Kollywood Star Heroes Waiting For Tollywood Directors - Sakshi
Sakshi News home page

Tollywood News: టాలీవుడ్‌ డైరెక్టర్స్‌ కోసం కోలీవుడ్‌ స్టార్స్‌ క్యూ

Feb 16 2023 4:05 PM | Updated on Feb 16 2023 4:42 PM

Kollywood Star Heroes Waiting For Tollywood Directors - Sakshi

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌ డైరెక్టర్స్‌ పాన్‌ ఇండియా స్థాయిలో రాణిస్తున్నారు. మన  దర్శకుల కోసం ఇతర భాషల హీరోలు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా కోలీవుడ్‌ స్టార్‌ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. కోలీవుడ్‌ హీరో-టాలీవుడ్‌ డైరెక్టర్‌ కాంబోలో ఇటీవల వచ్చిన సినిమాల్లో ‘ప్రిన్స్‌’ మొదటిది.  తెలుగు దర్శకుడు అనుదీప్ డైరెక్షన్ లో... తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా.. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ, డిజాస్టర్ గా నిలిచింది.

ఈ మూవీ తర్వాత కోలీవుడ్ లో టాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించిన మూవీ - వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు.  సంక్రాంతి బరిలో దిగిన ఈ మూవీ కోలీవుడ్ లో 300 కోట్లు వసూళ్లు చేసింది. విజయ్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా వారిసు రికార్డ్ క్రియేట్ చేసింది. 

ఇప్పుడు మరో తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి  కోలీవుడ్ బాక్సాపీస్ దగ్గర సక్సెస్ అందుకునేందుకు రెడీ అయ్యాడు. తొలిప్రేమ, మజ్ను, రంగ్ దే సినిమాలతో ఆకట్టుకున్నఈ డైరెక్టర్..  కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ తో ‘వాతి’ అనే మూవీ తెరకెక్కించాడు. ఈ సినిమా తెలుగులో సార్ పేరుతో ఈ నెల 17న రిలీజ్ చేయబోతున్నారు. ఎడ్యుకేషన్‌ మాఫీయా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు డైరెక్టర్‌ కోలీవుడ్‌లో ఏ రేంజ్‌ సక్సెస్‌ అందుకుంటాడో చూడాలి. ధనుష్‌.. వెంకీ అట్లూరి తోనే కాకుండా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా నటించబోతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement