ప్రేక్షకులకు పాఠాలు చెప్పేందుకు రెడీ అయిన ధనుష్‌ | Dhanush Sir Movie Release Date Finalised | Sakshi
Sakshi News home page

Sir Movie: ధనుష్‌ సార్‌ మూవీ రిలీజయ్యేది ఎప్పుడో తెలుసా?

Published Thu, Nov 17 2022 6:26 PM | Last Updated on Thu, Nov 17 2022 6:27 PM

Dhanush Sir Movie Release Date Finalised - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సార్‌. ఇది తమిళంలో వాతి పేరిట రూపొందుతోంది. విద్యావ్యవస్థలోని లోపాలను సరి చేయాలనుకునే మాస్టారుగా ధనుష్‌ కనిపించనున్నాడు. ఈ సినిమాకు తెలుగు డైరెక్టర్‌ వెంకీ అట్లూరి డైరెక్షన్‌ చేస్తున్నాడు. సంయుక్తా మీనన్‌ హీరోయిన్‌. తాజాగా ఈ సార్‌ ప్రేక్షకులకు పాఠాలు చెప్పేందుకు ఎప్పుడు రెడీ అవుతున్నాడో చెప్పేశారు.

సార్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. ఫిబ్రవరి 17న సార్‌ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. కాగా ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.

చదవండి: అతిలోక సుందరి శ్రీదేవి ఇల్లు చూశారా? ఎంత బాగుందో
బ్రెయిన్‌ దగ్గర పెట్టుకుని మాట్లాడు.. రేవంత్‌కు ఆదిరెడ్డి వార్నింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement