సంయుక్త, ధనుష్, వెంకీ, నాగవంశీ
‘‘ఒకప్పుడు తెలుగు సినిమా, తమిళ సినిమా, కన్నడ సినిమా, హిందీ సినిమా.. అనేవాళ్లు. ఇప్పుడు ఇండియన్ సినిమా అనడం సంతోషించదగ్గ విషయం’’ అని హీరో ధనుష్ అన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘సార్’(తెలుగు), ‘వాత్తి’ (తమిళం). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్ విడుదల చేశారు.
ధనుష్ మాట్లాడుతూ– ‘‘సార్’ నా మొదటి తెలుగు సినిమా.. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు వెంకీ అట్లూరిగారికి థ్యాంక్స్. అలాగే నిర్మాతలు చినబాబు, నాగవంశీగార్లకు, డైరెక్టర్ త్రివిక్రమ్‌గారికి కృతజ్ఞతలు’’ అన్నారు. వెంకీ అట్లూరి మాట్లాడుతూ– ‘‘లాక్‌డౌన్ సమయంలో ఈ కథని వంశీగారికి వినిపించగా ఆయనకు నచ్చింది. ధనుష్‌గారు ఈ మూవీ చేసినా చేయకపోయినా ఆయనకు కథ చెప్పానన్న సంతృప్తి చాలనుకున్నాను. కానీ, ఆయన కథ వినగానే చేస్తాననడంతో ఆనందంతో మాటలు రాలేదు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment