Keerthy Suresh Gets Trolled For Her Outfit At Venky Atluri Wedding, Deets Inside - Sakshi
Sakshi News home page

Keerthy Suresh: పాపం, అవకాశాల్లేక ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటోంది.. కీర్తిపై ట్రోలింగ్‌

Published Thu, Feb 2 2023 4:37 PM | Last Updated on Thu, Feb 2 2023 5:13 PM

Keerthy Suresh Gets Trolled For Her Outfit at Venky Atluri Wedding - Sakshi

తొలి ప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి పెళ్లిలో తళుక్కుమని మెరిసింది హీరోయిన్‌ కీర్తి సురేశ్‌. రంగురంగుల లెహంగాలో నూతన వధూవరులతో ఫోటోలు దిగింది. కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్తూ వారితో కలిసి దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇది చూసిన అభిమానులు కీర్తి.. ఇంద్రధనస్సును నేలకు తెచ్చిందంటూ మురిపెంగా కామెంట్లు చేస్తున్నారు.

అయితే కొందరు మాత్రం అబ్బే.. తన ఫ్యాషన్‌ సెన్స్‌ చండాలంగా ఉందని విమర్శిస్తున్నారు. టెంట్‌ను డ్రెస్‌గా కుట్టించుకుందని సెటైర్లు విసురుతున్నారు. 'నీ డ్రెస్సింగ్‌ సెన్స్‌ తెగ నచ్చేది. కానీ ఈ సారి మాత్రం మైనస్‌ 1 మార్క్‌ ఇస్తున్నా', 'షామియానా లెహంగా..', 'మరేం అనుకోనంటే ఓ మంచి స్టైలిష్‌ను పెట్టుకోవచ్చుగా', 'ఆ డిజైనర్‌ను చంపేయ్‌ కీర్తి', 'పాపం అవకాశాల్లేక ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటోంది' అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement