మరో తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ అయిందా? అంటే అవుననే టాక్ గట్టిగా వినిపిస్తుంది. దీనికి తగ్గ లాజిక్స్ కూడా చెబుతున్నారు. త్వరలోనే ఈ యంగ్ సెన్సేషనల్ బ్యూటీ.. వివాహం జరిగే అవకాశముందని తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఈ న్యూస్ ఆమె ఫ్యాన్స్ చెవిలో పడింది. దీంతో వాళ్లు తెగ బాధపడిపోతున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీ? అసలెందుకు పెళ్లి రూమర్స్ వచ్చాయి?
మలయాళ బ్యూటీ సంయుక్త మేనన్.. మిగతా భాషల్లో ఏం సినిమాలు చేసిందనేది పక్కనబెడితే తెలుగులో మాత్రం లక్కీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఎందుకంటే తొలి మూవీ 'భీమ్లా నాయక్', బింబిసార, సార్, విరూపాక్ష.. ఇలా వరసగా నాలుగు సినిమాలతో హిట్ కొట్టింది. దీంతో టాలీవుడ్ అదృష్ట కథానాయిక అనిపించుకుంది. తాజాగా 'డెవిల్' సినిమాతో వచ్చింది. కాకపోతే ఇదైతే హిట్ అనిపించుకోలేదు.
(ఇదీ చదవండి: 'జెర్సీ' హీరోయిన్ పచ్చబొట్టు కహానీ.. 18 ఏళ్లప్పుడు ప్రేమ.. అందుకే ఇప్పటికీ!)
ఇకపోతే ఈ ఏడాది నాలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన సంయుక్త మేనన్.. కొత్తగా ఒక్కటంటే ఒక్క సినిమా ఒప్పుకోలేదట. తెలుగులో మాత్రమే కాదు తమిళ, మలయాళ.. ఇలా ఏ భాషా మూవీలోనూ నటించట్లేదు. ప్రస్తుతానికైతే ఆమె నటిస్తున్నట్లు ఎక్కడా క్లారిటీ లేదు. అయితే 2024లో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిందని, అందుకే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదని అంటున్నారు.
సంయుక్త మేనన్ ప్రస్తుత వయసు 28 ఏళ్లు. మరీ ఇంత చిన్న వయసులో పెళ్లి చేసేసుకుంటుందా? ఆమె మ్యారేజ్ నిజం కాదని కొందరు అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏంటనేది స్వయంగా సంయుక్త స్పందిస్తే తప్ప క్లారిటీ రాదు. సో అదన్నమాట విషయం.
(ఇదీ చదవండి: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న 'దసరా' విలన్.. అమ్మాయి ఎవరో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment