samyuktha menon
-
జోరుగా హుషారుగా షూటింగ్‌కి పోదమా...
‘జోరుగా హుషారుగా షికారు పోదమా...’ అంటూ అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణకుమారి అప్పట్లో సిల్వర్ స్క్రీన్‌పై చేసిన సందడిని నాటి ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ పాట ప్రస్తావన ఎందుకూ అంటే... జోరుగా హుషారుగా షూటింగ్‌కి పోదమా... అంటూ కొందరు కథానాయికలు డైరీలో నాలుగుకి మించిన సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఆ హీరోయిన్లు చేస్తున్నసినిమాల గురించి తెలుసుకుందాం...రెండు దశాబ్దాలు దాటినా బిజీగా...చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకుపైగా ప్రయాణం పూర్తి చేసుకున్నారు త్రిష. అందం, అభినయంతో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె ఇప్పటికీ ఫుల్ బిజీ హీరోయిన్గా దూసుకెళుతున్నారు. అంతేకాదు.. అందం విషయంలోనూ యువ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం త్రిష చేతిలో తెలుగు, తమిళ్, మలయాళంలో కలిపి అరడజను సినిమాలున్నాయి. ఆమె నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా నటిస్తున్నారామె.‘స్టాలిన్’ (2006) సినిమా తర్వాత చిరంజీవి–త్రిష కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. అలాగే మోహన్‌లాల్ లీడ్ రోల్లో డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తోన్న మలయాళ చిత్రం ‘రామ్’లోనూ నటిస్తున్నారు త్రిష. అదే విధంగా అజిత్ కుమార్ హీరోగా మగిళ్ తిరుమేని తెరకెక్కిస్తున్న ‘విడాముయర్చి’, అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ‘గుడ్ బ్యాడీ అగ్లీ’, కమల్‌హాసన్ హీరోగా మణిరత్నం రూపొందిస్తున్న ‘థగ్ లైఫ్’, సూర్య కథానాయకుడిగా ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ‘సూర్య 45’ (వర్కింగ్ టైటిల్) వంటి తమిళ చిత్రాల్లో నటిస్తూ జోరు మీద ఉన్నారు త్రిష. తెలుగులో లేవు కానీ...తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బుట్ట బొమ్మగా స్థానం సొంతం చేసుకున్నారు హీరోయిన్ పూజా హెగ్డే. నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ (2014) అనే చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారీ బ్యూటీ. టాలీవుడ్లో పదేళ్ల ప్రయాణం పూజా హెగ్డేది. కాగా చిరంజీవి, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ‘ఆచార్య’ (2022) సినిమా తర్వాత ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. కానీ, బాలీవుడ్, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు పూజా హెగ్డే.తమిళంలో స్టార్ హీరోలైన విజయ్, సూర్యలకు జోడీగా నటిస్తున్నారు. విజయ్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ‘జన నాయగన్’ అనే సినిమాతో పాటు, సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో రూపొందుతోన్న ‘రెట్రో’ మూవీస్‌లో నటిస్తున్నారు పూజా హెగ్డే. అలాగే డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ అనే సినిమాలో నటిస్తున్నారామె. షాహిద్ కపూర్ హీరోగా రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో రూపొందిన హిందీ మూవీ ‘దేవా’. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. హిందీ, తమిళ భాషల్లో బిజీగా ఉన్న పూజా హెగ్డే తెలుగులో మాత్రం ఒక్క సినిమాకి కూడా కమిట్ కాలేదు. జోరుగా లేడీ సూపర్ స్టార్ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు నయనతార. నటిగా రెండు దశాబ్దాలకు పైగా ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఆమె ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. కథానాయికగా ఫుల్ క్రేజ్‌లో ఉన్నప్పుడే దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో 2022 జూన్ 9న వివాహబంధంలోకి అడుగుపెట్టారు నయనతార. వీరిద్దరికీ ఉయిర్, ఉలగమ్ అనే ట్విన్స్ ఉన్నారు. ఇక కెరీర్ పరంగా ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు సినిమాలున్నాయి. తమిళంలో ‘టెస్ట్, మన్నాంగట్టి సిన్స్ 1960, రాక్కాయీ’ వంటి సినిమాలతో పాటు పేరు పెట్టని మరో తమిళ చిత్రం, ‘డియర్ స్టూడెంట్’తో పాటు మరో మలయాళ మూవీ, ‘టాక్సిక్’ అనే కన్నడ సినిమాతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు నయనతార. అయితే 2022లో విడుదలైన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ తర్వాత మరో తెలుగు చిత్రానికి పచ్చజెండా ఊపలేదామె.అరడజను సినిమాలతో‘చూసీ చూడంగానే నచ్చేశావే.. అడిగీ అడగకుండా వచ్చేశావే... నా మనసులోకి’ అంటూ రష్మికా మందన్నాని ఉద్దేశించి పాడుకుంటారు యువతరం ప్రేక్షకులు. అందం, అభినయంతో అంతలా వారిని ఆకట్టుకున్నారామె. కన్నడలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘ఛలో ’(2018) సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్నారు ఈ కన్నడ బ్యూటీ. ఓ వైపు కథానాయకులకి జోడీగా నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి.వాటిలో ‘రెయిన్ బో, ది గాళ్ ఫ్రెండ్’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్న ‘రెయిన్ బో’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. అదే విధంగా ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది గాళ్ ఫ్రెండ్’. అలాగే విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీ ‘ఛావా’లో హీరోయిన్గా చేశారు రష్మిక. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.ఇక సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న హిందీ మూవీ ‘సికందర్’లోనూ రష్మిక కథానాయిక. అదే విధంగా నాగార్జున, ధనుశ్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న తెలుగు, తమిళ చిత్రం ‘కుబేర’లోనూ హీరోయిన్గా నటించారు ఈ బ్యూటీ. మరోవైపు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ‘థామా’ అనే బాలీవుడ్ మూవీలోనూ నటిస్తున్నారు రష్మికా మందన్నా.ఏడు చిత్రాలతో బిజీ బిజీగా...మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి, ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ సంయుక్తా మీనన్. ‘భీమ్లా నాయక్’ (2022) చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమయ్యారు ఈ మలయాళ బ్యూటీ. ‘భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష’ వంటి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు సంయుక్త. ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు సినిమాలున్నాయి. వాటిలో తెలుగులోనే ఐదు చిత్రాలుండగా, ఓ హిందీ ఫిల్మ్, ఓ మలయాళ సినిమా కూడా ఉంది.నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ‘స్వయంభూ’, శర్వానంద్ కథానాయకుడిగా రామ్ అబ్బరాజు డైరెక్షన్లో రూపొందుతున్న ‘నారి నారి నడుమ మురారి’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా లుధీర్ బైరెడ్డి తెరకెక్కిస్తున్న ‘హైందవ’, బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ‘అఖండ 2: తాండవం’ సినిమాల్లో నటిస్తున్నారు సంయుక్తా మీనన్. అదే విధంగా తొలిసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలోనూ నటిస్తున్నారామె.యోగేష్ కేఎంసీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అలాగే ఆమె నటిస్తున్న తొలి హిందీ చిత్రం ‘మహారాజ్ఞి–క్వీన్ ఆఫ్ క్వీన్స్’. ఈ మూవీకి చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అదే విధంగా మోహన్‌లాల్ లీడ్ రోల్లో జీతూ జోసెఫ్ దర్వకత్వంలో రూపొందుతోన్న మలయాళ చిత్రం ‘రామ్’లోనూ నటిస్తున్నారు సంయుక్తా మీనన్. ఇలా ఏడు సినిమాలతో ఫుల్ బీజీ బీజీగా ఉన్నారామె. హుషారుగా యంగ్ హీరోయిన్టాలీవుడ్లో మోస్ట్ సెన్సేషన్ హీరోయిన్గా దూసుకెళుతున్నారు శ్రీలీల. ‘పెళ్లిసందడి’ (2021) సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌ని సొంతం చేసుకున్నారు. రవితేజ హీరోగా నటించిన ‘ధమాకా’ (2022) సినిమాతో తెలుగులో తొలి హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న శ్రీలీల వరుస చిత్రాలతో యమా జోరు మీదున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తెలుగు సినిమాలతో పాటు ఓ తమిళ చిత్రం ఉన్నాయి.నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రాబిన్ హుడ్’, రవితేజ హీరోగా భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ‘మాస్ జాతర’, పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ వంటి తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు శ్రీలీల. అదే విధంగా శివ కార్తికేయన్ హీరోగా సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న ‘పరాశక్తి’ అనే తమిళ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారామె.హిందీలోనూ...దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘సీతా రామం’ (2022) సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు మృణాళ్ ఠాకూర్. ఆ సినిమా మంచి హిట్‌గా నిలిచింది. మృణాళ్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత తెలుగులో ‘హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్’ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఈ బ్యూటీ ప్రభాస్ ‘కల్కి: 2898 ఏడీ’ చిత్రంలో అతిథి పాత్ర చేశారు. ప్రస్తుతం మృణాళ్ ఠాకూర్ బాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారారు. ఆమె హిందీలో ‘పూజా మేరీ జాన్, హై జవానీతో ఇష్క్ హోనా హై, సన్ ఆఫ్ సర్దార్ 2’, తుమ్ హో తో’ వంటి చిత్రాలు చేస్తున్నారు. అదే విధంగా అడివి శేష్ హీరోగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ‘డెకాయిట్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు మృణాళ్ ఠాకూర్.రెండు తెలుగు... రెండు హిందీ ప్రేక్షకుల హృదయాల్లో అతిలోక సుందరిగా అభిమానం సొంతం చేసుకున్న దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీకపూర్ వారసురాలిగా పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ హిందీలో ఎంట్రీ ఇచ్చారు. యూత్ కలల రాణిగా మారారు ఈ బ్యూటీ. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘దేవర: పార్ట్ 1’ (2024) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు జాన్వీ. ప్రస్తుతం ఆమె చేతిలో కూడా నాలుగు సినిమాలుఉన్నాయి. వాటిలో రెండు తెలుగు కాగా రెండు హిందీ మూవీస్.రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ‘దేవర: పార్ట్ 2’ సినిమా కూడా ఉండనే ఉంది. అదే విధంగా హిందీలో ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి, పరమ్ సుందరి’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఇలా నాలుగైదు సినిమాలతో బిజీ బిజీగా షూటింగ్స్ చేస్తున్న కథానాయికలు ఇంకొందరు ఉన్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
64 ఏళ్ల హీరోతో జత కడుతున్న 29 ఏళ్ల హీరోయిన్ (ఫోటోలు)
-
అఖండ-2 హీరోయిన్ను ప్రకటించిన మేకర్స్
‘సింహా, లెజెండ్, అఖండ’ వంటి హిట్ సినిమాల తర్వాత హీరో బాలకృష్ణ(Balakrishna), డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఈ మూవీలో హీరోయిన్గా సంయుక్తా మీనన్(Samyuktha Menon) ఎంపికయ్యారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఎం. తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం మహా కుంభమేళాలో జరుగుతోంది. సినిమాలోని కీలక సీన్స్ షూట్ చేస్తు న్నారు. అయితే ఇప్పటివరకూ హీరోయిన్ ఎవరు? అనే విషయంపై చిత్రబృందం ప్రకటించలేదు. తాజాగా సంయుక్తా మీనన్ హీరోయిన్గా ఎంపిక అయినట్లు మేకర్స్ ప్రకటించారు. సెప్టెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమేరా: సి. రాంప్రసాద్, సంతోష్ డి. -
డిఫరెంట్ ఇయర్ రింగ్స్‌తో హీరోయిన్ సంయుక్త మీనన్ (ఫొటోలు)
-
స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన సినీనటి సంయుక్త మీనన్ (ఫొటోలు)
-
పింక్ కలర్ డ్రస్ లో మెరిసిన హీరోయిన్ సంయుక్త మీనన్ (ఫోటోలు)
-
'బచ్చలమల్లి' ప్రీ రిలీజ్ ఈవెంట్.. హీరోయిన్ల వైల్డ్ ఫైర్ గ్లామర్ (ఫొటోలు)
-
సన్నజాజి పువ్వులా సంయుక్త మీనన్.. ఇంత హాట్‌గా ఉందేంటి?
-
వింటేజ్ అవుట్‌ఫిట్‌లో తంగలాన్ బ్యూటీ.. గ్రీన్ శారీలో సంయుక్త మీనన్!
వింటేజ్ అవుట్‌ఫిట్‌లో తంగలాన్ బ్యూటీ మాళవిక మోహనన్..బుల్లితెర బ్యూటీ జ్యోతి కిల్లింగ్ లుక్స్...బ్లాక్ బ్యూటీలా మారిపోయిన మిల్కీ బ్యూటీ తమన్నా..గ్రీన్ శారీలో సంయుక్త మీనన్ హోయలు..బుట్టబొమ్మ పూజా హేగ్డే క్రేజీ లుక్స్... View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Ramya Krishnan (@meramyakrishnan) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) -
పర్వతాల్లో చిల్ అవుతోన్న సంయుక్త మీనన్.. రెడ్ డ్రెస్‌లో తాప్సీ !
రెడ్ డ్రెస్‌లో తాప్సీ పన్ను హోయలు..భూటాన్ పర్వతాల్లో చిల్ అవుతోన్న సంయుక్త మీనన్..మెహందీ లుక్ అంటోన్న మేఘా ఆకాశ్..బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయిన రకుల్ ప్రీత్ సింగ్ లుక్స్..క మూవీ హీరోయిన్ లేటేస్ట్ స్టిల్స్.. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Thanvi Ram (@tanviram) -
మేకప్ లేకుండా సంయుక్త.. టూర్ వెళ్తున్న సమంత
అడవుల్లో సఫారీకి వెళ్లిన హీరోయిన్ సంయుక్త మేనన్విమానంలో టూర్‌కి వెళ్లిపోతున్న ముద్దుగుమ్మ సమంతఎర్ర చీరలో కేక పుట్టిస్తున్న 'యానిమల్' బ్యూటీ తృప్తి దిమ్రిచీర కట్టినా సరే అందాలన్నీ చూపిస్తున్న సాక్షి మాలిక్షార్ట్ డ్రస్‌తో వయ్యారాలు ఒలకబోస్తున్న జ్యోతిరాయ్మాల్దీవుల్లో చిల్ అవుతున్న హాట్ బ్యూటీ సన్నీ లియోన్దంతేరస్ శుభాకాంక్షలు చెప్పిన సోనాక్షి సిన్హా View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Pulkit Samrat (@pulkitsamrat) View this post on Instagram A post shared by K sow (@saarya_laxman) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Pritha Hari (@pritha10hari) View this post on Instagram A post shared by PayalS Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by VDeviyaniSharma (@vdeviyanisharma) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Anala Susmitha (@anala.susmitha) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Sakshi Malik (@sakshimalikk) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) -
వాకథాన్‌లో టాలీవుడ్ హీరోయిన్స్ సంయుక్త-మీనాక్షి (ఫొటోలు)
-
పొట్టేల్ రియల్‌పాన్ ఇండియన్ మూవీ: సంయుక్తా మీనన్
‘‘పొట్టేల్’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఈ కథ మీద డైరెక్టర్ సాహిత్ నాలుగేళ్లు పని చేయడం మామూలు విషయం కాదు. మంచి రైటింగ్, డైరెక్షన్ ఉంటేనే ఇంత అద్భుతమైన సినిమా తెరపైకి వస్తుంది. ఈ ట్రైలర్లో ఫస్ట్ షాట్ చూసినప్పుడు ఒక రియల్‌పాన్ ఇండియన్ ఫిల్మ్‌లా అనిపించింది’’ అని హీరోయిన్ సంయుక్తా మీనన్ అన్నారు. యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో అజయ్ కీలకపాత్రలో నటించిన రూరల్ యాక్షన్ డ్రామా ‘పొట్టేల్’. సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించారు. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన సంయుక్తా మీనన్ మాట్లాడుతూ– ‘‘నిశాంక్గారు ఈ సినిమా గురించి చెప్పినప్పుడు చాలా ΄ప్యాషన్నేట్ ప్రోడ్యూసర్ అనిపించింది. ఇలాంటి ΄ప్యాషన్ ఉన్న నిర్మాతలు పరిశ్రమకి కావాలి’’ అన్నారు. అనన్య నాగళ్ల మాట్లాడుతూ– ‘‘ట్రైలర్లో చూసింది ఒక శాతం మాత్రమే. ఈ చిత్రంలో గొప్ప కథ ఉంది’’ అని చెప్పారు. ‘‘చాలా ప్రేమించి ఈ చిత్రం చేశాం’’ అన్నారు యువ చంద్రకృష్ణ. ‘‘ప్రేక్షకుల స్పందన కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’’ అని సాహిత్ మోత్కూరి పేర్కొన్నారు. ‘‘మంచి కంటెంట్‌తో నిర్మించిన ఈ చిత్రం పెద్ద సౌండ్ చేయబోతోంది. సాహిత్ అద్భుతంగా తీశాడు’’ అని నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే తెలిపారు. -
హీరోయిన్ సంయుక్త మీనన్ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)
-
నార్సింగిలో సందడి చేసిన హీరోయిన్ సంయుక్త మీనన్ (ఫొటోలు)
-
మాంగళ్య షాపింగ్ మాల్లో సంయుక్త మీనన్ సందడి
-
అమ్మ కోసం ‘సరే’ అన్నాను: సంయుక్త
‘మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు...’ అంటూ ‘సార్’ సినిమాలో మాస్టారు (ధనుష్)తో ప్రేమలో పడ్డారు హీరోయిన్ సంయుక్త. ఆ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ప్రేమను పొందారు ఈ మలయాళ బ్యూటీ. ప్రస్తుతం తెలుగులో ‘స్వయంభూ’, హిందీలో ‘మహారాజ్ఞి’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారామె. ఇక ‘సాక్షి’తోసంయుక్త పంచుకున్న విశేషాల్లో కొన్ని ఈ విధంగా...కేరళ టు హైదరాబాద్ షిఫ్ట్ అయినట్లున్నారు? ఈ మధ్య వరుసగా తెలుగులో నాలుగైదు సినిమాలు సైన్ చేశాను. ఇక్కడే ఉంటే బాగుంటుందని ముందు సర్వీస్ అపార్ట్మెంట్లో ఉండటం మొదలుపెట్టాను. మా అమ్మగారు కూడా నాతో పాటే ఉండాలనుకున్నారు. మా ఇంట్లో కుక్క పిల్లలు ఉన్నాయి. అమ్మా, నేను, కుక్కపిల్లలు... ఇదే నా ప్రపంచం. వాళ్లను విడిచి ఉండలేను. అందుకే ఇప్పుడు ఒక ఫ్లాట్ తీసుకుని, వాళ్లని కూడా హైదరాబాద్ తీసుకొచ్చేశాను.మలయాళంలో చేసిన ఫస్ట్ మూవీ ‘పాప్‌కార్న్’ (2016) చూసి, మీకు నటించడం రాదని కొందరు అన్నారు... మీకూ అలా అనిపించిందా? ఇప్పుడైతే ఇంకా బాగా నటించి ఉండేదాన్ని అనిపిస్తుంటుంది. యాక్టింగ్‌ని నా కెరీర్‌గా అనుకోలేదు. సినిమాకి అవకాశం వచ్చింది. ‘ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి.. ఒప్పుకో’ అని మా అమ్మగారు అన్నారు. ‘సరే’ అన్నాను. అప్పుడు నా వయసు 19, 20 ఏళ్లు ఉండి ఉంటాయి. ప్రపంచం గురించి పెద్దగా అవగాహన లేదు. షూటింగ్ లొకేషన్‌కి వెళ్లాక, అక్కడ రెండు కెమెరాలు ఉండటం చూసి రెండు ఎందుకు? ఉన్నాయా అనిపించింది. రెండు సైడ్స్ నుంచి షూట్ చేస్తారనే కనీస అవగాహన కూడా లేదు నాకు. పైగా బాగా బిడియస్తురాల్ని. (చదవండి: జూనియర్ ఎన్టీఆర్ దేవర.. ఓవర్సీస్లో మరో క్రేజీ రికార్డ్!)మా కుటుంబానికి చెందినవాళ్లెవరూ సినిమాల్లో లేరు. షూటింగ్ వాతావరణం మొత్తం చాలా అసౌకర్యంగా అనిపించింది. ఏదో నటించామంటే నటించాం అన్నట్లు చేశాను. ‘సినిమాలు మన వల్ల కాదు’ అని, చదువుకోవాలని డిసైడ్ అయిపోయాను. కానీ ఆ తర్వాత ‘తీవండి, లిల్లీ’ అనే సినిమాలకు అవకాశం వస్తే, ఒప్పుకున్నాను. ‘లీల్లీ’ లేడీ ఓరియంటెడ్ మూవీ కావడంతో సవాల్ అనిపించింది. సినిమా విధానాన్ని నేను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది ‘లిల్లీ’తోనే. ‘మనం నటించగలం’ అనే నమ్మకం కలిగింది కూడా ఆ సినిమాతోనే.‘సినిమాలు మన వల్ల కాదు’ అనుకున్నానని ఇంతకుముందు అన్నారు. లైఫ్‌లో ఏదైనా విషయంలో ‘వల్ల కాదు’ అంటే అలా సింపుల్‌గా వదిలేస్తారా? సింపుల్‌గా వదిలేయడం కూడా నా వల్ల కాదు. మనం ఎందుకు చేయలేం అనే ఆలోచన కూడా కలుగుతుంది. అయితే ఫస్ట్ మూవీకి నాకు సినిమా అంటే అర్థం కాలేదు. అర్థం కాని విషయం గురించి ఆలోచించడం ఎందుకని సినిమాలు వదిలేద్దామనుకున్నాను. ‘లీల్లీ’ చేసేటప్పుడు కాస్త అర్థమైంది. దాంతో కంటిన్యూ అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఏదైనా విషయాన్ని సాధించాలని నేను ఒక్కసారి ఫిక్స్ అయితే ఎంత కష్టపడటానికైనా రెడీ అయిపోతా. పైగా ఫస్ట్ మూవీ తర్వాత నేను సినిమాలకు దూరంగా ఉండాలనుకున్నప్పుడు ఇంకోటి ఎందుకు చేయడంలేదు? అని చుట్టూ ఉన్నవాళ్లు అనుకున్నారు. అప్పుడు సినిమా అనేది వర్ల్ పూల్ లాంటిదని అర్థమైంది. ఒక్కసారి వస్తే వెనక్కి వెళ్లలేం. ఫెయిల్యూర్‌గా మిగిలిపోవడం ఇష్టం లేక రెండో సినిమా ‘తీవండి’ ఒప్పుకున్నాను. ఆ తర్వాత ‘లిల్లీ’ చేశాను. ఈ సినిమాతో ఇండస్ట్రీలో ఉండాలని ఫిక్స్ అయిపోయాను. మొదట్లో అసౌకర్యంగా అనిపించిందని అన్నారు... ఇండస్ట్రీలో కొందరికి ఎదురయ్యే ‘క్యాస్టింగ్ కౌచ్’లాంటిది ఏమైనా... అలా ఏం లేదు. ఆ విషయంలో నేను లక్కీ. సినిమా మేకింగ్ ప్రాసెస్ అర్థం కాకపోవడంవల్లే వెళ్లిపోదామనుకున్నాను. ఒకవేళ క్యాస్టింగ్ కౌచ్‌లాంటి చేదు అనుభవం ఎదురై ఉంటే... అప్పటికప్పుడే అడిగేదాన్ని. ఇంట్లో ఏడ్చేసి, ఆ తర్వాత ఎప్పటికో ఆ విషయాన్ని బయటపెట్టేదాన్ని కాదు. మలయాళంలో నా ఫస్ట్ మూవీ నుంచి తెలుగు, తమిళంలో నాకన్నీ మంచి ప్రొడక్షన్ హౌస్లే దొరికాయి.‘మహారాజ్ఞి’తో హిందీకి కూడా వెళుతున్నారు... భాష తెలియకపోతే నటనకు న్యాయం చేయలేనని తెలుగు నేర్చుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మరి... హిందీ వచ్చా? స్కూల్లో హిందీ ల్వాంగేజ్ ఉండటంతో రాయడం, చదవడం వచ్చు. అయితే అనర్గళంగా మాట్లాడలేను. అందుకే తెలుగుకి ట్యూటర్ని పెట్టుకున్నట్లు హిందీకి కూడా పెట్టుకున్నాను. భాష నేర్చుకోవడం అంటే డైలాగ్స్ బట్టీ పట్టి ఆ సినిమా వరకు చెప్పడం వరకే అనుకోను. విడిగా కూడా తెలుగు మాట్లాడాలనుకున్నాను. అందుకే గ్రామర్ కూడా తెలుసుకోవాలని ట్యూటర్ పెట్టుకున్నాను. స్కూల్‌కి వెళ్లేటప్పుడు నోట్ బుక్ ఉంటుంది కదా.. అలాంటి నోట్‌బుక్ పెట్టుకుని, భాషలు నేర్చుకుంటున్నాను. మనం ఒక జాబ్ చేస్తున్నామంటే పూర్తి న్యాయం చేయాలన్నది నా అభిప్రాయం. -
సైజ్ జీరోలో సంయుక్త .. గ్లామర్ డోస్ పెంచేసిన జగతి మేడమ్
జిమ్‌లో 108రోజుల వర్కౌట్‌తో సైజ్ జీరోకు చేరుకున్న సంయుక్త మీనన్ స్టైలిష్, క్లాస్‌గా మెరిసిపోతున్న హన్సిక గ్లామర్ డోస్ పెంచేసిన 'గుప్పెడంత మనసు' జగతి మేడమ్ View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
బాడీ లుక్ మార్చేసిన సంయుక్త.. చీరలో నవ్వుతూ అనసూయ!
కొడుకులతో కలిసి సరదాగా అలా నయనతారటర్కీలో చిల్ అవుతున్న 'గుంటూరు కారం' మీనాక్షిచీరలో అందాలన్నీ చూపించేస్తున్న అనసూయజిమ్లో ఒంపుసొంపులతో హీరోయిన్ సంయుక్త మేనన్నవ్వుతూ మాయ చేస్తున్న 'సీతారామం' మృణాల్ ఠాకుర్చీరలో వయ్యారంగా తెలుగు బిగ్ బాస్ బ్యూటీ శుభశ్రీసీరియల్ బ్యూటీ జ్యోతిరాయ్ గ్లామర్ ట్రీట్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by SONIYA SINGH (@soniya_singh31) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Chaithra J Achar (@chaithra.j.achar) View this post on Instagram A post shared by Akhila Bhargavan (@akhilabhargavan) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) -
హీరోయిన్గా పొందిన ప్రేమను హ్యూమన్‌గా తిరిగి ఇస్తున్నా
పాలక్కాడ్ టు హైదరాబాద్... చెన్నై... ముంబై... సినిమా అనేది సంయుక్తను అన్ని రాష్ట్రాల్లోనూ పాపులర్ చేసింది. రీల్‌పై హీరోయిన్... రియల్‌గానూ అంతే... ఆపన్న హస్తం అందించడానికి వెనకాడరామె. 2018లో కేరళలో వరదలు సంభవించినప్పుడు స్వయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు సంయుక్త. తాజాగా వయనాడ్ బాధితులకు విరాళం ఇచ్చారు. ‘ఆది శక్తి’ పేరుతో సేవా సంస్థను ఆరంభించారు. తెలుగులో స్టార్ హీరోయిన్గా దూసుకెళుతున్న ఈ మలయాళ బ్యూటీ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ...→ కేరళలో పుట్టి పెరిగిన మీకు ఇప్పుడు వయనాడ్‌ని చూస్తుంటే బాధ అనిపించడం సహజం. వయనాడ్ ఎన్నిసార్లు వెళ్లారు? సంయుక్త: ఇప్పటివరకూ నేను ఒకే ఒక్కసారి వెళ్లాను. చాలా అందమైన ప్రదేశం. మంచి హిల్ స్టేషన్. హాయిగా గడపడానికి అక్కడికి వెళుతుంటారు. అలాంటి వయనాడ్ రూపు రేఖలు వర్షాల వల్ల మారి΄ోవడంతో బాధ అనిపించింది. ఇప్పుడు వయనాడ్ వెళదామనుకున్నాను కానీ సందర్శనలకు అనుమతి లేదు.→ వయనాడ్‌లో షూటింగ్స్ ఏమైనా చేశారా?ఆ అవకాశం ఇప్పటివరకూ రాలేదు. యాక్చువల్లీ అక్కడ వర్షాలప్పుడు నేను హైదరాబాద్‌లో ఉన్నాను. ప్రతి గంటకూ మా అమ్మగారు ఫోన్ చేసి, పరిస్థితులు చెప్పేవారు. ఆ బీభత్సం చూసి, ఆవిడైతే నాలుగైదు రోజులు నిద్ర΄ోలేదు. నిజానికి వయనాడ్‌కి ఏమైనా చేయమని అమ్మే చెప్పింది. నేనూ అదే అనుకున్నాను కాబట్టి వెంటనే విరాళం ఇచ్చాను. → ఆర్థిక సహాయమేనా? 2018 కేరళ వరదలప్పుడు స్వయంగా సహాయ కార్యక్రమాలు చేసినట్లు చేయాలనుకుంటున్నారా? ఇంకా చేయాలని ఉంది. కేరళలోని ఓ స్వచ్ఛంద సేవా సంస్థతో మాట్లాడాను. ఏం చేస్తే బాగుంటుందో వాళ్లు గ్రౌండ్ లెవల్లో స్టడీ చేస్తున్నారు. దాన్నిబట్టి సహాయ కార్యక్రమాలను ΄్లాన్ చేస్తాను.→ 2018లో చేసిన సేవా కార్యక్రమాల గురించి...2018లో కేరళ వరదలప్పుడు నేను చెన్నైలో ఇరుక్కు΄ోయాను. బాధితుల కోసం చాలా చిన్న స్థాయిలో ఓ కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేశాను. నేను ఊహించినదానికన్నా ఎక్కువ నిత్యావసర వస్తువులు రావడంతో పెద్ద గోడౌన్ తీసుకోవాల్సి వచ్చింది. వచ్చినవి వచ్చినట్లు సరఫరా చేశాం. ఇక కేరళ వెళ్లాక పాడై΄ోయిన ఇళ్లను బాగు చేసే కార్యక్రమంలో పాల్గొన్నాను. చెప్పలేనంత మట్టి పేరుకు΄ోవడంతో క్లీన్ చేయడానికి ఇబ్బందిపడ్డాం.→ సంయుక్తా మీనన్లోంచి ‘మీనన్’ ఎందుకు తీసేశారు? మా అమ్మానాన్న విడి΄ోయారు. అమ్మంటే నాకు చాలా ప్రేమ, గౌరవం. తన ఫీలింగ్స్‌ని గౌరవించి పేరులోంచి సర్ నేమ్ తీసేశాను. ఇంకో విషయం ఏంటంటే... నేను ఆడ.. మగ సమానం అని నమ్ముతాను. సర్ నేమ్ వద్దనుకోవడానికి అదో కారణం. → సింగిల్ పేరెంట్‌గా మీ అమ్మగారు మిమ్మల్ని పెంచారు కాబట్టి తండ్రి ప్రేమను మిస్సయిన ఫీలింగ్... యాక్చువల్లీ నాకు అమ్మానాన్న ఇద్దరి ప్రేమనీ పంచారు మా తాతగారు (సంయుక్త అమ్మ తండ్రి). నేను ఏం అడిగినా కాదని చెప్పలేనంత ప్రేమ మా తాతగారిది. అలాగని గుడ్డిగా ఓకే చెప్పలేదు. ఆయన బాధపడే పనులు చేయనని, అసలు తప్పు చేయనని నమ్మకం. అంత ప్రేమ పంచి, నమ్మకాన్ని పెంచుకున్న మా తాత నా ఫస్ట్ బాక్సాఫీస్ సక్సెస్‌ని చూడకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లి΄ోయారు. కానీ, ఎక్కడున్నా తన మనవరాలి విజయాన్ని చూస్తున్నారన్నది నా నమ్మకం.→ ‘స్వయంభూ’, హిందీ ‘మహారాజ్ఞి’ కోసం ఫైట్స్ కూడా నేర్చుకున్నారు... ఇప్పటివరకూ దాదాపు సున్నితమైన పాత్రల్లో కనిపించిన మీరు ఇప్పుడు పవర్‌ఫుల్‌గా కనిపించనున్నారన్న మాట... ‘స్వయంభూ’ కోసం గుర్రపు స్వారీ, ఫైట్స్‌లో శిక్షణ తీసుకున్నాను. అటు హిందీ ‘మహారాజ్ఞి’ కోసం కూడా యాక్షన్ నేర్చుకున్నాను. ఒకప్పుడు సినిమాలకు దూరంగా పారి΄ోవాలనుకున్న నేను ఇప్పుడు సినిమా కోసం ఏం నేర్చుకోవడానికైనా రెడీ అయి΄ోయాను. చేసే ప్రతి పాత్ర ఒకదానికి ఒకటి భిన్నంగా ఉండాలనుకుంటున్నాను. స్క్రీన్ మీద చూసి నాపై ప్రేమ పెంచుకున్న ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఎంతైనా కష్టపడొచ్చు. → ప్రేక్షకుల మీద ప్రేమతోనేనా ఈ సేవా కార్యక్రమాలు...అవును. పాలక్కాడ్‌లో మొదలై ఇతర రాష్ట్రాల్లో ఆదరణ పొందడం అంటే చిన్న విషయం కాదు. నటిగా నేను సక్సెస్ అయ్యానంటే అది నా విజయం కాదు. నన్ను ప్రేక్షకులే సక్సెస్ చేశారు. హీరోయిన్గా నేను పొందిన ప్రేమను హ్యూమన్‌గా తిరిగి ఇవ్వాలనుకున్నాను. ఏదైనా అర్థవంతంగా, ఉపయోగపడేది చేయాలన్నది నా సంకల్పం. అందుకే ‘ఆది శక్తి’ సేవా సంస్థ ఆరంభించాను. → కేరళ నుంచి నిత్యామీనన్, నయనతార, సమంత (సమంత అమ్మ మలయాళీ) వంటివారిని హైదరాబాద్ తీసుకొచ్చి స్టార్స్‌ని చేసింది టాలీవుడ్. ఇప్పుడు మీరు... మాలీవుడ్ అమ్మాయిలకు టాలీవుడ్ లక్కీ అనొచ్చా? ఒక్క మాలీవుడ్ ఏంటి? ఎవరికైనా ఆహ్వానం పలుకుతుంది టాలీవుడ్. సో.. మాకే కాదు అందరికీ లక్కీయే. ఇక్కడి ప్రేక్షకులు ఇష్టపడటం మొదలుపెట్టారంటే ఇక ఆ స్టార్‌ని ఎప్పటికీ ఇష్టపడతారు. అలాగే తెలుగు ఇండస్ట్రీ సినిమాని సెలబ్రేట్ చేస్తుంది. ఇంతగా ప్రేమించే తెలుగు పరిశ్రమలో భాగం కావడం హ్యాపీగా ఉంది. అందుకే కేరళ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. → మీ ‘ఆది శక్తి’ ఫౌండేషన్ గురించి క్లుప్తంగా... ఎవరికైనా సహాయం చేయాలంటే జస్ట్ డబ్బులు ఇచ్చేస్తే సరి΄ోదు. వాళ్లు జీవించినంత కాలం పనికొచ్చే సహాయం చేయాలి. నేను స్త్రీ సంక్షేమంపై దృష్టి పెట్టాను. చదువు, ఆరోగ్యం, ఉద్యోగం... వీటికి సంబంధించి సహాయం చేయాలన్నది నా ఆశయం. ముఖ్యంగా నేటి స్త్రీల మానసిక ఆరోగ్యం చాలా దెబ్బ తింటోంది. ఆ విషయం మీద వారిని ఎడ్యుకేట్ చేయాలి. నేను ‘ఆది శక్తి’ ఆరంభించే ముందు పలు స్వచ్ఛంద సేవా సంస్థలతో మాట్లాడాను. కొంత రిసెర్చ్ చేసి, అవగాహన తెచ్చుకుని ‘ఆది శక్తి’ ఆరంభించాను. – డి.జి. భవాని -
కరీంనగర్లో సందడి చేసిన సంయుక్త మీనన్, పాయల్ రాజ్‌పుత్ (ఫొటోలు)
-
Samyuktha Menon: శారీలో అలా.. హారంతో ఇలా.. బింబిసార హీరోయిన్ లుక్స్ చూశారా?
-
అలాంటి లుక్‌లో సంయుక్త మీనన్.. మెరిసిపోతున్న శివం భజే హీరోయిన్!
డిఫరెంట్ స్టైల్స్‌తో కనిపించిన యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ సెలూన్లో సందడి చేసిన బిగ్‌బాస్ దివి.. వైట్ శారీలో బుల్లితెర భామ మౌనీరాయ్... మెరిసిపోతున్న శివం భజే హీరోయిన్ దిగాంగన సూర్యవన్షి.. అలాంటి అవుట్‌ఫిట్‌లో సంయుక్త మీనన్ లుక్స్.. View this post on Instagram A post shared by Nikita Kapoor (@nikitashak) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Digangana Suryavanshi (@diganganasuryavanshi) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) -
హైదరాబాద్‌లో సంయుక్త మీనన్ డైమండ్ స్టోర్ ప్రారంభం (ఫొటోలు)
-
టాలీవుడ్లో వరుస హిట్స్.. అప్పుడే ఎంట్రీ ఇస్తోంది!
గతేడాది విరూపాక్ష, సర్ సినిమాలతో సూపర్‌హిట్స్ తన ఖాతాలో వేసుకున్న భామ సంయుక్త మీనన్. ప్రస్తుతం టాలీవుడ్ హీరో నిఖిల్ సరసన స్వయంభులో కనిపించనుంది. అంతే కాకుండా ఆ తర్వాత శర్వానంద్ కొత్త చిత్రంలోనూ హీరోయిన్గా నటించనుంది. ప్రస్తుతం టాలీవుడ్లో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ.. అప్పుడే బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది.కాజోల్, ప్రభుదేవా, నసీరుద్దీన్ షా కీ రోల్స్ చేయనున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు చరణ్ తేజ్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఆమె ఫస్ట్ హిందీ మూవీ కంటెండ్ బేస్ట్‌గా ఉండబోతోంది. త్వరలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ అనౌన్స్మెంట్ చేయనున్నట్లు లేటేస్ట్ టాక్. సర్ మూవీతో హిట్ కొట్టిన భామ.. వెంట వెంటనే అవకాశాలను కొల్లగొడుతోంది. -
టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త
తెలుగు సినిమాలపై స్టార్ హీరో సంయుక్త మేనన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక్కడ నటించాలంటే చాలా కష్టమని చెప్పింది. అలానే టాలీవుడ్లో తనకెదురైన కష్టాల్ని, అనుభవాల్ని బయటపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు చిత్రసీమపై తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసింది. అలానే మలయాళ ఇండస్ట్రీతో పోల్చి చూస్తే ఇక్కడ ఎలా ఉంటుందనేది కూడా చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరంటే?)'మలయాళంతో పోలిస్తే తెలుగు సినిమాల్లో నటించడం చాలా కష్టం. భాష రాకపోవడమనేది ఓ కారణమైతే.. మేకప్ మరో రీజన్. వినడానికి సిల్లీగా ఉన్నాసరే నా వరకు ఇది చాలా పెద్ద విషయం. మలయాళ చిత్రాల్లో మేకప్ త్వరగా అయిపోతుంది. చాలా నేచురల్‌గా వేస్తారు. యాక్టింగ్ కూడా మనకు నచ్చినట్లు చేసేయొచ్చు. కానీ టాలీవుడ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్క్రీన్‌పై ఎలా కనిపిస్తున్నామనేది ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. దానికి తోడు ఎక్కువ మేకప్ వేస్తారు. చాలా చిరాగ్గా.. ముఖంపై ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది' అని సంయుక్త తన కష్టాల్ని చెప్పుకొచ్చింది.2016లోనే నటిగా మారిన సంయుక్త మేనన్... తొలుత మలయాళ, తమిళ చిత్రాలు చేసింది. ఆ తర్వాత టాలీవుడ్లో అడుగు పెట్టింది. 'భీమ్లా నాయక్', 'బింబిసార', 'విరూపాక్ష', 'సర్' చిత్రాలతో వరస హిట్స్ కొట్టి గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. కానీ కల్యాణ్ రామ్ 'డెవిల్'తో ఫ్లాప్ అందుకుంది. ప్రస్తుతం నిఖిల్ 'స్వయంభు' మూవీతో పాటు శర్వానంద్, బెల్లంకొండ శ్రీనివాస్ చేయబోయే కొత్త చిత్రాల్లో నటిస్తోంది. అలానే హిందీలోకి కూడా అడుగుపెట్టాలని ప్లాన్స్ చేసుకుంటోంది.(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి పర్సనల్ వీడియో లీక్) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) -
ప్రముఖ దేవాలయంలో స్టార్ హీరోయిన్ సంయుక్త.. కారణం అదేనా?
హీరోయిన్లు హిట్ కొట్టడం కాస్త కష్టమైన విషయం. కానీ హీరోయిన్ సంయుక్త మేనన్ మాత్రం తెలుగులో వరస సినిమాలతో సక్సెస్ అందుకుంది. కానీ ఇప్పుడు కొత్తగా మూవీస్ ఏం చేయట్లేదు. దానికి కారణమేంటి తెలియదు గానీ సడన్‌గా ఈ మధ్య దేవాలయాలని సందర్శిస్తూ కనిపించింది. అయితే అసలు ఇలా ఎందుకు చేస్తుంది? ఏంటనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: సీతగా సాయిపల్లవి.. ఎంత ముద్దుగా ఉందో? ఫొటోలు వైరల్)మలయాళ బ్యూటీ సంయుక్త మేనన్.. 2016లోనే నటిగా ఇండస్ట్రీలోకి వచ్చింది. 2022లో 'భీమ్లా నాయక్' మూవీతో తెలుగులోకి అడుగుపెట్టింది. బింబిసార, సర్, విరూపాక్ష చిత్రాలతో వరసగా హిట్స్ కొట్టింది. కానీ గతేడాది వచ్చిన 'డెవిల్' మూవీతో ఈమెకు దెబ్బపడింది. ఈ సినిమా వచ్చి నాలుగు నెలలు పైనే అవుతున్న కొత్త ప్రాజెక్టులైతే ఒప్పుకోలేదు.కొన్నిరోజుల ముందు తిరుపతిలో కనిపించిన సంయుక్త.. ఇప్పుడు అసోంలోని ప్రముఖమైన కామాఖ్య దేవాలయంలో కనిపించింది. అయితే ఈ గుడికి పెళ్లి కావాల్సిన అమ్మాయిలు, పెళ్లయిన తర్వాత పిల్లలు కోసం చూసే తల్లులు మాత్రమే ఇక్కడికి వెళ్తుంటారు. దీంతో సంయుక్త పెళ్లి కావాలని ఏమైనా వెళ్లిందా అని మాట్లాడుకుంటున్నారు. అలానే బాలీవుడ్‌కి వెళ్లే ప్రయత్నాల్లో ఉందని, అందుకే ఈ గుడికి వెళ్లిందని మరో కామెంట్ కూడా వినిపిస్తుంది. ఇన్నాళ్లు సినిమాలు అంటూ తిరిగిన సంయుక్త ఇలా పూజలు, భక్తి మోడ్ లోకి మారిపోవడం చూసిన ఆమె ఫ్యాన్స్.. ఇలా మారిపోయిందేంటి అని అనుకుంటున్నారు. అసలు నిజమేంటనేది సంయుక్తనే చెప్పాలి.(ఇదీ చదవండి: 'ఫ్యామిలీ స్టార్' పరువు తీస్తున్న దోశ.. ఆ వార్నింగ్ సీన్ కూడా!) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) -
Samyuktha Menon: తిరుమలలో విరూపాక్ష హీరోయిన్.. కాలినడకన స్వామివారి దర్శనం(ఫోటోలు)
-
కర్నూలులో సినీ నటి సంయుక్త మీనన్ సందడి (ఫొటోలు)
-
జోర్డాన్‌లో అందాల భామ మానుషి చిల్లర్.. శారీలో సంయుక్త మీనన్ పోజులు!
జోర్డాన్‌లో ఆపరేషన్ వాలైంటైన్ భామ మానుషి చిల్లర్.. శారీలో సంయుక్త మీనన్ హోయలు.. వైట్ డ్రెస్‌లో దిశా పటానీ స్టన్నింగ్ పోజులు.. బ్లాక్ డ్రెస్‌లో మంచు లక్ష్మి లుక్స్ View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) -
Realme 12 సిరీస్ 5G ను అన్ బాక్స్ చేసిన సంయుక్త మీనన్ (ఫొటోలు)
-
గామా అవార్డ్స్ మెరిసిన తారలు (ఫొటోలు)
-
'నా జీవితమంతా సాహసాలే'.. ఆ సినిమా కోసం మరో డేరింగ్ చేస్తోన్న హీరోయిన్!
భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సంయుక్తా మీనన్. ఆ తర్వాత బింబిసారతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. గతేడాది విరూపాక్ష, డెవిల్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. అంతే కాకుండా ధనుశ్ సరసన సార్ చిత్రంలోనూ మెరిసింది. వరుసగా అవకాశాలతో సూపర్ హిట్స్ కొడుతోంది. తాజాగా ఈ బింబిసార ఫేమ్ యంగ్ హీరో నిఖిల్ చిత్రంలో నటిస్తోంది. నిఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న స్వయంభు చిత్రంలో కనిపించనుంది. అయితే తాజాగా సంయుక్త పోస్ట్ చేసిన ఓ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలేంటో చూద్దాం. తాజాగా ఈ కేరళ భామ గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోను ట్విటర్లో షేర్ చేసింది. అంతే కాకుండా సుదీర్ఘమైన సందేశం కూడా రాసుకొచ్చింది. ఈ ఏడాదిలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని తెలిపింది. నా జీవితమంతా ఎల్లప్పుడూ సాహసాలతోనే కొనసాగుతోందని.. తాను ఎప్పటికీ కంఫర్ట్ జోన్లో ఉండేందుకు ఇష్టపడనని వెల్లడించింది. జీవితంలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతానని తెలిపింది. నా నెక్ట్స్ మూవీ స్వయంభూ కోసమే ఇప్పుడు హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నానని రాసుకొచ్చింది ముద్దుగుమ్మ. సంయుక్త ట్వీట్లో రాస్తూ.. 'ఈ ఏడాదిలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూ జీవితం అంటే ఏంటో తెలుసుకుంటున్నా. నా జీవితమంతా సాహసాలతోనే నడుస్తోంది. కంఫర్ట్ జోన్లో ఉండిపోవడాన్ని ఇష్టపడను. నా కొత్త సినిమా స్వయంభు కోసం హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నా. ఇది నాకు కొత్త మానసిక అనుభూతిని కలిగిలిస్తోంది. ఇది నాకు లభించిన అదృష్టం కూడా. ఇది ఒక ఆధ్యాత్మిక, సుసంపన్నమైన ప్రయాణం. గుర్రంతో సామరస్యంగా ఉంటూ.. గుర్రం మనసును దగ్గర నుంచి పరిశీలించడం.. మేమంతా ఒక టీమ్‌గా కలిసి పని చేయడం చాలా అద్భుతంగా ఉంది. అలాగే నా జీవితంలో ఎదురైన ప్రతి ఓటమిని ఒక మెట్టుగా మలచుకుంటున్నా. అలాంటివేమీ నా జీవితంలో అడ్డంకి కాదు.' అంటూ పోస్ట్ చేసింది. 2024 embarked with a lot of learning about myself and about many things that makes life what it truly is. I have always been game for adventures in life. I never had a comfort zone because I always pushed myself to explore newer experiences 💫 As an actor, I am blessed to be… pic.twitter.com/lcW1nhNnY7 — Samyuktha (@iamsamyuktha_) February 10, 2024 -
Swayambhu: హనుమాన్ భక్తుడిగా నిఖిల్!
నిఖిల్ హీరోగా నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు.‘స్వయంభూ’ సినిమా అప్డేట్ను షేర్ చేశారు నిఖిల్. ‘‘నాన్‌స్టాప్‌గా మా సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో నేను హనుమాన్ భక్తుడి పాత్రలో నటిస్తున్నాను. ఈ సినిమాలో నా ఫేవరెట్ డైలాగ్ జై శ్రీరామ్. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నాం. దసరా లేదా దీపావళికి ఈ సినిమాను విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నాం’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు నిఖిల్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. #Swayambhu shooting in full swing with key sequences being shot 💥💥@actor_Nikhil will be seen as a devotee of Lord Hanuman in the film ❤️🔥@iamsamyuktha_ @krishbharat20 @RaviBasrur @manojdft @TagoreMadhu @bhuvan_sagar @PixelStudiosoff @TimesMusicHub @jungleemusicSTH pic.twitter.com/rMyTKrghZJ — Kakinada Talkies (@Kkdtalkies) January 16, 2024 -
వరుస హిట్స్‌తో జోరు చూపిస్తున్న సంయుక్త మీనన్
బ్యూటీ విత్ టాలెంట్ అనే గుర్తింపు మలయాళ హీరోయిన్స్ కు ఉంది. వారి లెగసీని టాలీవుడ్ లో కొనసాగిస్తోంది హీరోయిన్ సంయుక్తా మీనన్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ హీరోయిన్...ఐదు వరుస సూపర్ హిట్ సినిమాలతో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారింది. భీమ్లా నాయక్ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ సరసన బింబిసార, ధనుష్ తో కలిసి సార్, సాయి ధరమ్ తేజ్ జోడీగా విరూపాక్ష మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకుంది. రీసెంట్ గా కల్యాణ్ రామ్ డెవిల్ తో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్..ఇలా సంయుక్తా చేసిన ప్రతి సినిమాలోనూ ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. చేసిన ప్రతి సినిమా సక్సెస్ కావడంతో సంయుక్తా ఉంటే సినిమాకు ఒక పాజిటివ్ వైబ్, క్రేజ్ ఉంటుందనే పేరు టాలీవుడ్ దర్శక నిర్మాతలు, హీరోల్లో వచ్చేసింది. కంటిన్యూగా వస్తున్న సక్సెస్ తో సంయుక్తా మీనన్ కు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ దక్కుతున్నాయి. ప్రస్తుతం ఆమె నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభులో నాయికగా నటిస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమ తన ప్రతిభను గుర్తించి అందిస్తున్న అవకాశాలు, ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానం ఎంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తున్నాయని చెబుతోంది సంయుక్తా మీనన్. మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ తో నటిగా పేరు తెచ్చుకోవాలని ఉందని అంటోంది. -
టాలీవుడ్ లక్కీ హీరోయిన్ పెళ్లి చేసుకోనుందా? అందుకే ఇలా!
మరో తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ అయిందా? అంటే అవుననే టాక్ గట్టిగా వినిపిస్తుంది. దీనికి తగ్గ లాజిక్స్ కూడా చెబుతున్నారు. త్వరలోనే ఈ యంగ్ సెన్సేషనల్ బ్యూటీ.. వివాహం జరిగే అవకాశముందని తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఈ న్యూస్ ఆమె ఫ్యాన్స్ చెవిలో పడింది. దీంతో వాళ్లు తెగ బాధపడిపోతున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీ? అసలెందుకు పెళ్లి రూమర్స్ వచ్చాయి? మలయాళ బ్యూటీ సంయుక్త మేనన్.. మిగతా భాషల్లో ఏం సినిమాలు చేసిందనేది పక్కనబెడితే తెలుగులో మాత్రం లక్కీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఎందుకంటే తొలి మూవీ 'భీమ్లా నాయక్', బింబిసార, సార్, విరూపాక్ష.. ఇలా వరసగా నాలుగు సినిమాలతో హిట్ కొట్టింది. దీంతో టాలీవుడ్ అదృష్ట కథానాయిక అనిపించుకుంది. తాజాగా 'డెవిల్' సినిమాతో వచ్చింది. కాకపోతే ఇదైతే హిట్ అనిపించుకోలేదు. (ఇదీ చదవండి: 'జెర్సీ' హీరోయిన్ పచ్చబొట్టు కహానీ.. 18 ఏళ్లప్పుడు ప్రేమ.. అందుకే ఇప్పటికీ!) ఇకపోతే ఈ ఏడాది నాలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించిన సంయుక్త మేనన్.. కొత్తగా ఒక్కటంటే ఒక్క సినిమా ఒప్పుకోలేదట. తెలుగులో మాత్రమే కాదు తమిళ, మలయాళ.. ఇలా ఏ భాషా మూవీలోనూ నటించట్లేదు. ప్రస్తుతానికైతే ఆమె నటిస్తున్నట్లు ఎక్కడా క్లారిటీ లేదు. అయితే 2024లో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిందని, అందుకే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదని అంటున్నారు. సంయుక్త మేనన్ ప్రస్తుత వయసు 28 ఏళ్లు. మరీ ఇంత చిన్న వయసులో పెళ్లి చేసేసుకుంటుందా? ఆమె మ్యారేజ్ నిజం కాదని కొందరు అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏంటనేది స్వయంగా సంయుక్త స్పందిస్తే తప్ప క్లారిటీ రాదు. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ చేసుకున్న 'దసరా' విలన్.. అమ్మాయి ఎవరో తెలుసా?) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) -
కళ్యాణ్ రామ్ సంయుక్త మీనన్ ర్యాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ
-
రామ్ చరణ్ పేరు ఎత్తగానే కళ్యాణ్ రామ్ రియాక్షన్ చూడండి
-
అమెరికాలో జాబ్ చేసుకునే వాడిని సినిమాల్లోకి ఎందుకు వచ్చానంటే..!
-
Devil Movie Review: డెవిల్ మూవీ రివ్యూ
టైటిల్: డెవిల్ నటీనటులు: కల్యాణ్ రామ్, సంయుక్త మీనన్, మాళవిక నాయర్, సంయుక్త మీనన్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్, సత్య, ఎస్తర్ నోరోన్హా నిర్మాణ సంస్థ: అభిషేక్ పిక్చర్స్ కథ-మాటలు: శ్రీకాంత్ విస్సా దర్శకత్వం: అభిషేక్ నామా సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్. ఎస్ ఎడిటర్: తమ్మిరాజు విడుదల తేది: డిసెంబర్ 29,2023 కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1945లో సాగుతుంది.స్వాతంత్రం కోసం పని చేస్తున్న ఆజాద్ హింద్ ఫౌజ్ చీఫ్ సుభాష్ చంద్రబోస్ ఇండియాకు వస్తున్నట్లు తన అనుచరులకు తెలియజేస్తాడు. తన ఎక్కడ ల్యాండ్ అవ్వాలనేది కోడ్ రూపంలో తెలియజేయాలని తన ముఖ్య అనుచరుడు త్రివర్ణకు లేఖ ద్వారా తెలియజేస్తారు. చంద్రబోస్ ఇండియాకు వస్తున్నట్లు తెలుసుకున్న బ్రిటీష్ ఆర్మీ.. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. అదే సమయంలో మద్రాసు ప్రెసిడెన్సీలోని రాసపాడు జమీందారు కూతురు విజయ(అభిరామి) హత్య జరుగుతుంది. ఈ కేసు విచారణ బాధ్యతలను బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (కల్యాణ్ రామ్)కు అప్పజెప్పుతారు. డెవిల్కి విజయ కజిన్ నైషేద(సంయుక్త మీనన్)పై అనుమానం కలుగుతుంది. ఆమెతో ప్రేమలో పడినట్లు నటించి అసలు విషయం తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. బోస్‌ను పట్టుకునే ఆపరేషన్‌కు ఈ కేసుతో ఉన్న సంబంధం ఏంటి? బోస్ ముఖ్య అనుచరుడు త్రివర్ణ ఎవరు? బోస్ ఇండియాకు వస్తున్నట్లు బ్రిటీష్ సైన్యానికి ఎలా తెలిసింది? నైషేదను రహస్యంగా కలుస్తున్న వ్యక్తి ఎవరు? ఈ కథలో మాళవిక నాయర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. డెవిల్ కథ, కథనం రెండూ పాతవే. హీరో సీక్రెట్ ఏజెంట్‌గా ఉండి ఓ ఆపరేషన్‌లో పాల్గొనడం.. అతను తన ఒరిజినాలిటీ కప్పిపుచ్చి మరోలా నటించడం.. ప్రీక్లైమాక్స్ అసలు విషయం తెలియడం.. ఆ తర్వాత ఓ భారీ ఫైట్.. శుభం కార్డు.. ఈ తరహా కథలు తెలుగులో చాలానే వచ్చాయి. డెవిల్ కథ కూడా అదే. కాకపోతే సుభాష్ చంద్రబోస్ చుట్ట కథను నడిపించడం ఈ సినిమాకు ఉన్న ప్రత్యేకత. కథనం మాత్రం కొత్త సీసాలో పాత సారానే అన్నట్లుగా సాగుతుంది. ఊపిరి బిగపట్టుకొని చూసే సన్నివేశాలను సైతం చాలా సింపుల్‌గా తెరకెక్కించారు. సుభాష్ చంద్రబోస్ పాయింట్‌తో కథను చాలా ఆసక్తికరంగా ప్రారంభించారు. ఆ తర్వాత కథంతా జమీందారు కూతురు హత్య చుట్టూ తిరుగుతుంది. ఆ హత్య ఎవరు చేశారనేది సస్పెన్స్‌లో పెట్టి ప్రతి పాత్రపై అనుమానం కలిగేలా కథనాన్ని నడిపించాడు దర్శకుడు. అయితే ఈ క్రమంలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కహనీ మాత్రం కథను పక్కదోవ పట్టించడమే కాకుండా.. నీరసంగా సాగుతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్ బాగుటుంది. అలాగే అక్కడ ట్విస్ట్ రివీల్ చేసి ద్వితియార్థంపై ఆసక్తి కలిగించేలా చేశారు. సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు బాగుంటాయి. అయితే ఈ తరహా ట్విస్టులు గతంలో చాలా సినిమాల్లో చూశాం. ఇక అసలు ట్విస్ట్ రివీల్ అయ్యాక కథపై ఆసక్తి పూర్తిగా సన్నగిల్లుతుంది. క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఈజీగా అర్థమైపోతుంది. ఇక చివర్లో హీరో చేసే యాక్షన్ సీన్ మరింత బోరింగ్ అనిపిస్తుంది. వీఎఫ్ఎక్స్ మరింత పేలవంగా ఉన్నాయి. ఈ సినిమా దర్శకుడు మారడం.. చివరకు అభిషేక్ నామానే ఆ బాధ్యతలు తీసుకొని తెరకెక్కించాడు. అయితే నిర్మాతగా ఆయన సినిమాను రిచ్‌గా తెరకెక్కించగలిగాడే తప్ప.. దర్శకుడిగా మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. ఎవరెలా చేశారంటే.. కల్యాణ్ రామ్ నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకోవడమే కాదు.. ఆ పాత్రల్లో జీవిస్తాడు కూడా. నెగెటివ్ షేడ్స్ ఉన్న డెవిల్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. యాక్షన్ సీన్స్ తెరకెక్కించిన విధానం బాగోలేదు కానీ కల్యాణ్ రామ్ ఉన్నంతలో చక్కగా నటించాడు. నైషేదగా సంయుక్త మీనన్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. ఇక మాళవిక నాయర్‌కి ఈ చిత్రంలో మంచి పాత్ర లభించింది. ఆమె నిడివి తక్కువే అయినా..గుర్తిండిపోయే పాత్ర తనది. శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్, సత్య, ఎస్తర్ నోరోన్హా, సెఫీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథకి స్పీడ్ బ్రేకర్లుగా అడ్డు తగులుతాయే తప్ప ఆకట్టుకునేలా లేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. ద్వితియార్థంలో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
Devil Twitter X Review: ‘డెవిల్’ ట్విటర్ రివ్యూ
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డెవిల్’. అభిషేక్ పిక్చర్స్‌ఫై అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది. సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంపై మొదట్లో భారీ అంచనాలేమీ లేవు కానీ.. ప్రచార చిత్రాలు విడుదలైన తర్వాత సినిమాపై ఆసక్తి పెరిగింది. ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 29) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్లు ఫస్ట్ డే ఫస్ట్‌షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. డెవిల్ ఎలా ఉంది? కల్యాణ్ రామ్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర విషయాలు ట్విటర్(ఎక్స్)వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. డెవిల్ చిత్రానికి ఎక్స్‌లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా బాగుందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. కల్యాణ్ రామ్ వన్‌మ్యాన్ షో అని చెబుతున్నారు. అదే సమయంలో వీఎఫ్ఎక్స్ విషయంలో చిత్ర బృందం మరింత జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేదని కామెంట్ చేస్తున్నారు. #Devil review : Decent First half with Good interval block👌 Very good second half with good twist and turns 💥💥 Hituuuuuu bommmaaaaaaa👌 3.5/5 — Chennai Tarak (@chennaitarak) December 29, 2023 ఫస్టాఫ్ బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. సెకండాఫ్‌లో వచ్చే మలుపులు, ట్విస్టులు ఆకట్టుకున్నాయంటూ ఓ నెటిజన్ 3.5 రేటింగ్ ఇచ్చాడు. #Devil Review: 2.75/5 Average 1st Half ,Decent 2nd Half👍 Slow Screenplay, seems dragged at times BGM is Good👍@NANDAMURIKALYAN acting 👍 Songs are okay, few twists worked. Overall An Average Movie. Can give it a try for its setup and visuals#Devara #Salaar #GunturKaaram pic.twitter.com/mCHfwT4zG8 — GS (@Thanks2Cinema) December 28, 2023 ఫస్టాఫ్ యావరేజ్, సెకండాఫ్ డీసెకంట్, స్లో స్క్రీన్‌ప్లే, కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. బీజీఎం అదిరిపోయింది. కల్యాణ్ రామ్ యాక్టింగ్ బాగుంది అంటూ మరో నెటిజన్ 2.75/5 రేటింగ్ ఇచ్చాడు. Slow paced with good interval...Few scenes are boring 🥱....Bad screenplay, director has good stry but unable to potray..May be because of last moment director changes..#Devil — karthik (@karthik170920) December 28, 2023 Good 1st Half 👍 Good story point A Bit slow to takeoff but Gripped well and maintained intriguingly well Perfect blend of Commercial elements and investigative narration Bgm👍 Interval bang is good Vfx could have been much better #Devil — PKC (@PKC997) December 28, 2023 #Devil First Half : “DECODING BEGINS” 👉INTERESTING FIRST HALF WITH GOOD INTERVAL BLOCK 👉@NANDAMURIKALYAN Excellent Performance with Extraordinary Production Values 👉#HarshavardhanRameshwar impresses with his BGM#DevilReview #NandamuriKalyanRam — PaniPuri (@THEPANIPURI) December 29, 2023 ' -
కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ స్పెషల్ ఇంటర్వ్యూ
-
ప్రభాస్ 'స్పిరిట్' సినిమా ఛాన్స్ నాకే దక్కింది: మ్యూజిక్ డైరెక్టర్
కల్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ‘డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’. సంయుక్తా మీనన్ హీరోయిన్గా, మరో హీరోయిన్ మాళవికా నాయర్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల 29న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో ఈ చిత్రసంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ మాట్లాడుతూ– ‘‘డెవిల్’ సినిమాలో మూడు పాటలు ఉన్నాయి. ఇది పీరియాడికల్ ఫిల్మ్ కాబట్టి ప్రత్యేక వాయిద్యాలను వాడాం. ‘దూరమే..’ పాటను బుడాపెస్ట్‌లో షూట్ చేశాం. అలాగే ‘దిస్ ఈజ్ లేడీ రోజ్..’ పాటను ర్యాపర్ రాజకుమారితో పాడించాం. ఈ పాట సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. అలాగే నేపథ్య సంగీతం చాలా బాగుంటుంది. అయితే సంగీత దర్శకులు, నటీనటులు ఎంత ఎఫర్ట్ పెట్టినా విజువల్ సపోర్ట్ ఉండాలి. ఈ విషయంలో ఈ చిత్రం కెమెరామేన్ సౌందర్ రాజన్‌గారు ప్రాణం పెట్టి అద్భుతంగా వర్క్ చేశారు. సెకండాఫ్‌లోని ఓ ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్‌లో కల్యాణ్‌రామ్ గారి నట విశ్వరూపాన్ని ఆడియన్స్ చూస్తారు. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డులు రావొచ్చని నాకనిపిస్తోంది’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘భవిష్యత్‌లో డైరెక్షన్ చేసే అవకాశం ఉంది. ఇద్దరు గిటారిస్ట్స్ మాత్రమే ఉండేలా ఓ సినిమా, డ్రమ్స్ శివమణిగారి బయోపిక్ తీయాలని ఉంది. ‘యానిమల్’ తర్వాత బాలీవుడ్లో చాలా అవకాశాలు వస్తున్నాయి. అవి చర్చల దశలో ఉన్నాయి. ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా గారు చేయనున్న ‘స్పిరిట్’ సినిమాకు సంగీతం అందించనున్నాను’’ అన్నారు. -
డెవిల్ ట్రైలర్లో సంయుక్త మీనన్ స్పీచ్
-
రాజకీయ నాయకురాలు మణి మేకల
మణి మేకల పవర్ఫుల్ రాజకీయ నాయకురాలు. ఆమె ప్రసంగాలు ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తాయి. మరి.. ఆ రాజకీయ నాయకురాలికి, బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌కి ఉన్న లింక్ ఏంటి? అనేది ‘డెవిల్’ చిత్రంలో చూడాల్సిందే. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో ఓ రహస్యాన్ని ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్నారు. పొలిటీషియన్ మణి మేకల పాత్రను మాళవికా నాయర్ పోషిస్తున్నారు. ఆదివారం మాళవిక లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో కథానాయికగా సంయుక్తా మీనన్ నటిస్తున్నారు. నవంబర్ 24న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘డెవిల్’ రిలీజ్ కానుంది. దేవాన్‡్ష నామా సమర్పణలో స్వీయ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, కెమెరా: సౌందర్ రాజన్. -
‘డెవిల్’ పాట కోసం విదేశీ వాయిద్యాలు..స్పెషలేంటి?
ఫలితాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలు, విలక్షణమైన పాత్రలను పోషిస్తూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు నందమూరి హీరో కల్యాణ్ రామ్. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఇటీవల ‘మాయే చేసే..’పాటను రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. డెవిల్ చిత్రం 1940లోని మదరాసి ప్రెసిడెన్సీ నేపథ్యంలో సాగుతుంది. అంటే స్వాతంత్ర్యం రాక ముందు ఉన్న బ్యాక్ డ్రాప్‌తో డెవిల్ సినిమాను తెరకెక్కించారు. సన్నివేశాలు, పాటలను కూడా అలాగే చిత్రీకరించారు. కాస్ట్యూమ్స్, బ్యాగ్రౌండ్ ఇలా ప్రతీ విషయంలో మేకర్స్ పలు జాగ్రత్తలను తీసుకున్నారు. నాటి కాలాన్ని, నాటి సంగీతాన్ని తెరపై చూపించే క్రమంలో దర్శక నిర్మాత అభిషేక్ నామా దక్షిణ భారత దేశపు సహజమైన లొకేషన్లను ఎంచుకున్నారు. కారైకుడిలోని ప్యాలెస్‌లో ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటలో విదేశీ వాయిద్యాలు వాడారట. దక్షిణాఫ్రికా నుంచి జెంబో, బొంగొ, డీజెంబోలు.. మలేసియా నుంచి డఫ్ డ్రమ్స్.. చైనా నుంచి మౌత్ ఆర్గాన్, దర్భుకా.. దుబాయ్ నుంచి ఓషియన్ పర్క్యూషన్, సింగపూర్ నుంచి ఫైబర్ కాంగో డ్రమ్స్, వెస్ట్ ఆఫ్రికా నుంచి హవర్ గ్లాస్, షేప్డ్ టాకింగ్ డ్రమ్ ఇలా రకరకాల వాయిద్యాలను ఈ పాటలో వాడారు. వీటి వాడకంతోనే శ్రోతలను నాటి కాలానికి, వింటేజ్ మూడ్‌లోకి తీసుకెళ్లేలా చేయాయని చిత్ర యూనిట్ పేర్కొంది. నవంబర్ 24న ఈ చిత్రం విడుదల కానుంది. -
డెవిల్స్ ఏంజిల్
కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డెవిల్’. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్. సోమవారం (సెప్టెంబర్ 11) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘డెవిల్’ చిత్రంలో సంయుక్త పోషించిన నైషధ పాత్ర ఫస్ట్ లుక్‌పోస్టర్‌ను ‘డెవిల్స్ ఏంజిల్’ అంటూ మేకర్స్ విడుదల చేశారు. ‘‘తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను నవంబర్ 24న విడుదల చేస్తాం’’ అన్నారు అభిషేక్ నామా. -
గూఢచారి 111
‘వెన్నెల’ కిశోర్, సంయుక్తా విశ్వనాథన్ హీరో హీరోయిన్లుగా, మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్న స్పై యాక్షన్ కామెడీ ఫిల్మ్ ‘చారి 111’. టీజీ కీర్తీకుమార్ దర్శకత్వంలో అదితీ సోనీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమాను ప్రకటించడంతో పాటు, కాన్సెప్ట్ టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా టీజీ కీర్తీ కుమార్ మాట్లాడుతూ– ‘‘ఓ సిటీలో జరిగే అనుమానాస్పద ఘటనలను చేధించే రహస్య గూఢచారి పాత్రలో ‘వెన్నెల’ కిశోర్ కనిపిస్తారు. అలాగే ఆయన పాత్రలో ఓ కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం వినోదభరితంగా ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘స్పై జానర్లో ‘చారి 111’ కొత్తగా ఉంటుంది. కథలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. షూటింగ్ జరుగుతోంది’’ అన్నారు అదితీ సోనీ. ఈ చిత్రానికి సంగీతం: సైమన్ కె. కింగ్. -
ఈ హీరోయిన్లకు అదృష్టం లేదా?
చిత్రపరిశ్రమలో విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చినా కొంతమందికి అవకాశాలు రావు. మరికొంతమందికి వరుస ఫ్లాప్‌లు వచ్చిన క్రేజీ ఆఫర్స్ వరిస్తుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇలాంటి బాగా జరుగుతుంటాయి. సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ హీరోకి వెళ్తుంది. ఫ్లాప్ అయితే మాత్రం ఆ భారం హీరోయిన్ మోయాల్సి వస్తుంది. ఒకటి, రెండు చిత్రాలు హిట్ కాకపోతే చాలు ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా పక్కన పెట్టేస్తారు. పోనీ హిట్ ఇచ్చినా అవకాశాలు ఇస్తారా అంటే అదీ లేదు. టాలీవుడ్లో వరుస హిట్స్ ఇచ్చిన ఈ హీరోయిన్లకు ఇప్పటికీ సినిమా ఛాన్స్‌లు రావడం లేదు. పాన్ ఇండియా హిట్...బట్ నో చాన్స్ ‘కేజీయఫ్’ చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తుంపు తెచ్చుకుంది శ్రీనిధి శెట్టి. ప్రశాంత్ నీల్-యష్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. అలాగే ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన కేజీయఫ్ 2 కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ రెండు చిత్రాలలో శ్రీనిధి పెర్ఫామెన్స్ కూ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. తన అందాలకు ముగ్దులయ్యారు. వరుస సినిమాల అవకాశాలు వస్తాయని అంతా భావించారు.కానీ ఈ భామకు కేజీయఫ్ 2 తర్వాత ఆ స్థాయిలో ఒక్క పెద్ద సినిమా కూడా రాలేదు. తమిళ స్టార్ చియాన్ విక్రమ్ సరసన ‘కోబ్రా’లో మెరిసింది. ఆ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక నెక్ట్స్ సినిమాలతోనైనా అలరిస్తుందని ఫ్యాన్స్ భావించారు. కానీ ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికీ ఆఫర్లే అందకపోవడం గమనార్హం. ‘అఖండ’విజయం కానీ.. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన కంచె సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయింది ప్రగ్యా జైస్వాల్ .ఆ సినిమా లో తన క్యూట్ లుక్ తో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.అయితే ఆ సినిమా తరువాత ఎన్ని సినిమాల లో నటించినా అవి అంతగా ఆకట్టుకోలేక పోయాయి. చాలా కాలం తర్వాత ‘అఖండ’తో భారీ విజయం సాధించింది. బోయపాటి-బాలయ్య కాంబోలో వచ్చిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ కలెక్టర్‌గా నటించింది. తన గ్లామర్ తో ఆకట్టుకుంటూనే అద్భుతంగా నటించి అందరినీ మెప్పించింది.అయితే అఖండ సినిమా తరువాత ఈ భామ కు స్టార్ హీరోల సరసన అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఈ భామకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్.. అయినా కూడా.. భీమ్లానాయక్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచమైంది సంయుక్త మీనన్. ఈ మూవీలో రానాకు జోడీగా నటించింది. తర్వాత కల్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమాలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టింది. ఆ వెంటనే ధనుష్‌తో కలిసి ‘సార్’ మూవీలో నటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది. ఇక ఈ మధ్య మెగా హీరో సాయితేజ్‌తో కలిసి ‘విరూపాక్ష’లో నటించగా.. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇలా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న సంయుక్తకు మొన్నటి వరకు సినిమా అవకాశాలు రాలేదు. ఇప్పుడు నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘స్వయంభూ’లో లీడింగ్ హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది. వీళ్లే కాదు.. దసరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కీర్తి సురేశ్‌కు, బేబీ లాంటి సూపర్ హిట్ తర్వాత వైష్ణవికి కూడా సరైన ఆఫర్లు రాలేవు. వీరిద్దరు హీరోయిన్లుగా కమిట్ అయినా చిత్రాలే లేవు. అన్ని ఉన్నా అదృష్టం లేకపోతే ఏది దక్కదంటారు. మరి ఆ అదృష్టం ఈ అందగత్తెలకు ఎప్పుడు వస్తుందో చూడాలి. -
కల్యాణ్ రామ్ 'డెవిల్' గ్లింప్స్ రిలీజ్.. కానీ డైరెక్టర్ మిస్సింగ్!
నందమూరి కల్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'డెవిల్'. 'ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్' అనేది ఉపశీర్షిక. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. జూన్ 05న నందమూరి కల్యాణ్ రామ్ బర్త్‌డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. (ఇది చదవండి: అటు మాజీభార్య ఇటు ప్రేయసి.. మధ్యలో ఆమిర్‌ఖాన్!) అయితే బింబిసారతో సూపర్ హిట్ కొట్టిన కల్యాణ్ రామ్‌కు.. అమిగోస్ రూపంలో డిజాస్టర్ ఎదురైంది. దీంతో ప్రస్తుతం కల్యాణ్ రామ్ కాస్తా డిఫరెంట్ స్టోరీతో అభిమానుల ముందుకొస్తున్నారు. నటిస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఈసారి మాత్రం మరో వైవిధ్యమైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని కళ్యాణ్ రామ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో బింబిసార కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. గ్లింప్స్ చూస్తే స్టోరీ మొత్తం బ్రిటీష్ కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ గ్లింప్స్‌లో 'మనసులో ఉన్న భావన ముఖంలో తెలియకూడదు.. మెదడులో ఉన్న ఆలోచన మాటల్లో బయటపడకూడదు. అదే గూఢచారికి ఉండాల్సిన ముఖ్య లక్షణం.' అనే డైలాగ్ ఈ చిత్రంపై అభిమానుల్లో మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. అయితే గ్లింప్స్ వీడియోలో డైరెక్టర్ పేరు ఎక్కడా కూడా కనిపించకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. పోస్టర్లో కానీ.. వీడియోలో కానీ డైరెక్టర్ పేరు కనిపించలేదు. అయితే దీనికి కారణాలేంటనే విషయంపై ఫ్యాన్స్ తెగ చర్చిస్తున్నారు. (ఇది చదవండి: అభిమానుల్ని మోసం చేస్తున్న స్టార్ హీరోలు!) -
అదిరిపోయే ఫోజులతో సంయుక్త మీనన్ (ఫొటోలు)
-
ఇప్పుడే పరిచయమే...
శివ కందుకూరి హీరోగా, మేఘా ఆకాష్, ప్రగతి శ్రీవాస్తవ్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మను చరిత్ర’. ఈ మూవీతో భరత్ పెదగాని దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రొద్దుటూరు టాకీస్ పతాకంపై ఎన్.శ్రీనివాస రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఇప్పుడే పరిచయమే...’ పాటని హీరోయిన్ సంయుక్త మీనన్ లాంచ్ చేశారు. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, ఆర్మాన్ మాలిక్ పాడారు. -
సింకో గోల్డ్, డైమండ్ షోరుమ్ ను ప్రారంభించిన సంయుక్త మీనన్
-
ఓటీటీలోకి వచ్చేసిన 'విరూపాక్ష' మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన సినిమా విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంచనాలకు తగ్గట్లుగానే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. చదవండి: మరో వ్యాపారరంగంలోకి లేడీ సూపర్‌స్టార్ నయనతార ఇటీవలే హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై అక్కడ కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇటీవలె రూ. 100 కోట్ల క్లబ్లో కూడా చేరిపోయింది. ఇప్పటికే థియేట్రికల్ రన్ సూపర్‌హిట్ అయిన ఈ మూవీ ఓటీటీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సుమారు నెల రోజుల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. శనివారం అర్థరాత్రి నుంచే ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి థియేటర్స్‌లో సినిమాను మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేయండి మరి. చదవండి: రాత్రికి రాత్రే రూ. 40కోట్లు నష్టపోయాను: కంగనా రనౌత్ -
Samyuktha Menon: నగల షోరూం ప్రారంభోత్సవంలో నటి సంయుక్త మీనన్ సందడి (ఫొటోలు)
-
మెగాహీరో సెన్సేషన్.. రూ.100 కోట్లు కొల్లగొట్టిన 'విరూపాక్ష'
మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష. సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్గా నటించింది. కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.హర్రర్ థ్రిల్లర్ జానర్లో తెరకెకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.ఏప్రిల్ 21న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం తొలిరోజు నుంచే సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సాయితేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా తాజాగా వంద కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తర్వాత తెరకెక్కిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే విరూపాక్ష బాక్సాఫీస్‌ను షేక్‌చేసి అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.చదవండి: సల్మాన్ ఖాన్ సోదరి ఇంట్లో భారీ దొంగతనం ఈ విజయంపై సాయితేజ్ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. అభిమానులు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు అంటూ ఇన్‌స్టాలో పోస్టును షేర్ చేశాడు. కాగా ఇప్పటికే థియేటర్లలో సూపర్ హిట్ అయిన విరూపాక్ష ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ అయ్యింది.ఈనెల 21 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. Supreme Hero @IamSaiDharamTej's #Virupaksha celebrates the Spectacular Commercial Triumph 🥳🥁#BlockbusterVirupaksha amasses Incredible 1️⃣0️⃣0️⃣ Crores with Immense Love from audience ♥️@iamsamyuktha_ @karthikdandu86 @Shamdatdop @AJANEESHB @SVCCofficial @SukumarWritings pic.twitter.com/UcftHOtRPv — SVCC (@SVCCofficial) May 18, 2023 -
కోపంతో నడిరోడ్డుపై అతడి చెంప పగలగొట్టా.. హీరోయిన్
హీరోయిన్ సంయుక్తకు కోపం ఎక్కువేనట. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. 2016లో పాప్‌కార్న్ అనే మలయాళ చిత్రం ద్వారా పరిచయమైన ఈ భామ తమిళంలో జులై కాట్రిల్, ఇరుడా చిత్రాలలో నటించింది. అయితే అవేవీ ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ఆ తరువాత తమిళం, తెలుగు భాషల్లో ధనుష్ కథానాయకుడిగా నటించిన వాత్తీ చిత్రంలోనూ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో వెంటనే తెలుగులో నటుడు సాయిధరమ్ తేజ్ సరసన విరూపాక్ష చిత్రంలో నటించింది. లక్కీగా ఆ చిత్రం హిట్ అయింది. ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను సమంత వీరాభిమానినని చెప్పింది. ఆమె నటన అంటే చాలా ఇష్టమని పేర్కొంది. తనను ఆమెలా ఉంటానని చాలా మంది అంటున్నారని, అయితే ఆమెలా నటిస్తున్నానని చెప్తుంటే ఇంకా సంతోషంగా ఉందని చెప్పింది. అదేవిధంగా నటుడు ధనుష్ నటన నచ్చుతుందని పేర్కొంది. తాను 10వ తరగతి చదువుతున్నప్పుడు ధనుష్ కథానాయకుడిగా నటించిన ఆడుగళం చిత్రం పాటలను బస్సులో చూసి డాన్స్ చేసేదాన్నని చెప్పింది. అలాంటిది ఆయనకు జంటగా నటిస్తానని ఊహించలేదని పేర్కొంది. తనకు నటనకు అవకాశం వున్న పాత్రలు చేయాలని ఉందని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాలలో నటించాలని ఆశిస్తున్నానంది. తనకు కోపం ఎక్కువ అని.. ఒకసారి తాను, తన తల్లి కలిసి బయటకు వెళుతుండగా ఒక వ్యక్తి సిగరెట్ కాల్చుతూ పొగను తమపై వదిలాడని దీంతో కోపంగా అతని చెంప పగలగొట్టానని సంయుక్త తెలిపింది. తనకు ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టమని, అదీ ఒంటరిగా ప్రయాణం చేయడం ఇంకా ఇష్టమని చెప్పింది. ఎక్కువగా హిమాలయాలకు వెళుతుంటానని, ఖాళీ సమయాల్లో కవితలు రాస్తుంటానంది. తన చిన్న వయసులోనే తన తల్లిదండ్రులు విడిపోయారని, అందుకే తండ్రి ఇంటి పేరును తన పేరులో నుంచి తీసేసానని సంయుక్త తెలిపింది. చదవండి: మా అమ్మ చాలా స్ట్రిక్ట్: శ్రీలీల -
త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్గా సంయుక్తా మీనన్!
మలయాళ భామ సంయుక్తా మీనన్‌కు తెలుగులో సూపర్ క్రేజ్ ఉంది. భీమ్లా నాయక్‌తో టాలీవుడ్‌కు పరిచమైన ఈ భామ వరుస హిట్స్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే తెలుగులో ఆమె నటించిన భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష హిట్ అవ్వడంతో సంయుక్తకు గెల్డెన్ లెగ్ అనే పేరుంది. దీంతో తెలుగులో సంయుక్తా మీనన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. దీంతో ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా మరో క్రేజీ అవకాశాన్ని దక్కించుకుందట ఈ మల్లు బ్యూటీ. అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: వెకేషన్లో దిల్ రాజు కుమార్తె.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్! ఈ సినిమాలో బన్నీకి జోడీగా సంయుక్తను ఫిక్స్ చేశారట డైరెక్టర్ త్రివిక్రమ్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు ఫిల్మీదునియాలో జోరుగా ప్రచారం జరగుతుంది. ఈ క్రమంలో మరోసారి త్రివిక్రమ్-సంయుక్తా మీనన్‌ల రిలేషన్‌పై నెట్టింట పుకార్లు మరోసారి తెరమీదకి వచ్చాయి. చదవండి: టార్చర్.. రోజూ కొట్టేవాడు, పార్కింగ్ ప్లేస్‌లో పడుకునేదాన్ని: నటి -
ఓకే చెప్పాకే ఆలోచిస్తా, ఇకపై అలాంటి ప్రశ్న తలెత్తకూడదు: హీరోయిన్
కోలీవుడ్‌లో వరుసగా రెండు సక్సెస్‌లను అందుకుని జోరుమీదున్న నటి సంయుక్త. మాలీవుడ్‌లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ మలయాళ బ్యూటీ ఇంతకుముందు ధనుష్ కథానాయకుడిగా తమిళం, తెలుగు భాషల్లో నటించిన వాత్తీ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఆ సినిమా సక్సెస్ కావడంతో పాటు ఆమెకు మంచి పేరు వచ్చింది. దీంతో వెంటనే విరూపాక్ష అనే మరో తెలుగు చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. హీరో సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం గత వారం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో నటి సంయుక్త నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించింది. కాగా విరూపాక్ష చిత్రం తమిళంలోనూ అనువాదం అయి ఈనెల 5వ తేదీన తెరపైకి రాబోతుంది. ఈ సందర్భంగా శనివారం చైన్నెలో మీడియాతో ముచ్చటించిన నటి సంయుక్త ఏ విషయంలోనైనా తాను ముందు ఓకే చెప్పి ఆ తరువాతే ఆలోచిస్తానని చెప్పింది. విరూపాక్ష వంటి కమర్షియల్ కథా చిత్రంలో కథానాయిక పాత్రకు ప్రాధాన్యతను ఇవ్వడం అన్నది అభినందించదగ్గ విషయం అని పేర్కొంది. ఈ చిత్రం కోసం చాలా రిస్క్ చేసి నటించినట్లు చెప్పింది. భవిష్యత్‌లో కథానాయికల పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుందా? అన్న ప్రశ్నకు తావే ఉండరాదని పేర్కొంది. దయచేసి దర్శక, నిర్మాతలు మహిళా పాత్రలకు ప్రాధాన్యత నివ్వాలని విజ్ఞప్తి చేసింది. ప్రతిభావంతమైన నటీమణులు ఇక్కడ చాలా మంది ఉన్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తమిళంలో మరిన్ని చిత్రాలలో నటించాలని కోరుకుంటున్నానని నటి సంయుక్త పేర్కొంది. చదవండి: ఢీ డ్యాన్స్ షో కొరియోగ్రాఫర్ ఆత్మహత్య -
అదృష్ట అందగత్తెలు
ఎందరో అందగత్తెలు,అందులో కొందరు మాత్రమే లక్కీ అనిపించుకుంటున్నారు. అందుకు కారణం వరస విజయాలు. ఒక దాని తర్వాత మరో దానితో మూడు విజయాలు అందుకోని గోల్డెన్ లెగ్ అనిపించుకున్నారు. హ్యాట్రిక్ సక్సెస్‌లను ఖాతాలో వేసుకున్నారు.ఇంతకీ ఆపకుండా హిట్లు చూస్తున్న ఆ భామలు ఎవరు? సంయుక్త మీనన్ లక్కీ హ్యాండ్ అనకుండా ఉంటారా ? ఒకటి కాదు రెండు కాదు వరసగా నాలుగు విజయాలు.అవి కూడా అలాంటి ఇలాంటివి కాదు బ్లాక్ బస్టర్లు.ఈమె నటించిన హీరోలందరికి కెరీర్ బెస్ట్ విజయాలు ఇచ్చేసింది. అదెంటీ సంయుక్త కారణంగా హీరోలకు విజయాలు వస్తున్నాయా అంటే ఆమె లెగ్ మహిమ అలా ఉంది మరి. గోల్డెన్ లెగ్ పెడితే సక్సెస్‌లు రాకుండా ఉంటాయా ?అందంతో పాటు అభినయంతో కూడా కట్టిపడేస్తుంది ఈ బ్యూటీఫుల్ తార. ధనుష్ మొదటి సారి తెలుగులో నటించిన సార్ మూవీ బిగ్ హిట్. తెలుగుతో పాటు తమిళ్లో కూడా విజయం సాధించింది. ఇందులో హీరోయిన్గా సంయుక్త మీనన్ నటించింది. బహుశ ఈ బ్యూటీ అదృష్టమే ధనుష్‌కి కలిసి వచ్చిందేమో. సినిమా బిగ్ హిట్ అవటమే అందుకు సాక్ష్యం. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా కూడా ప్రపంచవ్యాప్తంగా వందకోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది సంయుక్త మీనన్ అదృష్ణాన్ని సమిక్ష్మించే మరో ఉదాహరణ బింబిసార. 2015 లో పటాస్‌తో చక్కని విజయం చూసాడు కళ్యాణ్ రామ్.తర్వాత విజయం అందని ద్రాక్షల మారింది. మళ్లీ 2022 లో బింబిసారతో విజయం దక్కింది. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. విరూపాక్ష సాలిడ్ వసూళ్లు రాబడుతుంది.సాయితేజ్ కెరీర్లోనే భారీ హిట్ కొట్టింది. విలేజ్ హర్రర్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో సంయుక్త మీనన్ కథానాయిక. అంతేకాదు మూవీ స్టోరీ కూడా ఈ బ్యూటీ క్యారెక్టర్ చుట్టునే తిరిగుతుంది. గ్లామర్ ఒలకబోస్తునే,అభినయంతో కూడా కట్టి పడేసేంది.అందంతో ఆకట్టుకుంటునే నెగిటివ్ రోల్లో మెస్మరైజ్ చేసింది ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా కృతి శెట్టిని ఓవర్ నైట్ స్టార్‌ని చేసేసింది. అందాల కనువిందు చేయటానికి ఎందరో బ్యూటీలు రెడీగా ఉన్నారు అయితే అభినయంతో ఆకట్టుకుంటున్న కృతీ వైపు అదృష్టం ఉంది. అందుకే ఉప్పెనంత విజయాలతో దూసుకుపోతుంది. హ్యాట్రిక్ విజయాలతో సత్తా చూపించింది (చదవండి: ఆ హీరోతో డేటింగ్ చేస్తోందని బాధపడ్డ మరో హీరో.. హర్టయిన నటి!) ఉప్పెన కృతి శెట్టికి మొదటి సినిమా. కుర్రాళ్ల గుండెల్ని ధక్ ధక్ మనేలా చేసింది కృతి అందం. తొలి సినిమాతోనే రూ. 100 కోట్ల కలెక్షన్స్ క్లబ్లో చేరింది. ఉప్పెన విజయంతో యంగ్ హీరోలతో జోడి కట్టే అవకాశం దక్కించుకుంది కృతి శెట్టి. రెండో సినిమాలో నాచురల్ స్టార్ నానితో ఆడిపాడింది. శ్యామ్ సింగరాయ్ టైటిల్‌తో వచ్చిన ఈ మూవీ విజయం సాధించింది. ఈ మూవీలో పక్కింటి అమ్మాయిలా కనిపించి, ఆడియన్స్ మనసు గెలుచుకుంది. (చదవండి: సౌత్ వర్సెస్ బాలీవుడ్.. ఐశ్వర్యరాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు) కృతి శెట్టి మూడో సినిమా బంగార్రాజు. నాగార్జున నాగ చైతన్య కలిసి నటించారు. చైతూ గర్ల్ ఫ్రెండ్‌గా యాక్ట్ చేసింది. బంగార్రాజు కూడా విజయం సాధింది కృతికి హ్యాట్రిక్ విజయం అందించింది. ఇప్పుడు మరోసారి చైతూతో జోడి కట్టింది .కస్టడీ మూవీలో రొమాన్స్ చేసింది. తొందర్లో సినిమా థియేటర్లలోకి రాబోతుంది. రకుల్ ప్రీత్ సింగ్ చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించింది .తర్వాత పెద్ద సినిమాలలో నటించే స్థాయికి ఎదిగింది.బిగ్ హీరోయిన్గా మారిపోయింది.నాన్నకు ప్రేమతో, సరైనోడు, దృవ లాంటి సినిమాలతో వరసగా మూడు విజయాలు అందుకున్న హీరోయిన్ల లిస్ట్‌లోకి చేరింది. అందాల తార అనుష్క కథే వేరు. అరుందతికి ముందు ఈ సినిమా తర్వాత అన్నట్టుగా సాగింది ఈ బ్యూటీ కెరీర్ .బాక్సాఫీసు ముందర అరుందతి భారీ హిట్ కొట్టింది. అప్పటి వరకు గ్లామర్ పాత్రలకే పరిమితమైన జేజెమ్మ అరుందతి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటించింది. ఇక ఈమె కూడా వరస హిట్లు కొట్టిన భామల లిస్ట్‌లో ఉంది. నివేథా థామస్ తెలుగులో నటించిన మొదటి సినిమా జెంటల్ మెన్. ఫస్ట్ సినిమాతోనే అభినయానికి కూడా మార్కులు వేసుకుంది నివేథా. తర్వాత నిన్ను కోరి. జై లవ కుశ అంటు మరో రెండు విజయాలను ఖాతాలో వేసుకుంది. ఇలా కెరీర్ మొదట్లోనే హ్యాట్రిక్ కొట్టి తక్కువ మంది తారలు మాత్రమే సాధించే ఫీట్ అందుకుంది వరస విజయాలు రావటం అంత ఈజీ మ్యాటర్ కాదు. ఓ నాయికకు అలా విజయాలు వచ్చాయి అంటే కెరీర్ దూసుకుపోతుంది అని అర్థం.అసలే సెంటిమెంట్లను బాగా నమ్మే ఫిల్మ్ ఇండస్ట్రీలో విజయవంతమైన సినిమాలలో నటించే అవకాశం రావటం అదృష్టమే అని చెప్పాలి. -
పూజ హెగ్డే కొంప ముంచిన సంయుక్త మీనన్?
-
కాకి సెంటిమెంట్ తో వండర్స్ క్రీయేట్ చేస్తున్న విరూపాక్ష కలెక్షన్
-
గుజరాత్ హీరోయిన్స్ మధ్య సూపర్ ఫైట్
-
'విరూపాక్ష' విధ్వంసం.. నాలుగు రోజుల్లోనే ఆ మార్క్ దాటేసింది!
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, సార్ భామ సంయుక్త మీనన్ జంటగా నటించిన చిత్రం 'విరూపాక్ష'. ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. హర్రర్ థ్రిల్లర్ జానర్లో తెరకెకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో దూసుకెళ్లోంది. రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ వంశీ కాక తన ట్విటర్లో షేర్ చేశారు. సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తర్వాత తెరకెక్కిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే విరూపాక్ష బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించటం విశేషం. దీంతో సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. సాయిధరమ్ తేజ్ కెరీర్లో ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం.. అది కూడా నాలుగు రోజుల్లోనే యాభై కోట్లు మార్క్‌ను టచ్ చేయటం ఇదే తొలిసారి అవుతుంది. కాగా.. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్, రవి కృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సుకుమార్ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. #Virupaksha continues the Blockbuster run at Box-office on weekdays too & hits the 50CR+ Milestone at the Box-office in just 4 days 🥳💥#BlockbusterVirupaksha IN CINEMAS NOW 👇https://t.co/VXxU4xmSnk@IamSaiDharamTej pic.twitter.com/pqOzIu3udj — Vamsi Kaka (@vamsikaka) April 25, 2023 -
యాంకర్ ప్రశ్నకు మాట్లాడలేక ఎమోషనల్ అయిన సాయిధరమ్ తేజ్..
-
బాక్స్ ఆఫీస్ ని పీస్ పీస్ చేస్తున్నవిరూపాక్ష కలెక్షన్స్..
-
ఇది పాన్ ఇండియా స్థాయి సినిమా..
-
ముగ్గురు మావయ్యల పేర్లు చెప్పగానే దద్దరిల్లిన ఆడిటోరియం..
-
తేజ్ మీద చాలా కోపంగా ఉంది..
-
తేజ్ గురించి చెప్తూ ఎమోషనల్ అయినా డైరెక్టర్ కార్తీక్..
-
గోల్డెన్ లెగ్ హీరోయిన్ అనగానే సంయుక్త రియాక్షన్ చూడండి..
-
ఫన్నీ స్పీచ్ తో నవ్వులు పూయించిన సోనియా.. తేజ్ రియాక్షన్ చూడండి
-
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘విరూపాక్ష’.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..
చాలా కాలం తర్వాత సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఖాతాలో మరో హిట్ పడింది. యాక్సిడెంట్ తర్వాత ఆయన నటించిన ‘విరూపాక్ష’ మూవీ ఈ నెల 21న విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. తొలి రోజు తెలుగు రాష్ట్రాలలో దాదాపు రూ.5 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు అంతకంటే ఎక్కువగా రూ5.80 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.65 కోట్ల షేర్, రూ. 24.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని దక్కించుకుంది. ఈ మూవీకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ. 22 కోట్లకు జరిగింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 23 కోట్లను వసూలు చేయాలి. రెండు రోజుల్లో రూ.13.65 కోట్లు సాధించింది. అంటే రూ. 9.35 కోట్ల 5 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టాలి. మూవీకి వచ్చిన టాక్ని బట్టి చూస్తే.. మరో రెండు రోజుల్లో ఈజీగా బ్రేక్ ఈవెన్ సాంధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి సాయి తేజ్ రీఎంట్రీతోనే బిగ్ కొట్టాడని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: 20 ఏళ్ల తర్వాత చిరంజీవితో శ్రియ.. ఏకంగా రూ. కోటి డిమాండ్!) ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించగా.. ఆయన శిష్యుడు కార్తిక్ దండు దర్శకత్వం వహించారు. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. సాయితేజ్‌కి జోడిగా సంయుక్త మీనన్ నటించగా.. రాజీవ్ కనకాల, సునీల్, సాయిచంద్, బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రలు పోషించారు. -
యాంకర్ ప్రశ్నకి ఎమోషనల్ అయిన సాయి ధరమ్ తేజ్
-
‘విరూపాక్ష’కు ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే..
సూప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన చిత్రం ‘విరూపాక్ష’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 21న విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. కార్తీక్ దండు రాసుకున్న కథ రొటీన్‌గానే ఉన్నప్పటికీ.. సుకుమార్ స్క్రీన్‌ప్లే సినిమాను నిలబెట్టింది. అలాగే అజనీష్ లోక్‌నాథ్ నేపథ్యం సంగీతం కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. ఇక ఫస్ట్‌డే ఫస్ట్ షో నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. . ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 కోట్ల షేర్, 8.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. (చదవండి: విరూపాక్ష మూవీ రివ్యూ) ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 6.35కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక ఏరియా వైజ్‌గా చూస్తే.. నైజాంలో అత్యధికంగా రూ.1.82 కోట్లు, వైజాగ్ రూ.58లక్షలు, సీడెడ్ రూ. 54 లక్షలు, గుంటూరు రూ. 46 లక్షలు, నెల్లూరు రూ. 20 లక్షలు, కృష్ణా రూ. 32 లక్షలు, వెస్ట్ రూ. 47 లక్షలు, ఈస్ట్ రూ.40 లక్షలు కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్తో పాటు మిగిలిన ప్రాంతాలలో రూ. 1. 56కోట్లు వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ. 22 కోట్లకు జరిగింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 23 కోట్లను వసూలు చేయాలి. తొలిరోజు పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఈ వీకెండ్‌లోగా ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని సినీ వర్గాలు అంచానా వేస్తున్నాయి. -
తేజ్ 6 నెలలుగా..పోరాడుతూనే ఉన్నాడు
-
విరూపాక్ష హీరోయిన్ సంయుక్త స్పెషల్
సౌతిండియన్ చిత్రాల్లో అన్ని లాంగ్వేజ్ సినిమాల్లో నటించిన సంయుక్త(సంయుక్త మీనన్)కు.. ఈ ఏడాది టాలీవుడ్లో బాగా కలిసొచ్చింది. ధనుష్ సార్ చిత్రంతో తెలుగులోనూ సాలిడ్ హిట్ అందుకున్న సంయుక్త.. ఇప్పుడు విరూపాక్షతోనూ ఆడియొన్స్‌ను మెస్మరైజ్ చేసింది. కిందటి ఏడాది భీమ్లా నాయక్, బింబిసారలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు సంయుక్త. ► 1995, సెప్టెంబర్ 11న పాలక్కాడ్(కేరళ)లో జన్మించింది సంయుక్త(సంయుక్త మీనన్). ► ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసి.. 2016లో పాప్‌కార్న్ చిత్రంతో మాలీవుడ్‌లో అగుడుపెట్టింది. ► కలరి చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టారు సంయుక్త. జులై కాట్రిల్, ఎరిడా, వాతి చిత్రాల్లో నటించారు. ► మాలీవుడ్‌లో ‘లిల్లీ’, టోవినో థామస్ సరసన ‘కల్కి’, ‘తీవండి’, వెల్లమ్, వోల్ఫ్, కడువా, బూమరాంగ్ తదితర చిత్రాల్లో నటించింది. ఉయరేలో ఓ కీలక పాత్ర పోషించింది. ► పవన్-రానాల మల్టీస్టారర్ భీమ్లా నాయక్‌తో టాలీవుడ్లో అడుగుపెట్టింది. కల్యాణ్ రామ్ బింబిసార, ధనుష్ బైలింగువల్ సార్(వాతి), సాయి ధరమ్‌తేజ్ విరూపాక్షతో హిట్లు అందుకుంది. ► కిందటి ఏడాది గాలిపటా2తో శాండల్‌వుడ్‌లో అడుగుపెట్టింది ఈ మల్లు బ్యూటీ. ► తనను సంయుక్తా మీనన్ అని పిలవొద్దని అంటున్నారామె. సంయుక్తా మీనన్లో ఇంటి పేరు ‘మీనన్’ను తాను పక్కనపెట్టానని, తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారామె. ► టిపికల్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సంయుక్త.. హీరోయిన్లను సినిమా ఫలితం ఆధారంగా గోల్డెన్ లెగ్-ఐరెన్ లెగ్ అని విభజించడాన్ని తాజాగా విరూపాక్ష ప్రెస్మీట్లో తీవ్రంగా ఖండించారు తాజాగా. -
మేనల్లుడి 'విరూపాక్ష' హిట్.. చిరంజీవి ఎంత ఆనందంగా ఉన్నారో
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం విరూపాక్ష నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కార్తీక్ దండు తెరకెక్కిచిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో సాయితేజ్‌కు జంటగా సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో హిట్ టాక్‌తో థియేటర్ల వద్ద సందడి చేస్తోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి విరూపాక్ష టీంకు అభినందనలు తెలిపారు. సతీమణి సురేఖ సాయితేజ్‌కు కేక్ తినిపిస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. విరూపాక్ష సినిమాపై అద్భుతమైన స్పందన వస్తోంది. సాయితేజ్ విరూపాక్షతో గ్రాండ్ వెల్కమ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నీ సినిమాని ప్రేక్షకులు మెచ్చుకోవడం, వారి ఆశీస్సులు అందించడం సంతోషంగా ఉంది. వీరూపాక్ష టీంకు హృదయపూర్వక అభినందనలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. దీనికి మేనల్లుడు సాయితేజ్ స్పందిస్తూ.. థ్యాంక్యూ అత్తా, మామ. లవ్ యూ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. Hearing fabulous reports about #Viroopaksha ! I am so happy for you dear @IamSaiDharamTej that you have made your come back with a bang. 🤗Delighted that the audience is appreciating and blessing your film! Hearty Congratulations to the entire team! 💐💐@iamsamyuktha_… pic.twitter.com/eeBh7L2skm — Chiranjeevi Konidela (@KChiruTweets) April 21, 2023 -
Virupaksha Review In Telugu: ‘విరూపాక్ష’ మూవీ రివ్యూ
టైటిల్: విరూపాక్ష నటీనటులు: సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్, రాజీవ్ కనకాల, సునీల్, సాయిచంద్, బ్రహ్మాజీ తదితరులు నిర్మాణ సంస్థలు: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్ దర్శకత్వం: కార్తీక్ దండు స్క్రీన్‌ప్లే: సుకుమార్ సంగీతం: అజనీష్ లోక్‌నాథ్ సినిమాటోగ్రఫీ: శామ్‌దత్ సైనుద్దీన్ ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: ఏప్రిల్ 21, 2023 రోడ్డు ప్రమాదం తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘విరూపాక్ష’. సాయిధరమ్ తేజ్ కెరీర్లోనే తొలి హారర్ మూవీ. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించడం, ఆయన శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై ఫస్ట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్,ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు (ఏప్రిల్ 21) ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. విరూపాక్ష కథేంటేంటే ఈ సినిమా కథంతా రుద్రవనం అనే గ్రామంలో జరుగుతుంది. 1979లో క్షుద్ర పూజలు చేస్తూ చిన్న పిల్లల ప్రాణాలు తీస్తున్నారనే నెపంతో ఓ జంటను కొట్టి చంపుతారు గ్రామస్తులు. అది జరిగిన పుష్కరకాలం తర్వాత సూర్య(సాయి ధరమ్ తేజ్) తన తల్లితో కలిసి ఆ గ్రామానికి వస్తాడు. ఆ గ్రామంలో జాతర జరుగుతుండడంతో 15 రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో ఆ ఊరి సర్పంచ్ హరిశ్చంద్ర(రాజీవ్ కనకాల) కూతురు నందిని(సంయుక్త మీనన్)తో ప్రేమలో పడతాడు. ఆమెను ఒప్పించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో రుద్రవనం గ్రామంలో వరుసగా మరణాలు సంభవిస్తాయి. అందులో సూర్య పెదనాన్న కూతురు పార్వతి(యాంకర్ శ్యామల) కూడా ఉంటుంది. అనుమానాస్పద మరణాల సంఖ్య పెరుగుతుండడంతో ఊరి ప్రజలంతా భయంతో వణికిపోతారు. చేతబడి కారణంగానే మరణాలు సంభవిస్తున్నాయని పూజారి (సాయిచంద్) ఊరినంతా అష్టదిగ్బంధనం చేయిస్తారు. అసలు ఆ ఊరిని పట్టిపీడుస్తున్న ఆ దుష్టశక్తి ఏంటి? చావుల వెనుక ఉన్న రహస్యం ఏంటి? ప్రేమించిన అమ్మాయి నందినిని రక్షించుకోవడం కోసం సూర్య ఎం చేశాడు? ఆ మిస్టరీ డెత్స్ కారణంగా భయపడుతున్న ఊరి ప్రజలకు ఎలాంటి విముక్తిని ఇచ్చాడు? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. చేతబడి నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో చాలా విజయం సాధించాయి కూడా. అయితే ఈ మధ్య కాలంతో ఈ తరహా చిత్రాలు రావడం లేదు. చాలా కాలం తర్వాత ఆ మధ్య ‘మసూద’ వచ్చి మంచి విజయం సాధించింది. మళ్లీ ఇన్నాళ్లకు మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘విరూపాక్ష’ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్ సీన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కథను చక్కగా అల్లుకున్నాడు కార్తిక్ దండు. అయితే ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో ప్రేమ కథను చొప్పించి కొత్తగా తెరపై చూపించే ప్రయత్నం చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. హీరోహీరోయిన్ల లవ్‌స్టోరీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అంతేకాదు ఒక ఫ్లోలో వెళ్తున్న కథకు అడ్డంకిగా అనిపిస్తుంది. పాడుబడ్డ ఇంట్లో క్షుద్రపూజల సీన్‌తో సినిమా ఆసక్తిగా ప్రారంభం అవుతుంది. పుష్కరకాలం తర్వాత ఏం జరుగుతుందో చనిపోతున్న జంటతో ముందే చెప్పించారు. చేతబడి కారణంగానే ప్రజలు చనిపోతున్నారనేది ప్రేక్షకులు ఈజీగా అర్థమవుతుంది. అయితే ఈ చేతబడి వెనుక ఉంది ఎవరు? ఎలా చేస్తున్నారు? అనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలిపిస్తూ సస్పెన్స్‌ని మెంటైన్ చేయడంలో సుకుమార్ వందశాతం విజయం సాధించారు. కొన్ని సన్నివేశాలు చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది. అదేసమయంలో లవ్‌స్టోరీ, లాజిక్‌లెస్ సీన్స్ బోర్ కొట్టిస్తాయి. క్లైమాక్స్‌కి ముందు వచ్చే సీక్వెన్స్‌లను మరింత క్లారిటీగా చూపిస్తే బాగుండేది. కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా సింపుల్‌గా ముగించారు. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుంది. హారర్ చిత్రాలను ఇష్టపడేవారికి ‘విరూపాక్ష’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే... యాక్సిడెంట్ తర్వాత తేజ్ నటించిన తొలి చిత్రమిది.హీరోయిజానికి అంతగా స్కోప్‌లేదు.అయినా కూడా తేజ్ తన పాత్రకి న్యాయం చేశాడు. సూర్య పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. గత సినిమాలతో పోలిస్తే.. నటనలోనూ మెచ్యూర్డ్‌గా కనిపించాడు. ఇక నందినిగా సంయుక్త మీనన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. కొన్ని కీలకమైన సన్నివేశాలలో అద్భుతంగా నటించింది. ఈ చిత్రంలో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. సునీల్ పాత్రని కథలో అనవసరంగా ఇరికించారనిపిస్తుంది. ఇక సర్పంచ్ హరిశ్చంద్రగా రాజీవ్ కనకాల, పూజారిగా సాయిచంద్, అఘోరాగా అజయ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. శామ్ దత్ సైనూద్ధీన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. రొటీన్ కథకు సుకుమార్ స్క్రీన్‌ప్లే బాగా ప్లస్ అయింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. - అంజిశెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
‘విరూపాక్ష’ ట్విటర్ రివ్యూ
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ హీరోయిన్. కార్తిక్ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని .బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచనాల మధ్య నేడు ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికే పలు చోట్ల విరూపాక్ష ఫస్ట్ షో పడిపోవడంతో సినిమా చూసిన ప్రేక్షకులు శుక్రవారం తెల్లవారుజాము నుంచే ట్విటర్లో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ‘విరూపాక్ష’ కథేంటి? ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. (ఇది చదవండి: ఖరీదైన కారు కొన్న మాస్ మహారాజా.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా?) సినిమాకు ట్విటర్లో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దర్శకుడు కార్తీక్ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశాడని అంటున్నారు. స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉందట. సుకుమార్ స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్‌గా ఉందని కామెంట్ చేస్తున్నారు. ట్విస్టులు కూడా బాగున్నాయట. (ఇది చదవండి: బుల్లితెర నటి సూసైడ్ కేసు.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో!) #Virupaksha A Good Village Thriller with Horror Elements! Interesting storyline with some spine chilling moments and nice twists. Though the love track in the 1st half is boring and the pace is uneven in parts, the screenplay engages for the most part and works out. Rating:… — Venky Reviews (@venkyreviews) April 21, 2023 #VirupakshaReview Something untitled Story Lineup concept is regular story no extra added fresh mashup @IamSaiDharamTej Done with maximum efforts @iamsamyuktha_ clevage shots highlights movie Director Version of Narration. SDM Overall Rating - 2/5 ⭐⭐ #Virupaksha — South Digital Media (@SDM_official1) April 21, 2023 ప్రీ ఇంటర్వెల్లో చిల్ అయ్యే మూమెంట్స్ ఉన్నాయట. సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ కలిగేలా ఇంటర్వెల్ సెట్ చేశారట. మొదటిభాగంలో లవ్ స్టోరీ బోరింగ్‌గా ఉంటుందట. అలాగే సినిమా కూడా స్లోగా సాగుతుందని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. Nice 2nd half. Highly engaging screenplay. Interesting story. It's been quite some time since we saw this kind of story in telugu films. Good watch #Virupaksha https://t.co/oLy3E7Lw6m — Puri stan (@purijagan_stan) April 21, 2023 #Virupaksha has a very good story and almost made well. The climax is bad and could have been much better story wise. This story also deserves a higher budget and could have used VFX better. Overall, I highly recommend watching the movie. @IamSaiDharamTej @SukumarWritings — Telugu Cinemaalaya (@cinemaalayaa) April 21, 2023 Decent watch..bgm aripinchadu..telugu lo chala days tarvatha proper thriller/horror #Virupaksha — Pandagowwww (@ravi_437) April 21, 2023 #Virupaksha is @IamSaiDharamTej’s career best film. Excellent script & wonderful execution by Director Karthik. It’s a big screen spectacle with top notch sounds effects. Rating 4/5. — Deccan Delight (@DeccanDelight) April 21, 2023 Virupaksha review: 2023 version of Chandramukhi Congrats @IamSaiDharamTej vanna.#Virupaksha#VirupakshaInCinemasNow — sri (@sri_pspk_devote) April 21, 2023