Vamsi padipally
-
క్రేజీ బజ్.. రజనీకాంత్‌తో ‘దిల్’ రాజు సినిమా?
ఇటీవల తమిళ హీరో విజయ్‌తో ‘వారిసు ’(తెలుగులో ‘వారసుడు’) సినిమా నిర్మించారు ‘దిల్’ రాజు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘దిల్’ రాజు ఓ సినిమాను పట్టాలెక్కించాలనే ప్రయత్నాల్లో ఉన్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. పూర్తి స్క్రిప్ట్ పూర్తయ్యాక రజనీకాంత్‌ను కలిసి కథ వినిపించాలని ‘దిల్’ రాజు భావిస్తున్నారట. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పనులను దర్శకుడు వంశీ పైడిపల్లికి ‘దిల్’ రాజు అప్పజెప్పారని, ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నది వంశీయే అనే టాక్ వినిపిస్తోంది. మరి.. రజనీకాంత్, ‘దిల్’ రాజు, వంశీ పైడిపల్లి కాంబినేషన్లోని సినిమా నిజమేనా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ప్రస్తుతం ‘జైలర్’ సినిమాలో నటిస్తున్నారు రజనీకాంత్. అలాగే ‘లాల్ సలామ్’లో ఓ గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాలు కాకుండా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో రజనీ ఓ సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. -
టాలీవుడ్ డైరెక్టర్స్ కోసం కోలీవుడ్ స్టార్స్ క్యూ
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ డైరెక్టర్స్ పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నారు. మన దర్శకుల కోసం ఇతర భాషల హీరోలు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కోలీవుడ్ హీరో-టాలీవుడ్ డైరెక్టర్ కాంబోలో ఇటీవల వచ్చిన సినిమాల్లో ‘ప్రిన్స్’ మొదటిది. తెలుగు దర్శకుడు అనుదీప్ డైరెక్షన్ లో... తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా.. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ, డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత కోలీవుడ్ లో టాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించిన మూవీ - వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. సంక్రాంతి బరిలో దిగిన ఈ మూవీ కోలీవుడ్ లో 300 కోట్లు వసూళ్లు చేసింది. విజయ్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా వారిసు రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మరో తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి కోలీవుడ్ బాక్సాపీస్ దగ్గర సక్సెస్ అందుకునేందుకు రెడీ అయ్యాడు. తొలిప్రేమ, మజ్ను, రంగ్ దే సినిమాలతో ఆకట్టుకున్నఈ డైరెక్టర్.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ‘వాతి’ అనే మూవీ తెరకెక్కించాడు. ఈ సినిమా తెలుగులో సార్ పేరుతో ఈ నెల 17న రిలీజ్ చేయబోతున్నారు. ఎడ్యుకేషన్ మాఫీయా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు డైరెక్టర్ కోలీవుడ్‌లో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటాడో చూడాలి. ధనుష్.. వెంకీ అట్లూరి తోనే కాకుండా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా నటించబోతున్నాడు. -
'వారీసు' బిగ్ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్ అవుట్
తమిళ స్టార్ హీరో విజయ్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'వారీసు'. తెలుగులో ఈ సినిమా వారసుడుగా రిలీజ్ చేయనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన రష్మిక, విజయ్‌ల ఫస్ట్ లుక్ విపరీతంగా ఆకర్షిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్ వచ్చేసింది. తమిళ వర్షన్లో విడుదలైన ఈ సాంగ్ అభిమానులను ఊర్రూతలూగిస్తోంది. (చదవండి: విజయ్, రష్మికల ‘వారీసు’ మూవీ ఎలా ఉంటుందంటే) తెలుగు, తమిళ భాషల్లో విజయ్ ఏకకాలంలో నటిస్తున్న చిత్రం వారీసు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్, ప్రభు, ప్రకాష్‌రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగిబాబు, సంగీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటివరకు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విజయ్ ఈ మూవీతో నేరుగా పలకరించబోతున్నాడు. ఈ చిత్రం కుటుంబ సెంటిమెంట్‌తో కూడిన యాక్షన్, రొమాన్స్ కథా చిత్రంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. -
దళపతి విజయ్ ‘వారసుడు’ మూవీ వర్కింగ్ స్టిల్స్ (ఫొటోలు)
-
నెట్టింట వైరల్ అవుతున్న ‘వారసుడు’ వర్కింగ్ స్టిల్స్
దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారిసు. ఈ చిత్రం తెలుగులో వారసుడు పేరుతో విడుదల కానుంది. చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన పది వర్కింగ్ స్టిల్స్‌ని ఒకేసారి విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'వారసుడు' స్టిల్స్ వైరల్ గా మారాయి. వారసుడులో విజయ్ కొత్త లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. విజయ్ తో పాటు రష్మిక, ఖుష్బూ కూడా కొత్త లుక్స్ లో కనిపించారు. అలాగే విజయ్, వెటరన్ హీరోయిన్ జయసుధ, దర్శకుడు వంశీ పైడిపల్లి షూటింగ్ లొకేషన్ వర్కింగ్ స్టిల్స్ కూడా ఆకట్టుకున్నాయి. 2023 సంక్రాంతికి వారసుడు విడుదల చేస్తున్నట్లు దీపావళి పండగ నాడు మేకర్స్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా సంక్రాంతి అతిపెద్ద పండుగ కావడంతో భారీ స్థాయిలో సినిమాని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు.పూర్తిస్థాయి ఎంటర్ టైనర్‌గా రూపొందించబడిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటించగా, ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
మహర్షి సినిమా సక్సెస్ మీట్
-
ప్రయాణం పూర్తి కావచ్చింది
రిషి ప్రయాణం చివరి స్టాప్‌కు వచ్చేసింది. ఈ జర్నీలో ఏం కనుక్కున్నాడో, తెలుసుకున్నాడో మనందరికీ మే9న తెరపై చూపించనున్నారు. మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహర్షి’. రిషి పాత్రలో మహేశ్ కనిపిస్తారు. అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ‘మహర్షి’ టాకీ పార్ట్ చివరిదశకు వచ్చేసిందని సమాచారం. రెండు పాటలు మినహా నేటితో చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన రెండు పాటల్లో ఒకదాన్ని హైదరాబాద్‌లో, రెండో పాటను దుబాయ్‌లో షూట్ చేస్తారని సమాచారం. ‘అల్లరి’ నరేశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం మే 9న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. కెమెరా: కె.యు.మోహనన్. -
మహేశ్‌బాబు నెక్ట్స్ సినిమా టైటిల్ ఏంటి?
మహేశ్‌బాబు తొలి సినిమా టైటిల్ ‘రాజకుమారుడు’. సూపర్‌స్టార్ కృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక రాజైతే ఆయన కుమారుడు రాకుమారుడే అవుతాడు కదా అని అభిమానులు ఆ టైటిల్ చూసి సంబర పడ్డారు. ఆ తర్వాత మహేశ్ ‘బాబీ’, ‘నాని’ వంటి సాఫ్ట్ టైటిల్స్‌తో సినిమాలు చేశారు. గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఒక్కడు’ మహేశ్ సినిమాల్లో టాప్ టైటిల్‌గా నిలిచిందని చెప్పవచ్చు. దాని కొనసాగింపుగా తెలుగులో అనేక ‘ఒక్కడు’ టైటిల్స్ వచ్చాయి. మహేశ్‌కు కృష్ణవంశీ ‘మురారి’ టైటిల్ ఇస్తే పూరి జగన్నాథ్ ‘పోకిరి’ టైటిల్ ఇచ్చారు. ఇక శ్రీకాంత్ అడ్డాల ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి డిఫరెంట్ టైటిల్‌ని ఇచ్చి మహేశ్‌బాబు మీద సుతారమైన తెలుగు మల్లెల వాన కురిపించారు. అయితే అన్ని టైటిల్స్ కూడా మహేశ్‌కు సులువైపోలేదు. త్రివిక్రమ్ ‘ఖలేజా’ టైటిల్ పెడితే అది చిక్కుల్లో పడింది. అదే టైటిల్‌ను వేరొకరు రిజిస్టర్ చేసుకుని ఉండటంతో చివరకు సినిమాను ‘మహేశ్ ఖలేజా’గా విడుదల చేయాల్సి వచ్చింది. మహేశ్ వంటి హీరోల పై ‘శ్రీమంతుడు’ వంటి పాత తరహా టైటిల్స్ పెట్టడం రిస్క్‌తో కూడిన పని. కానీ ‘శ్రీమంతుడు’ పెద్ద హిట్ అయ్యి సిరి తెచ్చి పెట్టింది. ఇక అదే దర్శకుడు శివ కొరటాల దర్శకత్వంలో వచ్చిన ‘భరత్ అనే నేను’ టైటిల్ కూడా ఎంతో ఆకట్టుకుని సినిమాను హిట్ చేసింది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు లేటెస్ట్ సినిమా టైటిల్ ఏమై ఉంటుందా అనేదానిపై కుతూహలం చోటు చేసుకుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ హీరోగా ‘దిల్’ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను ఆయన బర్త్‌డే సందర్భంగా ఈ గురువారం రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అనధికారిక వార్త ఏంటంటే.. ఈ సినిమాకు ‘రిషి’ అనే టైటిల్ అనుకుంటున్నారని ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో జోరుగా షికారు చేస్తోంది. ఇప్పటికే రివీల్ చేసిన అక్షరాలు ఆర్, ఐ, యస్, హెచ్ బట్టి సినిమా టైటిల్ ‘రిషి’ అయ్యుండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. ‘మహర్షి’ కూడా కావచ్చని అంటున్నారు. అయితే ఇది సినిమా టైటిలా? లేకపోతే సినిమాలో మహేశ్ బాబు క్యారెక్టర్ పేరా? ఒకవేళ పేరే అయితే దాన్నే టైటిల్‌గా పెడతారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. ‘అల్లరి’ నరేశ్ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో స్టూడెంట్‌గా మహేశ్ గడ్డం, జుట్టుతో కనిపించనున్న సంగతి తెలిసిందే. టైటిల్స్ స్పెషలిస్ట్ వంశీ దర్శకుడు వంశీ తెలుగులో కొత్త కొత్త టైటిల్స్ పెట్టి ప్రేక్షకులను మెప్పించగలరనే పేరు సంపాదించారు. ‘లేడీస్ టైలర్’, ‘శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్‌ట్రూప్’, ‘డిటెక్టివ్ నారదా’, ‘కొంచెం టచ్‌లో ఉంటే చెబుతాను’, ‘దొంగరాముడు అండ్ పార్టీ’, ‘ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’, ‘ఏప్రిల్ 1 విడుదల’... ఇలాంటి టైటిల్స్ అన్నీ ఆయన సృష్టించినవే. అయితే తిట్లని టైటిల్స్ చేయవచ్చని గ్రహించిన దర్శకుడు మాత్రం పూరి జగన్నాథ్. ‘ఇడియట్’, ‘పోకిరి’, ‘దేశముదురు’, ‘రోగ్’, ‘లోఫర్’... ఇవన్నీ ఆయన టైటిల్స్. ‘సామ్రాట్’, ‘సాహస సామ్రాట్’ తెలుగు ఇండస్ట్రీలో సినిమాల టైటిల్స్ కోసం ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టడం, ఆ టైటిల్స్ కోసం ప్రయత్నించడం చాలాకాలం నుంచి ఉంది. గతంలో చిరంజీవి నటించిన సినిమా కోసం ప్రేక్షకులకే కొన్ని టైటిల్స్ ఇచ్చి ఎక్కువ మంది కోరుకున్న టైటిల్‌ను పెట్టారు. ఆ సినిమా పేరు ‘విజేత’. బాలకృష్ణ, రమేశ్‌బాబు (కృష్ణ కుమారుడు) ఒకేసారి మొదలెట్టిన సినిమాలకు ‘సామ్రాట్’ టైటిల్ అనుకున్నారు. అయితే దాని రిజిస్ట్రేషన్ రమేశ్‌బాబు నిర్మాతల దగ్గరే ఉండటంతో ‘సాహస సామ్రాట్’ పేరుతో బాలకృష్ణ సినిమా రిలీజ్ చేయాల్సి వచ్చింది. జె.డి. చక్రవర్తి హీరోగా ‘పేరు లేని సినిమా’ను అనౌన్స్ చేసి ఒక క్రేజ్ సృష్టించాక దానికి ‘పాపే నా ప్రాణం’ పేరుతో విడుదల చేశారు. ఇటీవల ‘కత్తి’ సినిమా టైటిల్ కోసం కూడా గిరాకీ ఏర్పడింది. ఆ టైటిల్ దొరకని కల్యాణ్‌రామ్ తన సినిమాను ‘కల్యాణ్‌రామ్ కత్తి’గా రిలీజ్ చేయాల్సి వచ్చింది. కమెడియన్ సప్తగిరి దగ్గర ఉన్న ‘కాటమరాయుడు’ టైటిల్‌ను పవన్ కల్యాణ్ తీసుకుని అందుకు బదులుగా సప్తగిరి సినిమాను ప్రోత్సహించడం చూశాం. టైటిల్ సెంటిమెంట్ కె.విశ్వనాథ్ తన టైటిల్స్‌ను ‘ఎస్’ అక్షరం మీద పెట్టాలనుకుంటారన్న సెంటిమెంట్ ఉంది. ‘శంకరాభరణం’, ‘సాగరసంగమం’, ‘సప్తపది’, ‘శృతిలయలు’, ‘స్వర్ణకమలం’... ఇలా ‘ఎస్’ టైటిల్‌తో మొదలైన ఆయన సినిమాలన్నీ హిట్. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎస్.గోపాలరెడ్డికి తన సినిమాలన్నీ ‘మ’ అక్షరంతో మొదలవ్వాలన్న సెంటిమెంట్ ఏర్పడింది. ‘మంగమ్మ గారి మనవడు’, ‘ముద్దుల కృష్ణయ్య, ‘ముద్దుల మావయ్య’, ‘మువ్వా గోపాలుడు’, ‘మా పల్లెలో గోపాలుడు’ ఇవన్నీ ఆయన నిర్మాతగా వ్యవహరించిన సినిమాలే. ఇక పురిట్లోనే సంధి కొట్టిన టైటిల్స్ కూడా ఉన్నాయి. దాసరి ‘ఉడుకు నెత్తురు’, చిరంజీవి ‘వజ్రాల దొంగ’, పవన్ కల్యాణ్ ‘సత్యాగ్రాహి’, బాలకృష్ణ ‘విక్రమసింహ భూపతి’... ఇవన్నీ ఆదిలోనే వీగిపోయాయి. -
స్పెషల్ ఉగాది
నో మోర్ డౌట్స్. మరోసారి సమ్మర్‌కి సై అని, వచ్చే ఏడాది ఉగాది రుచులను థియేటర్స్‌లో చూపిస్తాం అంటున్నారు మహేశ్‌బాబు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘భరత్ అనే నేను’ చిత్రంతో సమ్మర్లో మహేశ్‌బాబు హిట్ సాధించారు. గతంలోనూ మహేశ్ కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ మూవీస్‌గా నిలిచిన ‘పోకిరి’ కూడా ఏప్రిల్‌లోనే రిలీజైందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా అశ్వనీదత్, ‘దిల్’ రాజు ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. ‘‘ఈ ఏడాది ఉగాది ఇంకాస్త స్పెషల్‌గా ఉండబోతుంది. 2019 ఏప్రిల్ 5న మహేశ్‌బాబు సినిమా విడుదల కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో ‘అల్లరి’ నరేశ్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతోంది. రవి పాత్రలో నరేశ్ నటిస్తుండగా, కృష్ణ పాత్రలో మహేశ్ నటిస్తున్నారని సమాచారమ్. మహేశ్, ‘అల్లరి’ నరేశ్, పూజా ఎమ్బీఏ క్లాస్మేట్స్గా కనిపిస్తారట. ప్రస్తుతం డెహ్రాడూన్‌లో చిత్రీకరిస్తున్న కాలేజీ సీన్స్ ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తాయని టాక్. -
అఖిల్ ప్రకటన వచ్చేస్తోంది..?
భారీ అంచనాల మధ్య తెరంగేట్రం చేసిన అక్కినేని నట వారసుడు అఖిల్, తొలి సినిమాతో ఆకట్టుకోలేకపోయాడు. ఎంతో హైప్ క్రియేట్ చేసిన 'అఖిల్' డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో రెండో సినిమా విషయంలో అక్కినేని ఫ్యామిలీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినా, ఫైనల్‌గా నాగార్జున లీడ్ రోల్లో ఊపిరి సినిమాను తెరకెక్కించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అఖిల్ హీరోగా హిందీ సూపర్ హిట్ సినిమా 'ఏ జవానీ హై దివానీ'ని రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే వంశీ పైడిపల్లి మాత్రం రీమేక్ కన్నా కొత్త కథతో సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ఇప్పటికే ఊపిరి సినిమాను రీమేక్‌గా తెరకెక్కించిన వంశీ, మరో సినిమా కూడా రీమేక్ చేస్తే తన మీద రీమేక్ డైరెక్టర్ అన్న ముద్ర పడుతుందన్న ఆలోచనలో ఉన్నాడట. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమిస్తూ ఉగాది సందర్భంగా ఏప్రిల్ 8న అఖిల్ సినిమా ప్రకటన వస్తుందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈసారైనా అఖిల్ ప్రకటిస్తాడో లేదో చూడాలి.