రాజకీయ నాయకురాలు మణి మేకల | Manimekalas Political Power Unveiled in Devil | Sakshi
Sakshi News home page

రాజకీయ నాయకురాలు మణి మేకల

Published Mon, Oct 16 2023 6:26 AM | Last Updated on Mon, Oct 16 2023 6:26 AM

Manimekalas Political Power Unveiled in Devil - Sakshi

మణి మేకల పవర్‌ఫుల్‌ రాజకీయ నాయకురాలు. ఆమె ప్రసంగాలు ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తాయి. మరి.. ఆ రాజకీయ నాయకురాలికి, బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌కి ఉన్న లింక్‌ ఏంటి? అనేది ‘డెవిల్‌’ చిత్రంలో చూడాల్సిందే. బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రంలో ఓ రహస్యాన్ని ఛేదించే బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా నందమూరి కల్యాణ్‌ రామ్‌ నటిస్తున్నారు.

పొలిటీషియన్‌ మణి మేకల పాత్రను మాళవికా నాయర్‌ పోషిస్తున్నారు. ఆదివారం మాళవిక లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో కథానాయికగా సంయుక్తా మీనన్‌ నటిస్తున్నారు. నవంబర్‌ 24న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘డెవిల్‌’ రిలీజ్‌ కానుంది. దేవాన్‌‡్ష నామా సమర్పణలో స్వీయ దర్శకత్వంలో అభిషేక్‌ నామా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్, కెమెరా: సౌందర్‌ రాజన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement