Venky atluri
-
అది నా అదృష్టం : వెంకీ అట్లూరి
‘నా మొదటి సినిమా 'తొలిప్రేమ' విజయం సాధించినప్పటికీ, ఒక ఐదు శాతం మంది ప్రేమకథే కదా అన్నట్టుగా కాస్త నెగటివ్ గా మాట్లాడారు. కానీ 'లక్కీ భాస్కర్'కి మాత్రం ఒక్క శాతం కూడా అలాంటి నెగటివ్ స్పందన రాలేదు. ప్రీమియర్ల నుంచే అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రేక్షకులు, రివ్యూ రైటర్లు అందరూ సినిమా బాగుంది అన్నారు. ఒక సినిమాని ఇలా చూసిన వారందరూ బాగుందని చెప్పడం నిజంగా గొప్ప విషయం. అదృష్టంగా భావిస్తున్నాను’అన్నారు డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఆయన దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలై మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ వెంకీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ 'లక్కీ భాస్కర్' కథ విని అందరూ బాగుంది అన్నారు. కానీ, కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందా అనే సందేహం వ్యక్తం చేశారు. అలాంటి సమయంలో సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ అవుతుందని భరోసా ఇచ్చారు.→ నేను సాధారణ ప్రేక్షకులతో కలిసి సినిమా చూసినప్పుడు.. ప్రతి సన్నివేశానికి, ప్రతి సంభాషణకి వారి నుంచి వచ్చిన స్పందన చూసి చాలా చాలా సంతోషం కలిగింది. కొన్ని సంభాషణలు అప్పటికప్పుడు చిత్రీకరణ సమయంలో రాయడం జరిగింది. వాటికి కూడా ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన లభించింది.→ సినిమా సెట్ లో హీరోనే మెయిన్ పిల్లర్. హీరో డల్ గా ఉంటే సెట్ మొత్తం డల్ గా ఉంటుంది. దుల్కర్ ఉదయం రావడమే ఫుల్ ఎనర్జీతో వచ్చేవారు. ఆయన ఈ కథని నమ్మడం వల్ల, సెట్ లో అంత సంతోషంగా ఉండటం వల్లే ఇంతమంచి అవుట్ పుట్ వచ్చింది. సన్నివేశాలు, సంభాషణలు చదివి బాగున్నాయని అభినందించే వారు. దాని వల్ల మరింత ఉత్సాహంగా ఇంకా మెరుగ్గా రాసేవాడిని.→ మొదట కథ రాసుకున్నప్పుడు ఇంత భారీ సినిమా అవుతుందని నేను అనుకోలేదు. నిజమైన లొకేషన్స్ లో షూటింగ్ చేసి, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేయొచ్చనే ఆలోచనలో ఉన్నాను. కానీ నిర్మాత వంశీ ఈ కథని ఎంతో నమ్మారు. కథకి తగ్గ భారీతనం తీసుకురావడం కోసం సెట్లు వేయాలని నిర్ణయించారు. కథని అంతలా నమ్మారు కాబట్టే వంశీ గారు ఎక్కడా రాజీ పడకుండా సినిమాని భారీస్థాయిలో నిర్మించారు.→ బ్యాంకింగ్ నేపథ్యం సాగే కథ ఇది. దీని కోసం ఎంతో రీసెర్చ్ చేశాను. కొన్ని సిరీస్ లు చూశాను. అయితే అవి టెక్నికల్ గా సాధారణ ప్రేక్షకులు అర్థం చేసుకునేలా లేవు. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకొని.. చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా ప్రతి సన్నివేశాన్ని రాసుకోవడం జరిగింది.→ సినిమాలు ఎడిట్ టేబుల్ మీద తయారవుతాయని భావిస్తాను. ఎడిటర్ నవీన్ నూలితో తొలిప్రేమ సినిమా నుంచి ట్రావెల్ అవుతున్నాను. నవీన్ ని ఎంతో నమ్ముతాను. ఏదైనా తప్పు అనిపిస్తే నిర్మొహమాటంగా చెప్తాడు. ఎడిటర్ గా లక్కీ భాస్కర్ కి పూర్తి న్యాయం చేశాడు. ఈ సినిమా ఎడిటింగ్ గురించి అందరూ అందుకే అంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు.→ ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్ ఏది ఒప్పుకోలేదు. ఏ జానర్ సినిమా చేయాలనే నిర్ణయానికి ఇంకా రాలేదు. ప్రస్తుతం కొన్ని కథా ఆలోచనలు ఉన్నాయి. ఖచ్చితంగా మరో మంచి చిత్రంతో అలరించడానికి ప్రయత్నిస్తాను. -
దిల్ రాజు సినిమా చాన్స్ ఇస్తే.. చేయనని చెప్పేశా: దుల్కర్ సల్మాన్
‘మంచి మనసున్న మనుషులంతా కలిస్తే గొప్ప సినిమా తెరకెక్కించవచ్చని నేను నమ్ముతా. దానికి ‘లక్కీ భాస్కర్’ చిత్రమే ఓ మంచి ఉదాహరణ. ఈ సినిమాలో పని చేసినవారంతా గొప్ప వ్యక్తులు. వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు. అందుకే ఇంత పెద్ద విజయం లభించింది.తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. వారితో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఇకపై కూడా మంచి కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తాను’అని అన్నారు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించింది. చిత్ర బృందంతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్, హను రాఘవపూడి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా దుల్కర్ మాట్లాడుతూ.. ‘సినిమా బ్లాక్ బస్టర్ అని నాకు ఫస్ట్ మెసేజ్ చేసింది జి.వి. ప్రకాష్. వెంకీ-జి.వి ఇద్దరూ డైనమిక్ కాంబో. నిర్మాతలకు జి.వి. ప్రకాష్ లాంటి టెక్నీషియన్స్ కావాలి. ఎందుకంటే పాటలు గానీ, నేపథ్య సంగీతం గానీ ఆలస్యం చేయరు. డీఓపీ నిమిష్, ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్, ఎడిటర్ నవీన్ అందరూ సినిమా అద్భుతంగా రావడానికి ఎంతో కృషి చేశారు. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. వారితో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ‘ఓకే బంగారం’ విడుదలయ్యాక నిర్మాత దిల్‌రాజు నాకొక అవకాశం ఇచ్చారు. తెలుగు సరిగ్గా రాకపోవడంతో ఆ సినిమా అంగీకరించలేకపోయా. నాగి, స్వప్న 'మహానటి' కోసం నన్ను సంప్రదించినప్పుడు నాకు తెలుగు రాదనే చెప్పాను. కానీ నన్ను తీసుకొచ్చి, ఈరోజు ఇలా నిలబెట్టారు. ఆ తర్వాత హను గారు 'సీతారామం'తో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాన్ని అందించారు. ఇప్పుడు వెంకీ. చూడటానికి కుర్రాడిలా ఉంటాడు. కానీ ఎంతో ప్రతిభ ఉంది. అందుకే ఇంత గొప్ప సినిమాలు చేస్తున్నాడు. లక్కీ భాస్కర్ సినిమాకి, ఇందులోని పాత్రలకు ప్రాణం పోసిన వెంకీకి థాంక్స్. అలాగే ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, "ఈ సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను. టీం అందరం ఎంతో కష్టపడి పని చేశాము. ఆ కష్టానికి తగ్గ ఫలితంగా ప్రేక్షకుల నుంచి లభిస్తున్న స్పందన చూసి ఎంతో సంతోషంగా ఉంది. ఇందులో నేను పోషించిన సుమతి పాత్ర పట్ల ఎంతో ప్రేమను కురిపిస్తున్నారు. దుల్కర్ గారితో కలిసి నటించడం ఆనందంగా ఉంది’ అన్నారు. ‘పేరుతో పాటు, సినిమాకి డబ్బులు కూడా రావడం సంతోషంగా ఉంది’ అని దర్శకుడు వెంకీ అట్లూరి అన్నారు. -
లక్కీ భాస్కర్ డైరెక్టర్ పై మండి పడుతున్న నితిన్, అఖిల్
-
'లక్కీ భాస్కర్' తొలిరోజు కలెక్షన్ ఎంతంటే?
'సీతారామం'తో అద్భుతమైన క్రేజ్ దక్కించుకున్న దుల్కర్ సల్మాన్.. హీరోగా నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ 'లక్కీ భాస్కర్'. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలోకి వచ్చింది. ప్రీమియర్స్ వేసినప్పుడే సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. ఇక తొలిరోజు వసూళ్లలోనూ మంచి నంబర్స్ నమోదు చేసింది. ఇంతకీ ఎన్ని కోట్లు వచ్చాయంటే?(ఇదీ చదవండి: 'క' సినిమా ధమాకా.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?)సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై దుల్కర్- వెంకీ అట్లూరి కాంబోలో తీసిన ఈ సినిమాని డబ్బు ప్రధాన ఇతివృత్తంగా తీశారు. 1992లో జరిగిన హర్షద్ మెహతా స్కామ్‌ని కాస్త టచ్ చేశారు. ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తూ సాగిన ఈ మూవీకి తొలిరోజు రూ.12.7 కోట్లు గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. ఈ మేరకు అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.స్వతహాగా తెలుగు హీరో కానప్పటికీ దుల్కర్ 'లక్కీ భాస్కర్' సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయంటే విశేషమనే చెప్పాలి. దీపావళి లాంగ్ వీకెండ్ ఉంది. వచ్చే వారం కూడా పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ లేవు. కాబట్టి ఈ మూవీతో పాటు క, అమరన్ చిత్రాలకు కలెక్షన్ పరంగా బాగా కలిసి రావొచ్చనిపిస్తోంది. దిగువన 'లక్కీ భాస్కర్' రివ్యూ ఉంది. దానిపై ఓ లుక్కేయండి.(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)Baskhar's 𝐒𝐄𝐍𝐒𝐀𝐓𝐈𝐎𝐍𝐀𝐋 start at the Box-Office 🔥#LuckyBaskhar Grosses over 𝟏𝟐.𝟕𝟎 𝐂𝐑 on 𝐃𝐀𝐘 𝟏 Worldwide! 💰𝑼𝑵𝑨𝑵𝑰𝑴𝑶𝑼𝑺 𝑫𝑰𝑾𝑨𝑳𝑰 𝑩𝑳𝑶𝑪𝑲𝑩𝑼𝑺𝑻𝑬𝑹 🤩🏦In Cinemas Now - Book your tickets 🎟 ~ https://t.co/Gdd57KhHT3 @dulQuer #VenkyAtluri… pic.twitter.com/B0VTxFbI07— Dulquer Salmaan (@dulQuer) November 1, 2024 -
వెంకీకి ఎప్పటినుంచో పూజా హెగ్డేపై కన్నుంది: నిర్మాత నాగవంశీ
'సీతారామం' సినిమా దెబ్బకు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇతడి లేటెస్ట్ మూవీ 'లక్కీ భాస్కర్'. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలోకి వస్తోంది. ఇప్పటికే దాదాపు ప్రమోషన్స్ పూర్తి చేశారు. ఇప్పుడు 'అన్‌స్టాపబుల్' షోలో పాల్గొన్నారు. ఇదివరకే షూటింగ్ పూర్తవగా.. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు.గతవారమే 'అన్‌స్టాపబుల్' నాలుగో సీజన్ మొదలైంది. తొలి ఎపిసోడ్‌కి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఇప్పుడు రెండో ఎపిసోడ్లో 'లక్కీ భాస్కర్' హీరోహీరోయిన్ దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ కనిపించారు.(ఇదీ చదవండి: 'జై హనుమాన్' నుంచి సడన్ సర్ప్రైజ్)కారు డ్రైవింగ్ స్పీడ్ గురించి బాలకృష్ణ.. 300 కిమీ వేగంతో నడుపుతానని దుల్కర్ చెప్పాడు. అలానే మాటల సందర్భంలో నిర్మాత నాగవంశీ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వెంకీ అట్లూరికి ఎప్పటినుంచో పూజా హెగ్డేపై కన్నుందని అన్నాడు. అలానే దిల్ రాజు.. చాలాసార్లు పింక్ ప్యాంట్ వేసుకుని వస్తున్నారని, అది వద్దని చెప్పాలనుందని నాగవంశీ అన్నారు.సినిమా సినిమాకు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అనే తెలుగు హీరో గురించి బాలకృష్ణ-నాగవంశీ మధ్య చర్చ జరిగింది. ఆ హీరో పేరు ఏంటనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉండిపోయింది. ప్రోమో చూస్తుంటే సరదాగానే అనిపించింది. ఎపిసోడ్ కూడా ఇలానే ఉంటే మంచి ఫన్ గ్యారంటీ.(ఇదీ చదవండి: హాట్ బ్యూటీతో విడిపోవడంపై క్లారిటీ ఇచ్చిన హీరో) -
'లక్కీ భాస్కర్' బ్యాంక్ ఖాతాలో కోట్లలో డబ్బు.. ఆసక్తిగా టీజర్
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా లక్కీ భాస్కర్.. పుష్కర కాలం పాటు ఆయన ఎన్నో చిత్రాలతో మెప్పించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వినూత్న చిత్రాలు, పాత్రలు చేస్తూ వస్తున్నారు దుల్కర్. ఇక పన్నెండేళ్లయిన సందర్భంగా దుల్కర్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన సమయం నుంచి ఆసక్తిని పెంచుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నారు. దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తుంది. 'మగధ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పని చేసే పాత్రలో దుల్కర్ కనిపించారు. 1980ల నాటి బొంబాయి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఒక సాధారణ మనిషి తాలూకు అసాధారణమైన ప్రయాణమే ఈ సినిమా. నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథగా రూపొందనున్న సినిమా ‘లక్కీ భాస్కర్’. దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటించనున్న సినిమా ఇది. ‘లక్కీ భాస్కర్’ టీజర్‌ను గమనిస్తే డబ్బు చుట్టూ ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది. నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన వ్యక్తి కథ అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. సో..‘లక్కీ భాస్కర్’ కథలోని ప్రధానాంశం డబ్బే అని తెలుస్తోంది. జులై నెలలో ఈ చిత్రం విడుదల కానుంది. -
మీనాక్షి చౌదరినే కావాలని పట్టుబట్టిన త్రివిక్రమ్ భార్య
త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్లో ప్రముఖ దర్శకనిర్మాతలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. అతను ఇటీవల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. సినిమాకు సంబంధించిన పలు పనుల్లో అతని భార్య సాయి సౌజన్య కూడా చురుకుగా పాల్గొంటున్నారు. స్క్రిప్ట్ డిస్కషన్స్‌లో కూడా సౌజన్య పాల్గొంటోంది. ఇప్పుడు, ఆమె సితార ఎంటర్టైన్మెంట్తో కలిసి దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మొదటి స్ట్రైట్ తెలుగు సినిమా లక్కీ భాస్కర్ని నిర్మిస్తోంది. (ఇదీ చదవండి: రవితేజ, విజయ్ దేవరకొండ ఎవరైతే ఏంటి.. శ్రీలీల పరిస్థితి ఇదీ!) అయితే ఆశ్చర్యకరంగా ఈ సినిమాలో కథానాయికగా మీనాక్షి చౌదరిని టీమ్ ఎంపిక చేసింది. మీనాక్షి చౌదరి మహేష్ బాబు గుంటూరు కారం కోసం త్రివిక్రమ్ కాంపౌండ్‌లోకి ప్రవేశించింది. ఆమె ఈ చిత్రంలో ద్వితీయ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ధనుష్ తొలి తెలుగు స్ట్రైట్ మూవీ అయిన 'సార్'ను వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇప్పుడు దుల్కర్ సినిమాను కూడా ఆయన తెరకెక్కించనున్నారు. లక్కీ భాస్కర్లో దుల్కర్‌కు సరిజోడిగా మీనాక్షి అయితే బాగుంటుందని సౌజన్య పట్టుబట్టి మరీ తీసుకున్నారట. ఒక సాధారణ మనిషి ఉన్నత శిఖరాలకు చేరిన అసాధారణమైన ప్రయాణంగా ‘లక్కీ భాస్కర్’ రూపొందుతోందని డైరెక్టర్ చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా హైదరాబాద్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్ సతీమణి సౌజన్యతో మీనాక్షి చౌదరి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్. -
లక్కీ భాస్కర్ షురూ
‘మహానటి, సీతారామం’ వంటి హిట్ చిత్రాల తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న స్ట్రయిట్ తెలుగు చిత్రం ‘లక్కీ భాస్కర్’ షూరూ అయింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘‘ఒక సాధారణ మనిషి ఉన్నత శిఖరాలకు చేరిన అసాధారణమైన ప్రయాణంగా ‘లక్కీ భాస్కర్’ రూపొందుతోంది. ‘సార్’(తమిళంతో ‘వాతి’) చిత్రం తర్వాత వెంకీ అట్లూరితో మేము నిర్మిస్తున్న రెండో పాన్ ఇండియా చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నిమిష్ రవి, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్. -
'సీతారామం' హీరో మరో తెలుగు మూవీ.. అలాంటి కాన్సెప్ట్‌తో!
దుల్కర్ సల్మాన్ పలు భాషల్లో స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పాన్-ఇండియా స్థాయిలో అలరిస్తూ, ప్రస్తుత ఉత్తమ నటులలో ఒకడిగా ఫేమ్ సంపాదించాడు. తన గత చిత్రం 'సీతారామం'తో బ్లాక్ బస్టర్ కొట్టిన దుల్కర్.. ఇప్పుడు మరోసారి తెలుగు దర్శకుడితో పనిచేసేందుకు రెడీ అయిపోయాడు. హీరో పుట్టినరోజు సందర్భంగా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: BRO Movie Review: ‘బ్రో’మూవీ రివ్యూ) ధనుష్ తో చేసిన 'సార్'(వాతి)తో వెంకీ అట్లూరి బిగ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న వెంకీ అట్లూరి.. ఇప్పుడు తన ప్రతిభను పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. 'నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథ'గా ఈ చిత్రం రూపొందుతోందని నిర్మాతలు చెప్పుకొచ్చాడు. ఈ మూవీకి 'లక్కీ భాస్కర్' టైటిల్ ఫిక్స్ చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. Presenting to you #LuckyBaskhar - Embark on a Captivating Journey, The Unraveling Triumphs of an Ordinary Man! 📈🎬#VenkyAtluri @gvprakash @vamsi84 @Banglan16034849 @NavinNooli #SaiSoujanya @sitharaents @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/NwNaZ9NAwC — Dulquer Salmaan (@dulQuer) July 28, 2023 (ఇదీ చదవండి: బ్రో మూవీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!) -
మరో స్ట్రయిట్ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దుల్కర్
‘మహానటి’, ‘సీతారామం’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ మరో స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తెలుగులో ‘తొలిప్రేమ’, ‘రంగ్ దే’, ‘సార్’ వంటి సినిమాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్న చిత్రంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘‘అక్టోబరులో షూటింగ్‌ను ఆరంభించి, వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్షకులను అలరించే మరో మంచి కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్‌గా ఈ చిత్రం ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
దర్శకుల ప్రతిభను పెంచే నటుడు ధనుష్: వెంకీ అట్లూరి
తమిళ సినిమా: ధనుష్ తొలిసారిగా తెలుగులో కథానాయకుడిగా నటించిన చిత్రం సార్. తమిళంలో పార్టీ పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని నాగ వంశీ, సాయి సౌమ్య నిర్మించారు. వెంకీ అట్లూరి కథ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. 1990 ప్రాంతంలో జరిగే కథా చిత్రంగా తెరకెక్కించారు. విద్య కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిన పెద్ద వ్యాపారంగా మారి పేద విద్యార్థులకు ఎలా భారమవుతోంది, దాన్ని మార్చడానికి ఓ యువ ఉపాధ్యాయుడు చేసే పోరాటమే ఈ చిత్రం. ఈనెల 17న తమిళం, తెలుగు భాషల్లో విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. దీంతో చిత్రం శనివారం ఉదయం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఇందులో పాల్గొన్న దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ ఇంత మంచి విజయాన్ని అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనను నమ్మి ఈ అవకాశాన్ని కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు చెప్పారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం పక్క బలంగా నిలిచిందన్నారు. ఇక నటుడు ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదని, ఆయన దర్శకుల ప్రతిభను పెంచే నటుడని పేర్కొన్నారు. షూటింగ్లో ఏ విషయం గురించి అయినా వెంటనే ఓకే చెప్పే నటుడని కొనియాడారు. ఆయనతో పనిచేయటం మంచి అనుభవంగా పేర్కొన్నారు. వాతి చిత్రం 8 రోజుల్లో రూ. 75 కోట్లు వసూలు చేసిందని దర్శకుడు తెలిపారు. ఇంకా భారీ మొత్తంలో వసూలు చేస్తుందని దర్శకుడు వెంకీ అట్లూరి ధీమా వ్యక్తం చేశారు. -
ధనుష్ ‘సార్’ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
సార్ సినిమాకు సీక్వెల్ లేదు: డైరెక్టర్
‘‘సార్’ సినిమాకు తల్లిదండ్రులు, విద్యార్థులు ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అవుతారు. ఈ సినిమా చూసిన తర్వాత విద్యార్థులకు వారి తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో అర్థం అవుతుంది. మనసున్న ప్రతి మనిషి కీ ‘సార్’ సినిమా నచ్చుతుంది’’ అన్నారు దర్శకుడు వెంకీ అట్లూరి. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘సార్’ (తమిళంలో ‘వాతి’). సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలైంది. ‘సార్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ చిత్రదర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ– ‘‘చదువు అనేది నిత్యావసరం. అందుకే ‘సార్’ సినిమా బ్యాక్‌డ్రాప్ 1990 అయినప్పటికీ ఇప్పటి ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారనిపించింది. ధనుష్‌గారికి మా నిర్మాత ‘సార్’ కథ చెప్పమనగానే హ్యాపీ ఫీలయ్యాను. కథ విన్నాక ధనుష్ గారు చప్పట్లు కొట్టి, కాల్షీట్స్ ఎప్పుడు కావాలని అడగటంతో ఇంకా హ్యాపీ ఫీలయ్యాను. ఇందులో తండ్రీకొడుకుల మధ్య మంచి సీన్ ఉంటుంది. అది త్రివిక్రమ్‌గారితో జరిపిన సంభాషణల నుంచే పుట్టింది. ‘సార్’ యూనివర్సల్ సబ్జెక్ట్. తమిళంలోనూ మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రానికి సీక్వెల్ ఆలోచన లేదు. ఇక నుంచి నా ప్రతి సినిమాకీ వైవిధ్యం చూపించడంతో పా టు విభిన్న జోనర్లలో చిత్రాలు చేస్తాను’’ అన్నారు. -
ధనుష్ 'సార్' మూవీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో వాతి పేరుతో విడుదలయ్యింది.ధనుష్‌కి జోడీగా సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించింది.రిలీజ్‌కు ముందే ఈ సినిమా పాటలు మాంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక సార్ విడుదలైన తొలిరోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. విద్యావ్యవస్థపై ఓ లెక్చరర్ పోరాటం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. దీంతో ధనుష్‌కి టాలీవుడ్లో సాలిడ్ డెబ్యూ లభించిందని టాక్ వినిపిస్తుంది. కలెక్షన్స్ విషయంలోనూ సార్ దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సార్ డిజిటల్ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. సినిమా రిలీజ్ అయిన ఐదు వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. -
రఘువరన్ బీటెక్ టోటల్ కలెక్షన్స్.. సార్ ఫస్ట్‌డేకు వచ్చేస్తాయి!
‘‘గత ఏడాది మా బ్యానర్ నుంచి వచ్చిన ‘భీమ్లానాయక్’, ‘డీజే టిల్లు’ సినిమాలకు హౌస్‌ఫుల్ అంటూ నాకు ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఇప్పుడు ‘సార్’కు అంత మంచి రెస్పాన్స్ వస్తుండడం హ్యాపీగా ఉంది’’ అని అన్నారు సూర్యదేవర నాగవంశీ. ధనుష్ హీరోగా నటించిన ద్విభాషా చిత్రం ‘సార్’ (తమిళంలో ‘వాతి’). వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. అదే రోజు సాయంత్రం జరిగిన విలేకర్ల సమావేశంలో నాగవంశీ మాట్లాడుతూ– ‘‘ధనుష్ గారి ‘రఘువరన్ బీటెక్’ మొత్తంగా తెలుగులో ఎంత వసూలు చేసిందో ఆ స్థాయి వసూళ్లు ‘సార్’ తొలి రోజునే వచ్చేలా ఉన్నాయి. ఆయన కెరీర్లో ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టేలా ఉంది’’ అన్నారు. ‘‘ఇంటర్మీడియట్ చదివినప్పుడు, నేను చూసిన చుట్టుపక్కల ఘటనల ఆధారంగా ఈ చిత్రకథ రాశాను’’ అన్నారు వెంకీ అట్లూరి. -
ధనుష్ ‘సార్’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
Sir Review: ‘సార్’ మూవీ రివ్యూ
టైటిల్: సార్(తమిళ్లో ‘వాతి’) నటీనటులు: ధనుష్, సంయుక్త మీనన్, సముద్ర ఖని, హైపర్ ఆది తదితరులు నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య దర్శకత్వం: వెంకీ అట్లూరి సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్ సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్ ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: ఫిబ్రవరి 17, 2023 తమిళ స్టార్ ధనుష్‌కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఆయన కోలీవుడ్‌లో నటించిన చిత్రాలన్ని తెలుగులో డబ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. అందుకే ఈ సారి నేరుగా తెలుగులోనే ‘సార్’(తమిళ్లో ‘వాతి’) సినిమా చేశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై హైప్‌ని క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(ఫిబ్రవరి 17) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1998-2000 కాలంలో సాగుతుంది. త్రిపాఠీ విద్యాసంస్థల చైర్మన్ శ్రీనివాస్ త్రిపాఠి(సముద్రఖని)కి విద్య అనేది ఒక వ్యాపారంగా భావిస్తాడు. క్వాలిటీ ఎడ్యుకేషన్ పేరుతో భారీగా ఫీజులు వసూళ్లు చేస్తూ ప్రభుత్వ కాలేజీలు మూత పడేలా చేస్తాడు. అధిక ఫీజుల వసూళ్లు చేస్తున్నరంటూ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో.. ఫ్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్ర కోసం ప్రభుత్వం ఓ జీవోని తీసుకురావాలని నిర్ణయించుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో త్రిపాఠీ ఓ ఒప్పందం కుదుర్చుకుంటాడు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలను దత్తత తీసుకొని.. త్రిపాఠి విద్యా సంస్థల ఫ్యాకల్టీతో ఉచితంగా విద్యను అందిస్తామని చెబుతాడు. దానికి ప్రభుత్వం కూడా సై అంటుంది. దీంతో త్రిపాఠి తమ విద్యా సంస్థలో పనిచేసే జూనియర్ లెక్చర్లను ప్రభుత్వ కాలేజీలకు పంపిస్తాడు. వారిలో ఒకరే బాలా గంగాధర్ తిలక్ అలియాస్ బాలు(ధనుష్). అతను కడప జిల్లా సిరిపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీకి వెళ్తాడు. దత్తత పేరుతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం చేయాలనేది త్రిపాఠి టార్గెట్ అయితే.. కాలేజీలో చదివే విద్యార్థులందరిని పాస్ చేయించి ప్రమోషన్ సాధించాలనేది బాలు లక్ష్యం. అతని లక్ష్యం నెరవేర్చుకునే క్రమంలో బాలుకు ఎదురైన సమస్యలు ఏంటి? త్రిపాఠి కుట్రను బాలు ఎలా తిప్పి కొట్టాడు? సిరిపురం ప్రెసిడెంట్(సాయి కుమార్) బాలు సార్‌ని ఊరి నుంచి బహిష్కరించినా.. పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాడు? తను చదువు చెప్పిన 45 మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్షల్లో రాణించారా? లేదా? పేద విద్యార్థులకు నాణ్యమైన చదువుని అందించాలని కృషి చేస్తున్న బాలు సార్‌కి బయాలజీ లెక్చర్ మీనాక్షి(సంయుక్త మీనన్) ఎలాంటి సహాయం చేసింది? బాలు కారణంగా సిరిపురం యువతలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘విద్య అనేది గుడిలో పెట్టిన నైవేద్యం లాంటిది..పంచండి. అంతేకానీ ఫైవ్‌స్టార్ హోటల్లో డిష్‌లా అమ్మకండి’.. ఇంటర్వెల్ ముందు విలన్‌తో హీరో చెప్పే మాట ఇది. ఈ ఒక్క డైలాగ్ చాలు ‘సార్’ సినిమా ఓ మంచి సందేశాత్మక చిత్రం అని చెప్పడానికి. దేశంలో ఎడ్యుకేషన్ మాఫీయా సాగిస్తున్న అరాచకాలు ఏంటి? ప్రైవేట్ విద్యా సంస్థలు చదువుని వ్యాపారంగా మార్చడం వల్ల మధ్య తరగతి కుటుంబాలు పడుతున్న అవస్థలు ఎంటి? అనేది ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ఎక్కడా అసభ్యతకు అశ్లీలతకు తావు లేకుండా చెప్పాలనుకున్న పాయింట్ నేరుగా చెప్పడంలో దర్శకుడు సఫలమయ్యాడు. సినిమా ప్రారంభమే ఆసక్తిగా ఉంటుంది. ఐఏఎస్ అధికారి ఏఎస్ మూర్తి (సుమంత్)ను వెతుక్కుంటూ కొంతమంది విద్యార్థులు రావడం..ఆయన బాలు సార్ గురించి చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. సినిమా అంతా బాలు క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. పిల్లలకు చదువుపై ఆసక్తి పెంచడం కోసం బాలు చేసే ప్రయత్నం.. ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు.. మీనాక్షి మేడంతో ప్రేమాయణం..మధ్యలో కెమిస్ట్రీ లెక్చరర్ కార్తిక్(హైపర్ ఆది) వేసే పంచ్ జోకులతో సోసోగా ఫస్టాఫ్ సాగుతుంది. చూస్తుండగానే ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఇక సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు బాలు సార్ చేసేప్రయత్నం.. ఆ ప్రయత్నం ఫలించకుండా చేసేందుకు త్రిపాఠి చేసే కుట్రలు సెకండాఫ్‌లో చూపించాడు. అయితే కథనం మొత్తం ప్రేక్షకుడి ఊహకు అందేలా సాగడం, ట్విస్టులు లేకపోవడం మైనస్. ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ ఎలా ఉండబోతుంది? క్లైమాక్స్ ఏంటి? అనేది సగటు ప్రేక్షకుడు ఈజీగా ఊహించగలడు. కొన్ని సన్నివేశాలు సినిమాటిక్‌గా అనిపిస్తాయి. నేపథ్య సంగీతంలో ఉన్నంత బలం.. కంటెంట్‌లో ఉండదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో ఉన్నంత ఎమోషన్.. సన్నివేశంలో కనిపించదు. ఇంటర్వెల్ తర్వాత వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ హృదయాలను హత్తుకుంటాయి. 'అవసరానికి కులం ఉండదు' , ‘అడిగింది కొనివ్వకపోతే ఆ పిల్లలు ఒక్క రోజే ఏడుస్తారు..కానీ వాళ్ల అమ్మ నాన్న కొనివ్వలేని పరిస్థితి ఉన్నంత కాలం ఏడుస్తూనే ఉంటారు’, ‘డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు.. కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది’ లాంటి డైలాగ్స్.. ఆ సందర్భంలో వచ్చే సన్నివేశాలు హృదయాలను హత్తుకుంటాయి. ఎవరెలా చేశారంటే.. బాలు పాత్రలో ధనుష్ పరకాయ ప్రవేశం చేశాడు. సినిమా మొత్తం బాలు పాత్ర చుట్టే తిరుగుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ధనుష్ వన్ మ్యాన్ షో నడిపాడని అనొచ్చు. ఫైట్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చక్కగా నటించాడు. మీనాక్షిగా సంయుక్త మీనన్ తన పాత్ర పరిధిమేర నటించింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. త్రిపాఠి విద్యా సంస్థల చైర్మన్‌గా సముద్ర ఖని తనదైన నటనతో మెప్పించాడు. సిరిపురం ప్రెసిడెంట్‌గా సాయి కుమార్ ఉన్నంతలో చక్కగా నటించాడు. హైపర్ ఆది తనదైన పంచ్ డైలాగ్స్‌తో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఏఎస్ మూర్తిగా సుమంత్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. .ఈ సినిమాకు ప్రధాన బలం జీవీ ప్రకాశ్ సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. ‘మాస్టారు మాస్టారు’పాట ఆకట్టుకుంటుంది. జె.యువరాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆ స్టార్ హీరోకు వెల్కమ్ చెప్పిన నితిన్.. ట్వీట్ వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సార్ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు(ఫిబ్రవరి17)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నితిన్ మూవీ టీంకు బెస్ట్ విషెస్ తెలిపారు. ధనుష్‌కు టాలీవుడ్‌కు స్వాగతం అంటూ అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. #SIR In cinemas, From Tomorrow!Hearing great things about the film already👏👏 Congrats to my dear Swami #VenkyAtluri & Grand Welcome to @dhanushkraja garu to Telugu. My heartfelt wishes to my hattrick producer @vamsi84 n @sitharaents , each and everyone from the Team #Sir pic.twitter.com/HcYFzxydrt — nithiin (@actor_nithiin) February 16, 2023 -
టాలీవుడ్ డైరెక్టర్స్ కోసం కోలీవుడ్ స్టార్స్ క్యూ
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ డైరెక్టర్స్ పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నారు. మన దర్శకుల కోసం ఇతర భాషల హీరోలు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కోలీవుడ్ హీరో-టాలీవుడ్ డైరెక్టర్ కాంబోలో ఇటీవల వచ్చిన సినిమాల్లో ‘ప్రిన్స్’ మొదటిది. తెలుగు దర్శకుడు అనుదీప్ డైరెక్షన్ లో... తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా.. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ, డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత కోలీవుడ్ లో టాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించిన మూవీ - వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. సంక్రాంతి బరిలో దిగిన ఈ మూవీ కోలీవుడ్ లో 300 కోట్లు వసూళ్లు చేసింది. విజయ్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా వారిసు రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మరో తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి కోలీవుడ్ బాక్సాపీస్ దగ్గర సక్సెస్ అందుకునేందుకు రెడీ అయ్యాడు. తొలిప్రేమ, మజ్ను, రంగ్ దే సినిమాలతో ఆకట్టుకున్నఈ డైరెక్టర్.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ‘వాతి’ అనే మూవీ తెరకెక్కించాడు. ఈ సినిమా తెలుగులో సార్ పేరుతో ఈ నెల 17న రిలీజ్ చేయబోతున్నారు. ఎడ్యుకేషన్ మాఫీయా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు డైరెక్టర్ కోలీవుడ్‌లో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటాడో చూడాలి. ధనుష్.. వెంకీ అట్లూరి తోనే కాకుండా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా నటించబోతున్నాడు. -
కళ్లు తిప్పుకోలేని అందం..అప్సరసలా మెరిసిపోయిన సంయక్త మీనన్ (ఫొటోలు)
-
సార్ మీ అందరి కథ – ధనుష్
‘‘సార్’ సినిమా అన్నివర్గాల వారికి నచ్చుతుంది. ఎందుకంటే ప్రేక్షకులు వాళ్ల కథతో కనెక్ట్ అవుతారు. ‘సార్’ మీ అందరి కథ.. మీకు నచ్చుతుందని, అందరూ ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అని హీరో ధనుష్ అన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘సార్’ (తమిళంలో ‘వాతి’). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారంవిడుదలకానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ధనుష్ మాట్లాడుతూ– ‘‘2002లో నా తొలి చిత్రం విడుదలయినప్పుడు నెర్వస్‌గా ఉన్నా.. ఇప్పుడు 2023లో నా తొలి తెలుగు సినిమా రిలీజ్ అవుతోంది.. ఇప్పుడు కూడా అలాగే ఉంది. తమిళ్, హిందీ, ఇంగ్లిష్ సినిమాలు చేశాను.. ప్రతి సినిమాని నా మొదట దిగానే భావిస్తా. ‘సార్’ ఒక సింపుల్ ఫిల్మ్.. కానీ, గ్రాండ్ ఎమోషన్స్, మెసేజ్ ఉంటుంది. నా తర్వాతి తెలుగు సినిమాకి తప్పకుండా తెలుగులో మాట్లాడతాను’’ అన్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ–‘‘ఒక మనిషి జీవన శైలిని మార్చేది చదువు మాత్రమే. అంత గొప్ప ఆయుధాన్ని డబ్బులేని వాళ్లకి దూరం చేయడం ఎంత వరకు న్యాయం? అనే ప్రశ్నే ‘సార్’ సినిమాలో వెంకీ అడిగే ప్రయత్నం చేశాడు. భారతీయ సినిమా చరిత్రలో ఒకప్పటి తరంలో శివాజీ గణేశన్‌గారు, కమల్ హాసన్‌గారు, తెలుగులో ఎన్టీఆర్‌గారు, నాగేశ్వరరావుగారు.. ఇలా తొలి తరం నటుల్లో ఎంత గొప్పవారుఉన్నారో తర్వాతి తరం గొప్ప నటుల్లో ధనుష్‌కి నేను టాప్ ప్లేస్ ఇస్తాను.. ఎందుకంటే సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఆయనకు భయం లేదు. పని చేయడాన్ని మాత్రమే ఇష్టపడతాడు. అలా పనిచేసుకుంటూ పోయే ధనుష్‌ని ఎవరూ ఆపలేరు’’ అన్నారు. ‘‘మా సార్’ చిత్రం ప్రీమియర్స్ ఒక రోజు ముందే వేస్తున్నామంటే సినిమాపై మాకు ఎంత నమ్మకం ఉందో జనాలకు ఇప్పటికే అర్థమై ఉంటుంది.. చాలా మంచి సినిమా ఇది.. ఎవరూ నిరుత్సాహపడరు’’ అన్నారు సూర్యదేవర నాగవంశీ. ‘‘నా ‘తొలి ప్రేమ’ సినిమా తర్వాత ఇంత నమ్మకంగా చెబుతున్నా. ‘సార్’ ప్రీమియర్స్ అయిన తర్వాత వచ్చే మౌత్ టాక్‌తో 17న అందరూ సినిమాకి వస్తారు’’ అన్నారు వెంకీ అట్లూరి. ఈ వేడుకలో నిర్మాత ఎస్.రాధాకృష్ణ, కెమెరామేన్ జె.యువరాజ్, నటుడు సాయికుమార్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు. -
ఇప్పుడు ఇండియన్ సినిమా అంటున్నారు: ధనుష్
‘‘ఒకప్పుడు తెలుగు సినిమా, తమిళ సినిమా, కన్నడ సినిమా, హిందీ సినిమా.. అనేవాళ్లు. ఇప్పుడు ఇండియన్ సినిమా అనడం సంతోషించదగ్గ విషయం’’ అని హీరో ధనుష్ అన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘సార్’(తెలుగు), ‘వాత్తి’ (తమిళం). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్ విడుదల చేశారు. ధనుష్ మాట్లాడుతూ– ‘‘సార్’ నా మొదటి తెలుగు సినిమా.. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు వెంకీ అట్లూరిగారికి థ్యాంక్స్. అలాగే నిర్మాతలు చినబాబు, నాగవంశీగార్లకు, డైరెక్టర్ త్రివిక్రమ్‌గారికి కృతజ్ఞతలు’’ అన్నారు. వెంకీ అట్లూరి మాట్లాడుతూ– ‘‘లాక్డౌన్ సమయంలో ఈ కథని వంశీగారికి వినిపించగా ఆయనకు నచ్చింది. ధనుష్‌గారు ఈ మూవీ చేసినా చేయకపోయినా ఆయనకు కథ చెప్పానన్న సంతృప్తి చాలనుకున్నాను. కానీ, ఆయన కథ వినగానే చేస్తాననడంతో ఆనందంతో మాటలు రాలేదు’’ అన్నారు. -
పెళ్లికి ఆ డ్రెస్‌లో వస్తావా? కీర్తి సురేశ్‌పై ట్రోలింగ్
తొలి ప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి పెళ్లిలో తళుక్కుమని మెరిసింది హీరోయిన్ కీర్తి సురేశ్. రంగురంగుల లెహంగాలో నూతన వధూవరులతో ఫోటోలు దిగింది. కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్తూ వారితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు కీర్తి.. ఇంద్రధనస్సును నేలకు తెచ్చిందంటూ మురిపెంగా కామెంట్లు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం అబ్బే.. తన ఫ్యాషన్ సెన్స్ చండాలంగా ఉందని విమర్శిస్తున్నారు. టెంట్‌ను డ్రెస్‌గా కుట్టించుకుందని సెటైర్లు విసురుతున్నారు. 'నీ డ్రెస్సింగ్ సెన్స్ తెగ నచ్చేది. కానీ ఈ సారి మాత్రం మైనస్ 1 మార్క్ ఇస్తున్నా', 'షామియానా లెహంగా..', 'మరేం అనుకోనంటే ఓ మంచి స్టైలిష్‌ను పెట్టుకోవచ్చుగా', 'ఆ డిజైనర్‌ను చంపేయ్ కీర్తి', 'పాపం అవకాశాల్లేక ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటోంది' అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Congratulations Venkyyyy Swamy and Pooja! May god shower all the love on you both for this new beginning! 🤗♥️♥️ pic.twitter.com/wp82WEXRjb — Keerthy Suresh (@KeerthyOfficial) February 1, 2023 Papam chances levu ga andhuke ee dresses 🤣 — HeathLedger (@HeathLedger150) February 1, 2023 Always liked yr dressing sense.. but this is -1/10 — a happy soul 💃 (@angelhere2022) February 1, 2023 Very nice outfit 👌 Marriage ki ilanti outfit design cheyyadame rotha ante nuv adhi veskelladam rotha pro max 🫡🤡 Urgent ga stylist/designer ni change chesey plox 🤡 — ɴ ᴀ ᴠ ᴇ ᴇ ɴ (@Naveen_Tweetz_) February 1, 2023 Keerthi fans r very disappointed with this Dress. — Gadidesi Venkateswarlu (@GVRgadidesivhp) February 1, 2023 @KeerthyOfficial please do one thing for your own sanity. Shoot 🔫 your designer 🤢 — Wednesday Walnut (@WednesdayWalnut) February 1, 2023 -
ధనుష్ ‘సార్’ వచ్చేస్తున్నాడు
నటుడు ధనుష్ ఇటీవల నటించిన చిత్రం తిరుచ్చిట్రం ఫలం. నిత్యామీనన్ కథానాయకిగా నటించిన ఇందులో ప్రియా భవానీశంకర్, రాశీఖన్నా అతిథులుగా మెరిశారు. మిత్రన్ జవహర్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా ప్రస్తుతం ధనుష్ తమిళం, తెలుగు భాషల్లో నటించిన చిత్రం వాతి. తెలుగులో సార్ పేరుతో తెరకెక్కింది. సంయుక్త మీనన్ నాయకిగా నటించారు. దర్శకుడు సముద్రఖని, రాజేంద్రన్, సాయికుమార్, ఆడుగళం నరేన్, తణికెళ్ల భరణి, హైపర్ ఆది, తోటపల్లి మధు, ఇళవరసు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇటీవల విడుదలై మంచి హిట్ అయ్యాయి. దీన్ని తమిళనాడు విడుదల హక్కులను 7 స్క్రీన్ స్టూడియో అధినేత ఎస్ఎస్.లలిత్‌కుమార్ పొందారు. ఈయన ప్రస్తుతం విజయ్ హీరోగా ఆయన 67వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంతో వాతి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలో ఈ నెల 4వ తేదీ భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కాగా చిత్రాన్ని 17వ తేదీ విడుదల చేస్తున్నట్లు ఇప్పుటికే నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. -
దర్శకుడు వెంకీ అట్లూరి పెళ్లిలో తారల సందడి.. ఫోటోలు వైరల్