హీరో ధనుష్‌కు కోలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ డబ్ చేసి వదలగా ఎన్నో సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఈ క్రమంలో ఇక్కడి ప్రేక్షకుల కోసం ధనుష్ డైరెక్ట్ తెలుగు సినిమా చేశాడు. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రమే సార్. ఈ మూవీ తమిళంలో వాత్తి పేరిట రిలీజైంది.
విద్య కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లి పెద్ద వ్యాపారంగా ఎలా మారింది? అది పేద విద్యార్థులకు ఎలా భారమవుతోంది? దాన్ని మార్చడానికి యువ ఉపాధ్యాయుడు ఎలా పోరాడాడన్నదే సినిమా. తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు రాబట్టింది. కేవలం 15 రోజుల్లోనే సార్ సెంచరీ కొట్టిన విషయాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్ స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కాగా ఇటీవల ధనుష్.. ఈ సినిమాలోని మాస్టారు మాస్టారు పాటను తనే స్వయంగా ఆలపించిన విషయం తెలిసిందే! తెలుగు, తమిళ రెండు భాషల్లోనూ ఆయన పాడగా అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపాయి. ధనుష్ నటనలోనే కాకుండా గొంతులోనూ తెలియని మ్యాజిక్ ఉందంటూ కామెంట్లు వెల్లువెత్తాయి. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు.
Love for #Vaathi / #SIRMovie is UNSTOPPABLE ❤️
— Sithara Entertainments (@SitharaEnts) March 4, 2023
The film has crossed a massive 1️⃣0️⃣0️⃣ crores gross worldwide 🌎
Thank you all for the phenomenal support 😇@dhanushkraja #VenkyAtluri @iamsamyuktha_ @gvprakash @dopyuvraj @NavinNooli @vamsi84 @SitharaEnts @7screenstudio pic.twitter.com/GOKevvLQo4
Comments
Please login to add a commentAdd a comment