దూసుకుపోతున్న సార్‌.. ఇప్పటిదాకా ఎన్ని కోట్లు వచ్చాయంటే? | Dhanush Sir Movie Reached Rs. 75 Crores Collections | Sakshi
Sakshi News home page

Sir Movie: ధనుష్‌ సార్‌ మూవీ కలెక్షన్స్‌ ఎంతో తెలుసా?

Published Sat, Feb 25 2023 6:01 PM | Last Updated on Sat, Feb 25 2023 6:01 PM

Dhanush Sir Movie Reached Rs. 75 Crores Collections - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్‌ ప్రధాన పాత్రలో నటించిన ద్విభాషా చిత్రం వాత్తీ. తెలుగులో సార్‌ పేరుతో రిలీజైంది. కేరళ కుట్టి సంయుక్త హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదలవగా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు తెలుగు డైరెక్టర్‌ వెంకీ అట్లూరి దర్శకుడిగా వ్యవహరించారు.

ఈ మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లు రాబట్టింది. ఈ విషయాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ ..తొమ్మిది రోజుల్లోనే రూ.75 కోట్ల మార్క్‌ దాటిందంటూ స్పెషల్‌ పోస్టర్‌ ద్వారా తెలియజేసింది. ఇది చూసిన ఫ్యాన్స్‌.. సార్‌ త్వరలోనే వంద కోట్ల క్లబ్బులో చేరడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: జోర్దార్‌గా రాకింగ్‌ రాకేశ్‌, సుజాతల హల్ది ఫోటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement