా ఓ సినిమా, డ్రమ్స్ శివమణిగారి బయోపిక్ తీయాలని ఉంది. ‘యానిమల్’ తర్వాత బాలీవుడ్లో చాలా అవకాశాలు వస్తున్నాయి. అవి చర్చల దశలో ఉన్నాయి. ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా గారు చేయనున్న ‘స్పిరిట్’ సినిమాకు సంగీతం అందించనున్నాను’’ అన్నారు. -
సిగ్గుండాలి.. 9 నెలలవుతున్నా డబ్బు ముట్టలేదు: డెవిల్ విలన్ ఫైర్
బింబిసార సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు హీరో నందమూరి కళ్యాణ్ రామ్. అయితే ఆ తర్వాత త్రిపాత్రాభినయంతో చేసిన అమిగోస్ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఇతడు డెవిల్ అనే భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఉపశీర్షిక. మాళవికా నాయర్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా స్వీయదర్శకత్వంలో నిర్మించాడు. మొదట్లో అతడు.. తర్వాత ఇతడు ఈ సినిమా ఆది నుంచి ఏదో ఒక వివాదంలో చుట్టుకుంటూనే ఉంది. మొదట్లో ఈ సినిమాకు నవీన్ మేడారం దర్శకుడు అని చెప్పారు. రిలీజైన పోస్టర్లోనూ అతడినే డైరెక్టర్‌గా ప్రస్తావించారు. తర్వాత టీజర్ రిలీజ్ చేసినప్పుడు మాత్రం దర్శకుడి స్థానంలో అభిషేక్ నామా పేరును పెట్టేశారు. తాజాగా ఈ సినిమాలో విలన్‌గా నటించిన యాక్టర్ మార్క్ బెనింగ్టన్ చిత్రయూనిట్‌పై తీవ్ర విమర్శలు చేశాడు. నాకు డబ్బులివ్వలేదు మార్క్ మాట్లాడుతూ.. 'డెవిల్ సినిమా షూటింగ్ మొదట్లో బాగానే జరిగింది. చివరి షెడ్యూల్ జరిగేటప్పుడు మాత్రం కొన్ని మార్పుచేర్పులు జరిగాయి. నా పాత్ర షూటింగ్ అయిపోయి 9 నెలలు కావస్తోంది. ఇప్పటివరకు నాకు డబ్బులు ముట్టనేలేదు. అంతేకాదు, నా పాత్రకుగానూ వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించారు. అది నేను ట్రైలర్లో చూసి చాలా బాధపడ్డాను. ఇలా చేయడం నాతో చేసుకున్న కాంట్రాక్టును ఉల్లంఘించడమే అవుతుంది' అని మండిపడ్డాడు. ఇలాంటి పని చేయడానికి కాస్తైనా సిగ్గుండాలంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లోనూ డెవిల్ నిర్మాతలపై ఫైర్ అయ్యాడు. మెంటల్ టార్చర్.. తాజాగా ఈ విషయంపై డెవిల్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత మోహిత్ రాల్యాని స్పందించాడు. నటుడి పోస్ట్‌కు కామెంట్ చేస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చాడు. 'నీ మేనేజర్ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పుడో ఇచ్చేశాం. అయినా కూడా ఇంకా డబ్బు కావాలంటూ మానసికంగా వేధిస్తున్నారు. నీ పాత్రకు వేరేవారితో డబ్బింగ్ చెప్పిన విషయానికి వస్తే.. నువ్వు తెలుగు మాట్లాడగలవా? లేదు.. అలాంటప్పుడు ఇంగ్లీష్ డైలాగులకు నీ వాయిస్, తెలుగు డైలాగులకు వేరొకరి వాయిస్ ఎలా వాడగలం? అగ్రిమెంట్లో ఆ రూల్ లేదు.. పైగా మీడియాలో మా నిర్మాణ సంస్థ ప్రతిష్ట దిగజార్చేలా వార్తలు ప్రచారం చేయిస్తున్నావు. నీ వాయిస్ వాడలేదని మమ్మల్ని కించపరుస్తున్నావు. నీ మాటలు నమ్మిన కొందరు నిజానిజాలు తెలుసుకోకుండానే వార్తలు రాసేస్తున్నారు. అసలు అగ్రిమెంట్లో నీ పాత్రకు నువ్వే డబ్బింగ్ చెప్పాలన్న నిబంధనే లేదు. ఎప్పుడేం చేయాలనేది నిర్మాత ఇష్టం. మనం ఇలా అందరి ముందు గొడవపడుతుండటం అసహ్యంగా ఉంది. నీపై నాకు చాలా గౌరవం ఉంది. ఆ విషయం నీక్కూడా తెలుసు. నీ నుంచి ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తుంటా' అని రాసుకొచ్చాడు. ఈ గొడవ సద్దుమణిగిందో మరేంటో కానీ కాసేపటి క్రితమే మార్క్ బెనింగ్టన్ డెవిల్ చిత్రయూనిట్‌ను తిడుతూ పెట్టిన పోస్టులను డిలీట్ చేశాడు. డెవిల్ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. చదవండి: ఏడాది తిరగకముందే భార్యకు కటీఫ్.. నాలుగోసారి ప్రేమలో మ్యూజిక్ డైరెక్టర్.. -
కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ ట్రైలర్
-
రాసుకోండి...‘డెవిల్’ బాగుంటుంది: కల్యాణ్‌రామ్
‘‘మంచి కథ, విజువల్స్, మ్యూజిక్ ఉండి.. దానికి తగ్గ టీమ్ వర్క్ చేసినప్పుడు ప్రేక్షకులు థియేటర్స్‌కి వద్దన్నా వస్తారని ‘బింబిసార’ సినిమా టైమ్‌లో చెప్పాను. దాన్ని మీరు (ఫ్యాన్స్, ఆడియన్స్) నిజం చేశారు. అదే కోవలో ‘డెవిల్’ మంచి కథా కథనాలతో వస్తోంది. రాసుకోండి.. సినిమా చాలా బావుంటుంది. ఈ చిత్రం సరికొత్త కథతో ఉంటుంది’’ అని హీరో కల్యాణ్ రామ్ అన్నారు. ఆయన హీరోగా, మాళవికా నాయర్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘డెవిల్’. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘ఖర్చుకి వెనకాడకుండా ‘డెవిల్’ని రూపొందించిన అభిషేక్ నామాగారికి థ్యాంక్స్. సినిమా అనేది టీమ్ ఎఫర్ట్. దాన్ని ప్రేక్షకులు ఆదరిస్తే వచ్చే ఆనందమే వేరు. ‘బింబిసార 2’ను వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో మొదలుపెడతాం. తమ్ముడు ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా గ్లింప్స్‌ని త్వరలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ‘‘డెవిల్’ కోసం రెండేళ్ల పాటు కల్యాణ్ రామ్‌గారు మరో సినిమా చేయకుండా పని చేశారు. ఇందులో ఆయన యాక్షన్, నటన అదిరిపోతాయి. మా ‘డెవిల్’ హిట్‌తో 2023 ముగుస్తుంది’’ అన్నారు అభిషేక్ నామా. -
Devil: హీరో కల్యాణ్ రామ్ ‘డెవిల్’ ట్రైలర్ విడుదల (ఫొటోలు)
-
'డెవిల్' ట్రైలర్ ఇంట్రెస్టింగ్.. అంతా బాగానే ఉంది కానీ?
కల్యాణ్ రామ్ కొత్త సినిమా 'డెవిల్'. ఇప్పటికే రిలీజై పోవాల్సిన ఈ చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. డిసెంబరు 29న పాన్ ఇండియా రేంజులో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఈ మధ్యే అధికారికంగా ప్రకటించారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. అంచనాలు పెంచేస్తున్న ఈ పెంచేస్తున్న ఈ ట్రైలర్ ఎలా ఉందంటే? (ఇదీ చదవండి: 'కాంతార' సినిమాలో ఛాన్స్ కోసం స్టార్ హీరోయిన్ తిప్పలు!) అభిషేక్ నామా నిర్మిస్తూ-దర్శకత్వం వహిస్తున్న 'డెవిల్' సినిమాలో కల్యాణ్ రామ్.. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించబోతున్నాడు. అదే విషయాన్ని ట్రైలర్లో చూపించారు. ఓ అమ్మాయి చావుని ఎంక్వైరీ చేసే క్రమంలో ఓ సీక్రెట్ ఏజెంట్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు అనేది మూవీలో చూపించబోతున్నారు. ట్రైలర్ బాగుంది, సినిమాపై హీరో కల్యాణ్ రామ్ కాన్ఫిడెంట్‌గానే ఉన్నాడు. కానీ 'సలార్' రిలీజైన వారం రోజులకే ఈ చిత్రం థియేటర్లలోకి వస్తుంది. ప్రభాస్ సినిమా హిట్ అయితే.. మూవీ లవర్స్ అదే మాయలో ఉంటారు. ఇదే జరిగితే మాత్రం 'డెవిల్'కి ఇది మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: లక్కీ హీరోయిన్ కోసం నిర్మాతగా మారిన 'జైలర్' డైరెక్టర్) -
డెవిల్ కోసం కళ్యాణ్‌రామ్ ఎన్ని కాస్ట్యూమ్స్ మార్చాడో తెలుసా?
కల్యాణ్ రామ్ టైటిల్ రోల్లో రూపొందిన తాజా చిత్రం ‘డెవిల్’. అభిషేక్ పిక్చర్స్‌పై అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో రూ΄పొందించిన చిత్రం ఇది. ఈ నెల 29న ఈ పీరియాడికల్ డ్రామాని విడుదల చేయనున్నారు. బ్రిటిష్‌వారు భారతదేశాన్ని పరిపాలించిన కాలానికి సంబంధించిన కథ ఇది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ భారతీయుడు అయినప్పటికీ బ్రిటిష్ గూఢచారి డెవిల్ పాత్రలో కనిపించనున్నారు. భారతీయత ఉట్టిపడటంతో పాటు స్టైలిష్ గూఢచారిగా చూపించేందుకు కాస్ట్యూమ్ డిజైనర్ రాజేశ్‌తో 90 కాస్ట్యూమ్స్ తయారు చేయించారు అభిషేక్ నామా. ఈ దుస్తుల గురించి కాస్ట్యూమ్ డిజైనర్ రాజేశ్ మాట్లాడుతూ– ‘‘హీరో లుక్ కొత్తగా ఉండేలా ట్రై చేశాం. ధోతి, పైన ఒక వెయిస్ట్ కోటుతో ఆయన కాస్ట్యూమ్స్‌లో భారతీయత కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇటలీ నుంచి తెప్పించిన మోహైర్ ఊల్‌తో 60 బ్లేజర్స్, దేశీ కాటన్‌తో కుర్తాలు, ధోతీలు తయారు చేశాం. 25 వెయిస్ట్ కోట్స్ కుట్టాం. బ్లేజర్ జేబు పక్కన వేలాడుతూ ఉండేలా ఓ హ్యాంగింగ్ వాచ్‌ను ప్రత్యేకంగా తయారు చేయించాం’’ అన్నారు. -
డెవిల్ డేట్ ఫిక్స్
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన పీరియాడికల్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించారు. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేస్తున్నట్లుగా గురువారం చిత్ర యూనిట్ వెల్లడించింది. ‘‘ఈ చిత్రంలో ఎవరికీ అంతు చిక్కని ఓ రహస్యాన్ని ఛేదించే బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కల్యాణ్ రామ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్. -
దిస్ ఈజ్ లేడీ రోజ్..
కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రంలోని ‘దిస్ ఈజ్ లేడీ రోజ్..’ అంటూ సాగే రెండో పాటను సోమవారం విడుదల చేశారు. చిత్రసంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరచిన ఈ పాటకు శ్రీహర్ష ఇమాని సాహిత్యం అందించగా, రాజకుమారి పాడారు. ఈ పాటలో కల్యాణ్ రామ్‌తో కలిసి బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్ నొరౌజీ కాలు కదిపారు. ‘‘ప్రేక్షకులకు ఈ పాట ఓ కనువిందులా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్. -
అద్భుతమైన డెవిల్స్ బ్రిడ్జ్! ఆ నిర్మాణం ఓ అంతుచిక్కని మిస్టరీ!
కనువిందు చేసే కొన్ని దృశ్యాలు ఎంతగా ఆకట్టుకుంటాయో.. అంతే బెదరగొడతాయి. ప్రపంచంలో కొన్ని ఆసక్తికరమైన నిర్మాణాల వెనుక ఉన్న రహస్యమైన కథలే అందుకు ప్రతీకలు. జర్మనీ, సాక్సోనీ రాష్ట్రం, గోర్లిట్జ్ జిల్లా, గబ్లెంజ్ సమీపంలోని రాకోట్జ్ సరసుపైనున్న వంతెన అలాంటిదే. ఇది ఆ రాష్ట్రంలోనే అతిపెద్ద నేషనల్ పార్క్ అయిన కుమ్లౌ అజేలియా రోడడెండ్రన్ పార్క్‌కి ఆనుకుని ఉంది. ఇక్కడి ప్రకృతి అందం.. కనురెప్పలను క్షణం కూడా వాల్చనివ్వదు. ఎటు తిరిగి చూసినా స్వప్నలోకంలో విహరిస్తున్నట్లే అనిపిస్తుంది. ఈ వంతెనకు.. సర్కిల్ బ్రిడ్జ్, బసాల్ట్ బ్రిడ్జ్, కుమ్లౌ బ్రిడ్జ్ ఇలా చాలా పేర్లు ఉన్నాయి. సుందరమైన ఈ వంతెన.. సరసులో ప్రతిబింబిస్తూ.. ఎటు నుంచి చూసినా.. కచ్చితమైన కొలతలతో.. వృత్తాకారంలో కనువిందు చేస్తుంది. చలికాలంలో కిందున్న నీరంతా గడ్డకట్టి.. ఓ ఆర్చ్‌లా ఆకట్టుకుంటుంది. అగ్నిపర్వతాల శిల నుంచి ఏర్పడిన ‘బసాల్ట్’ అనే రాతితో పాటు మరిన్ని సహజమైన రాళ్లతో ఇది నిర్మితమైందని కొన్ని పరిశోధనలు తేల్చాయి. అయితే ఇది జనజీవనాన్ని కలిపే వారధి కాదని, కేవలం వీక్షకుల అహ్లాదం కోసం నిర్మించిన కట్టడం మాత్రమేనని కొందరు నిపుణుల ఉద్దేశం. దీన్ని 19వ శతాబ్దంలో ఓ మోతుబరి దగ్గరుండి కట్టించాడని స్థానికంగా కొన్ని కథనాలున్నా వాటికి సరైన ఆధారాల్లేవు. వైవిధ్యమైన ఒంపుతో మలచిన ఈ వంతెన.. ఎలాంటి వారినైనా మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ బ్రిడ్జ్ మీద కొన్ని కొనలు.. ముళ్ల కిరీటాన్ని తలపిస్తాయి. ఇంత గొప్ప కట్టడం మనుషులకు సాధ్యంకాదని, దెయ్యాలు దీన్ని నిర్మించాయని, సైతాను ఆదేశంతో ఇది ఏర్పడిందని, ఈ వారధి సమీపంలో ఆత్మలు సంచరిస్తూ ఉంటాయని కొందరు విశ్వసిస్తారు. అందుకే దీన్ని ‘డెవిల్స్ బ్రిడ్జ్’ అని పిలిచేవారు ఎక్కువయ్యారు. ఇక్కడ ప్రత్యేకమైన కలువ పువ్వులు, అరుదైన వృక్షజాతులు.. రకరకాల రంగులతో ఆకట్టుకుంటాయి. మరోవైపు కొందరు దైవచింతన కలవారు.. ఈ వంతెన నిర్మాణానికి ఒక ఆధ్యాత్మిక అర్థాన్ని వివరిస్తారు. ఇది మరొక ప్రపంచానికి మార్గమని సూచిస్తారు. దాన్నే బలంగా నమ్ముతుంటారు. ఇక్కడి అందాలను చూడటానికి చాలామంది ఔత్సాహికులు ఎగబడుతుంటారు. కానీ ఈ బ్రిడ్జ్ మీదకు అనుమతి లేదు. చుట్టూ ఉన్న అందాలను మాత్రం తరించొచ్చు. ఏది ఏమైనా ఈ బ్రిడ్జ్‌ని నిర్మించింది ఎవరు? ఎందుకు నిర్మించారు? ఎందుకు దెయ్యం పేరుతో భయంకరమైన కథలు పుట్టుకొచ్చాయి? అసలు ఆ కాలంలో ఇంత గొప్ప నిర్మాణం ఎలా సాధ్యమైంది లాంటి ఎన్నో ప్రశ్నలకు నేటికీ సమాధానాలు దొరకలేదు. --సంహిత నిమ్మన (చదవండి: ఇజ్రాయెల్ యుద్ధం వేళ తెరపైకి వచ్చిన దుస్సల కథ! ఎందుకు హైలెట్ అవుతోందంటే..) -
రాజకీయ నాయకురాలు మణి మేకల
మణి మేకల పవర్ఫుల్ రాజకీయ నాయకురాలు. ఆమె ప్రసంగాలు ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తాయి. మరి.. ఆ రాజకీయ నాయకురాలికి, బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌కి ఉన్న లింక్ ఏంటి? అనేది ‘డెవిల్’ చిత్రంలో చూడాల్సిందే. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో ఓ రహస్యాన్ని ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్నారు. పొలిటీషియన్ మణి మేకల పాత్రను మాళవికా నాయర్ పోషిస్తున్నారు. ఆదివారం మాళవిక లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో కథానాయికగా సంయుక్తా మీనన్ నటిస్తున్నారు. నవంబర్ 24న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘డెవిల్’ రిలీజ్ కానుంది. దేవాన్‡్ష నామా సమర్పణలో స్వీయ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, కెమెరా: సౌందర్ రాజన్. -
‘డెవిల్’ పాట కోసం విదేశీ వాయిద్యాలు..స్పెషలేంటి?
ఫలితాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలు, విలక్షణమైన పాత్రలను పోషిస్తూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు నందమూరి హీరో కల్యాణ్ రామ్. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఇటీవల ‘మాయే చేసే..’పాటను రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. డెవిల్ చిత్రం 1940లోని మదరాసి ప్రెసిడెన్సీ నేపథ్యంలో సాగుతుంది. అంటే స్వాతంత్ర్యం రాక ముందు ఉన్న బ్యాక్ డ్రాప్‌తో డెవిల్ సినిమాను తెరకెక్కించారు. సన్నివేశాలు, పాటలను కూడా అలాగే చిత్రీకరించారు. కాస్ట్యూమ్స్, బ్యాగ్రౌండ్ ఇలా ప్రతీ విషయంలో మేకర్స్ పలు జాగ్రత్తలను తీసుకున్నారు. నాటి కాలాన్ని, నాటి సంగీతాన్ని తెరపై చూపించే క్రమంలో దర్శక నిర్మాత అభిషేక్ నామా దక్షిణ భారత దేశపు సహజమైన లొకేషన్లను ఎంచుకున్నారు. కారైకుడిలోని ప్యాలెస్‌లో ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటలో విదేశీ వాయిద్యాలు వాడారట. దక్షిణాఫ్రికా నుంచి జెంబో, బొంగొ, డీజెంబోలు.. మలేసియా నుంచి డఫ్ డ్రమ్స్.. చైనా నుంచి మౌత్ ఆర్గాన్, దర్భుకా.. దుబాయ్ నుంచి ఓషియన్ పర్క్యూషన్, సింగపూర్ నుంచి ఫైబర్ కాంగో డ్రమ్స్, వెస్ట్ ఆఫ్రికా నుంచి హవర్ గ్లాస్, షేప్డ్ టాకింగ్ డ్రమ్ ఇలా రకరకాల వాయిద్యాలను ఈ పాటలో వాడారు. వీటి వాడకంతోనే శ్రోతలను నాటి కాలానికి, వింటేజ్ మూడ్‌లోకి తీసుకెళ్లేలా చేయాయని చిత్ర యూనిట్ పేర్కొంది. నవంబర్ 24న ఈ చిత్రం విడుదల కానుంది. -
మాయే చేసే...
‘బింబిసార’ వంటి హిట్ మూవీ తర్వాత కల్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘డెవిల్’. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 24న విడుదల కానుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘మాయే చేసే..’ అనే పాటను ఈ నెల 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. సత్య ఆర్వీ సాహిత్యం అందించిన ఈ పాటను, సిధ్ శ్రీరాం పాడారు. అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘పీరియాడిక్ స్పై థ్రిల్లర్ మూవీ ‘డెవిల్’. నటుడిగా కల్యాణ్ రామ్‌లోని ఓ కొత్త కోణాన్ని ఈ చిత్రంలో ప్రేక్షకులు చూస్తారు. సినిమా కథ, కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సీఈఓ: వాసు పొతిని,కెమెరా: సౌందర్ రాజన్ ఎస్. -
డెవిల్స్ ఏంజిల్
కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డెవిల్’. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్. సోమవారం (సెప్టెంబర్ 11) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘డెవిల్’ చిత్రంలో సంయుక్త పోషించిన నైషధ పాత్ర ఫస్ట్ లుక్‌పోస్టర్‌ను ‘డెవిల్స్ ఏంజిల్’ అంటూ మేకర్స్ విడుదల చేశారు. ‘‘తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను నవంబర్ 24న విడుదల చేస్తాం’’ అన్నారు అభిషేక్ నామా. -
కల్యాణ్‌రామ్ 'డెవిల్'.. ఆ సీన్ల కోసం భారీ సెట్స్!
అమిగోస్ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తోన్నభారీ బడ్జెట్ చిత్రం డెవిల్. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ఉపశీర్షిక. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. స్వాతంత్య్రానికి ముందు జరిగిన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: బాలీవుడ్లో ఆ సత్తా ఎవరికీ లేదు.. సౌత్‌లో అతనొక్కడే: ఎన్టీఆర్‌పై గదర్ డైరెక్టర్) ఈ మూవీ షూటింగ్ కోసం భారీ సెట్స్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 1940 కాలం స్టోరీ కావడంతో అందుకు తగినట్లుగానే షూటింగ్ సెట్‌ను రూపొందించారు. ఆ కాలం నాటి పరిస్థితులు కళ్లముందు కనిపించేలా డిజైన్ చేశారు. బ్రిటీష్ కాలంలో సెట్స్ వేయటం తనకెంతో ఛాలెంజింగ్‌గా అనిపించిందని ఆర్ట్ డైరెక్టర్ గాంధీ పేర్కొన్నారు. మన దేశం ఉన్నసయమానికి చెందిన తమిళనాడు, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ వంటి పలు ప్రాంతాల నుంచి సెట్స్ కోసం కావాల్సిన సామాగ్రిని ప్రత్యేకంగా తెప్పించారు. ఈ సెట్స్ చూస్తుంటే సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాకు హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతమందిస్తున్నారు.ఈ సినిమాను నవంబరు 24న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. 'డెవిల్' మూవీ కోసం వేసిన సెట్స్ .. వాటి విశేషాలు... * 1940 మద్రాస్ ప్రాంతంలోని ఆంధ్రా క్లబ్ * బ్రిటీష్ కాలానికి తగ్గట్లు 10 వింటేజ్ సైకిల్స్, 1 వింటేజ్ కారు * బ్రిటీష్ కవర్ డిజైన్ తో ఉన్న 500 పుస్తకాలు * 1940 కాలానికి చెందిన కార్గో షిప్ * 36 అడుగుల ఎత్తైన లైట్ హౌస్ సెట్ (వైజాగ్ సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో) అయితే ఈసెట్స్ వేయడానికి మొత్తం 9 ట్రక్కుల కలపను తెప్పించారు. వెయ్యి టన్నులకు పైగా ఐరన్, ఫైబర్, 10వేల చదరపు అడుగుల వింటేజ్ వాల్ పేపర్‌ను ఉపయోగించారు. -
డెవిల్ వస్తున్నాడు
కల్యాణ్ రామ్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ ఫిల్మ్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించారు. నవీన్ మేడారం దర్శకత్వంలో దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మించిన చిత్రం ఇది. తాజాగా ఈ సినిమాను నవంబరు 24న విడుదల చేస్తున్నట్లుగా ఆదివారం చిత్రయూనిట్ ప్రకటించింది. ‘‘ఎవరికీ అంతు చిక్కని ఓ రహస్యాన్ని చేధించే ఓ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా కల్యాణ్‌రామ్ ఆకట్టుకోబోతున్నారు’’ అని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్. -
కల్యాణ్ రామ్ 'డెవిల్' గ్లింప్స్ రిలీజ్.. కానీ డైరెక్టర్ మిస్సింగ్!
నందమూరి కల్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'డెవిల్'. 'ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్' అనేది ఉపశీర్షిక. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. జూన్ 05న నందమూరి కల్యాణ్ రామ్ బర్త్‌డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. (ఇది చదవండి: అటు మాజీభార్య ఇటు ప్రేయసి.. మధ్యలో ఆమిర్‌ఖాన్!) అయితే బింబిసారతో సూపర్ హిట్ కొట్టిన కల్యాణ్ రామ్‌కు.. అమిగోస్ రూపంలో డిజాస్టర్ ఎదురైంది. దీంతో ప్రస్తుతం కల్యాణ్ రామ్ కాస్తా డిఫరెంట్ స్టోరీతో అభిమానుల ముందుకొస్తున్నారు. నటిస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఈసారి మాత్రం మరో వైవిధ్యమైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని కళ్యాణ్ రామ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో బింబిసార కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. గ్లింప్స్ చూస్తే స్టోరీ మొత్తం బ్రిటీష్ కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ గ్లింప్స్‌లో 'మనసులో ఉన్న భావన ముఖంలో తెలియకూడదు.. మెదడులో ఉన్న ఆలోచన మాటల్లో బయటపడకూడదు. అదే గూఢచారికి ఉండాల్సిన ముఖ్య లక్షణం.' అనే డైలాగ్ ఈ చిత్రంపై అభిమానుల్లో మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. అయితే గ్లింప్స్ వీడియోలో డైరెక్టర్ పేరు ఎక్కడా కూడా కనిపించకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. పోస్టర్లో కానీ.. వీడియోలో కానీ డైరెక్టర్ పేరు కనిపించలేదు. అయితే దీనికి కారణాలేంటనే విషయంపై ఫ్యాన్స్ తెగ చర్చిస్తున్నారు. (ఇది చదవండి: అభిమానుల్ని మోసం చేస్తున్న స్టార్ హీరోలు!) -
‘హజ్’లో సైతాన్ను రాళ్లతో ఎందుకు కొడతారు? దీని వెనుక చరిత్ర ఇదే..
హజ్ యాత్ర జూన్ 26న ప్రారంభమయ్యింది. ఈ యాత్రలో భాగంగా ప్రపంచంలోని నలుమూలల నుంచి లక్షలాది ముస్లింలు సౌదీ అరబ్‌లోని మక్కా చేరుకుంటారు. ఈ యాత్రలో ఒక అంశం ఎంతో ప్రధానమైనది. అదే సైతాన్ను రాళ్లతో కొట్టడం. ఈ ప్రక్రయ వెనుకనున్న చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సైతాన్ను రాళ్లతో కొట్టడం వెనుక.. ‘హజ్’లో సైతాన్ను రాళ్లతో కొట్టే ప్రక్రియ ‘హజ్’లోని మూడవ రోజు జరుగుతుంది. ఆ రోజునే బక్రీద్ జరుపుకుంటారు. బక్రీద్ నాడు హజ్ యాత్రికులు ముందుగా మీనా పట్టణం చేరుకుంటారు. అక్కడ వారు సైతాన్ను మూడు సార్లు రాళ్లతో కొడతారు. మీనా పట్టణంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో నిర్మితమైన వివిధ స్థంభాలను రాళ్లతో కొడతారు. దీనిలోని మొదటి స్థంభం జమ్రాహె ఉక్వా, రెండవది జమ్రాహె వుస్తా, మూడవ స్థంభం జమ్రాహె ఉలా. ఎందుకు ఇలా చేస్తారంటే.. ఇస్లాంలో పేర్కొన్న వివరాల ప్రకారం ‘హజ్’లో పాల్గొన్నవారు రాళ్లతో మూడు స్థంబాలను కొడతారు. ఒకానొకప్పుడు హజ్రత్ ఇబ్రహీం సైతాన్ను పారదోలేందుకు ఈ స్థంభాలను రాళ్లతో కొట్టారని చెబుతారు. ఆ సమయంలో హజ్రత్ ఇబ్రహీం తన కుమారునికి కుర్బానీ ఇచ్చేందుకు వెళుతుండగా సైతాన్ అతనిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. హాజీ ఈ స్థంభాలను సైతాన్‌కు ప్రతీకలుగా భావించి రాళ్లతో కొట్టారట. మొదటి రోజు హాజీ కేవలం మొదటి స్థంభాన్ని మాత్రమే కొట్టారు. తదుపరి రెండు రోజుల్లో మిగిలిన రెండు స్థంభాలను కొట్టారని చెబుతారు. హజ్ యాత్ర నియమనిబంధనలివే.. హజ్ యాత్ర చేసే ముస్లింలు పలునిబంధనలు పాటిస్తారు. ఈ యాత్ర చేసేవారు తప్పనిసరిగా ముస్లింలు అయివుండాలి. ఈ యాత్రలో పాల్గొనేవారు ఎర్హమా ధరించాల్సి ఉంటుంది. ఈ యాత్రలో మహిళలు పాల్గొన్నట్టయితే వారు తల నుంచి పాదాలవరకూ కప్పివుండే దుస్తులు ధరించడం తప్పనిసరి. ఇది కూడా చదవండి: స్టార్‌షిప్ మరో ప్రయోగంపై ఎలన్ మస్క్ అప్డేట్ -
ఈమె దెయ్యమా.. మనిషా..? అనుమానం వస్తే తప్పులేదు.. ఎందుకంటే?
ఎదురుగా ఉన్నది దెయ్యమో మనిషో తేల్చుకోవడానికి కాళ్లు వెనక్కు తిరిగి ఉండటాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు జానపదులు. ఇక్కడ ఉన్న కెల్సీ గ్రబ్ దెయ్యమేమో అని అనుమానం వస్తే తప్పులేదు. ఎందుకంటే ఏకంగా ఆమె తన పాదం మొత్తాన్ని వెనక్కు తిప్పి గిన్నెస్ రికార్డును బద్దలు కొట్టింది. మే 2న ఈ రికార్డు నమోదైంది. ప్రస్తుతం ఈమె కాళ్ల వైపే లోకం అబ్బురంగా చూస్తోంది ‘పిల్లలకు గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే క్రేజ్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి నాక్కూడా ఉండేది. కాని నేను కూడా ఆ రికార్డ్ సాధిస్తాననుకోలేదు’ అని సంబరపడుతోంది కెల్సీ గ్రబ్. అమెరికాలోని న్యూ మెక్సికోలో ఆల్ బకాకీ అనే ఊరికి చెందిన 32 ఏళ్ల కెల్సీ తన కాలిని171.4 డిగ్రీలు వెనక్కు తిప్పడం ద్వారా గిన్నెస్ రికార్డు స్ధాపించింది. ‘గత సంవత్సరం ఏదో షాపులో గిన్నెస్ రికార్డ్–2021 పుస్తకం తిరగేశాను. అందులో కాలు వెనక్కు తిప్పే వ్యక్తి ఫొటో ఉంది. అతని కంటే ఎక్కువగా వెనక్కు ఎందుకు తిప్పకూడదు అనిపించింది’ అంది కెల్సీ. చదవండి: రిలేషనే కాదు.. ఎదో తెలియని ఎమోషన్.. జుకర్‌బర్గ్ ఫోటో వైరల్ ఐస్ స్కేటింగ్‌ను తరచూ సాధన చేసే కెల్సీ స్కేటింగ్‌లో పాదాలు చురుగ్గా ఉండాలి కనుక తను సాధన చేస్తే కాలిని వెనక్కు తిప్పగలదు అనుకుంది. ‘నేను పెద్దగా కష్టపడలేదు. అప్పుడప్పుడు పాదాన్ని వెనక్కు తిప్పుతూ ఉండేదాన్ని. కొన్నిసార్లు మోకాల్లో నొప్పి అనిపించేది. అప్పుడు మాత్రం కొంచెం మెల్లగా తిప్పేదాన్ని’ అని తెలిపింది కెల్సీ. ఆమె ఇప్పుడు ఎంత సాధన చేసిందంటే ‘జనం వెనక్కు తిరిగిన పాదాన్ని కాకుండా అంత సులభంగా పాదాన్ని తిప్పినందుకే ఎక్కువ ఆశ్చర్యపోతుంటారు’ అని నవ్వింది. స్నేహితులు ఆమె విన్యాసాన్ని పూర్తిగా గమనించాక గిన్నెస్ రికార్డ్స్ వారికి మెయిల్ పెట్టింది కెల్సీ. ‘ఇదేదో రికార్డు స్థాయి ఫీట్లాగానే ఉంది. వచ్చి పరీక్షించండి అని మెయిల్ పెట్టాను. చిన్నపిల్లల్లాగే ఉత్సాహంగా ఎదురు చూశాను. రికార్డు కన్ఫర్మ్ అయ్యాక చాలా సంబరపడ్డాను’ అందామె. సాధారణ జనంలో చాలా మంది కాలిని 90 డిగ్రీల వరకూ వెనక్కు తిప్పగలరు. కాని కెల్సీ దాదాపు 180 డిగ్రీలు వెనక్కు తిప్పడంతో ఈ వార్త వైరల్‌గా మారింది. -
ట్రైన్లో యాక్షన్ సీన్స్.. ఆ కిక్కే వేరప్పా!
తెరపై విలన్ని హీరో రఫ్ఫాడిస్తుంటే ప్రేక్షకులకు దక్కే కిక్కే వేరు. అందుకే యాక్షన్ సీన్స్‌ని ప్రత్యేకంగా డిజైన్ చేస్తుంటారు. ఇప్పుడు కొన్ని సినిమాల కోసం ట్రైన్లో ఫైట్ సీన్స్ డిజైన్ చేస్తున్నారు. ట్రైన్లో రిస్కీ యాక్షన్ సీన్స్ చూపించనున్న ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. ట్రైన్లో భారతీయుడు దర్శకుడిగా శంకర్ పరిచయమైన తొలి సినిమా ‘జెంటిల్‌మేన్’. ఈ సూపర్‌డూపర్ హిట్ ఫిల్మ్‌లో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించారు. ఈ సినిమా ప్రారంభంలోనే ఓ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. ఆసక్తికర విషయం ఏంటంటే... శంకర్ దర్శకత్వం వహించిన ఆ తర్వాతి చిత్రాల్లో రజనీకాంత్ ‘రోబో’, విక్రమ్ ‘ఐ’ (తెలుగులో ‘మనోహరుడు’) వంటి వాటిలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ట్రైన్ యాక్షన్ సీక్వెన్సెస్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు శంకర్. 1996లో హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపు పాతికేళ్ల తర్వాత కమల్, శంకర్ కాంబోలోనే ‘ఇండియన్’కు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ సౌత్ ఆఫ్రికాలో జరగనుంది. అక్కడ దాదాపు రెండు వారాలపాటు షూటింగ్‌ని ΄్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లోనే ఓ భారీ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారట శంకర్. ఫారిన్ ఫైటర్స్, ఫారిన్ యాక్షన్ మాస్టర్స్ ఈ ఫైట్‌ను డిజైన్ చేయనున్నట్లు సమాచారం. ‘ఇండియన్ 2’లో ఉన్న మేజర్ హైలైట్స్‌లో ఇదొకటనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. పది కోట్ల ఫైట్ ఒకవైపు కమల్‌హాసన్‌తో ‘ఇండియన్ 2’ సినిమా చేస్తూనే మరోవైపు రామ్‌చరణ్‌తో ‘సీఈవో’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా చేస్తున్నారు శంకర్. ఈ సినిమా షూటింగ్‌ని యాక్షన్ సీన్‌తోనే ఆరంభించారు. భారీ స్థాయిలో ఓ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు దర్శకుడు శంకర్. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో వందమందికి పైగా ఫైటర్స్ పాల్గొన్నారని, ఈ ఫైట్ ఖర్చు రూ. పది కోట్లు పైనే అనే టాక్ వినిపిస్తోంది. మరి.. ఈ ఫైట్ ఏ విధంగా ఉంటుందనేది తెలియాలంటే వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ నెల 27న రామ్‌చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్, రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం రామ్‌చరణ్ పాల్గొనగా ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. పాటకు ప్రభుదేవా కొరియోగ్రాఫర్. నాగేశ్వరరావు దోపిడీ స్టువర్టుపురం దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ లుక్‌లో రవితేజ రైలు పట్టాలపై ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కథ రీత్యా ట్రైన్లో నాగేశ్వరరావు దోపీడీ చేసే సీన్ అట అది. ట్రైన్లో చిన్నపాటి యాక్షన్ టచ్ కూడా ఉంటుందట. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. డెవిల్ పోరాటం స్వాతంత్య్రానికి పూర్వం అంటే 1945లో బ్రిటిష్‌వాళ్ళు పరిపాలించిన మద్రాస్ ప్రెసిడెన్సీ నేపథ్యంలో జరిగే కథతో రూపొందుతున్న చిత్రం ‘డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్పోస్టర్లో కల్యాణ్ రామ్ ఓ ట్రైన్‌పై ఉన్నట్లు కనిపిస్తుంది. యాక్షన్ సీన్లో భాగంగా ఈ ట్రైన్ వస్తుందని తెలుస్తోంది. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. బొగ్గు దొంగ తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల సమీపంలో గల ఓ కల్పిత గ్రామంలో జరిగే కథగా రూపొందిన చిత్రం ‘దసరా’. ఇందులో మద్యానికి బానిస అయి, బొగ్గు దొంగతనం చేసే ధరణి పాత్రలో కనిపిస్తారట నాని. ఇటీవల విడుదలైన ‘దసరా’ ట్రైలర్లో బొగ్గు ఉన్న గూడ్స్ ట్రైన్‌పై నాని ఉన్న సీన్ కనిపిస్తుంది. ఇది ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ అని టాక్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. లోకల్ ట్రైన్లో ఏజెంట్ లోకల్ ట్రైన్లో ఫైట్స్ చేశారట అక్కినేని అఖిల్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన స్పై యాక్షన్ ఫిల్మ్ ‘ఏజెంట్’. గత ఏడాది వేసవిలో ‘ఏజెంట్’ షూటింగ్ హైదరాబాద్ మెట్రో రైల్లో జరిగింది. ట్రైన్లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా సురేందర్ రెడ్డి చిత్రీకరించారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇక ‘ఏజెంట్’ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఎనిమిది కోట్ల యాక్షన్ సూరి, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ ప్రధాన పాత్రల్లో వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విడుదలై’. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంలోని తొలి భాగం ‘విడుదలై పార్ట్ 1’ ఈ నెల 31న విడుదల కానుంది. ఈ చిత్రం కోసం దర్శకుడు వెట్రిమారన్ ఓ భారీ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌ను తీశారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఖర్చు దాదాపు రూ. 8 కోట్లు అని సమాచారం. కాగా ‘విడుదలై’ రెండో భాగం విడుదలపై కూడా త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఈ చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాల్లో ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. -
భయపెట్టనున్న యాషికా ఆనంద్!
తమిళ సినిమా: అందాల నటి యాషికా ఆనంద్ భయపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆ మధ్య కారు యాక్సిడెంట్ వల్ల నటనకు కొంత గ్యాప్ ఇచ్చారు. గాయం నుంచి కోలుకోవడంతో మళ్లీ సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. తాజాగా ఈమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం చైత్ర. యాషికా ఆనంద్ దెయ్యంగా నటిస్తున్న ఈ హారర్ర్ థ్రిల్లర్ కథా చిత్రంలో నటుడు అవి తేజ్, శక్తి మహేంద్ర, పూజ, రమణన్, కన్నన్, లూయిస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మార్స్ ప్రొడక్షన్స్ పతాకంపై కె.మనోహరన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వ బాధ్యతలను ఎం.జెనిత్ కుమార్ నిర్వహిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ పిజ్జా, డీమాంటీ కాలనీ చిత్రాల తరహాలో విభిన్న కథా, కథనాలతో కూడిన చిత్రంగా చైత్ర ఉంటుందన్నారు. ఇంతకుముందు ఎప్పుడు తెరపై చూడనటువంటి థ్రిల్లర్‌తో కూడిన హారర్ర్ కథా చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. చిత్రం షూటింగ్ పూర్తిగా తిరునల్వేలి జిల్లాలోని కావల్ తినరు ప్రాంతంలో నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని.. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. టీకన్నన్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సతీష్ కుమార్ చాయాగ్రహణను, ప్రభాకరన్ మెయ్యప్పన్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
జగిత్యాలలో దెయ్యం చేప.. ఇది వేరే చేపల్నిబతకనివ్వదు!
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని అన్ని చెరువులు దాదాపు నిండుకుండను తలపించాయి. చెరువుల్లో చేపలు పట్టేందుకు మత్య్సకారులు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో ఓ అరుదైన చేప వలకు చిక్కింది. చేపలు పట్టడానికి వెళ్లిన జాలరు గొల్లపెళ్లి రాజనర్సకు అరుదైన వింత చేప తన వలలో పడింది. ఈ విషయాన్ని జిల్లా మత్య్సశాఖ అధికారులకు తెలుపగా.. దీనిని డెవిల్(దెయ్యం) చేప అంటారని, ఇది ఎక్కువుగా సముద్ర జల్లాల్లో మాత్రమే కనిపిస్తుంటుందని అధికారులు తెలిపారు. మన తెలంగాణలోని వాగులో దొరకడం చాలా అరుదు అని పేర్కొన్నారు. కాగా ఈ రకపు డెవిల్ ఫిష్ పై నల్లటి మచ్చలు, ముళ్లు ఉంటాయి. ఈ చేప సుమారు అరకేజీకి పైగానే బరువు ఉంది. తాను ఎన్నో ఏళ్ల నుంచి చేపలు పడుతున్నా ఇలాంటి చేప ఎప్పుడూ చూడలేదని జాలరు రాజనర్సు తెలిపాడు. ఒంటినిండా జీబ్రా రకం గీతలతో కనిపించే ఈ చేపలో తినేందుకు మాంసం ఉండదు. పైగా చేప నిండా ముళ్లు, చర్మం కప్పబడినట్లు ఉంటుంది. సముద్రజాతికి చెందిన ఈ చేప నోరు అడుగు భాగంలో ఉంటుంది. చర్మం అంతా దుప్పటి కప్పబడినట్టు కన్పిస్తుంది. ఈ చేప ఉన్నచోట వేరే చేపలు బతకడం కష్టమని.. తన చుట్టూ ఉన్న మత్స్యాలను ఇది ఆహారంగా తీసుకుంటుందన్నారు. డెవిల్ ఫిష్‌కు పదునైన దంతాలు ఉండటం వల్ల వలలను సైతం కొరికి వేస్తుందని మత్య్సశాఖ అధికారులు చెబుతున్నారు. -
పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో నందమూరి కల్యాణ్ రామ్
హీరో కల్యాణ్‌రామ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇప్పటికే బింబిసారుడు అనే పీరియాడికల్ మూవీలో నటిస్తున్న కల్యాణ్ రామ్ తాజాగా మరో మూవీని అనౌన్స్ చేశారు. నవీన్ మేడారం దర్శకత్వంలో రానున్న ఈ సినిమాకు డెవిల్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన డెవిల్ మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కల్యాణ్‌రామ్ లుక్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. పంచెకట్టులో చేతిలో రివాల్వర్‌తో కల్యాణ్ రామ్ లుక్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించనున్నారు. పోస్టర్‌ను బట్టి ఇది 1945 బ్రిటిష్ కాలంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ను ఆధారంగా చేసుకొని ఈ కథను రూపొందించినట్లు తెలుస్తోంది. కల్యాణ్ రామ్ లుక్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. డెవిల్తో పాటు మరో మూడు సినిమాలు ప్రస్తుతం కల్యాణ్ రామ్ చేతిలో ఉన్నాయి. ఈసారి హిట్టు కొట్టేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు కల్యాణ్ రామ్. -
ముక్కిడి గుట్ట శవం
దెయ్యాలు లేవని ఒక్కోసారి గట్టిగా నమ్మాల్సి ఉంటుంది.దెయ్యాలు ఉండుంటే బతికి ఉండగా తమను అన్యాయంగా చంపినవారికి ఊరికే వొదిలి ఉండేవా?ప్రతి మనిషి మనసులో దెయ్యం ఉంటుంది.అది చెడు చేయమని పురిగొల్పుతూ ఉంటుంది.దానికి లొంగితే తాత్కాలిక విజయం.శాశ్వత అపజయం.12 ఆగస్టు 2016.రాత్రి 9.45. రామన్నపేట పోలీస్ స్టేషన్లో ఫోన్ మోగింది.సీఐ ఎత్తాడు.‘ఓకే .. ఇప్పుడే బయల్దేరుతున్నాం..’ అంటూ క్యాప్‌ను తల మీదుగా సర్దుకున్నాడు. సీఐని గమనించిన సిబ్బంది అలెర్ట్ అయ్యారు. ‘ఆత్మకూరు ఎస్ఐ నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే బయల్దేరాలి’ అన్నాడు సీఐ. క్షణాల్లో అందరూ వెహికిల్‌లోకి ఎక్కారు.జీపు భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని రాఘవాపురం గ్రామానికి హుటాహుటిన చేరుకుంది.పోలీసు జీపు శబ్దం వింటూనే పరుగుపరుగున జనం అక్కడకు చేరుకున్నారు. ‘ఏమైంది?’ దిగుతూనే అడిగాడు సీఐ.‘సార్.. ఆ ముక్కిడిగుట్ట నుంచి భరించలేని వాసన. కుళ్లిపోయిన శవం వాసనలా ఉంది. భరించలేకుండా ఉన్నాం’ చెప్పారు అక్కడ చేరిన జనంలోంచి ఒకరిద్దరు. ‘మీరు మాతో రావల్సి ఉంటుంది. ఏంటో తెలుసుకుందాం..’ అన్నాడు సీఐ.‘అలాగే సార్’ అన్నారు వాళ్లు.జనంతో పాటుగా ముక్కిడిగుట్ట వైపుగా వెళ్లారు పోలీసులు. గాలి వీస్తున్నప్పుడల్లా దుర్వాసన కూడా వేగంగా వస్తోంది. కానీ, ఆ చీకట్లో ఏమీ కనిపించడం లేదు. పైగా చెట్ల పొదలు. టార్చిలైట్ల సాయంతో వెతికి చూశారు. లాభం లేదు.. అయినా వారి ప్రయత్నం మానలేదు.తెలతెలవారుతుండగా చెట్ల పొదల్లో లోయలాగ ఉన్న ప్రాంతంలో ఓ అమ్మాయిæ మృతదేహాన్ని గుర్తించారు. శవం పూర్తిగా కుళ్లిపోయి గుర్తుపట్టరాకుండా ఉంది. శరీరంపై పసుపు రంగు పంజాబీ డ్రెస్ ఉంది. ఆత్మకూరు ఎస్ఐ, రామన్నపేట సీఐ ఇద్దరూ అక్కడే ఉన్నారు. నల్లగొండ నుంచి డాగ్‌స్క్వాడ్ వచ్చింది. పోలీసు జాగిలం గుట్ట పైన, కింద పరిసరాల చుట్టూ తిరిగింది. అయినా ఎటువంటి ఆధారాలూ దొరకలేదు. అధారాల కోసం శవం ఉన్న ప్రదేశం నుంచి చుట్టూ యాబై గజాల దూరంలో మరోసారి అంగుళం అంగుళం వెతికారు. ఒకచోట పగిలిన ఎర్రటి గాజు ముక్కలు, మరికాస్త దూరంలో ఓ చెప్పుల జతతో పాటు రెండు బస్ టికెట్లుæలభించాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యా జరిగిన ముక్కిడిగుట్టపై దొరికిన బస్ టికెట్ల వివరాలు సేకరిస్తే అవి మహేశ్వరం బస్‌డిపోకు చెందినవని, ఆగస్టు 7న శంషాబాద్ నుంచి శివరాంపల్లికి ప్రయాణం చేసినవారివి అయి ఉంటాయని తెలిసింది. స్వాధీనం చేసుకున్న బస్ టికెట్ల ఆధారంగా సీఐ, ఎస్ఐ దర్యాప్తు ముమ్మరం చేశారు. మొదట శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు వారు చేరుకున్నారు. ‘ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వారంలో మిస్సింగ్ కేసులు ఏమైనా ఉన్నాయా’ అని అడిగాడు ఎస్ఐ. వెంటనే ఆ వివరాలు వచ్చాయి.పది రోజుల వ్యవధిలోనే ఐదు మిస్సింగ్ కేసులు నమోదు అయినట్లుగా అక్కడి పోలీసులు తెలిపారు. ఆ ఐదు మిస్సింగ్ కేసులలో ఒక అమ్మాయి ధరించిన దుస్తులు, చెప్పుల జత తమకు లభ్యమైన ఆధారాలతో సరిపోలడంతో హత్యకు గురైన అమ్మాయి 22 ఏళ్ల శివలీలగా గుర్తించారు పోలీసులు.తమ కూతురు మిస్ అయినట్టు శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన శివలీల తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించారు పోలీసులు. వివరాలన్నీ తెలుసుకున్న తల్లీతండ్రీ బోరుమన్నారు. ‘సార్.. ఈ అమ్మాయి మా శివలీలనే. తను అంత దూరం ఎందుకు వెళ్లిందో తెలియదు. ఈ దారుణానికి ఒడిగట్టిందో ఎవరో తెలియదు. ఈ ఏడాదే అమ్మాయి పెళ్లి చేద్దామనుకున్నాం. ఇలా జరిగింది’ కుమిలి కుమిలి ఏడుస్తున్న వారితో ‘చనిపోయిన మీ అమ్మాయిని మేం తెచ్చివ్వలేకపోవచ్చు. కానీ, నేరస్తులు ఎవరో ఎక్కడున్నా పట్టుకు తీరుతాం’ దృఢంగా చెప్పి బయటకు నడిచాడు సీఐ. శివలీలతోపాటు మరో వ్యక్తి ప్రయాణించినట్టు సంఘటన స్థలం వద్ద లభించిన బస్ టికెట్స్ చెబుతున్నాయి. కనుక శివలీలకు ఇతర వ్యక్తులతో ఉన్న పరిచయాల పట్ల ఆరాతీశారు పోలీసులు. శివలీల తల్లిదండ్రుల నుంచి, ఆమె స్నేహితులు, పరిచయస్తుల వద్ద నుంచి మరిన్ని వివరాలు సేకరించారు. ఆ వివరాల్లో శివలీలకు ఒక వ్యక్తితో ఉన్న పరిచయం గురించి పోలీసులకు తెలిసింది. దీంతో ఆ కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. శివలీలతో పరిచయం ఉన్నట్టుగా అనుమానిస్తున్న ఆ వ్యక్తి సెల్‌ఫోన్‌పై పోలీసులు దృష్టి సారించారు. ఆగస్టు 20. భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన ముప్పై ఏళ్ల రవి(పేరు మార్చాం)ని అరెస్ట్ చేశారు పోలీసులు. ముందు తనకేమీ తెలియదని బుకాయించిన రవి పోలీసుల విచారణలో అసలు నిజాలు బయటపెట్టాడు. అవి ఇలా ఉన్నాయి.బైక్ మెకానిక్‌గా అబ్దుల్లాపూర్ మెట్టు వద్ద పనిచేస్తుంటాడు రవి. హత్యకు గురైన శివలీల అబ్దుల్లాపూర్ మెట్టు వద్ద ఉన్న అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలోనే రవికి శివలీలతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆర్నెల్లు కలిసి తిరిగారు. తల్లిదండ్రులు వచ్చినప్పుడల్లా శివలీల పెళ్లి విషయం ప్రస్తావన వచ్చేది. దీంతో తనను పెళ్లి చేసుకోమని, లేకుంటే తమ విషయాన్ని పెద్దవాళ్లతో చెబుతానని శివలీల రవిపై ఒత్తిడి చేయడం ప్రారంభించింది. అయితే, రవికి మూడేళ్ల క్రితమే వివాహం అయింది. ఏడాది వయసున్న కూతురు కూడా ఉంది. తరచూ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్న శివలీలను కొన్నాళ్లు తప్పించుకు తిరిగాడు. కానీ, ఇంకా ఆలశ్యం చేస్తే నేరుగా ఇంటికే వచ్చేస్తానని బెదిరింపులకు దిగడంతో ఆమెనే అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు రవి. శివలీలను మట్టుపెట్టడానికి ఊరికి శివారులో ఉన్న ముక్కిడిగుట్ట సరైన ప్లేస్ అనుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా ప్లాన్‌ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు.మహేశ్వరంలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన శివలీలకు ఫోన్ చేసి..‘నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఇద్దరం కలిసి మా ఊరు వెళ్దాం. అక్కడ మా ఇంట్లో వాళ్లకు పరిచయం చేస్తాను. అక్కడ మావాళ్లతో మాట్లాడి మన పెళ్లికి ఒప్పిద్దాం. తర్వాత మీ అమ్మనాన్నలతో మాట్లాడుదాం, సరేనా’ అన్నాడు రవి. శివలీల సంతోషంగా ఒప్పుకుంది. ఆగస్టు 7న ఉదయం అమ్మమ్మ వద్దకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయల్దేరింది. ఆమెను మహేశ్వరం బస్‌డిపోలో కలుసుకున్నాడు రవి. ఇద్దరూ ముందుగా శివరామ్పల్లికి చేరుకున్నారు. అక్కడి నుంచి వలిగొండకు చేరుకుని రెండు రోజులు ఉండిపోయారు. 9 ఆగస్టు రాత్రి 7 గంటల ప్రాంతంలో ముక్కిడిగుట్టకు శివలీలను తీసుకొచ్చాడు రవి.అసలే అటవీ ప్రాంతంలా ఉంది. పైగా చీకటి. జన సంచారం ఏమాత్రం లేదు అక్కడ. ‘ఇంటికని ఇక్కడికెందుకు తీసుకొచ్చావు. బాగా చలిగా కూడా ఉంది’ చుట్టూ చూస్తూ అంది శివలీల. ‘పెళ్లి గురించి అడిగావు కదా. పెళ్లి చేసి పైకి పంపించేద్దామని’ అన్నాడు రవి వెటకారంగా. రవి మాటలకు శివలీలకు కోపం వచ్చింది. ‘ఇంత మోసం చేస్తావా. మీ ఇంటికని చెప్పి ఈ గుట్టకు తీసుకొస్తావా? ఊళ్లోకెళ్లి అందరికీ నీ విషయం చెప్పి నీ బతుకు బజారుకీడుస్తా’ ఆవేశంగా అంటూనే శివలీలఅక్కణ్ణుంచి ఊరి వైపుగా పరిగెత్తబోయింది. కానీ, రవి ఆమెను అడుగు ముందుకు పడనీయకుండా గట్టిగా పట్టుకున్నాడు. శివలీల చున్నీ ఆమె మెడ చుట్టూ గట్టిగా బిగించాడు. ఆ పెనుగులాటలో మహేశ్వరం డిపో బస్ టికెట్లు రవి జేబులో నుంచి పడిపోయాయి. శివలీల చేతి గాజులు పగిలి అక్కడే పడిపోయాయి. కాసేపటికి శివలీల నిర్జీవంగా వాలిపోయింది. శివలీల చనిపోయిందని నిర్ధారించుకున్న రవి పీడ విరగడ అయిందనుకుని ఆమె శరీరాన్ని కొంత దూరం లాక్కెళ్లి అక్కణ్ణుంచి చెట్ల పొదల్లోకి జారవిడిచి, ఊళ్లోకి వెళ్లిపోయాడు. ప్రేమ పేరుతో వంచించి, ఆమెను అడ్డు తొలగించుకోవడానికి హత్య చేసిన రవి ఈ విషయం ఎవరికీ తెలియదనుకున్నాడు. తెలిసే అవకాశమే లేదనుకున్నాడు. కానీ నేరం దాగదని, రవిని జైలుకు పంపించి నిరూపించారు పోలీసులు. – రేగోటి పాండురంగం, సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా -
పసుపు కుంకుమ
‘‘ఆలోచించేపని లేదు. చెప్పినట్లు చెయ్యండి. కొంచెం పసుపు, కుంకుమ కావాలి’’ అన్నాడు. తీసుకురాబోయింది ప్రమతి. ఆగమన్నాడు వీరభద్రం. ‘‘డబ్బాలోని పసుపు, భరిణెలోని కుంకుమ కాదు’’ అన్నాడు. ‘‘పట్టేశాను’’ అన్నాడు వీరభద్రం.ఉలిక్కిపడింది ప్రమతి. ఉలిక్కిపడకుండా ఉండేందుకు ప్రయత్నించాడు సహస్ర. ప్రమతి భర్త సహస్ర.‘పట్టేశాను’ అన్న వెంటనే, తన వెంట తెచ్చుకున్న బీకరులాంటి గాజు పాత్రలో పెట్టేసి, గట్టిగా బిరడా బిగించాడు వీరభద్రం. వీరభద్రం భూత వైద్యుడు కాదు. భూత తాంత్రికుడు. మనుషులకు పట్టే దెయ్యాల్ని వదిలించడంలో అతడికి ఇంట్రెస్ట్ లేదు. మనుషుల్ని వదలకుండా పట్టి పీడించే దెయ్యాల్ని బంధించడంలో అతడు ఎక్స్పర్ట్. ప్రమతి, సహస్ర మొదట తనను కలిసేందుకు వచ్చినప్పుడు అతడేం ఉత్సాహం చూపలేదు. ఏమిటన్నట్లు చూశాడు. ‘‘ద..ద..’’ అని ప్రమతి తత్తరపడుతుంటే.. సహస్రే చెప్పాడు, ‘‘దెయ్యం ఉన్నట్లుంది మా ఇంట్లో.. దాన్ని వదిలించాలి’’ అని. ‘‘ఎన్నాళ్ల నుంచి ఉందనుకుంటున్నారు మీ ఇంట్లో దెయ్యం?’’ అడిగాడు వీరభద్రం. భార్యాభర్తలు ముఖాలు చూసుకున్నారు. యువ దంపతులు వాళ్లు. పెళ్లయి ఒక వారమైనా అయినట్లు లేదు. అంత ఉక్కిరిబిక్కిరిగా ఉన్నారు. ‘‘ఏడాది నుంచీ ఉంటున్నాం. ఆ దెయ్యం కూడా ఏడాది నుంచీ మాతోనే ఉన్నట్లు అనిపిస్తోంది. దెయ్యం వదలట్లేదని, ఇంటినే వదిలేయడానికి కూడా లేదు. అద్దెల్లు కాదు. సొంతది. మాకోసం మా అత్తమామలు కొని ఇచ్చింది. పెళ్లయిన నెల రోజులకు గృహప్రవేశం చేశాం’’ చెప్పింది ప్రమతి.‘‘సరే.. వస్తాను వెళ్లండి’’ అన్నాడు వీరభద్రం. ‘వస్తాను, వెళ్లండి’ అనగానే.. ‘మా ఇంటి అడ్రస్..’ అంటూ దారులు, దిక్కులు చెప్పబోయింది ప్రమతి. అవసరం లేదన్నట్లు చేత్తో వారించాడు వీరభద్రం. సహస్రకు భలే ఆశ్చర్యం అనిపించింది. వెనక్కు వచ్చేశారు. అలా వెనక్కు వచ్చేటప్పుడు కూడా వీరభద్రం వెనక నుంచి వాళ్లనేమీ అడగలేదు. ఏ టైమ్‌లో ఉంటారూ.. ఇద్దరూ ఒకే టైమ్‌లో ఎప్పుడుంటారూ, ఆఫీస్‌లకు సెలవెప్పుడూ.. ఇలాంటివేమీ అడగలేదు. వాళ్లలా వెళ్లగానే ఇలా.. పుస్తకాలేవో తెరుస్తుండడం ప్రమతి, సహస్ర గమనించారు. ఆ తర్వాత ఇద్దరూ కొంతసేపు దెయ్యం సంగతి మర్చిపోయి, వీరభద్రం గురించి మాట్లాడుకున్నారు. ఆయన కళ్లల్లో వారికేదో తేజస్సు కనిపించింది. ‘‘పట్టేస్తాడు’’ అనుకున్నారు. ‘‘పట్టేశాను’’ అని చెప్పి, బీకరులో పడేసి, బిరడాలో పెట్టేశాక.. దానిని ఈశాన్యంలోని దేవుడి మూలకు అభిముఖంగా, నైరుతి మూలలో చేతికి అందే ఎత్తులో అటకమీద ఉంచి చెప్పాడు వీరభద్రం.. ‘‘దీన్నిక్కడే కొన్నాళ్లు కదలకుండా ఉంచండి’’ అని. భయంగా చూశారు భార్యాభర్తలు. ‘‘దెయ్యాన్ని మీరు తీసుకెళతారనుకున్నాం’’ అన్నారు ఇద్దరూ ఒకేసారి. ‘‘లేదు. కొన్నాళ్లు ఈ బీకరు ఇక్కడే ఉండాలి. బీకరుకు అడ్డంగా కర్టెన్లాంటిది కూడా ఏమీ వేలాడదీయకండి. అది మీకు కనిపిస్తూ ఉండాలి’’ చెప్పాడు వీరభద్రం. ‘‘కానీ దాన్ని చూస్తుంటే మాకు భయంగా ఉంటుంది. బీకరులోని దెయ్యం మమ్మల్నే చూస్తూ ఉంటుందేమోనని. పైగా బీకరు అక్కడ ఉంటే.. మేం ఏ పనిలో ఉన్నా ఆ దెయ్యానికి కనిపిస్తూ ఉంటాం. తింటున్నా, టీవీ చూస్తున్నా, పడుకోడానికి వెళుతున్నా, స్నానం చేసి వస్తున్నా..’’ చెప్పాడు సహస్ర. అవునన్నట్లు చూసింది ప్రమతి. ‘‘కనిపించాలి’’ అన్నాడు వీరభద్రం.. బీకరులోకి చూస్తూ. ఆ మాటకు భయంగా గుటకలేశారు భార్యాభర్తలు. దెయ్యం ఇంట్లో ఏమూలన తిరుగుతోందో తెలియక భయపడడంవేరు. ఫలానా చోటు ఉందని తెలిసీ దెయ్యం.. ముందు ఇంట్లో తిరగడం వేరు. అది ఆలోచిస్తున్నారు వాళ్లు. అది కనిపెట్టాడు వీరభద్రం. ‘‘ఆలోచించే పని లేదు. చెప్పినట్లు చెయ్యండి.కొంచెంపసుపు, కుంకుమ కావాలి’’ అన్నాడు. తీసుకురాబోయింది ప్రమతి. ఆగమన్నాడు వీరభద్రం. ‘‘డబ్బాలోని పసుపు, భరిణెలోని కుంకుమ కాదు’’ అన్నాడు. ‘మరి!’ అన్నట్లు చూశారు ప్రమతి, సహస్ర. ‘‘నీ కాలికి రాసుకున్న పసుపు. నీ భర్త గుండెలకు నువ్వద్దిన కుంకుమ’’ అని చెప్పాడు వీరభద్రం. కాళ్లకు పసుపు రాసుకుని, ఆ రాసుకున్న పసుపులోంచి కొంత తీసింది ప్రమతి. అలాగే భర్త గుండెకు కుంకుమ అద్ది, ఆ అద్దిన కుంకుమలోంచి కొంత తీసింది. వాటిని చిన్న కాగితం ముక్కలో వేసుకుంది. రెంటినీ కుడిచేతి ఉంగరపు వేలు, బొటనవేలితో కలపి, నలపమని చెప్పాడు వీరభద్రం. కలిపి, నలిపింది. దాంట్లోంచి భార్యాభర్తల్ని చెరిసగం తీసుకోమని చెప్పాడు. తీసుకున్నారు. బీకరు దగ్గరికి వెళ్లి, బీకరుపై ఇద్దర్నీ వేర్వేరుగా రెండు బొట్లు పెట్టమన్నాడు. మళ్లీ ఉలిక్కిపడింది ప్రమతి. ఉలిక్కిపడకుండా ఉండేందుకు సహస్ర ప్రయత్నించాడు కానీ వీలుకాలేదు. ‘‘భయంలేదు. వెళ్లమ్మా.. నువ్కొక బొట్టు పెట్టు, నువ్వూ ఒక బొట్టు పెట్టబ్బాయ్’’ అన్నాడు. బొట్లు పెడుతున్నప్పుడు వాళ్ల వేళ్లు వణికాయి. బీకరు లోపల ఊపిరి ఆడకుండా ఎవరో టపటపా కొట్టుకుంటున్నట్లనిపించింది. ఆ తర్వాత వీరభద్రం వెళ్లిపోతుంటే.. భయంగా అడిగింది ప్రమతి. ‘‘ఎప్పుడు తీసుకెళతారు ఆ దెయ్యాన్ని’’ అని. ‘‘ఎవరూ తీసుకెళ్లే పని లేదు. సమయం వచ్చినప్పుడు బీకరే దానంతటది కిందపడి బద్దలవుతుంది’’.. చెప్పాడు వీరభద్రం. ‘‘అప్పుడు దెయ్యం మా పని పట్టదా.. అన్నాళ్లూ బంధించి ఉంచినందుకు?’’ అడిగాడు సహస్ర. ‘‘అలా జరగదు’’ అన్నాడు. వెళ్లే ముందు ఇంకో మాట కూడా చెప్పాడు. ‘‘మీరనుకున్నట్లు ఆ బీకరులో దెయ్యం లేదు. దెయ్యాలు ఉన్నాయి. రెండు దెయ్యాలు. ఒకటి ఆడ దెయ్యం, ఇంకోటి మగదెయ్యం. అంతేకాదు, అవి రెండూ కూడా బతికే ఉన్న ఇద్దరు మనుషుల ఆత్మలు.’’బతికున్న మనుషులకు కూడా ఆత్మలు ఉంటాయా అని ఆ రాత్రి చాలాసేపు మాట్లాడుకున్నారు ప్రమతి, సహస్ర. ఆ తర్వాతెప్పుడూ బీకరులోని ఆ రెండు దెయ్యాల గురించిమాట్లాడుకోలేదు. ఇంట్లో దెయ్యం ఉందని మునుపు వాళ్లకు అనిపించడానికి కారణమైన సంఘటనలు కూడా వీరభద్రం వచ్చి వెళ్లాక మళ్లీ ఆ ఇంట్లో జరగలేదు. కొన్నాళ్ల తర్వాత.. ఓ రోజు ఉదయాన్నే నిద్ర లేచిన ప్రమతి, సహస్రలకు భళ్లున ఏదో పగిలిన చప్పుడు వినిపించింది. వెళ్లి చూశారు. బీకరు! ముక్కలై పడి ఉంది. ఆ మధ్యాహ్నం వాళ్లకు వేర్వేరుగా రెండు పెళ్లి కార్డులు వచ్చాయి. ఒక జంటలో వరుడు పంపిన కార్డు ప్రమతి పేరు మీద వచ్చింది. ఇంకో జంటలో వధువు పంపిన కార్డు సహస్ర పేరు మీద వచ్చింది. ‘నువ్వు లేకుండా బతకలేను’ అని ప్రమతికి చెప్పి, ప్రమతికి పెళ్లవుతున్న రోజు.. చీకట్లో ప్రమతినిపట్టుకుని బోరుమని ఏడ్చిన అబ్బాయి వరుడు. ‘నువ్వే నా సర్వస్వం. నిన్ను తప్ప ఎవర్నీ పెళ్లి చేసుకోనని నమ్మించి, ఇప్పుడు వేరే అమ్మాయిని చేసుకుంటున్నావా!’’ అని.. చివరిసారి కలవడానికి వచ్చిన సహస్రను ఇంట్లోకి రానివ్వకుండా తలుపులు వేసుకుని, లోపల్నుంచి దభీదభీమని తలను తలుపుకేసి కొట్టుకున్న అమ్మాయి వధువు. ∙∙ మర్నాడు వీరభద్రాన్ని కలిసి బీకరు పగిలిపోయిందని చెప్పారు ప్రమతి, సహస్ర. ‘‘ఆత్మ విముక్తి జరిగింది’’ అన్నాడు వీరభద్రం. ‘‘బీకరును మీతో తీసుకెళ్లితే ఆత్మ విముక్తి జరిగి ఉండేది కాదా?’’ అడిగాడు సహస్త్ర.. ఆసక్తి కొద్దీ. ‘‘కసితో జరిగిన ఆత్మవిముక్తి అది. మీ దాంపత్యాన్ని ఆ ఆత్మలు కళ్లారా చూశాక’’.. చెప్పాడు వీరభద్రం. ∙మాధవ్ శింగరాజు -
దారి దెయ్యం
పదేళ్ల వరకు లోకం తెలియకపోయినా అబ్బాయిల్ని లోకం ఏమీ అడగదు. పదేళ్లయినా లోకం తెలియడం మొదలవకపోతే ‘ఏం అబ్బాయ్’ అని లోకమే అడగడం మొదలుపెడుతుంది. ఇరవై ఏళ్లు దాటుతున్నా లోకాన్ని అలా నోరు తెరుచుకుని చూస్తుంటే, ‘ఏం అబ్బాయో!’ అంటుంది. ఆ తర్వాత కూడా అలాగే ఉంటుంటే.. ‘అసలు అబ్బాయేనా?’ అంటుంది.ఇందులో లోకాన్ని తప్పుపట్టడానికి లేదు. సృష్టికి ఒక ధర్మం ఉన్నట్లు.. లోకమూ తనకో ధర్మం ఉందనుకుంటుంది. అడగడం తన ధర్మం అనుకుంటుంది. ఇలా సృష్టికి, మానవులకు కొన్ని ధర్మాలు ఎందుకు ఉంటాయో, తనని తనలా ఉండనివ్వకుండా అవెందుకొచ్చి తనను ప్రశ్నిస్తాయో అనిర్వేద్ పెద్దగా ఎప్పుడూ ఆలోచించలేదు. పాతికేళ్లు ఉంటాయి అనిర్వేద్‌కి. దృఢంగా, మరీ ఎత్తుగా కాకుండా, మ్యాన్లీ ఉంటాడు. మ్యాన్లీగా ఉండేవాళ్లలో లోకం ఆశించే మొదటి లక్షణం.. దేనికీ భయపడకపోవడం. అది అనిర్వేద్లో లేదు. మ్యాన్లీగా ఉండేవాళ్ల రెండో లక్షణం.. ఎప్పుడూ అమ్మాయిల గుంపులో కనిపించడం. ఈ లక్షణం కూడా అనిర్వేద్లో లేదు. లేకపోగా, అతడికి అమ్మాయిలంటే భయం! అమ్మాయిలంటే అతడికున్న భయానికి పనిగట్టుకుని కారణాలేవీ లేవు. లేవు కానీ, ఒకటి మాత్రం ప్రత్యేకమైన కారణంలా కనిపిస్తుంది. పదేళ్ల వయసులో ఆడుకుంటూ ఆడుకుంటూ ఎవరి ఇంటి లోనికో వెళ్లినప్పుడు.. అక్కడ తొలిసారి నిండు గర్భిణిని చూశాడు అనిర్వేద్. ఆ నిండు గర్భిణి కూర్చున్నప్పుడో, నిలుచున్నప్పుడో, నడుస్తున్నప్పుడో, నవ్వుతున్నప్పుడో అతడు చూడలేదు. నొప్పులు పడుతుండగా చూశాడు. దగ్గరగా చూశాడు. భయపడిపోయాడు. ‘పాపం’ అని దుఃఖపడిపోయాడు. కన్నీళ్లు తుడుచుకున్నాడు. పరుగున ఇంటికెళ్లి తన తల్లిని గట్టిగా కావలించుకుని ఆమె చీర కొంగుతో తన ముఖాన్ని ఊపిరి ఆడనంతగా చుట్లుచుట్లుగా చుట్టేసుకున్నాడు. ఇప్పటికీ నిండు గర్భిణిని ఎక్కడైనా చూస్తే అనిర్వేద్ భయపడిపోతాడు. నిండు గర్భిణులంటేనే కాదు, అనిర్వేద్‌కి దెయ్యాలన్నా భయమే. లోకధర్మానికి భయపడి ధైర్యాన్ని నటించడం వ్యక్తిగా తనకు ధర్మం కాదు అని అనుకున్నప్పటి నుంచీ అతడు నిర్భయంగా భయపడడం అలవాటు చేసుకున్నాడు. ఎవరేమనుకుంటే నాకేంటీ అనే తెగింపు అది. అయితే అదే అనిర్వేద్.. దెయ్యాలకు, నిండు గర్భిణులకు భయపడే విషయంలో మాత్రం.. ఎవరైతే నాకేంటీ అని తెగించి ధైర్యంగా ఉండలేకపోతున్నాడు. ఇప్పటికీ భయపడుతూనే ఉన్నాడు. ఈ „ý ణంలో కూడా..! ‘దెయ్యాల దారి’లో మెల్లిగా వెళుతోంది వ్యాను. అనిర్వేద్, ఇంకో వ్యక్తి మాత్రమే ఉన్నారు ఆ వ్యానులో. ఆ ఇంకో వ్యక్తి వ్యాన్ డ్రైవర్. చీకట్లో, ఇరుకైన ఆ గతుకుల దారిలో వ్యాన్ని సాధ్యమైనంత స్థిమితంగా ఆ వ్యక్తి డ్రైవ్ చేస్తున్నప్పటికీ వ్యాను ఎగుడు దిగుడు అవుతూనే ఉంది. అరవై ఏళ్లుంటాయి ఆ డ్రైవర్‌కి. తలజుట్టు, గడ్డం తెల్లగా నెరిసి ఉన్నాయి. దగ్గర్లోని టౌన్‌కి వచ్చి, తిరిగి ఊళ్లోకి వెళుతున్న ఆ వ్యాన్ని ఆపి మధ్యలో ఎక్కాడు అనిర్వేద్. ఇంకో అరగంటకు పైగా ఉంది ప్రయాణం. వ్యాన్‌లో కూర్చున్నప్పట్నుంచీ దెయ్యాల గురించే ఆలోచిస్తున్నాడు అనిర్వేద్. ఆ దారిలో తరచూ దెయ్యాలు కనిపిస్తుంటాయని ఊళ్లోవాళ్లు చెప్పుకోవడం ఆ సమయంలో అతడికి గుర్తుకొచ్చింది. ‘‘తాతా.. ఈ దారిలో నీకెప్పుడైనా దెయ్యాలు కనిపించాయా?’’ అడిగాడు అనిర్వేద్. సడెన్ బ్రేక్‌తో వ్యాన్ ఆపేశాడు ఆ వ్యక్తి. అనిర్వేద్ ఉలిక్కిపడ్డాడు. సడన్ బ్రేక్‌తో ఆ వ్యక్తి వ్యాన్ ఆపేశాడనే అనుకున్నాడు అనిర్వేద్. కానీ సడన్ బ్రేక్ వేసినట్లుగా వ్యానే దానంతటదే ఆగిపోయింది.‘ఏమైంది! దీనికి?!’ అనుకుంటూ ఒక్కక్షణం నిట్టూర్చి, విండ్ షీల్డ్‌లోంచి బయటికి చూశాడు ఆ వృద్ధ డ్రైవర్. రోడ్డు మీద వ్యాను లైట్ల మసక వెల్తురులో చాలా దూరంగా రోడ్డు మధ్యకు వచ్చి ఒక ఆకారం కనిపిస్తోంది. ఆ ఆకారాన్ని అనిర్వేద్ కూడా చూశాడు. ‘‘ఏంటది తాతా?’’ అని అడిగాడు. ‘‘ఎవరో మనిషి’’ అన్నాడు డ్రైవర్. ‘‘మనిషా! మనిషిలా కనిపించడం లేదు తాతా’’ అన్నాడు అనిర్వేద్.. భయంగా. రెండుసార్లు చేశాక, మూడోసారి స్టార్ట్ అయింది వ్యాను. అనిర్వేద్ ఊపిరి బిగించి రోడ్డు మధ్యలో అస్పష్టంగా కనిపిస్తున్న ఆకారం వైపే చూస్తున్నాడు. వ్యాన్ కొంత దూరం వెళ్లాక ఆ ఆకారానికి ఒక ఆకృతి వచ్చింది. మరికొంత దూరం వెళ్లాక ఆ ఆకృతికి ఒక స్పష్టమైన రూపం వచ్చింది. నిండు గర్భిణి ఆమె! ఒక్కసారిగా గుండె ఝల్లుమంది అనిర్వేద్‌కి. డ్రైవర్ ఆమెకు దగ్గరగా తీసుకెళ్లి వ్యాన్ని ఆపాడు. ‘‘ఇంట్లో నా పెనిమిటి లేడు. నొప్పులొస్తున్నాయి. టౌన్ ఆస్పత్రికి తీసుకెళ్లండి...’’ ప్రాణాల్ని బిగబట్టి, దండం పెడుతూ, రోడ్డు మీద కుప్పలా పడిపోయింది ఆమె. అనిర్వేద్ గొంతు తడారింది. నిండు గర్భిణిని మళ్లీ అన్నేళ్ల తర్వాత అంత దగ్గరగా చూడ్డం అదే మొదటిసారి అతడు. ‘‘పట్టు’’ అన్నాడు డ్రైవర్.. వ్యాన్ బ్యాక్ డోర్ తీసిపెట్టి. అదిరిపడ్డాడు అనిర్వేద్. ఆమెను ఎలా పట్టుకోవాలో, ఎలా పైకి లేపి వ్యాన్‌లో పడుకోబెట్టాలో తెలియడం లేదు అతడికి. నిర్వేదంగా చూస్తుండి పోయాడు. ‘‘పర్లేదు. తలవైపు, భుజాల కింద చేతులు వేసి భద్రంగా పట్టుకో’’ అని అనిర్వేద్తో చెప్పి, కాళ్లవైపు ఆమెను భద్రంగా పైకి లేపి, మెల్లిగా వ్యానులోకి చేర్చాడు డ్రైవర్. స్పృహలోకి వచ్చి, వాళ్లవైపు కృతజ్ఞతగా చూసింది ఆమె. వ్యాను అదే దారిలో వెనక్కు మళ్లింది. అనిర్వేద్ చెమటలు తుడుచుకుంటున్నాడు. సడెన్‌గా ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. తెరలు తెరలుగా అరుస్తోంది. ఏడుస్తోంది. అనిర్వేద్ నిశ్చేష్టుడై చూస్తున్నాడు. ‘‘జాగ్రత్త.. ధైర్యం చెబుతుండు’’ అన్నాడు అనిర్వేద్తో ఆ వృద్ధ డ్రైవర్.. వ్యాను వేగాన్ని పెంచుతూ. అనిర్వేద్ ధైర్యం తెచ్చుకున్నాడు. ‘‘ఓర్చుకోమ్మా.. దగ్గరికొచ్చేస్తున్నాం’’ అన్నాడు.. ఎలాగో గొంతు పెగిల్చుకుని! పదేళ్ల వయసులో నిండు గర్భిణి యాతనను చూసి దుఃఖపడినట్లే ఇప్పుడూ అతడు దుఃఖపడుతున్నాడు. ఉబికి వచ్చిన కన్నీళ్లు తుడుచుకుంటున్నాడు. పారిపోయి కడుపులో దాక్కోడానికి ఏ తల్లీ ఇప్పుడు అతడి దగ్గర లేదు. తనే తల్లి అయి, ఆ గర్భిణి తలవైపు కూర్చుని, వ్యాను కుదుపులకు ఆమె పడిపోకుండా పట్టుకున్నాడు. వ్యాను.. హాస్పిటల్ దగ్గర ఆగింది. ‘‘సేఫ్ డెలివరీ’’ నర్సు వచ్చి చెప్పింది. వ్యాను డ్రైవర్ చిరునవ్వు నవ్వాడు. అనిర్వేద్ నవ్వలేదు! అతడింకా భయం నుంచి తేరుకోలేదు. ప్రసవం జరిగింది ఆమెకే అయినా, పుట్టింది తనే అయినట్లుగా ఉందతడికి! - మాధవ్ శింగరాజు -
హారరిన్దీమిడ్నైట్
ఎడిటర్ భార్గవ పెద్దగా నవ్వాడు. ఎంత పెద్దగా అంటే.. ఆ పత్రికా కార్యాలయమే కనుక ఒక పెద్ద ఊడల మర్రి అయి ఉంటే.. ఆ ఊడలన్నీ కదిలిపోయేంత పెద్దగా!గాయత్రి అనే చిన్న పాప రాసిన ఉత్తరం ఆయన చేతిలో ఉంది. ఆ ఉత్తరం చదివాడు. అందుకే అంత పెద్దగా నవ్వాడు. ‘ప్రళయ’ పత్రికా కార్యాలయం అది. ఆ పత్రిక ఎడిటరే భార్గవ. ప్రళయ.. న్యూస్ పేపర్ కాదు. ‘వ్యూస్’ పేపర్. దినపత్రికే కానీ, ఘటనలను ఇవ్వదు. ఘటనల వెనుక ఉన్నదేమిటో ఊహించి ఇస్తుంది. అది కూడా మామూలు ఘటనలు కావు. దెయ్యాలు, భూతాలు, పిశాచాలు, విలయాలు, విపత్తులు, విధ్వంసాలు.. ఇలాంటి వాటిపై వ్యూస్ ఉంటాయి. కేరళలో మొన్న వరదలు వచ్చినప్పుడు ‘అయ్యప్పస్వామికి కోపం వచ్చిందా?’ అని ఈ పత్రిక విరామం లేకుండా స్టోరీల మీద స్టోరీలు కొట్టింది! అయ్యప్పస్వామికి కోపం వచ్చిందో లేదో తేల్లేదు కాదు, ప్రళయపై విమర్శలు మాత్రం వచ్చాయి. కానీ, సర్క్యులేషన్ పెరిగింది! ఏదైనా పత్రికలో ఒకటీ రెండూ కాలమ్స్ బాగా పాపులర్ అయి ఉంటాయి. ‘ప్రళయ’లో అలాక్కాదు. ప్రతి కాలమ్, ప్రతి పేజీ పాపులరే! రోజూ మూడో పేజీలో వచ్చే దెయ్యం కథైతే.. హారరిన్దీమిడ్నైటే! ప్రళయ.. వాకిట్లో పడగానే, దాన్ని చేతుల్లోకి తీసుకున్నవాళ్లు.. వెంటనే పేజీ తిప్పి రైట్ సైడ్ మూడో పేజీలో ఉండే దెయ్యం కథ కోసం వెతుక్కుంటారు. దానికో పెద్ద దెయ్యం బొమ్మ ఉంటుంది. కథ చదవగానే ఎంతటి ధైర్యస్థులకైనా దెయ్యం పట్టినట్లు అవుతుంది. అంత ఘోస్టీ›్లగా ఉంటుంది. పేజ్ త్రీలో వచ్చే కథ.. ‘పేజ్ త్రీ గర్ల్’లా ఉండాలని అంటాడు భార్గవ. అంటే.. వ్యామోహం కలిగించేలా! దెయ్యాల బొమ్మల్ని కూడా అతడు అందమైన అమ్మాయిల్లా వేయిస్తాడు. అసలా పైశాచిక అందానికే సగం ఛస్తారు పాఠకులు. విరబోసుకున్న జుట్టు, ఎరుపెక్కిన కళ్లు, ‘వాడాయ్..’ అని పాట పాడుతున్నట్లు ఉంటుంది ఆ దెయ్యం ఇలస్ట్రేషన్. నవ్వు ఆపుకోలేక పోతున్నాడు భార్గవ. అతడి చేతిలో గాయత్రి అనే ఆ పాప రాసిన ఉత్తరమింకా అలానే ఉంది. మళ్లీ ఒకసారి చదివాడు. ‘‘డియర్ అంకుల్.. మీరు వేసే కథల్లో, బొమ్మల్లో ఎప్పుడూ ఆడ దెయ్యాలే ఉంటాయెందుకు? దెయ్యాల్లో మగ దెయ్యాలు ఉండవా? దయచేసి నా సందేహానికి సమాధానం చెప్పగలరు’’– ఇట్లు మీ పత్రిక రీడర్, గాయత్రి, టెన్త్ క్లాస్, హైదరాబాద్.భార్గవకు సంతోషం వేసింది. ‘ప్రళయ’కు టీనేజ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారన్న సంతోషం అది. కాలింగ్ బెల్ నొక్కాడు.ధడేల్మని తలుపు తోసుకుని వచ్చాడు ప్రళయ కిశోర్. ఆఫీస్ బాయ్ అతడు. అతడి పేరు కిశోర్ మాత్రమే. ప్రళయలో పని చేస్తున్నాడు కాబట్టి ప్రళయ కిశోర్. ఆ ఆఫీస్‌లో ప్రతి ఒక్కరి పేరుకు ‘ప్రళయ’ అన్న మాట ప్రీఫిక్స్గా ఉంటుంది. ఆ నియమం పెట్టింది కూడా భార్గవే. చేస్తున్న పని మీద, చేస్తున్న వృత్తి మీద గౌరవం ఉన్నా లేకున్నా, ఆఫీస్‌లో ఉన్నంత వరకు గౌరవం పాటించడానికి పెట్టిన నిబంధన అది. తనని కూడా ప్రళయ భార్గవ అనే అనమంటాడు భార్గవ.‘‘ప్రళయ మనోహర్ని రమ్మను’’.. బాయ్‌తో చెప్పాడు భార్గవ. మనోహర్ వచ్చాడు. కూర్చోమనలేదు భార్గవ. అతడికి తెలుసు.. తన స్టాఫ్ ఎవరికీ ఎడిటర్ ఎదురుగా కూర్చునేంత తీరిక ఉండదని. ‘‘ఇవాళ్టి పేజ్ త్రీ దెయ్యం కథ వచ్చిందా?’’ అడిగాడు. ‘‘రాలేదు సార్’’ అన్నాడు ప్రళయ మనోహర్. ‘‘ఎందుకు రాలేదు?’’ పెద్దగా అరిచేశాడు భార్గవ. ఉలిక్కిపడ్డాడు ప్రళయ మనోహర్. మూడో పేజి ఇన్‌ఛార్జి అతడు. పేజ్ త్రీ దెయ్యం కథ బయటి నుంచి వస్తుంది. దాన్ని రాస్తున్నది ప్రళయ భయంకర్. భయంకర్ అసలు పేరు దీనదయాళ్. భార్గవే అతడికి భయంకర్ అనే పేరు పెట్టాడు.‘‘ఇంకా పది కథలు రెడీగా ఉన్నాయి సార్’’ అన్నాడు ప్రళయ మనోహర్.. ‘ఇంకో పది రోజుల దాకా ప్రళయ భయంకర్ కథ ఇవ్వకున్నా పర్లేదు’ అన్న టోన్‌లో. ‘‘సో.. మిస్టర్ ప్రళయ మనోహర్.. ఇంకో పది రోజులు మిమ్మల్ని నా క్యాబిన్లోకి పిలవక్కర్లేదనేనా మీరు అంటున్నారు!’’ అన్నాడు భార్గవ. ప్రళయ మనోహర్ భయంతో బిగదీసుకుపోయాడు. అతడి భయం చూసి భార్గవ కాస్త తగ్గుముఖం పట్టాడు. ‘‘ఎన్ని కథలు రెడీగా ఉన్నా, ఇవాళ్టి కథను మనం రెడీ చేసుకోవాల్సిందే మనోహర్. లేకుంటే పత్రికను నడపలేం’’ అన్నాడు. ‘‘సర్.. ఫోన్ చేశాను. వాళ్ల మిసెస్‌కి బాగోలేదట. అయినప్పటికీ, లెవన్త్ అవర్లోనైనా ఇచ్చేస్తానన్నారు’’.. చెప్పాడు మనోహర్.‘‘ఏం బాగోలేదట?’’.. క్యాజువల్‌గా అడిగాడు భార్గవ. చాలా క్యాజువల్‌గా. జనరల్‌గా అతడు అలా అడగడు. ఆఫీస్ స్టాఫ్‌లో కూడా లేడీస్‌కి ఎవరికైనా బాగోలేదని తెలిస్తే, ‘ఏమైంది?’ అని అడగడు. జస్ట్ బాగోలేదు అన్నంతవరకే ఆ టాపిక్‌కి ఆపేస్తాడు. ‘‘ఏం బాగోలేదట?’’ మళ్లీ అడిగాడు.. ఆ అడగడంలో, తనకు కథ రాలేదన్న అసహనం కన్నా, భయంకర్పై కన్సర్నే ఎక్కువగా ఉంది. ‘‘దెయ్యం పట్టిందట సర్.. వాళ్లావిడకు’’ చెప్పాడు మనోహర్. ‘‘వ్హాట్..!’’ అన్నాడు భార్గవ. భార్గవ క్యాబిన్లో అతడి ఎదురుగా కూర్చొని ఉన్నాడు భయంకర్. అతడి చేతిలో ఆవేళ్టి కథ ఉంది. ఇస్తానన్నట్లుగానే క్రితం రోజు కథను క్రితం రోజు రాత్రే చివరి నిముషంలో పంపించాడు కూడా. ‘‘మిసెస్ భయంకర్ ఇప్పుడెలా ఉన్నారు’’ అడిగాడు భార్గవ. ‘‘తను ఓకే.. నేనే బాగోలేనట..’’ ‘‘డాక్టర్ చూసింది తననా, మిమ్మల్నా?’’ నవ్వాడు భార్గవ.‘‘తనని చూసి, నాకు చెప్పాడు. దెయ్యం పట్టినట్లు బిహేవ్ చేస్తోంది డాక్టర్ అని చెప్పాను. ‘అయితే అది ఆమె ప్రాబ్లమ్ కాదు, మీ ప్రాబ్లమ్’ అన్నాడు. ‘అదేంటి డాక్టర్?’ అన్నాను. మీరు ఆమెను పట్టించుకోకపోవడం వల్లనే, ఆ స్పేస్‌లో ఆమెకు దెయ్యం పట్టింది’ అన్నాడు!’’.. చెప్పాడు భయంకర్. భయంకర్ వెళ్లిపోయాక, శ్రీకంఠను పిలిపించాడు భార్గవ. దెయ్యం కథకు రెగ్యులర్‌గా బొమ్మలు వేస్తుండే ఆర్టిస్ట్ అతడు.‘‘ఇవాళ్టి నుంచి, దెయ్యం కథకు మగ దెయ్యం బొమ్మ వెయ్యండి’’ చెప్పాడు భార్గవ. సంశయంగా అక్కడే ఆగిపోయాడు శ్రీకంఠ. ‘‘సర్క్యులేషన్ పడిపోయినా పర్లేదు.. మగదెయ్యం బొమ్మ వెయ్యండి’’ చెప్పాడు భార్గవ. - మాధవ్ శింగరాజు -
కలెక్టర్ బంగళా
నూరు, నూట పాతికేళ్ల పాటు మనుషులు బతికుండటం అనేది పెద్ద ఆసక్తికరమైన సంగతేం కాదు. ఆ నూరూ, నూటపాతికేళ్ల వాళ్లు చనిపోయినప్పుడే కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది.. ఇన్నేళ్లు బతికారా అని! అదీ పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు. ఊరికే ఆశ్చర్యం. ఆ బంగళా వయసు నూటా ముప్పై ఏళ్లకు పైగానే. అన్నేళ్లపాటు ఒక మనిషి బతికి ఉన్నారంటే ఆ మనిషిని చూడాలని వెళ్లేవారు ఎవరైనా ఉంటే ఉంటారేమో కానీ.. ఒక బంగళా అన్నేళ్ల నుంచీ ఉందంటే ఆ బంగళా లోపలికి వెళ్లి, లోపలంతా ఒకసారి చుట్టి రావాలని అనిపించకుండా మాత్రం ఎవరికీ ఉండదు. మానవ జీవనంలో లేని ఆసక్తి మానవ నిర్మాణంపై ఉండడం సహజమే. అది ప్రభుత్వ బంగళా. బ్రిటిష్ ప్రభుత్వం కట్టించిన ఆ బంగళాను, మన ప్రభుత్వం వాడుతోంది. అది కూడా ప్రభుత్వ కార్యాలయంగా వాడడం లేదు. బదలీ అయి వచ్చే కలెక్టర్ల నివాసగృహంగా వాడుతోంది. ప్రజలు ఎవరైనా బంగళాను బయటి నుంచి చూసి వెళ్లిపోవడమే కానీ, లోపలికి వెళ్లి కలియదిరగడానికి లేదు. అలాంటి బంగళా ఇప్పుడు అకస్మాత్తుగా స్థానికుల్లో, చుట్టపక్కలవాళ్లలో ఆసక్తి రేకెత్తించింది! అందుకు ప్రధానంగా రెండు కారణాలు. ఒకటి.. ఓ ఎంగ్ అండ్ డైనమిక్ మహిళా కలెక్టర్ ఆ బంగళాలోకి దిగడం. ఇంకొకటి.. ఆ బంగళాలో దెయ్యం తిరుగుతోందని ఆ కలెక్టరమ్మతో.. ఆ బంగళాలో పనిచేసేవారెవరో అనడం! బంగళాలో దెయ్యం ఉందని పనివాళ్లలో ఒకరు మొదట అన్నప్పుడు.. ఆ కలెక్టరమ్మ పెద్దగా నవ్వారు. ‘‘నీకెలా తెలుసు జంగయ్యా.. బంగళాలో దెయ్యం ఉందనీ!’’.. నవ్వును ఆపుకుంటూ అడిగారు కలెక్టరమ్మ. బంగళాలో దెయ్యం ఉందని చెప్పిన మనిషే జంగయ్య. ‘‘ఉందమ్మా.. పైన రూమ్‌లో ఉంది. నా భార్య కూడా చూసింది. నా భార్య రూమ్ సాఫ్ చేస్తుంటే వచ్చి దాని మెడ పట్టుకుంది’’ అన్నాడు జంగయ్య. కలెక్టరమ్మ ఈసారి నవ్వలేదు. నవ్వీ నవ్వనట్లు ఊరుకున్నారు. ‘‘సర్లే.. జాగ్రత్తగా ఉందాం’’ అని మాత్రం అన్నారు.‘‘దెయ్యాల దగ్గర జాగ్రత్త ఏంటమ్మా.. దెయ్యాలు దెయ్యాలే. మనుషులం మనుషులమే’’ అన్నాడు జంగయ్య. ప్రెస్ మీట్లో అంతా కలెక్టరమ్మ చుట్టూ చేరారు. అది కలెక్టరమ్మ ఏర్పాటు చేసిన మీట్ కాదు. ప్రెస్ మీట్ కోసం కలెక్టరమ్మను ఒప్పించిన మీట్. కొత్త కలెక్టర్.. జిల్లాలో ప్రభుత్వ పథకాలను ఎలా అమలు చేయబోతున్నారో.. ప్రజలకు ఎలా చేరువ అవబోతున్నారో చెప్పే ‘గెట్ టుగెదర్’ లాంటి మీట్. మీడియా ప్రతినిధులు కలెక్టరమ్మను ప్రశ్నలు అడుగుతున్నారు. మీడియా కెమెరాలు కలెక్టరమ్మ నవ్వును, కలెక్టరమ్మ చీరకట్టును, కలెక్టరమ్మ కంఠం కింది అందమైన ఉడెన్ జ్యుయలరీని, ఆ ఉడెన్ జ్యుయలరీకి ఉన్న ఉడెన్ లాకెట్నీ, ఆహ్లాదకరమైన ఆమె హావభావాల్ని షూట్ చేస్తున్నాయి. మీడియా ప్రశ్నలకు కలెక్టరమ్మ సమాధానాలన్నీ అయ్యాక.. టీ–బిస్కెట్ సెషన్లో.. ‘‘ఏలా ఉంది మేడమ్.. ఈ బంగళా! మీకు కంఫర్ట్‌గా ఉందా?’’ అని ఓ ప్రతినిధి అడిగారు. వెంటనే జంగయ్య గుర్తుకొచ్చాడు కలెక్టరమ్మకు. ‘‘నా కంఫర్ట్ కోసం ప్రభుత్వం నన్నిక్కడ ఉంచలేదు. ప్రజల కంఫర్ట్ చూడ్డానికి ఉంచింది’’ అని నవ్వారు కలెక్టరమ్మ. ‘‘అది నిజమే. కానీ మీరు కంఫర్ట్‌గా ఉంటేనే కదా.. ప్రజలు కంఫర్ట్‌గా ఉండేది’’ అని ఇంకో ప్రతినిధి అన్నారు. ‘‘ప్రజా ప్రతినిధులు తమ కంఫర్ట్ చూసుకోకుండా ప్రజల కోసం పని చేస్తున్నప్పుడు.. ప్రజాసేవకులమైన మేమూ అలాగే ప్రజల కోసం పని చేయాలి కదా.. కంఫర్ట్ చేసుకోకుండా’’.. నవ్వుతూ చెప్పారు కలెక్టరమ్మ. ‘‘అంటే.. మీరిప్పుడు కంఫర్ట్‌గా లేరనేనా.. ఈ బంగళాలో’’.. మరో ప్రతినిధి. కలెక్టరమ్మ ఆశ్చర్యపోయారు.‘‘నేను అలా అనడం లేదు. ప్రజల్ని కంఫర్ట్‌గా ఉంచడమే మా డ్యూటీ అంటున్నాను’’ అన్నారు. ‘‘ప్రజల్ని కాసేపు పక్కన పెడదాం మేడమ్. స్ట్రయిట్‌గా చెప్పండి. ఈ బంగళాలో మీరు ధైర్యంగా ఉండగలుగుతున్నారా?’’ ఇంకో ప్రశ్న. కలెక్టరమ్మ నవ్వారు. ‘‘నేననుకోవడం ఏంటంటే.. మీరే స్ట్రయిట్‌గా నన్ను అడగదలచిన ప్రశ్నను అడగలేకపోతున్నారు. అసలు ధైర్యం అనే మాట ఎందుకొచ్చింది?’’ అన్నారు. ‘‘బంగళాలో దెయ్యం తిరుగుతోందని..’’ అన్నారా ప్రతినిధి!ఆ మాటకు పెద్దగా నవ్వారు కలెక్టరమ్మ. ఆమెకు మళ్లీ జంగయ్య గుర్తుకొచ్చాడు. ‘‘అవును. ఉందని అంటున్నారు’’ అన్నారు నవ్వుతూ.అక్కడితో మీట్ ముగిసింది. ఇలా మీట్ ముగియగానే అలా టీవీ చానల్స్‌లో బ్రేకింగ్ న్యూస్ మొదలైంది.‘కలెక్టర్ బంగళాలో దెయ్యం’‘దెయ్యానికి భయపడుతున్న యువ కలెక్టర్’‘ఉంటారా? ఖాళీ చేస్తారా?’‘ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా?’బ్రేకింగ్‌లతో పాటే.. ‘దెయ్యాలున్నాయా? లేవా?’ అనే డిబేట్. డిబేట్లో ఘన విజ్ఞాన వేదిక (ఘ.వి.వే) చాలెంజ్. ‘‘కలెక్టర్ అయ్యుండీ.. ప్రజల్లో మూఢనమ్మకాలను పెంచి పోషిస్తారా! అంత చదువు చదివి ఏం లాభం? అంత ఉద్యోగం చేస్తూ ఏం ప్రయోజనం? కలెక్టర్ గారి బంగళాలో దెయ్యం ఉందని నిరూపిస్తే.. ఇరవై ఐదు లక్షల రూపాయలిస్తాం. ఒక్కరాత్రి బంగళాలో ఉండేందుకు అనుమతి ఇవ్వండి చాలు. దెయ్యాలు లేవని మేము రుజువు చేస్తాం..’’ డిబేట్లో ఆవేశంగా చెప్పుకుపోతున్నారు ఘ.వి.వే. అధ్యక్షుడు. టీవీ చూస్తున్న కలెక్టరమ్మ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బంగళాలో దెయ్యం ఉందని, ఆ దెయ్యానికి తను భయపడుతున్నానని తనెప్పుడు చెప్పిందో ఆమెకు అర్థం కాలేదు. ‘దెయ్యం ఉందట కదా’ అని వాళ్లు అంటే, ‘ఉందని అంటున్నారు’ అనే కదా తను వాళ్లతో అన్నది! అది కూడా నవ్వుతూ అన్న మాటే.లైఫ్‌లో మొదటిసారి దెయ్యం అంటే భయమేసింది కలెక్టరమ్మకు. బంగళాలో ఉందని జంగయ్య చెప్పిన దెయ్యానికి కాదు ఆమె భయపడింది. తన మాటల్ని వక్రీకరించిన దెయ్యానికి! ఘ.వి.వే. అధ్యక్షుడి మాటలు కూడా కలెక్టరమ్మకు ఆశ్చర్యంగా అనిపించాయి. లేవని నిరూపిస్తారట!! దెయ్యాలు ఉన్నాయని నమ్మని వారు.. పనిగట్టుకుని వచ్చి దెయ్యాలు లేవని నిరూపించవలసిన అవసరమేంటి?నవ్వుకున్నారావిడ. - మాధవ్ శింగరాజు -
మట్టి దెయ్యం
చాలాసేపటిగా చీకట్లో ఒక్కడే పడుకుని ఉన్నాడు వెంకటయ్య. చీకటికి, ఒంటరితనానికి అతడి జీవితం ఏళ్లుగా అలవాటు పడిపోయింది. మానవ జీవితంలో నింగి, నేల, నీరు, నిప్పు, గాలి మాత్రమే ఉంటే.. వెంకటయ్య అనే మానవుడి జీవితంలో చీకటి, ఒంటరితనం అనే రెండు అదనపు భూతాలు కూడా కలిసి మొత్తం ఏడు భూతాలు ఉన్నాయి!పూరింట్లో నులక మంచం మీద పడుకుని ఉన్నాడు వెంకటయ్య. మంచం మీద పల్చటి దుప్పటి ఉంది. వెంకటయ్య తలకింద బూరుగు దూది దిండు ఉంది. దగ్గర ఎవ్వరూ లేకుండా ఒక్కడే అలా పడుకుని, పైన చూరును చూసుకుంటూ దీర్ఘంగా ఆలోచనల్లోకి వెళ్లిపోవడం వెంకటయ్యకు ఇష్టమైన వ్యాపకం. అరవై ఏళ్లు దాటాయి వెంకటయ్యకు. బాధ్యతలన్నీ పూర్తి చేసుకుని ఇష్టమైన వ్యాపకంలోకి పూర్తిగా వచ్చేయడానికి వీలు కలిగాక అతడు ఆ పూరింట్లోంచి బయటికి రావడమే మానేశాడు. వెంకటయ్యకు భార్య ఉంది. పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకు పిల్లలున్నారు. వాళ్లంతా వెంకటయ్య ఉంటున్న పూరింటికి ఎదురుగా ఉన్న పెద్ద భవంతిలో ఉంటారు. అది వెంకటయ్య కట్టించిందే. పూరిల్లు మాత్రం వెంకటయ్య కట్టుకున్నది. మట్టిగోడలు, తాటాకులతో కట్టుకున్నాడు. భవంతిలోని వాళ్లు ఇక్కడికి రావడమే కానీ, వెంకటయ్య భవంతిలోకి వెళ్లడు. ఓ రోజు చెప్పేశాడు. ‘నేనిక నా ఇంట్లోనే ఉండిపోతాను. మీరంతా మనింట్లో ఉండండి’ అని! ఆ ‘ఓ రోజు’కు ఉన్న ప్రత్యేకత ఏం లేదు. ‘ఓ రోజు’ అంతే. ఆ మాటకు అతడి భార్యేమీ ఖిన్నురాలైపోలేదు. భర్త మట్టిమనిషి అని ఆమెకు తెలుసు. మట్టి అంటకుండా తిరిగే లోకానికి దూరంగా ఉంటానంటే ఆమె కాదనడానికి ఏముంటుంది! అయితే ఒక మాట మాత్రం అంది. ‘నేనూ మీతోనే ఈ పూరింట్లో ఉంటాను’ అని. ఆ మాటకు వెంకటయ్య నవ్వాడు. ఆమెకు చుట్టూ పిల్లలుండాలి. ఆ పిల్లల పిల్లలు ఉండాలి. ఇరుగు పొరుగు వచ్చి వెళుతుండాలి. ఒంట్లో బాగున్నా, లేకున్నా.. ఇన్నేళ్లలో తనెప్పుడూ ఏకాంతాన్ని, ఒంటరితనాన్ని కోరుకున్నట్లు అతడికి గుర్తు లేదు. అందుకే నవ్వి, ‘నాకు చీకటంటే ఇష్టం’ అన్నాడు.‘నేనూ చీకట్లోనే ఉంటాను’ అంది ఆవిడ. ‘నాకు ఒంటరితనం అంటే ఇష్టం’ అన్నాడు. ‘నేనూ ఒంటరితనంలోనే ఉంటాను’ అనడానికి లేకుండా పోయింది ఆవిడకు. ఇద్దరు కలిసి ఉంటే అది ఒంటరితనం అవుతుందా! అందుకే ఆ మాట అనలేకపోయింది. వెంకటయ్య సంపాదించాల్సిందంతా సంపాదించి, భార్యకు, పిల్లలకు ఇచ్చినంతా ఇచ్చి, పిల్లలకు ఉద్యోగాలొచ్చి, వాళ్లకు పెళ్లిళ్లయ్యాక తనొక్కడు ఇటు వేరుగా పూరింట్లోకి వచ్చేశాడు. వస్తూ వస్తూ భవంతిలోంచి పూరింట్లోకి తన మంచినీళ్ల కుండను భద్రంగా తెచ్చుకున్నాడు. ఊహ తెలిసినప్పట్నుంచీ ఆ కుండలోని నీళ్లే తాగుతున్నాడు అతను. అందుకే దానిని తెచ్చుకున్నాడు. మిగతా తిండీ తిప్పలు అక్కడి నుంచే ఇక్కడికి అడక్కుండానే, వేళ మీరకుండా వచ్చేస్తుంటాయి. అప్పుడప్పుడు మనవలు వచ్చి ఆడుకుని వెళుతుంటారు. అల్లరి మరీ ఎక్కువైనప్పుడు భార్యను పిలిచి, ‘వీళ్లను తీసుకెళ్లు’ అన్నట్లు ఆమె వైపు చూస్తాడు. వెంకటయ్య ఉంటున్న ఇంట్లో అతడి నులక మంచం, అతడి కళ్లజోడు తప్ప పిల్లలు ఎక్కి, దిగి, లాగి, జరిపి, నెట్టి, పడేసి, పగలగొట్టేవేమీ ఉండవు. ఉండవనే అతడూ అనుకున్నాడు కానీ ఆ రోజు అల్లరి ఎక్కువై, భార్యకు కబురు పంపేలోపే అతడు మంచినీళ్లు తాగే కుండను పగలగొట్టేశారు పిల్లలు! అది వెంకటయ్య ఊహించని పరిణామం. అది వెంకటయ్య తన పుట్టింటి నుంచి తెచ్చుకున్న మట్టి కుండ. చిన్నప్పట్నుంచీ ఆ కుండ తనతోనే ఉంది. బ్యాచిలర్‌గా ఉన్న రోజుల్లో అతడితో పాటు ఆ కుండ అతడు అద్దెకు తీసుకుని చదువుకుంటున్న రూమ్‌కి వచ్చేసింది. పెళ్లయ్యాక భార్యతో పాటు అతడి ఇంట్లోకి అడుగుపెట్టింది. పెళ్లైన ఈ ముప్పై ఐదేళ్లలో ఇంట్లో రెండు మూడు ఫ్రిజ్‌లు మారిపోయాయి కానీ, కుండ మారిపోలేదు. ఆ రాత్రి వెంకటయ్యకు కల వచ్చింది. తన కుండ పగిలిపోనట్లు! పగిలిపోనందుకు కలలో చాలా సంతోషించాడు. తెల్లారి లేవగానే పిల్లల్ని కుండ దగ్గరకు రానివ్వకూడదని కలలోనే అనుకున్నాడు. కల కూడా కుండలా పగిలిపోయినప్పుడు కానీ అతడికి మెలకువ రాలేదు. మెలకువ వచ్చి నీళ్లు తాగుదామంటే కుండ లేదు! పక్కనే భార్య పెట్టి వెళ్లిన వాటర్ బాటిళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు తాగబుద్ధి కాలేదు వెంకటయ్యకు. కుండ పగిలిన మర్నాడే కుమ్మరి దగ్గరు వెళ్లాడు వెంకటయ్య. అతడి చేతిలో సంచి ఉంది. ఆ సంచిలో పగిలిన తన కుండ పెంకులు ఉన్నాయి. ఆ పెంకుల్ని నీళ్లలో నానబెట్టి, మట్టి ముద్దగా చేసి, ఆ ముద్దతో చిన్న పాత్రంత కుండనైనా సరే తయారు చేసిమ్మని అడిగాడు. అలా వీలు కాదని కుమ్మరి అనడంతో కనీసం కుండపై మూతనైనా తయారు చేసి ఇమ్మన్నాడు. అలా చెయ్యడం కూడా కష్టం అన్నాడు కుమ్మరి. నిరాశగా చూశాడు వెంకటయ్య. అక్కడ ఉన్న కుండల్లో తన కుండను పోలిన కుండను ఒకదాన్ని కొనుక్కున్నాడు. కుండతో పాటు కుండపై మూత కూడా ఇచ్చాడు కుమ్మరి. కొత్త కుండను తీసుకుని ఆ ఎండలో అలాగే నడుచుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. బాగా దాహంగా ఉంది అతడికి. బాటిల్లో నీళ్లు ఉన్నాయి. తాగబోయి ఆగాడు. సంచీ తీసి అందులోంచి పెద్ద మూతంత ఉన్న పెంకును తీసి బాటిల్లోని నీళ్లను ఆ పెంకులో ఒంపుకుని, ఆ నీటిని తాగాడు. ప్రాణానికి హాయిగా అనిపించింది. ఆ రాత్రి వెంకటయ్య భార్య కొత్త కుండను కడిగి, వెంకటయ్య మంచం పక్కనే పెట్టి, నిండా నీళ్లు పోసి పైన మూత పెట్టింది. ఆమె అలా వెళ్లిపోగానే, వెంకటయ్య ఆ మూతను తీసి పక్కన పెట్టి, దాని స్థానంలో అంతక్రితం తను నీళ్లు తాగిన కుండ పెంకును మూతగా పెట్టాడు. తన పాత కుండతో అతడు బంధాన్ని తెంపుకోలేకపోతున్నాడు. ఆ రాత్రి వెంకటయ్య చాలాసేపటికి వరకు నిద్రపోలేదు. చీకట్లో అలాగే మేల్కొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎప్పటికో నిద్ర పడుతుండగా చిన్నగా చప్పుడు వినిపించింది. ఎవరో మంచినీళ్ల కోసం కుండపై మూత తీస్తున్న చప్పుడు అది! మంచంపై పక్కకు ఒత్తిగిలి ఆ చీకట్లోనే కుండవైపు చూశాడు. మూత కదులుతోంది!! కళ్లు చికిలించి కాస్త దగ్గరగా చూశాడు. మూత కదులుతున్నట్లేం అనిపించలేదు. భ్రాంతి అనుకున్నాడు. కళ్లు మూసుకున్నాడు. నిద్రలోకి జారుకుంటుండగా మళ్లీ మూత కదిలిన చప్పుడయింది. ఈసారి అతడు తలతిప్పి చూడలేదు. పూర్తిగా నిద్రలోకి వెళ్లిపోయాడు.పెద్దగా చప్పుడైతే ఉలిక్కిపడి లేచాడు వెంకటయ్య. లేచి, లైటు వేశాడు. కొత్త కుండ పగిలి ముక్కలై ఉంది. వాటి మధ్యలో పాత కుండ పెంకు మూత చెక్కు చెదరకుండా ఉంది!! - మాధవ్ శింగరాజు -
వృత్తి ధర్మం
‘‘నాకొక ఒర్జినల్ దెయ్యం కావాలి’’ అన్నాడు వ్యాస్. ‘‘కమెగైన్’’ అన్నాడు త్రిలోక్ మల్హోత్రా.‘‘ఎస్. ఒక నిజమైన దెయ్యాన్ని చూడాలని నా మనసు కోరుకుంటోంది’’ అన్నాడు వ్యాస్. ‘‘గాడ్.. నాకేమని వినిపించిందంటే.. మీరొక వర్జిన్ దెయ్యాన్ని కోరుకుంటున్నారని’’ అంటూ పెద్దగా నవ్వాడు మల్హోత్రా. ఆ నవ్వుతో అతడిపై వ్యాస్‌కి ఇంప్రెషన్ పోయింది. ‘‘మీ వల్ల కాదని నాకు అర్థమైంది. బై’’ అని విసుగ్గా పైకి లేచాడు. మల్హోత్రా ఖిన్నుడయ్యాడు. ‘నీ వల్ల కాదులే’ అని ఒక వ్యక్తి లేచి వెళ్లడానికి సిద్ధపడటం అతడి సర్వీసులో అదే మొదటిసారి. సర్వీసంటే పెద్దగా ఏం కాదు. దెయ్యాల్ని కళ్లారా చూపిస్తాడు. భక్తులు దైవ దర్శనానికి క్షణమైనా నోచుకోవడం కష్టం అవుతుందేమో కానీ, భయస్థులు మల్హోత్రా దగ్గరకు వచ్చాక దెయ్యాన్ని చూడకుండా వెళ్లరు. కొంతమందికి మాత్రం అక్కడి వరకూ వచ్చాక అనిపిస్తుంది.. దెయ్యంతో గేమ్స్ ఎందుకని. చివరి క్షణంలో వెనక్కి వెళ్లిపోతారు. త్రిలోక్ మల్హోత్రా భూత వైద్యుడు కాదు. భూత శాస్త్రజ్ఞుడు. దెయ్యాలు ఉన్నాయా లేవా అని పరిశోధనలు చేసే స్థాయిని అతడెప్పుడో దాటేశాడు. దెయ్యాల్ని పట్టి వాటిపై ఇప్పుడు పరిశోధనలు చేస్తున్నాడు. ఏట్లో చేపల్ని పట్టినట్లుగా అతడు శ్మశానాల్లో దెయ్యాల్ని పట్టేస్తాడు. ఆ పట్టేయడం గమ్మత్తుగా ఉంటుంది. గంగా జలాన్ని నేరుగా సీసాలోకి పట్టినట్లు.. దెయ్యాల్ని సీసాల్లో బంధించేసి తన ల్యాబ్‌కి తెచ్చేసుకుంటాడు. ‘‘మీ వృత్తి ధర్మం మీద నాకు సందేహాలు మొదలయ్యాయి మిస్టర్ మల్హోత్రా. నేను ఒరిజినల్ దెయ్యం అన్న మాటను మీరు ఎప్పుడైతే వర్జిన్ దెయ్యం అని తీసుకున్నారో.. మీరొక నాన్‌సీరియస్ డెవిల్స్ సైంటిస్ట్ అని అర్థమైంది. వృత్తి మీద గౌరవం లేనివాళ్లే ఇలా.. ఆడవాళ్లతో పోలికలు తెచ్చి గంభీరమైన వాతావరణాన్ని తేలికపరుస్తారు’’ అన్నాడు వ్యాస్. ‘‘అంటే.. మీరు ఆడవాళ్లను తేలికపరుస్తున్నారా వ్యాస్’’ అన్నాడు మల్హోత్రా. ‘‘నేను తేలికపరచలేదు మల్హోత్రా. దెయ్యాల్లో ఆడ మగ పోలికలు తెచ్చి, మీరే ఆడవాళ్లను తేలికపరిచారు. ఎట్ ద సేమ్ టైమ్ దెయ్యాలను! ఎట్ ద సేమ్ టైమ్ మీ వృత్తిని!’’ అన్నాడు వ్యాస్. మళ్లీ ఒకసారి నవ్వబోతూ ఆగాడు మల్హోత్రా. ‘‘మీరు అనుమతిస్తే నేను మరొకసారి నవ్వాలనుకుంటున్నాను మిస్టర్ వ్యాస్’’ అన్నాడు. ఆ విరుపు వ్యాస్‌కి అర్థమైంది. ‘‘నవ్వండి. కానీ.. ఒర్జినల్ దెయ్యమా? వర్జిన్ దెయ్యమా అనడం.. ఇట్సే బ్యాడ్ జోక్’’ అన్నాడు వ్యాస్. ‘‘రైట్. మిస్టర్ వ్యాస్. చెప్పండి. మీ మనసు ఏం కోరుకుంటోంది. దెయ్యాన్ని చూడాలనా? దెయ్యాలను చూడాలనా?’’.. అడిగాడు మల్హోత్రా. ‘‘ఎలాగైనా పర్లేదు మల్హోత్రా. కానీ మీరు సమాజాన్ని ఉద్ధరించే సైకాలజిస్టులానో, పత్రికల్లో దెయ్యం కథలు రాస్తుండే అతి తెలివి రచయితల్లానో దెయ్యాలను చూపించడాన్ని నేను ఇష్టపడను. ‘దెయ్యాలు ఎక్కడో ఉండవు.. మనసులోనే ఉంటాయి’ అంటాడు సైకాలజిస్ట్. ‘దెయ్యాలు లేవని చెప్పడానికే దెయ్యాలు ఉన్నాయని రాస్తున్నాను’ అంటాడు రచయిత. ఈ ట్రాష్ అంతా నాకు అక్కర్లేదు. అందుకే ఒర్జినల్ దెయ్యం కావాలని మిమ్మల్ని అడిగాను. ఒర్జినల్ అంటే.. అది నా కళ్లకు కనిపించాలి. అది నా మీదకు రావాలి. అది చూసి నేను భయంతో చచ్చినంత పనవ్వాలి. అది నన్ను తరుముకుంటూ ఉంటే నేను పెద్దగా రంకెలు పెడుతూ పారిపోతుండాలి. అలాంటి దెయ్యం! తెల్లటి పొగను చూపించి, అదే దెయ్యం అంటే నమ్మను. సమీపంలో ఏదో వింత వాసన వస్తోంది.. అదే దెయ్యం అంటే నమ్మను. కిర్రుమని చప్పుడవుతుంటే అదే దెయ్యం అని నమ్మను. కిటికీలు టపటప కొట్టుకుంటుంటే అదే దెయ్యం అని నమ్మను. మీరు నా చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి ఇదే దెయ్యం అని చూపిస్తే, అప్పుడు నేను నమ్ముతాను’’ అన్నాడు వ్యాస్. మౌనంగా విని, మౌనంగా ఉండిపోయాడు మల్హోత్రా. ‘‘ఏమిటాలోచిస్తున్నారు మల్హోత్రా. మీరైనా నాకొక స్పష్టమైన దెయ్యం రూపాన్ని చూపిస్తారనే అశిస్తున్నాను’’ అన్నాడు వ్యాస్. ‘‘తప్పకుండా’’ అన్నాడు మల్హోత్రా. అని, ‘‘ఒకటి చెప్పండి మీరు బయట ఉండి, లోపలి దెయ్యాల్ని చూడాలనుకుంటున్నారా? లోపల ఉండి బయటి దెయ్యాల్ని చూడాలనుకుంటున్నారా?’’ అడిగాడు. ‘‘అర్థం కాలేదు’’ అన్నాడు వ్యాస్. ‘‘బయట ఉండి లోపలి దెయ్యాల్ని చూడడం అంటే.. నా ల్యాబ్‌కి వెళ్లి, అక్కడి సీసాల్లోని దెయ్యాల్ని చూడ్డం. లోపల ఉండి బయటి దెయ్యాలను చూడ్డం అంటే.. శ్మశానానికి వెళ్లిపోయి అక్కడ తిరుగుతుండే దెయ్యాల్ని చూడ్డం’’.. చెప్పాడు మల్హోత్రా. వ్యాస్‌కి కొంతే అర్థమైంది. ‘‘ల్యాబ్‌కి వెళ్లడం వరకు ఓకే. శ్మశానానికి వెళ్లినప్పుడు అక్కడి దెయ్యాలు, మనమూ అంతా బయటే ఉంటాం కదా. మరి లోపల ఉండి బయటి దెయ్యాల్ని చూడ్డం ఏమిటి?’’ అని అడిగాడు. నల్లటి దారం ఒకటి చూపించి, ‘‘ఇది చేతికి కట్టుకుంటే మనం లోపల ఉన్నట్లే. మనం బోనులో తిరుగుతూ, సఫారీలో క్రూర జంతువుల్ని చూస్తూ వెళ్తాం కదా. అలా’’ అన్నాడు మల్హోత్రా. ‘‘అయితే శ్మశానానికే వెళ్దాం’’ అన్నాడు వ్యాస్. ఆ రాత్రి మల్హోత్రా కంటే ముందే శ్మశానానికి చేరుకున్నాడు వ్యాస్. అయితే మల్హోత్రా ఇచ్చిన నల్లదారం కట్టుకోవడం మర్చిపోయాడతడు. శ్మశానంలోకి వచ్చాక అక్కడి ఎగుడు దిగుడు దిబ్బల్ని, అక్కడక్కడా ఉన్న అస్థికల్ని, ఆ మసక వెలుతురులో వ్యాపిస్తున్న పొగలనీ చూశాక.. ఎందుకో తను చేస్తున్నది పిచ్చి పని అనిపించిందతడికి. మల్హోత్ర ఎంతకూ రాకపోతుంటే, మంచిదే అయిందని అక్కడి నుంచి వెనుతిరిగాడు. నాలుగడుగులు వేశాడో లేదో.. మల్హోత్రా వస్తూ కనిపించాడు! వస్తూ కనిపించాడో, Ðð ళ్తూ కనిపించాడో వెంటనే అర్థం కాలేదు వ్యాస్‌కి. ‘‘నీకంటే ముందే వచ్చాను వ్యాస్.. నా సీసాలోకి ఏ దెయ్యమైనా దొరుకుతుందేమోనని. ఒక్కటీ కనిపించలేదు. అలాగని నువ్వేం నిరాశపడకు. నువ్వు కోరుకుంటున్నట్లు నీ చెయ్యి పట్టుకుని నీకు దెయ్యాన్ని చూపించే పూచీ నాది’’ అన్నాడు మల్హోత్రా. ఇద్దరూ కలసి నడుస్తున్నారు. ముందు వ్యాస్ నడుస్తున్నాడు. వెనుక మల్హోత్రా నడుస్తున్నాడు. కొంత దూరం నడిచాక వ్యాస్‌కి ఎవరో తన చెయ్యి పట్టుకున్నట్లనిపించి వెనక్కి తిరిగి చూశాడు. మల్హోత్రానే. కానీ మల్హోత్రా చెయ్యి మాత్రమే వ్యాస్ చేతిని పట్టుకుని ఉంది. మల్హోత్రా ఎక్కడో.. దూరంగా.. చాలా దూరంగా.. తనవైపే నవ్వుతూ చూస్తున్నాడు. గుండె గుభేల్మంది వ్యాస్‌కి. దెయ్యాన్ని చూడాలను కోడానికి ధైర్యం అక్కర్లేదు. దెయ్యాన్ని చూడ్డానికి మాత్రం ధైర్యం కావాలని ఆ తర్వాతనైనా అతడు అనుకున్నాడేమో తెలీదు. - మాధవ్ శింగరాజు -
భూత వైద్యుడు
ఒక్కసారిగా పెద్దగా అరిచేసింది దుర్గ. ఆ అరుపుకు అదిరిపడ్డాడు అమన్. ‘‘నేను చచ్చాకైనా ఇల్లు మారుస్తావా అమన్?’’ అంది. ‘‘ఈ దెయ్యాల కొంపలో నేనుండలేను’’ అంది దుర్గ.పెద్దగా నవ్వబోయి, ఆగిపోయాడు అమన్. అక్కడ దుర్గ లేదు! కిచెన్‌లో చూశాడు. లేదు! హాల్లో చూశాడు. లేదు! డైనింగ్ రూమ్‌లో చూశాడు. లేదు! పెరట్లోకి వెళ్లి చూశాడు. లేదు! బాత్రూమ్ వైపు చూశాడు. లేదు! ముగ్గేస్తోందేమోనని చూశాడు. లేదు! మేడపైకి వెళ్లి చూశాడు. లేదు!‘‘ఈ దెయ్యాల కొంపలో నేనుండలేను’’ మళ్లీ అంది దుర్గ.‘‘ఎక్కడున్నావ్?!’’ అన్నాడు అమన్, ఆమె చేతిలోంచి కాఫీ కప్పు అందుకుంటూ. వింతగా ఉంది అతడికి. ‘‘బందిత పిలిస్తే వాకిట్లోకి వెళ్లాను..’’ ‘‘వాకిట్లో లేవు మరి!’’‘‘వాకిట్లోంచి వాళ్లింట్లోకి తీసుకెళ్లింది.’’‘‘ఏమంటోంది.. బందిత, తనక్కూడా మనింట్లో దెయ్యం కనిపించిందటనా?’’ నవ్వుతూ అన్నాడు.‘‘బందిత మనింట్లో కాదు కదా ఉండేది! నేనే చెప్పాను మన దెయ్యాల కొంప గురించి.’’‘‘ఏం చెప్పావ్? దెయ్యాలు ఉన్నాయనా?’’‘‘కాదు, మంచి ఇల్లేదైనా ఉంటే చూసి చెప్పమని.’’అమన్ నవ్వాడు. ‘‘ఏమంది బందిత?’’‘‘వెళ్లిపోతారా? అని ఆశ్చర్యంగా అడిగింది.’’‘‘నువ్వేమన్నావ్?’’‘‘పదేళ్లుగా ఉంటున్నాం. ఇక చాలు’’ అన్నాను.పెద్దగా నవ్వాడు అమన్. దుర్గ.. దెయ్యం అన్నప్పుడల్లా.. అమన్ అలాగే నవ్వుతాడు.. పెద్దగా, హార్ట్లీగా.‘‘ధైర్యవంతురాలివే. పేరు మాత్రం దుర్గ’’ అన్నాడు. ‘‘అమన్. నేను సీరియస్‌గా మాట్లాడుతున్నాను. ఇల్లు మారిపోదాం ప్లీజ్’ అంది దుర్గ. ఆమె కళ్లలో తడి!‘‘ఏమైంది.. దుర్గా’’ అన్నాడు. ‘‘ఇల్లు మారిపోదాం అని కదా అన్నాను. కాదు అమన్. పారిపోదాం అనిపిస్తోంది’’ అంది.భార్యవైపు వింతగా చూశాడు అమన్. ‘‘నువ్వు ఆఫీస్‌కి వెళ్లిపోతావు అమన్. పిల్లలు స్కూలుకు వెళ్లిపోతారు. ఇంట్లో నేనొక్కదాన్నీ ఉంటాను. నేనొక్కదాన్నే కాదు. నాతో కొన్ని దె..య్యా..లు కూడా! భయం వేస్తోంది అమన్.. చచ్చిపోతానేమోనని’’ అంది దుర్గ. ‘‘సరే, సీరియస్‌గా వెతుకుతాను. ఒకటి చెప్పు. మనింట్లో నిజంగానే అలాంటివేమైనా కనిపించాయా?’’ అడిగాడు అమన్. ‘‘ఎస్’’ అంది దుర్గ, కళ్లు తుడుచుకుంటూ. భార్య అలా కళ్లు తుడుచుకుంటూ ఇల్లంతా ఒకసారి కలియచూడడం గమనించాడు అమన్. ‘‘సీరియస్‌గా వెతుకుతాను దుర్గా’’ అన్నాడు.అన్నట్లుగానే వెతికాడు. అయితే ఇంటిని కాదు. సైకియాట్రిస్ట్‌ని! పదేళ్లుగా కంఫర్ట్‌గా ఉంటున్న ఇంటిని దెయ్యాల భయంతో ఖాళీ చేసి వెళ్లడం ఏమంత తెలివైన పనిలా అనిపించలేదు అమన్‌కి. దోమలనీ, నీళ్లు సరిగా రావనీ, వర్షాలొస్తే వరండా మునిగిపోతుందనీ, మార్కెట్‌కు దూరమనీ, హాస్పిటళ్లు దగ్గర్లో లేవనీ.. ఇలాంటి ఈతి బాధలు కూడా ఏం లేవు. అద్దెకూడా తక్కువే. అంత మంచి లొకాలిటీనీ, అంత మంచి ఇంటిని వదిలేసి వెళ్లిపోవడం పిచ్చితనం కాకపోతే ఏంటి.. అనుకున్నాడు అమన్. అందుకే సైకియాట్రిస్ట్‌ని కలిశాడు. భూతవైద్యుణ్ణి కలిసి, అతడికి ముందే నాలుగు ముక్కలు చెప్పి ఉంచి, ఇంటినంతా నాలుగు మూలలూ తిప్పించి ‘అసలిది దేవతలు ఉండే ఇల్లు’ అని ఆ భూతవైద్యుడి చేత దుర్గకు చెప్పించవచ్చు. కానీ ఇంట్లోకి భూత వైద్యుడిని రానివ్వడం అమన్‌కి ఇష్టం లేదు. అదీగాక, దుర్గ.. ‘ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోదాం’ అంటోంది తప్ప, ‘ఇంట్లోంచి దెయ్యాలను ఖాళీ చేయిద్దాం’ అనడం లేదు. అందుకే భూత వైద్యుణ్ణి కాక, మానసిక వైద్యుణ్ణి వెతికి పట్టుకున్నాడు అమన్. సైకియాట్రిస్ట్ దగ్గరికి అనగానే ఒక్కసారిగా పెద్దగా అరిచేసింది దుర్గ. ఆ అరుపుకు అదిరిపడ్డాడు అమన్. ‘‘నేను చచ్చాకైనా ఇల్లు మారుస్తావా అమన్?’’ అంది.ఖిన్నుడయ్యాడు అమన్ ఆ మాటకు! చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. దుర్గ కూడా మౌనంగా ఉండిపోయింది. ఆ రాత్రి, ఆ తెల్లారి వాళ్లిద్దరి మధ్యా మాటల్లేకపోవడం పిల్లలు గమనించారు.పిల్లలు స్కూల్‌కి వెళ్లిపోయాక, భర్త ఆఫీస్‌కి బయల్దేరుతుంటే అడిగింది దుర్గ..‘‘డాక్టర్ అపాయింట్మెంట్ ఎన్నింటికి?’’ దుర్గతో చాలాసేపు మాట్లాడాక, ఆమెను బయట వెయిట్ చెయ్యమని చెప్పి, అమన్‌ని లోపలికి పిలిచాడు డాక్టర్ తీర్థ. ఆయన ఎదురుగా కూర్చొన్నాడు అమన్. ‘‘మీ వైఫ్ చెప్పింది నిజమే. మీ ఇంట్లో దెయ్యాలున్నాయి’’ అన్నాడు డాక్టర్ తీర్థ.అమన్ వింతగా చూశాడు. ‘‘ఇంకా మీరు ఆ ఇంట్లో ఉంటే మీ వైఫ్ మీకు దక్కరు’’ అన్నాడు తీర్థ. ‘‘దెయ్యాలు ఆమెను పీక్కుతింటాయనేనా డాక్టర్.. మీరు చెప్పబోతున్నారు?’’‘‘ఎగ్జాట్లీ అమన్. ఆమెకు ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. ‘ఎందుకు ఇష్టం లేదు’ అని నేను ఆమెను అడగలేదు. అలా అడిగితే శాంతిపూజలు చేస్తే సరిపోతుందని చెప్పే భూతవైద్యుడికీ నాకు తేడా ఉండదు. మీరు వెంటనే ఇల్లు మారండి. చింత ఉన్న చోట శాంతి మంత్రం పని చేయదు. పదేళ్ల నుంచీ మీరు ఆ ఇంట్లో ఉంటున్నారు. రెండేళ్ల నుంచీ తను ఇల్లుమారుదాం అంటున్నారు. మీరు నవ్వి ఊరుకుంటున్నారు. నాట్ కరెక్ట్ అమన్’’ అన్నాడు డాక్టర్ తీర్థ. అమన్ దీర్ఘంగా నిట్టూర్చాడు. ‘‘ఒకే డాక్టర్’’ అని పైకి లేచాడు. మళ్లీ ఒక్క క్షణం ఆగి, ‘‘నిజంగానే మా ఇంట్లో దెయ్యాలు ఉన్నాయంటారా డాక్టర్? మీరు చెప్పండి’’ అన్నాడు. డాక్టర్ తీర్థ అమన్ వైపు చూశాడు. ‘‘లేవు అమన్’’ అన్నాడు. అమన్ అర్థంకానట్లు చూశాడు. ‘‘అవును అమన్. మీ ఇంట్లో దెయ్యాలు లేవు. కానీ మీ వైఫ్‌కి కనిపిస్తున్నాయి. కిచెన్ ఒక దెయ్యంలా, హాల్ ఒక దెయ్యంలా, డైనింగ్ రూమ్ ఒక దెయ్యంలా, పెరడు ఒక దెయ్యంలా, మేడ ఒక దెయ్యంలా, బాత్రూమ్ ఒక దెయ్యంలా.. అసలు మీ ఇల్లే ఓ పెద్ద దెయ్యంలా కనిపిస్తోంది. తనిప్పుడు బంధనవిముక్తి కోసం కొట్టుకుంటున్న ఆత్మలా ఇంట్లో ఉంటోంది. ఏళ్ల తరబడి ఉన్నచోటే ఉండిపోయి, చేసిన పనే చేసుకుంటూ పోతుంటే ఆడవాళ్లెవరికైనా దెయ్యం పట్టినట్లే ఉంటుంది అమన్. మగాళ్లం.. మనకది తెలియదు. రోజూ ఆఫీస్ నుంచి అతిథుల్లా ఇంటికి వచ్చిపోతుంటాం కదా’’.. ముగించాడు డాక్టర్ తీర్థ. అమన్ బయటికి వచ్చాడు. దుర్గ భుజాల చుట్టూ చెయ్యి వేసి చెప్పాడు..‘‘మంచి భూతవైద్యుడే దొరికాడు. నాకు పట్టిన దెయ్యాన్ని వదిలించాడు.’’ -
రెండు ముఖాలు
‘‘కోరిక తీరకుండా చనిపోతే దెయ్యం అవుతారనే విన్నాను కానీ, కోరిక తీర్చుకోడానికి చనిపోతే దెయ్యం అవుతారో లేదో నాకు తెలీదు మరి’’ అన్నాడు సుధామ. చచ్చి దెయ్యం అవ్వాలన్న కోరిక పట్టి పీడిస్తోంది శివశంకర్ని కొన్నాళ్లుగా! ‘‘కోరిక తీరకుండా చనిపోతేనే కానీ దెయ్యం అవ్వలేం’’ అన్నాడు సుధామ. శివశంకర్ కళ్లు మెరిశాయి. ఎందుకు మెరిశాయో సుధామకు అర్థంకాలేదు. ఇద్దరూ కొండంచున బండరాయిపై కాళ్లు కిందికి వేలాడేసి కూర్చొని ఉన్నారు. గట్టిగా గాలి వీస్తే పడిపోయేలా ఉన్నారు. అంతెత్తునుంచి ఊళ్లోని ఇళ్లు కనిపిస్తున్నాయి కానీ, ఊళ్లోని మనుషులు కనిపించడం లేదు. మనుషులు కనిపించకపోవడంతో శివశంకర్ మనసుకు ప్రశాంతంగా ఉంది. సుధామ ఏ ఆలోచనా లేకుండా శివశంకర్ పక్కన కూర్చొని ఉన్నాడు. ఇద్దరూ స్నేహితులు. జీతాల్లోకి, జీవితాల్లోకి వెళ్లిపోయిన చాలా ఏళ్లకు మళ్లీ ఊళ్లో కలుసుకున్నారు. ఉండిపోడానికి వచ్చిన రెండురోజులైనా మనుషుల్లో ఉండలేక శివశంకరే సుధామను ఆ కొండ పైకి లాక్కొచ్చాడు. చిన్నప్పుడు సాయంత్రాలప్పుడు ఇద్దరూ కలిసే ఆ కొండపైకి ఎక్కేవారు. సుధామ రాలేనప్పుడు శివశంకర్ ఒక్కడే వెళ్లి చీకటి పడేవరకు కొండపైనే కూర్చొని కిందికి దిగొచ్చేవాడు. అతడికెందుకో ఊళ్లో కంటే, ఊళ్లోని కొండపైనే హాయిగా ఊపిరాడేది. ఊళ్లో ఇరుగ్గా ఉన్నట్టనిపించేది. మనిషి పక్కనొచ్చి చేరితే గుండె నొక్కుకుపోయినట్లుగా ఉండేది. ‘‘కోరిక తీరకుండా చనిపోతే నిజంగానే దెయ్యం అవుతారా?!’’.. అడిగాడు శివశంకర్. మళ్లీ అతడి కళ్లల్లో మెరుపు. బతకాలని బలంగా కోరుకునేవాళ్ల కళ్లలో ఆశ కనిపిస్తుంది. చావాలని బలంగా కోరుకుంటున్నవాళ్ల కళ్లలో మెరుపు కనిపిస్తుంది. ‘‘ఏమైందిరా ఇప్పుడూ.. ’’ అన్నాడు సుధామ.. శివశంకర్ భుజం మీద చెయ్యి వేసి. ఆ చెయ్యి ఇంకొంచెం ఆత్మీయంగా వేసి ఉంటే ఆ తాకిడికి పడిపోయేలా కొండపై మరీ కొసకు శివశంకర్ కూర్చొని ఉండడం సుధామ గమనించలేదు. ‘‘ఈ మనుషులు నాకు నచ్చడం లేదు. పైకి ఒక రకంగా, లోపల ఒక రకంగా ఉంటున్నారు’’ అన్నాడు శివశంకర్. సుధామ నవ్వాడు. అలా నవ్వుతున్నప్పుడు ఆ కదలిక అతడిని కొండ రాయిపై మరికాస్త కొసకు జరిపింది. ‘‘మనుషులు పైకి ఉన్నట్లే లోపల, లోపల ఉన్నట్లే పైకి ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు శివా?’’ అన్నాడు సుధామ ఆపేక్షగా.‘‘మనుషులు రెండు రకాలుగా ఉంటే నేను సహించలేను సుధా! కాల్‌తో తన్నేసి వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ ఈ రెండు కాళ్లతో ఎంత మందినని తన్నను?! వెయ్యి, లక్ష, కోటి కాళ్లు కావాలి. వాటికి కొండంత బలం కావాలి. ఆ బలానికి ఈ రెండు ముఖాల మనుషులంతా పచ్చడి పచ్చడైపోవాలి’’ అన్నాడు శివశంకర్. పెద్దగా నవ్వాడు సుధామ. నవ్వుతూనే ఉన్నాడు. నవ్వును ఆపుకునే ప్రయత్నం చేయలేదతడు. చేసి ఉంటే, పక్కనే ఉన్న శివశంకర్ భుజాలు పట్టుకుని ఊపేసేవాడు. ఆ ఊపుకు ఇద్దరూ కొండ పైనుంచి పడిపోయేవారు. ‘‘చెప్పు.. మన ఊళ్లో ఎవరున్నారు నువ్వు కాల్‌తో తన్నాల్సిన లిస్టులో’’ అన్నాడు సుధామ.. నవ్వును తగ్గించి. ‘‘ఒకళ్లని చెప్పలేను. ఒక చోటని చెప్పలేను. నేనెక్కడికెళితే అక్కడ ఈ రెండు ముఖాలవాళ్లు తగులుతూనే ఉన్నారు’’ అన్నాడు శివశంకర్. అలా అన్నాడే గానీ, సుధామ చెప్పమన్న లిస్టులో మొదట అతడికి ఇద్దరు గుర్తొచ్చారు. ఒకరు తనెంతో ఇష్టపడిన తన చిన్నప్పటి హెడ్మాస్టర్. ఇంకొకరు.. తనిప్పుడు పనిచేస్తున్న ఊళ్లో అనుకోకుండా ఇటీవలే పరిచయం అయిన తన అభిమాన కథా రచయిత.శివశంకర్‌కి హెడ్మాస్టర్ని చిన్నప్పుడే కాలితో తన్నాలనిపించడానికి కారణం.. ప్రవల్లికను ఆ హెడ్మాస్టర్ తాకకూడని చోట తాకడం! నైన్త్‌లో ప్రవల్లిక శివశంకర్ క్లాస్మేట్. ప్రవల్లికది ఫస్ట్ బెంచ్. శివశంకర్ వెనుక ఎక్కడో కూర్చునేవాడు. ఆఫీస్ రూమ్‌లోకి పిలిపించుకుని హెడ్మాస్టర్ ప్రవల్లికను తాకకూడని చోట తాకినందు వల్ల శివశంకర్‌కు కోపం వచ్చేంత స్పెషల్ ఫీలింగ్సేమీ శివశంకర్‌కి ప్రవల్లిక మీద లేవు. కానీ హెడ్మాస్టర్ మీద ఉన్నాయి! గర్ల్ స్టూడెంట్స్‌కి, ఉమెన్ టీచర్స్‌కి ఆయనిచ్చే రెస్పెక్ట్‌లో శివశంకర్‌కి గొప్ప ఔన్నత్యం కనిపించేది. రామకృష్ణ పరమహంసలానో, రాజారామ్మోహన్ రాయ్లానో కనిపించేవారాయన. అలాంటి మనిషి ప్రవల్లికను అలా తాకడంతో మానవజన్మ మీదే గౌరవం పోయింది శివశంకర్‌కి. మనుషుల నుంచి తప్పించుకోడానికి కథల పుస్తకాల్లోకి వెళ్లిపోయాడు శివశంకర్. అలా వెళ్లినప్పుడే.. తనలాగే మనుషుల్ని విశ్వసించి, వారి అసలు స్వరూపానికి దిగ్భ్రాంతికి లోనై మానవ నైజాల మీద కథలు రాస్తున్న ఒక రచయిత శివశంకర్‌కి తగిలాడు. ఆ రచనలు అతడికి ఎంతో ఊరటనిచ్చేవి. ఇంత గొప్ప రచయిత పుట్టిన కాలంలో తనూ పుట్టడం తన పూర్వజన్మ సుకృతం అనుకున్నాడు. కొద్దికాలంలోనే ఆ రచయిత శివశంకర్ అభిమాన కథా రచయిత అయిపోయాడు. ఎలాగైనా ఆయన్ని ముఖాముఖి కలవాలనుకున్నాడు. కలిశాడు! అలా కలిసి వస్తున్నప్పుడు ఆయన్ని కాలితో ఒక్క తన్ను తన్ని రావాలనిపించింది శివశంకర్‌కి. అందుక్కారణం ఆ రచయితలో రెండో ముఖం కనిపించడం. కథలు రాసిన మనిషి, తన ఎదురుగా ఉన్న మనిషి ఒకరు కాదని ఆయనతో కూర్చున్న కాసేపటికే తెలిసిపోయింది శివశంకర్‌కి. కుమిలిపోయాడు. ఇక ఈ లోకంలో తను నమ్మవలసిన మనిషెవరూ లేరని నిర్ణయించుకున్నాడు. మనుషులంటే చికాకు పడుతూ మనిషిగా బతకడం ఎందుకు అనుకున్నాడు. చచ్చి దెయ్యమై ఈ రెండు ముఖాల వాళ్లందర్నీ కాళ్లతో తన్నుతూ తన మానవజన్మకు పరిహారం చెల్లించుకుందామనుకున్నాడు. ‘‘కోరిక తీరకుండా చనిపోతే దెయ్యం అవుతారనే విన్నాను కానీ, కోరిక తీర్చుకోడానికి చనిపోతే దెయ్యం అవుతారో లేదో నాకు తెలీదు మరి’’ అన్నాడు సుధామ. శివశంకర్ నివ్వెరపోయాడు. అతడి ముఖంలో మెరుపు మాయమైంది. ‘‘పైగా మనుషులంతా లోపల, బయట ఒకే ముఖంతో ఉండాలన్న నీ కోరిక తీరనిదే అయినా, అది తీరనందుకు కాకుండా, కోపం తీర్చుకునేందుకు నువ్వు దెయ్యం అవ్వాలని కోరుకుంటున్నావు కనుక నువ్వు చచ్చిపోయాక కచ్చితంగా దెయ్యం అవుతావో లేదో చెప్పలేను’’ అన్నాడు సుధామ. ‘‘అయితే ఏం చెయ్యాలంటావు?’’ అడిగాడు శివశంకర్. ‘‘మనుషుల్తో అలా వేగడమే’’ అన్నాడు సుధామ. ‘‘సాధ్యమేనా?’’ అన్నాడు శివశంకర్. ‘‘ఎందుకు సాధ్యం కాదు? నేను వేగట్లా. మనిషి జన్మ కన్నా దెయ్యం జన్మ ప్రశాంతమైనదని నేనూ నీలాగే అనుకున్నాను. ఇక్కడా రెండు ముఖాలు ఉన్నాయి’’ అన్నాడు సుధామ. తలతిప్పి చూడ్డానికి భయపడ్డాడు శివశంకర్. ఒక్కసారిగా కిందికి దూకేసేంత ఎత్తులో లేడతడు. కొద్దికొద్దిగా కొండ దిగి వెళ్లవలసిందే. - మాధవ్ శింగరాజు -
పీపారాయుడి తీర్పు
అదిగో అతడే పీపారాయుడు!ఈ పీపారాయుడి అసలు పేరేమిటో గానీ... పీపాలకు పీపాలు సారా తాగుతాడని అందరూ ప్రేమగా ‘పీపారాయుడు’ అని పిలుచుకుంటారు. పీపారాయుడు గుర్రపు బండి దిగనే దిగాడు. కండువాను ఆ భుజం మీది నుంచి ఈ భుజానికి మార్చాడు. పీపారాయుడి ముందు ఒక బక్క పల్చటి వ్యక్తి భయంగా నిల్చొని ఉన్నాడు.‘‘ఏమిటి వీడు చేసిన తప్పు?’’ కరీం బీడి కట్ట నుంచి ఒక బీడి వెలిగించి ఉక్కుస్వరంతో అడిగాడు రాయుడు.‘‘పక్కింట్లో నుంచి పప్పు దొంగిలించాడండీ’’ అన్నాడు రాయుడి పర్సనల్ అసిస్టెంట్.‘‘పప్పుచారు తినక చాలా రోజులవుతుందయ్యా... ఇంట్లో ఉప్పు తప్పా... పప్పు లేదయ్యా... అందుకే పక్కింట్లో నుంచి పప్పు దొంగిలించానయ్యా.. ఈ తప్పు నెక్స్›్ట టైమ్ జరగనీయనయ్యా’’ చేతులు కట్టుకొని వినయంగా చెప్పాడు పప్పుదొంగ. పీపారాయుడు మరో బీడి వెలిగించాడు. రాయుడు గొంతు సవరిస్తుండగా, ప్రమాదాన్ని పసిగట్టిన పప్పుదొంగ కన్నీళ్లతో అతని కాళ్ల మీద పడి, దీనంగా... ‘‘అయ్యా! అండమాన్ జైల్లో ఆరు సంవత్సరాలు శిచ్చ వేసినా బరిస్తాను. దయచేసి డైలాగులు మాత్రం కొట్టొద్దయ్య.. నా గుండె తట్టుకోలేదయ్యా...’’ అన్నాడు. ఇదేమీ పట్టించుకోని పీపారాయుడు డైలాగ్ అందుకున్నాడు...‘ఆపు! నువ్వు చేతులు కట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రానా ప్రయోజనం ఉండదు. ఈ పీపారాయుడి తీర్పులో మార్పు ఉండదు.ఎవడి పప్పూ వాడిదే. ఎవడి తప్పూ వాడిదే.ఎవడి ఒప్పూ వాడిదే. ఎవడి ఉప్పూ వాడిదే.ఎవడి చెప్పూ వాడిదే. ఎవడి డప్పూ వాడిదే.ఎవడి కప్పూ వాడిదే. ఎవడి జిప్పూ వాడిదే’పీపారాయుడి డైలాగుల ధాటికి పప్పు దొంగ మూర్ఛిల్లిపోయాడు.ఆ తరువాత... ఏకంగా ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయాడు!‘నెక్స్›్టకేస్’ అరిచాడు రాయుడు.‘‘అయ్యా! వారం కింద చనిపోయిన మీ మామ రంగారాయుడుగారు దెయ్యమై తిరుగుతున్నాడండీ. కావాలంటే వినండి’’ అని హెయిర్ సెలూన్ పుల్లయ్యను పీపారాయుడి ముందు ప్రవేశ పెట్టాడు రాయుడి పీఏ.‘‘ఏం జరిగింది?’’ పుల్లయ్య కళ్లలోకి సూటిగా చూస్తూ అడిగాడు రాయుడు. ‘‘అయ్యా! ఆ రోజు నేను మా హెయిర్ సెలూన్లో బిజీగా ఉన్నాను. ఈలోపు వెనక నుంచి...‘నాకు హెయిర్ కటింగ్ చేయాలి’ అని ఒక గొంతు వినిపించింది.నేను వెనక్కి తిరిగి చూడకుండానే...‘ఇప్పుడు తీరిక లేదు.. గంట తరువాత వచ్చేయ్’ అన్నాను.‘ఓకే... నా తలను ఇక్కడే విడిచి వెళతాను. రెండు గంటల తరువాత వచ్చి తీసుకెళతాను. కటింగ్ చక్కగా చెయ్... బైబై’ అని వెనక నుంచి గొంతు వినిపించింది. ‘వీడెవడ్రా బాబూ!’ అని వెనక్కి తిరిగి చూశాను.అంతే!భయంతో గట్టిగా అరిచాను.వెనక ఒక కుర్చీలో మన రంగారాయుడిగారి తల ఉంది!‘ఓరి నాయనో’ అంటూ నాతో పాటు కస్టమర్లు అందరూ తలో దిక్కు పారిపోయాం.ఒక గంట తరువాత ధైర్యం చేసి సెలూన్‌లోకి వచ్చి చూశాను. కుర్చీలో తలకు బదులు పుర్రె కనిపించింది...’’ అని చెప్పాడు పుల్లయ్య.‘‘ఈ సంఘటన ఎప్పుడు జరిగింది?’’ బీడి ముట్టిస్తూ అడిగాడు పీపారాయుడు. ‘‘వారం రోజుల క్రితం జరిగిందయ్యా’’ చెప్పాడు పులయ్య.‘‘మరి ఇన్ని రోజులు నాకు చెప్పకుండా ఎందుకు దాచావు?’’ బీడి పొగ ఊదుతూ అడిగాడు రాయుడు.‘‘ఎలా చెబుతానయ్యా... రంగారాయుడుగారు మీకు బంధువు... సాక్షాత్తు మామగారు.. ఏదో ఇప్పుడు ధైర్యం చేసి చెప్పాను’’ అన్నాడు పుల్లయ్య.వెంటనే పీపారాయుడు మరో బీడి ముట్టించి ఇలా డైలాగ్ అందుకున్నాడు...‘‘బంధాలు బంధుత్వాలు కాదురా నాకు కావల్సింది... నీతి న్యాయం ధర్మం.పుట్టిన పుట్టుక కాదురా ముఖ్యం... నాకు ముఖ్యం జరిగిన అన్యాయం... జరగాల్సిన న్యాయం!రేయ్... తియ్యరా పుర్రెఏది రా? బర్రె!’’‘‘పుర్రె సరే... మధ్యలో ఈ బర్రె ఎక్కడి నుంచి వచ్చింది?’’ జనంలో ఒకడు ఇంకోడి చెవులో ఊదాడు.‘‘ప్రాస కోసం అలా వాడుతుంటాడు’’ అన్నాడు ఇంకొకడు.ఈలోపు ‘పీ....పా....రాయుడు’ అని ఆకాశం అదిరేలా అరుపు వినిపించింది. అందరూ అటుకేసి చూశారు...‘వామ్మో దెయ్యం’ అని జనాలు పరుగందుకున్నారు.‘అయ్యా! అటు చూడండి మన రంగారాయుడుగారు దెయ్యమై వస్తున్నారు. మాకు మీరే దిక్కు’’ అని పీపారాయుడి కాళ్ల మీద పడ్డాడు పీఏ. ‘‘నువ్వేమీ భయపడకు... కాస్త కాళ్ల మీది నుంచి లేస్తావా’’ అన్నాడు రాయుడు. ‘‘అలాగే’’ అని లేచాడు పీఏ. ఇదే అదునుగా గోచి బిగించి ‘ఓరినాయనో దెయ్యం ఇటే వస్తుంది’ అని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు ది గ్రేట్ పీపారాయుడు! కొసమెరుపు: ఊరి జనాలు చూసింది దెయ్యాన్ని కాదు. మనిషినే! అలా అయితే చనిపోయిన రంగారాయుడు ఎలా బతికి వస్తున్నాడు అనే కదా మీ డౌటు. అతని పేరు రంగారాయుడు కాదు. దొంగారాయుడు. రంగారాయుడు, దొంగారాయుడు ట్విన్స్. చిన్నప్పుడు ఒక దొంగతనం చేసి ఊళ్లో జనాలకు భయపడి పారిపోయాడు. ఆ తరువాత ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. అతనంటూ ఒకడున్నాడని కూడా ఎవరికీ తెలియదు. అలాంటి దొంగారాయుడికి ఊరు మీద మనసు మళ్లి ఇలా వచ్చాడు. అంతే! – యాకుబ్ పాషా -
వారికి ‘ఆధార్’ అంటే భయం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ప్రతి పౌరుడు ఆధార్ కార్డును తీసుకోవాలని భారత ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ఒత్తిడి చేస్తున్నా, అన్ని ప్రభుత్వ స్కీమ్‌లకు తప్పనిసరంటున్నా మిజోరమ్‌లో కొంత మంది ప్రజలు మాత్రం ఇప్పటికీ ఆధార్ కార్డును తీసుకోవాలంటే భయపడుతున్నారు. అందుకు కారణం వారి మత విశ్వాసమే. మిజోరమ్‌లో 87 శాతం మంది క్రైస్తవులే ఉన్నారు. బైబిల్ చివరి పుస్తకంగా పరిగణించే ‘బుక్ ఆఫ్ రివిలేషన్’ ప్రకారం 666 నెంబర్‌ను ‘దెయ్యం’గా క్రైస్తవులు పరిణిస్తారు. ఈ దెయ్యాన్ని ‘ఎక్సాకోసియో ఇయెక్సెకోంటాహెక్సా ఫోబియా’ అనే పదంతో కూడా సూచిస్తారు. ఆధార్ కార్డు నెంబర్లలో 666 నెంబర్ కూడా ఉంటది కనుక, అది దెయ్యం కింద లెక్కేనని, అందుకని తాము ఆధార్ కార్డునే స్వీకరించమని కొందరు ఇప్పటికీ వాదిస్తున్నారు. రాష్ట్రంలో 400 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఏకమై ఆధార్ కార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కూడా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా తాను మాత్రం ఆధార్ కార్డు నెంబర్‌ను తీసుకోబోనని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్థుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న ఓ టీచర్ లాల్జియారానా ప్రకటించారు. మత స్వేచ్ఛను కలిగి ఉండే హక్కు రాజ్యాంగపరంగా తమకు ఉంది కనుక మత విశ్వాసం ప్రకారం ఆధార్ కార్డును తిరస్కరించే హక్కు కూడా తమకు ఉందంటూ కొందరు సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు. ఆధార్ కార్డుకు దెయ్యానికి సంబంధం లేదని, అయినా దేవుడిని ఆరాధించే ప్రజల వద్దకు దెయ్యం రాదంటూ రాష్ట్రంలోని దాదాపు అన్ని చర్చిలు స్పష్టం చేశాక ఎక్కువ మంది క్రైస్తవులు ఆధార్ కార్డులను నమోదు చేయించుకున్నారు. అయినప్పటికీ మార్చి 15వ తేదీ వరకు ఆధార్ కార్డుల నమోదు రాష్ట్రంలో 81 శాతం వరకు చేరుకుంది. అంటే, ఇంకా 19 శాతం మంది తీసుకోలేదు. -
ఉన్నాయి
లోకంలోని డొంక తిరుగుళ్లు చెడ్డ చికాకును తెప్పిస్తాయి అత్యుష్ణకి. ఏదీ నేరుగా ఉండదేం అనుకుంటాడు. చిన్నప్పుడు అతడికి పెద్దవాళ్ల మాటలు అర్థమయ్యేవి కావు. పాయింట్లెస్ అనుకునేవాడు. పాయింట్ ఉండే ఉండొచ్చు. తనకు అర్థం కానప్పుడు.. అది ఎంత పెద్ద పాయింట్ అయినా.. ‘నో పాయింట్ ఇన్ ఇట్’ అత్యుష్ణకి.అత్యుష్ణ ఇప్పుడు పెద్దయ్యాడు కానీ, పెద్దగా ఏం కాలేదు! ఓ పాతిక ఉంటాయంతే. పాతిక అంటే ఓ మోస్తరు పెద్దే. అయితే తను ఆ పాతిక్కంటే ముందే పెద్దవాడయ్యాడని అత్యుష్ణ నమ్మకం. అతడికి ఆ నమ్మకాన్నిచ్చింది కూడా ఈ లోకమే. లోకం మాట్లాడుకునే కొన్ని విషయాల మీద అత్యుష్ణకు అమితమైన ఆసక్తి కలిగేది. వాటి గురించి ఇంకా క్లియర్‌గా చెప్పమని లోకాన్ని అడిగేవాడు. లోకం ఏదో చెప్పేది. ‘ఏదో చెప్పడం కాదు, ఉన్నదేదో కరెక్టుగా’ చెప్పమనేవాడు. లోకం కళ్లు తేలేసేది. అప్పుడే అతడికి అనిపించేది.. లోకం పెద్దదే కానీ, తనకంటే పెద్దదేం కాదని! సంతృప్తికరమైన సమాధానం చెప్పలేనివారు.. గురుబ్రహ్మ అయితేనేం, గురువిష్ణు అయితేనేం, గురుదేవో.. మహేశ్వర అయితేనేం? ముఖ్యంగా మూడు విషయాలు అత్యుష్ణకు ఈ లోకాన్ని చులకన చేసిపడేశాయి. దేవుడు, దెయ్యం, ప్రేమ! దేవుడు.. దేవుడు అనడమే కానీ దేవుణ్ణెక్కడా ఈ లోకం అత్యుష్ణకు చూపించింది లేదు. ‘దేవుణ్ణి ఎవరో వచ్చి చూపించడం ఉండదురా మూర్ఖుడా! ఎవరికి వారు చూసుకోవడం మాత్రమే ఉంటుంది’ అని పూజారి అన్నప్పుడు.. వినడానికి బాగుంది కానీ నమ్మడానికి బాగోలేదు అత్యుష్ణకు. అయితే పూజారి మీద అతడికి నమ్మకం కలిగింది. తనను మూర్ఖుడా అని అంత గట్టిగా అన్నాడంటే.. అతడి దగ్గర తన మూర్ఖత్వానికి తగిన విరుగుడు జ్ఞానమేదో కచ్చితంగా ఉండి ఉంటుంది! ఆయన్ని కొంచెం తవ్వితే అది తనకు దొరకొచ్చు. ‘‘ఎవరికివారు దేవుణ్ణి చూసుకోవడం వరకు అర్థమైంది స్వామీ. సృష్టిలో ఏదైనా ఉందీ అంటే అది అందరికీ ఒకేలా కనిపిస్తున్నదై ఉండాలి కదా అని నా సందేహం’’ అన్నాడు. పూజారి నవ్వుతూ చూశాడు. ‘‘మనుషులంతా ఒకేలా ఉన్నారా అబ్బాయ్.. మనుషులందరికీ దేవుడు ఒకేలా కనిపించడానికి?’’ అన్నాడు. పూజారి మళ్లీ ఇంకోసారి ‘మూర్ఖుడా’ అనకుండా ‘అబ్బాయ్’ అనడం గమనించాడు అత్యుష్ణ. తన పాయింట్లో పూజారికి పాయింట్ కనిపించిందన్నమాట! ఎప్పుడూ దేవుడి దగ్గర ఉండే పూజారే.. ఎవరి దేవుణ్ణి వారే వెతుక్కోవాలి అని చెప్పినప్పుడు అత్యుష్ణకు ఒకటి స్పష్టం అయింది. దేవుడి దగ్గర పూజారి ఉన్నాడు కానీ, పూజారి దగ్గర దేవుడు లేడు! దెయ్యాన్ని కూడా ఈ లోకం అత్యుష్ణకు చూపించలేకపోయింది. ‘‘మేం చూశాం’’ అని చెప్పినవాళ్లను పట్టుకుని అడిగాడు.. ‘‘నిజంగా మీరు చూశారా?’’ అని. ‘‘నిజంగానే మేము చూశాం’’ అన్నారు. ‘‘ దెయ్యం ఎలా ఉంది?’’ అని అడిగాడు. చనిపోయిన.. వాళ్ల పిన్నమ్మలా ఉందనో, సూసైడ్ చేసుకున్న ఫలానా వెంకటలక్ష్మిలా ఉందనో చెప్పారు తప్ప.. దెయ్యం అంటే ఇలా ఉంటుందన్న ఒక పిక్చర్ అయితే రాలేదు అత్యుష్ణకు. ‘దేవుణ్ణి ఎవరో వచ్చి చూపించడం ఉండదురా మూర్ఖుడా! ఎవరికి వారు చూసుకోవడం మాత్రమే ఉంటుంది’ అన్న పూజారి సూత్రాన్ని దెయ్యాలకూ అన్వయించుకుని చూస్తే మాత్రం.. దెయ్యాలు ఉన్నాయనే అనుకోవాలి. అంటే దేవుడు కానీ, దెయ్యం కానీ.. మనిషి అనుకుంటే ఉండడం తప్ప, మనిషి అనుకోకుండా ఉండడం అనేది ఉండదు అని సరిపెట్టుకున్నాడు అత్యుష్ణ. అయితే దేవుణ్ణి, దెయ్యాన్ని వదిలించుకున్నంత తేలిగ్గా ప్రేమను వదిలించుకోలేకపోతున్నాడు అత్యుష్ణ. ఆ ప్రేమ పేరు విరాళి. మెస్‌లో అత్యుష్ణకు భోజనం వడ్డించే అమ్మాయి విరాళి. అందరికీ తనే వడ్డిస్తుంది. అత్యుష్ణకు వడ్డించడానికి మాత్రం ఆమె ఎదురుచూస్తూ ఉంటుంది! ఎప్పుడూ.. మెస్ టైమింగ్స్ అయిపోతున్నప్పుడు మాత్రమే వస్తాడు అత్యుష్ణ. మొదట్లో ఉన్నదేదో వడ్డించేది విరాళి. తర్వాత కొన్నాళ్లకు వడ్డించడం కోసం ఉంచి పెట్టేది! ఒకవేళ ఆ రోజుకి అత్యుష్ణ రాకపోతే.. అదలా ఉండిపోతుందంతే. ఆ విషయం అత్యుష్ణకు చెప్పేది కాదు. చెప్పినా, ‘మీ కోసం ఎదురు చూశాను’ అని చెప్పేదే తప్ప, ‘మీ కోసం తీసిపెట్టాను’ అని మాత్రం చెప్పేది కాదు. విరాళి వడ్డించే అమ్మాయే కానీ, వడ్డించే పనిలోకి వచ్చిన అమ్మాయి కాదు. మెస్వాళ్ల అమ్మాయి. అందుకే అత్యుష్ణకు ఏ టైమ్‌లో వెళ్లినా తినడానికి ఇంత దొరికేది. ఎప్పటిలా ఆ రోజు కూడా తినడానికి ఇంత దొరికింది అత్యుష్ణకు. నిజానికి ఆ రోజు అతడికి ఇంకాస్త ఎక్కువే దొరికింది! ‘‘ఇలాగైతే ఆరోగ్యం పాడైపోతుంది’’ అంది విరాళి మెల్లగా.ఫస్ట్ టైమ్ అత్యుష్ణతో ఆమె అలా అనడం. ఆమె వైపు చూశాడు అత్యుష్ణ. కొత్తగా ఉంది. తలస్నానం చేసిందేమో అనుకున్నాడు. వాళ్లిద్దరే ఉన్నారు అక్కడ.‘‘ఇలాగైతే మీ ఆరోగ్యం పాడైపోతుంది’’.. మళ్లీ అంది విరాళి.. ఈసారి కొంచెం వినిపించేలా. ‘మీ ఆరోగ్యం కూడా’ అందామనుకున్నాడు. అనలేదు.చిన్నమాటను పట్టుకుని ఆడపిల్లలు ఊరికే అల్లేసుకుంటారని అతడి భయం. దేవుడు, దెయ్యం లాగే.. ప్రేమ కూడా ఒక ‘అస్పష్టత’ అతడికి. మనిషి దేవుణ్ణి నమ్మినట్లే, దెయ్యాల్ని నమ్మినట్లే.. విరాళి గానీ, ఇంకొక అమ్మాయి కానీ ప్రేమ అనేది ఈ లోకంలో ఒకటుందని నమ్మడానికి తను కారణం కాకూడదనుకుంటాడు. అత్యుష్ణ రూమ్‌కి చేరుకునేటప్పటికి రాత్రి పన్నెండైంది. ‘‘దేవత వచ్చెళ్లింది. అదిగో నీ కోసమే ఆ టిఫిన్ బాక్స్’’ అన్నాడు రూమ్మేట్.‘దేవత’ అని అతడు అంటున్నది.. రూమ్ కింది పోర్షన్లో ఉండే ఓనర్స్ వాళ్ల అమ్మాయిని. ‘‘దేవతేంటి కొత్తగా?!’’ అన్నాడు అత్యుష్ణ.ఆమెకు అత్యుష్ణ పెట్టిన పేరు దెయ్యం అని. పట్టుకుంటే వదలదని. ‘‘తిండికి వేళ లేని వాళ్లు దెయ్యాలైతే.. ఏ వేళకొచ్చినా వడ్డించేవాళ్లు దేవతలేగా’’ అన్నాడు రూమ్మేట్. బాక్స్‌ని ఓపెన్ చెయ్యలేదు అత్యుష్ణ. పడుకుని నిద్రలోకి జారుకుంటూ ఉండగా.. అతడికో క్లారిటీ వచ్చింది. ఒకే మనిషిలో ఒకరికి దేవత, ఒకరికి దెయ్యం కనిపిస్తుంటే.. దెయ్యాలు, దేవుళ్లు ఉండడమన్నది ఒక పాయింటే కాదని! జీవితాన్ని ప్రేమ తాకందే ఆ పాయింట్ అర్థం కాదనీ!! -మాధవ్ శింగరాజు -
హేమంతి
‘‘ఆ పిల్ల వచ్చెళ్లిందిరా నీ కోసం’’ అంది అమ్మ. ఆ పిల్ల అంటే.. హేమంతి! ‘‘నా కోసం ఎందుకొస్తుంది? పండక్కి వచ్చిందేమో’’ అన్నాను. ‘‘పండక్కే ఊరొచ్చి, నీ కోసం మనింటికి వచ్చింది. బిడ్డని చంకనేసుకొచ్చింది. ముద్దుగా ఉందది’’ చెప్పింది అమ్మ. ‘‘ఏంటటా?’’ అన్నాను. ‘‘వాడు పండక్కి రాలేదా ఆంటీ అని అడిగింది’’. వాడు అంటే నేనే. మా అమ్మ తర్వాత ఈ ప్రపంచంలో నన్ను ‘రేయ్’ అని ఒక్క హేమంతే అంటుంది. నాన్న కూడా నన్ను రేయ్ అనరు. ‘బాబూ’ అనేది ఆయన పిలుపు. ‘‘అయినా నువ్వేంట్రా, ఎవరైనా పండక్కి వస్తారు. పండక్కని చెప్పి నువ్వు పండక్కి ముందో, పండగ తర్వాతో వచ్చెళతావు. తను వచ్చినప్పుడు నువ్వు ఉండుంటే బాగుండేది కదా!’’ అంది అమ్మ.\ ‘‘ఊ’’ అన్నాను. ‘‘వాడి ఫోన్ నెంబరు ఇవ్వనా అమ్మా అంటే, ‘వద్దాంటీ’ అని.. ‘ఇదిగో ఈ కవరు వాడికివ్వండి’ అని చెప్పి వెళ్లింది’’ అంది అమ్మ. కవర్ తీసుకున్నాను. అంటించి ఉంది. లోపల అసలు ఏమైనా ఉందా లేదా అన్నంత పలుచగా ఉంది కవరు. మూడేళ్లయింది హేమంతిని చూసి! హేమంతి పేరు హేమంతి కాదు. అది నేను పెట్టుకున్న పేరు. ఆ సంగతి హేమంతికి కూడా తెలీదు. టెన్త్‌లో నా క్లాస్మేట్ హేమంతి. ఏదో ఊర్నుంచి ట్రాన్స్ఫర్ అయి వచ్చారు. రోజూ మా ఇంటికి వచ్చేది. ఇంటి ముందు సన్నజాజి పందిరి కింద నిలబడి మాట్లాడుకునేవాళ్లం. ‘ఆడపిల్లల్తో మాటలేంట్రా?’ అంది అమ్మ ఓ రోజు, హేమంతితో మాట్లాడి ఇంట్లోకి రాగానే. ‘అదేంటమ్మా..’ అన్నాను. అమ్మేం మాట్లాడలేదు. ఇంటర్లో కూడా హేమంతి, నేను కలిసే చదువుకున్నాం. అప్పుడు పెట్టుకున్నదే హేమంతికి నేను ఆ పేరు. ఆ సంగతి తనకి చెప్పలేదు. అది నా సొంత విషయం అనుకున్నాను. హేమంతి బాగుంటుందని కాలేజ్‌లో అందరూ అనేవారు. అమ్మ కూడా అంటుండేది.. ‘చక్కటి పిల్లరా’ అని. ఎందుకనో అమ్మాయిలందరూ నాకు చక్కగానే కనిపించేవారు. హేమంతి.. ఇంకాస్త చక్కటి అమ్మాయి కావచ్చు. అయితే చక్కగా ఉంటుందని తనకు నేను హేమంతి అనే పేరు పెట్టుకోలేదు. హేమంతాన్ని, చామంతిని కలిపేసి.. హేమంతి అనే పదాన్ని క్రియేట్ చేశాను. ఆ క్రియేషన్ నాకు చాలా నచ్చింది. తనకి పెట్టుకోవాలనిపించింది. పెట్టుకున్నాను. ఇంటర్లోకి వచ్చాక కూడా అమ్మ నాకు చెబుతుండేది.. ‘ఆడపిల్లల్తో ఎక్కువగా మాట్లాడకు’ అని! చిన్నప్పుడు నాన్న నన్ను కొట్టి, నేను ఏడుస్తూ ఉంటే దగ్గరకు తీసుకుని ‘అబ్బెబ్బే.. మగపిల్లలు ఎక్కడైనా ఏడుస్తారా?’ అని కళ్లు తుడిచేవారు. ఎందుకు ఏడవకూడదు? నాన్న నన్ను కొట్టడం తప్పు కానప్పుడు, నేను ఏడ్వడం తప్పెలా అవుతుంది? చాలాసేపు ఆలోచించేవాడిని. తర్వాత నాన్నే కరెక్ట్ అని తెలిసింది. సినిమాల్లో హీరో, విలన్ ఒకర్నొకరు కొట్టుకుంటూ ఉంటారు. హీరో ఏడ్వడు, విలనూ ఏడ్వడు. మగాళ్లు ఏడ్వరనీ, ఏడ్వకూడదనీ అలా నా మనసులో పడిపోయింది. ఆడపిల్లల్తో ఎక్కువ మాట్లాడకూడదని ఎప్పుడూ అమ్మ చెబుతుండే మాట కూడా అలాగే నా మనసులో పడిపోయింది. తర్వాత్తర్వాత.. అమ్మ అలా చెప్పడానికి నేనొక కారణాన్ని కనిపెట్టాను. నేను బాగుండను! బాగుండను అంటే.. అమ్మాయిలకు నచ్చేంత బాగుండను. ఆ సంగతి నాకు తెలుసు. నేనెవరినైనా ఇష్టపడి, వాళ్లు కాదంటే మనసు నొచ్చుకుంటానని, ముందు జాగ్రత్తగా అమ్మ అలా చెప్పేదేమో! హేమంతికి నేను పేరు పెట్టుకున్నానే కానీ, హేమంతిపై ఆశలు పెట్టుకోలేదు. హేమంతికి కాలేజ్ నిండా ఫ్రెండ్సే. ఇంటి దగ్గర మాత్రమే తనకి నాతో మాట్లాడే టైమ్ దొరుకుతుంది. హేమంతికి, నాకు కామన్ ఫ్రెండ్ ఒకడున్నాడు. హేమంతిని వాడు భలే నవ్వించేవాడు. పొట్ట చేత్తో పట్టుకుని మరీ నవ్వుతుంది హేమంతి. అలా నవ్వుతున్నప్పుడు హేమంతి ఇంకా బాగుండేది. వాడికి బైక్ ఉంది. ఆ బైక్ మీద ఎప్పుడైనా ఇద్దరూ కలిసి కనిపించేవారు. ఓరోజు నన్నూ ఎక్కమన్నాడు వాడు. ‘ముగ్గురమా!’ అన్నాను. ‘ఎక్కరా పర్లేదు’ అన్నాడు. అప్పటికే వాడి వెనుక హేమంతి కూర్చొని ఉంది. హేమంతి వెనుక నేను కూర్చోబోయాను. ‘ఫట్’మని నా చెంప మీద కొట్టాడు వాడు. ‘ఆడపిల్లని మధ్యలో కూర్చోబెట్టుకుంటార్రా ఎవరైనా?’ అన్నాడు! ‘లేదూ.. నీ ఫ్రెండ్ కదా. నీ వెనకే ఉంటే బాగుంటుందనీ..’ అన్నాను. ఈసారి ‘ఫట్’మని హేమంతి నా చెంప మీద కొట్టింది. వాడి కన్నా గట్టిగా కొట్టింది. ‘ఎవరికిరా బాగుండేది? నీకా’ అని మళ్లీ కొట్టింది. ‘నేను రాను. మీరు వెళ్లండి’ అన్నాను. అదే కాలేజ్‌లో మా డిగ్రీ. థర్డ్ ఇయర్లో ఉండగా.. రోజూ వచ్చినట్లే.. మా ఇంటికొచ్చింది హేమంతి. ఎప్పటిలా సన్నజాజి పందిరి కింద నిలబడి మాట్లాడుకుంటున్నాం. హేమంతి డల్‌గా ఉంది. ‘నాన్న ఒప్పుకోవడం లేదు. మంచి సంబంధం అంటున్నారు’ అంది. ‘చేసుకోవచ్చు కదా’ అన్నాను. ‘నీకేం అనిపించడం లేదా?’ అంది హేమంతి. ‘పెళ్లి తర్వాత కూడా చదువుకోవచ్చు అన్నారు కదా. ఇంకేంటి?’ అన్నాను. హేమంతి వెళ్లిపోయింది. ‘పెళ్లి ఖాయం అయ్యేలా ఉంది. వెళ్లిపోతాం ఇక్కణ్నుంచి’ అంది హేమంతి మళ్లీ ఒకరోజు వచ్చి. ‘అవునా?’ అన్నాను. ‘నీకేం అనిపించడం లేదా?’ అంది. ‘ఏంటి అనిపించడం?’ అన్నాను. హేమంతి మాట్లాడలేదు అదే చివరిసారి నేను హేమంతిని చూడడం. ఇంట్లోకొచ్చి ఎందుకనో అద్దం చూసుకున్నాను. కళ్లు మామూలుగానే ఉన్నాయి. కళ్లల్లో నీళ్లు లేవంటే మనిషి ఏడ్వడం లేదనేనా?! గదిలోకి వెళ్లాక, అమ్మకు హేమంతి ఇచ్చి వెళ్లిన కవరు తెరిచి చూశాను. లోపల చిన్న కాగితం ఉంది. అందులో రెండే వాక్యాలు. ‘కోరికలు తీరకుండా చనిపోతే దెయ్యాలవుతారని అంటారు. మనసులో ప్రేమను పెట్టుకుని తిరిగే మనుషులకు ఏ పేరు పెడితే బాగుంటుందో ఆలోచించు. చక్కటి పేర్లు పెట్టగలవు కదా!’ – హేమంతి -
వెనకే ఉంది
దేవుణ్ణి నమ్మేవారికి దేవుడు కనిపించినట్లుగా, దెయ్యాలను నమ్మనివాళ్లకు దెయ్యాలు కనిపించకుండా ఉండవు. ‘‘...అండ్, మీట్ మిస్టర్ దీపక్ మిశ్రా.. దెయ్యాల స్పెషలిస్ట్!’’‘హోటల్ చోళా ఇంటర్నేషనల్’ కాన్ఫరెన్స్ హాలు బయట లాంజ్‌లో రాత్రి బాగా పొద్దుపోయాక జరిగింది ఈ పరిచయం. దీపక్ మిశ్రాను భగవాన్‌కి పరిచయం చెయ్యడానికి ముందు, భగవాన్ని దీపక్ మిశ్రాకు పరిచయం చేశాడు దేవన్.. ‘‘హి ఈజ్ మిస్టర్ భగవాన్, హెడ్ ఆఫ్.. ‘నో గాడ్, నో ఘోస్ట్.’’ దేవన్ జర్నలిస్ట్. చెన్నైలోని ఒక ఆంగ్ల దినపత్రికలో సీనియర్ రిపోర్టర్. చోళా ఇంటర్నేషనల్‌లో దెయ్యాలపై ఆ మర్నాటి నుండి మూడు రోజులపాటు డీప్ డిబేట్ జరగబోతోంది. మిశ్రాది ఢిల్లీ. డిబేట్ కోసం చెన్నై వచ్చి చోళా ఇంటర్నేషనల్‌లో దిగాడు. భగవాన్‌ది హైదరాబాద్. డిబేట్లో మిశ్రాను డీ కొనడం కోసం చెన్నై వచ్చి అదే హోటల్లో తనకు కేటాయించిన గదికి చేరుకున్నాడు. ‘చోళా’తో దేవన్‌కి మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రముఖులెవరు వచ్చినా, వెంటనే దేవన్‌కు ఫోన్ వెళుతుంది. ‘‘వెల్, మిస్టర్ భగవాన్.. మీరు నో గాడ్.. నో ఘోస్ట్ అంటున్నారు. నుదుటిపై పెద్ద బొట్టుతో కనిపిస్తున్నారు?!’’.. అడిగాడు మిశ్రా. భగవాన్ పెద్దగా నవ్వాడు. ‘‘అది దేవుడికీ, దెయ్యానికీ సంబంధం లేని బొట్టు. నా కూతురు తనకేమీ తోచకపోతే, ఒక్కోసారి నాకు జడేసి, రబ్బరు బ్యాండు పెడుతుంది. అలాగే వచ్చేస్తాను బయటికి. ఇవాళ పెద్ద బొట్టు పెట్టింది’’.. చెప్పాడు భగవాన్. ‘‘మరి భగవాన్ అనే పేరేమిటి?’’‘‘దేవుడిని నమ్మనివాళ్లకు భగవాన్ అనీ, దెయ్యాల్ని నమ్మేవాళ్లకు దీపక్ అని.. పేరు ఉండకూడదనేముందీ?’’అలా.. కొంత టాపిక్ నడిచాక.. ‘రేపు డిబేట్లోకలుద్దాం’ అని చెప్పి, దేవన్ వెళ్లిపోయాడు. దీపక్, భగవాన్ మిగిలారు.‘‘సో.. రేపు మీరు దెయ్యాలు లేవని నాతో వాదించబోతున్నారు..’’ నవ్వాడు దీపక్. ‘‘లేవని వాదించబోవడం లేదు మిస్టర్ మిశ్రా. ఉంటే చూపించండని వాదించబోతున్నాను’’ అన్నాడు భగవాన్ తనూ నవ్వుతూ. ‘‘ఇప్పుడు చూపిస్తాను, మీకేమైనా అభ్యంతరమా?’’ అన్నాడు మిశ్రా సడన్‌గా. దెయ్యాల్ని నమ్మేవాళ్లకు, దెయ్యాలున్నాయని వాదించేవాళ్లకు భగవాన్ విలువ ఇవ్వడు. ఇవ్వకపోగా, ఒక్కోసారి తేలిగ్గా తీసిపారేస్తాడు. ఇప్పుడు మిశ్రానీ అలాగే తీసిపారేశాడు. ‘‘చూపించనక్కర్లేదు. మిమ్మల్ని చూస్తున్నాను కదా’’ అన్నాడు! మిశ్రా హర్ట్ కాలేదు. ‘దేవుణ్ణి నమ్మేవారికి దేవుడు కనిపించినట్లుగా, దెయ్యాలను నమ్మనివాళ్లకు దెయ్యాలు కనిపించకుండా ఉండవు మిస్టర్ భగవాన్’’ అందామనుకున్నాడు కానీ, భగవాన్.. దేవుడిని కూడా నమ్మడు. అందుకే దేవుడి ప్రస్తావన లేకుండా.. ‘‘దెయ్యాలు.. మనుషులకు కావలసినప్పుడు కనిపించవు. దెయ్యాలకు మనుషులు కావలసినప్పుడు కనిపిస్తాయి’’ అని మాత్రమే అన్నాడు. ‘‘మరి ఇందాక చూపిస్తానన్నారు!’’ అడిగాడు భగవాన్. ‘‘అవునవును. కానీ మీరు నాలో దెయ్యాన్ని చూశాక, నేను చూపించే దెయ్యంలో మీకేం ఇంట్రెస్టు ఉంటుంది చెప్పండి?’’‘‘అవుననుకోండి, మనుషులకు కావలసినప్పుడు దెయ్యాలు కనిపించవని అన్నారు కదా, దాంతో నాకు ఇంట్రెస్టు పెరిగింది. మీరెలా చూపిస్తారో చూద్దామని’’ అన్నాడు భగవాన్. ‘‘చూడదలచుకున్నారా.. చెప్పండి’’ అడిగాడు మిశ్రా. ‘‘చూశాక, అది దెయ్యం కాదంటే, మీరు ఒప్పుకుంటారా? ’’ అన్నాడు భగవాన్. ‘‘దెయ్యం అవునో కాదో మీ మనసుకు తెలిసినప్పుడు నా ఒప్పుకోలుతో ఇక పనేముంటుంది?’’‘‘మీరు దెయ్యం అని నాకు చూపించిన దాన్ని, నేను దెయ్యం కాదు అంటే మీరు ఒప్పుకోవాలి కదా!’’‘‘అదే అంటున్నా.. మిస్టర్ భగవాన్. దెయ్యాన్ని చూపించడం వరకే నా పని. అది దెయ్యమా కాదా అన్నది మీ మనసుకు అనిపించినదాన్ని బట్టి ఉంటుంది.’’‘‘అలాంటప్పుడు అది దెయ్యం ఎలా అవుతుంది మిస్టర్ మిశ్రా. మీరు దెయ్యాన్ని చూపించినప్పుడు, ఆ దెయ్యాన్ని నేను కూడా చూడగలిగితేనే కదా అది దెయ్యం అవుతుంది.’’ ‘‘రైట్. మిస్టర్ భగవాన్. మీ వెనుక నేనిపుడు దెయ్యాన్ని చూస్తున్నాను. ఈ క్షణంలో చూస్తున్నాను. ఆ దెయ్యాన్ని మీరు చూడాలని అనుకుంటున్నారా?’’‘‘అనుకోవడం లేదు. ఎందుకంటే నా వెనుక ఏ దెయ్యమూ ఉండదని, ఏ దేవుడూ ఉండడని నాకు తెలుసు’’.‘‘ఒకే దెన్. మీరు మీ మాట మీద నిలబడగలరా?’’ అడిగాడు మిశ్రా. ‘‘ఎస్’’ అన్నాడు భగవాన్.‘‘అయితే ఈ క్షణంలో మీరు.. మీరొక్కరే వాష్‌రూమ్‌లోకి వెళ్లిరాగలరా?’’‘‘వెళ్లి?’’‘‘అద్దంలో మీ ముఖం చూసుకుని రండి.’’ ‘‘చూసుకుంటే?!’’ ‘‘మీ వెనుక.. ఎవరున్నారో మీకు కనిపిస్తుంది.’’‘‘కనిపించకపోతే?’’‘‘కనిపించకపోతే.. నా దగ్గరికి వచ్చి చెప్పండి’’ అన్నాడు మిశ్రా. భగవాన్ లేచి, వాష్‌రూమ్‌లోకి వెళ్లాడు. తిరిగొచ్చి చూస్తే.. అక్కడ మిశ్రా లేడు!లాంజ్‌లో లైట్స్ ఆఫ్ అయి ఉన్నాయి. డిమ్ లైట్లో.. ‘‘మిస్టర్ మిశ్రా.. మిస్టర్ మిశ్రా’’ అని వెతుక్కుంటున్నాడు భగవాన్. ‘‘రాత్రి ఏమైపోయారు.. అకస్మాత్తుగా’’.. డిబేట్ హాల్లో గుసగుసగా అడిగాడు భగవాన్. ‘‘నిద్రొచ్చి వెళ్లిపోయాను. దెయ్యం కనిపించిందా?’’ ‘‘అది చెప్దామనే వచ్చాను. మీరు కనిపించలేదు’’ చెప్పాడు భగవాన్. ‘‘నేను కనిపించలేదు సరే, దెయ్యం కనిపించిందా?’’ అడిగాడు మిశ్రా. ‘‘కనిపించలేదు’’ చెప్పాడు భగవాన్. ‘‘నమ్మను. మీరు అద్దంలో చూసుకోకుండానే వచ్చేసి ఉంటారు’’ అన్నాడు మిశ్రా. ‘‘చూశాను. కనిపించలేదు’’.. అబద్ధం చెప్పాడు భగవాన్. ‘‘ఏం కనిపించలేదు?’’‘‘దెయ్యం’’మిశ్రా నవ్వుకున్నాడు. డిబేట్ హాల్లో భగవాన్ వెనుక మిశ్రాకు స్పష్టంగా దెయ్యం కనిపిస్తోంది. భయం అనే దెయ్యం! భయం ఉందంటే దెయ్యం ఉందనే. లేనిది మాత్రం..వాష్‌రూమ్‌లో అద్దం. - మాధవ్ శింగరాజు -
ట్రూత్ బంగళా
పాడుబడిన బంగళాలు దెయ్యాలకు సౌకర్యంగా ఉంటాయి. ఓనర్ అనేవాడు ఉండడు. అది మొదటి సౌకర్యం. రోజూ ఉదయాన్నే లేచి, గదులన్నీ శుభ్రం చేసే పని ఉండదు. అది రెండో సౌకర్యం. బెడ్రూమ్లోనే పడుకోవాలనేం లేదు. ఇంట్లోని దూలాలకు ఎక్కడబడితే అక్కడ, ఎలాబడితే అలా వేలాడుతూ నిద్రపోవచ్చు. ఇది మూడో సౌకర్యం. ఇలాంటి లైఫ్ మనుషులకు చాలా అరుదుగా మాత్రమే దొరుకుతుంది. బాగా డబ్బున్న ఎన్నారైలు ఎవరైనా çఫర్నీచర్‌తో పాటు బంగళాను అద్దెకు ఇచ్చేసి, ఏళ్ల తరబడి ఇండియా రాకుండా ఎక్కడో ఉండిపోతే.. ఇక్కడ ఆ బంగళాలో అద్దెకున్నవారి జీవితం.. పాడుబడిన బంగళాలో దెయ్యాలకు ఉన్నంత సౌకర్యంగా ఉంటుంది. అయితే.. కొన్నిసార్లు సౌకర్యం కూడా విసుగు పుట్టిస్తుంది.. మనుషులకైనా, దెయ్యాలకైనా! ‘‘లోపల ఉండీ ఉండీ విసుగేస్తోంది. అలా బయటికి వెళ్లొద్దామా?’’‘‘నాకూ అదే అనిపిస్తోంది. షిట్.. మనదీ ఒక లైఫేనా?’’‘‘నోర్ముయ్.. జీవితాన్ని తిట్టకు. నువ్వు సరిగా జీవించలేకపోతే.. నువ్వు షిట్వి అవుతావు కానీ, జీవితం షిట్ అవుతుందా?’’మూడో దెయ్యం మౌనంగా ఉంది. ఊరికి దూరంగా ఉన్న ఆ పాడుబడిన బంగళాలో ఏళ్లుగా ఆ మూడు దెయ్యాలు ఉంటున్నాయి. ఒకప్పుడు ఆ బంగళా ఊరికి మధ్యలో ఉండేది. లోపల్నుంచి ఏవో అరుపులు, ఏడుపులు వినిపిస్తున్నాయని ఎవరో అనడంతో.. ఊరే బంగళాకు దూరంగా ఉంటోంది. అప్పుడొచ్చి చేరాయి ఎక్కణ్ణుంచో ఈ మూడు దెయ్యాలు. అయితే మొదటి దెయ్యం రెండో దెయ్యాన్ని అంత తేలిగ్గా బంగళాలోకి రానివ్వలేదు. ‘నువ్వెవరు? నీ బయోగ్రఫీ ఏంటి?’ అని అడిగింది. చిన్న గొడవ తర్వాత మాత్రమే అవి రెండూ కలిసిపోయాయి. మూడో దెయ్యం వాటి మధ్యకు వచ్చినప్పుడు ఇంత గొడవ జరగలేదు. ‘మీరు ఉండనిస్తే ఉంటాను. వెళ్లిపొమ్మంటే వెళ్లిపోతాను. ఈ బంగళా కాకపోతే మరొక బంగళా. ఈ ఊరు కాకపోతే మరొక ఊరు’ అంది మూడో దెయ్యం. దాని ఫిలాసఫీ ఆశ్చర్యంగా అనిపించింది ముందొచ్చిన ఆ రెండు దెయ్యాలకు.‘సరే.. రా. మాతోనే ఉండిపో’ అన్నాయి. ‘‘ఏంటి.. నువ్వేమీ మాట్లాడవు? అది షిట్ అనడం కరెక్టేనా.. లైఫ్‌ని?!’’.. సీనియర్ దెయ్యం అడిగింది మూడో దెయ్యాన్ని.మూడో దెయ్యం తాత్వికంగా నవ్వింది. ‘‘మనుషులకు ఎంత దూరంగా ఉన్నా మనిషి భాష వచ్చేస్తోంది మనకు. నువ్వూ ఒకట్రెండుసార్లు.. ‘గాడ్’ అనడం విన్నాను నేను. పాపం దాని తప్పేముంది. షిట్ అని ఎక్కడో విన్నట్లుంది. మనుషులు ఈ మధ్య షిట్కు వెళ్లడం కన్నా, ‘షిట్’ అనడం ఎక్కువైపోయింది’’ అంది.. రెండో దెయ్యాన్ని సమర్థిస్తూ. సీనియర్ దెయ్యం వదల్లేదు. ‘‘నా కంప్లెంట్ అది కాదు. మన లైఫ్ మరీ ‘షిట్’ అనుకునేంత దరిద్రంగా ఏం లేదుకదా. అలాంటప్పుడు షిట్ అనడం ఎందుకూ..’’ అంది. ‘‘విసుగునే అది ‘షిట్’ అని ఉంటుంది. విసుగులోనే నువ్వు అప్పుడప్పుడు ‘గాడ్’ అంటావు. మీరిద్దరూ అంటున్నది లైఫ్‌ని కాదు. లైఫ్‌లోని ఒక విసుగును’’ అంది తాత్విక దెయ్యం. ‘‘సరేసరే.. మాటల్తోనే తెల్లారేటట్లుంది. అలా బయటికి వెళ్లొద్దాం’’ అంది రెండో దెయ్యం. కిటికీలోంచి బయటికి చూసింది తాత్విక దెయ్యం. దూరంగా పెద్ద మంట కనిపిస్తోంది. ‘‘అక్కడేదో మంట ఉన్నట్లుంది’’ అంది. ‘‘ఏం మంట? చితి మంటా? కొత్తగా ఏముంటుందీ’’ అంది సీనియర్ దెయ్యం.‘‘చితి మంట కాదు. చలి మంటలా ఉంది. కాసేపు అక్కడ కూచొని వచ్చేద్దాం. మంచులో ఎక్కువసేపు బయట తిరగడం కూడా మంచిది కాదు’’ అంది తాత్విక దెయ్యం. మూడు దెయ్యాలూ గాల్లో పైకి లేచాయి. అవి అలా లేస్తుంటే.. బంగళా బయట అలవాటుగా తిరుగుతుండే కుక్క ఒకటి మోరెత్తి వాటి వంక చూసింది. దెయ్యాలు మంట చుట్టూ కూర్చున్నాయి. కొంత సమయం గడిచింది. దూరాన్నుంచి ఎవరో మనిషి వస్తూ కనిపించాడు. ‘‘మన వైపే వస్తున్నాడు’’ అంది రెండో దెయ్యం. ‘‘రానివ్వు. మనకేంటి. వాడికెంతుంటుందో మనకూ అంతుంటుంది’’ అంది సీనియర్ దెయ్యం. ఆ మనిషి సరాసరి చలిమంట దగ్గరికి వచ్చి నిలుచున్నాడు. అతడి చేతుల్లో ఎండు పుల్లలు ఉన్నాయి. ‘‘ఎవరు మీరు.. ఎప్పుడొచ్చారు? ఇంతక్రితం కనిపించలేదే’’ అన్నాడు అనుమానంగా. సీనియర్ దెయ్యం, రెండో దెయ్యం నవ్వాయి. ‘‘ఓ.. నువ్వు వేసుకుని వెళ్లిన చలిమంటేనా ఇది! రా.. వచ్చి కూర్చో. భయపడకు మేమేం దెయ్యాలం కాదులే’’ అంది రెండో దెయ్యం. ఆ ఎండుపుల్లల మనిషికి భయం వేసింది. అక్కడున్నది దెయ్యాలు కాదంటే అతడికి నమ్మబుద్ధి కావడం లేదు. ‘‘మరి నువ్వేమిటి? మాలాగే మనిషివేనా? దెయ్యానివా?’’ అని అడిగింది సీనియర్ దెయ్యం. ఎండుపుల్లల మనిషి ఆలోచనలో పడ్డాడు. ఎందుకో అవి దెయ్యాలేనని అతడి మనసుకు గట్టిగా అనిపిస్తోంది. ఇప్పుడు తను ‘మనిషి’ అని తెలిస్తే అవి తనను పీక్కుతినడం ఖాయం. అందుకే తను మనిషి కాదు, దెయ్యం అని చెప్పదలచుకున్నాడు. అలా చెప్తే.. దెయ్యాలు దెయ్యాలకు హాని చెయ్యవు కాబట్టి బతికిపోతాడు. ఒకవేళ అక్కడున్నది మనుషులైతే తను దెయ్యం కాబట్టి అక్కడి నుంచి వాళ్లు పారిపోతారు. ‘‘ఏంటి ఆలోచిస్తున్నావ్.. నువ్వు మనిషివా, దెయ్యానివా చెప్పూ..’’ అని అడిగింది సీనియర్ దెయ్యం. ‘‘దెయ్యాన్ని’’ అని చెప్పాడు ఎండుపుల్లల మనిషి. తాత్విక దెయ్యం స్పందించలేదు. ఎప్పటిలా తాత్వికంగా ఉండిపోయింది. ఎండుపుల్లలన్నీ అయిపోయాక మంట చల్లారిపోయింది. ‘ఇక వెళ్దాం’ అని పైకి లేచాయి దెయ్యాలన్నీ. అవి బంగళా దగ్గరకు గాలిలో ఎగురుకుంటూ రాగానే.. బంగళా దగ్గరి కుక్క మోర పైకెత్తి సాలోచనగా చూసింది.. ఈ నాలుగో దెయ్యం ఎక్కడిదబ్బా అన్నట్టు! ‘‘అబద్ధం చెబితే మాత్రం! మనమెవరం శిక్షించడానికి? నువ్వు చెప్పలేదా అబద్ధం.. ‘మేము దెయ్యాలం కాదు, మనుషులం’ అని’’ అంటోంది తాత్విక దెయ్యం బంగళా లోపలికి నడుస్తూ. ‘‘నేను నిజం చెప్పించడానికి అబద్ధం చెప్పాను. వాడు నిజం దాచడానికి అబద్ధం చెప్పాడు. తేడా లేదా’’ అంది సీనియర్ దెయ్యం విసుగ్గా. ఆ తెల్లవారుజామును అటుగా వెళుతున్నవాళ్లెవరో ఆ బంగళాలోంచి అరుపులు, ఏడుపులు విన్నారు. - మాధవ్ శింగరాజు -
అమ్మో దెయ్యం
-
సినిమా థియేటర్లో దెయ్యం?
బెంగళూరు : విచిత్ర శబ్ధాలు, వింత ఆకారాల సంచారంతో దెయ్యం తిరుగుతోందనే వదంతి నగరవాసులను భీతిల్లేల చేసింది. నగరంలోని రామసముద్రం రోడ్డులోని బండ కాలనీలో సంగం థియేటర్ ఉంది. చాలా కాలంగా మూత పడిన ఈ థియేటర్ నుంచి విచిత్రమైన శబ్ధాలు వస్తున్నాయని, వింత ఆకారాలు ఆ చుట్టు పక్కల సంచరిస్తున్నాయని ఆ విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో సోమవారం రాత్రి వందల సంఖ్యలో గ్రామస్తులు థియేటర్ వద్ద గుమికూడారు. దెయ్యం ఎలా తిరుగుతోంది..ఎప్పుడు బయటకు వస్తోందని పరస్పరం ఆరా తీయడం కనిపించింది. విషయం తెలుసుకున్న టౌన్ ఎస్ఐ భైరా అక్కడకు చేరుకొని ప్రజలతో మాట్లాడారు. ఇది కేవలం వదంతి మాత్రమేనని, ఎవరూ నమ్మవద్దరిని చెబుతూ అక్కడినుంచి అందరినీ పంపించి వేశారు. -
థియేటర్లో దెయ్యం!
బెంగళూరు(కర్ణాటక): విచిత్ర శబ్ధాలు, వింత ఆకారాల సంచారం, దెయ్యం తిరుగుతోందనే వదంతులు అక్కడి వారిని తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. కోలార్ జిల్లా ముళబాగిలు పట్టణంలోని సంగం థియేటర్ కొంతకాలంగా మూతబడి ఉంటోంది. అయితే, గత కొంతకాలంగా ఈ థియేటర్ నుంచి విచిత్రమైన శబ్ధాలు వస్తున్నాయని, దెయ్యం మాదిరి ఆకారాలు ఆ చుట్టుపక్కల సంచరిస్తున్నాయని స్థానికంగా వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి వందల సంఖ్యలో గ్రామస్తులు ఆ నిర్మాణం వద్ద గుమికూడారు. దెయ్యం ఎలా తిరుగుతోంది..ఎప్పుడు బయటకు వస్తోందంటూ ఆరా తీశారు. విషయం తెలుసుకున్న టౌన్ ఎస్ఐ భైరా అక్కడకు చేరుకొని ప్రజలతో మాట్లాడారు. ఇది కేవలం వదంతి మాత్రమేనని, దెయ్యం సంచారం అనేది వట్టి పచారమేనని ఎవరూ నమ్మవద్దని చెప్పి అందరినీ అక్కడి నుంచి పంపించి వేశారు. -
దెయ్యాలతో దోస్తీ
దెయ్యం అంటే ఎవరైనా ఆమడ దూరం పారిపోతారు. కానీ, వీళ్లు వేరే టైప్. దెయ్యాలతో దోస్తీ చేస్తారు. బ్రేక్ డ్యాన్సులు కూడా చేస్తారు. అప్పటివరకూ ఎంచక్కా ఆడిపాడిన దెయ్యాలు సడన్‌గా యూ టర్న్ తీసుకుని ఎటాక్ చేస్తే ఎలా ఉంటుందన్న అంశాలతో రూపొందుతున్న హర్రర్ చిత్రం‘రా..రా’. శ్రీకాంత్, నాజియా జంటగా శ్రీమిత్ర చౌదరి సమర్పణలో విజయ్ నిర్మించారు. విజి చరిష్ దర్శకుడు. రాక్ రాక్ షకీల్ సంగీత దర్శకుడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జూన్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘నేను తొలిసారి చేస్తున్న కామెడీ హర్రర్ థ్రిల్లర్ చిత్రమిది. మనుషులకు, దెయ్యాలకు మధ్య సాగే సరదా ఆటలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతాయి’’ అన్నారు. ‘‘మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన ఈ చిత్రం మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఓ టాప్ హీరోతో టీజర్ రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత విజయ్. -
ఆక్వా ప్రకంపన
నరసాపురం/మొగల్తూరు : మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్‌లో పుట్టుకొచ్చిన కాలుష్య భూతం ఐదుగురు యువకుల్ని పొట్టనపెట్టుకుని ఆ కుటుంబాల్లో విషాదం నింపింది. మరోవైపు ఈ అంశం అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టించింది. ఇదిలావుంటే.. ఐదుగురి మరణానికి విషవాయువులు కారణం కాదని.. విద్యుదాఘాతం వల్ల ప్రమాదం జరిగిందని నమ్మించే డ్రామాకు ఆనంద గ్రూపు సంస్థల యాజమాన్యం తెరలేపింది. ఇందుకోసం దళారులను రంగంలోకి దింపింది. మరోవైపు చిన్నపాటి ప్లాంట్ నుంచి వెలువడిన కాలుష్యమే ఏకంగా ఐదుగుర్ని పొట్టన పెట్టుకుంటే.. తుందుర్రులో నిర్మించే ఆక్వా పార్క్ వల్ల తలెత్తే ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంటుందో గుర్తించాలని.. తక్షణమే ఆక్వా పార్క్‌ను సముద్ర తీరానికి తరలించాలనే డిమాండ్‌తో ఉద్యమాలు ఊపందుకున్నాయి. తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల్లో యుద్ధవాతావరణం నెలకొంది. ఇంకోవైపు మొగల్తూరు ఘటనలో మృతిచెందిన వారి ఇళ్లకు ఎవరినీ రానివ్వకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు. కుటుంబాలకు ఆసరాగా నిలిచిన ఐదుగురు యువకుల్ని మొగల్తూరు నల్లంవారి తోటలోని ఆనంద ఆక్వా ప్లాంట్ పొట్టన పెట్టుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపగా.. అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టించింది. గురువారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఈగ ఏడుకొండలు (22), తోట శ్రీనివాస్ (30), నల్లం ఏడుకొండలు (22), జక్కంశెట్టి ప్రవీణ్ (23), బొడ్డు రాంబాబు (22) ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. గురువారం రాత్రి వీరి మృతదేహాలకు నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్‌మార్టం జరిపించి హుటాహుటిన గ్రామాలకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యులపై పోలీసులు ఒత్తిడి తెచ్చిమరీ రాత్రికి రాత్రే అంత్యక్రియలు జరిపించారు. మృతుల ఇళ్ల ఇళ్లవద్ద బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఆ ఇళ్ల వద్ద శుక్రవారం హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. సీతారామపురం గ్రామానికి చెందిన ఈగ ఏడుకొండలు, మొగల్తూరు మండలం పోతులవారి మెరకకు చెందిన తోట శ్రీనివాస్‌లకు చంటిబిడ్డలు ఉన్నారు. బొడ్డు రాంబాబు (మెట్టిరేవు), నల్లం ఏడుకొండలు (నల్లంవారి తోట), జక్కంశెట్టి ప్రవీణ్ (కాళీపట్నం)లకు వివాహాలు కాలేదు. తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్ల బాధ్యతలు మొత్తం వీరే చూస్తున్నారు. మృతులు ఐదుగురూ తమ కుటుంబాలను వారి భుజాలపై మోస్తున్నవారే. మృతుల కుటుం బాల్లో ఏ ఇంటికి వెళ్లినా వారి రోదనలు, ఆవేదనల్ని చూసి ప్రతి ఒక్కరి హృదయం చలించిపోయింది. అన్నెంపున్నెం ఎరుగుని వీరంతా.. స్వార్థం కోసం, సంపాదన కోసం పెద్దలు చేసిన ద్రోహానికి బలైపోయారని గ్రామస్తులు నిట్టూరుస్తున్నారు. ఇంటింటా ఇదే చర్చ సముద్రం.. గోదావరి.. పచ్చని పొలాల మధ్య ప్రశాంతంగా ఉండే ఆ గ్రామాల్లోని వాతావరణాన్ని ఆనంద ఆక్వా ప్లాంట్ నిర్లక్ష్యం పూర్తిగా మార్చేసింది. ఐదుగురు యువకుల మృతితో మొగల్తూరు మండలంలో భయానక వాతావరణం నెలకొంది. కొన్ని ఇళ్లలో పొయ్యి కూడా వెలిగించుకోలేదు. అందరిలో ఒకటే భయం, ఆందోళన కనిపిస్తున్నాయి. విషవాయువు రావడం ఏమిటి, మనుషులు చనిపోవడం ఏమిటనే చర్చ నడుస్తోంది. ఇలాంటి ఘోరం తామెప్పుడూ వినలేదని చెబుతున్నారు. ఎవరిని కదిపినా భవిష్యత్‌లో ఇంకెన్ని చావులు చూడాల్సి వస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇళ్ల మధ్య ఇలాంటి ఫ్యాక్టరీలు పెడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అని ఆవేదన చెందుతున్నారు. ఆనంద ఫ్యాక్టరీనే కాదు, చుట్టుపక్కల ఉన్న అన్ని కాలుష్యకారక ప్లాంట్లను మూసేయాలని డిమాండ్ చేస్తున్నారు. మృతుల ఇళ్లవద్దా బూట్ల చప్పుళ్లే మొగల్తూరుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసుల బూట్ల చప్పుళ్ల మధ్య భీతావహ వాతావరణం నెలకొంది. గురువా రం నాటి ఘోర ఘటన నేపథ్యంలో మొగల్తూరు పరిసరాల్లో భారీస్థాయిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుల ఇళ్ల వద్ద కూడా పోలీస్ బలగాలు మోహరించాయి. వారి ఇళ్లకు ఎవరినీ రానివ్వడం లేదు. ప్రమాదానికి కారణమైన ఆనంద ప్లాంట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఫ్యాక్టరీని సీజ్ చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించినా.. గేట్లకు ఎలాంటి సీళ్లు వేయలేదు. గేట్లు మూసేసి, కాపలాగా భారీ బందోబస్తు పెట్టారు. పెనుగొండ సీఐ రామారావు నేతృత్వలో 100 మంది కానిస్టేబుళ్లు ఫ్యాక్టరీ చుట్టూ రక్షణ వలయంగా నిలబడ్డారు. తుందుర్రును మరిపించే విధంగా పోలీస్ బందోబస్తు నల్లంవారి తోటలోనూ కొనసాగుతోంది. ఫ్యాక్టరీకి వెళ్లేదారుల్లోనూ, మండలంలోని ముఖ్యమైన గ్రామాల ప్రధాన కూడళ్లలోనూ పోలీసులు జీప్లను నిలిపి నిఘా ఉంచారు. నిజానికి ప్రమాదం జరిగిన గురువారం సాయంత్రం వరకూ మాత్రమే ఫ్యాక్టరీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించిన తరువాత అంతా ప్రశాంతంగానే ఉంది. ఆప్తులను కోల్పోయి మృతుల కుటంబాలవారు, ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయంతో ప్రజలు ఆందోళన చెందుతుంటే.. పోలీసుల చర్యలు పచ్చని గ్రామాల్లో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. -
బ్రెజిల్ అధ్యక్షుడి ప్యాలెస్‌లో దెయ్యం !
-
జయంతి.. ఓ దెయ్యం
అనగనగా ఓ దెయ్యం. ఆ దెయ్యానికి తల ఉండదు. దీనికి కారకులు ఎవరు? వారిపై తల లేని దెయ్యం ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అనే కథతో రూపొందిన సినిమా ‘జయంతి’. ఫణిరాజ్ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. వచ్చే నెలలో రిలీజ్ చేయాలను కుంటున్నారు. ఫణిరాజ్ మాట్లాడుతూ – ‘‘జయంతి అనే ఓ దెయ్యం కథే ఈ సినిమా. బ్రహ్మానందం, అలీ, పోసానిల సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తారక్ –ఫణిరాజ్. -
అమ్మో దెయ్యం.. మాకు భయం
చింతపల్లి: విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగి కస్తూర్భా గాంధీ గురుకుల విద్యాలయంలోని 50 మంది బాలికలు శనివారం దెయ్యం తిరుగుతోందంటూ ఇంటి బాట పట్టారు. పాఠశాలలో రాత్రి పూట కొందరు బాలికలకు దెయ్యం పడుతోందని, ఆ భయంతోనే వెళ్లిపోయారని కొందరు చెబుతుండగా, సంఘటన వెనుక కొందరు స్వార్థపరులు కథ నడుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 185 మంది బాలికలు చదువుతున్నారు. కొంత కాలంగా పాఠశాలలోని బోధకులు మధ్య విభేదాలు ఉన్నాయని, ఇందులో భాగంగా ప్రత్యేక అధికారిణి లక్ష్మిని ఆ బాధ్యతల నుంచి తప్పించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు కొందరు విద్యార్థినులను పావులుగా వాడుకుంటున్నట్లు పలువురు చెబుతున్నారు. ఏటీడబ్ల్యువో విచారణ తాజంగి కస్తుర్భా బాలికలు ఇంటి బాట పట్టడంపై ఏటీడబ్ల్యువో దేముళ్లు విచారణ జరిపారు. విద్యార్థినులు వెళ్లి పోవడానికి గల కారణాలను సిబ్బంది, బాలికలను అడిగి తెలుసుకున్నారు. సంఘటన వెనుక వినిపిస్తున్న కథనంపై కూడా ఆయన ఆరా తీస్తున్నారు. ఇళ్లకు వెళ్లిపోయిన బాలికలందరినీ వెనక్కు రప్పించేందుకు ప్రత్యేక అధికారి లక్ష్మి చర్యలు చేపట్టారని ఆయన తెలిపారు. -
ర్యాగింగ్ భూతాన్ని తరిమివేద్దాం
– చైతన్యానికి శ్రీకారం చుట్టిన వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం – యాంటీ ర్యాగింగ్ పోస్టర్ విడుదల చేసిన గౌరు వెంకటరెడ్డి కర్నూలు (ఓల్డ్‌సిటీ): ర్యాగింగ్ భూతాన్ని తరిమివేద్దామని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక కష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విద్యార్థి విభాగం నాయకులతో కలిసి యాంటీ ర్యాగింగ్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్ అనేది విద్యార్థి పాలిట యమపాశం లాంటిదన్నారు. నూతనంగా కాలేజీల్లో చేరే విద్యార్థుల పట్ల సీనియర్లు అసభ్యంగా ప్రవర్తించడంతో మనో వేదనకు గురై చివరికు ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఇలాంటి దురాచారాన్ని రూపుమాపాలని పిలుపునిచ్చారు. ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రై వేటు, ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థులను చైతన్యపరిచే కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ర్యాగింగ్ నష్టాలను వివరించి, విద్యార్థుల మధ్య స్నేహ పూర్వక వాతావరణం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు టి.అనిల్ కుమార్, నగర అధ్యక్షుడు పి.జి. గోపినాథ్ యాదవ్, ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి, సతీశ్ యాదవ్, జగదీశ్‌రెడ్డి, సంజు, అశోక్, ప్రత్యూష్, సురేంద్ర, రాజు, కొండ, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
గోగులపాడులో దెయ్యం భయం
-
అదాశర్మ... అప్పుడే టీవీకా?!
అందచందాలు మెండుగా ఉన్నా అందరూ సినిమాల్లో రాణించలేరని అదాశర్మని చూస్తే అర్థమవుతుంది. ‘1920’ చిత్రంలో దెయ్యం పట్టిన పిల్లగా నటించి అదరగొట్టిన అదా... ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేసింది. తెలుగులో నితిన్ సరసన ‘హార్ట్ అటాక్’లోనూ నటించింది. కానీ కలసి రాలేదు. దాంతో బుల్లితెరకు బయలుదేరిందని తెలుస్తోంది. బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు విపుల్ షా తీయబోతోన్న సీరియల్లో అదా ప్రధాన పాత్రలో నటించబోతోందట. దాంతో అదా అప్పుడే సీరియల్స్‌కి వెళ్లడమేంటని కొందరు అంటున్నారు. ఏం చేస్తుంది పాపం! చాన్సుల కోసం చూసి చూసి విసిగిపోయి ఉంటుంది. అయినా బుల్లితెరకి రావడం ఆమెకు బాధాకరమేమో కానీ, అంత చక్కని అమ్మాయి సీరియల్స్‌లో కనిపించడమంటే టెలివిజన్ ప్రేక్షకులకు సంతోషకరమైన విషయమే! -
సౌత్ కధలపై మనసుపడ్డ సల్లుభాయ్
-
రాత్రి 11.40
నిజాలు దేవుడికెరుక బాధతో చనిపోయిన మనిషి దెయ్యమై తిరుగాడుతాడని చాలామంది అంటారు. అయితే ఇది నిజం కాదని కొందరు వాదిస్తుంటారు. అలాంటి వాళ్లందరూ 'ఒకికు' గాథ వింటే ఏమంటారో! మనసు వికలమై తనువు చాలించిన ఈ పద్దెనిమిదేళ్ల అమ్మాయి ఆత్మ... ప్రపంచానికి సవాలు విసిరింది. దెయ్యాలు లేవు అనేవారి ఆలోచనల్ని కొత్త దారిలోకి మళ్లించింది! జపాన్... 17వ శతాబ్దం. సమయం రాత్రి పదకొండూ నలభై కావస్తోంది. అరుగు మీద కూచుని ఉన్నాడు మకిహికో. ఆ రోజు సాయం త్రమే తన చిన్నాన్న ఇంటికి వచ్చాడు. కాసేపు పిచ్చాపాటీ మాట్లాడి, విందు ఆరగించాడు. పదయ్యేసరికే మంచమెక్కాడు కానీ కొత్త ప్రదేశం కావడం వల్ల ఎంతకీ కంటిమీదికి కునుకు రాలేదు. దాంతో కాసేపు అటూ ఇటూ దొర్లి... ఇక లాభం లేదని బయటకు వచ్చాడు. వేసవి కావడంతో చెట్లు అలక బూనినట్టుగా బిగుసుకుపోయాయి. కాకపోతే ఇంట్లో కంటే బయట కాస్త చల్లగా అనిపించడంతో అరుగుమీద కూచున్నాడు. కాసేపయ్యాక అరుగుమీదే ఒరిగాడు. ఆకాశంలోకి చూస్తూ తారల వెలుగుల్ని, మబ్బుల మనోహరత్వాన్నీ ఆస్వాదిస్తున్నాడు. ఉన్నట్టుండి ఎక్కడో నీళ్ల చప్పుడు అయ్యింది. దగ్గరో కొలను కానీ, నది కానీ లేవు. మరి నీళ్లు కదిలిన శబ్దమెక్కడినుంచి వచ్చిందో అనుకుంటూ చుట్టూ చూశాడు. వెన్నెల వెలుగులో కాస్త దూరంగా ఓ బావి కనిపించింది. కానీ అక్కడెవ్వరూ నీళ్లు తోడటం లేదు. మరి నీళ్ల సవ్వడి ఎందుకొచ్చింది, బరువైన వస్తువేదైనా అందులో పడిందా అనుకున్నాడు. ఓ క్షణం ఆలోచించి, మళ్లీ పడుకున్నాడు. క్షణం తరువాత మళ్లీ అదే నీళ్ల శబ్దం. వెంటనే లేచి కూచున్నాడు మకిహికో. బావివైపు దృష్టి సారించాడు. అంతే... అతడి వెన్ను జలదరించింది. నూతిలోంచి ఓ అమ్మాయి బయటకు వస్తోంది. మకిహికో ఒళ్లు ఝల్లుమంది. గుండె గుభేలుమంది. ఆ అమ్మాయి బయటికొచ్చి నేలమీద దిగింది. ఎదురుగా ఉన్న భవంతివైపు కదులుతోంది. పాదాలు కనిపించనంత పొడవైన తెల్లని గౌను వేసుకుంది. నల్లని కురులు వీపంతా ఆక్రమించాయి. చక్రాల బండి మీద ఉన్నట్టు అలా అలా అలవోకగా సాగిపోతోంది. క్షణంలో ఆమె ఆ భవనంలోకి వెళ్లిపోయింది. ఒళ్లంతా చెమటలు పోశాయి మకిహికోకి. ఎవరా అమ్మాయి? నూతిలోంచి వచ్చిందేమిటి? అసలు మనిషేనా? లేక దెయ్యమా? తన ఆలోచనకి తనే ఉలిక్కిపడ్డాడు. గబగబా లేచి ఇంట్లోకి వెళ్లి తలుపు బిగించాడు. ఇంట్లోవాళ్లని లేపుదామా అనుకున్నాడు. కానీ అందరూ మత్తుగా నిద్రపోతున్నారు. దాంతో వెళ్లి తన పడకమీద పడుకున్నాడు. భయంతో ముఖం కూడా బయట లేకుండా నిలువునా దుప్పటి కప్పేసుకున్నాడు. తను చూసిన దృశ్యం పదే పదే కళ్లముందు కనిపిస్తోంది. దాన్ని మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. అంతలో సన్నగా ఏడుపు వినిపించింది. ఆమె ఏడుస్తోంది. హృదయవిదారకంగా వెక్కి వెక్కి ఏడుస్తోంది. గుండెల్ని పిండేసేలా రోదిస్తోంది. ఎవరిదా రోదన? ఆమెదేనా? ఎందుకేడుస్తోంది? అసలామె మనిషేనా? దెయ్యమా? దెయ్యమైతే ఎందు కేడుస్తుంది? కాసేపటికి ఆ ఏడుపు ఆగిపోయింది. అంతా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం కూడా మకిహికోని భయపెట్టింది. ఆ రాత్రంతా నిదుర లేకుండా చేసింది. ఉదయం లేస్తూనే రాత్రి జరిగింది తన చిన్నాన్నకి చెప్పాడు మకిహికో. కానీ అతడి చిన్నాన్న పెద్దగా రియాక్టవ్వలేదు. ''ఓ అదా... అది మామూలేలే. మాకు అలవాటైపోయింది'' అన్నాడు కూల్‌గా. ''అలవాటైపోయిందా? అంటే రోజూ ఇలా జరుగుతుందా?'' అన్నాడు మకిహికో మరింత ఆశ్చర్యంగా. ''ఇప్పుడేంటి... కొన్ని దశాబ్దాలుగా ఇలానే జరుగుతోందట.'' ''దశాబ్దాలుగా జరుగుతోందా? అంటే ఆమె... దె... దె... దెదె దెయ్యమా?'' అన్నాడు వణుకుతూ. ''అవును.'' మకిహికో పై ప్రాణాలు పైనే పోయాయి. ''దెయ్యమా? ఆ విషయం ఇంత సింపుల్‌గా చెబుతున్నావేంటి చిన్నాన్నా? దెయ్యమని తెలిసి కూడా ఇక్కడ ఎలా ఉంటున్నారు? భయం లేదా మీకు?'' అన్నాడు కంగారుపడుతూ. ''లేదురా. ఆమె కథ తెలిస్తే భయం కాదు... జాలి వేస్తుంది. తను ఎవరినీ ఏమీ చేయదు. ఆమె మనసులో ఎవరిమీదా కోపం లేదు... వేదన తప్ప.'' ''వేదనా? ఎందుకు?'' మకిహికోకి ఆమె కథ చెప్పాడు చిన్నాన్న. అంతే... అతడి మనసంతా జాలితో నిండిపోయింది. ‘‘అయ్యో పాపం’’ అన్నాడు మకిహికో బాధగా. అతడే కాదు. ఆమె కథ విన్నవాళ్లు, ఆమె వ్యథ తెలిసినవాళ్లెవరి మనసులైనా కరిగి నీరవుతాయి. జపాన్లోకి కోబ్ ప్రాంతంలో ఉంది హినెజీ క్యాజిల్. దాని యజమాని ఒయామా నావికుడు. ఆరు నెలలు సముద్రం మీద ఉంటే, ఆరు నెలలు ఇంటి దగ్గర ఉంటాడు. అతడికి కుటుంబం లేదు. నలుగురైదుగురు పనివాళ్లు అన్ని పనులూ చేసి పెడుతుంటారు. వంటపని చేసేందుకు ఒక మహిళ ఉంది. ఆమె చాలా యేళ్లుగా పనిచేస్తోంది. అయితే ఈసారి ఒయామా వచ్చేసరికి ఆమెకి సుస్తీ చేయడంతో, తన దూరపు బంధువైన ఒకికుని పనిలో పెట్టి తాను వెళ్లిపోయింది. ఒకికుకి పద్దెనిమిదేళ్లుంటాయి. భలే చలాకీ అయిన పిల్ల. వంట చేయడానికే వచ్చినా ఆ ఒక్కటీ చేసి ఊరుకోదు. అన్ని పనులూ దగ్గరుండి చూసుకుంటుంది. దానికి తోడు మహా అందగత్తె కూడా. పైడిబొమ్మలా ఉంటుంది. తీగలాంటి ఒళ్లు, తేనెకళ్లు, నల్లగా నిగనిగలాడే ఒత్తయిన జుత్తు, ముట్టుకుంటే మాసిపోయే లేతదనం, చకచక కదిలే చలాకీతనం... ఆమెని చూసి ముచ్చటపడనివాళ్లుండరు. చాలామంది అయితే ఆమె పనిమనిషి అంటే నమ్మరు. అంత బాగుంటుంది. అదే ఆమె పాలిట శాపమయ్యింది. ఒయామా ఒకికు మీద కన్నేశాడు. కాదంటే కన్నెర్రజేశాడు. బెదిరించాడు. ఎలాగైనా తన కోరిక తీర్చుకోవాలని పన్నాగాలు పన్నాడు. కానీ ఒకికు లొంగలేదు. దాంతో పగ పెంచుకున్నాడు ఒయామా. ఎలాగైనా ఒకికుకి బుద్ధి చెప్పాలనుకున్నాడు. అందుకోసం కుట్ర పన్నాడు. తన ఇంట్లో ఖరీదైన సెరామిక్ ప్లేట్లు పది ఉన్నాయి. వాటిలో ఒకటి తీసి దాచేశాడు. దానికోసం వెతికినట్టు నటించాడు. చివరికి ఒకికుయే దొంగిలించి ఉంటుందన్నాడు. పోలీసులకు పట్టిస్తానన్నాడు. అలా అయినా ఆమె తన మాట వింటుందని అతడి ఉద్దేశం. ఒకికు కుమిలిపోయింది. తానే పాపం ఎరుగనని ఏడ్చింది. కానీ కరిగిపోయేంత సున్నిత మనస్కుడు కాదు ఒయామా. వదిలేది లేదన్నాడు. దాంతో అవమాన భారాన్ని మోయలేక, అతనికి లొంగనూలేక పెరట్లో ఉన్న బావిలో దూకి మరణించింది ఒకికు. అక్కడితో ఆమె కథ ముగిసిందనుకున్నారంతా. కానీ మరో కొత్త కథకి తెర లేచింది. చనిపోయిన మర్నాడు అర్ధరాత్రి ఒయామా ఇంట్లో ఒకికు ఆత్మ ప్రత్యక్షమైంది. ఇల్లంతా తిరుగుతూ దేనికోసమో వెతికింది. తర్వాత పెద్ద పెట్టున ఏడ్చింది. ఆ పైన నూతి దగ్గరకు వెళ్లి మాయమైంది. అప్పట్నుంచీ ప్రతిరోజూ అర్ధరాత్రి అయ్యేసరికి ఆమె నూతి నుంచి వస్తూనే ఉంది. ఇల్లంతా వెతికి, ఏడ్చి మాయమౌతూనే ఉంది. ఆమె వెతుకుతోంది మాయమైన పదో సెరామిక్ ప్లేట్ కోసమని అందరికీ అర్థమైంది. దొంగతనం చేసిందన్న అపవాదును భరించలేక చనిపోయిన ఆమె, ఆ అపనిందను తుడిపేసుకోవడానికే ఇలా ప్రయత్నిస్తోందని తెలిసొచ్చింది. ఒయామా హడలిపోయాడు. తను చేసిన పాపం బయటపడుతుందేమోనని భయపడ్డాడు. ఆ ఒత్తిడి అతడి నరాల్ని పిండేసింది. పక్షవాతం వచ్చింది. మంచాన పడి నరక యాతన అనుభవించి మరణించాడు. ఆ తర్వాత ఆ బంగ్లా ఒయామా దూరపు బంధువుల చేతికి వెళ్లింది. కానీ ఎవ్వరికీ అక్కడ ఉండేందుకు ధైర్యం చాలలేదు. ప్రతిరాత్రీ ఒకికు వస్తుంటే భయమేసి పారిపోయారు. కొన్నాళ్లకు ఇక ఆ ఇంటివైపు రావడమే మానేశారంతా. కానీ ఒకికు మాత్రం తన వెతుకులాట ఆపలేదు. నిర్దోషినని నిరూపించుకోవాలన్న ఆమె ఆరాటం ఆగనూలేదు. ఇది ఒకికు కథ. అయితే కాలం గడిచేకొద్దీ ఈ కథకు అనేక వెర్షన్లు పుట్టుకొచ్చాయి. ఒకికుని ఒయామాయే చంపి నూతిలో పడేశాడని కొందరు అన్నారు. ఇంకొందరయితే... ఒయామా ఆమె మీద ఆశపడలేదని, ఆమె సెరామిక్ ప్లేట్ పగులగొట్టడంతో కోపోద్రిక్తుడై కొట్టాడని, అనుకోకుండా ఒయామా మరణించిందని అన్నారు. రచయితలు రకరకాల మలుపులతో ఒకికు కథను రాశారు. సినిమావాళ్లు ఆ కథకు మరిన్ని రంగులద్దారు. ఏది ఏమైతేనేం.. ఒయామా చేతిలో ఒకికు బలైపోయిందన్నది వాస్తవం. ఓ అమాయకురాలు... దురహంకారి, దుష్టుడైన యజమాని కారణంగా ప్రాణాలు కోల్పోయింది. చేయని తప్పుకు పడిన నిందను తుడిచేసుకోవడానికి, తన అమాయకత్వాన్ని నిరూపించుకోవడానికి శతాబ్దాలుగా ప్రయత్నిస్తోంది. ఆమె ఏ పాపం చేయలేదని, ఆమెకు అన్యాయం జరిగిందని ప్రపంచమంతా అర్థం చేసుకుంది. కానీ ప్రపంచం తనను అర్థం చేసుకుందన్న విషయం ఒకికుకి ఇంకా అర్థం కాలేదు. అందుకే ఇప్పటికీ ఆమె ఆత్మ... హినెజీ క్యాజిల్‌లో తిరుగాడుతూనే ఉంది! -సమీర నేలపూడి -
కులం.. దేశానికి పట్టిన దెయ్యం
-
కులం.. దేశానికి పట్టిన దెయ్యం
సాక్షి, హైదరాబాద్: ఏ సమస్యకైనా ఉత్తమ పరిష్కార మార్గం చర్చలేనని ప్రముఖ ఆర్థిక వేత్త, నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ అమర్త్యసేన్ అన్నారు. కులం దేశానికి పట్టిన అతిపెద్ద దెయ్యమని అభివర్ణించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అమర్త్యసేన్‌కు గురువారం డాక్టరేట్‌ను అందజేసింది. అనంతరం వర్సిటీలోని ఆడిటోరియంలో ‘విశ్వవిద్యాలయాల్లో కాఫీ షాపుల ఆవశ్యకత’ అనే అంశంపై అమర్త్యసేన్ ప్రసంగిస్తుండగా దళిత విద్యార్థులు అడ్డుతగిలారు. యూనివర్సిటీలో దళిత విద్యార్థుల పట్ల తీవ్ర వివక్ష చూపుతున్నారని, దీనిపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. వైస్ చాన్స్‌లర్, భద్రతా సిబ్బంది విద్యార్థులను బుజ్జగించారు. అనంతరం అమర్త్యసేన్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఏ సమస్యనైనా చర్చల ద్వారానే పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని, అదే సరైన మార్గమని సూచించారు. తానూ అనేక ఉద్యమాల్లో స్వయంగా పాల్గొన్నానని.. ఆహార భద్రతా చట్టం, దళిత, మైనారిటీ హక్కులు, బాలల పోషకాహారం వంటి సమస్యలపై నేరుగా పోరాడానని తెలిపారు. ప్రజాస్వామ్యంలో అన్ని విషయాల్లో సమానత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. ‘నిరసించు, చైతన్యపరచు, వ్యవస్థీకరించు’ అనే అంబేద్కర్ సూచనను అందరూ పాటించాలని నొక్కి చెప్పారు. విద్య, వైద్యం, పోషకాహారం వంటి కీలక అంశాల్లో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ అథమ స్థానంలో ఉందన్నారు. దేశంలో మూడో వంతు ప్రజలకు ఇప్పటికీ విద్యుత్ కనెక్షన్ లేదని, ఇలాంటి సామాజిక అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని, అందుకు ప్రసార మాధ్యమాలు సహకరించాలని అమర్త్యసేన్ కోరారు. చివరిగా విద్యార్థులడిగిన పలు ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. కార్యక్రమంలో యూనివర్సిటీ చాన్స్‌లర్ హనుమంతరావు, వైస్ చాన్స్‌లర్ రామకృష్ణ రామస్వామి, రిజిస్ట్రార్ రాజశేఖర్, ఆర్థికశాస్త్ర విభాగం డీన్ నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు.